Updates: అసెంబ్లీలో వాడీవేడిగా కులగణనపై చర్చ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్నారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం.. ఈనివేదికకు ఆమోద ముద్ర వేసింది. 04:29PMతెలంగాణ శాసన మండలి నిరవధిక వాయిదా04:26PMమాకు మైక్ ఇవ్వకపోవడం అన్యాయం: KTRస్పీకర్ మైక్ ఇవ్వాలని BRS డిమాండ్.మైక్ ఇవ్వకపోవడం చాలా అన్యాయమన్న కేటీఆర్04:24PMబీజేపీ ఎమ్మెల్యేల నిరసన తమకు మైక్ ఇవ్వాలని స్పీకర్ పోడియం ముందు బీజేపీ సభ్యుల నిరసనబీసీలపై చర్చ సందర్భంగా.. బీసీలకు మైక్ ఇవ్వకుంటే ఎలా? అని నిలదీత04:22PMశాసనసభలో బీఆర్ఎస్ ఆందోళనసమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో పాల్గొన్న వాళ్లకే మైక్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరిన సీఎం రేవంత్కేటీఆర్ ప్రసంగం అనంతరం.. సీఎం అభ్యంతరంసర్వేకి, అసెంబ్లీకి సంబంధం ఏంటని బీఆర్ఎస్ ఆందోళనసీఎం వ్యాఖ్యలపై ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు04:17PMవాళ్లకు మైక్ ఇవ్వకండి అధ్యక్షా: సీఎం రేవంత్ రెడ్డిMCHRD వెబ్ సైట్ లో మాత్రమే ఎస్ కే ఎస్ రిపోర్ట్ ఉంది..దానికి ఎవరు ఓనర్ క్లెయిం చేయలేదుప్రభుత్వం మీద నమ్మకం లేకనే సర్వే లో పాల్గొనలేదన్న కేటీఆర్.. ఈ చర్చలో ఎలా పాల్గొంటారు?సర్వే లో పాల్గొనని వారికి మైక్ ఇవ్వొద్దని స్పీకర్ కోరిన సీఎం రేవంత్04:11PMఅధికార పక్షానికి కేటీఆర్ కౌంటర్సమగ్ర కుటుంబ సర్వే పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికారులకు గుర్తు చేశాం2014లో సమగ్ర కుటుంబ సర్వే జరిగిందిఆ సర్వేను చేయించింది ప్రభుత్వమే.. సమగ్ర కుటుంబ సర్వేను అధికారులే చేశారుఆ డాటాను పారదర్శకంగా వెబ్సైట్లోనూ ఉంచాంసమగ్ర కుటుంబ సర్వే 3కోట్ల 64లక్షలు పాల్గొన్నారు.ఆనాటి సర్వే ప్రకారం బీసీల సంఖ్య 1కోటి 85లక్షల మంది.. 51 శాతంముస్లిం బీసీలతో(10 శాతం) కలిపితే 61 శాతంకాంగ్రెస్ సర్వే రిపోర్ట్ ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నారుబీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలిఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు..మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి.42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడుతున్నారు అనుకున్నాంకాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం లేదు.04:08PMఎంఐఎం అక్బరుద్దీన్ ప్రసంగంరాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు 12.56 శాతంముస్లిం మైనారిటీ ఓసీలు: 2.48 శాతంకుల గణన రిపోర్ట్ సభలో పెట్టే విధానంపై అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహంకేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే సభలో పెట్టలేదని రేవంత్ ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ఏంటి?సభలో రిపోర్ట్ పెట్టకుండా.. కనీస సమయం ఇవ్వకుండా సూచనలు ఎలా? చేస్తారు?బలహీన వర్గాలకు చాలా కాలంగా అన్యాయం జరిగింది04:08PMవిపక్షాలకు సీఎం రేవంత్ కౌంటర్సర్వేలో ఎలాంటి తప్పులు లేవుసర్క్యూలేట్ అవుతున్న డాక్యుమెంట్లోనూ తప్పులే ఉన్నాయిపాయల్ శంకర్ అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారురాష్ట్రంలో బీసీల సంఖ్య పెరిగిందిమా సర్వే ప్రకారం బీసీ జనాభా 56 శాతంకేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ఈ సర్వేలో పాల్గొనలేదుడీకే అరుణ సహా అనేక మంది నేతలూ పాల్గొనలేదుమోదీ ప్రధాని అయ్యాక ఇప్పటిదాకా ఎందుకు కులగణన చేపట్టలేదుకుల గణన చేపట్టింది ప్రజల సంక్షేమం కోసమేమా కులగణన నివేదిక 100కు వంద శాతం పారదర్శకమైందిఅపోహల సంఘం లెక్కలు కూడా తప్పుగానే ఉన్నాయిపాయల్ శంకర్‌ను బీఆర్ఎస్ నేతలు వాడుకుంటున్నారుసర్వేలో పాల్గొనని నేతలు ఇప్పటికైనా సహకరించండిస్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు సీట్లు ఇస్తాంచట్టం ప్రకారం కుదరకపోతే.. పార్టీ పరంగా ఇస్తాం బీసీ ల సంఖ్య తగ్గడం ఏంటి.. మిగతా సంఖ్య ఎలా పెరిగింది?తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలి:::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంత్రులు పదే పదే మాట్లాడడం సరైంది కాదు .అందరూ మాట్లాడాక చివర మాట్లాడితే మంచిది..:::తలసాని2014 సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి అసలు డాటా ఉందా?:::ఉత్తమ్గత ప్రభుత్వం చేసిన సర్వే ను తప్పు పడితే ఎలా..ప్రభుత్వం సర్వే పనికిరాదా?:::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ 03:49PM శాసన సభలో మంత్రి ఉత్తమ్ప్రతిపక్ష నేతలు ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.దేశంలో పదేళ్లు బీజేపీ ప్రభుత్వం ఉంది.. ఏ రాష్ట్రంలో అయినా బీసీ కులగణన చేశారా?తెలంగాణలో అత్యంత పారదర్శకంగా కులగణన జరిగింది.కాంగ్రెస్ స్లోగన్ ‘‘సోషల్ జస్టిస్’’ప్రతిపక్ష నేతలకు ఏమైనా అనుమానాలు ఉంటే.. ప్రజెంటేషన్ ఇస్తాం.ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న సూచనలు, సద్విమర్శలు తీసుకుంటాంఅపోహలను సృష్టిస్తే ఊరుకునేది లేదుజనాభా ను తగ్గించామని చెప్పడం సరైంది కాదునాలుగున్నర కోట్లు ,అయిదు కోట్లు అని అపోహలు సృష్టించడం సరైంది కాదు03:41PMశాసన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నివేదిక.. సమగ్ర ఇంటింటి కుల సర్వే.. ఎన్నో ఒడిదుకులు ఎదురుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగింది..స్వతంత్రం రాక ముందు 1931 ముందు కుల సర్వే జరిగింది.. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ కుల సర్వే జరగలేదుబలహీన వర్గాలకు మేమెంతో మాకంత ఉండాలని సమాచారం కులాల లెక్కలు లేక దాని ప్రకారమే ప్రభుత్వ పథకాల వచ్చేవిభారత్ జోడో యాత్ర లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరిగినప్పుడు చాలా వర్గాలకు ప్రాతినిధ్యం లేదు వారికి అవకాశాలు రావాలంటే ఎవరేంతో వారికి తెలవల్సిందే అని ఎన్నికల్లో చెప్పడం జరిగిందిబలహీన వర్గాలపై స్పష్టంగా మా విధానం చెప్పడం జరిగింది.. ఇచ్చిన మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందిఫిబ్రవరి 4 కేబినెట్ సమావేశం జరిగింది.. 16 న శాసన సభలో తీర్మానం చేసుకున్నాంపార్లమెంట్ ఎన్నికల తర్వాత చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగిందిలక్ష మంది ప్రభుత్వం ఉద్యోగులతో ఈ సర్వే చేసి సమాచారాన్ని సెకరించాం..1931 నుండి సమాచారం లేదు.. బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఇంకా న్యాయం చేయాలనుకుంటే సలహాలు సూచనలు చెప్పండిబలహీన వర్గాల శాఖ మంత్రిగా వాటన్నిటిని బలహీన వర్గాల అభివృద్ధికి తీసుకుపోతాంప్రతిదీ రాజకీయం చేసినట్టు.. బలహీన వర్గాల ఆకాంక్షలను రాజకీయం చేయకండి..తెలంగాణ అన్ని జిల్లాలో స్వేచ్చగా తమ ఆకాంక్ష ముందుకు తీసుకుపోవాలిఈ సమాచారాన్ని తీసుకొని భవిషత్ లో ఆయా వర్గాలకు న్యాయం చేయడానికి ఉపయోగపడతుందిబలహీన వర్గాల అభివృద్ధికి ఈ రోజు నుండి శకం ప్రారంభమైందితెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సమాచార సేకరణ దేశానికి రోల్ మోడల్..తెలంగాణ దేశానికి దిక్సూచినిన్న రాహుల్ గాంధీ పార్లమెంటు లో తెలంగాణ ప్రభుత్వం చేసిన సమగ్ర కుల సర్వే ప్రజా ప్రతినిధులకు గౌరవం అన్నారునివేదిక వచ్చిన తరువాత ముందుకు పోవడానికి రోడ్ మ్యాప్ తీసుకుపోవడానికి సభలో చర్చించుకొని భవిషత్ లో అందరికి మార్గదర్శకత్వం దొరుకుతుంది..తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు ఒక అవకాశం దొరుకుతుంది1986 లో మురళీధర్ రావు కమిషన్ వచ్చినప్పుడు విద్యార్థి నాయకుడిగా, మాజీమంత్రి గంగుల కమలాకర్ ,కేంద్ర మంత్రి బండి సంజయ్ కమిషన్ ఉద్యమంలో పాల్గొని నినదించినంబావి తరాలకు న్యాయం జరగడానికి బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి మా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జీవితంలో నాకు గొప్ప కార్యక్రమంఇప్పటి వరకు లెక్కలే లేవు... లెక్కలు తక్కువ ఎలా వస్తాయి.. ఇప్పుడు జరిగిన లెక్కల్ కొలమానం భవిష్యత్ లో మరోసారి సర్వే జరిగినప్పుడు మార్పు కనిపిస్తుంది.ప్రతి ఇంటికి వెళ్లి సహకరించిన సహకరించకపోయిన వారు ఇంటికి వెళ్లి స్వచ్ఛందంగా సమాచారాన్ని సేకరించాం.నివేదిక సబ్ కమిటీకి సమర్పించారుసబ్ కమిటీ లో చర్చించి కేబినెట్ లో పెట్టింది..బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తుంది2011 జనాభా లెక్కల్లో ఆనాడు తెలంగాణ లో 3 కోట్ల 50 లక్షలు ఉండేది.. ఇప్పుడు 3 కోట్ల 70 లక్షల మంది ఉన్నారు..కేంద్రం నుండి జనాభా ప్రాతిపదికన దక్షిణ ,ఉత్తర భారతదేశానికి నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు..దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు పాటించడం జనాభా తగ్గింది160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టీ లక్ష మంది ఉద్యుగులతో ఈ ప్రక్రియ చేపట్టింది..సలహాలు సూచనలు ఇవ్వండి..సున్నితమైన అంశం.చాలా కాలంగా ఎంతో మంది మేధావులు, సంఘాలు , ఉద్యమకారులుఈ సర్వే కోసం ఉద్యమిస్తే రాహుల్ గాంధీ గారీ ఆలోచనకు అనుగుణంగా ఎవరెంతో వారంతా తెలవాల్సిందే అని ఈ సర్వే జరిగింది..బలహీన వర్గాలకు న్యాయం జరగాలి...రోడ్డు మ్యాప్ రావాలి.. వారికి అందే కార్యక్రమాలపై ఆలోచన చేయాలిబలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్నప్పుడు దానికి మించిన సంతోషం లేదుఅందరూ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా బలహీన వర్గాల బిడ్డలు స్వాగతిస్తూ సలహాలు సూచనలు ఇవ్వండి..బలహీన వర్గాలకు న్యాయం జరగలేనే దానికన్నా మించిన సంతోషం ఇంకోటి ఉండదు..బలహీన వర్గాల మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజు10 సంవత్సరాలుగా కావాలనే ఉద్యమకారులు స్వాగతించాలి..గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బలహీన వర్గాల బిడ్డగా ,సబ్ కమిటీ సభ్యుడిగా , డిక్లరేషన్ చైర్మన్ గా, బలహీన వర్గాల మంత్రిగా కుల సర్వే తీర్మానం ప్రవేశ పెట్టే అదృష్టం కలిగింది..మన వర్గాలకు అన్నిటికీ న్యాయం జరిగే కార్యక్రమం.. అందరూ సలహాలు సూచనలు ఇవ్వండి బీసీలకు టిక్కెట్ లలో అన్యాయం జరుగుతుందిటిక్కెట్ వచ్చిన వాల్లలో కొంత మందిని గెలిపించారుబీసీ ముఖ్యమంత్రి అవుతాడనుకున్నాం::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీసీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ముందు.. బీజేఎల్పీగా బీసీ కి అవకాశం ఇస్తే బావుండేది.:::మంత్రి పొన్నం బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తొలగించింది మేము కాదు..కేంద్ర మంత్రి గా ఉన్న బీసీ నేత బండారు దత్తాత్రేయ ను మేము తొలగించలేదు..బీసీ లకు ప్రాధాన్యత ఇచ్చేదే మేము::మంత్రి శ్రీధర్ బాబుబలహీనవర్గాలు తమ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాయిబీఆర్ఎస్ హయాంలో బీసీలకు అధిక లబ్ధి జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ మంది కుల గణన సర్వేలో పాల్గొనలేదుతెలంగాణ కుల గణన సర్వేలో ఎస్సీ, బీసీ జనాభా తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది:::తలసాని శ్రీనివాస యాదవ్2: 45pmఅసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం..పార్లమెంట్ ఎన్నికల కారణం గా కులగణన కొంత ఆలస్యం అయింది: సీఎం రేవంత్ రెడ్డివివిధ రాష్ట్రాలలో సర్వే లు చేసి... పకడ్బందీగా కులగణన చేశాం: సీఎం రేవంత్ రెడ్డిలక్ష కు పైగా అధికారులతో కులగణన వివరాలు సేకరించారు: సీఎం రేవంత్ రెడ్డి76 వేల మంది ఉధ్యోగులు డేటా ఎంట్రీ చేశారు: సీఎం రేవంత్ రెడ్డికులగణనలో పాల్గొన్న వారందరిని ,పనిచేసిన వారందరినీ పార్టీ లకు అతీతంగా అభినందించాలి: సీఎం రేవంత్ రెడ్డి2: 21pmఅసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం.. కులగణన చేసిన విధానాన్ని సభలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎవరి జనాభా ఎంత అనే సైంటిఫిక్ డేటా లేదు: సీఎం రేవంత్ రెడ్డిఅందుకే కులగణన చేసాం: సీఎం రేవంత్ రెడ్డి1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదు: సీఎం రేవంత్ రెడ్డికేవలం ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు మాత్రమే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నాయి: సీఎం రేవంత్ రెడ్డి2: 21pmతెలంగాణ శాసన సభ లో కుల గణన రిపోర్ట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2: 20pmతెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం.. కులగణన,ఎస్సీ వర్గీకరణపై చర్చ 01:02PMముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీకులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించిన మంత్రి మండలిసీఎం రేవంత్ అధ్యక్షతన ఈ ఉదయం నుంచి జరిగిన భేటీభేటీ కారణంగా.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు 2గం. వాయిదా 11:53AMసభ వాయిదాపై హరీష్‌రావు సెటైర్అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయడం ఏంటి?కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదంనాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు.. నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదుఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?:::ఎక్స్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు పోస్ట్11:44AMసభ వాయిదాపై బీఆర్ఎస్ నేతల ఫైర్శాసన సభ ఎన్నడూ లేని విధంగా ప్రారంభమై వాయిదా పడింది ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఇలా జరగలేదు సభ బిజినెస్ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా వాయిదా వేశారు తెలంగాణ రాష్ట్రం ,శాసన సభ పరువు పోయింది కేబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని శాసన సభ ను వాయిదా వేస్తారా ? కేబినెట్ మీటింగ్ ,శాసన సభ సమావేశాల షెడ్యూల్ ముందే ఖరారు చేశారు మళ్ళీ మార్పులు ఎందుకు చేశారు ఒక్క నిమిషం లోనే సభ ను వాయిదా వేసుకోవడాన్ని బీ ఆర్ ఎస్ ఎల్పీ తీవ్రంగా ఖండిస్తున్నాం :::మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చే గౌరవం ఇదేనా ? బీసీ గణన పై చర్చ అని వాయిదా వేస్తారా ? కేబినెట్ ముందు పెట్టకుండానే నిన్న కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టారు ? బీసీ లను కాంగ్రెస్ మోసం చేస్తోంది మొదట్నుంచి కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకంగా మా జీవితం లో ఈ తరహా లో అసెంబ్లీ ని చూడాలేదు .బీసీ గణన తప్పుల తడక :::మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ లో నూటికి తొంభై శాతం బడుగు ,బలహీన వర్గాలు ,దళితులు ,గిరిజనులు ,మైనారిటీ లే ..ఈ రోజు అసెంబ్లీ లో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు ..షెడ్యూల్ ఇచ్చి మాట తప్పుతారా ? ..కేబినెట్ సమావేశం నిన్న పెట్టుకుంటే ఏమయ్యేది ? ...మమ్మల్ని సభకు పిలిచి అవమానించారు ..మంత్రి శ్రీధర్ బాబు చెప్పగానే ఒక్క నిమిషం లో సభను స్పీకర్ వాయిదా వేశారు ..స్పీకర్ సభ ను వాయిదా వేసే ముందు మమ్మల్ని అడగరా ? ..సభ ను వాయిదా వేయడం కుట్ర పూరితం ..సభ ను ఒక రోజే నిర్వహించడం అన్యాయం ..నాలుగు రోజులు అయినా సభ పెట్టాలి ...బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ..బీసీ లు చైతన్యవంతులు కేసీఆర్ ఏం చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో గమనిస్తున్నారు ..బీసీ ల కోసం మరో ఉద్యమం రాబోతోంది ..తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఈ ఉద్యమం ఉండబోతోంది :::మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్11.33AMఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ నేతలు11.21AMఅవిశ్వాసం పెడతాం: బీజేపీ ఎమ్మెల్యేతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది తొందర్లోనే ఈ ప్రభుత్వం పై అవిశ్వాసం పెడతాం ఇది ప్రజా విద్రోహ ప్రభుత్వం అవసరమైతే మజ్లిస్ తో చర్చించి అవిశ్వాసానికి వెళ్తాం పార్టీలకు అతీతంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ప్రజాస్వామ్య యుతంగా ప్రజా ప్రభుతాన్ని ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ లో నిరాశ, నిస్పృహల్లో ఉన్న mla లతో చర్చించి వారిని ప్రభుత్వంలో చేర్చుకుంటాం:::రాకేష్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే11.13AMఒక్క నిమిషానికే వాయిదానా?: బీఆర్ఎస్ ఫిర్యాదుస్పీకర్ గడ్డం ప్రసాద్ వద్దకు BRS ఎమ్మెల్యేలు ఒక్క నిమిషంలో సభను వాయిదా వేయడం ఏంటి?: బీఆర్ఎస్అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు: బీఆర్ఎస్బీసీలు, ఎస్సీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: బీఆర్ఎస్శాసన సభను అర్ధాంతరంగా ఎలా వాయిదా వేస్తారు? అని ప్రభుత్వంపై స్పీకర్‌కు BRS ఫిర్యాదు 11:07AMతెలంగాణ అసెంబ్లీ వాయిదాతెలంగాణ ప్రత్యేక శాసనసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదాకొనసాగుతున్న కేబినెట్ భేటీమంత్రులు లేకపోవడంతో వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరిన శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుఅంగీకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్.. మధ్యాహ్నాం లంచ్ తర్వాత కొనసాగనున్న సమావేశం 11:05AMక్యాబినెట్ సమావేశం జరుగుతోంది: మంత్రి శ్రీధర్ బాబుసీఎం, డిప్యూటీ సీఎంతో పాటు సహచరు మాత్రులందరూ కేబినెట్లో ఉన్నారు: మంత్రి శ్రీధర్ బాబుసభను వాయిదా వేయాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేస్తున్న: మంత్రి శ్రీధర్ బాబు 11:03AMతెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం10:50AMఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక కు కేబినెట్ ఆమోదం..SC వర్గీకరణ - శాతంగ్రూప్ 1 - ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలు సంచార కులాలు- 1%గ్రూప్ 2 - మాదిగ మాదిగ ఉప కులాలు - 9%గ్రూప్ 3 --మాల మాలవకులాలు -5%10:40AMఅసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం10:30AMకులదరణ సర్వే 100% నిస్పాక్షికంగా జరిగింది.హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 100కు 100% సర్వే జరిగింది.హైదరాబాదులో కావాలని కొంతమంది సర్వేకు దూరంగా ఉన్నారు.గ్రేటర్ సిటీలో మరికొందరు కావాలని సర్వే అధికారులపై కుక్కలు వదిలారు.కుల గణన సర్వేపై అపోహలు వద్దు.ప్రభుత్వంలో వ్యక్తిగా చెప్తున్న మాకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు.బీసీల గురించి ఎవరైనా మాట్లాడితే బీసీ సామాజిక వర్గంలో చులకన అవుతారు.బీసీలకు అన్యాయం చేసే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు.మా ప్రభుత్వం ఏ పని చేసిన చిత్తశుద్ధితో పూర్తి చేస్తుంది:: మంత్రి పొన్నం ప్రభాకర్ 10:20AMబీజేఎల్పీ లో BJP ఎమ్మెల్యేల సమావేశం అసెంబ్లీలో కులగణన షార్ట్ డిస్కషన్ పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చకాంగ్రెస్ పార్టీకి బిసి రిజర్వేషన్ల పెంపుపై చితశుద్ది లేదు - BJLP నేత మహేశ్వర రెడ్డిరాజకీయ లబ్ధి కోణంలోనే కులగణన , అసెంబ్లీలో చర్చ - BJLP నేత మహేశ్వర రెడ్డిమతప్రాతిపదికన ముస్లింలకి ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు ఎత్తివేయాలి - BJLP మహేశ్వర రెడ్డిఇప్పటికే దీనివల్ల గ్రేటర్ హైదరాబాద్ లో హిందూ బిసిలు నష్టపోయారు - BJLP నేత మహేశ్వర రెడ్డికామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలకి ప్రభుత్వం వెళ్ళాలి - BJLP నేత మహేశ్వర రెడ్డి10:04AMహైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి09:30AMనేడు తెలంగాణ కేబినెట్ భేటీ..ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం..కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ నివేదిక లకు కేబినెట్ కు సమర్పించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ని సబ్ కమిటీ..కులగణన,ఎస్సీ వర్గీకరణ నివేదిక లపై చర్చించి ఆమోదం తెలపనున్న కేబినెట్..అనంతరం 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..అసెంబ్లీ లో కేబినెట్ ఆమోదించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేధికను సభలో చర్చకు పెట్టనున్న ప్రభుత్వం..