గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్.. అప్‌డేట్స్
హోరాహోరీగా సాగిన తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.
మూడో రోజు.. కొనసాగుతున్న పట్టభద్రుల ఉప ఎన్నిక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
- ఇప్పటివరకు 44 మంది అభ్యర్థులను ఎలిమినేట్
- తీన్మార్ మల్లన్న ( కాంగ్రెస్) : 1,23,873
- రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్): 1,04,990
- గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి: 43,797
- గెలుపు కోటాకు −31,222 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న
- గెలుపు కోటాకు 50105 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్
- స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి
- అశోక్ ఫలితాలను వెల్లడించని అధికారులు
- అశోక్ ఎలిమినేషన్ ప్రాసెస్ తర్వాత మొదలుకానున్న బీజేపీ అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శుక్రవారం మధ్యాహ్నానికి 37 మంది ఎలిమినేట్
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,410 ఓట్లు,
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,676 ఓట్లు,
బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 43,571 ఓట్లు,
స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,862 ఓట్లు
గెలుపు కోటాకు 31,685 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉండగా, 50,419 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్ రెడ్డి ఉన్నారు.
మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు.
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు (1,22,813) వచ్చినా, 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా.. గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు.
గెలుపు కోసం 1,55,095 ఓట్లు సాధించాల్సి ఉంది.
గురువారం రాత్రి 10 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment