
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో కులగణన.. రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాలకు రిఫరెన్స్‌గా మారనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కులగణన నివేదికను ప్రవేశపెట్టి.. చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ తర్వాత సీఎం రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
ఈరోజు దేశం చరిత్రలో నిలిచిపోతుంది. బీసీ, ఎస్సీ, మైనారిటీలకు న్యాయం జరగనుంది. ఈ నిర్ణయంతో ప్రధాని పై ఒత్తిడి పెరగనుంది. అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలని డిమాండ్ రానుంది. భవిషత్ లో ఈ రోజు మేము ప్రవేశపెట్టే డాక్యుమెంట్ రిఫరెన్స్ తీసుకోవాలి.
2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ మేమే చేశాం. 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలి. కోర్టు ఇచ్చిన క్లిమిలేయర్ ను తిరస్కరించాం బీసీ రిజర్వేషన్ల పై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేశాం. కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీ కి రాని వాళ్లు అసెంబ్లీ టైం గురించి మాట్లాడుతున్నారు. కొందరు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు. వాళ్ల సొంత నియోజకవర్గాల్లోనే వాళ్ల గతి ఏంటో? అని కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment