సాక్షి, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చల్ల స్వరూపరాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో గురువారం మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అభ్యర్థులను చూడకుండా వారి వెనక ఉన్న తనను చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే అభ్యర్థులకు శ్రీరామ రక్ష అని, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలవలేరని ధీమా వ్యక్తం చేశారు. ఒకరో, ఇద్దరో గెలిస్తే వారు అభివృద్ధి చేయలేరని, పదవులు ప్రజలు ఓట్లు వేస్తే వచ్చేవని, ఆ పదవిని ప్రజల సేవ కోసం ఉపయోగించాలని హితవు పలికారు. ప్రజలు మెచ్చే పద్ధతిలో నాయకుల పని విధానం ఉండాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఇక హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలను అభివృద్ధి చేసింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని మంత్రి పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా: జగిత్యాలలోని పలు వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా:
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓ వ్యక్తిని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి వద్ద నుంచి రూ. 7లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కాగా డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు విచారణ జరుపుతున్నారు.
విద్యార్థుల ఆందోళన
పెద్దపల్లి జిల్లా: సుల్తాన్‌బాద్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీధర్ రావు తమ పట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కొందరు విద్యార్థులు కళాశాల భవనంపై వాటర్ ట్యాంక్ ఎక్కి యాజమాన్యం దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దిగేది లేదంటూ నిరసన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment