Mahatma Jyothiba Phule
-
బీసీ కులగణన వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్సీ కవిత
నల్గొండ: అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పూలే జయంతికి మరో నెల రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. ‘ప్రభుత్వం నుంచి అసెంబ్లీలో విగ్రహ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. 1931లో చివరిసారిగా కుల గణన చేశారు. బీసీ కులగణన వెంటనే చేపట్టాలి. మండల్ కమీషన్‌కు వ్యతిరేకంగా ఆనాడు రాజీవ్‌గాంధీ మాట్లాడారు. 1996లో రూ.4500 కోట్లతో కులగణన చేసి కనీసం వాటిని బయట కూడా రానివ్వలేదు కాంగ్రెస్. ఎంతమంది బీసీ జడ్జీలు ఉన్నారని రాహుల్ గాంధీ అంటున్నారు. 75 ఏళ్లు పాలించింది మీరు కాదా రాహుల్. ...పార్లమెంట్లో పూలే విగ్రహం ఉన్నంక అసెంబ్లీలో ఉంటే తప్పేంటి. ఏపీలో కులగణనపై ఓ ప్రణాళిక ప్రకారం చట్టం చేసి ముందుకు పోతున్నారు. కులగణన చేసి రిజర్వెషన్ల కోటా తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి 20 వేల కోట్ల నిధులిస్తామన్నారు. బడ్జెట్లో ఎనిమిది వేల కోట్లే ఇచ్చారు. తెలంగాణలో ఎంబీసీ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు ఏమైందో చెప్పాలి’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. -
ఆయన మంత్రివర్గంలో పని చేయడం అదృష్టం
సాక్షి, విజయవాడ: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నెరవేరుస్తూ బలహీనవర్గాలకి అండగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులతో కలిసి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలకి ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలె అని గుర్తు చేశారు. పూలే ఆశయాలని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని సీఎం వైఎస్ జగన్ బలహీనవర్గాలని బ్యాక్‌బోన్‌గా చూస్తున్నారని తెలిపారు. ఎన్నో సంక్షేమ పధకాలతో బలహీన వర్గాలకి అండదండగా నిలబడిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమన్నారు. చదవండి: మూడు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే బలహీనవర్గాలకి 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని కొనియాడారు. ఇంగ్లీష్ మీడియం, అమ్మఒడి లాంటి సంక్షేమ పధకాలతో సీఎం వైఎస్ జగన్ బలహీనవర్గాల జీవితాలలో పెను మార్పులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. మహిళలకి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా సీంఎ జగన్ బీసీ మహిళల జీవితాలలో వెలుగులు నింపారన్నారని తెలిపారు. విద్యకి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా బీసీలు ఉన్నత చదువులు అభ్యసించడానికి అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడిన సీఎం జగన్ మంత్రివర్గంలో పనిచేయడం మా అదృష్టమని తెలిపారు. బలహీనవర్గాలకి అండగావుంటున్న తమ ప్రభుత్వానికి మహాత్మా జ్యోతిరావు పూలె ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. -
వెయ్యి నోటుపై పూలే బొమ్మ ముద్రించాలి
► జేసీకి బీసీ విద్యార్థి నాయకుల వినతి పెద్దపల్లిరూరల్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేయనున్న వెయ్యి రూపాయల నోటుపై బీసీ ఉద్యమ నేత, మహాత్మా జ్యోతిబాపూలే బొమ్మను ముద్రించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఇన్ చార్జి పిట్టల రమేశ్ కోరారు. కలెక్టరేట్లో జేసీ ప్రభాకర్‌రెడ్డికి బీసీ నాయకులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. సామాజిక మార్పు కోసం కృషి చేయడంతోపాటు మహిళలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించిన మహనీయుడు పూలే అని, భారతదేశం గర్వించే నేత చిత్రాన్ని వెయ్యి నోటుపై ముద్రించాలన్నారు. కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నోమూరి శ్రీధర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రేండ్ల మల్లికార్జున్, ఉపాధ్యక్షుడు బండి శ్రీకాంత్, జక్కుల శ్రీకాంత్ పాల్గొన్నారు.