ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీకి లేదు: పొన్నం | Ponnam Prabhakar Held A Municipal Election Meeting In Siddipet | Sakshi
Sakshi News home page

ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీకి లేదు: పొన్నం

Published Sat, Jan 4 2020 5:51 PM | Last Updated on Sat, Jan 4 2020 5:56 PM

Ponnam Prabhakar Held A Municipal Election Meeting In Siddipet - Sakshi

సాక్షి, సిద్ధిపేట : గత ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చని టీఆర్‌ఎస్‌  ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. శనివారం హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ  సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల మీద మూడు లక్షల కోట్ల అప్పుల భారం మోపిన టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఒక్క  టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా.. యూనివర్సిటీలలో వీసీలను నియమించకుండా.. అనేక ప్రభుత్వ పాఠశాలను మూసివేసుకుంటూ పోతున్నడని టీఆర్‌ఎస్‌ అధినేత  కేసీఆర్ను దుయ్యబట్టారు. ఈచ్‌ వన్ టీచ్‌ వన్  అనే నినాదం తీసుకు వచ్చిన కేసీఆర్‌.. ఈచ్‌ వన్ టీచ్‌ వన్ అనే బదులు ఈచ్‌ వన్ డ్రీంక్ వన్ అన్నట్టుందని ఎద్దేవా చేశారు. నియంతృత్వ పోకడలు కలిగిన  టీఆర్‌ఎస్‌ పార్టీని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సూచించారు.  మున్సిపల్ ఎన్నికల్లోప్రశ్నించే గొంతుక  కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని పొన్నం  ప్రభాకర్ కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement