నల్గొండ: అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పూలే జయంతికి మరో నెల రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు.
‘ప్రభుత్వం నుంచి అసెంబ్లీలో విగ్రహ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. 1931లో చివరిసారిగా కుల గణన చేశారు. బీసీ కులగణన వెంటనే చేపట్టాలి. మండల్ కమీషన్‌కు వ్యతిరేకంగా ఆనాడు రాజీవ్‌గాంధీ మాట్లాడారు. 1996లో రూ.4500 కోట్లతో కులగణన చేసి కనీసం వాటిని బయట కూడా రానివ్వలేదు కాంగ్రెస్. ఎంతమంది బీసీ జడ్జీలు ఉన్నారని రాహుల్ గాంధీ అంటున్నారు. 75 ఏళ్లు పాలించింది మీరు కాదా రాహుల్.
...పార్లమెంట్‌లో పూలే విగ్రహం ఉన్నంక అసెంబ్లీలో ఉంటే తప్పేంటి. ఏపీలో కులగణనపై ఓ ప్రణాళిక ప్రకారం చట్టం చేసి ముందుకు పోతున్నారు. కులగణన చేసి రిజర్వెషన్ల కోటా తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి 20 వేల కోట్ల నిధులిస్తామన్నారు. బడ్జెట్‌లో ఎనిమిది వేల కోట్లే ఇచ్చారు. తెలంగాణలో ఎంబీసీ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు ఏమైందో చెప్పాలి’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment