census
-
కులగణనపై ఈటల కీలక వ్యాఖ్యలు
సాక్షి,యాదాద్రి భువనగిరి జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన ఒక డ్రామా అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.యాదగిరిగుట్టలో ఆదివారం(ఫిబ్రవరి16) ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.‘బీసీ గణనను చట్టబద్దమైన సంస్థలతో సర్వే చేసి అసేంబ్లీలో చట్ట బద్దత కల్పించాలి. బీసీ కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు.కులగణనను పార్లమెంట్లో ఆమోదించేందుకు సిద్దంగా ఉన్నాం. 70ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ సీఎం కూడా లేడు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ అంటేనే స్కామ్‌లు, భూ దందాలు,లంచాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల చుట్టూ తిరుగుతున్నాడు.ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మూడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. బీఆర్ఎస్ గతంలో టీచర్లను మోసం చేసి పోటీ చేసే అర్హత కోల్పోయింది’అని ఈటల అన్నారు. -
తెలంగాణలో మరోసారి కులగణన సర్వే
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కులగణన సర్వే (telangana census survey)నిర్వహించింది. అయితే తొలిసారి నిర్వహించిన సర్వేలో పలు కారణాల వల్ల 3.1 శాతం మంది పాల్గొనలేదు. ఇప్పుడు వారి కోసం మరోసారి కులగణన సర్వే చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రకటించారు. మరోసారి కులగణన చేపడితే తాము పాల్గొంటామంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. ఆ విజ్ఞప్తులపై భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘తెలంగాణ మరోసారి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఉంటుంది. తొలిసారి చేపట్టిన కులగణన సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వారికి మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఈ నెల 16 నుంచి 18 మధ్య మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తున్నాం.సర్వేలో పాల్గొనే వాళ్ళు టోల్ ఫ్రీ, మండల కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు..కేసీఆర్ (kcr), కేటీఆర్ లాంటి వాళ్లకు మరో అవకాశం ఇస్తున్నాం. రాష్ట్ర జనాభాలో వీళ్ళు చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి మొదటి వారంలో కేబినెట్ ఆమోదం తెలుపుతాం. ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. రాబోయే అసెంబ్లీలో బిల్లు పెట్టి.. చట్టం చేస్తాం.అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపి..కేంద్రానికి పంపుతాం. త్వరలోనే తెలంగాణ నుంచి బృందంగా వెళ్లి ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ పెద్దలను కలుస్తాం. కేంద్రం వద్దకు వెళ్లినప్పుడు కలిసివచ్చే రాజకీయ పార్టీలను తీసుకెళ్తాం. దశాబ్దాల బీసీ కల త్వరలోనే నెరవేర్చబోతున్నాం. ఓబీసీల లక్ష్యాలను సాధించడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు. బీసీ రిజర్వేషన్లు ప్రకటన తర్వాతే పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్రం చట్టబద్ధత కల్పిస్తుందని ఆశిస్తున్నాం. మా పార్టీ ఎంపీలే కాదు...అన్ని పార్టీల ఎంపీలను కలుపుకోని వెళ్తాం.’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. 👉చదవండి : రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై ఫౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన! -
తెలంగాణ కులగణన.. ఆ లెక్కలు వాళ్లే చెప్పాలి: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో కులగణన.. రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాలకు రిఫరెన్స్‌గా మారనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కులగణన నివేదికను ప్రవేశపెట్టి.. చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ తర్వాత సీఎం రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.ఈరోజు దేశం చరిత్రలో నిలిచిపోతుంది. బీసీ, ఎస్సీ, మైనారిటీలకు న్యాయం జరగనుంది. ఈ నిర్ణయంతో ప్రధాని పై ఒత్తిడి పెరగనుంది. అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలని డిమాండ్ రానుంది. భవిషత్ లో ఈ రోజు మేము ప్రవేశపెట్టే డాక్యుమెంట్ రిఫరెన్స్ తీసుకోవాలి.2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ మేమే చేశాం. 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలి. కోర్టు ఇచ్చిన క్లిమిలేయర్ ను తిరస్కరించాం బీసీ రిజర్వేషన్ల పై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేశాం. కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీ కి రాని వాళ్లు అసెంబ్లీ టైం గురించి మాట్లాడుతున్నారు. కొందరు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు. వాళ్ల సొంత నియోజకవర్గాల్లోనే వాళ్ల గతి ఏంటో? అని కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
Updates: అసెంబ్లీలో వాడీవేడిగా కులగణనపై చర్చ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్నారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం.. ఈనివేదికకు ఆమోద ముద్ర వేసింది. 04:29PMతెలంగాణ శాసన మండలి నిరవధిక వాయిదా04:26PMమాకు మైక్ ఇవ్వకపోవడం అన్యాయం: KTRస్పీకర్ మైక్ ఇవ్వాలని BRS డిమాండ్.మైక్ ఇవ్వకపోవడం చాలా అన్యాయమన్న కేటీఆర్04:24PMబీజేపీ ఎమ్మెల్యేల నిరసన తమకు మైక్ ఇవ్వాలని స్పీకర్ పోడియం ముందు బీజేపీ సభ్యుల నిరసనబీసీలపై చర్చ సందర్భంగా.. బీసీలకు మైక్ ఇవ్వకుంటే ఎలా? అని నిలదీత04:22PMశాసనసభలో బీఆర్ఎస్ ఆందోళనసమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో పాల్గొన్న వాళ్లకే మైక్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరిన సీఎం రేవంత్కేటీఆర్ ప్రసంగం అనంతరం.. సీఎం అభ్యంతరంసర్వేకి, అసెంబ్లీకి సంబంధం ఏంటని బీఆర్ఎస్ ఆందోళనసీఎం వ్యాఖ్యలపై ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు04:17PMవాళ్లకు మైక్ ఇవ్వకండి అధ్యక్షా: సీఎం రేవంత్ రెడ్డిMCHRD వెబ్ సైట్ లో మాత్రమే ఎస్ కే ఎస్ రిపోర్ట్ ఉంది..దానికి ఎవరు ఓనర్ క్లెయిం చేయలేదుప్రభుత్వం మీద నమ్మకం లేకనే సర్వే లో పాల్గొనలేదన్న కేటీఆర్.. ఈ చర్చలో ఎలా పాల్గొంటారు?సర్వే లో పాల్గొనని వారికి మైక్ ఇవ్వొద్దని స్పీకర్ కోరిన సీఎం రేవంత్04:11PMఅధికార పక్షానికి కేటీఆర్ కౌంటర్సమగ్ర కుటుంబ సర్వే పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికారులకు గుర్తు చేశాం2014లో సమగ్ర కుటుంబ సర్వే జరిగిందిఆ సర్వేను చేయించింది ప్రభుత్వమే.. సమగ్ర కుటుంబ సర్వేను అధికారులే చేశారుఆ డాటాను పారదర్శకంగా వెబ్సైట్లోనూ ఉంచాంసమగ్ర కుటుంబ సర్వే 3కోట్ల 64లక్షలు పాల్గొన్నారు.ఆనాటి సర్వే ప్రకారం బీసీల సంఖ్య 1కోటి 85లక్షల మంది.. 51 శాతంముస్లిం బీసీలతో(10 శాతం) కలిపితే 61 శాతంకాంగ్రెస్ సర్వే రిపోర్ట్ ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నారుబీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలిఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు..మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి.42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడుతున్నారు అనుకున్నాంకాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం లేదు.04:08PMఎంఐఎం అక్బరుద్దీన్ ప్రసంగంరాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు 12.56 శాతంముస్లిం మైనారిటీ ఓసీలు: 2.48 శాతంకుల గణన రిపోర్ట్ సభలో పెట్టే విధానంపై అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహంకేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే సభలో పెట్టలేదని రేవంత్ ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ఏంటి?సభలో రిపోర్ట్ పెట్టకుండా.. కనీస సమయం ఇవ్వకుండా సూచనలు ఎలా? చేస్తారు?బలహీన వర్గాలకు చాలా కాలంగా అన్యాయం జరిగింది04:08PMవిపక్షాలకు సీఎం రేవంత్ కౌంటర్సర్వేలో ఎలాంటి తప్పులు లేవుసర్క్యూలేట్ అవుతున్న డాక్యుమెంట్లోనూ తప్పులే ఉన్నాయిపాయల్ శంకర్ అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారురాష్ట్రంలో బీసీల సంఖ్య పెరిగిందిమా సర్వే ప్రకారం బీసీ జనాభా 56 శాతంకేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ఈ సర్వేలో పాల్గొనలేదుడీకే అరుణ సహా అనేక మంది నేతలూ పాల్గొనలేదుమోదీ ప్రధాని అయ్యాక ఇప్పటిదాకా ఎందుకు కులగణన చేపట్టలేదుకుల గణన చేపట్టింది ప్రజల సంక్షేమం కోసమేమా కులగణన నివేదిక 100కు వంద శాతం పారదర్శకమైందిఅపోహల సంఘం లెక్కలు కూడా తప్పుగానే ఉన్నాయిపాయల్ శంకర్‌ను బీఆర్ఎస్ నేతలు వాడుకుంటున్నారుసర్వేలో పాల్గొనని నేతలు ఇప్పటికైనా సహకరించండిస్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు సీట్లు ఇస్తాంచట్టం ప్రకారం కుదరకపోతే.. పార్టీ పరంగా ఇస్తాం బీసీ ల సంఖ్య తగ్గడం ఏంటి.. మిగతా సంఖ్య ఎలా పెరిగింది?తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలి:::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంత్రులు పదే పదే మాట్లాడడం సరైంది కాదు .అందరూ మాట్లాడాక చివర మాట్లాడితే మంచిది..:::తలసాని2014 సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి అసలు డాటా ఉందా?:::ఉత్తమ్గత ప్రభుత్వం చేసిన సర్వే ను తప్పు పడితే ఎలా..ప్రభుత్వం సర్వే పనికిరాదా?:::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ 03:49PM శాసన సభలో మంత్రి ఉత్తమ్ప్రతిపక్ష నేతలు ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.దేశంలో పదేళ్లు బీజేపీ ప్రభుత్వం ఉంది.. ఏ రాష్ట్రంలో అయినా బీసీ కులగణన చేశారా?తెలంగాణలో అత్యంత పారదర్శకంగా కులగణన జరిగింది.కాంగ్రెస్ స్లోగన్ ‘‘సోషల్ జస్టిస్’’ప్రతిపక్ష నేతలకు ఏమైనా అనుమానాలు ఉంటే.. ప్రజెంటేషన్ ఇస్తాం.ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న సూచనలు, సద్విమర్శలు తీసుకుంటాంఅపోహలను సృష్టిస్తే ఊరుకునేది లేదుజనాభా ను తగ్గించామని చెప్పడం సరైంది కాదునాలుగున్నర కోట్లు ,అయిదు కోట్లు అని అపోహలు సృష్టించడం సరైంది కాదు03:41PMశాసన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నివేదిక.. సమగ్ర ఇంటింటి కుల సర్వే.. ఎన్నో ఒడిదుకులు ఎదురుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగింది..స్వతంత్రం రాక ముందు 1931 ముందు కుల సర్వే జరిగింది.. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ కుల సర్వే జరగలేదుబలహీన వర్గాలకు మేమెంతో మాకంత ఉండాలని సమాచారం కులాల లెక్కలు లేక దాని ప్రకారమే ప్రభుత్వ పథకాల వచ్చేవిభారత్ జోడో యాత్ర లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరిగినప్పుడు చాలా వర్గాలకు ప్రాతినిధ్యం లేదు వారికి అవకాశాలు రావాలంటే ఎవరేంతో వారికి తెలవల్సిందే అని ఎన్నికల్లో చెప్పడం జరిగిందిబలహీన వర్గాలపై స్పష్టంగా మా విధానం చెప్పడం జరిగింది.. ఇచ్చిన మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందిఫిబ్రవరి 4 కేబినెట్ సమావేశం జరిగింది.. 16 న శాసన సభలో తీర్మానం చేసుకున్నాంపార్లమెంట్ ఎన్నికల తర్వాత చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగిందిలక్ష మంది ప్రభుత్వం ఉద్యోగులతో ఈ సర్వే చేసి సమాచారాన్ని సెకరించాం..1931 నుండి సమాచారం లేదు.. బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఇంకా న్యాయం చేయాలనుకుంటే సలహాలు సూచనలు చెప్పండిబలహీన వర్గాల శాఖ మంత్రిగా వాటన్నిటిని బలహీన వర్గాల అభివృద్ధికి తీసుకుపోతాంప్రతిదీ రాజకీయం చేసినట్టు.. బలహీన వర్గాల ఆకాంక్షలను రాజకీయం చేయకండి..తెలంగాణ అన్ని జిల్లాలో స్వేచ్చగా తమ ఆకాంక్ష ముందుకు తీసుకుపోవాలిఈ సమాచారాన్ని తీసుకొని భవిషత్ లో ఆయా వర్గాలకు న్యాయం చేయడానికి ఉపయోగపడతుందిబలహీన వర్గాల అభివృద్ధికి ఈ రోజు నుండి శకం ప్రారంభమైందితెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సమాచార సేకరణ దేశానికి రోల్ మోడల్..తెలంగాణ దేశానికి దిక్సూచినిన్న రాహుల్ గాంధీ పార్లమెంటు లో తెలంగాణ ప్రభుత్వం చేసిన సమగ్ర కుల సర్వే ప్రజా ప్రతినిధులకు గౌరవం అన్నారునివేదిక వచ్చిన తరువాత ముందుకు పోవడానికి రోడ్ మ్యాప్ తీసుకుపోవడానికి సభలో చర్చించుకొని భవిషత్ లో అందరికి మార్గదర్శకత్వం దొరుకుతుంది..తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు ఒక అవకాశం దొరుకుతుంది1986 లో మురళీధర్ రావు కమిషన్ వచ్చినప్పుడు విద్యార్థి నాయకుడిగా, మాజీమంత్రి గంగుల కమలాకర్ ,కేంద్ర మంత్రి బండి సంజయ్ కమిషన్ ఉద్యమంలో పాల్గొని నినదించినంబావి తరాలకు న్యాయం జరగడానికి బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి మా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జీవితంలో నాకు గొప్ప కార్యక్రమంఇప్పటి వరకు లెక్కలే లేవు... లెక్కలు తక్కువ ఎలా వస్తాయి.. ఇప్పుడు జరిగిన లెక్కల్ కొలమానం భవిష్యత్ లో మరోసారి సర్వే జరిగినప్పుడు మార్పు కనిపిస్తుంది.ప్రతి ఇంటికి వెళ్లి సహకరించిన సహకరించకపోయిన వారు ఇంటికి వెళ్లి స్వచ్ఛందంగా సమాచారాన్ని సేకరించాం.నివేదిక సబ్ కమిటీకి సమర్పించారుసబ్ కమిటీ లో చర్చించి కేబినెట్ లో పెట్టింది..బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తుంది2011 జనాభా లెక్కల్లో ఆనాడు తెలంగాణ లో 3 కోట్ల 50 లక్షలు ఉండేది.. ఇప్పుడు 3 కోట్ల 70 లక్షల మంది ఉన్నారు..కేంద్రం నుండి జనాభా ప్రాతిపదికన దక్షిణ ,ఉత్తర భారతదేశానికి నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు..దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు పాటించడం జనాభా తగ్గింది160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టీ లక్ష మంది ఉద్యుగులతో ఈ ప్రక్రియ చేపట్టింది..సలహాలు సూచనలు ఇవ్వండి..సున్నితమైన అంశం.చాలా కాలంగా ఎంతో మంది మేధావులు, సంఘాలు , ఉద్యమకారులుఈ సర్వే కోసం ఉద్యమిస్తే రాహుల్ గాంధీ గారీ ఆలోచనకు అనుగుణంగా ఎవరెంతో వారంతా తెలవాల్సిందే అని ఈ సర్వే జరిగింది..బలహీన వర్గాలకు న్యాయం జరగాలి...రోడ్డు మ్యాప్ రావాలి.. వారికి అందే కార్యక్రమాలపై ఆలోచన చేయాలిబలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్నప్పుడు దానికి మించిన సంతోషం లేదుఅందరూ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా బలహీన వర్గాల బిడ్డలు స్వాగతిస్తూ సలహాలు సూచనలు ఇవ్వండి..బలహీన వర్గాలకు న్యాయం జరగలేనే దానికన్నా మించిన సంతోషం ఇంకోటి ఉండదు..బలహీన వర్గాల మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజు10 సంవత్సరాలుగా కావాలనే ఉద్యమకారులు స్వాగతించాలి..గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బలహీన వర్గాల బిడ్డగా ,సబ్ కమిటీ సభ్యుడిగా , డిక్లరేషన్ చైర్మన్ గా, బలహీన వర్గాల మంత్రిగా కుల సర్వే తీర్మానం ప్రవేశ పెట్టే అదృష్టం కలిగింది..మన వర్గాలకు అన్నిటికీ న్యాయం జరిగే కార్యక్రమం.. అందరూ సలహాలు సూచనలు ఇవ్వండి బీసీలకు టిక్కెట్ లలో అన్యాయం జరుగుతుందిటిక్కెట్ వచ్చిన వాల్లలో కొంత మందిని గెలిపించారుబీసీ ముఖ్యమంత్రి అవుతాడనుకున్నాం::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీసీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ముందు.. బీజేఎల్పీగా బీసీ కి అవకాశం ఇస్తే బావుండేది.:::మంత్రి పొన్నం బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తొలగించింది మేము కాదు..కేంద్ర మంత్రి గా ఉన్న బీసీ నేత బండారు దత్తాత్రేయ ను మేము తొలగించలేదు..బీసీ లకు ప్రాధాన్యత ఇచ్చేదే మేము::మంత్రి శ్రీధర్ బాబుబలహీనవర్గాలు తమ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాయిబీఆర్ఎస్ హయాంలో బీసీలకు అధిక లబ్ధి జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ మంది కుల గణన సర్వేలో పాల్గొనలేదుతెలంగాణ కుల గణన సర్వేలో ఎస్సీ, బీసీ జనాభా తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది:::తలసాని శ్రీనివాస యాదవ్2: 45pmఅసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం..పార్లమెంట్ ఎన్నికల కారణం గా కులగణన కొంత ఆలస్యం అయింది: సీఎం రేవంత్ రెడ్డివివిధ రాష్ట్రాలలో సర్వే లు చేసి... పకడ్బందీగా కులగణన చేశాం: సీఎం రేవంత్ రెడ్డిలక్ష కు పైగా అధికారులతో కులగణన వివరాలు సేకరించారు: సీఎం రేవంత్ రెడ్డి76 వేల మంది ఉధ్యోగులు డేటా ఎంట్రీ చేశారు: సీఎం రేవంత్ రెడ్డికులగణనలో పాల్గొన్న వారందరిని ,పనిచేసిన వారందరినీ పార్టీ లకు అతీతంగా అభినందించాలి: సీఎం రేవంత్ రెడ్డి2: 21pmఅసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం.. కులగణన చేసిన విధానాన్ని సభలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎవరి జనాభా ఎంత అనే సైంటిఫిక్ డేటా లేదు: సీఎం రేవంత్ రెడ్డిఅందుకే కులగణన చేసాం: సీఎం రేవంత్ రెడ్డి1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదు: సీఎం రేవంత్ రెడ్డికేవలం ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు మాత్రమే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నాయి: సీఎం రేవంత్ రెడ్డి2: 21pmతెలంగాణ శాసన సభ లో కుల గణన రిపోర్ట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2: 20pmతెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం.. కులగణన,ఎస్సీ వర్గీకరణపై చర్చ 01:02PMముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీకులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించిన మంత్రి మండలిసీఎం రేవంత్ అధ్యక్షతన ఈ ఉదయం నుంచి జరిగిన భేటీభేటీ కారణంగా.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు 2గం. వాయిదా 11:53AMసభ వాయిదాపై హరీష్‌రావు సెటైర్అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయడం ఏంటి?కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదంనాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు.. నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదుఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?:::ఎక్స్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు పోస్ట్11:44AMసభ వాయిదాపై బీఆర్ఎస్ నేతల ఫైర్శాసన సభ ఎన్నడూ లేని విధంగా ప్రారంభమై వాయిదా పడింది ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఇలా జరగలేదు సభ బిజినెస్ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా వాయిదా వేశారు తెలంగాణ రాష్ట్రం ,శాసన సభ పరువు పోయింది కేబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని శాసన సభ ను వాయిదా వేస్తారా ? కేబినెట్ మీటింగ్ ,శాసన సభ సమావేశాల షెడ్యూల్ ముందే ఖరారు చేశారు మళ్ళీ మార్పులు ఎందుకు చేశారు ఒక్క నిమిషం లోనే సభ ను వాయిదా వేసుకోవడాన్ని బీ ఆర్ ఎస్ ఎల్పీ తీవ్రంగా ఖండిస్తున్నాం :::మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చే గౌరవం ఇదేనా ? బీసీ గణన పై చర్చ అని వాయిదా వేస్తారా ? కేబినెట్ ముందు పెట్టకుండానే నిన్న కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టారు ? బీసీ లను కాంగ్రెస్ మోసం చేస్తోంది మొదట్నుంచి కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకంగా మా జీవితం లో ఈ తరహా లో అసెంబ్లీ ని చూడాలేదు .బీసీ గణన తప్పుల తడక :::మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ లో నూటికి తొంభై శాతం బడుగు ,బలహీన వర్గాలు ,దళితులు ,గిరిజనులు ,మైనారిటీ లే ..ఈ రోజు అసెంబ్లీ లో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు ..షెడ్యూల్ ఇచ్చి మాట తప్పుతారా ? ..కేబినెట్ సమావేశం నిన్న పెట్టుకుంటే ఏమయ్యేది ? ...మమ్మల్ని సభకు పిలిచి అవమానించారు ..మంత్రి శ్రీధర్ బాబు చెప్పగానే ఒక్క నిమిషం లో సభను స్పీకర్ వాయిదా వేశారు ..స్పీకర్ సభ ను వాయిదా వేసే ముందు మమ్మల్ని అడగరా ? ..సభ ను వాయిదా వేయడం కుట్ర పూరితం ..సభ ను ఒక రోజే నిర్వహించడం అన్యాయం ..నాలుగు రోజులు అయినా సభ పెట్టాలి ...బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ..బీసీ లు చైతన్యవంతులు కేసీఆర్ ఏం చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో గమనిస్తున్నారు ..బీసీ ల కోసం మరో ఉద్యమం రాబోతోంది ..తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఈ ఉద్యమం ఉండబోతోంది :::మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్11.33AMఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ నేతలు11.21AMఅవిశ్వాసం పెడతాం: బీజేపీ ఎమ్మెల్యేతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది తొందర్లోనే ఈ ప్రభుత్వం పై అవిశ్వాసం పెడతాం ఇది ప్రజా విద్రోహ ప్రభుత్వం అవసరమైతే మజ్లిస్ తో చర్చించి అవిశ్వాసానికి వెళ్తాం పార్టీలకు అతీతంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ప్రజాస్వామ్య యుతంగా ప్రజా ప్రభుతాన్ని ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ లో నిరాశ, నిస్పృహల్లో ఉన్న mla లతో చర్చించి వారిని ప్రభుత్వంలో చేర్చుకుంటాం:::రాకేష్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే11.13AMఒక్క నిమిషానికే వాయిదానా?: బీఆర్ఎస్ ఫిర్యాదుస్పీకర్ గడ్డం ప్రసాద్ వద్దకు BRS ఎమ్మెల్యేలు ఒక్క నిమిషంలో సభను వాయిదా వేయడం ఏంటి?: బీఆర్ఎస్అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు: బీఆర్ఎస్బీసీలు, ఎస్సీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: బీఆర్ఎస్శాసన సభను అర్ధాంతరంగా ఎలా వాయిదా వేస్తారు? అని ప్రభుత్వంపై స్పీకర్‌కు BRS ఫిర్యాదు 11:07AMతెలంగాణ అసెంబ్లీ వాయిదాతెలంగాణ ప్రత్యేక శాసనసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదాకొనసాగుతున్న కేబినెట్ భేటీమంత్రులు లేకపోవడంతో వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరిన శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుఅంగీకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్.. మధ్యాహ్నాం లంచ్ తర్వాత కొనసాగనున్న సమావేశం 11:05AMక్యాబినెట్ సమావేశం జరుగుతోంది: మంత్రి శ్రీధర్ బాబుసీఎం, డిప్యూటీ సీఎంతో పాటు సహచరు మాత్రులందరూ కేబినెట్లో ఉన్నారు: మంత్రి శ్రీధర్ బాబుసభను వాయిదా వేయాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేస్తున్న: మంత్రి శ్రీధర్ బాబు 11:03AMతెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం10:50AMఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక కు కేబినెట్ ఆమోదం..SC వర్గీకరణ - శాతంగ్రూప్ 1 - ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలు సంచార కులాలు- 1%గ్రూప్ 2 - మాదిగ మాదిగ ఉప కులాలు - 9%గ్రూప్ 3 --మాల మాలవకులాలు -5%10:40AMఅసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం10:30AMకులదరణ సర్వే 100% నిస్పాక్షికంగా జరిగింది.హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 100కు 100% సర్వే జరిగింది.హైదరాబాదులో కావాలని కొంతమంది సర్వేకు దూరంగా ఉన్నారు.గ్రేటర్ సిటీలో మరికొందరు కావాలని సర్వే అధికారులపై కుక్కలు వదిలారు.కుల గణన సర్వేపై అపోహలు వద్దు.ప్రభుత్వంలో వ్యక్తిగా చెప్తున్న మాకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు.బీసీల గురించి ఎవరైనా మాట్లాడితే బీసీ సామాజిక వర్గంలో చులకన అవుతారు.బీసీలకు అన్యాయం చేసే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు.మా ప్రభుత్వం ఏ పని చేసిన చిత్తశుద్ధితో పూర్తి చేస్తుంది:: మంత్రి పొన్నం ప్రభాకర్ 10:20AMబీజేఎల్పీ లో BJP ఎమ్మెల్యేల సమావేశం అసెంబ్లీలో కులగణన షార్ట్ డిస్కషన్ పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చకాంగ్రెస్ పార్టీకి బిసి రిజర్వేషన్ల పెంపుపై చితశుద్ది లేదు - BJLP నేత మహేశ్వర రెడ్డిరాజకీయ లబ్ధి కోణంలోనే కులగణన , అసెంబ్లీలో చర్చ - BJLP నేత మహేశ్వర రెడ్డిమతప్రాతిపదికన ముస్లింలకి ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు ఎత్తివేయాలి - BJLP మహేశ్వర రెడ్డిఇప్పటికే దీనివల్ల గ్రేటర్ హైదరాబాద్ లో హిందూ బిసిలు నష్టపోయారు - BJLP నేత మహేశ్వర రెడ్డికామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలకి ప్రభుత్వం వెళ్ళాలి - BJLP నేత మహేశ్వర రెడ్డి10:04AMహైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి09:30AMనేడు తెలంగాణ కేబినెట్ భేటీ..ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం..కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ నివేదిక లకు కేబినెట్ కు సమర్పించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ని సబ్ కమిటీ..కులగణన,ఎస్సీ వర్గీకరణ నివేదిక లపై చర్చించి ఆమోదం తెలపనున్న కేబినెట్..అనంతరం 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..అసెంబ్లీ లో కేబినెట్ ఆమోదించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేధికను సభలో చర్చకు పెట్టనున్న ప్రభుత్వం.. -
ఎట్టకేలకు కదలిక?!
నాలుగేళ్ళ జాప్యం తరువాత ఎట్టకేలకు రథం కదులుతున్నట్టుంది. దేశంలో పదేళ్ళకు ఒకసారి చేయాల్సిన జనగణన ఎలాగైతేనేం వచ్చే 2025లో ముందడుగేసే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర సర్కార్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వినిపిస్తోంది. 2026 మార్చి నాటికి ఆ గణాంకాలు అందుబాటులోకి వస్తాయట. 2011 తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు జరగనున్న ఈ జనగణన, అది అందించే సమాచారం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు కీలకం. అందుకే, ఇప్పటికైనా ఈ బృహత్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాలనుకోవడం ఆహ్వానించదగిన విషయం. ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనతో పాటు పలు రాజకీయ నిర్ణయాలకూ ఈ జనగణన భూమిక కానుంది. జనగణనతో పాటు పనిలో పనిగా కులగణన కూడా జరపాలనే డిమాండ్ ఊపందుకుంది. అలాగే, ఇకపై 2025ను ప్రాతిపదికగా తీసుకొని ప్రతి దశాబ్దం మొదట్లో జరపాల్సిన జనగణన తాలూకు కాలరేఖను 2035, ’45... అలా మారుస్తారనే మాటా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అవసరమైతే అఖిలపక్ష భేటీ జరపాలనే వాదన వస్తున్నది అందుకే. 1881 నుంచి నిర్వహిస్తున్న ఈ జనాభా లెక్కల ప్రక్రియ అసలు 2021లోనే జరగాల్సింది. అయితే, రాజ్యాంగ రీత్యా కేంద్రం పరిధిలోని ఈ ప్రక్రియను కోవిడ్–19 కారణంగా సర్కారు వాయిదా వేసింది. ఆ పైన కరోనా పోయినా ఈ బృహత్తర బాధ్యత నెరవేర్చడానికి మోదీ సర్కార్ ఎందుకో ఉత్సాహం చూపలేదు. పాత కాలపు జనాభా లెక్కలతో ప్రస్తుత ప్రజా అవసరాలను ఎలా తెలుసుకుంటారన్న విమర్శలకూ గురైంది. ఎందుకంటే, కేవలం తలల లెక్కగా కాక జనాభా హెచ్చు తగ్గుల ధోరణులతో పాటు, సామాజిక, ఆర్థిక పరిస్థితులను సైతం అర్థం చేసుకోవడానికి జనగణన కీలకసూచిక. ప్రభుత్వ ప్రాధాన్యాల నిర్ణయం, వనరుల కేటాయింపు, సంక్షేమ పథకాల రూపకల్ప నకు ఉపకరించే సమగ్ర సమాచార సమాహారం. దేశంలోని సంక్లిష్టమైన సామాజిక సమస్యల పరిష్కారానికి ఓ కరదీపిక. కచ్చితమైన సమాచారం ద్వారానే విద్య, వైద్యం, గృహనిర్మాణం, ప్రాథమిక వసతుల్లో అన్ని ప్రాంతాల్లో సమానాభివృద్ధికి సర్కారు జోక్యం చేసుకొనే వీలుంటుంది. అదే సమయంలో రాజకీయ పర్యవసానాలూ అనేకం. నియోజకవర్గాల పునర్విభజనకూ, జనాభా లెక్కలకూ లింకుంది. ‘‘2026 తరువాత జరిగే తొలి జనగణన’’ ఆధారంగా చట్టసభలలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని 2002లోనే అప్పటి వాజ్‌పేయి సర్కార్ నిర్ణయించింది. అందువల్ల రాజకీయాల రూపురేఖలను మార్చే జనగణన చర్చోపచర్చలకు కారణమవుతోంది. బీజేపీకి ఆది నుంచి దక్షిణాది కన్నా ఉత్తరాదిలోనే బలం, బలగం ఎక్కువ. జనగణన అనంతరం జనసంఖ్య ఆధారంగా పునర్విభజన జరిగితే... కట్టుదిట్టంగా జనాభా నియంత్రణ చర్యలు చేపట్టిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. పార్లమెంట్ స్థానాల సంఖ్య దక్షిణాదిలో తగ్గి, ఉత్తరాదిలో పెరుగు తుంది. అది కాషాయపార్టీకి అనుకూలంగా మారుతుందనే అనుమానం ఉంది. ప్రజాస్వామ్యమంటే ప్రజాసంఖ్యకు సిసలైన రీతిలో ప్రాతినిధ్యం వహించాలన్నది నిజమే. అంత మాత్రాన కుటుంబ నియంత్రణ పాటించనందుకు గాను అధికారం ఉత్తరాది వైపు మొగ్గడమూ సమర్థనీయం కాదు. 1951 నుంచి మన జనగణనలో ఎస్సీ, ఎస్టీలు మినహా మిగతా కులాల లెక్కలు వేయడం లేదు. కానీ, కులాల వారీ జనాభా ఆధారంగా మెరుగైన ప్రాతినిధ్యం, వనరుల కేటాయింపు జరగాలన్నది దీర్ఘకాలిక డిమాండ్. ఈ న్యాయమైన ప్రజాకాంక్షను కేంద్రం ఇప్పటికైనా పట్టించుకొని తీరాలి. అలాగే, లెక్కల్లో ఆడవాళ్ళ సంఖ్య తేలడంతో చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలుకు మెరుగైన ప్రాతిపదిక సిద్ధమవుతుంది. వీటి వల్ల సామాజిక న్యాయం, సమ్మిళిత ఆర్థిక పురోగతి, స్త్రీ – పురుష సమానత్వ స్పృహతో విధాన నిర్ణయానికీ వీలు చిక్కుతుంది. పైగా, ఈ పర్యాయం జనాభా లెక్కలు తొలిసారిగా డిజిటల్ విధానంలో జరగనున్నందున వివరాలు, విశేషాలు మరింత నిక్కచ్చిగా, వేగంగా అందవచ్చు. సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ముందస్తు పరీక్షగా జనాభా లెక్కల సన్నాహక ప్రక్రియ జరుపుతారు. మరుసటేడు ఫిబ్రవరిలో అసలు లెక్కలు జరుపుతారు. 2021 జనాభా లెక్కల కోసం 2019లోనే ఆ ప్రీ–టెస్ట్ జరిపినా, జాప్యమైనందున మళ్ళీ ప్రీ–టెస్ట్ జరపవచ్చు. అధికారిక ప్రకటనతోనే ఈ సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. అత్యవసరం, అనివార్యమైనప్పటికీ, జనగణన అంశంలో దేశంలో చేపట్టాల్సిన చర్యలూ కొన్ని ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో ఒకరికి మోదం, వేరొకరికి ఖేదం కలగరాదంటే... అమెరికా ఫక్కీలో మన వద్దా వివిధ రాష్ట్రాల మధ్య విద్య, ఉపాధి నిమిత్తం అంతర్గత వలసలను ప్రోత్సహించడం జనసంఖ్య సమతుల్య పంపిణీకి ఒక మార్గమని నిపుణుల మాట. అదే సమయంలో స్థానిక భాష, సంస్కృతుల్లో వలసదారులు కలగలసిపోయేలా ఇంగ్లీషు, హిందీ, స్థానిక భాష – అనే త్రిభాషా సూత్రాన్ని దేశవ్యాప్తంగా అనుసరించాలని మరో సూచన. హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల వారు సైతం కచ్చితంగా మరో భారతీయ భాష నేర్చుకోవాలనే నియమం ద్వారా భాష, ప్రాంతాలకు అతీతంగా అందరినీ దగ్గర చేయవచ్చు. వెరసి, సమతుల్య జనాభా పంపిణీ, సాంస్కృతిక స్నేహవారధి సాయంతో ఆర్థికంగా, సామాజికంగా సంతులిత ప్రాంతీయాభివృద్ధికి బాటలు వేయవచ్చు. ఈసారికి 2025లో చేసినా, ఇకపై మునుపటిలానే ప్రతి దశాబ్ది ఆరంభంలోనే ఈ ప్రక్రియ చేపట్టడం మేలు. ఏమైనా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రాంతీయ ప్రయోజనాల్లో సమతూకం పాటించాలి. పరస్పర విశ్వాసంతో పాటు పూర్తి చిత్తశుద్ధి అందుకు అవసరం. -
జనగణన వచ్చే ఏడాదే షురూ!. కేంద్రం కీలక నిర్ణయం. 2026 నాటికి ప్రక్రియ పూర్తి. తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన?
-
నూతన దంపతులు 16 మందిని కనాలి
చెన్నై: నూతన దంప తులు ఎక్కువ మంది పిల్లల్నికనే విష యం ఆలోచించాల ని తమిళనాడు ము ఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొ న్నారు. ‘తమిళ సంప్రదాయంలో పెద్దలు నూతన దంపతులను 16 సంపదలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తుంటారు. కానీ, నేడు పరిస్థితి మారిపోయింది. 2026 నుంచి చేపట్టనున్న జన గణన, లోక్‌సభ నియోజ కవర్గాల పునర్విభజనతో పుణ్యమాని చిన్న కుటుంబానికి బదులు, 16 మంది సంతానంతో కళకళలాడాలని ఆశీర్వదించాల్సిన రోజులొచ్చాయి’అని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం చెన్నైలో జరిగిన సామూహిక వివాహ వేదిక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దేశంలో ఎన్నికల ముఖ చిత్రమే పూర్తిగా మారిపోనుందని అన్నారు. ‘లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున, మాకు 16 మంది పిల్లలుండాలా అని ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడొచ్చు. అయితే, ఈ విషయం మనం మర్చిపోకూడదు’ అని ఆయన అన్నారు. -
TG: బీసీ కులగణనపై హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: మూడు నెలల్లో బీసీ కుల గణన చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణనపై బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం(సెప్టెంబర్10)విచారించింది. పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. పిటిషన్‌పై విచారణ ముగిసినట్లు హైకోర్టు ప్రకటించింది. హైకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం మూడు నెలల్లో కులగణన చేయడం సాధ్యమేనా కోర్టును మళ్లీ సమయం అడుగుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: స్థానిక సంస్థల నిధులు పెంచండి -
ఎట్టకేలకు ఒక కదలిక
రథం కదులుతోంది. ఎప్పుడో జరగాల్సిన పనిలో ఇప్పటికైనా అడుగులు ముందుకు పడుతున్నాయి. దేశంలో జనాభా లెక్కల పని ఎట్టకేలకు మరికొద్ది రోజుల్లోనే సెప్టెంబర్‌లో ఆరంభ మవుతోంది. ఆ మేరకు ఇటీవల వెలువడ్డ సమాచారం పెద్ద ఊరట. ప్రతి పదేళ్ళకు ఒకసారి జరగాల్సిన ఈ జనగణన యజ్ఞం నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది. కోవిడ్ సహా అనేక సాకులతో ప్రభుత్వం సాచివేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చింది. అయితే, భారత్ లాంటి వర్ధమాన దేశానికి జనగణన మినహా ప్రత్యామ్నాయ మార్గాలలో ఆ స్థాయి సమాచారం అందుబాటులో లేదు. ఉన్నా అది అంత నమ్మదగినదీ కాదు. అందుకే జనాభా పరంగా, సామాజిక – ఆర్థికపరంగా దేశ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించడానికి కొన్ని దశాబ్దాలుగా జనగణన అత్యంత కీలకమైనది.అలాంటి జనగణన ప్రక్రియ ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కుతోంది. వచ్చే నెల (సెప్టెంబర్)లో ఆరంభ మయ్యే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఏణ్ణర్ధ కాలం పడుతుందని ప్రభుత్వం మాట. జనగణన అనేది పలువురు పొరబడుతున్నట్టు కేవలం గణాంకాల సేకరణ కాదు. అది సుపరి పాలనకు మూలస్తంభం. దేశం ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక సవాళ్ళకు పరిష్కారాలు కనుగొనేందుకు మార్గదర్శి. పట్టణీకరణ, ప్రాథమిక వసతుల అభివృద్ధి మొదలు సాంఘిక సంక్షేమం, ఆర్థిక ప్రణాళిక వరకు ప్రతి అంశం పైనా సరైన విధాన నిర్ణయాలకు ఈ సమాచారమే కీలకం. నిజానికి, జనాభా లెక్కల సేకరణలో కేంద్ర సర్కార్ చేసిన సుదీర్ఘ జాప్యం చాలాకాలంగా విమర్శలకు గురవుతోంది. ప్రైవేట్వారే కాదు... సర్కారీ ఆర్థిక నిపుణులు సైతం విమర్శకుల్లో ఉండడం గమనార్హం. పాత జనాభా లెక్కల ఆధారంగానే ఇప్పటికీ ఆరోగ్యం, ఆర్థిక అంశాలు, చివరకు ద్రవ్యోల్బణం రేటు, ఉపాధి లెక్కల లాంటివన్నీ గణిస్తూ ఉండడం వల్ల కచ్చితత్వం లోపిస్తోంది. డేటా లోపంతో కనీసం 15 కీలక అంశాలపై దుష్ప్రభావం పడింది. అదే ఈ నిపుణులందరి బాధ. పుష్కర కాలం క్రితపు లెక్కలపై ఆధారపడే సరికి అంతా లోపభూయిష్టమైంది. దాదాపు 10 కోట్ల మంది పౌర సరఫరా వ్యవస్థకు వెలుపలే ఆహారభద్రత లేకుండా మిగిలిపోయారు. ఇళ్ళు, శ్రామికుల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులపైనా దెబ్బ పడింది. చివరకు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వారి సర్వేల నాణ్యత కూడా దెబ్బతింది. అంతెందుకు... జనాభాలో చైనాను భారత్ దాటేసి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరించినట్టు ఐరాస నివేదిక గత ఏడాది ప్రకటించింది. దాన్ని ఖరారు చేయడానికో, కాదనడానికో, ఆ జనాభా లెక్కకు అనుగణంగా అవసరమైన చర్యలు చేపట్టాడానికో కూడా మన వద్ద నిర్దుష్టమైన గణాంకాలు లేని పరిస్థితి. అలాంటి లోపాలన్నీ సరిదిద్దుకోవడానికి ఇప్పుడిది సదవకాశం. అదే సమయంలో జనగణనలో భాగంగా మన జనాభా తాలూకు కులగణన కూడా చేయడం అత్యవసరం. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ కోరుతున్నది అదే. తద్వారా జనసంఖ్యలో ఏ సామాజిక వర్గం వంతు ఎంత, ఏయే వర్గాల స్థితిగతులు ఏమిటి, ఏ వర్గాలు ఎంతగా వెనకబడి ఉన్నాయి తదితర భోగట్టా తేటతెల్లమవుతుంది. కులాలు, ఉపకులాలతో పాటు వర్తమానంలో కనుమరుగైపోతున్న ఆశ్రిత కులాల లెక్కలూ వెలికివస్తాయి. వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చేలా పాలకులు పాలసీలు చేయడానికీ వీలవుతుంది. ప్రణాళిక, పాలన, చట్టాల రూపకల్పన సహా అనేక ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షకూ, నిర్వహణకూ ఈ సమాచారమంతా ఉపకరిస్తుంది. తాజా జనగణన రాజకీయంగానూ ప్రధానమే. దేశంలోని అన్ని స్థాయుల చట్టసభలలో నియో జక వర్గాల పునర్విభజన, రిజర్వేషన్‌కు ఈ కొత్త లెక్కలే ఆధారమవుతాయి. అంటే, అసెంబ్లీ, పార్ల మెంట్ స్థానాల సంఖ్య మారిపోనుంది. ఈ లెక్కన దక్షిణాదితో పోలిస్తే జనాభా నియంత్రణ అంతగా లేని ఉత్తరాదిలో మరిన్ని చట్టసభా స్థానాలు వస్తాయి. ఫలితంగా అధికార సమీకరణాలూ మారి పోతాయి. ఇంతటి ముఖ్యమైనది కాబట్టే... ఇలాంటి అధికారిక గణాంక వ్యవస్థను ప్రభుత్వ, రాజ కీయ జోక్యాలకు వీలైనంత దూరంగా ఉంచడం శ్రేయస్కరం. మారిన కాలానికి అనుగుణంగా కొత్త జనగణన రూపురేఖలూ మారుతున్నాయట. ప్రధానంగా డిజిటల్ పద్ధతిలో, అదీ స్వీయ నమోదు పద్ధతిలో జనగణన సాగనుంది. గతంలో స్త్రీ, పురుషుల వివరాలనే దఖలు పరిస్తే, ఇప్పుడు తొలి సారిగా ట్రాన్స్జెండర్ల వివరాలనూ ప్రత్యేకంగా నమోదు చేయనున్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలే కాక ‘ఇతర వెనుకబడిన వర్గాలు’ అంటూ వివరాలు విడిగా నింపనున్నారట. ఏమైతేనేం, ఇన్నేళ్ళ తరువాతైనా జనాభా లెక్కల ప్రక్రియను మళ్ళీ చేపట్టడం హర్షణీయం. అతి ముఖ్యమైన బృహత్ యజ్ఞాన్ని ఇక నుంచైనా ఎప్పటికప్పుడు నిర్ణీత సమయానికే నిర్వహించడం అత్యవసరం. తద్వారానే కచ్చితమైన డేటా దేశంలో పాలనా యంత్రాంగానికి అందుబాటులోకి వస్తుంది. 2026 మార్చి కల్లా ఈ జనగణన ఫలితాలను సమర్పించేందుకు కేంద్ర శాఖలు ఇప్పటికే నిర్ణీత కాలవ్యవధి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. దీంతో, 2011 నుంచి అప్పటి దాకా... అంటే 15 ఏళ్ళ కాలవ్యవధిలోని సమాచారం చేతిలోకి వస్తుంది. అయితే, ఈసారి జరిగిన జాప్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. దేశం ముందుకు సాగడానికి దాని సమూహ స్వరూప స్వభావాలు దానికైనా తెలిసి ఉండడం ముఖ్యం. అలాంటి సమాచార సేకరణ, వినియోగంలో అంతరాయాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఊహించని ఆటంకాలు ఎదురైనా ఇబ్బంది పడకుండా ఉండేలా జనాభాపై సమగ్ర సమాచారం అందించే కట్టుదిట్టమైన వ్యవస్థలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నాలు జరగడానికి ఇదే తరుణం. -
జనగణన లేకుండా ఈ లెక్కలేల?
పటా్న: ప్రధానమంత్రి ఆర్థికవ్యవహారాల సలహా మండలి(ఈఏసీ–పీఎం) నివేదికలోని గణాంకాలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సందేహం వ్యక్తంచేశారు. తాజాగా జనగణన చేపట్టకుండానే దేశంలో హిందూ, ముస్లింల జనాభాపై కేంద్రం ఎలా ఒక అంచనాకు వస్తుందని నిలదీశారు. దేశంలో ముస్లింల జనాభా పెరిగిందని, హిందువుల జనాభా తగ్గిందంటూ విడుదలచేసిన ఈఏసీ–పీఎం రిపోర్ట్‌పై తేజస్వీ స్పందించారు. ‘‘ అసలైన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే హిందూ, ముస్లింల మధ్య మోదీ సర్కార్ చిచ్చుపెడుతోంది. జనాభా లెక్కలు లేకుండానే ఎలా ఈ కొత్త లెక్కలతో వచ్చారు? 2021లో కూడా జనగణన ఎందుకు సాధ్యంకాలేదు. అప్పుడు, ఇప్పుడు మీరే ప్రధాని. హిందూ, ముస్లింలను వేర్వేరుగా పక్షపాత ధోరణితో చూసే విధానాన్ని విడనాడండి. సమస్యల గురించే మాట్లాడండి’ అని ప్రధానికి తేజస్వీ హితవు పలికారు. షేర్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్: ఏ క్రాస్ కంట్రీ అనాలసిస్(1950–2015) పేరిట ఈఏసీ–పీఎం ఒక నివేదిను తయారుచేసింది. 1950వ సంవత్సరంను ప్రాతిపదికగా తీసుకుని లెక్కిస్తే దేశ జనాభాలో 84.68 శాతంగా ఉన్న హిందువులు 2015 ఏడాదివచ్చేసరికి 78.06 శాతానికి తగ్గారు. అంటే దేశజనాభాలో హిందువుల వాటా 7.82 శాతం తగ్గింది. అదే సమయంలో దేశజనాభాలో ముస్లింలు 9.84 శాతంగా ఉంటే 2015 ఏడాదినాటికి దేశజనాభాలో వారు 14.09 శాతానికి పెరిగారని నివేదిక పేర్కొంది. -
బీసీ కులగణన వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్సీ కవిత
నల్గొండ: అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పూలే జయంతికి మరో నెల రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. ‘ప్రభుత్వం నుంచి అసెంబ్లీలో విగ్రహ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. 1931లో చివరిసారిగా కుల గణన చేశారు. బీసీ కులగణన వెంటనే చేపట్టాలి. మండల్ కమీషన్‌కు వ్యతిరేకంగా ఆనాడు రాజీవ్‌గాంధీ మాట్లాడారు. 1996లో రూ.4500 కోట్లతో కులగణన చేసి కనీసం వాటిని బయట కూడా రానివ్వలేదు కాంగ్రెస్. ఎంతమంది బీసీ జడ్జీలు ఉన్నారని రాహుల్ గాంధీ అంటున్నారు. 75 ఏళ్లు పాలించింది మీరు కాదా రాహుల్. ...పార్లమెంట్లో పూలే విగ్రహం ఉన్నంక అసెంబ్లీలో ఉంటే తప్పేంటి. ఏపీలో కులగణనపై ఓ ప్రణాళిక ప్రకారం చట్టం చేసి ముందుకు పోతున్నారు. కులగణన చేసి రిజర్వెషన్ల కోటా తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి 20 వేల కోట్ల నిధులిస్తామన్నారు. బడ్జెట్లో ఎనిమిది వేల కోట్లే ఇచ్చారు. తెలంగాణలో ఎంబీసీ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు ఏమైందో చెప్పాలి’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. -
అనంతపురం జిల్లాలో వేగంగా కులగణన కార్యక్రమం
-
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి కులగణన..28వ తేదీ వరకూ గృహాలను సందర్శించి సర్వే...ఇంకా ఇతర అప్డేట్స్
-
జన గణన తరువాత మహిళా బిల్లు అమలు
శివాజీనగర(బెంగళూరు): 2024లో జన గణన పూర్తయ్యాక మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కర్ణాటకలోని మూడుబిద్రిలో రాణి అబ్బక్క స్మారక తపాలా స్టాంపును శనివారం ఆమె విడుదల చేసి మాట్లాడారు. ప్రధాని మోదీకి దేశ నిర్మాణంలో మహిళల పాత్రపై ఉన్న ఎంతో విశ్వాసం వల్లనే మహిళా బిల్లు వాస్తవ రూపం దాలి్చందని చెప్పారు. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉళ్ళాల రాణి అబ్బక్క ధైర్యం, ధీరత్వం గొప్పదన్నారు. సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన అనేక మంది గుర్తు తెలియని పోరాటయోధుల సేవలను స్మరించుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ప్రభుత్వం 14,500 మంది స్వాతంత్య్ర సమరవీరుల కథలతో డిజిటల్ భాండాగారాన్ని రూపొందిస్తోందని చెప్పారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు... ఆ భాగాన్ని కొట్టేయలేం: సుప్రీం
న్యూఢిల్లీ: ఇటీవలే పార్లమెంటు ఆమోదం పొందిన మహిళల రిజర్వేషన్ బిల్లులో ‘జనగణన అనంతరం అమల్లోకి వస్తుంది’అని పేర్కొంటున్న భాగాన్ని కొట్టేయడం చాలా కష్టమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులిచ్చేందుకు తిరస్కరించింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో తెచి్చన మహిళా బిల్లును రానున్న సాధారణ ఎన్నికల్లోపే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టి దర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది. దీన్ని ఈ అంశంపై దాఖలైన మరో పిటిషన్‌తో పాటు నవంబర్ 22న విచారిస్తామని పేర్కొంది. లోక్‌సభలోనూ, అసెంబ్లీల్లోనూ మూడో వంతు స్థానాలను మహిళలకు రిజర్వు చేస్తూ కేంద్రంలో బీజేపీ సర్కారు సెపె్టంబర్ 21న ఈ బిల్లు తేవడం తెలిసిందే. దానికి పార్లమెంటుతో పాటు రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా లభించింది. ఇక మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదమే మిగిలింది. ఇది నిజంగా మంచి ముందడుగని ధర్మాసనం అభిప్రాయపడింది. -
సంపూర్ణ సాధికారత
"అణగారిన వర్గాల అభ్యున్నతికి కుల గణన మరింత దోహదం చేస్తుంది. ఆర్థిక, సామాజిక సాధికారత దిశగా చేయూత అందిస్తుంది. ఇంకా ఎవరైనా అర్హులు ప్రభుత్వ పథకాలు అందకుండా మిగిలిపోయినా కూడా ఈ గణన ద్వారా తెలుస్తుంది. తద్వారా వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుంటుంది." -సీఎం జగన్మోహన్ రెడ్డి సాక్షి, అమరావతి: సంపూర్ణ సామాజిక సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుల గణనకు శ్రీకారం చుడుతోంది. సమాజంలో అణగారిన వర్గాలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య, విద్యా ఫలాలు అందేందుకు వీలుగా ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దాదాపు శతాబ్దం తర్వాత రాష్ట్రంలో కుల గణన ద్వారా మరిన్ని పేదరిక నిర్మూలన పథకాలు, మానవ వనరుల అభివృద్ధితోపాటు తారతమ్యాలు, అసమానతలను రూపు మాపేలా ప్రణాళిక రూపొందించింది. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి కీలక సమావేశంలో ఈమేరకు కుల గణన నిర్ణయానికి ఆమోదం లభించింది. సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ తర్వాత కుల గణన ప్రక్రియ చేపడతామని తెలిపారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా సామాజిక వర్గాల నాయకులతో సమావేశాలు, ఐదు ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. కుల గణన చేపట్టాలని కోరుతూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినా స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలో బీసీల ఆత్మ బంధువుగా సీఎం జగన్ చేపడుతున్న కుల గణనను ‘సామాజిక సాధికార సురక్ష’గా అభివర్ణించారు. సంక్షేమ ఒరవడిలో భాగంగా నవంబరు 7వతేదీన వైఎస్సార్ రైతు భరోసా సాయం పంపిణీతో పాటు 15వతేదీన భూమిలేని నిరు పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ, 22–ఏ జాబితా నుంచి ఈనామ్ భూముల మినహాయింపు, ఎస్సీ కార్పొరేషన్ రుణాల ద్వారా భూమి కొనుగోలు చేసిన వారికి రుణాలను మాఫీ చేయడంతో పాటు వాటిపై పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. ఎస్సీ శ్మశాన వాటికల కోసం భూములు, లంక భూములకు పట్టాల పంపిణీ చేపడతామన్నారు. 28వ తేదీన జగనన్న విద్యా దీవెన, 30న పేదింటి ఆడబిడ్డలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అందజేస్తామన్నారు. జర్నలిస్టుల చిరకాల వాంఛ, విజ్ఞప్తిని గౌరవిస్తూ అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు సీఎం జగన్ సారథ్యంలోని మంత్రి మండలి అంగీకారం తెలిపిందని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు 3.64 శాతం డీఏ (01–07–2022 నుంచి) ఇవ్వనున్నట్లు చెప్పారు. మంత్రి మండలి నిర్ణయాలపై మంత్రి ఏమన్నారంటే.. ఆస్పత్రికి వెళ్లేందుకు రూ.500 ప్రయాణ ఖర్చులు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి పేదల ఆరోగ్యంపై ఆరా తీస్తోంది. ఇప్పటి వరకు 11,710 క్యాంపులను నిర్వహించింది. సుమారు 60 లక్షల మంది శిబిరాల వద్ద వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇంటి వద్దే 6.40 కోట్ల ర్యాపిడ్ టెస్టులు చేశారు. 8,72,212 మందికి కంటి పరీక్షలు చేయగా 5,22,547 మందికి కంటి అద్దాలు అందజేశారు. మిగిలిన వారికి మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు సిఫారసు చేశారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య పరీక్షల్లో అనారోగ్య సమస్యలను గుర్తిస్తే చికిత్స విషయంలో సమగ్రంగా ఫాలో అప్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గతంలో ఆరోగ్యశ్రీ చికిత్సలు చేయించుకున్న వ్యక్తులు, శిబిరాల ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సిన వారు, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్దేశించారు. మెరుగైన వైద్యం కోసం రిఫరెల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా/ఆస్పత్రికి పంపించాలన్నారు. వారికి ప్రయాణ ఖర్చులు కింద రూ.500 అందించాలని ఆదేశించారు. చికిత్స సమయంలో, అనంతరం కూడా సకాలంలో మందులు అందించడంతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని దిశానిర్దేశం చేశారు. కొత్తగా రెండు రవాణా శాఖ యూనిట్లు తూర్పు గోదావరి జిల్లా నల్లజెర్ల, గోపాలపురం, తాళ్లపూడి మండలాలతో కలిపి దేవరాపల్లిలో రవాణా శాఖకు యూనిట్ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, ఒక హోంగార్డు నియామకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 6 మండలాలు (ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, రామగిరి, కనగానపల్లె, సీకే పల్లె)తో కలిపి రవాణా శాఖకు కొత్తగా యూనిట్ ఆఫీసు నెలకొల్పి ఒక మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ ఇంజనీరు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ముగ్గురు హోంగార్డులను నియమించనున్నాం. స్కూళ్లలో టెక్నాలజీ వినియోగం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన విద్య అందించే చర్యల్లో భాగంగా 6,790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ నియామకానికి మంత్రి మండలి ఆమోదించింది. ఫ్యూచర్ స్కిల్స్‌పై బోధన కోసం సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీలను మ్యాపింగ్ చేసింది. ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు ట్యాబ్‌లు, డిజిటల్ పరికరాలు, యాప్‌లు, ఐఎఫ్‌పీ ప్యానళ్ల వినియోగంపై శిక్షణ ఇస్తారు. వీటిల్లో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే సరిదిద్దుతారు. భూ కేటాయింపులపై కొత్త పాలసీ భారీ ప్రాజెక్టుల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్ కాంప్లెక్స్, డీజిల్ బస్ రిట్రో ఫిటింగ్, బ్యాటరీ ఫ్యాక్ అసెంబుల్డ్ చేసే పెప్పర్ మోషన్ సంస్థకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించింది. ఈ సంస్థ రూ.4,640 కోట్ల పెట్టుబడితో 8,080 మందికి ఉపాధి కల్పించనుంది. పరిశ్రమలకు భూ కేటాయింపులపై కొత్త పాలసీ ‘న్యూ ల్యాండ్ అలాట్మెంట్’కి ఆమోదం లభించింది. ఇకపై లీజు విధానం స్థానంలో సేల్ డీడ్ ద్వారా కేటాయింపులు జరుగుతాయి. పరిశ్రమల కోసం మాత్రమే ఆ భూమిని వినియోగించేలా తగిన షరతులతో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. విద్యుత్ రంగంలో.. ►అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీకి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం గతంలో ఏపీఐఐసీ 1,200 ఎకరాలు కేటాయించింది. ఇందులో ఎన్టీపీసీ రూ.95 వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయడంతో పాటు దీన్ని సబ్ లీజ్‌కు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. ►ఏపీ ఫెర్రో అల్లాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు వివిధ రకాల విద్యుత్ డ్యూటీలలో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. తద్వారా సుమారు రూ.766 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించనుంది. ఈ పరిశ్రమలపై 50 వేల మంది ఆధారపడటంతో ఈమేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ► 902 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నంద్యాల, వైఎస్సార్ జిల్లాలలో 5,400 ఎకరాలు లీజు ప్రాతిపదికన కేటాయింపు. ఈ కంపెనీ ఎకరానికి ఏడాదికి రూ.31 వేలు చెల్లించనుంది. ►కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అనుమతి. మంత్రి మండలి ఆమోదించిన మరిన్ని అంశాలు ► పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2023–24 ధాన్యం సేకరణకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణ సేకరణకు సంబంధించి ప్రభుత్వ గ్యారంటీలకు, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతినిస్తూ గత నెల 30వతేదీన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం ప్రతిపాదనలకు, రెండు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలన్న ఎస్ఐపీబీ నిర్ణయానికి ఆమోదం లభించింది. ►రహదారుల, భవనాల శాఖలో వసతి గృహాల మెరుగైన నిర్వహణకు అవుట్ సోర్సింగ్ విధానంలో 467 పోస్టుల భర్తీ. ►పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాల్టీలో పురపాలకశాఖ భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు. ►50 ఎకరాల లోపు ఏపీఐఐసీ ద్వారా 285 భూ కేటాయింపులకు ఆమోదం. ► తిరుపతి జిల్లా పేరూరులో ఎంఆర్కేఆర్ గ్రూపు హోటల్ నిర్మాణానికి అదనంగా మరో 2 ఎకరాలు, వైఎస్సార్ జిల్లా గండికోటలో, విశాఖపట్నంలో మే ఫెయిర్ గ్రూపులకు గతంలో కేటాయించిన భూములు కాకుండా కొత్త సర్వేనెంబర్లలో భూ కేటాయింపులు. ► విశాఖపట్నానికి చెందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని గ్రూప్–1 అధికారిగా నియామకానికి ఆమోదం. ► కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు 4.12 ఎకరాల భూమి కేటాయింపు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లెలో ఏపీఐఐసీకి 2.92 ఎకరాల భూమి కేటాయింపు. ► శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు. ► నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరులో 39.08 ఎకరాల భూమి రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డుకు కేటాయింపు. ► రాష్ట్రంలో 100 ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ. ఇందులో 45 పోస్టులు అప్‌గ్రేడేషన్, 55 సూపర్ న్యూమరీ పోస్టులు. ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలో విజయవాడతో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలులో 22 పోస్టుల భర్తీకి ఆమోదం. ► కర్నూలులో సెకండ్ నేషనల్ లా యూనివర్సిటీ, స్టేట్ క్వాజీ జ్యుడీషియల్ అండ్ లీగల్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు అవసరమైన మరో 100 ఎకరాల భూమి కేటాయింపు. ఇప్పటికే వీటి కోసం 50 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం. ► దేవదాయ శాఖలో సిబ్బంది బలోపేతానికి దేవదాయశాఖ కమిషనర్ పరిధిలో ఒక డిప్యూటీ కమిషనర్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ► దేవాలయాలు ఆర్జించే ఆదాయాల ఆధారంగా ఏర్పాటు చేసే పోస్టులకు సంబంధించిన ఆదాయ పరిమితుల పెంపు. గతంలో డిప్యూటీ కమిషనర్ పరిధిలో రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటే ఇప్పుడు దానిని రూ.7 కోట్ల నుంచి రూ.12 కోట్లకు, జాయింట్ కమిషనర్ పరిధిలో గతంలో రూ.కోటి పైన ఉంటే దానిని రూ.12 కోట్లు కంటే ఎక్కువ పరిమితి పెంచారు. ► విశాఖపట్నం జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు, యూజర్ చార్జీల నుంచి మినహాయింపు. ► పోలవరం ముంపు గ్రామాల పునరావాసంలో భాగంగా ఏలూరు జిల్లా పరిధిలో పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల పరిధిలో 12,984 కుటుంబాలకు, తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం, కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో 3,823 కుటుంబాలకు కేటాయించిన ఇళ్ల పట్టాలకు, భూమి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ భూమి కేటాయింపునకు సంబంధించి ఉచితంగా రిజిస్ట్రేషన్. ► విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవలో ప్రముఖ జానపద కళాకారుడు, దివంగత వంగపండు ప్రసాదరావు సతీమణి వంగపండు విజయలక్ష్మికి 1,000 గజాల ఇంటి స్థలం కేటాయింపు. ఇదీ చదవండి: బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం -
Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ మోదీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. అయితే జన గణన, డీ లిమిటేషన్ వంటివాటితో నిమిత్తం లేకుండా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. అలాగే మూడో వంతు రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా వర్తింపజేయాలన్నారు. బుధవారం లోక్‌సభలో మహిళా బిల్లుపై చర్చను విపక్షాల తరఫున ఆమె ప్రారంభించారు. రిజర్వేషన్ల అమలులో ఏ మాత్రం ఆలస్యం చేసినా అది భారత మహిళల పట్ల దారుణ అన్యాయమే అవుతుందని అన్నారు. ‘కుల గణన జరిపి తీరాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఇందుకోసం తక్షణం కేంద్రం చర్యలు చేపట్టాలి‘ అని పునరుద్ఘాటించారు. రాజకీయాలతో పాటు వ్యక్తిగతాన్నీ, భావోద్వేగాలను కూడా రంగరిస్తూ సాగిన ప్రసంగంలో సోనియా ఏమన్నారంటే... ‘దేశాభివృద్ధిలో మహిళల పాత్రను సముచితంగా గుర్తుంచుకునేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది సరైన సమయం. అందుకే, నారీ శక్తి విధాన్ అధినియమ్‌కు కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా మద్దతిస్తుంది. దాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలి. ఆ దారిలో ఉన్న అడ్డంకులను తలగించాలి‘. వంటింటి నుంచి అంతరిక్షం దాకా... ‘మసిబారిన వంటిళ్ల నుంచి ధగధగా వెలిగిపోతున్న స్టేడియాల దాకా, అంతరిక్ష సీమల దాకా భారత మహిళలది సుదీర్ఘ ప్రయాణం. అటు పిల్లలను కని, పెంచి, ఇటు ఇల్లు నడిపి, మరోవైపు ఉద్యోగాలూ చేస్తూ అంతులేని సహనానికి మారుపేరుగా నిలిచింది మహిళ. అలాంటి మహిళల కష్టాన్ని, గౌరవాన్ని, త్యాగాలను సముచితంగా గుర్తించినప్పుడు మాత్రమే మానవతకు సంబంధించిన పరీక్షలో మనం గట్టెక్కినట్టు‘. స్వాతంత్య్ర పోరులోనూ నారీ శక్తి ‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలోనూ, అనంతరం ఆధునిక భారత నిర్మాణంలో కూడా భారత మహిళలు పురుషులతో భుజం కలిపి సాగారు. కుటుంబ బాధ్యతల్లో మునిగి సమాజం, దేశం పట్ల తమ బాధ్యతలను ఎన్నడూ విస్మరించలేదు. సరోజినీ నాయుడు, సుచేతా కృపాలనీ, అరుణా అసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిట్, రాజ్ కుమార్ అమృత్ కౌర్, ఇంకా ఎందరెందరో మహిళామణులు మనకు గర్వకారణంగా నిలిచారు. గాం«దీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ తదితరుల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ వంతు పాత్ర పోషించారు‘. రాజీవ్ కల.. అప్పుడే సాకారం ‘చట్ట సభల్లో మహిళలకు సముచిత ప్రాతి నిధ్యం దక్కాలన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు ఆమోదం పొందినప్పుడే అది పూర్తిగా సాకారవుతుంది. నేనో ప్రశ్న అడగాలనుకుంటున్నా. భారత మహిళలు తమ రాజకీయ బాధ్యతలను తలకెత్తుకునేందుకు 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇప్పుడు కూడా వారిని ఇంకా ఆరేళ్లు, ఎనిమిదేళ్లు... ఇలా ఇంకా ఆగమంటూనే ఉన్నారు. భారత మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన సరైనదేనా?‘ మహిళా శక్తికి ప్రతీక ఇందిర... ఇక దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వ్యక్తిత్వం భారత మహిళల శక్తి సామర్థ్యాలను తిరుగులేని ప్రతీకగా ఇప్పటికీ నిలిచి ఉంది. వ్యక్తిగతంగా నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన సందర్భం. మహిళలకు స్థానిక సంస్థల్లో మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ నా జీవిత భాగస్వామి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తొలిసారిగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. కానీ రాజ్యసభలో ఆ బిల్లును కేవలం ఏడు ఓట్లతో ఓడించారు. అనంతరం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పాస్ చేయించింది. ఫలితంగా నేడు 15 లక్షలకు పైగా మహిళలు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా రాణిస్తున్నారు‘. -
పులుల సంతతిని ఎలా లెక్కిస్తారు ?
-
జన ధన భారత్! 2023లో రికార్డు దిశగా.. 1950లో మన జనాభా ఎంతో తెలుసా?
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఈ ఏడాదే భారత్ అవతరించబోతోంది. 2011 తర్వాత మన దేశంలో జనాభా వివరాల సేకరణ జరగలేదు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) జనాభా లెక్కల కోసం పాటించే సూత్రాన్ని అనుసరించి ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి భారత జనాభా చైనాను అధిగమించనుందని అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి 1950లో ప్రపంచ జనగణన మొదలు పెట్టినప్పటి నుంచీ అధిక జనాభాగల దేశంగా పేరుపడిన చైనా ఇంకో రెండు నెలల్లో ఆ హోదాను కోల్పోబోతోందని ప్యూ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. –దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి 72 ఏళ్లలో 100 కోట్లు.. ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనగణన చేసిన తొలి సంవత్సరం 1950లో భారత జనాభా 35.3 కోట్లు. ఇప్పుడది 140 కోట్లకు చేరినట్లు ‘ప్యూ’అంచనా. అంటే గత 72 ఏళ్లలో దేశ జనాభా 100 కోట్లకుపైగా పెరిగింది. ఇది మొత్తం యూరప్ దేశాల జనాభా (74.4 కోట్లు) కంటే అధికం. ఉత్తర, దక్షిణ, అమెరికా ఖండాల కంటే (100 కోట్లు) కూడా ఎక్కువే. చైనాలో ప్రస్తుత జనాభా 140 కోట్లుగా ఉన్నా.. అక్కడ కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల మందగించింది. కానీ భారత్‌లో మాత్రం ఎప్పటి మాదిరిగానే పెరుగుతోంది. యూఎన్వో అంచనా ప్రకారం.. భారత దేశ జనాభా ఈ దశాబ్ధం చివరికి 150 కోట్లకు, 2064 నాటికి 170 కోట్లకు చేరుకుంటుంది. అక్కడి నుంచి జనాభా పెరుగుదల మందగిస్తుంది. యంగ్ ఇండియా ►భారత జనాభాలో 25 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నవారు 40 శాతంపైగా ఉన్నారు. జనాభా సగటు వయసు 28 ఏళ్లు. అదే అమెరికాలో 38, చైనాలో 39 ఏళ్లు. అంటే ఇండియాలో ప్రతి పది మందిలో నలుగురికిపైగా పాతిక సంవత్సరాలలోపు వయసువారే. ►మరోవైపు అధిక జనాభా ఉన్న చైనా, అమెరికా దేశాల్లో వయసుపై బడిన వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. 65 ఏళ్లు దాటిన వారు భారత జనాభాలో కేవలం 7.1 శాతం మాత్రమే. వీరి సంఖ్య భారత జనాభాలో 2063 నాటికి 20 శాతం, 2100 నాటికి 30 శాతానికి మాత్రమే పెరుగుతుంది. అంటే ఈ శతాబ్దం చివరి వరకు భారత్ యువ భారతంగానే ఉంటుందన్న మాట. ఇంకా భారతదేశంలో పాతికేళ్లలోపు వారి సంఖ్య 2078 నాటికి కానీ 65 ఏళ్ల పైబడిన వారి సంఖ్యను దాటే అవకాశం లేదన్నది యూఎన్ అంచనా. జననాల్లోనూ వేగమే.. చైనా, అమెరికాలతో పోలిస్తే భారత్‌లో జననాల రేటు కూడా అధికమే. ప్రస్తుతం సగటున భారత మహిళ తన జీవితకాలంలో 2.0 పిల్లలకు జన్మనిస్తోంది. అదే చైనాలో 1.2, అమెరికాలో 1.6గా ఉంది. అయితే గతంతో పోలిస్తే భారత దేశంలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 1992లో జననాల రేటు 3.4, 1950లో ఏకంగా 5.9 ఉండేది. భారత్‌లో అన్ని మతస్తుల్లోనూ జననాల రేటు తగ్గుతూనే ఉంది. ముస్లింలలో జననాల రేటు 1992లో 4.4గా ఉంటే.. 2019 కల్లా అది 2.4కి తగ్గింది. హిందువుల్లో 3.3 నుంచి 1.9కు, క్రిస్టియన్లలో 2.9 నుంచి 1.9కు, సిక్కుల్లో 2.4 నుంచి 1.6కు తగ్గింది. అయితే పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో శిశు జననాల రేటులో తేడాలు ఉన్నాయి. పట్టణాల్లో ప్రతి మహిళకు సగటున 1.6 శిశువులు జన్మిస్తే.. గ్రామాల్లో 2.1 మంది జన్మిస్తున్నారు. అదే 20 ఏళ్ల క్రితం సగటు పట్టణాల్లో 2.7, గ్రామాల్లో 3.7 మందిగా ఉండేది. ఇక జనాభా పెరుగుదల విషయంలోనూ ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉంది. 2001–2011 మధ్య మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌లలో జనాభా పెరుగుదల 25 శాతం ఉంటే.. గోవా, కేరళలో 10 శాతం మాత్రమే ఉందని భారత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు చెప్తున్నాయి. అదే నాగాలాండ్‌లో అయితే 0.6 శాతం జనాభా తగ్గింది. తగ్గుతున్న లింగభేదం 70వ దశకంలో లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచ్చిన తరువాత బాల బాలికల సంఖ్యలో వ్యత్యాసం పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 111 మంది బాలురకి 100 మంది మాత్రమే బాలికలు ఉన్నట్లు తేలింది. తర్వాత వ్యత్యాసం తగ్గుతూ వస్తోంది. కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015 నాటికి బాల బాలికల వ్యత్యాసం 109–100కి తగ్గింది. 2019 నాటికి 108 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలు ఉన్నట్టు వెల్లడైంది. లింగభేదంతో పాటు శిశు మరణాలు కూడా బాగా తగ్గుతూ వస్తున్నాయి. 1990లో ప్రతి వెయ్యిమంది శిశువులకు 89 మంది మరణించేవారు. అదే 2020 వచ్చే నాటికి 27 మందికి తగ్గింది. ఐరాస ఆధ్యర్యంలో పనిచేస్తున్న గ్రూప్ యూఎన్ఐజీ 1960 నుంచి ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల సమాచారాన్ని సేకరిస్తోంది. అయితే శిశుమరణాల విషయంలో భారత్ పొరుగు దేశాలతో పోలిస్తే వెనుకబడే ఉంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ప్రతి వెయ్యిమంది శిశువులకు 24 మంది, నేపాల్‌లో 24, భూటాన్‌లో 23, శ్రీలంకలో ఆరుగురు మరణిస్తున్నారు. చైనాలో 6, అమెరికాలో ఐదుగురు శిశువులు పుట్టుక సమయంలోనే అసువులుబాస్తున్నారు. వెళ్లేవారే ఎక్కువ.. వలసలు కూడా దేశ జనాభాను ప్రభావితం చేస్తాయి. జనాభాను పెంచుకోవడం కోసం అనేక దేశాలు వలసదారుల్ని, శరణార్థులను ఆహ్వానిస్తున్నాయి. జనాభాను సంపదగా భావిస్తున్నాయి. పనిచేయగల సత్తా ఉన్న వారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. అయితే భారతదేశానికి ఇతర దేశాల నుంచి వలస వస్తున్న వారి కంటే ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఒక్క 2021లోనే భారత్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు మూడు లక్షల మంది ఉన్నారు. అనేక సందర్భాల్లో భారత్‌కు వలస వచ్చిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిన దాఖలాలు ఉన్నాయి. 2016లో దాదాపు 68,000 మంది భారత్‌కు శరణుకోరి వచ్చారు. వీరిలో అధిక శాతం మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలే. ఏదేమైనా ఈ శతాబ్దం చివరి వరకు భారత్ నుంచి వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటుందని ఐక్యరాజ్యసమితి జనాభా వివరాల విభాగం అంచనా వేసింది. -
Caste Census: నిజంగా కులగణన అవసరమేనా?
భారతదేశంలో కులాల వారీగా జనాభాను లెక్కించాలని చాలా రోజుల నుంచి కొంత మంది కుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా ఈ కులగణనకు జెండా ఊపడంతో, కులగణన వలన జరిగే ప్రయోజనాలు, సమస్యలు అనే విషయంపై చర్చ మొదలైంది. కులగణన అనే తేనె తుట్టెను నితీష్ కుమార్ కదిలించడం వెనక రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని విమర్శకుల వాదన. కులాల వారీ జనాభా లెక్కల సేకరణ డిమాండ్ వెనక సామాజిక అభివృద్ధి కోణం ఉంటే సమర్థనీయమే. అభిలషణీయమే. ఇక స్వాతంత్య్రానంతరం కొంత మంది మాత్రమే ఈ దేశాన్ని పాలించడంలో, దేశ వనరులను అను భవించడంలో ముందంజలో ఉన్నారు. ఆ పనిలో తాము కూడా ముందు ఉండాలని దూరాలోచన కులగణన సమర్థకుల మనసుల్లో ఉంటే... ఈ విషయంలో వాదాలూ, ప్రతి వాదాలూ, సమస్యలు అనేకం ఉత్పన్నం కావచ్చు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశంలోని అనేక వర్గాలు వెనుకబడి ఉన్న మాట నిజమే. స్వాతంత్య్రానంతరం ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక దృష్టి కోణంతోనే పాలనను సాగించి, నిమ్న వర్గాల ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ప్రజల సమగ్ర అభివృద్ధికి బాటలు పరిచిందనేది కాదనలేని నిజం. అయితే ఇంకా ఆయా వర్గాలు వెనకబడే ఉన్నాయనీ, అభివృద్ధి ఫలాల్లో ఎవరి వాటా వారికి అందాలంటే కులగణనే మార్గమనీ కొందరంటున్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ భద్రతకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రజా సంక్షేమానికి ఇవ్వడం లేదనేది కొంతమంది విజ్ఞుల అభిప్రాయం. ఏ కులం వారు ఎంతమంది ఈ దేశంలో ఉన్నారు అనే విషయం తెలిస్తే, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయపరమైన పదవులు ఏయే కులాల వారికి ఎన్ని దక్కాలి అనే విషయంపై లెక్కలు తేలుతాయని కుల గణనను సమర్థించే నాయకులు చెప్పే మాటలు వాస్తవ విషయంలో నిజం కాకపోవచ్చు. దేశంలో ఇప్పటికే కొన్ని బీసీ కులాల వాళ్ళు తమ కులాలను ఎస్సీలో చేర్చండి అనీ, ఎస్టీల్లో చేర్చండి అనే డిమాండ్లను మొదలుపెట్టారు. కొన్ని ఆధిపత్య కులాలవారు తమను బీసీ వర్గాల్లో చేర్చండి అనే డిమాండు లేవదీస్తున్నారు. ఈ కులగణన చేపడితే ఇటువంటి అనేక డిమాండ్లూ, సమస్యలూ చుట్టు ముట్టవచ్చు. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం 1871లో కులాల వారీగా భారతదేశాన్ని విభజించి చూసే ప్రణాళిక అల్లింది. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. భారతీయుల్లో జాతీయాభిమానం పెరిగి, భారతదేశంలో తమ పెత్తనం చేజారిపోతుందని ఊహించిన బ్రిటిష్ పాలకులు భారతీయ సమాజాన్ని కులాల వారీగా, మతాల వారీగా విభజించడానికే ఈ కులాల వారీ గణనను ప్రారంభించారనేది వాస్తవం. ఈ దేశ సమగ్రత, సమైక్యత, శక్తి మంతమైన భారత్ నిర్మాణం ఇత్యాది విషయాల్లో దేశంలోని మిగతా పార్టీల కంటే భారతీయ జనతా పార్టీది భిన్నమైన దృక్పథం. కులాల వారీగా భారతీయ సమాజాన్ని విభజిస్తే– భారతీయ సంస్కృతికి తాను వారసుణ్ణి అనే భావన లుప్తమై, ప్రజల్లో అసంఘటిత భావాలు ప్రబలి, జాతి వ్యతిరేక శక్తులు బలపడతాయని ఆ పార్టీ భావించే... ఇంతవరకు కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చింది. నిజంగా కులగణన అవసరమేనా? ఓట్లను అమ్ముకోకుండా ప్రజలు నీతి, నిజాయతీ, దేశ అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన నాయకులను ఎన్నుకుంటే సరిపోదా? కులాల లెక్కల వల్ల దేశంలో సౌభ్రాతృత్వ వాతావరణం నెలకొంటుందా? కుల గణనను సమర్థించే వారందరూ ఈ విషయాలను గమనంలో ఉంచుకుంటే కొంత ప్రయోజనం ఉంటుంది. (క్లిక్ చేయండి: స్తబ్ధత నుంచి చైతన్యంలోకి...) - ఉల్లి బాలరంగయ్య రాజకీయ సామాజిక విశ్లేషకులు -
బిహార్‌లో ‘కులగణన’.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
పాట్నా: బిహార్‌లో కులాలవారీగా జనాభా గణన శనివారం ప్రారంభమైంది. ఈ లెక్కింపుని చరిత్రాత్మకమైనదిగా ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అభివర్ణించారు. సమాజంలోని బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఈ ప్రక్రియతో శాస్త్రీయమైన డేటా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కులాల వారీగా జనగణన ప్రారంభమైన సందర్భంగా తేజస్వి యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ మహాఘటబంధన్‌లో అన్ని పార్టీలు కులజనగణనకు అనుకూలంగా ఉన్నాయని కేవలం బీజేపీ మాత్రమే విమర్శిస్తోందన్నారు. ‘‘రాష్ట్రంలో ఒక చరిత్రాత్మక ప్రక్రియ మొదలైంది. మహాఘట్బంధన్ ప్రభుత్వం ఈ భారీ కసరత్తుకి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన శాస్త్రీయమైన సమాచారం అందుబాటులోకి వచ్చి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతాయి’’ అని చెప్పారు. బీజేపీ నిరుపేదల వ్యతిరేక పార్టీ కాబట్టి ఈ తరహా ప్రక్రియలకు మద్దతునివ్వదని విమర్శించారు. ఇదీ చదవండి: 4 ‘ఐ’లపైనే దృష్టి: మోదీ -
BC Census: బీసీ జన గణనతోనే న్యాయం
జనాభా కులాలుగా విడగొట్ట బడిన దేశం మనది. ఆధిపత్య కులాలు దేశంలోని భూమి, ఇతర వనరులు; విద్య, ఉద్యోగ అవకాశాలను అధికంగా అను భవిస్తున్నాయి. సంపద వారి చేతుల్లో ఉన్నందు వల్ల చదువు కోగలరు కాబట్టి... ఉద్యోగావకాశాలూ సహజంగా వారికే అధికంగా లభిస్తాయి. అయితే దేశంలో సంఖ్యాపరంగా వీరి సంఖ్య తక్కువ. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా అధికంగా ఉంది. రాజ్యాంగం అందరికీ సమాన అవ కాశాలు వాగ్దానం చేసింది. అవకాశాల్లో సమాన భాగం కాకపోయినా... కనీస భాగం పొందాలంటే రిజర్వేషన్లు ఒక్కటే మార్గమని రాజ్యాంగ సభ భావించి రాజ్యాం గంలో అందుకు తగిన ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కాలంలో కొత్త కులాలనూ, వర్గాలనూ రిజర్వేషన్ వర్గాల్లో కలపడంతో రిజర్వేషన్ వర్గాల వారికి అవకాశాలు పలుచబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కులాల జన గణన జరిగితే ఎవరి దామాషా ప్రకారం వారు అవకాశాలను పొందవచ్చుగదా అనే ఆలోచన బయలుదేరింది. ముఖ్యంగా వందలు, వేలా దిగా ఉన్న బీసీ కులాలు ఈ డిమాండ్‌ను బలంగా విని పిస్తున్నాయి. ఇలా కుల గణన జరిగితే ఒనగూరే ఇతర ప్రయోజనాలనూ వారు పేర్కొంటున్నారు. వెనుక బడిన మెజార్టీ ప్రజల సంక్షేమానికి తగిన పథకాల రూపకల్పనకు ఈ డేటా చాలా అవసరం. విద్య, ఉద్యోగ రంగాల్లో ఎవరి వాటా వారు పొందడానికి వీలు కలుగుతుంది. ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని ఎన్నో వందల కులాలను వెలుగులోకి తీసుకురావచ్చు. ఫలితంగా అత్యధిక పేదలు ఉన్న బీసీల్లో తమ వాటా తమకు లభిస్తుందన్న సాంత్వన లభిస్తుంది. ఎవరి వాటా వారికి లభిస్తే సామాజిక అశాంతి తగ్గి శాంతి భద్రతలు మెరుగవుతాయి. ప్రభుత్వం తన దృష్టిని అభివృద్ధి కార్యక్రమాలపై నిలపడానికి అవకాశం ఏర్పడుతుంది. కులగణనపై సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం... కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనపరంగా కష్టమని తెలిపింది. దీంతో బీసీలు బాగా అసంతృప్తికి లోనయ్యారు. 1931 కులగణన తర్వాత బీసీ జనగణన జరగలేదు. అయితే 1979లో జనతా ప్రభుత్వం బీపీ మండల్ సారథ్యంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులవారిని గుర్తించి వారి అభివృద్ధికి సిఫార్సులు చేయమని ఒక కమిటీని నియమించింది. ఈ మండల్ కమిషన్ 1980లో సమర్పించిన నివే దికలో భారత్ మొత్తం జనాభాలో 52 శాతం వెనుక బడిన తరగతులవారేననీ, వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ సిఫార్సు చేసింది. బీసీల సమగ్ర అభివృద్ధి కోసం అనేక సిఫార్సులు చేసినా అవన్నీ అటకెక్కాయి. 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అత్యంత దారుణ వ్యతిరేక పరిస్థితుల్లో అమలులోకి వచ్చాయి. నిజానికి ఇప్పుడు బీసీల జనాభా మరింతగా పెరిగి ఉండాలి. వారూ వీరూ చెప్పే లెక్కలన్నీ కాకి లెక్కలే. ఒక్కసారి కుల గణన జరిపితే అభివృద్ధి ఫలాల్లో ఎవరి వాటా వారు అడగడానికి వీలు ఉంటుంది. సామాజిక న్యాయం సాకారమవుతుంది. (చదవండి: కులాంతర వివాహాలు శాస్త్రబద్ధమే) - డాక్టర్ పరికిపండ్ల అశోక్ సామాజిక కార్యకర్త -
సామాజిక న్యాయానికి బీసీ జనగణన
భారత సమాజం కులాల దొంతర అన్న సంగతి తెలిసిందే. ఈ దొంతరలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ఆదిమ తెగలవారూ, అసలు మనుషులుగా గౌరవం పొందని హిందూ సామాజిక బహిష్కృత ఎస్సీలూ అట్టడుగున ఉంటే... అటు ఓసీలలా గౌరవానికి నోచుకోనివారూ, ఇటు ఎస్సీల్లా మరీ తక్కువ చూపుకు గురికాని బీసీలు మధ్యస్తరంలో ఉన్నారు. దేశ జనాభాలో వీళ్లశాతం సగం కన్నా ఎక్కువే. వీరంతా సంప్రదాయ వృత్తులను అనుసరిస్తూ దేశ సంపద సృష్టిలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో అణగారిన, వెనుక బడిన వర్గాలకు ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించినా... జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అందడం లేదనేది ఒక ప్రగాఢమైన విశ్వాసం రిజర్వేషన్ పొందుతున్న వర్గాల్లో ఉంది. మరీ ముఖ్యంగా బీసీల్లో ఈ అభిప్రాయం ఉంది. తాము దేశ జనాభాలో ఎంతమందిమి ఉన్నామో తెలిస్తే... ఆ నిష్పత్తిలో రిజర్వేషన్లు పొందవచ్చని వారు భావిస్తున్నారు. అందుకే బీసీ జన గణన జరగాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినా అది పట్టించుకోవడం లేదు. దీంతో అనేక రాష్ట్రాల్లో బీసీ జనాభాను లెక్కించాలనీ, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనీ కోరుతూ ఉద్యమాలు రగులుకుంటున్నాయి. బీసీ జనగణన చేయమని అడిగితే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వంపై దీర్ఘకాలిక ఉద్యమం చేయక తప్పని స్థితి వచ్చింది. ఈ ఉద్యమం దేశ చరిత్రలోనే మరో శాంతియుత బీసీల హక్కుల సాధన జాతీయ ఉద్యమంగా కొనసాగాలి. అది ఏ విధంగా అంటే 14 ఏళ్లు శాంతియుతంగా కొనసాగిన మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ నమూనాలో కొనసాగాలి. వ్యవసాయరంగాన్ని రక్షించుకోవడానికి ఇటీ వల జరిగిన శాంతియుత రైతాంగ ఉద్యమ రూపం ధరించాలి. రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం భావించి ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానం పంపి ఇప్పటికి సరిగ్గా ఆరేళ్లు అవుతోంది. కేంద్రం ఇప్పటికీ పెదవి విప్పటం లేదు. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం బీసీ జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకుని కేంద్రానికి పంపింది. హేమంత్ సొరేన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 60 శాతం నుంచి 77 శాతానికి రిజర్వేషన్లు పెంచాలనే చట్టసవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. రిజర్వేషన్ల పెంపుకోసం రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో మార్పులు చేయాలని కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో తెలంగా ణకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఇలా రిజర్వేషన్ల శాతం పెరిగినప్పుడే జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కుతుంది. రాజ్యాంగంలోని 340 ఆర్టికల్‌ను అనుసరించి భారత దేశంలో ప్రప్రథమంగా 1953 జనవరిలో కాకా కాలేల్కర్ నేతృత్వంలో వెనుకబడిన తరగతుల కమిషన్‌ను నియ మించడం జరిగింది. ఇది 1955లో తన నివేదికను సమ ర్పిస్తూ దేశంలో 2399 కులాలను వెనుకబడిన కులాలుగా అందులో 837 కులాలను అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించి కొన్ని సిఫార్సులు చేసింది. అయితే ప్రభుత్వం ఈ కమిషన్ చేసిన సిఫార్సులను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం 1979లో బి.పి. మండల్ నేతృత్వంలో రెండవ బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేయడం జరిగింది. ఈ కమిషన్ బీసీల జనాభాను 52 శాతంగా లెక్కకట్టి వీరికి విద్యా ఉద్యోగ రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలని 1980లో నివేదిక సమర్పించింది. అయితే, ఈ సిఫారసులు 1992 నుండి మాత్రమే అమలులోకి వచ్చాయి. 2017 అక్టోబర్‌లో జస్టిస్ రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాను వర్గీకరించడం ఈ కమిషన్ ముఖ్య విధి. ఇప్పటికి ఈ కమిషన్ గడువును 13 సార్లు పొడిగించడం జరిగింది. ఇంతవరకు ఈ కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత బి.ఎస్. రాములు నేతృత్వంలో నియమించబడ్డ తొలి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఏప్రిల్ 2017లో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తూ, బీసీ–ఇ గ్రూప్‌లో ఉన్న ముస్లింలలోని కొన్ని వెనుకబడిన వర్గాలకు అందించబడుతున్న రిజర్వే షన్లను 4 శాతం నుండి 10 శాతానికి పెంచాలని సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసులను ప్రభుత్వం అంగీక రిస్తూనే, సుధీర్ కమిషన్, ఇతర నివేదికలను అనుసరించి వీరికి రిజర్వేషన్లను పన్నెండు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2019లో ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ మరో నివేదిక సమర్పిస్తూ... సంచార, అర్ధ సంచార జాతులకు చెందిన 17 కులాలను తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసులను కేసీఆర్ క్యాబినెట్ యధాతథంగా ఆమోదించి అమలుచేయడం జరిగింది. 2011లో జరిగిన సామాజిక ఆర్థిక కులగణన వివరాలు ఉన్నాయని చెప్పిన కేంద్రం ఆ వివరాలు ఎందుకో బైట పెట్టకుండా దాటవేసింది. దేశంలో సగానికి పైగా జనాభా వున్న బీసీల విషయంలో కేంద్రం లెక్కలేనితనం చూపడం దారుణమైనది. దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? వీళ్ల ఆర్థిక స్థితి గతులేమిటి? వీరి చదువులు ఎలా వున్నాయి? వీరి ఉద్యోగ అవకాశాలేమిటి? వీరింకా దారిద్య్ర రేఖకు దిగువన ఉండటానికి కారణాలు ఏమిటి? బీసీలలో ఇంకా సంచారజాతులుగా వున్న వారి దీనస్థితికి విముక్తి ఎప్పుడు? ఈ సమాచారం లేకుండా దేశాభివృద్ధికి వ్యూహాలు రచించడం కష్టం. అందుకే బీసీ జన గణన అత్యంతావశ్యం. జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ -
జనగణనలో కులగణన చేపట్టాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే జనగణనలో కులగణన చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ కులాల జనాభా లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కృష్ణయ్య నేతృత్వంలో ఢిల్లీలో కిషన్‌రెడ్డిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, బీసీ నేతలు మెట్ట చంద్రశేఖర్, మోక్షిత్ తదితరులు కలిసి చర్చలు జరిపారు. బీసీలకు సంబంధించిన 15 ప్రధాన సమస్యలను వివరించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. కులగణన, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం సహా పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. బీసీ ఉద్యోగులకు ప్రమోన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసినట్టు కృష్ణయ్య తెలిపారు. -
జనగణన ఆచూకీ ఏదీ?
ఈసారి కుల ప్రాతిపదికన జనగణన జరపాలని వివిధ రాజకీయ పార్టీలతోపాటు బీసీ కులాలు సైతం గట్టిగా డిమాండ్ చేస్తున్న తరుణంలో మొత్తంగా జనగణన ప్రక్రియకే గండికొడుతున్నారన్న కథనాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వాస్తవానికి జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ పద్ధతి ప్రకారం 2019 మార్చిలో విడుదలైంది. 2020 ఏప్రిల్– సెప్టెంబర్ల మధ్య తొలి దశలో ఇళ్లు, కట్టడాలు, కుటుంబాలకు సంబంధించిన లెక్కల సమీకరణ... నిరుడు ఫిబ్రవరి 9నుంచి రెండో దశ లో జనాభా లెక్కింపు, భాష, మత, విద్య, ఆర్థిక అంశాలతోపాటు వలసలు, సంతాన సాఫల్యత, విడాకులు, సహజీవనాలు వగైరా వివరాల సేకరణ ప్రారంభం కావాలని అందులో నిర్దే శించారు. కానీ ఈలోగా కరోనా విరుచుకుపడటంతో ఇదంతా వాయిదా పడింది. 2020 నవంబర్ మొదలుకొని క్రమేపీ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డం మొదలైంది. ఎన్నికలు, మతపరమైన ఉత్స వాలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలన్నీ నిరుడు యధావిధిగానే జరిగాయి. కానీ జనగణనను మాత్రం ఆపేశారు. 2021–22 మధ్య జనగణన తొలి దశ ఉంటుందనీ, 2023–24 మధ్య రెండో దశ ఉంటుందనీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైతం చెప్పింది. ఫోన్ ద్వారా వివరాలు సేకరించే ఆలోచన చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకూ మళ్లీ దానిపై ఉలుకూ పలుకూ లేదు. ప్రభుత్వాలు వేసే ప్రతి అడుగుకూ జనగణనలో వెలువడే డేటా ఎంత ప్రాణప్రదమో చెప్పన వసరం లేదు. పేదరిక నిర్మూలన పథకాల అమలుకూ, మౌలిక వసతుల పరికల్పనకూ, విద్య, ఆరోగ్య రంగాల పటిష్టతకూ, ఆహారభద్రతకూ ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోవాలన్నా జనగణన కీలకం. అందులో వెలువడే డేటా లేకుండా అవి పకడ్బందీ వ్యూహాలను రూపొందించడం, వాటిని పట్టాలెక్కించడం అసాధ్యం. జనాభా లెక్కల స్థూల వివరాలు వెనువెంటనే వెల్లడైనా వివిధ రంగాలకు సంబంధించిన సమస్త గణాంకాలూ అనంతరకాలంలో అంచెలంచెలుగా బయటి కొస్తుంటాయి. సాధారణ ప్రజానీకం జీవనం ఎలావుందో తెలియలన్నా... వారి మౌలిక అవసరాలు తీర్చడానికి అమలవుతున్న చర్యల ఫలితాలు అవగాహన కావాలన్నా... మత, భాషా ప్రాతిపదికన మైనారిటీలుగా ఉన్నవారి స్థితిగతులు అర్థం కావాలన్నా... లోటుపాట్ల సవరణకు ఏం చేయాలో ప్రభుత్వాలు సమీక్షించాలన్నా జనగణనే దిక్కు. విధాన రూపకల్పనకూ, బడ్జెట్ కేటాయింపులకూ, పాలనా వ్యవస్థ పటిష్టతకూ జనగణనలో వెల్లడయ్యే డేటా ఉపయోగపడుతుంది. నియోజకవర్గాల పునర్విభజన, ఎస్సీ, ఎస్టీ స్థానాల ఖరారు తదితర అంశాలు సరేసరి. మన దేశంలో 1881లో ప్రారంభించాక ఎప్పుడూ జనగణన ఆగలేదు. ఎన్ని అవాంత రాలొచ్చినా పదేళ్లకోసారి అది క్రమం తప్పకుండా సాగుతూనే ఉంది. అలాగని దానిపై వివాదాలు లేకపోలేదు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే ఎన్యూమరేటర్లు నిర్దుష్టమైన సమాచారాన్ని సేకరించడంలో విఫలమవుతున్నారని నిపుణుల వాదన. ఎన్యూమరేటర్లకు తగిన శిక్షణ లేకుండా, డేటా సేకరణ వెనకుండే పరమార్థాన్ని వివరించకుండా రంగంలోకి దించడం వల్ల వారు ఇష్టాను సారం కాగితాలు నింపడం మినహా మరేమీ చేయటంలేదని 2011 జనాభా లెక్కల సేకరణ సమయంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతక్రితం దశాబ్దాల్లోనూ ఇదే వరస. కొన్ని చోట్లయితే ఎన్యూమరేటర్ల జాడలేదంటూ జనమే ఫిర్యాదులు చేశారు. వీటన్నిటినీ సరిచేసి పకడ్బందీ జనగణనకు చర్యలు తీసుకోవాల్సిందిపోయి, మొత్తంగా ఆ ప్రక్రియనే అనిశ్చితిలో పడేయటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రజలకు సంబంధించిన డేటా లేనప్పుడు ఏమవుతుందో చెప్పడానికి ఇటీవల ఆర్థికవేత్తలు జీన్ డ్రీజ్, రీతికా ఖేరాలు లేవనెత్తిన అంశాలే రుజువు. 2011 లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. దాని ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా 80 కోట్లమంది నిరుపేదలకు ప్రభుత్వాలు సబ్సిడీ బియ్యం, ఇతర సరుకులు అందిస్తున్నాయి. దేశ జనాభా దాదాపు 137 కోట్లకు చేరివుండొచ్చని 2020లో అంచనావేశారు. ఆ లెక్కన మొత్తంగా 92 కోట్ల మందికి పీడీఎస్ అమలు కావాలి. కానీ ఇప్పటికీ 2011 జనాభా లెక్కలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడంవల్ల 12 కోట్లమందికి పీడీఎస్ సరుకులు అందుబాటులోకి రావడంలేదని వారిద్దరూ తేల్చారు. కరోనా కారణంగా ప్రబలిన నిరుద్యోగిత ఈ సంఖ్యను మరింత పెంచివుండొచ్చు. దానికి తగినట్టు తమ రాష్ట్రాలకు అదనపు కోటా కావాలని రాష్ట్రాలు అడగాలన్నా, కేంద్రం ఇవ్వాలన్నా జనగణన డేటా ఉంటే తప్ప అసాధ్యం. ఆమధ్య కేంద్ర ఆహార శాఖ కార్యదర్శే ఈ మాటన్నారు. మనకు ఆధార్ డేటా ఎటూ ఉంది కదా అని కొందరు వాదిస్తున్నారు. అలాగే అంగన్వాడీ వంటిచోట్ల గర్భిణుల, శిశువుల వివరాలు నమోదు చేస్తారు. కానీ ఆ గణాంకాలు సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరించే అవకాశం ఎంతమాత్రమూ లేదు. కరోనా విరుచుకుపడటం, అది ఒమిక్రాన్ రూపంలో శరవేగంగా విస్తరిస్తుండటం వాస్తవమే. కానీ మన పొరుగునున్న చైనా 2020 న వంబర్–డిసెంబర్ మధ్య జనగణన పూర్తి చేసుకుంది. స్థూల వివరాలను నిరుడు మే నెలలో ప్రకటించింది. అమెరికా సైతం ఆన్లైన్, ఫోన్–ఇన్ మార్గాల్లో 2020లో ఈ క్రతువు పూర్తిచేసింది. నిరుడు ఆగస్టులో అది డేటా కూడా విడుదల చేసింది. కానీ మనం మాత్రం ఇతరత్రా కార్యకలాపాలన్నీ యధావిధిగా సాగించుకుంటూ జనగణనను మాత్రం నిర్లక్ష్యం చేశాం. ఈ విషయంలో కేంద్రం వివరణనివ్వడం, సాధ్యమైనంత త్వరగా దాన్ని ప్రారంభించటం అత్యవసరం. -
యోగి నా ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఫోన్లపై నిఘా పెట్టారని, ట్యాపింగ్ చేయిస్తున్నారని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసిన సంభాషణలను ప్రతిరోజు సాయంత్రం యోగి వింటున్నారని అన్నారు. యోగిని నిరుపయోగిగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యూపీ సీఎంపై ప్రశంసలు కురిపిస్తూ ఆంగ్లంలో యూపీ, యోగి కలిస్తే ‘ఉపయోగి’ అవుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆదివారం అఖిలేఖ్ విలేకరులతో మాట్లాడారు. ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోంది కాబట్టి తనతో మాట్లాడేటపుడు జాగురుకతతో ఉండాలని విలేకరులకుసూ చించారు. యోగి సర్కారు రాష్ట్రంలో ‘వాట్సాప్ యూనివర్సిటీ’ నడుపుతోందని విమర్శించారు. ఓటమి భయంతోనే 12 మంది బీజేపీ పాలితరాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవల వారణాసి, ఆయోధ్యల్లో పర్యటించారన్నారు. లఖింపూర్ ఖేరి హింసాకాండలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వెనకేసుకొస్తున్నాయన్నారు. అధికారంలోకి వస్తే యూపీలో కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
ఓబీసీ కులగణనకు 'నో' చెప్పిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో వెనుకబడిన కులాల జనాభా గణనకు జనాభా లెక్కల సేకరణ (సెన్సెస్) సరైన సాధనం కాదని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన జనాభాను మినహా కులాలవారీగా జనాభా లెక్కలను సేకరించలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన మీదట జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం షెడ్యూలును రూపొందిస్తుందని మంత్రి తెలిపారు. బీసీ జనాభా లెక్క తేల్చేందుకు వీలుగా సెన్సెస్‌లో కులగణన జరిపించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన విషయం హోం మంత్రిత్వ శాఖకు తెలుసునని చెప్పారు. దేశంలో జనాభా సంఖ్యను లేదా ఏదైనా సామాజిక వర్గానికి సంబంధించిన జనాభాను లెక్కించడం నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ఉద్దేశం కాదని మంత్రి అన్నారు. వర్గీకరణ అవసరాల కోసమే ఎన్ఎస్ఎస్ ఇంటింటి సర్వే చేపడుతుందని వెల్లడించారు. చదవండి: (ఏపీలో 3 కొత్త మెడికల్ కాలేజీలకు ఆమోదం) నరేగా బకాయిలు 1,341 కోట్లు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద మెటీరియల్, అడ్మినిస్ట్రేటివ్ కాంపోనెంట్ల కింద కేంద్రం చెల్లించాల్సిన బకాయిలు 1,341 కోట్లు ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్న, అనుబంధ ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. మెటీరీయల్, అడ్మినిస్ట్రేటివ్ కాంపోనెంట్ల కింద చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన పంపినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా మార్గదర్శకాలను అనుసరిస్తూ సవివరమైన ప్రతిపాదన పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. నరేగా కింద లేబర్ కాంపోనెంట్ కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. చదవండి: ('విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం') విశాఖ జిల్లాలో 79 కోట్లతో వాటర్‌షెడ్ పనులు ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద 2013-14లో విశాఖపట్నం జిల్లాలో 79 కోట్లతో 53 వేల హెక్టార్లలో 15 వాటర్‌షెడ్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లు చేపట్టడానికి భూ వనరుల శాఖ ఆమోదం తెలిపిందని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ 2015-16లో ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగమైందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందిన సమాచారం మేరకు విశాఖ జిల్లాలో చేపట్టిన 15 ప్రాజెక్ట్‌లు అమలు దశలో ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వీటని పూర్తి చేయలేకపోయింది. అందువలన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు గుడువును 2022 మార్చి వరకు పొడిగించినట్లు మంత్రి తెలిపారు. -
ఢిల్లీ జంతర్‌మంతర్: బీసీ సంఘాల ఆందోళన.. వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, ఢిల్లీ: కులాలవారీగా జనగణన చేపట్టాలంటూ ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ధర్నాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బీసీ సంక్షేమ సంఘాలు పాల్గొన్నాయి. కాగా ఈ ధర్నాకు వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ధర్నాలో ఎంపీలు మార్గాని భరత్, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య హాజరయ్యారు. చదవండి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ కాగా అనేక చిన్నచిన్న కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయంగా గుర్తింపు తెచ్చారన్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. బీసీలు బలహీన వర్గాలకు చెందిన వారే కానీ బలహీనులు కాదని.. బీసీలకు కేటాయించే బడ్జెట్ సరిపోవట్లేదని ఎంపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. సామాజిక వెనుకబాటు ఉన్నవారికి రిజర్వేషన్లు అందాలన్నారు. జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నామని బోస్ పేర్కొన్నారు. -
బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్: సీఎం జగన్
సాక్షి,అమరావతి: 1931లో కులపరమైన జనాభా గణన జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. 90 ఏళ్లుగా కులపరమైన జనాభా లెక్కలు లేవని అన్నారు. ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ కులాల వారీగా బీసీ జనగణన అంశంపై మంగళవారం ప్రసంగించారు. దేశంలో బీసీల జనాభా 52 శాతమని పేర్కొన్నారు. వెనకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని సీఎం స్పష్టం చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కులగణన జరగలేదని తెలిపారు. కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు. కులగణన డిమాండ్‌కు తాము మద్దతు తెలుపుతున్నామని సీఎం జగన్ చెప్పారు. చదవండి: AP Assembly Session 2021: శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరణ బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం జగన్ తెలిపారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తెస్తున్నామని, ఈ రెండున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. బీసీ కులగణన జరిగితే మరింత వెసులుబాటు కలుగుతుందని అన్నారు. కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నాటి నుంచి బీసీల జనాభా అందాజుగా లెక్కిస్తున్నారు తప్ప కచ్చితమైన లెక్కలేదని తెలిపారు. దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా బీసీలను ఎదగనివ్వడం లేదని అన్నారు. బీసీల ఎంతమంది ఉన్నారని తెలిస్తేనే వారికి న్యాయం చేయగలుగుతామని అన్నారు. బీసీల లేక్కలు తేలితే ప్రభుత్వానికి స్పష్టత వస్తుందని సీఎం తెలిపారు. జనగణన లేకపోవడంతో బీసీలు వెనకబడిపోయారని సీఎం అన్నారు. అందుకోసమే జనగణన చేయాలని సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. బీసీలను సామాజికంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని సీఎం చెప్పారు. టీడీపీ హయాంలో ఓట్ల వారీగా కులాలను విభజించారని అన్నారు. తమ పాలనలో ఎక్కడ కూడా లంచాలు లేవని, అవినీతి లేదని తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా గొప్ప వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం అన్నారు. అడుగడుగునా సామాజిక న్యాయం కనపడేలా చేశామని తెలిపారు. టీడీపీ పాలనలో రాజ్యసభకు ఒక్క బీసీని కూడా పంపిచలేదని సీఎం జగన్ అన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 67 శాతం ఇచ్చామని చెప్పారు. జడ్పీ ఛైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 69 శాతం ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. 13 మేయర్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 92 శాతం ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 నామినేటెడ్ ఛైర్మన్ల పదవుల్లో బీసీలకు 53 ఇచ్చామని సీఎం తెలిపారు. -
బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్.. అసెంబ్లీలో మంత్రి వేణుగోపాలకృష్ణ
సాక్షి, అమరావతి: బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అని.. 1931లో జనగణన ఆధారంగానే బీసీలను ఇప్పటికీ లెక్కిస్తున్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని అసెంబ్లీలో మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, వెనుకబడిన కులాల జనగణన అత్యవసరం అని.. నిజమైన నిరుపేదలకు ఎంతగానో ఉపయోగమన్నారు. సంక్షేమ పథకాల అమలకు ఇది ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ప్రత్యేక వాదం వచ్చింది అందుకే.. మండలిలో మంత్రి బుగ్గన ‘‘90 ఏళ్లుగా బీసీల లెక్కలు దేశంలో లేవు. బీసీల జీవన స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బీసీల్లో 139 కులాలు ఉన్నాయి. కుల గణన కచ్చితంగా జరగాలి. ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ వరంగా మారింది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో బీసీలకు అనేక మేళ్లు. బీసీలను చైతన్యం దిశగా సీఎం జగన్ నడిస్తున్నారు. ఇది బీసీల ప్రభుత్వం. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం. కాంట్రాక్టు పనుల్లో బీసీలకు 50 శాతం. బీసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. వైఎస్సార్ చేయూత గొప్ప పథకం. బీసీల కోసం వైఎస్సార్ రెండడుగులు ముందుకు వేస్తే.. వైఎస్ జగన్ పదడుగులు వేస్తున్నారని’’ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. -
బీసీ జనాభా లెక్కలు తేల్చాల్సిందే!
గణాంకాలు లేకుండా ఓబీసీల అభివృద్ధి ప్రణాళికలు ఎలా సాధ్యం? స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో ఓబీసీల కుల గణాంకాల అవసరం గురించి చర్చ జరుగుతూనే ఉంది. వివిధ సామాజిక వర్గాలు ఏ రంగాల్లో, ఎంత స్థాయిలో వెనుకబడి ఉన్నారు? వారి ప్రధానమైన సమస్యలేమిటి? గత కాలంలో వారి జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా? ప్రభుత్వం ఏ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి? అన్న ప్రశ్నలకు సమాధానం గణాంకాల ద్వారా వెతకడానికి సాధ్యమవుతుంది. 50 శాతం పైగా ఉన్న జనాభా విషయంలో మొదటి నుండి ఆధిపత్య కులాల ఆధ్వర్యంలో నడిచే అన్ని ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కావాలని నిర్లక్ష్యం చేయడం దారుణం. మన దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 1872 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి చేపట్టిన కుల గణాంకాలలో కుల అంశం కూడా చేర్చారు. అది 1931 వరకు కొనసాగింది. 1941లో గణాంకాలు సేకరించినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధంవల్ల ఆ ప్రక్రియలను మధ్యలోనే నిలిపివేశారు. 1951 నుంచి భారత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గణాంకాలు తప్ప ఓబీసీలు కుల గణాంకాలు చేపట్టడం కావాలనే మానివేసింది. మొదటి ఓబీసీ కమిషన్ 1953 (కాకా కలేల్కర్), రెండవ కమిషన్ (మండల్) 1979, తప్పనిసరిగా కుల గణాంకాలు చేపట్టాలని సిఫారసు చేశాయి. మండల్ కమిషన్ ఓబీసీల రిజర్వేషన్లను నిర్ధారించటానికి 1931 కుల గణాంకాలను ప్రాతిపదికగా తీసుకొన్నది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసిన అన్ని బీసీ కమిషన్లు కులగణాంకాలు చేపట్టాలని పదేపదే చెబుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు కూడా శాస్త్రీయమైన గణాంకాలు లేకుండా ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం ఎలా ఇయ్యాలి అన్న విషయంలో నిర్ణయం తీసుకోవడం అహేతుకమని చేప్తూనే ఉన్నాయి. 2010 సంవత్సరం పార్లమెంట్లో దాదాపు అన్ని పార్టీలు ఈ విషయంలో పట్టుపట్టగా యూపీఏ ప్రభుత్వం మొదటగా అంగీ కరించి, ఆ తర్వాత మాటమార్చి 2011లో సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ) చేపట్టటానికి ప్రభుత్వశాఖల ద్వారా దేశవ్యాప్త గణాంకాలను చేపట్టింది. అయితే అందులో తప్పులు దొర్లాయని గణాంకాల వివరాలు బయటపెట్టలేదు. ఆ తర్వాత 2014లో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గణాంకాల వివరాలను బయట పెడతామని వాగ్దానం చేసి, జరిగిన తప్పులు సవరించలేని స్థాయిలో ఉన్నాయని, వాటిని అక్కడితో ఆపేసింది. కేవలం 20 శాతం కూడా లేని కులాలు 80 శాతం పైగా దేశ వనరులను, ప్రభుత్వ వ్యవస్థలను, పరిశ్రమలను, వ్యాపారాన్ని, ఉద్యోగాలను, ఇంకా అధికారాన్ని తమ గుప్పిట్లో ఉంచుకున్నట్లు, 50 శాతం పైగా ఉన్న వేలాది కులాలు కింది స్థాయిలో కనీస అభివృద్ధికి నోచుకోకుండా అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైనట్లు బయటపడింది. అందువల్ల ఆ సమాచారాన్ని తొక్కిపెట్టించి ఉంచడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2021 సెన్సెస్‌లో కుల అంశాన్ని చేర్చాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గణాంకాల అవసరం గురించి దాదాపు అన్ని పార్టీలవారు ప్రస్తావించి, సమాచారం లేకుండా కొత్త కులాలను చేర్చడానికి, అభివృద్ధి చెందిన కులాలను జాబితాల నుండి తొలగించటానికి ఎలా సాధ్యమని ప్రశ్నించాయి. సమాచారం లేకుండానే కులాలను వర్గీకరిస్తే భవిష్యత్తు పరిణామాలు అసంబద్ధంగా ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి 2021 సెన్సెస్‌లో భాగంగా కుల గణాంకాలను చేపట్టాల్సిందే. వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి సుదమల్ల వెంకటస్వామి తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మొబైల్ : 93470 15154 -
బీసీ జనగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతు ల్లో కులాల వారీగా జనగణన ప్రక్రియ చేపట్టే లా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. దీని పై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి, కేంద్రానికి సమర్పించాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు గురువారం శ్రీనివాస్‌గౌడ్ లేఖ రాశారు. బీసీలకు విద్య, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల అమలులో బీసీ జనగణన కీలకమని పేర్కొన్నారు. -
కుల జనగణనపై ఇంత వ్యతిరేకతా?
మెజారిటీ శూద్రులు కులాలవారీ జనగణనను కోరుకుంటుండగా, ద్విజులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, ఐఐటీ, ఐఐఎమ్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి అత్యున్నత సంస్థలతోపాటు కేంద్రప్రభుత్వ పాలనావ్యవస్థ దాదాపుగా ద్విజుల అదుపులో ఉంటోంది. ఒకసారి కులాలవారీగా అధికారిక డేటా విడుదల చేశాక, దేశంలోని కీలకమైన పాలనా వ్యవస్థల్లో ఏ ఒక్కదానిలో కూడా తమకు ప్రాతినిధ్యం లేదని జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, ఉత్తర, దక్షిణ భారతదేశంలోని ఇతర కమ్యూనిటీలు కూడా గుర్తించే ప్రమాదముంది. జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో తమ ప్రాతినిధ్యం కోసం శూద్రకులాలు డిమాండ్ చేసే ప్రమాదం ఉంది కాబట్టే కులాలవారీగా జనగణనను అగ్రవర్ణాలు వ్యతిరేకిస్తున్నాయి. కులాలవారీ జనాభా గణన కోసం డిమాండ్ పుంజుకుంటోంది. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలూ దీనికి అంగీకరించాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే అంతర్గత వినియోగం కోసం కులాల వారీ డేటాను సేకరించి ఉన్నాయి. ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కులపరమైన డేటాను సేకరించింది. ‘సమగ్ర కుటుంబ సర్వే’ అని పేరుపెట్టినప్పటికీ కులాలవారీగా ప్రజల సమగ్ర వివరాలను సేకరించింది. తెలంగాణలో పుట్టి, ఆ తర్వాత దేశవిదేశాల్లోని వలస ప్రాంతాల్లో పెరిగిన అనేకమంది పిల్లలను తెలంగాణ గ్రామాలకు తిరిగివచ్చి తమతమ పేర్లను నమోదు చేసుకోవాలని వారి తల్లిదండ్రులు కోరి మరీ వెనక్కు పిలిపించారు. ‘తెలంగాణ ఆల్ ఫ్యామిలీ సెన్సెస్ 2014’ నాకు జీసస్ తల్లిదండ్రులైన జోసెఫ్, మేరీలు నజరత్ నుంచి బెతెల్హామ్ చేరుకుని స్వస్థలంలో తమ పేర్లు నమోదు చేయించుకున్న వైనాన్ని గుర్తు చేసింది. వ్యక్తులందరూ తమతమ పూర్వీకుల పట్టణాలకు రావాలన్న నాటి రాజాదేశాన్ని పాటించడానికి జోసెఫ్, మేరీలు బెతెల్హామ్కు ప్రయాణించి వచ్చారు. ఈ ఆదేశం జారీ చేసిన సమయంలో మేరీ... జీసస్‌కి జన్మ నివ్వడానికి గర్భధారణతో ఉండింది. కాబట్టి, బెతెల్హామ్లో ఒక గొర్రెల పాకలో జీసస్ జన్మించడానికి ఆనాడు నిర్వహించిన జనాభా గణనే కారణమైంది. మోజెస్ కాలం నుంచి వ్యక్తులను లెక్కించే చరిత్ర ఇజ్రాయెల్‌కి ఉండేది. హరప్పా వంటి మహత్తర నాగరికతను కలిగి ఉన్నప్పటికీ ప్రాచీన భారతదేశం వ్యక్తుల వారీగా జనాభాను లెక్కించే ఎలాంటి పద్ధతినీ కలిగి ఉండేది కాదు. మన చరిత్రలో తొలిసారిగా బ్రిటిష్ వలస ప్రభుత్వం తన సొంత పన్నుల వసూలు కోసం జనాభా లెక్కలను నిర్వహించింది. తొలి జనగణనను 1865 నుంచి 1872 మధ్య కాలంలో నిర్వహించారు. మొట్టమొదటి సమగ్ర జనగణన 1881లో జరిగింది. చాలావరకు బ్రాహ్మణులు జనగణనను, ప్రత్యేకించి కులాలవారీ జనగణన అనే భావనను తొలినుంచీ వ్యతిరేకిస్తూ వచ్చారు. అతి చిన్న మైనారిటీగా ఉండే ద్విజులు (బ్రాహ్మణులు, బనియాలు, క్షత్రియులు, కాయస్థులు, ఖాత్రీలు) సంస్కృతం, పర్షియన్, ఇంగ్లిష్ భాషలు నేర్చుకున్న విద్యావంతులుగా ఉండేవారు. దేశంలో తాము అతి చిన్న మైనారిటీ అనే వాస్తవం ప్రపంచానికి తెలీకూడదనే వారు కోరుకున్నారు. ఈ మేధావి వర్గమే మండల్ రిజర్వేషన్ల అమలును, కుల గణనను వ్యతిరేకించింది. భాను ప్రతాప్ మెహతా వంటి పలువురు ఉదారవాద మేధావులు కులాలవారీ జనగణనకు వ్యతిరేకంగా బలంగా వాదించారు. మండల్ ఉద్యమ కాలంలో కూడా వీరిలో చాలామంది కులం అనేది బ్రిటిష్ వారి సృష్టి అని వాదించేంతవరకు వెళ్లారు. వామపక్షం, ఉదారవాదులు, ఛాందసవాదులు... ఇలా భావజాలాలతో పనిలేకుండా, ఈ మేధావులందరూ కులవ్యవస్థను బ్రిటిష్ వలసవాదులు సృష్టించారని వాదించారు. వేదాలను సృష్టించిన క్రమంలో, కౌటిల్యుడి అర్థశాస్త్రం, మనుధర్మశాస్త్రం రచించిన క్రమంలో వర్ణ కుల విభజన ఉనికిలోకి వచ్చిన వైనాన్ని వీరు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అనేక జాతీయ వాద పండితులు మనుస్మృతిని గొప్ప ప్రాచీన న్యాయ స్మృతిగా ప్రశంసించేవరకు వెళ్లారు. భారతీయ కమ్యూనిస్టు చింతనాపరులు సైతం ఈ వాదంలో కొట్టుకుపోయారు. అంబేడ్కర్ అనేక రంగాల్లో ద్విజ మేధావులను సవాలు చేసేంతవరకు... కులంపై, భారతీయ నాగరికతపై వ్యతిరేక దృక్పథాన్ని ప్రతిపాదించేవారు శూద్ర, దళిత, ఆదివాసీ ప్రజలకు లేకుండా పోయారు. 1931 తర్వాత కులవారీ గణనను జనాభా లెక్కలనుంచి ఉపసంహరించారు. ప్రపంచ యుద్ధం, 1951 వరకు భారతదేశంలో దుర్భిక్ష పరిస్థితులే దీనికి కారణం. నెహ్రూ, ఆయన ఏర్పర్చుకున్న మేధావుల బృందం సైతం కులాలవారీ జన గణన చేపట్టాలని కోరుకోలేదు. కులసంబంధిత గాయాలను కులాలవారీ గణన కొత్తగా రేపుతుందనే అర్థరహితమైన సిద్ధాంతాలు వ్యాప్తిలోకి వచ్చాయి. కులాల వారీ జనగణన, ఓబీసీ రిజర్వేషన్ పై నెహ్రూ కూడా వీటి ప్రభావానికి లోనయ్యారని పిస్తుంది. నెహ్రూ స్వయంగా కులవారీ జనగణనను వ్యతిరేకించినప్పుడు, 1951లో నెహ్రూ మంత్రివర్గంలోని అంబేడ్కర్ సైతం ఏమీ చేయలేకపోయారు. పీసీ జోషి, శ్రీపాద్ డాంగే, బీటీ రణదివే వంటి కమ్యూనిస్టు ద్విజ మేధావులతోపాటు వామపక్షానికి చెందిన బెంగాలీ భద్రలోక్ నెహ్రూవియన్ల అభిప్రాయాలతో ఏకీభవించినట్లే కనిపించింది. ఏదేమైనా ఈ దృక్పథం హెగ్డేవార్, గోల్వాల్కర్ వంటి హిందుత్వ మేధావులకు ఆమోదనీయమైందని గ్రహించాలి. బ్రిటిష్ వారు దేశాన్ని వీడి వెళ్లిపోగానే, దేశంలోని మొత్తం మేధో, పాలనా, రాజకీయ నిర్మాణాలు ద్విజ మేధావుల చేతుల్లోకి వచ్చేశాయి. అత్యున్నత పాలనా వ్యవస్థలో శూద్ర, దళిత, ఆదివాసీ మేధావులు కానీ, చైతన్యవంతమైన రాజకీయ శక్తులు కానీ లేకుండా పోయారు. అదే సమయంలో తమను ప్రత్యేక వర్గాల కింద గణించే హక్కును దళితులు, ముస్లింలు పొందడంతో అంబేడ్కర్ పెద్దగా ఈ అంశంపై పోరాడలేకపోయారు. సూత్రరీత్యా దళిత రిజర్వేషన్లు 1947లోనే ఉనికిలోకి వచ్చాయి. దేశ విభజన సమస్యల కారణంగా నెహ్రూ పాలనా యంత్రాంగం ముస్లింలను మైనారిటీలుగా గణించడాన్ని కొనసాగించడం ద్వారా వారిని సంతృప్తి పరిచింది. దాంతోపాటు అగ్రశ్రేణి విద్యావంత ముస్లిం మేధావులను పాలనా యంత్రాంగంలో చేర్చుకున్నారు. కానీ శూద్ర ఓబీసీలకు కులవారీ జనగణన కోసం లేదా రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు ఒక లాబీ అంటూ లేకుండా పోయింది. మెజారిటీ శూద్రులు కులవారీ జనగణనను కోరుకుంటుండగా, ద్విజులు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి అత్యున్నత సంస్థలలోని పాలనా యంత్రాంగ నిర్మాణాలు మొత్తంగా తమ నియంత్రణలోనే ఉన్నాయని ద్విజులకు తెలుసు. మన రాయబార కార్యాలయాలతో సహా ఢిల్లీ పాలనాయంత్రాంగం కూడా వాస్తవంగా ద్విజుల అదుపులో ఉంటోంది. ఒకసారి కులాలవారీగా అధికారిక డేటా విడుదల చేశాక, ఢిల్లీ నుంచి దేశాన్ని పాలిస్తున్న కీలకమైన పాలనా వ్యవస్థల్లో ఏ ఒక్కదానిలో కూడా తమకూ ప్రాతినిధ్యం లేదని జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మహిస్యాలు (పశ్చిమ బెంగాల్), ఉత్తర, దక్షిణ భారతదేశంలోని ఇతర కమ్యూనిటీలు కూడా గుర్తించే ప్రమాదముంది. కులాలవారీగా జనాభా గణన భారతదేశంలో ప్రజాస్వామ్య భావనను మౌలికంగానే మార్చివేస్తుంది. పార్టీ భేదాలకు అతీతంగా బిహార్ ప్రాంతీయ నేతలు ప్రధాని నరేంద్రమోదీని ఇటీవలే కలిసి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే తలపెట్టిన కులప్రాతిపదిక డేటా సేకరణను నమూనాగా తీసుకుని కులాలవారీ జనగణన చేపట్టాలని కోరారు. తెలంగాణలో కేసీఆర్, కర్ణాటకలో సిద్ధరామయ్య కులాల ప్రాతిపదికన తమవైన సంక్షేమ పథకాల ఎజెండా కోసం ఆ డేటాను ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు తెలంగాణలోనే ఒకటో, రెండవ అతిపెద్ద కమ్యూనిటీలైన గొల్ల–కురుమలు, ముదిరాజుల అసలు సంఖ్యను కేసీఆర్ గుర్తించి, సాంప్రదాయికంగా గొర్రెలకాపరులైన గొల్లకురుమల కోసం గొర్రెల పంపిణీ, చేపల వేటను వృత్తిగా కలగిన ముదిరాజుల కోసం మత్స్య పరిశ్రమాభివద్ధి పథకాన్ని ప్రారంభించారు. ప్రతిఫలంగా 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వీరి ఓట్లను కొల్లగొట్టారు. ప్రాంతీయ పార్టీలకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇక ప్రజానీకం కులాలవారీగా జనాభా గణన వల్ల తమదైన ప్రయోజనాలను పొందుతోంది. మరోవైపున బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల వంటి జాతీయ పార్టీలు... తమను కులాలుగా గణించడాన్ని వ్యతిరేకిస్తున్న తమవైన ద్విజుల నెట్వర్క్పట్ల ఎంతో జాగరూకతతో ఉంటున్నాయి. ఇదే భవిష్యత్తులో అతిపెద్ద వైరుధ్యంగా మారబోతోంది. -ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఆ దేశ జనాభాలో 3కోట్ల మంది బ్యాచిలర్సే
బీజింగ్: ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. ఆ దేశ జన గణన ఈ సంవత్సరం చేశారు. తాజాగా చేసిన జనగణనలో విస్తుగొల్పే విషయాలు వెల్లడయ్యాయి. దేశ జనాభాలో ముఖ్యంగా పెళ్లి కాని వారు అధికంగా ఉన్నారని తేలింది. ఈ విషయం తాజాగా చేసిన జనాభా లెక్కల్లో వెల్లడైంది. దీంతో ఆ దేశంలో పెద్ద ఎత్తున పెళ్లి కాని ప్రసాద్‌లే ఉన్నారు. చైనా జనాభా లెక్కల వివరాలను మే 11వ తేదీన విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం జనాభా వృద్ధి రేటు తగ్గడం ఆందోళన కలిగించే అంశం. అయితే చైనా పాటించిన విధానం ప్రభావంతో ప్రస్తుతం పెళ్లి కాని పురుషులు అధికంగా ఉన్నారు. లింగ సమతుల్యత పాటించకపోవడం వలన ఈ సమస్య ఏర్పడిందని మేధావులు చెబుతున్నారు. 30 మిలియన్ల(3 కోట్లు) పెళ్లి కాని పురుషులు ఉన్నారని చైనా ఏడవ జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం చైనాలో 111.3 పురుషులకు వంద మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అంతకుముందు 2010లో 118.1 పురుషులకు వంద మంది అమ్మాయిలు ఉన్నారు. గత లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం లింగ నిష్పత్తి కొంత మెరుగైందనే చెప్పవచ్చు. కానీ ఆశించిన స్థాయిలో లింగ నిష్పత్తి లేదు. ఒకరు మాత్రమే అనే విధానంతో లింగ అంతరం సమస్య పెరిగింది. -
మరోసారి అటకెక్కిన ఓబీసీ కులగణన
బ్రిటిష్ పాలనలో జనాభా లెక్కల్లో ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, ఆంగ్లో ఇండి యన్స్, ముస్లి మేతరుల (హిందు వులు) లెక్కలు తీసేవారు. 1872 నుండి జనాభా లెక్కలలో ఆయా కులాల గణాంకాలను 1931,1932 వరకు లెక్కించింది. శూద్ర కులాల సామాజిక, ఆర్థిక, విద్య, సాంస్కృతిక అంశాలు తెలిస్తే తప్ప దేశ అభివృద్ధి సాధ్యం కాదని గుర్తిం చింది. దేశానికి స్వాతంత్య్ర సిద్ధించిన అనంతరం 1951 నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తు న్నారు. ఇందులో స్త్రీలు, పురుషులు, పిల్లలు, మతంతో పాటుగా షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) లెక్కలను తీస్తున్నారు. కానీ దేశ జనాభాలో యాభై శాతం పైగా జీవిస్తున్న వెనుకబడిన తరగతుల (బీసీ/ఓబీసీ) లెక్కలు తీయడం లేదు. మొదటి జాతీయ బీసీ కమిషన్ మొదలుకొని, అన్ని రాష్ట్రా లలో నేటి వరకు నియమించిన బీసీ కమిషన్లు అన్నీ ఓబీసీ కులగణన చేయాలని సూచించాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేక సందర్భాలలో వెనుకబడిన తరగతుల లెక్కలను తేల్చా లని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాయి. 2012లో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ‘సెన్సస్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఆర్.కృష్ణమూర్తి’ మధ్య కేసు తీర్పులో కేంద్ర ప్రభుత్వాన్ని జనాభా లెక్కలతో పాటుగా ఓబీసీ కులగణన చేయాలని సూచించింది. 2010లో జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఓబీసీ కుల గణన చేయాలని అన్ని ప్రతిపక్ష పార్టీలు, భారతీయ జనతా పార్టీతో సహా ముక్తకంఠంతో నినదించాయి. అందుకు స్పందిం చిన కేంద్ర ప్రభుత్వం 2011లో చేయబోయే జనాభా లెక్కలలో సాధ్యం కాదనీ; అప్పటికే జనాభా లెక్కలకు సంబంధించిన సామగ్రిని దేశవ్యాప్తంగా పంపించడం జరిగిందనీ; తరువాత తీయబోయే జనాభా లెక్కలలో ఓబీసీ గణన చేస్తామనీ లోకసభ, రాజ్యసభ సాక్షిగా ప్రకటించింది. 2014లో అధికారం లోకి వచ్చిన బీజేపీ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల జనగణన 2021లో చేపడుతామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్ వారు 2021 జనగణనకు సంబంధించిన షెడ్యూలు విడుదల చేస్తూ మొదట శాంపిల్ సర్వేకు ప్రతి రాష్ట్రంలో మూడు మండలాలను ఎంపిక చేసి మొబైల్ మరియు డేటా షీట్ ద్వారా సర్వేను 12 ఆగస్టు నుండి 30 సెప్టెంబర్ 2019 వరకు నిర్వహించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీల వివరాలు సేకరించారు గానీ ఓబీసీల వివరాలను సేకరిం చలేదు. శాంపిల్ సర్వేలో చేయలేదంటే ఈసారి కూడా ఓబీసీ కులగణన చేయడం లేదని తేటతెల్లమైంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్లుగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 స్థానిక సంస్థలైన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు పరిచారు. కానీ 2019లో పంచాయతీ ఎన్నికలలో తెలంగాణ ప్రభుత్వం 50% పరిమితికి సంబంధించి కోర్టు తీర్పులను సాకుగా చూపి 34 నుండి 23 శాతానికి బీసీ రిజర్వేషన్లను కుదించారు. ఫలితంగా సుమారు 1000 సర్పంచి సీట్లను బీసీలు కోల్పోవలసి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం 2014లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం అధికారికంగా బీసీ జనాభాను కోర్టులకు సమర్పించి 34% రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తీసుకోవచ్చు. కానీ అలా చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో జీవో 176 ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలకు 34%, ఎస్సీలకు 19.08%, ఎస్టీలకు 6.77% మొత్తం వర్టికల్ రిజర్వేషన్ 60% శాతంగా కల్పించింది. ఈ రిజర్వేషన్లపై హైకోర్టు ధర్మాసనం బిర్రు ప్రతాపరెడ్డి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ మధ్య కేసు తీర్పులో బీసీల జనాభా లెక్కలు లేవు కనుక వర్టికల్ రిజర్వేషన్ 50% దాటడానికి వీలులేదని తీర్పిచ్చింది. తప్పని పరిస్థితులలో ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను జీవో 559 ద్వారా 34% నుండి 24%కి తగ్గించింది. ఇప్పటికీ ఎన్నికలు జరగలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2021 జనాభా లెక్కలలో ఓబీసీ గణన చేపట్టి సమసమాజానికి బాటలు వేయాలని 70 కోట్ల మంది బీసీలు ఆశిస్తున్నారు. లెక్కలు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చేయని కారణంగా వీరికి అమలుపరుస్తున్న రిజర్వేషన్లపై అనేక న్యాయపరమైన చిక్కులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులలో ఎదుర్కోవాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీలకు విద్య, ఉద్యోగ తదితర రంగాలలో వారి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయాలంటే ఓబీసీ కులగణన తప్పనిసరి. ఇది అన్ని సమస్యలకు సర్వరోగ నివారిణిగా ఉపయోగపడుతుంది. కోడెపాక కుమార స్వామి వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ‘ మొబైల్ : 94909 59625 -
‘ఏడాది ఆలస్యమైనా వచ్చే నష్టమేమీ లేదు’
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతున్నందున... జనాభా లెక్కలు తీసే ప్రక్రియ ఈ ఏడాది మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్)లో తాజా వివరాలు నమోదు చేసే ప్రక్రియ కూడా ఇప్పట్లో ఉండకపోవచ్చు. ప్రతి పదేళ్లకు ఒకసారి భారతదేశంలో జరిగే జనగణన ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక సేకరణ. దేశంలోని మూలమూలలో ప్రతి ఇంటికి వెళ్లి జనాభా వివరాలను సేకరించే పనిలో ఏకంగా 30 లక్షల మంది ప్రభుత్వ సిబ్బంది పాల్గొంటారు. ‘జనగణన ఇప్పుడు అంత ముఖ్యమైన అంశం కాదు. ఏడాది ఆలస్యమైనా వచ్చే నష్టమేమీ లేదు’ అని కేంద్ర గణాంకశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2021 జనగణన మొదటిదశను ఎప్పుడు ప్రారంభించాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకోనప్పటికీ... ఈ ఏడాది మాత్రం మొదలయ్యే అవకాశాల్లేవని వెల్లడించారు. వాస్తవానికి జనగణన, ఎన్పీఆర్ నవీకరణ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు జరగాల్సి ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్పీఆర్ నవీకరణను వ్యతిరేకించినా... జనగణనకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పాయి. అయితే కోవిడ్ సంక్షోభం కారణంగా జనగణనను వాయిదా వేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించాలి కాబట్టి సిబ్బందికి ఉండే ఆరోగ్యపరమైన ముప్పును తక్కువ చేయలేమని ఆ అధికారి చెప్పారు. (ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు) -
జనగణనలో మొబైల్ నంబర్!
న్యూఢిల్లీ: జనగణన సమయంలో కుటుంబ పెద్ద మొబైల్ నెంబర్ వివరాలను కూడా సమాచారం కోసం వచ్చిన ఉద్యోగులకు(ఎన్యూమరేటర్లు) ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 31 ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని సేకరించాల్సిందిగా జనగణన అధికారులను ఆదేశించామని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, మొబైల్ నెంబర్‌ను జనగణనకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి మాత్రమే వినియోగిస్తామని, మరే ఇతర అవసరాలకు వాడబోమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇతర ప్రశ్నలతో పాటు కుటుంబపెద్ద ఫోన్ నెంబర్, ఇంట్లో ఉన్న టాయిలెట్లు, టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్, సొంత వాహనాలు, కంప్యూటర్, ల్యాప్‌టాప్, తాగు నీటి వసతి.. తదితర సమాచారాన్ని ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్యలో కుటుంబ సమాచార సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. కుటుంబ పెద్ద ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతర ఏ సామాజిక వర్గానికి చెందుతారనే వివరాలూ సేకరిస్తారు. ఇల్లు సొంతమా?, ఇంట్లోని గదులెన్ని? ముఖ్యమైన ఆహారం ఏమిటి?, వంటకు వాడే ఇంధనం ఏమిటి? తదితర ప్రశ్నలు కూడా ఉంటాయి. ఈ సారి పేపర్‌పై కాకుండా ఈ వివరాలన్నింటినీ మొబైల్ యాప్‌లో నిక్షిప్తం చేస్తారు. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను కూడా రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. -
యాప్ సాయంతో జనాభా లెక్కలు
-
కొత్త ‘లెక్కలు’ పంపండి!
సాక్షి, హైదరాబాద్: జనాభా లెక్కల సేకరణకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. 2021 జనాభా లెక్కల కోసం వివరాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో 2011 జనాభా లెక్కల అనంతరం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పునర్విభజనకు సంబంధించిన సమాచారాన్ని పంపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర జనగణన వ్యవహారాల డైరెక్టర్ ఇలంబర్తి లేఖ రాశారు. 2011 అనంతరం రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే జిల్లాల పునర్విభజన నేపథ్యంలో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో రెండు జిల్లాల కేంద్రాలు, 58 మండలాలు, 460 గ్రామాల పేర్లు కనిపించకుండా పోవడం, కొన్ని పేర్లు మార్పులు జరగడం వంటి వాటిని గుర్తించిన∙కేంద్ర జనగణనశాఖ డైరెక్టర్.. పొరపాటున మాయమైతే వెంటనే నోటిఫై చేయాలని రాష్ట్రప్రభుత్వానికి గతంలోనే లేఖ రాసింది. 2018 జనవరి 1 నుంచి మారిన గ్రామాలు, మండలాలు, పట్టణాలు, జిల్లాల సరిహద్దులను గుర్తించి 2019 అక్టోబర్ 31 వరకు విడుదల చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ల కాపీలను కూడా పంపాలని ఆదేశించారు. -
7వ ఆర్థిక గణన సర్వే ఆరంభం
సాక్షి, ఒంగోలు:కుటుంబ ఆర్థిక స్థితిగతులపై వివరాల సేకరణకు కసరత్తు మొదలైంది. 7వ ఆర్థిక గణన సర్వేను జిల్లాలో మంగళవారం కలెక్టర్ పోల భాస్కర్ లాంఛనంగా ప్రారంభించారు. సరిగ్గా వంద రోజుల్లో సర్వే పూర్తి చేసి వివరాలను అప్లోడ్ చేయాలి. ఈ సర్వే ద్వారా దారిద్యరేఖకు దిగువ, ఎగువ ఎందరు ఉన్నారో లెక్క తేల్చనున్నారు. ఈ తరహా సర్వేలు ఇప్పటికి ఆరు పూర్తయ్యాయి. ఈ నివేదికల ఆధారంగానే తలసరి గ్రాంటులు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన సర్వేలన్నీ మాన్యువల్‌గా జరగగా ఈ ఏడాది సర్వే డిజిటల్ ఇండియాను దృష్టిలో ఉంచుకొని కాగిత రహితంగా చేయనున్నారు. మొట్టమొదటి సారిగా ఆర్థిక గణన సర్వేకి మొబైల్ యాప్‌ను వినియోగిస్తున్నారు. కుటుంబాల ఆర్థిక స్థితి గతులను దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వాల నుంచి సహాయం, వివిధ రకాల సహాకారం అందనుంది. ఎంతో కీలకమైన ఆర్థిక గణన కుటుంబాల్లో తలసరి ఆదాయాల లెక్క తేల్చనుంది. పట్టణాలు, పల్లెల్లో వేర్వేరుగా.. జిల్లాలో 1028 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవి కాకుండా 35 అటవీ గ్రామాలు ఉన్నాయి. ఒంగోలు నగర పాలక సంస్థతో పాటు కందుకూరు, చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 12.5 లక్షల కుటుంబాలు ఉన్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో విడివిడిగా 7వ ఆర్థిక గణన సర్వే జరగనుంది. వీరిలో భూమి కలిగిన వారు 7.22 లక్షలు, మధ్య తరహా రైతులు 4.32 లక్షలు, చిన్నతరహా రైతులు 1.78 లక్షల మంది ఉన్నారు. వీరి వివరాలను సర్వే ద్వారా సేకరిస్తారు. ఎన్యూమరేటర్ల ఎంపిక ఆర్థిక గణన సర్వే కోసం ఎన్యూమరేటర్ల ఎంపిక కార్యక్రమం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. నగరంతో పాటు మున్సిపాలిటీలు, పట్టణ పాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో సర్వే విడివిడిగా జరగనుంది. ఏడవ ఆర్థిక గణన సర్వేను గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ, రాష్ట్ర ప్రభుత్వంలోని ఆర్ధిక గణాంక శాఖ, జాతీయ శాంపుల్ సర్వే, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చేపట్టింది. ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫ్ర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వారితో నియమించిన కామన్ సర్వీసెస్ సెంటర్స్.. ఈ గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ ఈ సర్వేను సంయుక్తంగా అమలు చేస్తోంది. ఆర్థిక లెక్క తేలుతుంది.. సర్వే ద్వారా కుటుంబాల ఆర్థిక లెక్క తేలనుంది. కార్యక్రమం దేశం భౌగోళిక సరిహద్దుల్లోని అన్ని సంస్థల పూర్తి లెక్కలను, అసంఘటిత రంగంలోని కుటుంబాల వారి వివరాలను సర్వేద్వారా అందిస్తోంది. అన్ని సంస్థల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది. సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రణాళికల కోసం ఆర్ధిక కార్యకలాపాల భౌగోళిక వ్యాప్తి జిల్లాలోని రకరకాల యాజమాన్యాల నమూనాలు, ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమైన వ్యక్తుల ఉద్యోగులు ఇతర విలువైన సమాచారాన్ని సేకరించనున్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే.. సర్వే కచ్చితత్వం కోసం మొబైల్ యాప్ ద్వారా చేపట్టారు. ఇందు కోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేశారు. గతంలో నిర్వహించిన 6వ గణన కార్యక్రమం మాన్యువల్‌గా చేసినందున సమగ్ర నివేదిక రావడానికి నెలల పాటు కాలహరణం జరిగింది. 2013లో ఈ గణన సర్వే వివరాలు 2016లో గానీ అవుట్‌పుట్ విడుదల కాలేదు. ఈ దఫా సర్వేలో ఈ ఇబ్బందులు లేకుండా డిజిటల్ ఇండియా నియమాలను అనుసరించి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేయనున్నారు. ఇందు కోసం ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చారు. జియో ట్యాగింగ్, టైమ్ స్టాంపింగ్, యాప్ లెవల్ డేటా ధ్రువీకరణ, డేటాను సంరక్షించేందుకు సురక్షితం కోసం లాగిన్,వెబ్ అప్లికేషన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని నివేదికలను పై స్థాయి అధికారులకు అప్లోడు చేయడం కోసం సులభతరంగా వీటిని రూపొందించారు. ఎన్యుమరేటర్ల పైన సూపర్వైజర్లు లెవన్–1 , లెవల్–2 అధికారులు ఉన్నారు. ఎన్యుమరేటర్లకు ప్రైవేటు వ్యక్తులను నియమించారు. వీరికి ఎస్ఎస్సి విద్యార్హత ఉంటే సరిపోతుంది. 1028 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. వీరు కాకుండా పట్టణ,నగర పాలక సంస్థ పరిధిలో ఎన్యుమరేటర్లను ప్రత్యేకంగా నియమించారు. ఎన్యుమరేటర్లు సేకరించిన సమాచారాన్ని లెవల్–1 అధికారి తనిఖీ చేసి సర్వే సరిగ్గా వచ్చిందని బావిస్తే లెవల్–2 అధికారికి పంపుతారు. అక్కడి నుంచి యాప్ ద్వారా అప్లోడు చేస్తే సర్వే నివేదికకు చేరుతుంది. ఈ పద్దతిలో సర్వే అవుట్‌పుట్ జనవరి ఆఖరుకే ప్రభుత్వానికి ఇవ్వడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. సూపర్వైజర్లకు ఇప్పటికే డీఈఎస్, ఎన్ఎస్వో, సీఎస్ఈ సంస్థలు శిక్షణ ఇచ్చాయి. కలెక్టర్ అధ్యక్షతన కమిటీ.. ఆర్థిక సర్వేకి కలెక్టర్ అధ్యక్షతన కమిటీ నియమించారు. జిల్లా స్థాయి కమిటీ ఈ సర్వేను పర్యవేక్షిస్తుంది. జిల్లా ఎస్పీ, సీపీవో, ఇతర 14 శాఖల అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పోగ్రాం ఇంప్లిమెంట్ జిల్లా మేనేజర్ ప్రమోద్‌కుమార్ సూపర్వైజర్ల పనితీరు, ఆపై అధికారుల పని తీరును పర్యవేక్షిస్తుంటారు. సర్వేని రెండు రకాలుగా చేస్తారు. ప్రతి కుటుంబాన్ని కలుస్తారు. ఇల్లు తీరును పరిశీలించి వివరాలను సేకరిస్తారు. ఇంటి ముందు దుకాణాలు ఉన్నా, ఇంటి ముందు కమర్షియల్ గదులు ఉన్నా, మొత్తంగా కమర్షియల్ దుకాణాలు ఉన్న వివిధ విభాగాల కింద వివరాలను సేకరించి నమోదు చేస్తారు. నార్మల్ హౌస్‌హోల్డ్, సెమి నార్మల్ హౌస్‌హోల్డ్, కమర్షియల్ విభాగాల కింద సర్వే వివరాలను నమోదు చేస్తారు. ఎంతో కీలకమైన ఈ ఏడవ ఆర్ధిక గణన సర్వేను జిల్లాలో వంద రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. -
ఊళ్లకు ఊళ్లు మాయం !
సాక్షి, హైదరాబాద్ : మనుషులు అదృశ్యం కావడం.. వస్తువులు కనిపించకుండా పోవడం గురించి విన్నాం. అయితే ఇక్కడ ఏకంగా ఊళ్లకు ఊళ్లే మాయమయ్యాయి. అదెలా అని ఆశ్చర్య పోతున్నారా?.. మన రెవెన్యూ అధికారుల నిర్వాకంతో ఇది సాధ్యమైంది. జనాభా లెక్కల సేకరణతో అసలు విషయం వెలుగుచూసింది. 2021 జనగణనకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో 2011 సెన్సెస్‌ను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఆ జాబితా ఆధారంగా గ్రామాల వారీగా జనాభా వివరాల సేకరణకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో కొన్ని గ్రామాలు కనిపించకుండా పోవడంతో కేంద్ర జనగణన శాఖ అవాక్కయ్యింది. ఏకంగా ఊళ్లు మాయం కావడాన్ని సీరియస్‌గా పరిగణించింది. 2011 జనాభా లెక్కల అనంతరం ఏర్పడిన 23 జిల్లాలు కలుపుకొని.. మొత్తం 14 జిల్లాల పరిధిలో 460 గ్రామాలు, 2 మున్సిపాలిటీల పేర్లు గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర జనగణనశాఖ జాయింట్ డైరెక్టర్ హెలెన్ ప్రేమకుమారి.. సదరు గ్రామాలను డీనోటిఫై చేశారా?.. అలాగే కొత్తగా జాబితాలో 38 పంచాయతీలు చేర్చిన వైనాన్ని ప్రశ్నిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖాస్త్రం సంధించడం గమనార్హం. ఒకవేళ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో చేరిస్తే.. ఆ వివరాలు పంపాలని కోరారు. రెవెన్యూ లెక్క తప్పింది ! జిల్లాల పునర్విభజన అంశంతో కొన్ని పల్లెల వివరాలు రెవెన్యూ రికార్డుల నుంచి మాయమయ్యాయి. భౌతికంగా ఆ పల్లెలు యథాస్థానంలో ఉన్నా రికార్డుల నుంచి కనిపించకుండాపోవడం కలకలం సృష్టించడమే కాదు, అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. 2016లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేస్తూ జీఓ 221 నుంచి 250లను జారీ చేసింది. జీఓల్లో గ్రామాలకు గ్రామాలే గల్లంతయ్యాయి. జిల్లా కేంద్రాలుగా ఏర్పడ్డ 2 మున్సిపాలిటీల పేర్లు కూడా కనిపించకుండా పోయా యి. పోనీ, ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారా! అంటే అదీ లేదు. 2021 జనాభా లెక్కల సేకరణకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయా జిల్లాల్లోని గ్రామాల జాబితాను పరిశీలిస్తున్న క్రమంలో 58 మండలాల పరిధిలోని 460 గ్రామాలతోపాటు వనపర్తి, గద్వాల మున్సిపాలిటీల సమాచారం కూడా గల్లంతుకావడంతో జనగణన అధికారులు నివ్వెరపోయారు. ఈ విషయాన్ని గత మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేసింది. ఈ గ్రామాలున్నాయా? రద్దు చేశా రా? కొత్తగా 38 గ్రామాలను ఏర్పాటు చేశా రు కదా.. వాటికి సంబంధించి ఉత్తర్వు కాపీలను పంపమని సూచించింది. భారత్–2021 జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఏడాది చివరి నాటికి గ్రామాల హద్దులను ప్రకటించాల్సి ఉన్నందున తక్షణమే వివరాలను నివేదించాలని కోరింది. కేంద్రం లేఖతో తేరుకున్న రెవెన్యూ శాఖ.. గ్రామాల గల్లంతుపై దృష్టి సారించింది. గత జూన్‌లో సీఎస్ జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా ఈ అంశంపై చర్చించారు. కేంద్రం పంపిన జాబితాలో గల్లంతైనట్లు గుర్తించిన గ్రామాలపై మండలాలవారీగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 589 తహసీల్దార్లలో కేవలం 167 మంది, 142 మున్సిపాలిటీల్లో 30 మంది మాత్రమే స్పందించారు. -
ప్రధాన జనగణన అధికారులుగా కలెక్టర్లు
సాక్షి, అమరావతి: 2021 నుంచి చేపట్టనున్న జనాభా సేకరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్లను ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారులుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ప్రీ టెస్ట్ సెన్సెస్ నిర్వహణ జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా భోగాపురం, అనంతపురం జిల్లా ఆత్మకూరు, గుంటూరు జిల్లా నర్సరావుపేట సెన్సెస్ చార్జ్ ఆఫీసర్లుగా స్థానిక తహసిల్దార్లను నియామకం చేస్తూ సాధరణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
తెలంగాణలో 17 పులులు, 125 చిరుతలు
-
పాక్‌లో ఎట్టకేలకు జనాభా గణన
ఇస్లామాబాద్: రెండు దశాబ్దాల తరువాత తొలిసారిగా పాకిస్తాన్ జనాభా లెక్కలు నిర్వహించనుంది. బుధవారం నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం కోసం రెండు లక్షల మంది సైనికులను, అధికారులను నియమించారు. జనగణన ద్వారా వచ్చిన సమాచారాన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, శాసనసభ స్థానాల పునర్విభజనకు ఉపయోగిస్తారు. రెండుదశల్లో మే 25 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని పాక్ సైనికాధికారులు ప్రకటించారు. జనాభా లెక్కలు సేకరించే అధికారి వెంట భద్రత కోసం ఒక సైనికుడిని నియమిస్తారు. సమాచార సేకరణలో సైనికులు కూడా సహకరిస్తారు. ఇందుకోసం అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చే పౌరులకు రూ.50 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని అధికారులు హెచ్చరించారు. పాకిస్తాన్లో చివరిసారిగా 1998లో జనాభా లెక్కలు నిర్వహించగా, దేశ జనాభా 18 కోట్లని తేలింది. -
చిరుతల సంఖ్య తేలింది
చిరుతపులుల జనసంఖ్యపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. స్వాతంత్ర్యానంతరం వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా చేపట్టిన చిరుత పులుల జనగణనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం భారత్‌లో 12 వేల నుంచి 14 వేల చిరుతపులులు ఉన్నాయని, పులుల సంఖ్య (7,910)తో పోల్చిచూస్తే ఈ సంఖ్య మెరుగైనదని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్, చిరుతపులుల జనగణన ముఖ్యఅధికారి యదువేంద్రదేవ్ ఝా చెప్పారు. డెహ్రాడైన్లో జరిగిన వార్షిక పరిశోధనా సదస్సులో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. చిరుతల సంచారం అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి, అక్కడక్కడా నైట్‌విజన్ కెమెరాలను ఏర్పాటుచేసి ఫోటోలు తీశామని, ఇతర ప్రాంతాల్లోనూ వివిధ మార్గాల ద్వారా ఫొటోలను సేకరించామని, అన్నింటిని క్రోడీకరించిన పిదప దేశంలో చిరుత పులుల రమారమి జనాభాను అంచనావేయగలిగామని ఝా చెప్పారు. పులుల జనగణనను కూడా ఇవే పద్దతుల ద్వారా సేకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాగా, ఈశాన్య భారతంలో ఇంకా సర్వే చేపట్టలేదని, ఆ వివరాలను కూడా కూడితే చిరుతపులుల జనసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 343 చిరుతపులులు ఉండగా మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 1,817, కర్ణాటకలో 1,129, మహారాష్ట్రలో 905, ఛత్తీస్‌గఢ్ లో 846, తమిళనాడులో 815, ఉత్తరాఖండ్ లో 703, హిమాలయ ప్రాంతంలో 300 నుంచి 400 చిరుతపులులు జీవిస్తున్నాయి. -
ముస్లిం జనాభా పైపైకి.. హిందూ జనాభా కిందికి
న్యూఢిల్లీ: దేశంలో ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో హిందువుల సంఖ్య నానాటికి తగ్గిపోతుందని వివరించింది. మతాల వారిగా జనాభా గణన వివరాలను మంగళవారం సాయంత్రం జనాభా లెక్కల ప్రధాన రిజిష్ట్రార్ అండ్ కమిషనర్ విడుదల చేశారు. దీని ప్రకారం 2001 నుంచి 2011 మధ్య కాలంలో 0.8శాతం వృద్ధితో ముస్లింల జనాభా 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు పెరుగగా హిందువుల జనాభా 0.7శాతం తగ్గుదలతో 96.63 కోట్లుగా ఉన్నది. గత నాలుగేళ్ల కిందటే జనాభా లెక్కలు పూర్తయినప్పటికీ మతాలవారి జాబితాను నేడే ప్రకటించారు. ఇంకా కులాల వారి జాబితా విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆర్జేడీ, జేడీయూ, డీఎంకే కులాల వారి జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశాయి కూడా. తాజాగా విడుదల చేసిన మతాలవారి 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశం మొత్తం జనాభా 121.09 కోట్లుకాగా అందులో హిందువులు 96.63 కోట్లు(దేశ జనాభాలో 79.8శాతం), ముస్లింలు 17.22 కోట్లు(14.2శాతం), క్రైస్తవులు 2.78 కోట్లు (2.3శాతం), సిక్కులు 2.08 కోట్లు(1.7శాతం), బౌద్దులు 84లక్షలు(0.7శాతం), జైనులు 45 లక్షలే(0.4శాతం),ఇతర మతాలకు చెందినవారు 79లక్షలు (0.7శాతం), అసలు ఏ మతానికి చెందనివారు 29లక్షలు (0.2శాతం) ఉన్నది. 2001 జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా 82.75 కోట్లతో దేశ జనాభాలో 80.45 శాతం ఉండగా ముస్లింల జనాభా 13.8 కోట్లతో 13.4 శాతం ఉంది. మొత్తం జనాభా వృద్ధి రేటు పదేళ్ల కాలంలో 17.7 శాతంగా నమోదైంది. ఇక క్రైస్తవులు, జైనుల జనాభా పెరుగుదలలో మాత్రం పెద్దగా మార్పు రాలేదని వివరించారు. -
కులాల వారీగా జనాభా గణన చేపట్టండి: సుప్రీం
న్యూఢిల్లీ: కులాలవారీగా జనాభా గణన చేపట్టాలంటూ కేంద్రప్రభుత్వానికి దేశ అత్యున్నత కోర్టు సుప్రీం కోర్టు మార్గదర్శకత్వాలు జారీ చేసింది. గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. మద్రాస్ హైకోర్టు తన పరిధి మీరిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. -
జపాన్‌లో పెరుగుతున్న 'పెద్దోళ్లు'
ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా వెలుగొందుతున్న జపాన్ అతిపెద్ద వయస్కులకు నిలయం. మిగతా దేశాలతో పోల్చితే ఈ దేశంలో అతిపెద్ద వయస్కుల సంఖ్య అధికం. విశేషమేమిటంటే జపాన్‌లో వృద్ధుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో వృద్ధులున్నట్టు తాజా గణంకాలు వెల్లడిస్తున్నాయి. 2010 జనాభా లెక్కల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు 31.86 మిలియన్ల మంది ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే ఇది 1.12 మిలియన్ ఎక్కువ. 13.69 మిలియన్ల మంది పురుషులు, 18.18 మంది మహిళలు వృద్ధ జనాభాలో ఉన్నారు. జపాన్ జనాభాలో నలుగురిలో ఒక్కరు 65 ఏళ్ల కంటే పైబడిన వారు ఉన్నారని వివరించింది. 2035 నాటికి ప్రతి ముగ్గురిలో ఒక వృద్ధుడు ఉంటారని అంచనా వేసింది.