బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మూ సీ ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు చెబుతోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌కు సెపె్టంబర్‌లో పంపించిన ప్రతిపాదనల్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అని స్పష్టంగా రాసి ఉందని, కానీ, శాసనమండలి సాక్షిగా మంత్రి శ్రీధర్‌బాబు మాత్రం మూసీ ప్రాజెక్టు కాదు.. మురుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కోరామని తప్పుడు సమాధానం చెప్పారని విమర్శించారు.
ప్రపంచ బ్యాంకుకు మూసీ కోసం ఋణం అడిగిన సాక్ష్యాధారాల నివేదికల ప్రతులను ఆమె విడుదల చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో రుణం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచి్చన ఏడాదిలోనే సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ, హైదరాబాద్‌ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకుకు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో రియల్ ఎస్టేట్, ల్యాండ్ పూలింగ్ చేసి భవంతులు కడతామని స్పష్టంగా పేర్కొందని కవిత విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment