Ponnam Prabhakar Goud
-
Updates: అసెంబ్లీలో వాడీవేడిగా కులగణనపై చర్చ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్నారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం.. ఈనివేదికకు ఆమోద ముద్ర వేసింది. 04:29PMతెలంగాణ శాసన మండలి నిరవధిక వాయిదా04:26PMమాకు మైక్ ఇవ్వకపోవడం అన్యాయం: KTRస్పీకర్ మైక్ ఇవ్వాలని BRS డిమాండ్.మైక్ ఇవ్వకపోవడం చాలా అన్యాయమన్న కేటీఆర్04:24PMబీజేపీ ఎమ్మెల్యేల నిరసన తమకు మైక్ ఇవ్వాలని స్పీకర్ పోడియం ముందు బీజేపీ సభ్యుల నిరసనబీసీలపై చర్చ సందర్భంగా.. బీసీలకు మైక్ ఇవ్వకుంటే ఎలా? అని నిలదీత04:22PMశాసనసభలో బీఆర్ఎస్ ఆందోళనసమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో పాల్గొన్న వాళ్లకే మైక్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరిన సీఎం రేవంత్కేటీఆర్ ప్రసంగం అనంతరం.. సీఎం అభ్యంతరంసర్వేకి, అసెంబ్లీకి సంబంధం ఏంటని బీఆర్ఎస్ ఆందోళనసీఎం వ్యాఖ్యలపై ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు04:17PMవాళ్లకు మైక్ ఇవ్వకండి అధ్యక్షా: సీఎం రేవంత్ రెడ్డిMCHRD వెబ్ సైట్ లో మాత్రమే ఎస్ కే ఎస్ రిపోర్ట్ ఉంది..దానికి ఎవరు ఓనర్ క్లెయిం చేయలేదుప్రభుత్వం మీద నమ్మకం లేకనే సర్వే లో పాల్గొనలేదన్న కేటీఆర్.. ఈ చర్చలో ఎలా పాల్గొంటారు?సర్వే లో పాల్గొనని వారికి మైక్ ఇవ్వొద్దని స్పీకర్ కోరిన సీఎం రేవంత్04:11PMఅధికార పక్షానికి కేటీఆర్ కౌంటర్సమగ్ర కుటుంబ సర్వే పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికారులకు గుర్తు చేశాం2014లో సమగ్ర కుటుంబ సర్వే జరిగిందిఆ సర్వేను చేయించింది ప్రభుత్వమే.. సమగ్ర కుటుంబ సర్వేను అధికారులే చేశారుఆ డాటాను పారదర్శకంగా వెబ్సైట్లోనూ ఉంచాంసమగ్ర కుటుంబ సర్వే 3కోట్ల 64లక్షలు పాల్గొన్నారు.ఆనాటి సర్వే ప్రకారం బీసీల సంఖ్య 1కోటి 85లక్షల మంది.. 51 శాతంముస్లిం బీసీలతో(10 శాతం) కలిపితే 61 శాతంకాంగ్రెస్ సర్వే రిపోర్ట్ ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నారుబీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలిఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు..మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి.42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడుతున్నారు అనుకున్నాంకాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం లేదు.04:08PMఎంఐఎం అక్బరుద్దీన్ ప్రసంగంరాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు 12.56 శాతంముస్లిం మైనారిటీ ఓసీలు: 2.48 శాతంకుల గణన రిపోర్ట్ సభలో పెట్టే విధానంపై అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహంకేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే సభలో పెట్టలేదని రేవంత్ ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ఏంటి?సభలో రిపోర్ట్ పెట్టకుండా.. కనీస సమయం ఇవ్వకుండా సూచనలు ఎలా? చేస్తారు?బలహీన వర్గాలకు చాలా కాలంగా అన్యాయం జరిగింది04:08PMవిపక్షాలకు సీఎం రేవంత్ కౌంటర్సర్వేలో ఎలాంటి తప్పులు లేవుసర్క్యూలేట్ అవుతున్న డాక్యుమెంట్లోనూ తప్పులే ఉన్నాయిపాయల్ శంకర్ అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారురాష్ట్రంలో బీసీల సంఖ్య పెరిగిందిమా సర్వే ప్రకారం బీసీ జనాభా 56 శాతంకేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ఈ సర్వేలో పాల్గొనలేదుడీకే అరుణ సహా అనేక మంది నేతలూ పాల్గొనలేదుమోదీ ప్రధాని అయ్యాక ఇప్పటిదాకా ఎందుకు కులగణన చేపట్టలేదుకుల గణన చేపట్టింది ప్రజల సంక్షేమం కోసమేమా కులగణన నివేదిక 100కు వంద శాతం పారదర్శకమైందిఅపోహల సంఘం లెక్కలు కూడా తప్పుగానే ఉన్నాయిపాయల్ శంకర్‌ను బీఆర్ఎస్ నేతలు వాడుకుంటున్నారుసర్వేలో పాల్గొనని నేతలు ఇప్పటికైనా సహకరించండిస్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు సీట్లు ఇస్తాంచట్టం ప్రకారం కుదరకపోతే.. పార్టీ పరంగా ఇస్తాం బీసీ ల సంఖ్య తగ్గడం ఏంటి.. మిగతా సంఖ్య ఎలా పెరిగింది?తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలి:::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంత్రులు పదే పదే మాట్లాడడం సరైంది కాదు .అందరూ మాట్లాడాక చివర మాట్లాడితే మంచిది..:::తలసాని2014 సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి అసలు డాటా ఉందా?:::ఉత్తమ్గత ప్రభుత్వం చేసిన సర్వే ను తప్పు పడితే ఎలా..ప్రభుత్వం సర్వే పనికిరాదా?:::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ 03:49PM శాసన సభలో మంత్రి ఉత్తమ్ప్రతిపక్ష నేతలు ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.దేశంలో పదేళ్లు బీజేపీ ప్రభుత్వం ఉంది.. ఏ రాష్ట్రంలో అయినా బీసీ కులగణన చేశారా?తెలంగాణలో అత్యంత పారదర్శకంగా కులగణన జరిగింది.కాంగ్రెస్ స్లోగన్ ‘‘సోషల్ జస్టిస్’’ప్రతిపక్ష నేతలకు ఏమైనా అనుమానాలు ఉంటే.. ప్రజెంటేషన్ ఇస్తాం.ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న సూచనలు, సద్విమర్శలు తీసుకుంటాంఅపోహలను సృష్టిస్తే ఊరుకునేది లేదుజనాభా ను తగ్గించామని చెప్పడం సరైంది కాదునాలుగున్నర కోట్లు ,అయిదు కోట్లు అని అపోహలు సృష్టించడం సరైంది కాదు03:41PMశాసన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నివేదిక.. సమగ్ర ఇంటింటి కుల సర్వే.. ఎన్నో ఒడిదుకులు ఎదురుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగింది..స్వతంత్రం రాక ముందు 1931 ముందు కుల సర్వే జరిగింది.. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ కుల సర్వే జరగలేదుబలహీన వర్గాలకు మేమెంతో మాకంత ఉండాలని సమాచారం కులాల లెక్కలు లేక దాని ప్రకారమే ప్రభుత్వ పథకాల వచ్చేవిభారత్ జోడో యాత్ర లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరిగినప్పుడు చాలా వర్గాలకు ప్రాతినిధ్యం లేదు వారికి అవకాశాలు రావాలంటే ఎవరేంతో వారికి తెలవల్సిందే అని ఎన్నికల్లో చెప్పడం జరిగిందిబలహీన వర్గాలపై స్పష్టంగా మా విధానం చెప్పడం జరిగింది.. ఇచ్చిన మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందిఫిబ్రవరి 4 కేబినెట్ సమావేశం జరిగింది.. 16 న శాసన సభలో తీర్మానం చేసుకున్నాంపార్లమెంట్ ఎన్నికల తర్వాత చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగిందిలక్ష మంది ప్రభుత్వం ఉద్యోగులతో ఈ సర్వే చేసి సమాచారాన్ని సెకరించాం..1931 నుండి సమాచారం లేదు.. బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఇంకా న్యాయం చేయాలనుకుంటే సలహాలు సూచనలు చెప్పండిబలహీన వర్గాల శాఖ మంత్రిగా వాటన్నిటిని బలహీన వర్గాల అభివృద్ధికి తీసుకుపోతాంప్రతిదీ రాజకీయం చేసినట్టు.. బలహీన వర్గాల ఆకాంక్షలను రాజకీయం చేయకండి..తెలంగాణ అన్ని జిల్లాలో స్వేచ్చగా తమ ఆకాంక్ష ముందుకు తీసుకుపోవాలిఈ సమాచారాన్ని తీసుకొని భవిషత్ లో ఆయా వర్గాలకు న్యాయం చేయడానికి ఉపయోగపడతుందిబలహీన వర్గాల అభివృద్ధికి ఈ రోజు నుండి శకం ప్రారంభమైందితెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సమాచార సేకరణ దేశానికి రోల్ మోడల్..తెలంగాణ దేశానికి దిక్సూచినిన్న రాహుల్ గాంధీ పార్లమెంటు లో తెలంగాణ ప్రభుత్వం చేసిన సమగ్ర కుల సర్వే ప్రజా ప్రతినిధులకు గౌరవం అన్నారునివేదిక వచ్చిన తరువాత ముందుకు పోవడానికి రోడ్ మ్యాప్ తీసుకుపోవడానికి సభలో చర్చించుకొని భవిషత్ లో అందరికి మార్గదర్శకత్వం దొరుకుతుంది..తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు ఒక అవకాశం దొరుకుతుంది1986 లో మురళీధర్ రావు కమిషన్ వచ్చినప్పుడు విద్యార్థి నాయకుడిగా, మాజీమంత్రి గంగుల కమలాకర్ ,కేంద్ర మంత్రి బండి సంజయ్ కమిషన్ ఉద్యమంలో పాల్గొని నినదించినంబావి తరాలకు న్యాయం జరగడానికి బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి మా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జీవితంలో నాకు గొప్ప కార్యక్రమంఇప్పటి వరకు లెక్కలే లేవు... లెక్కలు తక్కువ ఎలా వస్తాయి.. ఇప్పుడు జరిగిన లెక్కల్ కొలమానం భవిష్యత్ లో మరోసారి సర్వే జరిగినప్పుడు మార్పు కనిపిస్తుంది.ప్రతి ఇంటికి వెళ్లి సహకరించిన సహకరించకపోయిన వారు ఇంటికి వెళ్లి స్వచ్ఛందంగా సమాచారాన్ని సేకరించాం.నివేదిక సబ్ కమిటీకి సమర్పించారుసబ్ కమిటీ లో చర్చించి కేబినెట్ లో పెట్టింది..బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తుంది2011 జనాభా లెక్కల్లో ఆనాడు తెలంగాణ లో 3 కోట్ల 50 లక్షలు ఉండేది.. ఇప్పుడు 3 కోట్ల 70 లక్షల మంది ఉన్నారు..కేంద్రం నుండి జనాభా ప్రాతిపదికన దక్షిణ ,ఉత్తర భారతదేశానికి నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు..దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు పాటించడం జనాభా తగ్గింది160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టీ లక్ష మంది ఉద్యుగులతో ఈ ప్రక్రియ చేపట్టింది..సలహాలు సూచనలు ఇవ్వండి..సున్నితమైన అంశం.చాలా కాలంగా ఎంతో మంది మేధావులు, సంఘాలు , ఉద్యమకారులుఈ సర్వే కోసం ఉద్యమిస్తే రాహుల్ గాంధీ గారీ ఆలోచనకు అనుగుణంగా ఎవరెంతో వారంతా తెలవాల్సిందే అని ఈ సర్వే జరిగింది..బలహీన వర్గాలకు న్యాయం జరగాలి...రోడ్డు మ్యాప్ రావాలి.. వారికి అందే కార్యక్రమాలపై ఆలోచన చేయాలిబలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్నప్పుడు దానికి మించిన సంతోషం లేదుఅందరూ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా బలహీన వర్గాల బిడ్డలు స్వాగతిస్తూ సలహాలు సూచనలు ఇవ్వండి..బలహీన వర్గాలకు న్యాయం జరగలేనే దానికన్నా మించిన సంతోషం ఇంకోటి ఉండదు..బలహీన వర్గాల మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజు10 సంవత్సరాలుగా కావాలనే ఉద్యమకారులు స్వాగతించాలి..గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బలహీన వర్గాల బిడ్డగా ,సబ్ కమిటీ సభ్యుడిగా , డిక్లరేషన్ చైర్మన్ గా, బలహీన వర్గాల మంత్రిగా కుల సర్వే తీర్మానం ప్రవేశ పెట్టే అదృష్టం కలిగింది..మన వర్గాలకు అన్నిటికీ న్యాయం జరిగే కార్యక్రమం.. అందరూ సలహాలు సూచనలు ఇవ్వండి బీసీలకు టిక్కెట్ లలో అన్యాయం జరుగుతుందిటిక్కెట్ వచ్చిన వాల్లలో కొంత మందిని గెలిపించారుబీసీ ముఖ్యమంత్రి అవుతాడనుకున్నాం::బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీసీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ముందు.. బీజేఎల్పీగా బీసీ కి అవకాశం ఇస్తే బావుండేది.:::మంత్రి పొన్నం బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తొలగించింది మేము కాదు..కేంద్ర మంత్రి గా ఉన్న బీసీ నేత బండారు దత్తాత్రేయ ను మేము తొలగించలేదు..బీసీ లకు ప్రాధాన్యత ఇచ్చేదే మేము::మంత్రి శ్రీధర్ బాబుబలహీనవర్గాలు తమ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాయిబీఆర్ఎస్ హయాంలో బీసీలకు అధిక లబ్ధి జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ మంది కుల గణన సర్వేలో పాల్గొనలేదుతెలంగాణ కుల గణన సర్వేలో ఎస్సీ, బీసీ జనాభా తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది:::తలసాని శ్రీనివాస యాదవ్2: 45pmఅసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం..పార్లమెంట్ ఎన్నికల కారణం గా కులగణన కొంత ఆలస్యం అయింది: సీఎం రేవంత్ రెడ్డివివిధ రాష్ట్రాలలో సర్వే లు చేసి... పకడ్బందీగా కులగణన చేశాం: సీఎం రేవంత్ రెడ్డిలక్ష కు పైగా అధికారులతో కులగణన వివరాలు సేకరించారు: సీఎం రేవంత్ రెడ్డి76 వేల మంది ఉధ్యోగులు డేటా ఎంట్రీ చేశారు: సీఎం రేవంత్ రెడ్డికులగణనలో పాల్గొన్న వారందరిని ,పనిచేసిన వారందరినీ పార్టీ లకు అతీతంగా అభినందించాలి: సీఎం రేవంత్ రెడ్డి2: 21pmఅసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం.. కులగణన చేసిన విధానాన్ని సభలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎవరి జనాభా ఎంత అనే సైంటిఫిక్ డేటా లేదు: సీఎం రేవంత్ రెడ్డిఅందుకే కులగణన చేసాం: సీఎం రేవంత్ రెడ్డి1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదు: సీఎం రేవంత్ రెడ్డికేవలం ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు మాత్రమే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నాయి: సీఎం రేవంత్ రెడ్డి2: 21pmతెలంగాణ శాసన సభ లో కుల గణన రిపోర్ట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2: 20pmతెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం.. కులగణన,ఎస్సీ వర్గీకరణపై చర్చ 01:02PMముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీకులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించిన మంత్రి మండలిసీఎం రేవంత్ అధ్యక్షతన ఈ ఉదయం నుంచి జరిగిన భేటీభేటీ కారణంగా.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు 2గం. వాయిదా 11:53AMసభ వాయిదాపై హరీష్‌రావు సెటైర్అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయడం ఏంటి?కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదంనాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు.. నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదుఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?:::ఎక్స్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు పోస్ట్11:44AMసభ వాయిదాపై బీఆర్ఎస్ నేతల ఫైర్శాసన సభ ఎన్నడూ లేని విధంగా ప్రారంభమై వాయిదా పడింది ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఇలా జరగలేదు సభ బిజినెస్ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా వాయిదా వేశారు తెలంగాణ రాష్ట్రం ,శాసన సభ పరువు పోయింది కేబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని శాసన సభ ను వాయిదా వేస్తారా ? కేబినెట్ మీటింగ్ ,శాసన సభ సమావేశాల షెడ్యూల్ ముందే ఖరారు చేశారు మళ్ళీ మార్పులు ఎందుకు చేశారు ఒక్క నిమిషం లోనే సభ ను వాయిదా వేసుకోవడాన్ని బీ ఆర్ ఎస్ ఎల్పీ తీవ్రంగా ఖండిస్తున్నాం :::మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చే గౌరవం ఇదేనా ? బీసీ గణన పై చర్చ అని వాయిదా వేస్తారా ? కేబినెట్ ముందు పెట్టకుండానే నిన్న కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టారు ? బీసీ లను కాంగ్రెస్ మోసం చేస్తోంది మొదట్నుంచి కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకంగా మా జీవితం లో ఈ తరహా లో అసెంబ్లీ ని చూడాలేదు .బీసీ గణన తప్పుల తడక :::మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ లో నూటికి తొంభై శాతం బడుగు ,బలహీన వర్గాలు ,దళితులు ,గిరిజనులు ,మైనారిటీ లే ..ఈ రోజు అసెంబ్లీ లో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు ..షెడ్యూల్ ఇచ్చి మాట తప్పుతారా ? ..కేబినెట్ సమావేశం నిన్న పెట్టుకుంటే ఏమయ్యేది ? ...మమ్మల్ని సభకు పిలిచి అవమానించారు ..మంత్రి శ్రీధర్ బాబు చెప్పగానే ఒక్క నిమిషం లో సభను స్పీకర్ వాయిదా వేశారు ..స్పీకర్ సభ ను వాయిదా వేసే ముందు మమ్మల్ని అడగరా ? ..సభ ను వాయిదా వేయడం కుట్ర పూరితం ..సభ ను ఒక రోజే నిర్వహించడం అన్యాయం ..నాలుగు రోజులు అయినా సభ పెట్టాలి ...బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ..బీసీ లు చైతన్యవంతులు కేసీఆర్ ఏం చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో గమనిస్తున్నారు ..బీసీ ల కోసం మరో ఉద్యమం రాబోతోంది ..తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఈ ఉద్యమం ఉండబోతోంది :::మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్11.33AMఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ నేతలు11.21AMఅవిశ్వాసం పెడతాం: బీజేపీ ఎమ్మెల్యేతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది తొందర్లోనే ఈ ప్రభుత్వం పై అవిశ్వాసం పెడతాం ఇది ప్రజా విద్రోహ ప్రభుత్వం అవసరమైతే మజ్లిస్ తో చర్చించి అవిశ్వాసానికి వెళ్తాం పార్టీలకు అతీతంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ప్రజాస్వామ్య యుతంగా ప్రజా ప్రభుతాన్ని ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ లో నిరాశ, నిస్పృహల్లో ఉన్న mla లతో చర్చించి వారిని ప్రభుత్వంలో చేర్చుకుంటాం:::రాకేష్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే11.13AMఒక్క నిమిషానికే వాయిదానా?: బీఆర్ఎస్ ఫిర్యాదుస్పీకర్ గడ్డం ప్రసాద్ వద్దకు BRS ఎమ్మెల్యేలు ఒక్క నిమిషంలో సభను వాయిదా వేయడం ఏంటి?: బీఆర్ఎస్అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు: బీఆర్ఎస్బీసీలు, ఎస్సీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: బీఆర్ఎస్శాసన సభను అర్ధాంతరంగా ఎలా వాయిదా వేస్తారు? అని ప్రభుత్వంపై స్పీకర్‌కు BRS ఫిర్యాదు 11:07AMతెలంగాణ అసెంబ్లీ వాయిదాతెలంగాణ ప్రత్యేక శాసనసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదాకొనసాగుతున్న కేబినెట్ భేటీమంత్రులు లేకపోవడంతో వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరిన శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుఅంగీకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్.. మధ్యాహ్నాం లంచ్ తర్వాత కొనసాగనున్న సమావేశం 11:05AMక్యాబినెట్ సమావేశం జరుగుతోంది: మంత్రి శ్రీధర్ బాబుసీఎం, డిప్యూటీ సీఎంతో పాటు సహచరు మాత్రులందరూ కేబినెట్లో ఉన్నారు: మంత్రి శ్రీధర్ బాబుసభను వాయిదా వేయాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేస్తున్న: మంత్రి శ్రీధర్ బాబు 11:03AMతెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం10:50AMఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక కు కేబినెట్ ఆమోదం..SC వర్గీకరణ - శాతంగ్రూప్ 1 - ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలు సంచార కులాలు- 1%గ్రూప్ 2 - మాదిగ మాదిగ ఉప కులాలు - 9%గ్రూప్ 3 --మాల మాలవకులాలు -5%10:40AMఅసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం10:30AMకులదరణ సర్వే 100% నిస్పాక్షికంగా జరిగింది.హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 100కు 100% సర్వే జరిగింది.హైదరాబాదులో కావాలని కొంతమంది సర్వేకు దూరంగా ఉన్నారు.గ్రేటర్ సిటీలో మరికొందరు కావాలని సర్వే అధికారులపై కుక్కలు వదిలారు.కుల గణన సర్వేపై అపోహలు వద్దు.ప్రభుత్వంలో వ్యక్తిగా చెప్తున్న మాకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు.బీసీల గురించి ఎవరైనా మాట్లాడితే బీసీ సామాజిక వర్గంలో చులకన అవుతారు.బీసీలకు అన్యాయం చేసే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు.మా ప్రభుత్వం ఏ పని చేసిన చిత్తశుద్ధితో పూర్తి చేస్తుంది:: మంత్రి పొన్నం ప్రభాకర్ 10:20AMబీజేఎల్పీ లో BJP ఎమ్మెల్యేల సమావేశం అసెంబ్లీలో కులగణన షార్ట్ డిస్కషన్ పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చకాంగ్రెస్ పార్టీకి బిసి రిజర్వేషన్ల పెంపుపై చితశుద్ది లేదు - BJLP నేత మహేశ్వర రెడ్డిరాజకీయ లబ్ధి కోణంలోనే కులగణన , అసెంబ్లీలో చర్చ - BJLP నేత మహేశ్వర రెడ్డిమతప్రాతిపదికన ముస్లింలకి ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు ఎత్తివేయాలి - BJLP మహేశ్వర రెడ్డిఇప్పటికే దీనివల్ల గ్రేటర్ హైదరాబాద్ లో హిందూ బిసిలు నష్టపోయారు - BJLP నేత మహేశ్వర రెడ్డికామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలకి ప్రభుత్వం వెళ్ళాలి - BJLP నేత మహేశ్వర రెడ్డి10:04AMహైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి09:30AMనేడు తెలంగాణ కేబినెట్ భేటీ..ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం..కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ నివేదిక లకు కేబినెట్ కు సమర్పించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ని సబ్ కమిటీ..కులగణన,ఎస్సీ వర్గీకరణ నివేదిక లపై చర్చించి ఆమోదం తెలపనున్న కేబినెట్..అనంతరం 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..అసెంబ్లీ లో కేబినెట్ ఆమోదించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేధికను సభలో చర్చకు పెట్టనున్న ప్రభుత్వం.. -
వ్యాక్సిన్ కోసం మోదీ ముందు ధర్నా చేయండి: పొన్నం
సాక్షి, హైదరాబాద్: పక్క రాష్ట్రాల్లో అల్లర్లు జరుగుతున్నాయంటూ దీక్షలు చేయడంకాదని, తెలంగాణలోని ఆరోగ్య పరిస్థితులపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర బీజేపీ నేతలకు మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఘర్షణలు జరిగాయని ఇక్కడ దీక్షలు చేస్తున్న బీజేపీ నేతలు కరోనా వ్యాక్సిన్ లేదని, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు లేవని మోదీ ముందు ధర్నా చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చే ఆందోళనలు చేయడం తెలంగాణ ప్రజలను అవమానపర్చడమేనని, నిజంగా బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర నేతలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. తెలంగాణకు దౌర్భాగ్యస్థితి పట్టింది: భట్టి సాక్షి, హైదరాబాద్: కరోనాతో రాష్ట్రం అతలాకుతమవుతున్న వేళ చిల్లర రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కారణంగా తెలంగాణకు దౌర్భా గ్యస్థితి పట్టిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్ర మార్క విమర్శించారు. ఇలాంటి సీఎం నాడు ప్రధా ని అయి ఉంటే పోలియో దెబ్బకు దేశంలోని సగంమంది అంగవైకల్యంతో బాధపడాల్సి వచ్చేదని ఎద్దేవా చేశారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. బుధవారం సీఎల్పీ కార్యాలయం నుంచి ఆయన జూమ్‌యాప్ ద్వారా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, పొడెం వీరయ్య హాజరై కరోనా పరిస్థితులపై చర్చించారు. అనంతరం జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా మొదటిదశ సమయంలోనే ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ఫీజులు నిర్ధారించాలని కోరామన్నారు.అప్పుడు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు జనాన్ని జలగల్లా పీల్చుకుతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ఇప్పు డు ఇంజక్షన్లుంటే ఆక్సిజన్ ఉండదు.. ఆక్సిజన్ ఉంటే బెడ్లు ఉండవు.. వెంటిలేటర్లుంటే టెక్నీషియ న్లు లేరు.. వ్యాక్సిన్లు లేవు.. ఆరోగ్య శాఖకు మంత్రి కూడా లేరు.. అని అన్నారు. కరోనాపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ఏమైందని భట్టి ప్రశ్నించారు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వాలి: జగ్గారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను సీఎం కేసీఆర్‌కు అధికారులు చెబుతున్నారో లేదోననే అనుమానం తమకుందని, అందుకే నేరుగా ఆయనతోనే మాట్లాడేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి కోరారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రజలు ఆక్సిజన్ లేక చనిపోతున్నారని, సీటీ స్కాన్ యంత్రాలు పనిచేయడం లేదని, ఉన్నా అవి పనిచేయడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని కోరారు. ప్రస్తుత తరుణంలో రాజకీయ విమర్శలు ముఖ్యం కాదని, ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యమో...భూముల పంచాయితీలు ముఖ్యమో తేల్చుకోవాలని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. -
ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీకి లేదు: పొన్నం
సాక్షి, సిద్ధిపేట : గత ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శనివారం హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల మీద మూడు లక్షల కోట్ల అప్పుల భారం మోపిన టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా.. యూనివర్సిటీలలో వీసీలను నియమించకుండా.. అనేక ప్రభుత్వ పాఠశాలను మూసివేసుకుంటూ పోతున్నడని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను దుయ్యబట్టారు. ఈచ్ వన్ టీచ్ వన్ అనే నినాదం తీసుకు వచ్చిన కేసీఆర్.. ఈచ్ వన్ టీచ్ వన్ అనే బదులు ఈచ్ వన్ డ్రీంక్ వన్ అన్నట్టుందని ఎద్దేవా చేశారు. నియంతృత్వ పోకడలు కలిగిన టీఆర్ఎస్ పార్టీని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లోప్రశ్నించే గొంతుక కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. -
వారు పార్టీలో ఉన్నా ఒకటే లేకున్న ఒకటే: పొన్నం
సాక్షి, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సెలెక్ట్ ఎలక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆశావాహులు కాంగ్రెస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురువారం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపికకు 15 మంది సభ్యులతో కమిటీ వేశామని అన్నారు. ఎంత మంది పార్టీని వీడినా, ఆఖరికి తాను కూడా వెళ్లినా కాంగ్రెస్ జీవనదిలాంటిదన్నారు. కరీంనగర్ కార్పోరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగుతుందని మంత్రి చెప్పడం అవాస్తవమని అన్నారు. కరీంనగర్లో టీఆర్ఎస్ సాధించిన అభివృద్ధిపై చర్చకు మంత్రి గంగుల సిద్ధమా అని సవాల్ విసిరారు. లండన్, న్యూయార్క్ లాగా కరీంనగర్‌ను చేస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు వేములవాడ దగ్గరున్న నీటిని చూపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. (జిల్లాల వారీగా కోఆర్డినేటర్ల నియామకం) దేశానికి కాంగ్రెస్ మాత్రమే రక్ష అని, మత విధ్వేషాలు రెచ్చగొడుతూ టీఆర్ఎస్, బీజేపీ ఆశాంతికి కారణమవుతున్నాదని ఆరోపించారు. కరీంనగర్లో పార్టీకి నష్టం కలగకుండా తొందరలోనే కమిటీ వేయాలని పార్టీని కోరారు. తాను నామినేషన్ వేసినప్పుడు రానోళ్లు ఈ పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని వ్యాఖ్యానించారు. ఎవరున్నా..లేకున్నా పార్టీకి జరిగే నష్టమేమీ లేదన్నారు. ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. వార్డుల విభజనలో అభ్యంతరాలు తీసుకున్నా.. వాటిని పరిగణలోకి తీసుకోలేదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల టికెట్లలో తాను ఎవరికీ సిఫారసు చేయనని స్పష్టం చేశారు. -
కాలగర్భంలో కలుస్తావు.. ఖబర్దార్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె గురించి గవర్నర్‌తో నివేదిక తెప్పించుకున్న కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గల్లీలో కొట్లాట, ఢిల్లీలో దోస్తానా అన్న చందంగా బీజేపీతో టీఆర్ఎస్ స్నేహం చేస్తోందని ఆరోపించారు. సెలవులు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్న సీఎం కేసీఆర్ గురించి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే వెంటనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఉద్యమ స్ఫూర్తిని అభినందిస్తున్నానన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు విభజించి.. పాలించే టీఆర్ఎస్ కుట్రలో చిక్కుకోకుండా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని.. ఆర్టీసీ కార్మికులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని విఙ్ఞప్తి చేశారు. కాలగర్భంలో కలుస్తావు.. ఖబర్దార్ ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్న ఎంఐఎం పార్టీకి ఆర్టీసీ సమస్యలు కనబడటం లేదా అని పొన్నం ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని అందుకే.. సమ్మె గురించి మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ‘ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేయించి కార్యకర్తలను, ప్రజలను కేసీఆర్ భయభ్రాంతులకు గురిచేశారు. కోర్టు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, తెలంగాణ సమాజం ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని కోరినా అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే కాలగర్భంలో కలుస్తావు. ఖబర్దార్ కేసీఆర్’అని హెచ్చరించారు. -
‘డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డిది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే’
సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెందిన ఆయన శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి వద్దకు చేరుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. (చదవండి : డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత) ఆయన మాట్లాడుతూ.. ‘శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కార్మికులు ఎవరు ధైర్యం కోల్పోవద్దు. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆర్టీసీ కార్మికుల ఉసురు కేసీఆర్కుతగులుతుంది. శ్రీనివాస్‌రెడ్డిది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యే’అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యo చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చీమకుట్టినట్టుగా కూడా లేదు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఆర్టీసీ సమ్మెకు ముందు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కొన్ని షరతులతో మద్దతు తెలిపిన మాట నిజమే. రేపు సీపీఐ పార్టీ అత్యవసర సమావేశంలో మద్దతు ఉపసంహరణపై చర్చిస్తాం’అన్నారు. (చదవండి : గూండాగిరీ నడవదు.. కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు) -
‘తెలంగాణ బీజేపీ నేతలు కొత్త బిచ్చగాళ్లు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఐసీయూలో ఉందని, గాంధీభవన్‌కు టులెట్ బోర్డు పెట్టుకోవాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తిప్పికొట్టారు. బీజేపీ నేతలు కొత్త బిచ్చగాళ్ల మాదిరి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చేసిన పనులేవో వివరించి జనం మనసు గెలవాలని హితవు పలికారు. 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన పార్టీ నేతలు.. నీతులు చెప్తున్నారని చురకలంటించారు. మురళీధర్ రావుకి అంత నమ్మకం ఉంటే.. కరీంనగర్ నుంచి ఎందుకు పోటీచేయలేదని పొన్నం ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు కవిత, వినోద్‌ను ఓడించాలన్నదే ప్రజల అభిమతమని.. అంతేగాని బీజేపీపై అభిమానం కాదన్నారు. 600 జడ్పీటీసీల్లో కనీసం ఆరు కూడా గెలవనోళ్లు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే తెలంగాణ బీజేపీ శాఖ పనిచేస్తోందని, టీఆర్ఎస్ బీజేపీ తోడుదొంగలని వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలకు దోస్తీ లేకుంటే.. కేసీఆర్ ముందుస్తు ఎన్నిలకు వెళ్లినప్పుడు కాషాయ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయానికి తాళం వేసే రోజులు వస్తాయని జోస్యం చెప్పారు. -
‘కిషన్‌ది ప్రభుత్వ హత్యే’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: మిడ్ మానేరు నిర్వాసితుల పాదయాత్రలో పాల్గొని గుండె పోటుతో మృతి చెందిన ఆరెపల్లి గ్రామానికి చెందిన కిషన్ కుటుంబ సభ్యులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ తదితరులు గురువారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కిషన్‌ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. మృతి చెందిన కిషన్‌కు ప్రభుత్వం తక్షణమే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తే.. కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తామన్నారు. ముంపు గ్రామంలో సీనియర్ అధికారిని నియమించి సమస్యలకు న్యాయమైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు పొన్నం. -
ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్‌కే
సాక్షి, వేములవాడ: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తమకే ఉందని, ఈసారి తప్పకుండా పొన్నం ప్రభాకర్ విజయం సాధిస్తారన్న ధీమా ఉందని, నియోజకవర్గ ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని రాజన్న ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ అన్నారు. తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి పోలింగ్ ఏర్పాట్లను బుధవారం పరిశీలించిన ఆయన తదనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసేందుకు పొన్నం ప్రభాకర్‌కు ఓటేసి గెలిపించాలని ఆది శ్రీనివాస్ కోరారు. దేశానికి రాహుల్‌గాంధీ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
కరీంనగర్ కింగ్ ఎవరు..?
సాక్షి, కరీంనగర్ : ఉత్తర తెలంగాణలో కీలక నియోజకవర్గంగా కరీంనగర్ లోక్‌సభ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డిసెంబర్ 7న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తికాగా సరిగ్గా 125 రోజులకు అంటే ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ సరళిలో లేదా ఓటర్ల తీర్పులో మార్పు ఉంటుందా? రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు, సీఎంను ఎన్నుకునే విషయంలో ఒక విధంగా, ప్రధానిని ఎన్నుకునే విషయంలో మరోలా ప్రజలు స్పందిస్తారా అనేది ఇప్పుడు కరీంనగర్ విషయంలో ఆసక్తికరంగా మారింది. అదీగాకుండా ఇటీవల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రావడంతో, మొత్తం మూడు ఎమ్మెల్సీ సీట్లలో రెండు కరీంనగర్ పరిధిలో ఉండడంతో లోక్‌సభ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ లోక్‌సభ స్థానంలో భారీ మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ పక్షాన ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌కుమార్ బరిలో నిలిచారు. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో వీరి మధ్య త్రిముఖపోరు నెలకొంటుందా లేక టీఆర్ఎస్–కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్–బీజేపీ మధ్య ద్విముఖ పోటీగా మారుతుందా అనేది వేచిచూడాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో గతంతో పోలిస్తే తమ జీవితాలు మెరుగ్గానే ఉన్నాయని, ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు, రైతులను ఆదుకునేందుకు మరిన్ని చర్యలు కావాలని ప్రజలు కోరుతున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇదీ పరిస్థితి సిరిసిల్ల: ఇది టీఆర్ఎస్కు పెట్టని కోట. సంస్థాగతం గా బలంగా ఉంది. గతంలో సిరిసిల్ల నుంచి గెలిచిన వారెవరూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించలేదు. 2014లో గెలిచి కేటీఆర్ మంత్రి అయ్యాక విస్తృతం గా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లు, వంతెనలు, ఇతర పనుల రూపంలో గత ఐదేళ్లలో రూ. వేలాది కోట్ల మేర నిధులు ఖర్చుచేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకున్నారు. ఇక్క డ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు కరువయ్యా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి నిరుత్సాహంతో ఉన్నారు. బీజేపీ పరిస్థితీ ఏమంత మెరుగ్గా లేదు. వేములవాడ: ఇది టీఆర్ఎస్కు బలమైన సెగ్మెంట్. గతంతో పోలిస్తే ఇక్కడ మంచినీటి సరఫరా మెరుగుపడింది. వేసవిలో తరచుగా ఎదురయ్యే సమస్యలు అంతగా లేవని స్థానికులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిరిసిల్ల, వేములవాడ ఇతర నియోజకవర్గాలు ప్రయోజనం పొందనున్నాయి. మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికే 60 నుంచి 70 శాతం దాకా తాగునీరు సరఫరా అవుతోంది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఇప్పుడు అందుబాటులో ఉంటున్నారని ప్రజలు అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కొంత ఉంటుంది. లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు ఇక్కడి వారితో అనుబంధం ఉంది. బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. హుజూరాబాద్: రాజకీయంగా టీఆర్ఎస్ బలంగానే ఉంది. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్లో అభివృద్ధి పనులు బాగానే చేపట్టారు. 2014తో పోలిస్తే గత ఎన్నికల్లో తన మెజారి టీ కొంత మేర తగ్గడంపై ఇటీవల కార్యకర్తల సమావేశంలో ఈటల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి లక్ష మెజా రిటీని సాధించడం ద్వారా దానిని భర్తీచేయాలని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి కొంత మేర మద్దతు దొరికే అవకాశాలున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ సామాజిక వర్గం వారు ఇక్కడ ఎక్కువమంది ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నుంచి జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ తుమ్మిడి సమ్మిరెడ్డి, వి.రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఇక్కడి యువకులు కొందరిపై వీహెచ్‌పీ, బజ్రంగ్దళ్ ప్రభావం ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో లోక్‌సభ అభ్యర్థి సంజయ్ కుమార్‌కు అనుకూల ప్రచారం సాగుతోంది. చొప్పదండి: అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ఇక్కడ పటిష్టంగానే ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో భారీ గా చేరికలు సాగాయి. కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయి లో పుంజుకోవాల్సి ఉంది. ప్రధాని మోదీ ప్రభావం యువతపై కొంత మేర ఉండే అవకాశాలున్నాయి. హిందుత్వ భావజాలం కారణంగా బీజేపీ అభ్యర్థిపై ఇక్కడి యువకులు ఆకర్షితులవుతున్నట్టు చెబుతున్నారు. కరీంనగర్: ఇక్కడ టీఆర్ఎస్కు సానుకూలత ఉంది. కాంగ్రెస్, బీజేపీ కంటే టీఆర్ఎస్ ఆశీర్వాద సభలు, రోడ్‌షోలు, కుల సంఘాల సమావేశాలతో ప్రచారం లో ముందుంది. వరస విజయాలతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు స్థానికంగా సంబంధాలు మరింత మెరుగయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసిన బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు. వీరిద్దరూ కూడా కరీంనగర్ పట్టణవాసు లు కావడంతో వారి మద్దతుదారులు పెద్దసంఖ్య లోనే ఉన్నారు. వీరికి బీసీ సామాజికవర్గాల ఓట్లు పడే అవకాశాలున్నాయి. సంస్థాగతంగా కాంగ్రెస్ ఇక్కడ బలంగానే ఉంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలొచ్చాక కాంగ్రెస్ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరారు. ఇది కాంగ్రెస్‌కు ప్రతికూలం కావచ్చు. హిందూ అనుకూల ఓటుబ్యాంక్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన సంజయ్ లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశమైంది. మానకొండూరు: ఇక్కడి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ప్రజలతో సంబంధాలు బాగానే ఉన్నాయి. టీఆర్ఎస్ కేడర్ బలంగానే ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిన సీనియర్ నేత ఆరేపల్లి మోహన్ తాజాగా టీఆర్ఎస్ లో చేరడం కాంగ్రెస్ పార్టీపై కొంత మేర ప్రభావం చూపొచ్చునని చెబుతున్నారు. సీనియర్‌నేత కవ్వం పల్లి సత్యనారాయణకు సముచిత స్థానం కల్పించడం ద్వారా ఆ నష్టం భర్తీకి పొన్నం చర్యలు తీసుకుంటున్నారు. హిందువుల కోసం పోరాడే వ్యక్తిగా సంజయ్‌కు ఇక్కడి యువతలో గుర్తింపు ఉంది. ఇక్కడ టీఆర్ఎస్–కాంగ్రెస్–బీజేపీల మధ్య పోటా పోటీగా ఉండొచ్చునని అంచనావేస్తున్నారు. హుస్నాబాద్: ఈ నియోజకవర్గాన్ని అన్నీ తానై మా జీ మంత్రి టి.హరీశ్‌రావు నడిపించారు. ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌తో పాటు తాను జవాబుదారీగా ఉం టూ ఇక్కడి ప్రజల్లో నమ్మకం కలిగించారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లోని కొంత భాగం కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాలో ఉంది. టీఆర్ఎస్కు స్థానిక నాయకులు, కార్యకర్తల మద్దతుంది. కాంగ్రెస్‌కు ఇక్కడ మద్దతుదారులున్నా పార్టీని చురుకుగా నడిపించే నాయకులు లేరు. ఇక్కడ కొంతమేర సీపీఐ ప్రభావం ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పెద్దగా కేడర్ లేదు. అభివృద్ధే ఎజెండా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందు కెళుతున్నాం. ప్రచారానికి వెళ్లినపుడు ప్రజల్లో స్పందన బాగుంటోంది. ఓటర్లు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో జాతీయస్థాయిలో తమ ఎంపీ ఉండాలని కరీంనగర్ ప్రజలు కోరుకుంటున్నారు. ఐదేళ్లలో రాష్ట్ర ఎంపీలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాం. నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు, మంజూర్లు పొందగలిగాం. కేంద్ర ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్కు పాత్ర ఉంటే ఇంకా సాధిస్తాం. విభజన చట్టంలో పేర్కొన్న తెలంగాణలోని ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయి. ఈసారి దానిని సాధించేందుకు కృషి చేస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి 4,5 వార్డుల్లో ప్రభావం చూపగలుగుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఆ పార్టీకి రావు. అందువల్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులెవరూ నాకు పోటీ కాదు. – బోయినపల్లి వినోద్‌కుమార్, టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఆయన ఓడినా నష్టమేం లేదు.. స్థానికుడిని. ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటాను. 2009–14 మధ్యకాలంలో ఎంపీగా సాధించిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఢిల్లీలో పోషించిన కీలకపాత్ర నన్ను గెలిపిస్తాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడినా ప్రజలకొచ్చే పెన్షన్లు, రైతుబంధు ఇతర సంక్షేమ పథకాలు ఆగిపోవు. రాష్ట్ర ప్రభుత్వంపై ఏ ప్రభావం పడదు. హిందూ–ముస్లింల మధ్య వైషమ్యాలు పెంచడం ద్వారా ఇక్కడ రాజకీయంగా లాభపడాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించవు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయడం పొరబాటు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని మిగతా 6 నియోజకవర్గాలను కవర్ చేశాక, చివరకు కరీంనగర్ అసెంబ్లీపై దృష్టి పెడదామనుకున్నా. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావడంతో అధిష్టానం ఆదేశాలతో పోటీ చేయాల్సి వచ్చింది. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా, కరీంనగర్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసే వ్యక్తిగా ప్రజలు ఈసారి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, ఇతర జిల్లాల బుద్ధిజీవులు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పే ఎంపీ ఎన్నికలపుడు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇస్తారని ఆశిస్తున్నాను. – పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ అభ్యర్థి నన్ను గెలిపించే ఆలోచనలో ఉన్నారు.. మరోసారి నరేంద్రమోదీని ప్రధానిని చేసేందుకు ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీగా నన్ను పంపించాలనే అభిప్రాయంతో ఇక్కడి ప్రజలున్నారు. నేను గెలిస్తే స్వయంగా ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసి, నియోజకవర్గ అభివృద్ధికి నేరుగా నిధులు తెచ్చే అవకాశం ఉంది. అదే టీఆర్ఎస్ నాయకుల విషయానికొస్తే వారు సీఎం కేసీఆర్‌నే కలిసే పరిస్థితే ఉండదు. లోక్‌సభ ఎన్నికలు జాతీయ రాజకీయాలకు సంబంధించినవి కాబట్టి ప్రజలు భిన్నమైన తీర్పునిస్తారనే నమ్మకముంది. ఇక్కడ టీఆర్ఎస్కు ఓటేసినా ఎంఐఎంకు వేసినట్టే. కాంగ్రెస్‌కు వేస్తే టీఆర్ఎస్కు వేసినట్లే. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడింది. బీజేపీకి గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని భావిస్తున్నాను. రెండు సార్లు అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చెందాననే సానుభూతి ప్రజల్లో ఉంది. ఏడు సెగ్మెంట్లలో బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. గతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్కు అవకాశమిచ్చినందున ఈసారి నన్ను గెలిపిద్దామనే ఆలోచనతో ప్రజలున్నారు. మాకు సైలెంట్ ఓటింగ్ పడుతుంది. – బండి సంజయ్‌కుమార్, బీజేపీ అభ్యర్థి లోక్‌సభ ఓటర్లు పురుషులు :8,07,233 మహిళలు : 8,25,565 ఇతరులు : 26 మొత్తం ఓటర్లు : 16,32,824 2018 అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ పరిధిలో పార్టీలకు పోలైన ఓట్లు టీఆర్ఎస్ 6,91,885 కాంగ్రెస్ 3,45,149 బీజేపీ 1,02,014 మొత్తం పోలైన ఓట్లు 15,42,685 -
‘పొన్నం’కు హ్యాట్రిక్ ఓటమి ఖాయం
సాక్షి, కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు హ్యాట్రిక్ ఓటమి తప్పదని ఏఎంసీ మాజీ చైర్మన్, కార్పొరేటర్ వై.సునీల్‌రావు అన్నారు. శనివారం కశ్మీర్‌గడ్డలోని ఎస్బీఎస్ ఫం క్షన్‌హాల్‌లో మాట్లాడుతూ.. పొన్నంను కాంగ్రెస్ అ భ్యర్థిగా ప్రకటించడంలోనే కాంగ్రెస్ బలహీనత నాయకత్వలేమి బయటపడిందన్నారు. క్యాడర్ మొత్తం నిరుత్సాహంలో ఉందని, వారంరోజుల్లో జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందన్నారు. అన్ని వ ర్గాలప్రజలు, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌పై విశ్వాసం ప్రకటిస్తున్నారని, కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కరీంనగర్ లో వినోద్‌కుమార్ ఎంపీగా స్మార్ట్‌సిటీ, నేషనల్ హైవేలు, కొత్తరైల్వే లైన్లు, పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వేలైన్, హైకోర్టు విభజన, కాళేశ్వరం అను మతులు, మిడ్‌మానేరు పూర్తి, రివర్స్ పంపింగ్ కార్యక్రమాల్లో శక్తివంచన లేకుండా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ నిర్వహించే టీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం బహిరంగసభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.నాయకులు చంద్రమౌళి, వినోద్, ఫహాద్, మహేశ్, వెంకటయ్య, నాంపల్లి, సంజీవ్, ఫరీద్, అనిల్, శంకర్, బాలు, నరేందర్, అంజన్‌రావు పాల్గొన్నారు. కేసీఆర్ సభను విజయవంతం చేయాలి కరీంనగర్ ఎంపీగా విజయం సాధించడానికి ఆదివారం స్పోర్ట్స్స్కూల్ మైదానంలో జరిగే కేసీఆర్ సభను విజయవంత చేయా లని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గుర్రాల మల్లేశం అన్నారు. శనివారం ప్రెస్‌భవన్‌లో మాట్లాడుతూ.. 7 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముదిరాజ్‌లు అధిక సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్ సభను విజయవంత చేయాలని పిలునిచ్చారు. సమావేశంలో లక్ష్మణ్, కోలిపాక మల్లికార్జున్, సత్తయ్య, పండుగ నాగరాజు, సిద్ది సంపత్, శ్రీకాంతం, శివ, నగునూరు మధుకర్, జడుగుల తిరుపతి, అట్లు శంకర్, అంజి, తిరుపతి తదితరులున్నారు. టీఆర్ఎస్ మైనార్టీసెల్ ఆధ్వర్యంలో శనివారం ప్రెస్‌భవన్‌లో మాట్లాడారు. కేసీఆర్ సభను విజయవంతం చేయాలని జిల్లా టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.శకురోద్దీన్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహమ్మద్ శుక్రోద్దీన్, అబ్దుల్ బషీర్, షాదుల్, గౌసోద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్ పొన్నంకే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అందరూ ఊహించినట్టుగానే కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మాజీ ఎంపీ, బీసీ వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌కే కరీంనగ ర్ ఎంపీ స్థానాన్ని ఖరారు చేసింది. అనూహ్యంగా తెరపైకి వచ్చిన మాజీమంత్రి, వికారాబాద్‌కు చెందిన ఏ.చంద్రశేఖర్‌కు పెద్దపల్లి సీటును కేటాయించింది. కరీంనగర్ సీటు పొన్నంకే ఖాయమని స్పష్టమైన సంకేతాలు ఉన్నా.. పెద్దపల్లి విషయంలోనే రెండురోజుల్లో మార్పులు జరిగాయి. పెద్దపల్లి నుంచి టికెట్ ఆశించిన స్థానిక నేతలు కవ్వంపల్లి సత్యనారాయణ, గోమాస శ్రీనివాస్, ఆరెపల్లి మోహన్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కాదని మాదిగ సామాజికవర్గానికి చెందిన ఏ.చంద్రశేఖర్‌కు కేటాయించారు. టీఆర్ఎస్ నుంచి మాజీఎంపీ వివేక్‌కు మరోసారి అవకాశం ఇస్తారని భావిస్తున్న తరుణంలో స్థానికేతరుడైన చంద్రశేఖర్ ప్రభావం ఎలా ఉంటుందోనని అంశం ఆసక్తికరంగా మారింది. అయితే వివేక్, ఆయన తండ్రి, కేంద్రమాజీ మంత్రి వెంకటస్వామి కూడా హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం. -
‘కరీంనగర్ రా తేల్చుకుందాం’
హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. గాంధీభవన్‌లో పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. 16 మంది ఎంపీలను గెలిపించాలన్న కేటీఆర్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య కాకుండా... ఇంతకుముందు ఉన్న 15 ఎంపీలతో టీఆర్ఎస్ సాధించింది ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 15 మంది ఎంపీలతో ఒక్క విభజన హామీ అయినా సాధించారా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణా కోసం పొన్నం ప్రభాకర్ ఏం చేశాడో కేటీఆర్.. నీ తండ్రిని అడగాలని హితవు పలికారు. అమరుల రక్తపు కూడు తింటున్నది కేసీఆర్ కుటుంబమేనని దుయ్యబట్టారు. అమరవీరుల శవాలపై కేటీఆర్ పేలాలు ఏరుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. 2004లో కాంగ్రెస్ భిక్షతోనే కేసీఆర్, కరీంనగర్ ఎంపీ అయింది వాస్తవం కాదా అని సూటిగా అడిగారు. తనపై మాట్లాడే ముందు కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. లక్ష రూపాయల జీతం కోసం అమెరికా వెళ్లిన కేటీఆర్.. నీకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కరీంనగర్ రా.. నేనేంటో నీవేంటో తెలుస్తది అంటూ సవాల్ విసిరారు. తెలంగాణా కోసం అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హెలికాఫ్టర్‌ను పేలుస్తానని నేనంటే.. కేటీఆర్ మాత్రం కిరణ్‌తో పైరవీలు చేసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ యువరాజుగా ఫీలవుతున్నావ్.. జాగ్రత్త అని సూచించారు. కేసీఆర్ అంటేనే అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అని ఢిల్లీలో రికార్డు ఉందని ఎద్దేవా చేశారు. అలాగే కేటీఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ పొన్నం విమర్శించారు. -
తెలంగాణ వ్యతిరేకి పవన్‌తో చర్చలా?
సాక్షి, నిజామాబాద్ : రాజ్‌భవన్ అప్రజాస్వామిక చర్యలకు వేదికగా మారిందని టీపీసీసీ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణను వ్యతిరేకించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో సీఎం కేసీఆర్ ఎలా చర్చలు జరుపుతారని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో రాజ్ భవన్‌కు ఉన్న విలువను తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి ఎందుకు వచ్చిందా? అని ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీకి ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశం మొత్తం ఏకకాలంలో ఎన్నికలనే నినాదం ఎత్తుకున్న మోదీ.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ కోసమే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సహకరించారని ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఎట్‌హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరైన విషయం తెలిసిందే. -
అభ్యర్థులతో కాదు.. డబ్బుసంచులతో పోటీపడ్డాం: పొన్నం
సాక్షి, కరీంనగర్ : ఎన్నికల్లో అభ్యర్థులతో కాకుండా.. డబ్బు సంచులతో పోటిపడ్డామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఫలితాలు తారుమారై, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజాకూటమిపై వ్యతిరేకంగా చేసిన ప్రచారం వారికే నష్టం కలిగించిందన్నారు. ముందస్తుగా శాసనసభను ఎందుకు రద్దు చేశారో చెప్పకపోవడాన్ని ప్రజలు గమనించారని చెప్పారు. తమ మేనిఫెస్టోపై విమర్శలు చేసిన టీఆర్ఎస్.. తిరిగి దాన్నే కాపీ కొట్టిందని ఎద్దేవ చేశారు. ప్రకటనల పేరిట కోట్లరూపాయలు ఖర్చు చేసామని చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. ఇప్పటికీ కేటీఆర్ 100 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారంటే.. ఫలితాలు తెలిసి భయపడైనా ఉండాలని, లేకుంటే ఈవీఎంలను మేనేజ్ అయినా చేసి ఉండాలని అనుమానం వ్యక్తం చేశారు. తాము వేసుకున్న కండువాలు చూసి కేటీఆర్ భయపడుతున్నారని, తమ పొత్తులు బహిరంగమన్నారు. కానీ టీఆర్ఎస్.. బీజేపీ,ఎంఐఎం కండువాలు వేసుకోకున్నా.. వారి పొత్తులు నిజం కదా? అని ప్రశ్నించారు. ఈవీఎంల వద్ద మా తరఫున మూడు షిప్ట్‌ల్లో కాపాలా కాస్తున్నామని తెలిపారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజం చేసానని తనపై టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. తాను పోటీ చేస్తున్నా అనగానే గంగులకు భయపట్టుకుందని, ప్రస్టేషన్‌తో ఇంట్లో టీవీ, సెల్ఫోన్లు పగులగొట్టుకున్నాడని తెలిపారు. అవినీతిపరుడైన గంగుల అన్ని విధాల ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. డబ్బులు, అహంకారం ఉన్నవాళ్లు చాలా మంది ఓడిపోయారన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారన్న అనుమానం ఉందని, అవసరమైతే గజ్వేల్‌లా అంతటా వీవీ ఫ్యాట్ స్లిప్‌లను లెక్కించాలని కోరుతామన్నారు. -
అలా అయితే తెలంగాణ ఏర్పడేది కాదు
కరీంనగర్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ ఢిల్లీ దాకా దేకుకుంటూ పోయినా రాష్ట్రం ఏర్పడేది కాదని వ్యాఖ్యానించారు. పిరికి వాళ్లు అభద్రతా భావంతో వ్యవహరించినట్లు కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ బంధం అనేక సందర్భాల్లో బయటపడిందని గుర్తు చేశారు. వారిద్దరి మధ్య ఫెవికోల్‌గా ఎంఐఎం ఉందని అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేసిందని తెలిపారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను విస్మరించి కేసీఆర్ మాటల గారడీతో కాలం గడిపారని ధ్వజమెత్తారు. పెన్షనర్లకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మిగిల్చిందని తీవ్రంగా విమర్శించారు. డబ్బు, మతంతో వచ్చేవారికి గుణపాఠం చెప్పాలని ప్రజల్ని కోరుతున్నామన్నారు. కేసీఆర్‌ది నోరా లేక మోరీయా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేతగాని దద్ధమ్మలు మమ్మల్ని విమర్శిస్తారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
అధికారంలోకి వస్తే బీసీ సబ్‌ప్లాన్ అమలు
హైదరాబాద్: బీసీల రాజకీయ చైతన్యాన్ని ఈ ఎన్ని కల్లో నిరూపించాల్సిన అవసరం ఉందనీ, తాము అధికారంలోకి వస్తే బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామని టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్లో ఆదివారం ‘బీసీల సమగ్ర ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి బీసీ డిక్లరేషన్’ పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ చేపట్టిన బీసీ బస్సు యాత్రతో అన్ని రాజకీయ పార్టీలు బీసీల వైపు చూస్తున్నాయన్నారు. ఇదే ఒరవడి కొనసాగించి అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం పెంచే దిశగా కృషి చేయాలని కోరారు. చట్టసభల్లో బీసీలు అడుగు పెట్టాలంటే అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండేసి ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని సూచించారు. ఆ స్థానాల్లో అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులను నిలబెడితే ధన ప్రవాహం పనిచేయకుండా బరిలో దిగిన అభ్యర్థి గెలిచినా, ఓడినా బీసీలే ఉంటారన్నారు. అప్పుడు కనీసం 34 మంది బీసీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో చూడవచ్చని అన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ దొంగచాటున అసెంబ్లీ టికెట్లను ప్రకటించినందున బీసీలు ఆశించిన స్థానాలు దక్కకపోయినా కాంగ్రెస్ లో మాత్రం వారికి ఎక్కువ స్థానాలు లభించేలా కృషి చేస్తానని అన్నారు. బీసీల పక్షాన అండగా నిలబడేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు ఈ పదవిని కట్టబెట్టారని, ఈ బాధ్యతను శిరసావహిస్తానని చెప్పారు. బీసీ సంఘం కూర్చిన మేనిఫెస్టో మహాకూటమి తరహాలో ఉండేలా చూస్తామన్నారు. అధికారంలోకి వస్తే బీసీ జనాభాకు దామాషా ప్రకారం నిధులు ఒక హక్కుగా దక్కడానికి బీసీ సబ్‌ప్లాన్ చట్టాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ... బీసీలకు అవకాశం వస్తే ఎవరికీ తీసిపోరని, అందుకు తానే ఒక ఉదాహరణ అని చెప్పారు. నాడు ఎన్టీఆర్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా మచ్చలేకుండా 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా ఈ స్థాయికి చేరుకున్నట్లు వివరించారు.మహా కూటమిలో బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం దక్కేలా తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు.బీసీ మేనిఫెస్టోలో పొందుపరిచిన డిమాండ్లను తాము అంగీకరిస్తున్నామని ఈ ఎజెండా అమలుకు పాటుపడతామని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించాలని డిమాండ్ చేశారు. దీన్ని అమలు చేసిన పార్టీలే అధికారంలోకి వస్తాయని, మోసపూరిత మాటలతో కాలం వెళ్లదీస్తే బీసీలు నమ్మడానికి సిద్ధంగా లేరని అన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ మిగతా 14 సీట్లు బీసీలకు ఇవ్వాలని, మహా కూటమి, బీజేపీ పార్టీలు సగం సీట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ ఏ సామాజిక వర్గానికీ లేని క్రీమీలేయర్ బీసీలపైన విధించడం దారుణం అని అన్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే దీన్ని ఎత్తివేస్తామని హామీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లా సూర్య ప్రకాశ్ (బీఎల్ఎఫ్), చెరుకు సుధాకర్(తెలంగాణ ఇంటిపార్టీ), కాసం వెంకటేశ్వర్లు (బీజేపీ), బోమ్మవోని ప్రభాకర్(సీపీఐ)లతో పాటుగా మేధావులు, విద్యావేత్తలు, కుల సంఘాల నేతలు హాజరై ప్రసంగించారు. కేసీఆర్‌కు బీసీల సమస్యలు పట్టవు: మధుయాష్కీ మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ... ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన బడుగులకు అసలు సిసలైన తెలంగాణ రాలేదని, నేడు సగం తెలంగాణ మాత్రమే వచ్చిందని అన్నారు. సంపూర్ణ తెలంగాణ రావాలంటే సామాజిక తెలంగాణ రావాలని ఉద్ఘాటించారు. ఫాం హౌస్‌కు పరిమితమైన కేసీఆర్‌కు బీసీల సమస్యలు పట్టవని అన్నారు. గొర్రెలు, బర్రెలతో మోసగించి బీసీలకు కేవలం 20 టికెట్లు ఇచ్చి ఫాం హౌస్‌కు పారిపోయారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అయినా, కాంగ్రెసైనా బీసీలకు అన్యాయం చేసినప్పుడు ఒక బీసీ బిడ్డగా ఎదిరిస్తానని అన్నారు.బీసీలకు ఈ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యమివ్వాలని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్‌కు ఆదేశాలు ఇచ్చారని, బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే విధంగా రాహుల్‌గాంధీని ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. -
‘బీజేపీ అభ్యర్థుల జాబితా ఖరారు చేసిన కేసీఆర్’
సాక్షి, హైదరాబాద్: విభజన హామీలు ఏవి కూడా అమలు కాకపోయినా బీజేపీకి టీఆర్ఎస్ అన్ని విషయాల్లో సహకరించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్‌కు వస్తున్నారని ప్రశ్నించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా అమిత్ షా కంటే మందు ఏసీబీ, ఈడీ అధికారులు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ-టీఆర్ఎస్లు కావాలనే కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నాయని మండిపడ్డారు. 119 స్థానాలలో పోటీ చేయడానికి బీజేపీకి అభ్యర్థులే లేరని, అందుకే టికెట్లు రాని వేరే పార్టీలలోని సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవ చేశారు. తెలంగాణలో బీజేపీకి వంద స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. ఉదయం తిట్టుకుంటారు.. సాయంత్రం.. ప్రధాని నరేంద్ర మోదీ-ఆపద్దర్మ సీఎం కేసీఆర్ ఇద్దరూ కలిసి పనిచేస్తున్న మాట వాస్తవమని, వారిద్దరి మధ్య ఫెవికాల్ బంధం ఉందని తెలిపారు. గతంలో గజ్వేల్ సభలో కేసీఆర్, నరేంద్ర మోదీ పరస్పరం పొగుడుకున్నారని గుర్తు చేశారు. ఇద్దరు పరస్పర అంగీకారంతోనే ఒకరిపైఒకరు విమర్శలు చేసుకోవడంలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పరిపాలనను కేంద్ర మంత్రులు అభినందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే టీఆర్ఎస్కు ఓటు వేసినట్లేనని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థుల లిస్టు కూడా కేసీఆరే రెడీ చేసి అమిత్ షాకు పంపించారని ఆరోపించారు. బీజేపీ-టీఆర్ఎస్ నేతలు ఉదయం తిట్టుకుంటారు.. సాయంత్రం కలుసుకుంటారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ గురించి బీజేపీకి కేసీఆర్ ముందే చెప్పారని, దానికి మోదీ-షాలు మద్దతిచ్చారని వివరించారు. తెలంగాణలో బలహీనవర్గాలకు చెందిన బండారు దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి కావాలని తప్పించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు వచ్చిన లాభమేమిలేదని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. -
‘అబద్దాల బ్రాండ్ అంబాసిడర్ హరీశ్’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ హుస్నాబాద్ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనాలు పెద్దగా సభకు తరలి రాలేదన్నారు. సభ సక్సెస్ కాకున్నా విజయవంతం అయిందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సభలో ప్లెక్సీలు కట్టింది కూడా స్థానికేతరులేనని ఆరోపించారు. అభివృద్ధిపై ఏం చెప్పుకోలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ఉందన్నారు. అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అపద్ధర్మ మంత్రి హరీశ్ రావు అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. ఒక్క సారి టీఆర్ఎస్ను గెలిపిస్తేనే పూర్తికాలం కొనసాగలేదని.. మళ్లీ గెలిపిస్తే ఏడాదికే రద్దు చేయడరని నమ్మకమేంటని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పొన్నం ధీమా వ్యక్తం చేశారు. -
కేసీఆర్ మాటలు వింటే నవ్వొస్తోంది
సాక్షి, కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభలో హంగామా తప్ప ఏమీ లేదని, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభను చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. సభ అట్టర్ ఫ్లాఫ్ అయిందనడానికి సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో నుంచి తీసిని ఏరియల్ వ్యూ విజువల్సే సాక్ష్యమన్నారు. పత్రికలు మాత్రం గోరింతలను కొండంతలు చేశాయన్నారు. దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పత్రికలకు ముందస్తు ఎన్నికలంటూ లీకులిచ్చి ఇప్పుడేమో మ్యానిఫెస్టో కమిటీ త్వరలో వేస్తానంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రజాసంఘాలు టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. విరసం నేత వరవరరావు అరెస్ట్‌పై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదన్నారు. ఢిల్లీ దగ్గర మోకరిల్లుతామని మమ్మల్ని విమర్శిస్తున్న కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర మోకరిల్లడం లేదా అని ప్రశ్నించారు. ఫెడరల్ విధానంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎంతో కీలకమని తెలిపారు. ప్రధాన మంత్రిని ‘ఇస్తావా చస్తావా’ అని బెదిరించి జోనల్ విధానాన్ని సాధించానని చెబితే నవ్వొచ్చిందన్నారు. ఇదే మాట నాలుగేళ్ల కింద ఎందకడగలేదని నిలదీశారు. ముస్లిం, గిరిజిన రిజర్వేషన్లపై ఇదే తరహాలో మోదీని ఎందుకు అడగడం లేదన్నారు. విభజన హామీలు ఎందుకు సాధించలేక పోయావని ప్రశ్నించారు. రాష్ట్రంలో 15 రోజుల్లోనే 500 పైగా రైతులు చనిపోయారని, రాష్ట్రంలో హెల్త్ ఎమ్మెర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విద్యుత్ ఉద్యోగులకు జీతాలు పెంచిన కేసీఆర్.. హరీశ్ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నందుకే ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెంచడం లేదా అని ప్రశ్నించారు. -
ప్రగతి నివేదన ఎవరి కోసం?
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు కరీంనగర్ జిల్లా ప్రజలు ఎందుకు రావాలంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రగతి నివేదనపై ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగంగా చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. టీఆర్ఎస్ సభ పెడితే కాంగ్రెస్ నాయకుల లాగులు తడుస్తాయంటున్న నేతల మాటలను ఉటంకిస్తూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం చూస్తుంటే ఎవరి లాగులు తడుస్తున్నాయో అర్థమవుతోందని పొన్నం ఎద్దేవా చేశారు. జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చని పరిస్థితిలో ప్రగతి నివేదన సభకు జిల్లా ప్రజలు వెళ్లాల్సిన అవసరేమేముందన్నారు. ప్రగతి నివేదన ఎవరికోసం? ప్రగతి నివేదన సభ పెడుతోంది ప్రజల కోసమా లేదా బస్సులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల కోసమా అంటూ పొన్నం ఎద్దేవా చేశారు. రైతుబంధు బీమా అమల్లోకి వచ్చిన నాటి నుంచి 15 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 541 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. రైతుల కోసం పనిచేస్తున్నామంటూ చెప్పుకొనే టీఆర్ఎస్ ప్రభుత్వం.. సగటున రోజుకు 31 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలంటూ పొన్నం డిమాండ్ చేశారు. -
‘నాయిని’ తూటాలు లేని తుపాకీ: పొన్నం
సిరిసిల్ల: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తూటాలు లేని తుపాకీ లాంటివాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘అభివృద్ధి కనిపిస్తలేదా.. అయితే కంటి పరీక్షలు చేయించుకో? అనే నాయిని వ్యాఖ్యలపై పొన్నం మండిపడ్డారు. ‘మా కళ్లు బాగానే ఉన్నాయి.. మీరే మెదడు పరీక్ష చేయించుకోవాలి’అని హితవు పలికారు. మంత్రి కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలకే కాదు.. దేవుడికి ఇచ్చిన హామీని కూడా విస్మరించడంలో కేసీఆర్‌కు మించినోడు లేడని ధ్వజమెత్తారు. -
‘టీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషించింది’
సాక్షి, కరీంనగర్ : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. అవిశ్వాస తీర్మానంలో తెరాస శిఖండి పాత్ర పోషించిందని విమర్శించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సమక్షంలో టీఆర్ఎస్ అంగీకరించదని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు ఇవ్వమని తాము అడగడం లేదని, అక్కడి ఎంపీలు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వమని కోరుతున్నామన్నారు. ఏపీ పై తమ ప్రతి స్పందన కోరే ముందు తెలంగాణ ఇచ్చేముందు హోదా ఇవ్వడానికి టీఆర్ఎస్ అంగీకారం తెలిపిందో లేదో వినోద్ కుమార్ చెప్పాలన్నారు. విభజన హామీలపై పోరాడకుండా కాంగ్రెస్‌ను నిందించడం తగదన్నారు. పోలవరం కోసం ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసినప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణ పౌరుషాన్ని తాకట్టు పెట్టి కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ వేదికను ఉపయోగించుకోకుండా కాంగ్రెస్‌ను విమర్శించడం తగదని హెచ్చరించారు. మంత్రి పదవి ఇస్తే పోరాడేవాడా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హయంలో తాము తెలంగాణ కోసం పోరాటం చేశామని, టీఆర్ఎస్ నేతలు చరిత్ర మరచి మాట్లాడటం విడ్డూరంగా ఉందనన్నారు. చంద్రబాబు నాయుడు మత్రి పదవి ఇస్తే కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడేవాడా అని పోన్నం ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో హరీశ్ రావు యువతను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు పురిగొల్పారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను టీఆర్ఎస్ విమర్శించడం తగదని హెచ్చరించారు. -
కమీషన్ల కోసమే పథకాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తెలంగాణ ప్రభుత్వం తమ జేబులు నింపుకునేందుకు కమీషన్లకోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని.. 2019లో ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి, తిమ్మాపూర్, వీర్నపల్లి మండలం, కంచర్ల, మద్దిమల్ల, వీర్నపల్లి గ్రామాల్లో శనివారం మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, రాష్ట్ర నాయకుడు కేకే మహేందర్‌రెడ్డితో కలసి సుడిగాలి పర్యటన నిర్వహించారు. అటవీ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రభాకర్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌కు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదన్నారు. ఏ గ్రామంలో చూసినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులే కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. 2019లో కాంగ్రెస్‌పార్టీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సుద్దాల దేవయ్య మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్న కాలంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా అప్పటి అభివృద్ధే కనిపిస్తోందన్నారు. వివిధ గ్రామాలకు చెందిన పలువురు యువకులు పొన్నం సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సాహేబ్, సంగీతం శ్రీనివాస్, ఎస్కే. గౌస్, బుగ్గ కృష్ణమూర్తిశర్మ, బూత శ్రీనివాస్, లెంకల రాజు, జనార్దన్, సతీశ్, రవి, రాములునాయక్, మహిపాల్, శంకర్, అబ్బనవేణి సత్తయ్య, మద్దిమల్ల తిరుపతి, హైమద్హుస్సెన్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
దానం ఓ బచ్చా; ఆయనతో ఏమీ కాదు..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి దానం నాగేందర్‌పై కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్ నిప్పులు చెరిగారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ‘దానం ఓ బచ్చాగాడు. అతను చెప్పడం వల్లనే నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారనడం హస్యాస్పదం’ అని అంజన్‌కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. నాగేందర్ కాంగ్రెస్‌ను వీడడం వల్ల జరిగే నష్టమేమీ లేదని అన్నారు. అయినా, ఇప్పటికే పలుమార్లు పార్టీలు మారిన నాగేందర్ పార్టీని వీడడం ఒకందుకు మంచిదేనని అన్నారు. కాంగ్రెస్ తనకు అన్యాయం చేసిందని చెప్పుకు తిరుగుతున్న దానంకు సిగ్గుండాలని అన్నారు. హైదరాబాద్‌లో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. కబ్జాదారున్ని ఎందుకు చేర్చుకున్నారు..? ‘దానం నాగేందర్ భూ కబ్జాదారుడని హోం మంత్రి గతంలో అన్నారు. అలాంటి కబ్జాదారున్ని పార్టీలో ఎందుకు చేర్చుకున్నార’ని పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్పై మండిపడ్డారు. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌పై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. బీసీలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని చెప్పుకుంటున్న దానం.. టీఆర్ఎస్ పాలనలో బీసీల అభివృద్ధికి కేటాయించిన నిధులెన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. వలిగొండ ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు పొన్నం తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 15 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలకు దాసోహం.. దానం ఒక బీసీ అయివుండి అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహేశ్‌గౌడ్ విమర్శించారు. బీసీ సమస్యలపై ఏనాడూ పోరాడని దానం తనకు పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరేమిటో ప్రజలకు తెలుసునని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. -
కేజ్రీవాల్‌కు ఎందుకు సంఘీభావం తెలపలేదు?
సాక్షి, కరీంనగర్ : బీజేపీ తీరును వ్యతిరేకించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఐఏఎస్‌ల సమ్మెకు నిరసనగా ఆందోళన చేస్తున్న కేజ్రీవాల్‌కు ఎందుకు సంఘీభావం తెలపలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులు నలుగురు కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించినప్పుడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన హామీల అమలుపై టీఆర్ఎస్ కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ బీజేపీ చేతిలో శిఖండిలా మారరని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక శక్తుల కూటమి పేరుతో రాజకీయ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ అభివృద్ధిపై టీఆర్ఎస్ ప్రభుత్వం శీతకన్ను వేసిందని ధ్వజమెత్తారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై కేసీఆర్ కేంద్రంతో రహస్య ఒప్పందం చేసుకోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలను పాత జిల్లాల ప్రకారం చేపడుతున్నారనీ, మరి జిల్లాల విభజనను కేంద్రం ఎలా పరిగణలోకి తీసుకుంటుందని అన్నారు. -
ఈ ఫలితాలు మోదీ పతనానికి నాంది: పొన్నం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ పతనానికి నాంది అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఫలితాలు భవిష్యత్ కాంగ్రెస్ విజయానికి పునాది వేశాయన్నారు. 11 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాల్లో కేవలం ఒక ఎంపీ, ఒక అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగిందని, ఆ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ఘోర పరాజయం పాలైందని ఎద్దేవా చేశారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలకు మేఘాలయ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. యూపీలోని కైరానా లోక్‌సభ స్థానంలో ఆర్ఎల్డీ విజయం బీజేపీ వ్యతిరేక శక్తుల కలయికతోనే సాధ్యం అయిందన్నారు. -
నీ అయ్యకే బెదరం.. నువ్వెం చేస్తావ్
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): ‘సోనియా దయతో తెలంగాణ ఏర్పడితే పదవులు అనుభవిస్తూ అహంకారపూరితంగా మాట్లాడడం మంత్రి కేటీఆర్‌కే చెల్లింది.. నీ అయ్య కేసీఆర్‌కే బెదరం.. నిన్నా మొన్నా వచ్చిన నువ్వు కాంగ్రెస్‌ను ఏం చేస్తవ్’అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో శనివారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలకడం హేయమన్నారు. తెలంగాణ ఏర్పడితే పేదరికం పోతుందన్న టీఆర్ఎస్.. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. 2019 ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. -
టీఆర్ఎస్ సర్కార్‌పై పొన్నం ఫైర్
కరీంనగర్ : టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కరీంనగర్లో విలేకరులతో మాట్లాడుతూ..రైతులకు 24 గంటల కరెంట్ కావాలని ఎవరు అడిగారని..ఇప్పుడు 12 గంటల కరెంటు చాలని ఎవరు తీర్మానం చేయమన్నారని టీఆర్ఎస్ నేతలనుద్దేశించి ప్రశ్నించారు. జడ్పీలో తీర్మానం ప్రభుత్వ అనాలోచిత విధానాలకు నిదర్శనమన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మంత్రి ఈటల రాజేందర్ తీర్మానం చేయమనడం ఏం సూచిస్తుందని అడిగారు. నిధులు, విధుల విషయంలో చర్చించకుండా, ప్రజాసమస్యలపై చర్చించకుండా మొక్కుబడి సమావేశం నిర్వహించారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో విమర్శిస్తే కేసులు పెడతామంటే భయపడమని చెప్పారు. కేసీఆర్ దొంగ, అవినీతిపరుడని తప్పకుండా విమర్శిస్తామని హెచ్చరించారు. -
‘తెలంగాణలో ధృతరాష్టుడి పాలన’
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ధృతరాష్టుడి పాలన సాగుతోందని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పొన్నం మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి ఈటెల నియోజకవర్గంలో సబ్సిడీ ట్రాక్టర్లను టీఆర్ఎస్ కు చెందిన వారికే పంచిపెట్టారని ఆరోపించారు. సబ్సిడి ట్రాక్టర్లపై లోక్ అధాలత్, సీఎస్‌కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆర్టీఐ ద్వారా సబ్సిడీ ట్రాక్టర్ల అవినీతి బయటపడిందని, మంత్రి ఈటెల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులే అవినీతిని ప్రోత్సాహిస్తున్నారని, ఈ విషయంపై సీఎం కేసీఆర్, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్పందించాలన్నారు. రాష్ట్రంలోఒకవైపు మంత్రుల దౌర్జన్యం.. మరొకవైపు మంత్రుల పీఆర్ఓల దౌర్జన్యం నడుస్తోందని పొన్నం విమర్శించారు. -
ఇసుకదందాలో సీఎం కుటుంబం: పొన్నం
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఇసుకదందాలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు, బంధువుల హస్తం ఉందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణను అడ్డుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినా స్పందించలేదన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల హస్తం ఉందని రుజువు చేయడానికి ఆధారాలు తన దగ్గర సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. ఇసుక అక్రమ రవాణను అడ్డుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు. -
ఓటేసినా ఎంపీ పొన్నం ప్రభాకర్
-
‘బలవంతపు సంసారాన్ని ఏమంటారో.. మీ భార్యలనడగండి’
సీమాంధ్ర ఎంపీలపై టీ-ఎంపీలు పొన్నం, గుత్తా ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: ‘‘సంసారమైనా, వ్యాపారమైనా బలవంతంగా చేయండంటే.. దాన్ని ఏమంటారో మీ భార్యల్నే అడిగి చెప్పండి’’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు సీమాంధ్ర ఎంపీలపై ధ్వజమెత్తారు. వారు గురువారమిక్కడ ఏపీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం చేశాక సైతం దానిని అడ్డుకుంటామని, విభజన జరగదని సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. పార్టీ నిర్ణయంపై గౌరవం లేకుండా, ధిక్కార ధోరణితో వారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గురువారం లోక్‌సభలో సైతం ఉండవల్లి ప్రసంగాన్ని తాము అడ్డుకోలేదని, వాస్తవాలు చెప్పమని మాత్రమే అడిగామని అన్నారు. దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్టుగా సీమాం ధ్ర ఎంపీలు వ్యవహరిస్తున్నారని, వారి దొంగ నాటకాలను ఇకనైనా కట్టిపెట్టాలని సూచించారు. ఏపీ ఎన్జీవోల సభకు అనుమతివ్వడం ద్వారా సీఎం విద్వేషాలను మరింత పెంచుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘా తం కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న వారంతా విభజనను సమర్థించాలని వారు సూచించారు. -
కేంద్రపాలిత ప్రాంతం అంటే ఒప్పుకోం: ఎంపి పొన్నం
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా ఆపుతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర నేతల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఎంపి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉండేవారికి ఎవరికీ ఎలాంటి హానీ జరగదని హామీ ఇచ్చారు. హైదరాబాద్ తెలంగాణ నడిబొడ్డున ఉందని చెప్పారు. అందువల్ల దానిని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటే తాము ఒప్పుకునేదిలేదని ఆయన స్పష్టం చేశారు.