సాక్షి, కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు హ్యాట్రిక్ ఓటమి తప్పదని ఏఎంసీ మాజీ చైర్మన్, కార్పొరేటర్ వై.సునీల్‌రావు అన్నారు. శనివారం కశ్మీర్‌గడ్డలోని ఎస్‌బీఎస్ ఫం క్షన్‌హాల్‌లో మాట్లాడుతూ.. పొన్నంను కాంగ్రెస్ అ భ్యర్థిగా ప్రకటించడంలోనే కాంగ్రెస్ బలహీనత నాయకత్వలేమి బయటపడిందన్నారు. క్యాడర్ మొత్తం నిరుత్సాహంలో ఉందని, వారంరోజుల్లో జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందన్నారు. అన్ని వ ర్గాలప్రజలు, టీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్‌పై విశ్వాసం ప్రకటిస్తున్నారని, కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కరీంనగర్ లో వినోద్‌కుమార్ ఎంపీగా స్మార్ట్‌సిటీ, నేషనల్ హైవేలు, కొత్తరైల్వే లైన్లు, పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వేలైన్, హైకోర్టు విభజన, కాళేశ్వరం అను మతులు, మిడ్‌మానేరు పూర్తి, రివర్స్ పంపింగ్ కార్యక్రమాల్లో శక్తివంచన లేకుండా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ నిర్వహించే టీఆర్‌ఎస్ ఎన్నికల శంఖారావం బహిరంగసభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.నాయకులు చంద్రమౌళి, వినోద్, ఫహాద్, మహేశ్, వెంకటయ్య, నాంపల్లి, సంజీవ్, ఫరీద్, అనిల్, శంకర్, బాలు, నరేందర్, అంజన్‌రావు పాల్గొన్నారు.
కేసీఆర్ సభను విజయవంతం చేయాలి
కరీంనగర్ ఎంపీగా విజయం సాధించడానికి ఆదివారం స్పోర్ట్స్‌స్కూల్ మైదానంలో జరిగే కేసీఆర్ సభను విజయవంత చేయా లని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గుర్రాల మల్లేశం అన్నారు. శనివారం ప్రెస్‌భవన్‌లో మాట్లాడుతూ.. 7 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముదిరాజ్‌లు అధిక సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్ సభను విజయవంత చేయాలని పిలునిచ్చారు. సమావేశంలో లక్ష్మణ్, కోలిపాక మల్లికార్జున్, సత్తయ్య, పండుగ నాగరాజు, సిద్ది సంపత్, శ్రీకాంతం, శివ, నగునూరు మధుకర్, జడుగుల తిరుపతి, అట్లు శంకర్, అంజి, తిరుపతి తదితరులున్నారు. టీఆర్‌ఎస్ మైనార్టీసెల్ ఆధ్వర్యంలో శనివారం ప్రెస్‌భవన్‌లో మాట్లాడారు. కేసీఆర్ సభను విజయవంతం చేయాలని జిల్లా టీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.శకురోద్దీన్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహమ్మద్ శుక్రోద్దీన్, అబ్దుల్ బషీర్, షాదుల్, గౌసోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment