
సాక్షి, పెద్దపల్లి: బంగారు తెలంగాణ దొరల ఇంటికే పరిమితమైందని, పేదలకు ఇళ్లు లేవు, ఇంటికి తలుపులు లేవని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం పెద్దపల్లి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ దోచుకోడానికే అధికారంలోకి వచ్చాయని, అందుకే దొరల పాలన అంతం చేసి పేదల రాజ్యం తెచ్చుకోవాలన్నారు. ఒకవైపు మహిళల రక్షణ కోసం షీ టీమ్‌లు అని డబ్బాలు కొడుతున్నారని.. మరోవైపు బాలికలపై అధికార పార్టీ నేతలు అత్యాచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment