
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి మున్నిపల్‌లోని 18వ వార్డు కౌన్సిలర్‌గా టీఆర్‌ఎప్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా 21వ వార్డు నుంచి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోడలు, టీఆర్‌ఎస్ అభ్యర్థి మమతారెడ్డి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగార ప్రత్యర్థి అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో పెద్దపల్లిలో టీఆర్‌ఎస్ పార్టీ రెండు కౌన్సిలర్ పదవులను కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాలను అధికారులు రేపు(14వ తేదీ మంగళవారం) అధికారికంగా ప్రకటించనున్నారు.