
సాక్షి, నల్గొండ: వరంగల్ -ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ పూర్తయింది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ సాగుతోంది. మొదటి రౌండ్‌లో 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న.. రెండో రౌండ్‌లోనూ లీడ్‌లో కొనసాగారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్‌లో ఆయనకు 34,575 ఓట్లు పోల్ అయ్యాయి.
రెండో రౌండ్ ఫలితాలు
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్(తీన్మార్ మల్లన్న)కు వచ్చిన ఓట్లు: 34,575
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 27,573
బీజేపీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 12,841
స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు వచ్చిన ఓట్లు: 11,018
నల్గొండలోని దుప్పలపల్లిలో నిన్న(బుధవారం) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment