ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. కాసేపట్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం | Telangana Assembly Special Session Feb 4th Live Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. అప్‌డేట్స్‌

Published Tue, Feb 4 2025 11:03 AM | Last Updated on Tue, Feb 4 2025 1:04 PM

Telangana Assembly Special Session Feb 4th Live Updates

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికను సభలో చర్చకు పెట్టనుంది ప్రభుత్వం. అంతకు ముందు సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశమైంది. ఈ భేటీలో నివేదికకు ఆమోదం లభించినట్లు సమాచారం. అయితే ఆ భేటీ కొనసాగుతుండడంతో.. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు సభను వాయిదా వేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కోరారు. దీంతో మధ్యాహ్నాం 2గం​. దాకా సమావేశాలు వాయిదా పడ్డాయి.

01:02PM

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ

  • కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించిన మంత్రి మండలి
  • సీఎం రేవంత్‌ అధ్యక్షతన ఈ ఉదయం నుంచి జరిగిన భేటీ
  • భేటీ కారణంగా.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు 2గం. వాయిదా

 

11:53AM
సభ వాయిదాపై హరీష్‌రావు సెటైర్‌

  • అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయడం ఏంటి?
  • కేబినెట్‌ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్‌ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్‌ బాబు కోరడం హాస్యాస్పదం
  • నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్‌ కాలేదు.. నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్‌ కాలేదు
  • ఇంకెప్పుడు ప్రిపేర్‌ అవుతారు?

:::ఎక్స్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు పోస్ట్‌

11:44AM
సభ వాయిదాపై బీఆర్‌ఎస్‌ నేతల ఫైర్‌

  • శాసన సభ ఎన్నడూ లేని విధంగా ప్రారంభమై వాయిదా పడింది 
  • ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఇలా జరగలేదు 
  • సభ బిజినెస్ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా వాయిదా వేశారు 
  • తెలంగాణ రాష్ట్రం ,శాసన సభ పరువు పోయింది 
  • కేబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని శాసన సభ ను వాయిదా వేస్తారా ? 
  • కేబినెట్ మీటింగ్ ,శాసన సభ సమావేశాల షెడ్యూల్ ముందే ఖరారు చేశారు 
  • మళ్ళీ మార్పులు ఎందుకు చేశారు 
  • ఒక్క నిమిషం లోనే సభ ను వాయిదా వేసుకోవడాన్ని బీ ఆర్ ఎస్ ఎల్పీ తీవ్రంగా ఖండిస్తున్నాం 

:::మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

  • కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చే గౌరవం ఇదేనా ? 
  • బీసీ గణన పై చర్చ అని వాయిదా వేస్తారా ? 
  • కేబినెట్ ముందు పెట్టకుండానే నిన్న కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టారు ? 
  • బీసీ లను కాంగ్రెస్ మోసం చేస్తోంది 
  • మొదట్నుంచి కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకంగా 
  • మా జీవితం లో ఈ తరహా లో అసెంబ్లీ ని చూడాలేదు .
  • బీసీ గణన తప్పుల తడక 

:::మాజీ మంత్రి గంగుల కమలాకర్
 

  • తెలంగాణ లో నూటికి తొంభై శాతం బడుగు ,బలహీన వర్గాలు ,దళితులు ,గిరిజనులు ,మైనారిటీ లే ..
  • ఈ రోజు అసెంబ్లీ లో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు ..
  • షెడ్యూల్ ఇచ్చి మాట తప్పుతారా ? ..
  • కేబినెట్ సమావేశం నిన్న పెట్టుకుంటే ఏమయ్యేది ? ...
  • మమ్మల్ని సభకు పిలిచి అవమానించారు ..
  • మంత్రి శ్రీధర్ బాబు చెప్పగానే ఒక్క నిమిషం లో సభను స్పీకర్ వాయిదా వేశారు ..
  • స్పీకర్ సభ ను వాయిదా వేసే ముందు మమ్మల్ని అడగరా ? ..
  • సభ ను వాయిదా వేయడం కుట్ర పూరితం ..
  • సభ ను ఒక రోజే నిర్వహించడం అన్యాయం ..
  • నాలుగు రోజులు అయినా సభ పెట్టాలి ...
  • బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ..
  • బీసీ లు చైతన్యవంతులు కేసీఆర్ ఏం చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో గమనిస్తున్నారు ..
  • బీసీ ల కోసం మరో ఉద్యమం రాబోతోంది ..
  • తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఈ ఉద్యమం ఉండబోతోంది  

:::మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్


11.33AM
అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నేతలు


11.21AM
అవిశ్వాసం పెడతాం: బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది 

తొందర్లోనే ఈ ప్రభుత్వం పై అవిశ్వాసం పెడతాం ఇది ప్రజా విద్రోహ ప్రభుత్వం 

అవసరమైతే మజ్లిస్ తో చర్చించి అవిశ్వాసానికి వెళ్తాం 

పార్టీలకు అతీతంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం 

ప్రజాస్వామ్య యుతంగా ప్రజా ప్రభుతాన్ని ఏర్పాటు చేస్తాం 

కాంగ్రెస్ లో నిరాశ, నిస్పృహల్లో ఉన్న mla లతో చర్చించి వారిని ప్రభుత్వంలో చేర్చుకుంటాం

:::రాకేష్‌ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే


11.13AM
ఒక్క నిమిషానికే వాయిదానా?: బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

  • స్పీకర్ గడ్డం ప్రసాద్ వద్దకు BRS ఎమ్మెల్యేలు 
  • ఒక్క నిమిషంలో సభను వాయిదా వేయడం ఏంటి?: బీఆర్‌ఎస్‌
  • అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు: బీఆర్‌ఎస్‌
  • బీసీలు, ఎస్సీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: బీఆర్‌ఎస్‌
  • శాసన సభను అర్ధాంతరంగా ఎలా వాయిదా వేస్తారు? అని ప్రభుత్వంపై స్పీకర్‌కు BRS ఫిర్యాదు  

 

11:07AM
తెలంగాణ అసెంబ్లీ వాయిదా

  • తెలంగాణ ప్రత్యేక శాసనసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా
  • కొనసాగుతున్న కేబినెట్‌ భేటీ
  • మంత్రులు లేకపోవడంతో వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరిన శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు
  • అంగీకరించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌.. మధ్యాహ్నాం లంచ్‌ తర్వాత కొనసాగనున్న సమావేశం
     

11:05AM

  • క్యాబినెట్ సమావేశం జరుగుతోంది: మంత్రి శ్రీధర్‌ బాబు
  • సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు సహచరు మాత్రులందరూ కేబినెట్లో ఉన్నారు: మంత్రి శ్రీధర్‌ బాబు
  • సభను వాయిదా వేయాలని స్పీకర్ను విజ్ఞప్తి చేస్తున్న: మంత్రి శ్రీధర్‌ బాబు

 

11:03AM
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం

10:50AM

ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక కు కేబినెట్ ఆమోదం..

SC వర్గీకరణ - శాతం

గ్రూప్ 1 - ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలు  సంచార కులాలు- 1%

గ్రూప్ 2 -  మాదిగ మాదిగ ఉప కులాలు - 9%

గ్రూప్ 3 --మాల మాలవకులాలు -5%

10:40AM
అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం


10:30AM

  • కులదరణ సర్వే 100% నిస్పాక్షికంగా జరిగింది.
  • హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 100కు 100% సర్వే జరిగింది.
  • హైదరాబాదులో కావాలని కొంతమంది సర్వేకు దూరంగా ఉన్నారు.
  • గ్రేటర్ సిటీలో మరికొందరు కావాలని సర్వే అధికారులపై కుక్కలు వదిలారు.
  • కుల గణన సర్వేపై అపోహలు వద్దు.
  • ప్రభుత్వంలో వ్యక్తిగా చెప్తున్న మాకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు.
  • బీసీల గురించి ఎవరైనా మాట్లాడితే బీసీ సామాజిక వర్గంలో చులకన అవుతారు.
  • బీసీలకు అన్యాయం చేసే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు.
  • మా ప్రభుత్వం ఏ పని చేసిన చిత్తశుద్ధితో పూర్తి చేస్తుంది

:: మంత్రి పొన్నం ప్రభాకర్‌

 

10:20AM

  • బీజేఎల్పీ లో BJP ఎమ్మెల్యేల సమావేశం  
  • అసెంబ్లీలో కులగణన షార్ట్ డిస్కషన్ పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
  • కాంగ్రెస్ పార్టీకి బిసి రిజర్వేషన్ల పెంపుపై చితశుద్ది లేదు - BJLP నేత మహేశ్వర రెడ్డి
  • రాజకీయ లబ్ధి కోణంలోనే కులగణన , అసెంబ్లీలో చర్చ - BJLP నేత మహేశ్వర రెడ్డి
  • మతప్రాతిపదికన ముస్లింలకి ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు ఎత్తివేయాలి - BJLP మహేశ్వర రెడ్డి
  • ఇప్పటికే దీనివల్ల గ్రేటర్ హైదరాబాద్ లో హిందూ బిసిలు నష్టపోయారు - BJLP నేత మహేశ్వర రెడ్డి
  • కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలకి ప్రభుత్వం వెళ్ళాలి - BJLP నేత మహేశ్వర రెడ్డి

10:04AM
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

09:30AM

  • నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..
  • ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం..
  • కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ నివేదిక లకు కేబినెట్ కు సమర్పించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ని సబ్ కమిటీ..
  • కులగణన,ఎస్సీ వర్గీకరణ నివేదిక లపై చర్చించి ఆమోదం తెలపనున్న కేబినెట్..
  • అనంతరం 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..
  • అసెంబ్లీ లో కేబినెట్ ఆమోదించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేధికను సభలో చర్చకు పెట్టనున్న ప్రభుత్వం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement