వెయ్యి నోటుపై పూలే బొమ్మ ముద్రించాలి | Poole picture to print on thousand note | Sakshi
Sakshi News home page

వెయ్యి నోటుపై పూలే బొమ్మ ముద్రించాలి

Published Sat, Feb 4 2017 9:56 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

వెయ్యి నోటుపై పూలే బొమ్మ ముద్రించాలి

వెయ్యి నోటుపై పూలే బొమ్మ ముద్రించాలి

► జేసీకి బీసీ విద్యార్థి నాయకుల వినతి
పెద్దపల్లిరూరల్‌: కేంద్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేయనున్న వెయ్యి రూపాయల నోటుపై బీసీ ఉద్యమ నేత, మహాత్మా జ్యోతిబాపూలే బొమ్మను ముద్రించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఇన్ చార్జి పిట్టల రమేశ్‌ కోరారు. కలెక్టరేట్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డికి బీసీ నాయకులు  శుక్రవారం వినతిపత్రం సమర్పించారు.

సామాజిక మార్పు కోసం కృషి చేయడంతోపాటు మహిళలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించిన మహనీయుడు పూలే అని, భారతదేశం గర్వించే నేత చిత్రాన్ని వెయ్యి నోటుపై ముద్రించాలన్నారు. కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నోమూరి శ్రీధర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రేండ్ల మల్లికార్జున్, ఉపాధ్యక్షుడు బండి శ్రీకాంత్, జక్కుల శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement