తెలంగాణ: 2 కార్పొరేషన్‌, 5 మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ వశం | Telangana Municipal Elections 2021 Results Counting Live Updates | Sakshi
Sakshi News home page

Telangana: మినీ మున్సి ‘పోల్స్‌’ కౌంటింగ్‌, లైవ్‌ అప్‌డేట్స్‌

Published Mon, May 3 2021 7:16 AM | Last Updated on Mon, May 3 2021 8:19 PM

Telangana Municipal Elections 2021 Results Counting Live Updates - Sakshi

లైవ్‌ అప్‌డేట్స్‌:

గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లను కూడా టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది.

  • టీఆర్‌ఎస్ 51 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, రెండుచోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. 
  • ఖమ్మం కార్పొరేషన్‌లో 55 డివిజన్లు ఉండగా అత్యధిక డివిజన్లను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. 45 డివిజన్‌లలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు.

ఖమ్మం కార్పొరేషన్‌లో పొత్తులవారీగా..

టీఆర్ఎస్ + సీపీఐ =38
కాంగ్రెస్+ సీపీఎం = 11
బీజేపీ = 1
ఇతరులు = 2

తెలంగాణలో 5 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం

నకిరేకల్ (20):
టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6


కొత్తూరు (12):
టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5

అచ్చంపేట (20):

టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ 1

జడ్చర్ల (27):
టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 2, బీజేపీ 2

సిద్దిపేట (43):
టీఆర్ఎస్ 36, బీజేపీ 1, ఎంఐఎం 1, ఇతరులు 5

సిద్దిపేట మున్సిపాలిటీ జనరల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు

1వ వార్డు టీఆర్‌ఎస్
2వ వార్డు టీఆర్‌ఎస్
3వ వార్డు టీఆర్‌ఎస్
4వ వార్డు టీఆర్‌ఎస్
5వ వార్డు టీఆర్‌ఎస్
6వ వార్డు టీఆర్‌ఎస్ 
7వ వార్డు టీఆర్‌ఎస్
8వ వార్డు టీఆర్‌ఎస్
9వ వార్డు టీఆర్‌ఎస్
10వ వార్డు టీఆర్‌ఎస్
11వ వార్డు టీఆర్‌ఎస్
12వ వార్డు టీఆర్‌ఎస్
13వ వార్డు టీఆర్‌ఎస్
14వ వార్డు టీఆర్‌ఎస్
15వ వార్డు టీఆర్‌ఎస్
16వ వార్డు టీఆర్‌ఎస్
17వ వార్డు బీజేపీ 
18వ వార్డు టీఆర్‌ఎస్
19వ వార్డు టీఆర్‌ఎస్
20వ వార్డు స్వతంత్రుడు. కానీ టీఆర్‌ఎస్‌లో చేరిక
21వ వార్డు టీఆర్‌ఎస్
22వ వార్డు టీఆర్‌ఎస్
23వ వార్డు టీఆర్‌ఎస్
24వ వార్డు టీఆర్‌ఎస్
25వ వార్డు టీఆర్‌ఎస్
26వ వార్డు టీఆర్‌ఎస్
27వ వార్డు టీఆర్‌ఎస్
28వ వార్డు టీఆర్‌ఎస్
29వ వార్డు ఏఐఎంఐఎం
30వ వార్డు టీఆర్‌ఎస్
31వ వార్డు టీఆర్‌ఎస్
32వ వార్డు టీఆర్‌ఎస్
33వ వార్డు టీఆర్‌ఎస్
34వ వార్డు టీఆర్‌ఎస్
35వ వార్డు స్వతంత్ర
36వ వార్డు స్వతంత్ర
37వ వార్డు టీఆర్‌ఎస్
38వ వార్డు టీఆర్‌ఎస్
39వ వార్డు టీఆర్‌ఎస్
40వ వార్డు టీఆర్‌ఎస్
41వ వార్డు టీఆర్‌ఎస్
42వ వార్డు స్వతంత్ర
43వ వార్డు స్వతంత్ర
.................................
 43 వార్డుల్లో టీఆర్ఎస్ 36 సొంతం చేసుకోగా, స్వతంత్రులు ఐదుగురు, ఒక బీజేపీ, ఒక ఏఐఎంఎం సొంతం చేసుకున్నాయి.

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తాజా లెక్కింపు వివరాలు

  • మొత్తం డివిజన్లు 66 ఉండగా టీఆర్‌ఎస్‌ హవా సాగిస్తోంది.
  • టీఆర్‌ఎస్ 28 విజయం + 23 ఆధిక్యం = మొత్తం  51
  • బీజేపీ 8 విజయం, రెండింటిలో ఆధిక్యం = మొత్తం 10
  • ఒక చోట కాంగ్రెస్ విజయం, మరో చోట ఆధిక్యం
  • స్వతంత్రులు ఇద్దరు విజయం, ఒకరు ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం మూడు స్థానాలు


ఖమ్మం లెక్కింపు కేంద్రంలో గందరగోళం ..

ఒక డివిజన్  ఓట్లు మరో డివిజన్ బ్యాలెట్ బాక్స్ లో కంపించాయంటూ కాంగ్రెస్  అభ్యర్థి సుగుణ ఆందోళన. 11 డివిజన్ బ్యాలెట్ బాక్స్‌లో  24వ డివిజన్ ఓట్లలో ఎలా వచ్చాయంటూ ఆందోళన. కౌంటింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి. కన్నీళ్లు పెట్టుకుంటూ కౌంటింగ్ కేంద్రం ముందు ఆందోళన. రీపోలింగ్ జరపాలని డిమాండ్.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ అప్డేట్స్..

  • మూడు రౌండ్లు ముగిసేవరకు 28 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం..మరో 23 డివిజన్లలో ఆధిక్యం.
  • 7 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం.. మరో మూడు డివిజన్లలో లీడ్.
  • ఒక డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం. మరో డివిజన్లో లీడ్.
  • రెండు డివిజన్లలో స్వతంత్రులు  విజయం. మరో స్థానంలో లీడ్.
     


సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

  • రెండో రౌండ్లో‌ దూసుకుపోతున్న కారు..
  • 22, 23 , 24 , 25 , 26, 27 వార్డుల్లో కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత.
     

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 9, బీజేపీ 3, కాంగ్రెస్ 1, ఐఏఎఫ్ బీ ఒకరు గెలిచారు.
టీఆర్ఎస్ నుంచి
9వ డివిజన్ టీఆర్ఎస్ చీకటి శారద
13 వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి సురేష్ జోషి విజయం
23 డివిజన్ టీఆర్ఎస్ యెలగం లీలావతి
24 డివిజన్ టీఆర్ఎస్ రామ తేజస్విని విజయం
28వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి గందె కల్పన విజయం
29 డివిజన్ టీఆర్ఎస్ గుండు సుధారాణి
51వ డివిజన్ బోయినిపెల్లి రంజిత్ రావు
60వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి అభినవ్ భాస్కర్
61వ డివిజన్ టీఆర్ఎస్ ఎలకంటి రాములు గెలిచారు.
బీజేపీ
30 డివిజన్ రావుల కోమల
52 డివిజన్ చాడ స్వాతి
59వ డివిజన్ గుజ్జుల వసంత
ఇతరులు
22 డివిజన్ ఐఏఎఫ్ బీ అభ్యర్థి బస్వరాజు కుమార్
10వ డివిజన్ కాంగ్రెస్ తోట వెంకటేశ్వర్లు గెలిచారు.
2 డివిజన్‌లలో టీఆర్‌ఎస్ ముందంజ. 

10 టీఆర్‌ఎస్‌ గెలుపు. బీజేపీ 5, 3 డివిజన్‌లలో ముందంజలో  స్వంతంత్ర అభ్యర్థి 1 గెలుపు, 1 కాంగ్రెస్ గెలుపు

వరంగల్‌ : 6 డివిజన్ చెన్నం మధు టీఆర్‌ఎస్ గెలుపు
7 డివిజన్ వేముల శ్రీనివాస్ టీఆర్‌ఎస్ గెలుపు

ఖమ్మం..

ఖమ్మం కార్పొరేషన్ 30డివిజన్ల లెక్కింపు పూర్తి

టీఆర్‌ఎస్, సీపీఐ కూటమి -21 (టీఆర్‌ఎస్-19, సీపీఐ-2)

కాంగ్రెస్, సీపీఎం కూటమి-7 (కాంగ్రెస్ 6, సీపీఎం 1)

బీజేపీ-1

స్వతంత్ర -1

టీఆర్‌ఎస్-21
కాంగ్రెస్-07
బీజేపీ-01
స్వతంత్ర -01

నల్లగొండ: నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
నకిరేకల్ (20): టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6
రంగారెడ్డి: కొత్తూరు మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
కొత్తూరు (12): టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5
నాగర్‌కర్నూలు: అచ్చంపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
అచ్చంపేట (20): టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ 1
మహబూబ్‌నగర్: జడ్చర్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
జడ్చర్ల (27): టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 2, బీజేపీ 2

సిద్దిపేట: సిద్దిపేట 4 వ వార్డులో బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసిన  అభ్యర్థి లక్ష్మి మృతి .నాల్గు రోజుల నుంచి అనారోగ్యంతోబాధపడుతున్న లక్ష్మి సోమవారం మృతి చెందారు. 

ఖమ్మం: పోలింగ్‌ నాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఖమ్మం 57వ డివిజన్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించిం‍ది. పోలింగ్ రోజు 57వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్, టీఆరెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్‌ వాళ్ళు దొంగ ఓట్లు వేయించారని పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించి ఆందోళన చేశారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. దాంతో పోలీసులు రెండు సార్లు లాఠీ ఛార్జ్ చేశారు.

హైదరాబాద్‌: లింగోజీగూడ డివిజన్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్ధి దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి గెలుపొందారు. బల్దియాలో మూడుకు చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య. బీజేపీ కార్పొరేటర్ మృతితో లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నిక అనివార్యం అయింది.

నల్గొండ జిల్లా: నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
నకిరేకల్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో టీఆర్ఎస్ 12 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 2, ఇతరులు 5 వార్డుల్లో గెలుపొందారు.
►ఒకటో వార్డులో 190 ఓట్లు మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థి కందాల భిక్షం రెడ్డి గెలుపొందారు. 196 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
► రెండో వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీల్ కుమార్ 400 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
► మూడో వార్డులో టీఆర్ఎస్‌ అభ్యర్థి చింత స్వాతి త్రిమూర్తులు గెలిచారు.
► నాలుగో వార్డులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గాజుల సుకన్య విజయం సాధించారు.
► ఐదో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి వంటేపాక సోమలక్ష్మీ గెలుపొందారు.
► ఆరో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ మట్టిపల్లి కవిత విజయం సాధించారు.
► ఏడో వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండ శ్రీను గెలుపొందారు.
► ఎనిమిదో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పన్నాల పావని శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు.
► తొమ్మిదో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి చౌగోని రజిత విజయం సాధించారు.
► పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇ సునీత 74 మెజారిటీతో విజయం సాధించారు.
► 11వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మురారి శెట్టి ఉమారాణి గెలుపొదారు.
► 12వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోతు వెంకన్న విజయం సాధించారు.
► 13వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సునీత విజయం సాధించారు.
► 14వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గడ్డం స్వామి గెలుపొందారు. 
► 15వ వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి యసారపు వెంకన్న గెలిచారు. 
► 16వ వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి సైదుల విజయం సాధించారు.
►17వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లె విజయ్ గెలిచారు.
► 18వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి దైద స్వప్న రవీందర్‌ విజయం సాధించారు.
► 19వ వార్డులో రాచకొండ శ్రీను (టీఆర్ఎస్) గెలుపొందారు.
► 20వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాములమ్మ విజయం సాధించారు.

ఖమ్మం జిల్లా: ఖమ్మం కార్పొరేషన్‌ ఫలితాలు:
► ఒకటో డివిజన్ టీఅర్ఎస్ అభ్యర్థి తేజావత్ హుస్సేన్ గెలుపొందారు. 
► 2వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి వెంకటేశ్వర్లు గెలుపొందారు.
► 3వ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్తపల్లి నీరజ విజయం సాధించారు.
► 7వ డివిజన్‌లో బీజేపీ దొంగల సత్యనారాయణ గెలుపొందారు.
► 8వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సైదుల విజయం సాధించారు.
► 14వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బలరాజు విజయం సాధించారు.
► 20వ డివిజన్ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రశాంత్ లక్ష్మీ గెలుపొందారు. 
► 25వ డివిజన్‌లో టీఆఎస్‌ అభ్యర్థి చంద్రకళ గెలుపొందారు. 
► 31వ డివిజన్‌లో సీపీఎం అభ్యర్థి ఎర్ర గోపి విజయం సాధించారు.
► 37వ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఫాతిమా జోహార  విజయం సాధించారు.
► 43వ డివిజన్ నుంచి సీపీఐ అభ్యర్ధి క్లైమేట్ విజయం సాధించారు.
44వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయ గెలుపొందారు.
► 55వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి మోతారపు శ్రావణి విజయం సాధించారు.
► 56వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైడిపల్లి రోహిణి గెలుపొందారు.
ఖమ్మం కార్పొరేషన్‌ 30 డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మూడు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యింది. టీఆర్‌ఎస్‌,సీపీఐ కూటమి-21(టీఆర్‌ఎస్‌-19, సీపీఐ-2), కాంగ్రెస్, సీపీఎం కూటమి-07(కాంగ్రెస్‌-6, సీపీఎం-1), బీజేపీ-01, ఇండిపెండెంట్-01 గెలుపొందారు. 

వరంగల్‌: వరంగల్‌ కార్పొరేషన్‌ ఫలితాలు:
వరంగల్‌ కార్పొరేషన్‌లో కొనసాగుతున్నటీఆర్‌ఎస్‌ హవా. టీఆర్‌ఎస్‌ 23 డివిజన్లు, బీజేపీ 3 డివిజన్లు, కాంగ్రెస్‌ పార్టీ 1 డివిజన్‌లో ఆధిక్యంలో ఉన్నాయి. 
వరంగల్‌ కార్పొరేషన్‌లో కొనసాగుతున్నటీఆర్‌ఎస్‌ హవా. టీఆర్‌ఎస్‌ 23 డివిజన్లు, బీజేపీ 3 డివిజన్లు, కాంగ్రెస్‌ పార్టీ 1 డివిజన్‌లో ఆధిక్యంలో ఉన్నాయి. 

సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీ ఫలితాలు
► 1వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి  విజేందర్ రెడ్డి  గెలుపొందారు. 
► 2వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాయిని చంద్రం 364 ఓట్ల మెజారిటీ గెలిచారు.
► 3వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వంగ రేణుక తిరుమల్ రెడ్డి విజయం సాధించారు.
► 4వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండం కవిత గెలుపొందారు.
► 5వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనగోని వినోద్ విజయం సాధించారు.
► 6వ వార్డులో  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వడ్ల కొండ సాయి కుమార్ గెలుపొందారు. 
► 7వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల శ్రీదేవి 547 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
► 8వ వార్డులో  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి  వరాల కవిత విజయం సాధించారు.
► 9వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసుకుల సతీష్ 88 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 
► 10వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బింగి బాల్ లక్ష్మీ 222 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 
► 11వ  వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్ గెలుపొందారు.
► 12వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి అత్తెల్లి శ్రీనివాస్ 331 ఓట్లతో విజయం సాధించారు.
► సిద్దిపేట మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ దూసుకుపోతుంది. మొత్తం 43 వార్డుల్లో.. 14 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ మొదటి స్థానంలో ఉండగా.. బీజేపీ రెండో స్థానంలో ఉంది. 
► తొలి రౌండ్‌ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి. 12 వార్డుల్లో మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు 49. టీఆర్ఎస్ 44, బీజేపీ 2, ఇండిపెండెంట్ 3 ఓట్లు వచ్చాయి.
►మొదటి రౌండ్‌లో 21 వార్డుల్లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 19 వార్డుల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ-1, ఇండిపెండెంట్‌-1 గెలుపొందారు. 

మహబూబ్‌నగర్‌: అచ్చంపేట మున్సిపాలిటీ ఫలితాలు..
అచ్చంపేట మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ కైవసం అయ్యింది. 20 వార్డుల్లో కౌంటింగ్‌ పూర్తయ్యింది. టీఆర్‌ఎస్‌-13, కాంగ్రెస్‌-6, బీజేపీ-1 విజయం సాధించారు. 
ఒకటో వార్డు  కాంగ్రెస్ అభ్యర్థి గౌరి శంకర్ విజయం సాధించారు.
13వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అంతటి శివ గెలుపొందారు.

వరంగల్‌: పరకాల 9వ వార్డులో బీజేపీ విజయం
పరకాల 9వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. పరకాల మున్సిపాలిటీ 9 వార్డులో 215 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి పూర్ణచారి విజయం సాధించారు.

261ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి చిదురాల దేవేంద్ర రెండో స్థానంలో నిలిచారు. 131 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి దార్నా వేణుగోపాల్ మూడో స్థానంలో నిలిచారు.

రంగారెడ్డి: కొత్తూరు మున్సిపాలిటీ
► ఏడో వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కమ్మరి జయమ్మ 26 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 
► రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతోంది.

మహబూబ్‌ నగర్‌:  జడ్చర్ల మున్సిపాలిటీ
జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రెండు రౌండ్లలో ఫలితాలు కానున్నాయి.5 కౌంటింగ్ హాల్స్‌లో 19 టేబుల్స్‌  ఏర్పాటు చేశారు. 

► సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.
 తెలంగాణ మినీ మున్సి ‘పోల్స్‌’ కౌంటింగ్‌ ప్రారంభమైంది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లకు కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి చేశారు. నెగిటివ్‌ రిపోర్ట్‌ ఉన్నవారికే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతి ఉంటుంది.
 తెలంగాణ మినీ మున్సి ‘పోల్స్‌’ కౌంటింగ్‌ కాసేపట్లో ప్రారంభంకానుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో పాటు సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్‌ మున్సిపాలిటీల ఓట్లను లెక్కిస్తారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లకు కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి చేశారు. నెగిటివ్‌ రిపోర్ట్‌ ఉన్నవారికే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతి ఉంటుంది.

సాక్షి, హైదరాబాద్‌:  మినీ మున్సి‘పోల్స్‌’ఫలితాలు నేడు(సోమవారం) వెల్లడికానున్నాయి. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలతోపాటు గజ్వేల్‌ మున్సిపాలిటీలోని 12వ వార్డు, నల్లగొండ 26వ వార్డు, బోధన్‌ 18వ వార్డు, పరకాల 9వ వార్డు, జీహెచ్‌ఎంసీలోని లింగోజిగూడ డివిజన్‌కు గత నెల 30న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఆయా కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది.

బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో సాయంత్రంలోగా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపులో కోవిడ్‌–19 నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జిల్లా అధికారులను ఆదేశించింది. ఫలితాలు వెల్లడైన తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆంక్షలు విధించింది. ఎన్నికల అధికారులు, సిబ్బందితోపాటు ఏజెంట్లు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకుని నెగెటివ్‌గా తేలిన తర్వాతే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి  అనుమతించనున్నారు.


చదవండి: సీఎం కేసీఆర్‌ సంచలనం: ఈటల బర్తరఫ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement