vote counting
-
బీజేపీకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. నువ్వా..నేనా అన్నట్టుగా మూడురోజులపాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ముక్కోణపు పోరులో చివరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి అత్యధిక ఓట్లతో విజయం సాధించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి కౌంటింగ్ నిర్విరామంగా కొనసాగింది. ఉదయం 8.30 గంటలకల్లా.. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన 11 రౌండ్లు పూర్తయ్యాయి. మొత్తంవ్యాలి డ్ ఓట్లు 2,23,343 కాగా, అందులో 28,686 ఓట్లు చెల్లనివి ఉన్నాయి. అధికారులు 1,11,672 ఓట్లను గెలుపు కోటాగా నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యతలో 7 రౌండ్లు బీజేపీ... 4 రౌండ్లు కాంగ్రెస్‌కు ఆధిక్యం మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కౌంటింగ్ జరిగిన 11 రౌండ్లలో మొదటి నుంచీ బీజేపీ ఆధిక్యం కనబర్చగా, మధ్యలో 6,7,8,9 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి ఆధి క్యం వచ్చింది. చివరి రెండు రౌండ్లలో తిరిగి బీజేపీ మెజారిటీ సాధించింది. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యాక బీజేపీ అభ్యర్థికి 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధికి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్ధికి 60,419 ఓట్లు వచ్చాయి. ఏ అభ్యర్ధికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,11,672 ఓట్లు రాలేదు. గెలుపు కోటాను చేరుకోవడానికి అంజిరెడ్డికి 35,997 ఓట్లు, నరేందర్‌రెడ్డికి 41,107 ఓట్లు, ప్రసన్న హరికృష్ణకు 51,253 ఓట్లు అవసరం అయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డిపై బీజీపీ అభ్యర్థి అంజిరెడ్డి కేవలం 5,110 ఓట్ల అధిక్యం సాధించారు. గెలుపు కోటాకు కావాల్సిన ఓట్లకు ఎవరూ చేరుకోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల కోసం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను వరుస క్రమంలో ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో 53 మంది ఎలిమినేట్ అయ్యారు. అయినా ఎవరూ కోటా ఓట్లు సాధించలేదు. దీంతో చివరకు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఎలిమినేట్ చేసి, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి..........ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి .............ఓట్టు వచ్చాయి. అధిక ఓట్లు సాధించిన అంజిరెడ్డి అయితే ఇద్దరూ కోటా ఓట్లను చేరుకునే పరిస్థితి లేకపోవడంతో అధిక ఓట్లతో ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని విజేతగా ప్రకటించాలనుకున్నారు. కానీ, దానిపై కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఇద్దరిలో ఎవరికీ గెలుపు కోటా ఓట్లు రానందున ఫలితాన్ని ప్రకటించొద్దని అవసరమైతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాలని రిటర్నింగ్ ఆఫీసర్‌ను కోరారు. దీంతో అధికారులు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. చివరకు మిగిలిన ఇద్దరిలో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్ధిని విజేతగా ప్రకటించాలన్న ఆదేశాల మేరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని బుధవారం అర్ధరాత్రి విజేతగా ప్రకటించారు. దీంతో కౌంటింగ్ హాల్ నుంచి నరేందర్‌రెడ్డి బయటకు వచ్చారు. ఆయన్ను మీడియా చుట్టుముట్టగానే భావోద్వేగానికి గురై.. కన్నీటి పర్యంతమయ్యారు. ఏమీ మాట్లాడలేక పోయారు. గురువారం ఉదయం ప్రెస్‌మీట్ పెడతామని ఆయన అనుచరులు మీడియాకు చెప్పగా, నరేందర్‌రెడ్డి కారు ఎక్కి అంబేడ్కర్ స్టేడియం నుంచి వెళ్లిపోయారు. చెల్లని ఓట్లు.. సహకరించని పార్టీ ! నరేందర్‌రెడ్డి ఓటమిలో చెల్లని ఓట్లు కీలక పాత్ర పోషించాయి. చిన్న చిన్న పొరబాట్లతో దాదాపు 28వేలకుపైగా గ్రాడ్యుయేట్ ఓట్లు చెల్లకుండా పోయాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 28 వేల చెల్లని ఓట్లలో 15 వేలకుపైగా నరేందర్‌రెడ్డికి వచ్చినవే కావడం గమనార్హం. అందుకే ఓడిన బాధ కంటే కూడా తన ఓట్లు చెల్లకుండా పోయి ఓటమికి దారి తీయడం ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్దపల్లి జిల్లా నాయకులు తరహాలో మిగిలిన మూడు జిల్లాల ముఖ్యనేతలు తమకు సహకరించకపోవడం కూడా తమ ఓటమికి మరో కారణమని నరేందర్‌రెడ్డి వర్గం వాపోయింది. కరీంనగర్ ఎన్నికల సభలోనూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఈ సీటు ఓడిపోతే తన ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీలేదని వ్యాఖ్యానించడం కూడా తమకు ప్రతికూలంగా మారిందని ఆయన అనుచరులు గుర్తు చేశారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.ప్రొఫైల్ పేరు: చిన్నమైల్ అంజిరెడ్డి పుట్టినతేదీ: 18–06–1966 రామచంద్రాపురం, సంగారెడ్డి విద్యార్హత: ఎమ్మెస్సీ మ్యాథ్స్ (ఉస్మానియా) సతీమణి: గోదావరి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, సంగారెడ్డి రాజకీయం: 2009 ప్రజారాజ్యం పార్టీతో ఆరంగ్రేట్రం 2014లో సంగారెడ్డి సెగ్మెంట్లో ఇండిపెండెంట్‌గా పరాజయం -
పట్టభద్రుల పట్టం ఎవరికి?
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి, పేరాబత్తుల, గాదె గెలుపు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ మద్దతు తెలిపిన పేరాబత్తుల రాజశేఖరం, ఉమ్మడి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందిన విషయం తెలిసిందే. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికలు జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు రెండో రోజు మంగళవారం కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. -
నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/నల్లగొండ: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాటు పూర్తయ్యాయి. ఈ మేరకు కరీంనగర్, నల్లగొండలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సోమవారం సాయంత్రం లోగా వెల్లడికానున్నాయి. పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది. కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్లు కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా, ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. వీరందరికీ శనివారం అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎన్నికల అధికారులు మాక్ కౌంటింగ్ చేపట్టారు. ఈ మాక్ కౌంటింగ్‌లో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కౌంటింగ్ సూపర్వైజర్లు, సిబ్బందికి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు విధానం, నిబంధనలు, మార్గదర్శకాలను వివరించారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లు, టీచర్ నియోజకవర్గంలో 27,088 ఓట్లు ఉన్నాయి. ఈ క్రమంలో టీచర్ల లెక్కింపు సాయంత్రానికి వెలువడే అవకాశాలు ఉండగా.. గ్రాడ్యుయేట్ మాత్రం మరునాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, టీచర్ ఎమ్మెల్సీ బరిలో 15 మంది తలపడుతున్నారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జాలబావి సమీపంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 24,139 మంది ఓట్లు పోలయ్యాయి. నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు ఏర్పాట్లు చేసిన అసెంబ్లీ వర్గాలుసాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మె ల్సీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. గత నెల 24వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సోమవా రం నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. దీనికోసం అసెంబ్లీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఈనెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశముంటుంది. పోలింగ్ ఈనెల 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. వెంటనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎమ్మెల్సీలుగా ఉన్న సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శేరి సుభాశ్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్‌ల పదవీకాలం మార్చినెలాఖరుతో ముగియనుంది. శాసనసభలో పార్టీల బలాబలాల ప్రకారం మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, ఒకటి బీఆర్ఎస్కు దక్కనున్నాయి. మరో స్థానం ఎవరికి వస్తుందన్న దాని పై స్పష్టత లేదు. అయితే, కాంగ్రెస్ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను నిలపాలని యోచిస్తోంది. ఈ నాలుగింటిలో ఒకటి తమకివ్వాలని ఎంఐఎం అడుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోనుంది. ఇక, బీఆర్ఎస్ నుంచి ఎవరిని బరిలో నిలపాలన్న దానిపై ఆ పార్టీ వర్గాలు ఇంకా కసరత్తు చేస్తున్నాయి. -
నేడే ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెల 27న జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పడిన 70 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణ–గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ, ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మూడు స్థానాలకు పోటీ అధికంగా ఉండడం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితాలు వెలువడటానికి సుదీర్ఘ సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. -
నేడే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు
న్యూఢిల్లీ: హస్తిన అధికార పీఠం ఎవరికి దక్కుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో 60.54 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తాము వరుసగా మూడోసారి విజయం సాధించడం తథ్యమని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ 2015లో 67 సీట్లు, 2020లో 62 స్థానాలు గెలుచుకుంది. అయితే, ఈసారి బీజేపీకి విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టంచేశాయి. ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత కమలం పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని అంచనా వేశాయి. వరుసగా రెండుసార్లు ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ ఈసారి ఆప్, బీజేపీలతో గట్టిగానే తలపడింది. అధికారం దక్కకపోయినా కొన్ని సీట్లయినా వస్తాయని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు ముందు ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ ప్రారంభించిందని, తమ అభ్యర్థులను ప్రలోభపెట్టడానికి ప్రయతి్నస్తోందని, ఒక్కొక్కరికి రూ.15 కోట్ల చొప్పున నగదు, మంత్రి పదవులు ఇవ్వజూపిందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించడం సంచలనం సృష్టించింది. అధికారం సొంతం చేసుకోవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని ఆయన మండిపడ్డారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనాకు సైతం ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై వి.కె.సక్సేనా స్పందించారు. నిజాలు నిగ్గుతేల్చడానికి ఏసీబీ దర్యాప్తు జరపాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఫిరోజ్‌షా రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో అధికారులు లీగల్ నోటీసు జారీ చేశారు. ఆరోపణలకు ఆధారాలు సమరి్పంచాలని పేర్కొన్నారు. -
ఇది మాయ కాక మరేమిటి?
నిరూపించ లేనంత మాత్రాన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల వినియోగ ప్రక్రియలో తప్పులే లేవనో, తప్పిదాలకు ఆస్కారమే లేదనో ధ్రువీకరించినట్టు కాదు. అభియోగాలు మోపేవారు అందుకు హేతువును, తమ సందేహాలకు కారణాలను, తగు సాక్ష్యాధారాలను సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకు రావాలి. వాటిని స్వీకరించి బాధ్యులైన వ్యక్తులు, సంస్థలు లోతుగా పరిశీలన జర పాలి. అభియోగాలకు ఆధారాలున్నాయో లేదో, అవి తప్పో, కాదో తేల్చాలి. ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత, జవాబు దారీతనం ముఖ్యం. అది జరగటం లేదు.అయిందానికి, కానిదానికి నిత్యం పరస్పరం విమర్శించుకునే రాజకీయ పార్టీలు ఈవీఎంల విషయంలో అనుసరించే ద్వంద్వ వైఖరి వారి ఆరోపణలకు పస లేకుండా చేస్తోంది. దాంతో వివాదం ప్రాధాన్యత లేకుండా పోతోంది. కానీ, కొన్ని రాజకీయేతర తటస్థ సంఘాలు, సంస్థలు కూడా అభ్యంతరాలు లేవనెత్తాయి. పోలింగ్ శాతాల సమాచారంలో వ్యత్యాసాలను ఎత్తిచూపుతూ, బహిరంగ ప్రజాభిప్రాయానికి విరుద్ధ ఫలితాలనూ... ఈవీఎంల దుర్వినియోగానికి గల ఆస్కారాన్నీ అవి ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చినా... తగిన స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఓట్ ఫర్ డెమాక్రసీ (వీఎఫ్‌డీ), అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), సిటిజన్ కమిషన్ ఆన్ ఎలక్షన్ (సీసీఈ) వంటి పౌర సంఘాలు నిర్దిష్టంగా ఫిర్యాదులు చేసినా వాటిని పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు. రాజకీయ పక్షాల నుంచే కాక ప్రజాసంఘాలు, సంస్థల నుంచి నిర్దిష్ట ఆరోపణలు చేసినపుడు కూడా ‘నిరాధారం’, ‘దురుద్దేశ పూర్వకం’ అంటూ, కనీస విచారణైనా జరుపకుండానే ఎన్నికల సంఘం కొట్టిపారేస్తోందన్నది వారిపై ప్రధాన అభియోగం!ఓటు వ్యత్యాసాల పైనే సందేహాలుసాయంత్రం వరకు పోలింగ్ సరళి ఒక విధంగా ఉండి, ముగింపు సమయాల్లో అనూహ్య, అసాధారణ ఓటింగ్ శాతాలు నమోదు కావడం, అలా ఎన్నికల అధికారి రాత్రి ఇచ్చిన గణాంకాలకు భిన్నంగా ఓట్ల లెక్కింపు ముందరి ‘లెక్క’తేలడం పట్ల సందేహాలున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో ఈ ఓట్ల వ్యత్యాసం భారీగా ఉంటోంది. ఇది సార్వ త్రిక ఎన్నికల్లోనే కాకుండా హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల సందర్భంగానూ వెల్లడయిందనేది విమర్శ. గణాంకాలు వారి వాదనకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా, ఆఖరు నిమి షపు ఓట్ల వ్యత్యాసం పది శాతానికి పైగా ఉన్న పది జిల్లాల్లోని 44 అసెంబ్లీ స్థానాల్లో 37 ఎన్డీయే పక్షాలు గెలిచాయి. కానీ వ్యత్యాసం 10 శాతం కన్నా తక్కువగా ఉన్న 12 జిల్లాల్లోని 46 సీట్లలో ఎన్డీయే కూటమి 11 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇటువంటి పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ప్రతిబింబించిందని విమర్శకులంటారు. ఆఖరు నిమిషపు పోలింగ్ శాతపు పెరుగుదల వరుసగా ఐదు విడతల్లో 0.21%, 0.34%, 0.23%, 0.01%, 0.25% నామ మాత్రంగానే ఉండ టంతో ఎన్డీయే కూటమికి రాజకీయంగా ఇదేమీ లాభించ లేదనేది విశ్లేషణ! అందుకే, అక్కడ లోక్ సభ స్థానాల సంఖ్య 62 నుంచి ఈ సారి 36కి పడిపోయింది. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలివిడతలో ‘ఆఖరు నిమిషపు ఓటింగ్ శాతం’ పెరుగుదల 1.79% నమోదుకాగా బీజేపీ 43లో 17 అసెంబ్లీ స్థానాలు నెగ్గింది. కానీ, రెండో విడత పోలింగ్ సందర్భంగా ఓటింగ్ శాతం పెరుగుదల 0.86%కి పరిమితమైనందునేమో, 38లో 7 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇదంతా ఈవీఎంల మాయా జాలమే అని విమర్శకులంటారు.కళ్లకు కట్టినట్టు గణాంకాలుమహారాష్ట్రలోని అకోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారిచ్చిన సమాచారం ప్రకారం, పోలింగ్ ప్రక్రియ అన్ని విధాలుగా ముగిసేటప్పటికి ఈవీఎం ద్వారా 2,12,690 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు రోజున ఈవీఎం నుంచి రాబట్టిన ఓట్ల సంఖ్య 2,36,234. అంటే, వ్యత్యాసం 23.544 ఓట్లు. గెలిచిన బీజేపీ అభ్యర్థికి దక్కిన ఆధిక్యత 18,851 ఓట్లు! ఇలా రాష్ట్రవ్యాప్తంగా గమనిస్తే, పోలింగ్ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎన్నికల సంఘం వారి ‘యాప్’ ద్వారా వెల్లడైన గణాంకాల కన్నా ఓట్ల లెక్కింపు రోజున రమారమి పెరిగిన సంఖ్య ఉన్న నియోజకవర్గాలు తక్కువలో తక్కువ 95 ఉన్నాయనేది వారి వాదన. ఒకే విడత పోలింగ్ జరిగిన నవంబరు 20, సాయంత్రం 6.15 గంటలకు ఒకసారీ, రాత్రి 11.45 గంటలకు ఒకసారీ ఎన్నికల సంఘం అధికారికంగా ఓటింగ్ శాతాలను వెల్లడించింది. సాయంత్రం సమాచారం వెల్లడించే సమయానికి ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్లలో గడువు లోపల ‘క్యూ’లో చేరిన వారందరూ ఓటు వేసే వరకు, ఎంత సమయమైనా ఓటింగ్ ప్రక్రియ కొనసాగు తుందని పేర్కొన్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది గణాంకాలు రాత్రి ప్రకటించిన సమాచారంలో పేర్కొన్నారు. 288 నియోజకవర్గాల్లో సాయంత్రానికి 58.22% (5,64,88,024 ఓట్లు) పోలయినట్టు తెలిపిన అధికారులు రాత్రి అయ్యేటప్పటికి 65.02% (6,30,85,732 ఓట్లు) నమోదైనట్టు చెప్పారు. అంటే, వ్యత్యాసం 65,97,708 ఓట్లన్న మాట! నవంబరు 22న ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటలు ముందు, ‘యాప్’ వెల్లడించిన సమాచారం ప్రకారం, రాష్ట్ర మంతటా నమోదైన ఓట్ల సంఖ్య 6,40,85,095. అప్పుడు పోలింగ్ శాతం 66.05%కి చేరింది. ఏమిటీ వ్యత్యాసాలన్న ప్రశ్న ఈవీఎంలపై శంకకు తావిస్తోంది. 288 నియోజక వర్గాల్లోని 1,00,186 పోలింగ్ బూత్‌లలో సగటున 76 ఓట్ల చొప్పున 76 లక్షల ఓటర్లు, ఎలా గడువు తర్వాత ‘క్యూ’ల్లో నిలుచొని ఓటు వేసి ఉంటారనే ప్రశ్న తలెత్తడం సహజం!సందేహాలను నివృత్తి చేసేవిధంగా ఎన్నికల సంఘం సమా ధానం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. చైతన్యమే దారిదీపం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మాల్శిరాస్ తాలూకా మార్కడ్వాడి అనే చిన్న గ్రామంలో జనం తిరగబడ్డారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, ఓట్ల లెక్కింపు తర్వాత ఆరోపిస్తూ గ్రామస్థులు బ్యాలెట్ ద్వారా ‘మళ్లీ పోలింగ్’ జరపాలని వారికి వారే నిర్ణయించారు. కానీ పోలీస్ ఆంక్షలు విధించి సదరు రీపోల్ను అధికారులు జరుగనీయ లేదు. 13 వేల ఓట్ల ఆధిక్యతతో ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థి ఉత్తమ్రావ్ జన్కర్ ఎమ్మెల్యేగా ఎన్నికయి కూడా... ఆ గ్రామంలో ఈవీఎం అవకతవకలతో నష్టం జరిగిందని ఆరో పించారు. కులాల వారిగా, విధేయత పరంగా చూసినా... గ్రామంలో తనకు ఆధిక్యత ఉండగా, తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్ సత్పతే (బీజేపీ)కి 160 ఓట్లు ఎక్కువ రావటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రీపోల్ నిర్వహణకు ప్రేరణ కల్పించారు. తమ ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించనందునే రీపోల్ ఆలోచనని గ్రామ ముఖ్యులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలింగ్ ఏజెంట్లుగా పోలింగ్ ముగిసే సమయంలో, కౌంటింగ్ ఏజెంట్లుగా ఓట్ల లెక్కింపు మొదలెట్టేప్పుడు ఆ యా కేంద్రాల్లో ఉంటారు. వారీ లెక్కలు సరి చూసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదనే వాదనొకటుంది. ఈవీఎంలలో మాయ ఉందంటే... దానికి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అనుమానాలు, గణాంకాల్లో సందేహాలు న్నాయంటే దానికి బాధ్యుల నుంచి సమాధానాలు రావాలి. ప్రజలకు కావాల్సింది... పారదర్శక పాలనా వ్యవస్థలూ, పాలకుల నుంచి జవాబుదారీతనం... దట్సాల్!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చి సంస్థ డైరెక్టర్ -
నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు
ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో హో రాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో విజేతలెవరో నేడు తేలిపోనుంది. రెండు రాష్ట్రాల్లో శనివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగిన 46 అసెంబ్లీ స్థానా ల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. సాక్షి.కామ్ ఈ ప్రజా తీర్పును.. ఎప్పటికప్పటి ఫలితాలను మీకు ప్రత్యేకంగా అందించబోతోంది.నాందేడ్ లోక్‌సభ స్థానంతోపాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్‌లో లోక్‌సభ స్థానానికి సైతం ఉప ఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ పడిన రాహుల్ సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా భవితవ్యం మరికొన్ని గంటల్లో తేటతెల్లం కానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌తోపాటు ఉప ఎన్నికలు జరిగిన అసెంబ్లీ స్థానాలు, నాందేడ్, వయనాడ్ లోక్‌సభ స్థానాల్లో శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మహారాష్ట్రలో మొత్తం 288 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలుండగా, 4,136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మరోసారి మహాయుతి ప్రభుత్వమే ఏర్పాటయ్యే అవకాశం ఉందని సర్వేలు అంచనా వేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో 1,211 మంది పోటీ మొత్తం 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్‌లో ఈసారి 1,211 మంది పోటీ చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మధ్య అసలైన పోటీ నెలకొంది. జార్ఖండ్‌లో మరోసారి అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా, విజయం తమదేనని ఎన్డీయే నేతలు తేల్చిచెబుతున్నారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయేవైపే మొగ్గుచూపాయి. మహారాష్ట్రలో ఎంవీఏ ముందు జాగ్రత్త మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన తమ అభ్యర్థులందరినీ వెంటనే ముంబైలో శిబిరానికి తరలించాలని మహా వికాస్ అఘాడీ నిర్ణయించింది. తమ ఎమ్మెల్యేలపై బీజేపీ కూటమి వల విసిరే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా వారిని శిబిరానికి తరలించాలని నిర్ణయించినట్లు శివసేన(యూబీటీ) అగ్రనేత సంజయ్ రౌత్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి కనీసం 160 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించారని తెలిపారు. -
శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకే
కొలంబో: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనూర కుమార దిస్సనాయకే (56) విజయం సాధించారు. దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులో ఫలితం తేలడం విశేషం. జనతా విముక్తి పెరమున అధినేత అయిన దిస్సనాయకే తన సమీప ప్రత్యరి్థ, ఎస్‌జేబీ నేత సజిత్ ప్రేమదాసపై విజయం సాధించారు. అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (75) తొలి రౌండ్లోనే వైదొలి గారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో దిస్సనాయకే 42.31% ఓట్లతో తొలి స్థానంలో, ప్రేమదాస 32.8 శాతంతో రెండో స్థానంలో నిలవగా విక్రమసింఘే 17.27 శాతంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఏ ఒక్కరికీ విజయానికి కావాల్సిన 50 శాతం రాకపోవడంతో ద్వితీయ ప్రాధమ్య ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను తేల్చారు. శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిస్సనాయకే సోమవారం ప్రమాణం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) ప్రకటించింది. దిస్సనాయకేకు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.ఏకేడీ.. ఎట్టకేలకు! ఏకేడీగా పిలుచుకునే అనూర దిస్సనాయకే నార్త్ సెంట్రల్ ప్రావిన్స్ లోని థంబుట్టెగామలో జన్మించారు. కొలంబో సమీపంలోని కెలనియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకున్నారు. 1987లో జేవీపీలో చేరారు. 1971, 1987, 1990ల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకు జేవీపీ హింసా మార్గం తొక్కింది. ఇది భారత వ్యతిరేకి కూడా. అప్పట్లో రాజీవ్ గాం«దీ–జయవర్థనే ప్రభుత్వాల ఒప్పందం శ్రీలంక సార్వ¿ౌమత్వానికి భంగకరమని భావించేది. గత ఫిబ్రవరిలో దిస్సనాయకే భారత్‌లో పర్యటించాక పార్టీ వైఖరిలో మార్పువచి్చంది. 90ల్లో జేవీపీ ప్రజాస్వామ్య విధానాల పట్ల మొగ్గాక పారీ్టలో దిస్సనాయకేకు ప్రాధాన్యం పెరిగింది. 2000 ఎన్నికల్లో మొదటిసారి ఎంపీ అయ్యారు. 2014లో పార్టీ అధ్యక్షుడయ్యారు. 2019 ఎన్నికల్లో జేవీపీకి దక్కిన ఓట్లు కేవలం మూడు శాతమే. -
ఈవీఎంలలో గోల్ మాల్..
-
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న
సాక్షి, నల్గొండ: వరంగల్ -ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ పూర్తయింది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ సాగుతోంది. మొదటి రౌండ్లో 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న.. రెండో రౌండ్లోనూ లీడ్‌లో కొనసాగారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్లో ఆయనకు 34,575 ఓట్లు పోల్ అయ్యాయి.రెండో రౌండ్ ఫలితాలుకాంగ్రెస్ అభ్యర్థి నవీన్(తీన్మార్ మల్లన్న)కు వచ్చిన ఓట్లు: 34,575బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 27,573బీజేపీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 12,841స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు వచ్చిన ఓట్లు: 11,018నల్గొండలోని దుప్పలపల్లిలో నిన్న(బుధవారం) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. -
ఈవీఎంలు మార్చేశారు
-
ఒడిషా తీర్పుపైనా దేశం నజర్
భువనేశ్వర్: నవీన్ పట్నాయక్ రికార్డు అధిగమిస్తారా? పవన్ చామ్లింగ్ మైలురాయి దాటుతారా?. లోక్‌సభ ఫలితాలతో పాటు యావత్ దేశం దృష్టి ఇప్పుడు ఒడిషా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఉంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుండగా బీజూ జనతా దళ్(బీజేపీ) విజయం సాధిస్తే నవీన్ చరిత్ర సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మంగళవారం ఓట్ల లెక్కింపు తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది తేటతెల్లమవుతుంది. ఒకవేళ బీజేడీకు అనుకూలంగా ఫలితాలు వస్తే జూన్ 9న నవీన్ ఆరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఇది వాస్తవమైతే మరో 70 రోజుల తర్వాత నవీన్ సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డు అధిగమించి చరిత్ర సృష్టిస్తారు. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ నేత ఆయన చామ్లింగ్ 24 ఏళ్ల 165 రోజులు సీఎంగా విధులు నిర్వహించారు. ఆయన 1994 నుంచి 2019 మే వరకు సేవలందించారు. దీర్ఘకాలం సీఎంలుగా విధులు నిర్వహించిన ముఖ్యమంత్రులు అయిదుగురున్నారు. కాంగ్రెస్‌కు చెందిన వీరభద్రసింగ్ హిమాచల్‌ప్రదేశ్ సీఎంగా 21 సంవత్సరాలు 13 రోజులు విధులు నిర్వహించారు. 1983 నుంచి 2017 వరకు (నాలుగుసార్లు) సేవలందించారు. మిజోరం కాంగ్రెస్ నేత లాల్ థధ్వాల్ 22 ఏళ్ల 60 రోజులు (1986 నుంచి 2018) ఆ రాష్ట్రాన్ని పాలించారు. అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు గెగాంగ్ అపాంగ్ 22 ఏళ్ల 250 రోజులు (1980 నుంచి 2007) అధికారంలో ఉన్నారు. పశ్చిమబెంగాల్ సీఎంగా సీపీఎంకి చెందిన జ్యోతిబసు 23 సంవత్సరాల 137 రోజులు (1977 నుంచి 2000) ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. నవీన్ అయిదుసార్లు (2000 నుంచి 2024 వరకు) సీఎంగా విధులు నిర్వహించి జ్యోతిబసు రికార్డును అధిగమించారు. ఈసారి (2024 జూన్ 9న) ఆరోసారి ప్రమాణ స్వీకారం చేస్తే పవన్ చామ్లింగ్ రికార్డును అధిగమించి చరిత్రలో నిలిచిపోతారు.బీజేడీ నేతల్లో ఆశాభావం: నవీన్ విధేయులుగా ముద్రపడిన నేతలంతా బీజేడీ అధికారంలోకి వస్తుందని, సీఎంగా నవీన్ ఆరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆశాభావంతో ఉన్నారు. నవీన్‌కు ఆదరణ తగ్గలేదని ఎన్నికల ఫలితాలు రుజువుచేస్తాయని అంటున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల భవిష్యత్ మంగళవారం తేలనుంది. ఎన్నికలకు సంబంధించి వివిధ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సిద్ధమైంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 69 స్ట్రాంగ్ రూముల్లో ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), వీవీ ప్యాట్లను కట్టుదిట్టంగా భద్రపరిచారు. మూడంచెల భద్రత స్ట్రాంగ్ రూముల చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూములను సీసీ కెమెరాల నిఘాలో ఉంచారు. వాటి రక్షణ కోసం 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్) మోహరించారు. పోలీసు బృందాలు రాత్రింబవళ్లు పహరా కాస్తున్నాయి. భువనేశ్వర్‌లోని బీజేబీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. సీఏపీఎఫ్ మరియు రాష్ట్ర సాయుధ పోలీసులు (ఓఎస్ఏపీ) ఇరువర్గాలు స్ట్రాంగ్‌రూమ్‌కు బాధ్యత వహిస్తారు. ఇదే తరహాలో బరిపద, బరంపురం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, ఉమా చరణ్ పటా్నయక్ ఇంజినీరింగ్ స్కూల్ ఆవరణలో స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేసి ఈవీఎం, వీవీప్యాట్లను కట్టుదిట్టమైన భద్రతలో ఉంచారు. ఫలితాల తదనంతరంపై నిఘా రాష్ట్రంలో ఫలితాల అనంతరం శాంతిభద్రతల పరిరక్షణపై భారత ఎన్నికల సంఘం ఉద్ఘాటించింది. ఎన్నికల తదనంతర పరిస్థితుల ప్రభావంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఈసీఐ మందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఈనెల 6 వరకు రాష్ట్రంలో 70కి పైగా సీఏపీఎఫ్ కంపెనీలు మోహరించబడతాయి. రాష్ట్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌లు మరియు కౌంటింగ్ కేంద్రాలకు రక్షణగా 25 కంపెనీల సీఏపీఎఫ్ కొనసాగించాలని ఈసీఐ నిర్ణయించింది. రాష్ట్రం అంతటా శాంతిభద్రతల పరిస్థితిని నిర్వహించడానికి అదనంగా 70 సీఏపీఎఫ్ కంపెనీలను నియమించాలని నిర్ణయించారు. లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి జయపురం: సార్వత్రిక ఎన్నికల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జయపురం సబ్ డివిజన్ ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ ప్రభాత్ కుమార్ పొరిడ తెలిపారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ సభాగృహంలో విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించారు. జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో జయపురం, కోట్పాడ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 20 టేబుల్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అలాగే బ్యాలెట్ పేపర్లు లెక్కించేందుకు 5 టేబుల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. నవరంగపూర్, కొరాపుట్ లోక్‌సభ స్థానాల్లో అంతర్భాగమైన ఈ రెండు స్థానాల్లో లోక్‌సభ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం 58 మంది సిబ్బందిని, రెండు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 37 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. లెక్కింపు వివరాలు ప్రజలకు తెలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో జయపురం బీడీవో శక్తి మహాపాత్రో, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి సిద్ధార్థ పటా్నయిక్, జయపురం తహసీల్దార్ డా.మనోలిస ఆచార్య, బొరిగుమ్మ బీడీవో అమృత లాల్ బెహర, కోట్పాడ్ అదనపు తహసీల్దార్ నీలాంబర పూజారి, జయపురం సబ్ డివిజన్ సమాచార ప్రజా సంబంధాల అధికారి యశోద గదబ, జయపురం పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్ దొళాయి, సదర్ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి, బీజేడీ ప్రతినిధి సుభాష్ పండ, కాంగ్రెస్ ప్రతినిధి తరణి ప్రసాద్ పాణిగ్రహిలు పాల్గొన్నారు. -
కూటమితో కుమ్మక్కు!
కూటమి నేతలతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారా.. కౌంటింగ్‌కు తమకు అనుకూలమైన అధికారులను వేయించుకున్నారా..? నేడు జరగనున్న ఓట్ల లెక్కింపులో అక్రమాలు.. దౌర్జాన్యాలకు స్కెచ్ వేశారా..? అంటే జిల్లా వాసుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థులు పైచేయి సాధించేందుకు కొందరు అధికారులు అడ్డదారులు తొక్కేందుకు సిద్ధమైనట్టు స్పష్టమవుతోంది. సాక్షి టాస్‌్కఫోర్స్: కౌంటింగ్‌లో అక్రమాలు.. దౌర్జనాలకు కూటమి అభ్యర్థులు పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన ఆదేశాలను ఆసరాగా చేసుకుని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూటమి నేతలు కొందరు అధికారుల సహకారంతో రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు స్వతంత్ర అభ్యర్థులు అడ్డొస్తారని వారికి ఏజెంట్లను కుదించడమే ఇందుకు నిదర్శనం. తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ, చిత్తూరు ఎస్వీ సెట్లో నేడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కూటమికి ఓటమి తప్పదని భావించిన అభ్యర్థులు టీడీపీ సానుభూతిపరులైన అధికారుల ద్వారా మరికొందరు అధికారులను రకరకాల ప్రలోభాలతో లోబరుచుకున్నారు. వారందరికీ కౌంటింగ్ కేంద్రంలో డ్యూటీలు వేయించుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. వారి సహకారంతో కౌంటింగ్ కేంద్రంలో అక్రమాలు, దౌర్జన్యాలకు దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తారుమారు చేసి.. కూటమికి అనుకూలంగా మార్చే కుట్ర అడ్డదారుల్లోనైనా గెలుపొందాలని కూటమి నేతలు అన్ని మార్గాలను ఎంచుకున్నారు. ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపు సమయంలో కూటమి ఏజెంట్లు రచ్చచేసి వైఎస్సార్సీపీ ఏజెంట్ల దృష్టి మరల్చేందుకు పథకం వేసినట్లు తెలిసింది. ఈవీఎంలోని మొత్తం ఓట్ల లెక్కింపు విషయంలో తమకు అనుకూలంగా లెక్కలను తారుమారు చేసేందుకు స్కెచ్ వేసినట్లు సమాచారం. మొత్తంగా నేటి కౌంటింగ్ సమయంలో అడ్డదారులన్నింటినీ ఉపయోగించుకుని పైచేయి సాధించేందుకు కూటమి నేతలు కుట్రలకు పదునుపెట్టారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు కౌంటింగ్ కేంద్రంలో అక్రమాలు, దౌర్జనాలకు తావులేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులు, ఓటర్లు కోరుతున్నారు. వీలైనన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లే లక్ష్యంగా.. అధికారులంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేసిన కూటమి నేతలు.. నేడు జరగనున్న కౌంటింగ్‌లో దాన్ని అవకాశంగా వినియోగించుకోవాలని కుయుక్తులు పన్నుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా ఈసీ ఆదేశాలను బూచీగా చూపి వీలైనన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూటమి అభ్యర్థికి అనుకూలంగా మలచుకునేందుకు పథకం వేసినట్టు సమాచారం. అందుకు అడ్డుగా ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్లను రెచ్చగొట్టి బయటకు పంపేందుకు స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల విషయంలోనూ ముందే అడ్డుకట్ట వేశారు. టేబుల్‌కి ఒక ఏజెంట్‌ని నియమించుకునే అవకాశం అభ్యర్థి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే టేబుల్‌కి ఒక ఏజెంట్‌ని ఏర్పాటు చేసుకునే అవకాశం కలి్పంచారు. స్వతంత్ర అభ్యర్థుల విషయానికి వచ్చే సరికి కేవలం 5, 6 మంది ఏజెంట్లను మాత్రమే నియమించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వతంత్ర అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అభ్యర్థే కదా? అన్నీ టేబుల్స్ వద్ద ఏజెంటు ఉండకపోతే ఎలా? అని ప్రశి్నస్తున్నారు. అయినా వారికి ఎన్నికల అధికారి ససేమిరా అన్నట్లు స్వతంత్ర అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలగం కోసం కొత్త ఎత్తుగడ కౌంటింగ్ కేంద్రలో అక్రమాలు, దౌర్జన్యాలకు బలగం ఉండేలా కూటమి అభ్యర్థులు కాంగ్రెస్ ఏజెంట్ ఫామ్స్‌ని కొనుగోలు చేసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనా ఆ పార్టీ తరుఫున అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. జాతీయ పార్టీ కావడంతో కాంగ్రెస్ అభ్యరి్థకి టేబుల్‌కి ఒకరు చొప్పున ఏజెంట్‌ని నియమించుకునే అవకాశం ఉంది. పేరుకు మాత్రమే పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తమ ఏజెంట్ ఫామ్స్‌ని కూటమి అభ్యర్థులకు విక్రయించి సొమ్ముచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ ఏజెంట్ ఫామ్స్‌తో కూటమి నేతలు కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించనున్నారు. కౌంటింగ్ కేంద్రంలో కూటమి నేతలకు బలం ఎక్కువ ఉండడంతో అక్రమాలు, దౌర్జన్యాలు చేసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బలగంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వీలైనన్ని కూటమి అభ్యర్థి లెక్కలో వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఏ చిన్న పొరబాటు ఉన్నా.. కూటమి అభ్యర్థి అకౌంట్లో వేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. -
దారులన్నీ కర్నూలు వైపే!
కర్నూలు(అర్బన్): సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. ఫలితాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు, వారి అనుచరగణం కర్నూలుకు చేరుకుంటున్నారు. కర్నూలు పార్లమెంట్‌తో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు రాయలసీమ యూనివర్సిటీలో జరగనున్న విషయం తెలిసిందే. కౌంటింగ్ విధులు నిర్వహించాల్సిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రాయలసీమ విశ్వ విద్యాలయానికి వెళ్లేందుకు వీలుగా 4వ తేదిన ఉదయం 5 గంటలకే బస్సులను కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. వీరంతా కచ్చితంగా ఉదయమే రావాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఎన్నికల విధుల్లో భాగంగా ఉదయం 5 గంటలకు కర్నూలుకు చేరుకునే పరిస్థితులు లేని కారణంగా ఒక రోజు ముందుగానే ఇక్కడకు చేరుకున్నారు. వీరంతా రాత్రి బస చేసేందుకు తమ బంధువులు, స్నేహితుల ఇళ్లు, లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు. సారీ ... రూముల్లేవు! కర్నూలులోని పలు ప్రధాన లాడ్జీలతో పాటు చిన్న చితకా లాడ్జీల్లో కూడా రూములు లేవనే సమాధానం వినిపిస్తోంది. ప్రధాన రాజకీయ పారీ్టలకు చెందిన నేతలు పలు లాడ్జీల్లో 15 రోజుల ముందుగానే ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం నుంచి 4వ తేదీ వరకు గదులను అడ్వాన్స్‌గా అద్దెకు తీసుకున్నారు. దీంతో మెజారిటీ లాడ్జీలన్నీ రాజకీయ నేతలతో సందడి చేస్తున్నాయి. ఏసీ రూములు లేకపోయినా ఫరవాలేదు. కనీసం టీవీ ఉంటే చాలు అంటూ నేతలు లాడ్జీలల్లో దిగిపోతున్నారు. ఆయా లాడ్జీలకు అనుసంధానంగా ఉన్న హోటళ్లలో రాత్రి డిన్నర్, ఉదయం టిఫెన్, మధ్యాహ్నం లంచ్‌కు సరపడా మెనూను కూడా అడ్వాన్స్‌గా ఆర్డర్ చేసుకుంటున్నారు. నగరంలోని ప్రధాన లాడ్జీలతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలు కూడా హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టే స్థాయికి వచ్చాయి. నేతల ఇళ్ల వద్ద జన సందోహం ... జిల్లాలోని ఒక పార్లమెంట్ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన ప్రధాన పారీ్టలకు చెందిన మెజారిటీ అభ్యర్థుల నివాసాలు కర్నూలులోనే ఉన్నాయి. వారి ఇళ్ల వద్దకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఓట్ల లెక్కింపులో అనుభవం ఉన్న పలువురు నేతలు ఓట్ల లెక్కింపు సమయంలో ఉండాల్సిన చురుకుదనం, ప్రశ్నించే తత్వం, తెలివితేటలు, సమయస్ఫూర్తిపై తమ ఏజెంట్లకు తెలియజేస్తూ కౌంటింగ్ కేంద్రాలకు పంపుతున్నారు. -
కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు...!
-
ఓటమి భయంతో టీడీపీ, టాయిలెట్ మీడియా కుట్రల మేళా
-
ఏపీ ఎన్నికల తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే..
-
ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలి: రాజీవ్‌కుమార్
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని.. ఇందుకు అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాల సీఈవోలు, ఎన్నికల అధికారులకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆదేశించారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సందుతో కలసి రాజీవ్‌కుమార్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరి సమిష్టి కృషితో దేశవ్యాప్తంగా ఎన్నికలు విజయవంతంగా జరుగుతున్నాయని అభినందించారు. అదే స్ఫూర్తితో వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పాస్‌లు లేకుండా ఎవరినీ అనుమతించవద్దని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ పరికరాలను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఫలితాల ప్రకటనలో ఆలస్యం చేయొద్దు.. ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపు గురించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వాలని రాజీవ్‌కుమార్ ఆదేశించారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు వంటి పరికరాలను కౌంటింగ్ కేంద్రాల్లో సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా.. ఒక క్రమ పద్ధతిలో తీసుకురావాలని స్పష్టం చేశారు. ఒక ఈవీఎం లెక్కింపు పూర్తయిన తర్వాతే మరో ఈవీఎం తీసుకోవాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ‘లెక్కింపు పూర్తి అయినట్లుగా’ ఆయా ఈవీఎంలపై మార్క్ చేయాలని ఆదేశించారు. ఆ వెంటనే సీల్ చేసి ఒక క్రమపద్ధతిలో సురక్షితంగా భద్రపరచాలని ఆదేశించారు. అనవసరంగా ఈవీఎంలను అటూ, ఇటూ కదిలించవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపు కోసం ప్రత్యేకంగా టేబుళ్లు, స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయొద్దని.. డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా, అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, హరేంధిర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
Pakistan General Elections 2024: ఇంటర్నెట్ బంద్..ఉగ్ర దాడులు
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో హింసాత్మక ఘటనల మధ్య సాధారణ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. మొత్తం 12.8 కోట్ల మంది ఓటర్ల కోసం 6.50 లక్షల మంది భద్రతా సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. పోలింగ్ నేపథ్యంలో గురువారం ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆ వెంటనే అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టారు. శుక్రవారం ఉదయాని కల్లా ఫలితాల సరళిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉగ్రదాడుల్లో ఆరుగురు మృతి ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. డేరా ఇస్మాయిల్ ఖాన్‌లోని కలాచి వద్ద భద్రతా సిబ్బంది వాహనాన్ని బాంబుతో పేలి్చన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో నలుగురు జవాన్లు చనిపోయారు. మరో ఘటన..బలోచిస్తాన్‌లోని ఖరాన్‌లో మందుపాతర పేలి ఇద్దరు పోలీసులు చనిపోగా మరో ఏడుగురు గాయపడ్డారు. భద్రతా కారణాలు చూపుతూ అధికారులు ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులను గురువారం మూసివేశారు. సరుకు రవాణా వాహనాలతోపాటు పాదచారులను సైతం అనుమతించలేదు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే మొబైల్, ఇంటర్నెట్ సరీ్వసులను దేశవ్యాప్తంగా నిలిపివేశారు. అయితే, రిగ్గింగ్‌ను యథేచ్ఛగా కొనసాగించేందుకే ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై ఎన్నికల కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా స్పందిస్తూ ఉగ్రదాడులు జరిగితే బాధ్యతెవరిదని ప్రశ్నించారు. ఎన్నికలకు, ఇంటర్నెట్తో ఎటువంటి సంబంధం లేదన్నారు. మద్దతుదారుల మధ్య ఘర్షణ అటోక్ నియోజకవర్గంలో రెండు చోట్ల పీఎంఎల్–ఎన్, పీటీఐ పార్టీ మద్దతుదారుల మధ్య ఘర్షణతో పోలింగ్ 5 గంటలపాటు ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది విధులకు రాకపోవడం, బ్యాలెట్ పేపర్లు చాలినన్ని అందకపోవడం, బ్యాలెట్ పేపర్లలో తప్పులు వంటి కారణాలతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యమైంది. బలోచిస్తాన్, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌ల్లో వర్షం, అతిశీతల వాతావరణ పరిస్థితుల మధ్య చాలా చోట్ల ఓటేసేందుకు జనం బయటకు రాలేదు. -
Mizoram: ఎలక్షన్ కౌంటింగ్ తేదీ మార్పు.. ఈసీ కీలక ప్రకటన
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. డిసెంబర్ 3 జరగాల్సిన ఓట్ల లెక్కింపును డిసెంబర్ 4కి మారుస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆదివారం మిజోరం ప్రజలకు ప్రత్యేకమైన రోజు అని 2023 డిసెంబర్ 3వ తేదీ ఆదివారం కావడంతో కౌంటింగ్ తేదీని మరో రోజుకు మార్చాలని అభ్యర్థిస్తూ వివిధ వర్గాల నుంచి అనేక వినతులు అందినట్లు ప్రెస్ నోట్లో ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. పలు వర్గాల ప్రజల నుంచి అందిన వినతులను పరిగణనలోకి తీసుకుకు మిజోరాం శాసనసభకు జరిగే సాధారణ ఎన్నికల కౌంటింగ్ తేదీని డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 4 (సోమవారం)కు మారుస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మిగతా షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. Counting of votes in Mizoram rescheduled to Dec 4. Mizoram civil society and parties had demanded change in date from Dec 3 as it was Sunday@DeccanHerald pic.twitter.com/vOlND6G4kX — Shemin (@shemin_joy) December 1, 2023 -
MP: కౌంటింగ్ వేళ క్యాబినెట్ మీటింగ్.. కాంగ్రెస్ అభ్యంతరం
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన చివరి క్యాబినెట్ సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ సమావేశానికి మంత్రులందరితో పాటు సీనియర్ అధికారులను కూడా పిలిచారు. ఎటువంటి అజెండా లేకుండా ఎన్నికల ఫలితాలకు మూడు రోజుల ముందుగా ఆకస్మిక సమావేశం ఏర్పాటు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓట్ల లెక్కింపును ప్రభావితం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమే ఇది అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీసీ శర్మ ఆరోపించారు. బాలాఘాట్ పోస్టల్ బ్యాలెట్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీకి ఓటు వేయలేదు కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపునకు మూడు రోజుల ముందుగా ఇలా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం గత పదేళ్లలో ఎప్పుడూ జరగలేదు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ ఎటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేరు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇక్బాల్ సింగ్ బెయిన్స్ పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బెయిన్స్ పదవీ విరమణ తర్వాత కొత్త ప్రధాన కార్యదర్శిగా వీర రాణా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే బెయిన్స్ తర్వాత రాష్ట్రంలో ఆమె సీనియర్ మోస్ట్ అధికారి. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ప్రారంభం
-
బాబు ఇలాకాలో ఫ్యాన్ హవా
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. పరిషత్ ఎన్నికల ఫలితాల్లో రికార్డు స్థాయిలో స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ఇక టీడీపీకి గతంలో మంచి పట్టున్న కుప్పంలోనూ ఇప్పుడు వైఎస్సార్సీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్విని(23).. 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో 65 జడ్పీటీసీలకుగానూ ఇప్పటికి 29 స్థానాలను .. 841కి ఎంపీటీసీ స్థానాలకుగానూ.. 416 స్థానాలను కైవసం చేసుకుని ఆధిక్యంలో దూసుకుపోతోంది వైఎస్సార్సీపీ. మరోవైపు ఆదివారం ఉదయం మొదలైన ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యం కొనసాగిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ జిల్లాల వారీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కౌంటింగ్ కేంద్రాల వద్ద జనసమూహానికి అనుమతి లేదు
-
కౌంటింగ్ ప్రక్రియ.. ఈసీ కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ విజృంభిస్తోంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనా విజృంభణకు తాజాగా దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలే కారణమని జనాలు బలంగా విశ్వస్తున్నారు. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టు ఎన్నికల కమిషన్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ వ్యాప్తికి ఈసీనే కారణమని.. హత్యా కేసు పెట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మే 2న జరగబోయే కౌంటింగ్‌కు సంబంధించి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు, కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపింది. ఈ మేరకు ఈసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈసీ ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఈసీ కౌంటింగ్ కేంద్రాల వద్ద జనసమూహానికి అనుమతి లేదని తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లాలనుకునే వారు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు, టీకా రెండు డోసులు తీసుకున్నట్లు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను కౌంటింగ్‌కు 48 గంటల ముందే సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించింది. అభ్యర్థులు కౌంటింగ్ రోజున హాజరయ్యే ఏజెంట్లకు సంబంధించిన లిస్ట్‌ను మూడు రోజుల ముందుగానే అందించాలని తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గురువారం బెంగాల్లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు పెద్ద ఎత్తున జనాలతో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకే కోవిడ్ విజృంభిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. చదవండి: ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు -
రెట్టింపు పోలింగ్.. రేపే కౌంటింగ్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి–మహబూబ్‌నగర్– హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం జరగనుంది. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్లను సరూర్‌నగర్‌లోని ఇండోర్‌స్టేడియంలో లెక్కించనున్నారు. భారీ సంఖ్యలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉండటమే కాక, గతంలో కంటే ఓటర్లు..పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగినందున కౌంటింగ్‌కు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. 2015లో జరిగిన ఇదే నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్థులు 31 మందితోపాటు నోటా ఉంది. ప్రస్తుతం నోటా లేదు. ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత క్రమంలో జరగనున్నందున మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎవరికీ కోటా ( చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ) ఓట్లు రాకుంటే, కోటా ఓట్లు వచ్చేంత వరకు తర్వాతి ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఎన్నికలో పోస్టల్‌బ్యాలెట్ల ఓట్లను విడిగా లెక్కించరని అధికారులు తెలిపారు. గత ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో దాదాపు 8400 ఓట్లు చెల్లకుండా పోయాయి. ప్రస్తుతం అభ్యర్థుల సంఖ్య మూడింతలు పెరిగింది. ఓటర్లు భారీగా పెరిగారు. అప్పట్లో 2.96 లక్షల ఓటర్లుండగా, ప్రస్తుతం 5.31 లక్షలకు పెరిగారు. గత ఎన్నికల్లో 39 శాతం పోలింగ్ జరగ్గా, ప్రస్తుతం 67.25 శాతం పోలింగ్ నమోదైంది. అంటే, పోలింగ్ శాతం దాదాపుగా డబుల్ అయింది. ప్రాధాన్యతలతో ఓట్లను సక్రమంగా వేయలేకపోయిన ఓటర్లు ఎక్కువ మంది ఉండవచ్చుననే అనుమానాలున్నాయి. అదే జరిగితే చెల్లని ఓట్లు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ మంది బరిలో ఉన్నందున అభ్యర్థులందరి ఓట్లూ లెక్కించేందుకు ఎంతో సమయం పట్టనుంది. బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నప్పటికీ, బ్యాలెట్ పేపర్లను నిర్ణీత సంఖ్యలో బండిల్స్‌గా కట్టడం, ఇతరత్రా కార్యక్రమాలన్నీ పూర్తిచేయాల్సి ఉండటంతో మధ్యాహ్నం లేదా సాయంత్రం అసలైన లెక్కింపు ప్రారంభం కానుంది. బుధవారం విజేత ఎవరో తెలిసే అవకాశాల్లేవని అధికారులు భావిస్తున్నారు. గురువారం లేదా శుక్రవారం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. కౌంటింగ్‌కు ఏర్పాట్లు.. అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎనిమిది హాళ్లలో, ఒక్కో హాల్లో ఏడు టేబుళ్లను కౌంటింగ్ కోసం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తొలుత బ్యాలెట్ పత్రాలను 50 లేదా 100 బ్యాలెట్లను కలిపి ఒక్కొక్క బండిల్‌గా కడతారని, తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం పరిశీలన దిల్సుఖ్నగర్: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం లెక్కింపు కేంద్రాన్ని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ భద్రతా ఏర్పాట్లును పరిశీలించారు. ఇండోర్ స్టేడియం వద్ద మూడంచెల భద్రత, 1200 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. స్టేడియం చూట్టూ మౌంటెడ్ గుర్రాలు, పెట్రోలింగ్, సీసీటీవీలు కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజున 144 సెక్షన్ విధించినట్లు వెల్లడించారు. చదవండి: మంచి గవర్నర్... భోజనం పెట్టి; ల్యాప్‌టాప్ ఇచ్చి -
రేపే మున్సిపల్ కౌంటింగ్
-
లెక్కింపు వేళ జాగ్రత్తగా ఉందాం
సాక్షి, అమరావతి :ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఓట్ల లెక్కింపు సమయంలో చేసే కుట్రలు, కుతంత్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఇన్నేళ్ల కష్టాన్ని వృథా కాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. వైఎస్సార్ 2009లో మరణించిన తరువాత పదేళ్ల పాటు మహాభారత యుద్ధంలో పాండవుల్లాగా పోరాడామని, వైఎస్సార్ సీపీ విజయపథంలో దూసుకెళుతున్న తరుణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గురువారం విజయవాడలోని ఏ–1 కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్ సీపీ ఎన్నికల ఏజెంట్ల కౌంటింగ్ శిక్షణా శిబిరంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసిన అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులు, ఏజెంట్లు, పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు, పరిశీలకులు హాజరైన ఈ శిక్షణా శిబిరంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శామ్యూల్ తదితరులు పాల్గొని మాట్లాడారు. అజేయ కల్లంతోపాటు పలువురు మాజీ అధికారులు ఈ సందర్భంగా సందేహాలను నివృత్తి చేశారు. తొలుత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. విజయవాడకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కార్యకర్తలు కష్టాలకు ఎదురొడ్డి పోరాడారు పదేళ్లుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు పడ్డ కష్టాలు వర్ణనాతీతమని, వేలాది మందిపై ప్రభుత్వం కేసులు పెట్టి వేధించినా ఎన్నికల్లో పార్టీ కోసం తెగించి పని చేశారని విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తానని అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. పరాజయం పాలవుతున్నానని స్పష్టంగా తెలుసుకున్న చంద్రబాబు ఈవీఎంలపై లేనిపోని నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. 2014 ఎన్నికల్లో ఇవే ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకొచ్చాయని సూటిగా ప్రశ్నించారు. గతంలో కన్నా మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టిన ఈసీ.. ఓటర్లు తమ ఓటు ఎవరికి పడిందో తెలుసుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్లను అందుబాటులోకి తెచ్చినా చంద్రబాబు ఇంకా ఆరోపణలు చేస్తూ ఎన్నికల కమిషనర్లను నిందిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆధిక్యతతో ఉన్న చోట్ల సాధ్యమైనన్ని ఎక్కువ అభ్యంతరాలు, అనుమానాలు లేవనెత్తి కౌంటింగ్ ప్రక్రియకు అవాంతరాలు సృష్టించాలని చంద్రబాబు తన పార్టీ కౌంటింగ్ ఏజెంట్లను ఆదేశించారంటే ఆయన ఎంత దుర్మార్గమైన ఆలోచనలతో ఉన్నారో బోధపడుతోందన్నారు. మన ఏజెంట్లను అపహరించే ప్రమాదంఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఓట్ల లెక్కింపు రోజు వైఎస్సార్ సీపీ కౌంటింగ్ ఏజెంట్లను అపహరించాలని టీడీపీ పథకం వేస్తోందని, చివరి నిమిషంలో ఇలాంటి దుర్మార్గాలు జరిగితే కొత్త ఏజెంట్లను నియమించుకునే అవకాశం ఉండదని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులను హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించి పార్టీ కౌంటింగ్ ఏజెంట్లను ఒక రోజు ముందుగానే పిలిపించుకుని రక్షణ కల్పించాలని, ఓట్ల లెక్కింపు కేంద్రం వరకూ వారిని జాగ్రత్తగా తరలించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి కనీసం గంట ముందుగానే ఏజెంట్లు కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలకు ప్రవేశం ఉండదని గుర్తుంచుకోవాలని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. పోలింగ్ రోజు ప్రతి ఒక్క ఓటు కోసం ఎంత కష్టపడ్డామో లెక్కింపు రోజు ప్రతి ఓటునూ నిశితంగా పరిశీలించడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. అంకెలు, సంఖ్యలూ జాగ్రత్తగా గమనించాలన్నారు. ఒకటి రెండు ఓట్ల ఆధిక్యం కూడా గెలుపు ఓటములను నిర్ణయిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని కోరారు. లెక్కింపు సమయంలోఅతి విశ్వాసం వద్దు :మాజీ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లాం వైఎస్సార్ సీపీ శ్రేణులు ఈసారి క్షేత్రస్థాయిలో చాలా బాగా పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలిగాయని, అయితే ఓట్ల లెక్కింపు సందర్భంగా అతి విశ్వాసంతో ఉండవద్దని అజేయ కల్లం సూచించారు. ‘మనీ.. మీడియా... మ్యానిపులేషన్’ను తట్టుకుని విపక్ష కార్యకర్తలు పని చేశారని ప్రశంసించారు. లెక్కింపు సందర్భంగా టీడీపీ ఏజెంట్లు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కౌంటింగ్ సూపర్వైజర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లదేనని, వైఎస్సార్ సీపీ ఏజెంట్లు పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని సూచించారు. టీడీపీ ఏజెంట్లు రెచ్చగొట్టే చర్యలకు దిగినా సంయమనం కోల్పోవద్దన్నారు. కౌంటింగ్ ప్రక్రియ అంతా కెమెరాల్లో రికార్డు అవుతుందని వివరించారు. అభ్యంతరాలపై అక్నాలెడ్జ్మెంట్ తప్పనిసరి : మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శామ్యూల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లు రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా అందజేసి కచ్చితంగా ధృవీకరణ పత్రం తీసుకోవాలని మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శామ్యూల్ సూచించారు. లిఖితపూర్వకంగా కాకుండా నోటిమాటగా అభ్యంతరం తెలిపితే అది చట్టం ముందు నిలబడదని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలోనే ఈవీఎంల సెక్యూరిటీని ఏజెంట్లు జాగ్రత్తగా పరిశీలించి ప్రతి రౌండ్లోనూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాదికిపైగా రాష్ట్రమంతా కాలి నడకన తిరిగి చల్లిన విత్తనాలు బాగా పండాయనే వార్తలు వస్తున్నాయని, ఆ పంట ఫలాన్ని అందుకునే కీలకమైన ఓట్ల లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గరి నుంచి చివరి వరకూ ఏజెంట్లు కేంద్రంలోనే ఉండాలని, మధ్యలో వెళ్లవద్దని, నూరు శాతం ప్రక్రియ పూర్తయ్యాక గానీ బయటకు రావద్దని శామ్యూల్ సూచించారు. -
వరంగలో ఓట్ల లెక్కింపు ఇలా..
సాక్షి, జనగామ: ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక లెక్కింపే మిగిలింది. ఈవీఎంలను ఇప్పటికే స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపుకోసం ఆయా జిల్లాల అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థుల తరపున ఏజెంట్లను అనుమతిస్తారు. దీంతో ఆయా అభ్యర్థులు, వారు ఎంచుకున్న ఏజెంట్లకు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. సూచనలు... కౌంటింగ్ ఏజెంట్లుగా అనుభవం ఉన్న వ్యక్తులను ఎంచుకోవాలి. దాని వలన అభ్యర్థి ప్రయోజనాలు సరిగ్గా పరిరక్షించబడుతాయి. ఎన్నికల సంఘం శాశ్వత ఆదేశాల ప్రకారం సెక్యూరిటీ ఉన్న వ్యక్తులను కౌంటింగ్ ఏజెంట్లుగా అంగీకరించరు. ఎందుకంటే భద్రత సిబ్బందిని ఆయన వెంట లోనికి అనుమతించరు. భద్రత లేకుండా తాను వెళతానని లిఖిత పూర్వకంగా రాసిచ్చినా అంగీకరించరు. ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్లుగా పనిచేస్తే సదరు వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ప్రతి అభ్యర్థి ఎన్ని లెక్కింపు టేబుళ్లు ఉంటే అంతమందిని గరిష్టంగా 15 మందిని ఏజెంట్లుగా నియమించుకోవచ్చు. సాధారణంగా 12 నుంచి 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. వీటిలో ఒకటి రిటర్నింగ్ అధికారి టేబుల్ ఉంటుంది. కౌంటింగ్ ఏజెంటును ఫొటోలో ఉన్న అభ్యర్థి కానీ అతని ఎన్నికల ప్రతినిధి గానీ ఫారం 18లో వివరాలు అందజేసి, ఏజెంటు ఫొటోగ్రాఫ్, సంతకాలు చేసిన రెండు ఫారాలు రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. అభ్యర్థి తనకు సౌలభ్యంగా ఉంచేందుకు ఫారం 18లోనే తన తరుపు పాల్గొనే ఏజెంట్ల పేర్లు కూడా రాసి ఇవ్వొచ్చు. కౌంటింగ్‌కు మూడు రోజుల ముందుగా సాయంత్రం 5 గంటల లోగా ఏజెంట్ల జాబితా, ఫొటోలను రిటర్నింగ్ అధికారికి అందజేస్తే వారు అనుమతి పత్రాలను జారీ చేస్తారు. ఏజెంట్లు ఓట్ల లెక్కింపునకు గంట ముందుగా కౌంటింగ్ హాలుకు అనుమతి పత్రంతో హాజరుకావాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం.. మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. 17 సీ ఫారంలో ఈవీఎంల వారీగా పోలైన ఓట్ల వివరాలు ఉంటాయి ( పోలింగ్ పూర్తయ్యాక నమోదు చేస్తారు). పోలైన ఓట్లు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకుంటారు. వాటిని ఏజెంట్లు నోట్ చేసుకున్న అనంతరం ఈవీఎం ల సీల్ ను తొలగించి రిజల్ట్ బటన్ ను నొక్కుతారు. వెంటనే అభ్యర్థుల వారీగా... వారికి పోలైన ఓట్లు వెలువడతాయి. అనివార్య కారణాల చేత నియమించిన వ్యక్తి నచ్చక పోయినా.. లేదా అతను హాజరు కాలేకపోయినా.. ఫారం 19 పూర్తి చేసి ఓట్ల లెక్కింపునకు ముందుగా మరో ఏజెంటును నియమించుకోవచ్చు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే ఎట్టి పరిస్థితుల్లోను ఏజెంటును నియమించుకోవడానికి వీలు లేదు. ఏ టేబుల్ వద్ద నియమించిన ఏజెంటు అక్కడే ఉండాలి. అన్ని టేబుళ్ల వద్ద తిరగడానికి వీలు లేదు. హాలులో ఖచ్చితమైన క్రమశిక్షణ పాటించాలి. నియమాలు పాటించక పోతే ఏ ఏజెంటునైనా బయటకు పంపించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. లెక్కింపు పూర్తయి ఫలితాలు వెలువడే వరకు హాలు నుంచి ఏజెంటును బయటకు వెళ్లడానికి అనుమతించరు. కౌంటింగ్ హాలు దగ్గర తాగునీరు, అల్పాహారం, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తారు. లెక్కింపు కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు. లెక్కింపు కేంద్రంలో దూమపానం నిషేధం. వరుస క్రమంలో లెక్కింపు కొనసాగుతుంది. ప్రతి వరుసలో ఉన్న టేబుళ్లకు సీరియల్ నెంబర్ ఇవ్వబడుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్,అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలు, నమోదైన గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల ప్రాధాన్యత క్రమంలో ఏజెంట్లకు కుర్చీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క రౌండ్లో 14 ఈవీఎంల ఫలితాలు వెల్లడవుతాయి.. పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి రౌండ్ల లెక్కింపు ఉంటుంది. -
ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం నగరంలోని రాణీమేరీ కాలేజీలో ప్రారంభమైంది. ఉప ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత గెలుపు ఖాయమని ఇప్పటికే అన్నాడీఎంకే నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే అమ్మకు ఎంత మెజార్టీ లభిస్తుంది అనే అంశంపై వారిలో ఉత్కంఠత నెలకొంది. జూన్ 27న ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సీపీఐ మాత్రమే తమ అభ్యర్థిగా మహేంద్రన్ ను బరిలో దింపగా... మిగిలిన 26 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. ఈ ఉప ఎన్నికల్లో 74.4 శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే పాత వన్నార్పేటలో ఓటర్ల సంఖ్య కంటే అధిక శాతం పోల్ కావడంతో సదరు ప్రాంతంలో ఎన్నికల సంఘం సోమవారం రీపోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్షతోపాటు పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీపై అనర్హత విధించింది. అందులోభాగంగా శ్రీరంగం నుంచి ప్రాతినిధ్యం వహించిన జయలలిత ఎమ్మెల్యే పదవితోపాటు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే దీనిపై ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలను కొట్టివేసి.. జయను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆమె మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఆరునెలల్లో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జయలలిత ఆర్కే నగర్ నుంచి ఉప ఎన్నికల బరిలో దిగిన విషయం విదితమే. -
ఓటమి అంచున టీడీపీ అభ్యర్థి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఉపాధ్యాయ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన చైతన్యరాజు ఓటమికి చేరువయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి స్థానం నుంచి బరిలో దిగిన యూటీఎఫ్ అభ్యర్థి రామసూర్యారావు.. చైతన్య రాజు కంటే ముందజంలో కొనసాగుతున్నారు. మొత్తం 17487 ఓట్లు ఉండగా తొలి ప్రాధాన్యత ఓట్లలో దాదాపు 14 వేల ఓట్లు లెక్కించారు. రామసూర్యారావుకు 7265 ఓట్లు రాగా, చైతన్య రాజుకు 5443 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో రామసూర్యారావు విజయానికి కేవలం 300 ఓట్ల దూరంలో ఉన్నారు. -
రెండో రౌండ్లోనూ బీజేపీ ముందంజ
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో పట్టుభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్లో ముందంజలో ఉన్న రామచంద్రరావు రెండో రౌండ్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రామచంద్రరావు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ కంటే 6వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఫలితాల సరళి ఇలాగే కొనసాగితే గెలుస్తామని బీజేపీ వర్గాల ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి ఎర్రబెల్లి రామ్మోహన్ రావు పోటీ చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో నిలిచారు. -
గుంటూరు-కృష్ణా టీచర్స్ ఎమ్మెల్సీగా ఏఎస్ రామకృష్ణ
గుంటూరు : గుంటూరు-కృష్ణా జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ఏఎస్ రామకృష్ణ గెలుపొందారు. ఏఎస్ రామకృష్ణ తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుపై తొలి ప్రాధాన్యత ఓటుతో ఆయన విజయం సాధించారు. యూటీఎఫ్ తరపున బరిలోకి దిగిన ఏఎస్ రామకృష్ణకు 7,146 ఓట్లు రాగా, కేఎస్ లక్ష్మణరావుకు 5,392 ఓట్లు వచ్చాయి. కాగా తొలి నుంచి చివరి వరకూ ఏఎస్ రామకృష్ణకు లక్ష్మణరావు పోటీ ఇచ్చారు. మరోవైపు రాజకీయంగా ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి ఓట్లు వేయించుకున్నారని లక్ష్మణరావు ఆరోపించారు. కులపరంగా , వర్గ పరంగా టీచర్లను ఒత్తిళ్లకు గురిచేశారన్నారు. అయినా పెద్ద ఎత్తున టీచర్లు తనకు ఓట్లు వేశారని లక్ష్మణరావు తెలిపారు. ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కంపు మొదలైంది. తెలంగాణలోని రెండు పట్టభద్రుల స్థానాలకు, ఏపీలోని రెండు ఉపాధ్యాయ స్థానాలకు బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. లెక్కింపు ప్రక్రియకు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు చొప్పున 42 మంది కౌంటింగ్ సిబ్బందితోపాటు ప్రతి టేబుల్‌కూ ఒక కౌంటిం గ్ సూపర్వైజర్ను నియమించారు. అలాగే సబ్‌కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులను కౌంటింగ్ టేబుళ్ల వద్ద పర్యవేక్షణకు నియమించారు. *హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి ...హైదరాబాద్ చాదర్‌ఘాట్ విక్టోరియా ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. ఈ స్థానానికి ఎమ్మెల్సీ బరిలో 31మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 39శాతం ఓట్లు పోల్ అయ్యాయి. * వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానానికి ...నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ మొదలైంది. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ బరిలో 22మంది అభ్యర్థులు ఉండగా, 51 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. *ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 15మంది అభ్యర్థులు ఉండగా, 83 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. *కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గుంటూరు సెయింట్ జోసెఫ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతోంది. ఎమ్మెల్సీ బరిలో ఆరుగురు అభ్యర్థులు పోటీ చేయగా 70శాతం ఓట్లు పోల్ అయ్యాయి. లెక్కింపు ప్రక్రియ ఇలా ఉదయం 7.50 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ను పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారు.కౌంటింగ్ హాలులో ఏర్పాటు చేసిన 14 టేబుళ్లపై ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. -
ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు నేడు
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు-కృష్ణా జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ స్థానానికి జరిగిన ఎన్నిక ఫలితం బుధవారం తేలనుంది. గుంటూరులోని సెయింట్ జోసఫ్ మహిళా బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం వేదికగా గెలుపెవరిదో తేలనుంది. ఈనెల 22న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపోటములపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఎన్నికలో రెండు జిల్లాల పరిధిలో ఉన్న మొత్తం 18,931 ఓట్లలో 13,046 ఓట్లు పోలయ్యాయి. గుంటూరులో 6,672, కృష్ణా జిల్లాలో 6,374 ఓట్లు ఉన్నాయి. రెండు జిల్లాల్లోని 110 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లన్నింటినీ ఒక డబ్బాలో పోసి అభ్యర్థుల వారీగా విభజించి లెక్కిస్తారు. ప్రథమ ప్రాధాన్యత ఓటుతో పాటు రెండో ప్రాధాన్యత ఓటును వేర్వేరుగా లెక్కిస్తారు. ఇందుకు సెయింట్ జోసఫ్ కళాశాలలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరిగినందున ఓట్ల లెక్కింపు, తుది ఫలితం ప్రకటించేందుకు అధికం సమయం పట్టే అవకాశముంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పోలీసుశాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. లెక్కింపు కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు పరుస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ఫలితాల కోసం అభ్యర్థులు, మద్దతుదారులు ఎదురుచూస్తున్న తరుణంలో మరి కొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకోండి -భన్వర్‌లాల్ గుంటూరు ఈస్ట్: కృష్ణా-గుంటూరు జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మంగళవారం హైదరాబాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించాలన్నారు. 25న ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. లెక్కింపు హాలులో సీసీ టీవీ,కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గుర్తింపు కార్డు కలిగిన వారిని మినహా ఇతరులను కేంద్రంలోనికి ,లెక్కింపు హాలులోనికి అనుమతించవద్దని ఆయన స్పష్టం చేశారు. పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. లెక్కింపు ప్రక్రియలో ఏ సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. లెక్కింపు ముగిసిన వెంటనే అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలను ఎన్నికల ఏజెంట్లకు తెలియజేయాలన్నారు. ఎన్నికల సంఘం పరిశీలన అనంతరం అభ్యర్థి ఎంపిక ప్రకటనను తెలియజేస్తుందని, అనంతరం రిటర్నింగ్ అధికారి ప్రకటించవచ్చని చెప్పారు. -
రేపే విడుదల!
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలకు పోటీ చేసిన 897 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరో 24 గంటల్లో వెలువడనుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల్లో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. శుక్రవారం జరగనున్న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. ఏప్రిల్ 10, 17, 24 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మూడు దశల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. రేపటితో ఇవి బహిర్గతం కానున్నాయి. ప్రత్యేక ఏర్పాట్లలో ఎన్నికల సంఘం... ఓట్ల లెక్కింపు ప్రక్రియ నుంచి ఫలితాల ప్రకటన వరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసింది. ఇందుకోసం మంత్రాలయలో 12 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ఓట్ల లెక్కింపు వివరాలు ఈ కంట్రోల్ రూమ్‌ల ద్వారా తెలియజేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్‌ల నిర్వహణ బాధ్యతలను 20 మంది అధికారులకు అప్పగించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 14 రౌండ్లుగా ఓట్ల లెక్కింపు జరగనుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉన్న చోట టేబుల్స్ సంఖ్యను పెంచనున్నారు. భద్రతపై ప్రత్యేక శ్రద్ధ.. ఓట్ల లెక్కింపు సందర్భంగా భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఎలాంటి అవాఛంనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు.. ఏదైన తీవ్రమైన సంఘటన జరిగితే కాల్పులు కూడా జరిపేందుకు పోలీసులకు అనుమతులిచ్చారని చెప్పారు. లెక్కింపు కేంద్రాల వద్దకు కేవలం పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మంత్రాలయలో ప్రతి అంతస్తుపై ఎన్నికల ఫలితాల వివరాలను తిలకించేందుకు టీవీలు ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు మంత్రాలయ ప్రధానద్వారం, పోస్ట్‌ఆఫీస్‌వైపు ఉన్న ద్వారం వద్ద భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. టీవీ, రేడియోల్లో... ప్రజలందరికి ఓట్ల లెక్కింపు వివరాలు దూరదర్శన్‌తోపాటు ఆకాశవాణి(రేడియో) ద్వారా వెనువెంటనే తెలియజేయనున్నారు. ప్రతీరౌండ్‌లో ఏ అభ్యర్థికి ఆధిక్యం లభించింది? ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి..? ఎవరు విజయం సాధించారు..? ఇలా అన్ని వివరాలను వెనువెంటనే ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. విజయోత్సవాల ఏర్పాట్లలో గెలుపు గుర్రాలు... ఆలూ లేదు... చూలూ లేదు... కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా నేటి రాజకీయాల పరిస్థితి ఉంది. శుక్రవారం వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు ప్రముఖ పార్టీలకు చెందిన కొందరు నాయకులు అప్పుడే సన్నద్ధమయ్యారు. ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయనే ధీమాతో కొందరు ముందే భారీగా మిఠాయిలు, డీజే సౌండ్ సిస్టం, విద్యుత్ దీపాలు, బ్యాండ్ బృందాలు, బాణసంచాలకు అప్పుడే అర్డర్లు ఇచ్చేశారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలుసుకున్న బీజేపీ వర్గాలు కూడా భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ఆనందోత్సవాలు నిర్వహించేందుకు అవసరమైన సరంజామాను ఫలితాలకు ముందే సిద్ధం చేసుకున్నాయి. దీంతో మిఠాయి షాపులు, బ్యాండ్ బృందాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫలితాల అనంతరం ప్రజలకు పంపిణీ చేసేందుకు నగరంలోని గిర్గావ్ (చర్నిరోడ్) ప్రాంతంలోని ప్రముఖ గణేశ్ భండార్ షాపు యజమానికి సుమారు 25-30 వేల బూంది లడ్డూలు తయారుచేయాలని బీజేపీ నాయకులు ఆర్డర్ ఇచ్చారు. లడ్డూలకు తోడుగా ప్రముఖులకు అందజేసేందుకు ఖరీదైన బర్ఫీ, కాజుకత్రీ, మాల్‌పోహ లాంటి స్వీట్లు కూడా అర్డర్ చేసినట్లు బీజేపీ ప్రతినిధి అతుల్ షా చెప్పారు. కమలం ఆకారంలో ఉండే 10 కేజీల భారీ కేక్ కూడా అర్డర్ ఇచ్చారు. ఫలితాలకు ఒక రోజు ముందు (15న) సీపీ ట్యాంక్ పరిసరాల్లో నరేంద్ర మోడీ, ఆయన తల్లి ఇంటర్వ్యూ ఎల్సీడీపై ప్రసారం చేయనున్నారు. 16న నాగ్పాడా, కామాటిపుర, కస్తూర్భా గాంధీ చౌక్, ఉమర్‌ఖాడీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఫలితాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
పుర ‘ఫలితం’ నేడే
సాక్షి, కర్నూలు : ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం బట్టబయలు కానుంది. 43 రోజుల ఉత్కంఠకు సోమవారంతో తెరపడనుంది. మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల సస్పెన్స్ వీడనుంది. జిల్లాలోని నంద్యాల, నందికొట్కూరు, డోన్, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలతో పాటు ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీలకు గత మార్చి 30న పోలింగ్ నిర్వహించడం తెలిసిందే. ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావితం చూపుతాయంటూ పలు పార్టీలు కోర్టును ఆశ్రయించడంతో కౌంటింగ్ ఈనెల 12వ తేదీకి వాయిదా పడింది. మొత్తం 219 వార్డుల్లో.. ఆళ్లగడ్డలోని రెండు (3, 4) వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 217 వార్డుల్లో ఆయా పార్టీల అభ్యర్థులు తలపడ్డారు. సోమవారం చేపట్టనున్న ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలకు చెందిన ఈవీఎంలను కర్నూలు శివారులోని సెయింట్ జోసెఫ్ బాలికల కళాశాలకు తరలించి స్ట్రాంగ్‌రూములో భద్రపరిచారు. ఇక్కడే ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు నెలన్నర రోజులుగా ఫలితం కోసం అభ్యర్థులు నిరీక్షించాల్సి వచ్చింది. వరుస ఎన్నికల నేపథ్యంలో వీరంతా క్షణమొక యుగంగా గడిపారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం మొట్టమొదటగా వెలువడుతున్న ఫలితాలు మున్సిపల్ ఎన్నికలవే కావడం అన్ని పార్టీలను కలవరపరుస్తోంది. వెనువెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అందరి దృష్టి ఈ ఫలితాలపైనే కేంద్రీకృతమైంది. పురపోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆశావహుల సంఖ్య అమాంతం పెరిగిపోవడంతో ఆఖరి క్షణం వరకు బరిలో ఎవరుంటారనే విషయంలో సందిగ్ధం తలెత్తింది. దీంతో పలు మున్సిపాలిటీల్లో చైర్మన్‌గిరిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎట్టకేలకు సోమవారం మున్సిపల్ ఫలితాలు వెల్లడి కానున్న దృష్ట్యా అభ్యర్థుల్లో వణుకు మొదలైంది. ఇదిలా ఉండగా రాష్ట్రపతి పాలన నేపథ్యంలో చైర్మన్ల ఎంపిక వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. -
వేడెక్కిన గ్రామీణం
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరో 24 గంటల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఫలితాలను వాయిదా వేసింది. ఈనెల 7న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో 13న ఉదయం 8 గంటలకు ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చర్చనీయాంశమైంది. అధికారులు ఈ రికార్డులను చిత్తు కాగితాలుగా పేర్కొంటున్నా.. నిజానిజాలు కొత్త పాలకవర్గం ఏర్పాటుతో వెల్లడి కానుంది. సోమవారం కర్నూలు నగరంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో నంద్యాల మున్సిపల్ కమిషనర్‌తో పాటు కీలక సిబ్బంది ఆ విధుల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయ ఆవరణ నుంచి పొగలు వస్తుండటంతో స్థానికులు గుర్తించి కార్యాలయ కింది స్థాయి సిబ్బందికి సమాచారం చేరవేశారు. వెంటనే వారు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకునే సరికి పలు రికార్డులు కాలిపోగా.. మరికొన్ని మంటలను ఆర్పేందుకు వినియోగించిన నీటితో ఎందుకూ పనికిరాకుండాపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే పాత రికార్డు గదికి విద్యుత్ సరఫరాను నిలిపేశారు. చిమ్మచీకట్లో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందిపడ్డారు. పోలీసులు, ఎలక్ట్రానిక్ మీడియా లైటింగ్‌తో మంటలను అదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదం వెనుక గత పాలకవర్గాల కుట్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2005 నుంచి 2010 సంవత్సరాల మధ్య కౌన్సిల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన కౌన్సిల్ సభ్యులు విచారణ చేపట్టాలని కోరినా అప్పటి మున్సిపల్ చైర్మన్ కైప రాముడు, వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ అంగీకరించలేదు. తాజాగా ఏర్పాటయ్యే పాలకవర్గం అప్పటి అక్రమాలపై ఎక్కడ విచారణకు ఆదేశిస్తుందోననే భయంతోనే ఇలా చేసి ఉంటారా? అని పలువురు అనుమానిస్తున్నారు. కాలింది చిత్తు కాగితాలే: రామచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ అగ్ని ప్రమాదంలో కాలిపోయింది చిత్తు కాగితాలు మాత్రమే. ఆ గదిలో కీలక రికార్డులేవీ లేవు. 2009లో సంభవించిన వరదల్లో పూర్తిగా పనికిరాకుండాపోయిన పలు పేపర్లను ఆ గదిలో భద్రపరిచాం. గత పది సంవత్సరాలకు సంబంధించిన రికార్డులన్నీ సురక్షితంగానే ఉన్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నాం. కౌంటింగ్ ముగిసిన వెంటనే ప్రమాదానికి కారణాలను తెలుసుకుంటాం. -
పురపాలకులు తేలేది నేడే
ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీ స్థానాల ఫలితాలు వెల్లడి - 210 వార్డులకు 1311మంది అభ్యర్థులు పోటీ - మధ్యాహ్నం వరకు ఓట్ల లెక్కింపు పూర్తి - గెలుపు సంబరాలు, ర్యాలీలు నిషేధం - కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు - మద్యం దుకాణాలు బంద్ నల్లగొండ, న్యూస్‌లైన్, పురపాలకుల భవితవ్యం సోమవారం తేలనుంది. ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణ నేటితో తెరపడనుంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. మొత్తం 210 వార్డులకు ఒక్కో వార్డుకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 1311 మంది పోటీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన చాలా వ్యవధి తర్వాత ఫలితాలు వెల్లడవుతుండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏడు స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నల్లగొండ శివారు ప్రాంతంలోని డాన్‌బోస్కో స్కూల్లో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 7.30 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేస్తారు. ఆ తర్వాత 8 గంటల నుంచి ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఓట్ల కౌటింగ్ సజావుగా సాగేందుకు కౌంటింగ్ కేంద్రంలో టేబుళ్లు 37 ఏర్పాటు చేశారు. సిబ్బంది 148మందిని నియమించారు. నల్లగొండ మున్సిపాలిటీకి 7, మిగతా ఆరు స్థానాలకు ఐదు చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డు ఓట్ల లెక్కింపు మూడు రౌండ్లలో పూర్తి చేస్తారు. మొత్తం అన్ని వార్డుల ఓట్ల లెక్కింపు 17 రౌండ్లలో పూర్తవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితాలు వెల్లడిస్తారు. భారీ బందోబస్తు... ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కౌంటింగ్ కేంద్రం వెలుపల, బయట పోలీస్ బలగాలతో పాటు, ప్రత్యేక పోలీస్ ఫోర్సు ఏర్పాటు చేశారు. ఏడుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, ఎస్ఐలు 69 మంది, ఏఎస్ఐలు 89 మంది, కానిస్టేబుళ్లు 248, హోంగార్డులు 179 మందిని నియమించారు. వీరితోపాటు స్పెషల్ పార్టీ, ఆర్మ్డ్ రిజర్వు పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలను కూడా మోహరించారు. మద్యం దుకాణాలు బంద్ గెలుపు సంబరాలతో పాటు మద్యం దుకాణాలు కూడా మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరిటెండెంట్ దత్తురాజు గౌడ్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. -
స్థానిక కౌంటింగ్ కేంద్రాల్లో మార్పులు
- మొత్తం ఆరు చోట్ల లెక్కింపు - ఏర్పాట్లు సిద్ధం చేసిన యంత్రాంగం చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో ఏప్రిల్‌లో నిర్వహించిన 65 జెడ్పీటీసీ, 901 ఎంపీటీసీ స్థానాల ఫలితాలను ఈనెల 13వ తేదీ ప్రకటించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఐదు చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పత్రాలను లెక్కించాలని అధికారులు నిర్ణయించారు. అయితే మదనపల్లెలోని వశిష్ట కళాశాలలో స్థలం చాలకపోవడంతో పక్కనే ఉన్న కేశవరెడ్డి పాఠశాలను సైతం ఎన్నికల కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ రాంగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజాపరిషత్ సీఈవో వేణుగోపాలరెడ్డి, రిటర్నింగ్ అధికారి రవిప్రకాష్‌రెడ్డి తదితరులు కేశవరెడ్డి పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటుతో పాటు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాలు జిల్లాలో మొత్తం ఆరుచోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 65 మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ 13వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివాదాలు ఏర్పడితే రీకౌంటింగ్ ఏర్పాటు చేయడం లాంటి అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ఏ సమయానికి పూర్తవుతుందనే విషయంపై అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఇక డివిజన్లు, మండలాల వారీగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలిస్తే.. చిత్తూరు.. చిత్తూరు మండలంలోని చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, బంగారుపాళెం, తవణంపల్లె, ఐరాల, ఎస్ఆర్.పురం, వెదురుకుప్పం, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, పాలసముద్రం, కార్వేటినగరం, నారాయణవనం, నగరి, నిండ్ర, విజయపురానికి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను పూతలపట్టు మండల సమీపంలోని వేము ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. పలమనేరు.. రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం, కుప్పం, పలమనేరు, గంగవరం, బెరైడ్డిపల్లె, వీ.కోట, రామసముద్రం, పెద్దపంజాణి, పుంగనూరు, చౌడేపల్లె, పీలేరు, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, కేవీ.పల్లె, రొంపిచెర్ల, సదుం, సోమల మండలాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను పలమనేరులోని మదర్ థెరిస్సా జూనియర్ కళాశాలలో లెక్కిస్తారు. మదనపల్లె.. మదనపల్లెలోని మాచిరెడ్డిగారిపల్లెలో ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో నిమ్మనపల్లె, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. ఇక మదనపల్లె పట్టణంలోని వశిష్ట పాఠశాలలో మదనపల్లె, కురబలకోట, బీ.కొత్తకోట, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, పీటీఎం, ములకలచెరువు మండలాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. తిరుపతి.. తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో పాకాల, చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట, ఏర్పేడు, పులిచెర్ల, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే తిరుపతి నగరంలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, బీఎన్.కండ్రిగ, కేవీబీ.పురం, వరదయ్యపాళెం మండలాలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. -
ఓట్ల లెక్కింపునకు 1320 మంది
- 14న సిబ్బందికి శిక్షణ చిత్తూరు(జిల్లాపరిషత్)న్యూస్‌లైన్: జిల్లాలో ఈనెల 7వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కేంద్రం చిత్తూరులో మూడు కాలేజీల్లో ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే.రాంగోపాల్ సారథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మూడు (రాజంపేట, చిత్తూరు, తిరుపతి) లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన సిబ్బంది ఎంపికను పూర్తి చేశారు. దీనికి గాను జిల్లాలో 1320 మంది సిబ్బందిని ఓట్ల లెక్కింపు విధులకు ఎంపిక చేశారు. మూడు లోక్‌సభ స్థానాల పరిధిలో పోలైన అసెంబ్లీ, లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు మొత్తం 364 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మూడు చోట్ల ఓట్ల లెక్కింపు జిల్లాలోని చిత్తూరు, రాజంపేట, తిరుపతి లోక్‌సభ పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును చిత్తూరులోని శ్రీనివాస ఇన్స్టిట్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీటమ్స్), ఒకే క్యాంపస్‌లో ఉన్న ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, ఆర్కేఎం లా కాలేజీలో నిర్వహించనున్నారు. శ్రీవేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టె క్నాలజీలో తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, చిత్తూ రు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను లెక్కిస్తారు. ఆర్కేఎం లా కాలేజ్ క్యాంపస్‌లో పీలేరు, మదనపల్లె, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు లెక్కిస్తారు. ఇందుకు గాను అసెంబ్లీకి 86 టేబుళ్లు, లోక్‌సభకు పోలైన ఓట్ల లెక్కింపునకు 86 టేబుళ్లు ఏర్పాటు చేశారు.చిత్తూరులోని శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ (సీటమ్స్)లో చిత్తూరు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని చంద్రగిరి, నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పంతో పాటు, తిరుపతి అసెంబ్లీ ఓట్లను లెక్కిస్తారు. ఈ కేంద్రంలో అసెంబ్లీ కౌంటింగ్‌కు 98 టేబుళ్లు, లోక్‌సభకు 94 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 1320 మంది ఉద్యోగులను ఉపయోగించనున్నారు. 14న శిక్షణ జిల్లాలో 16వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎంపిక చేసిన కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సహాయకులు, సూక్ష్మపరిశీలకులకు బుధవారం చిత్తూరులోని మహతి ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కే.రాంగోపాల్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎంపికైన సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, సిబ్బంది అందరూ సకాలంలో ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు -
మరో 24 గంటలే..!
- రేపే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ - పది గంటల కల్లా ఫలితం - నర్సీపట్నం, యలమంచిలిలో సందడి నర్సీపట్నం, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల ముహూర్తం సమీపిస్తోంది. ఓట్ల లెక్కింపు మరో 24 గంటల్లో ప్రారంభం కానుంది. సుమారు 45 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. పది గంటల కల్లా తొలి ఫలితం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు పట్టణాల్లో చైర్మన్ పీఠాలను ఏ పార్టీవారు అధిష్టించనున్నారో తేలిపోనుంది. జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు మార్చి 30న పోలింగ్ నిర్వహించారు. సోమవారం ఈ ఓట్ల లెక్కింపునకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. దీంతో రెండు పురపాలికల్లోనూ సందడి నెలకొంది. నర్సీపట్నంలో 27, యలమంచిలిలో 24 వార్డులున్నాయి. యలమంచిలిలో ఒకటి ఏకగ్రీవమైంది. రెండు పట్టణాల్లోనూ 50 వార్డుల్లో 75,265 మంది ఓటర్లకు 59,441 మంది ఓటేశారు. ప్రధానంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే పోటీ చోటుచేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వీటి ఫలితాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి పెదబొడ్డేపల్లి డాన్బాస్కోప్ కాలేజి, యలమంచిలికి అనకాపల్లి ఏఎమ్ఏఎల్ కాలేజీలోనూ లెక్కిపు చేపడతారు. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చారు. లెక్కింపునకు ఒక్కో మున్సిపాలిటీకి 30 మంది అధికారులతో పాటు మరో 30 మంది కిందస్థాయి సిబ్బందిని నియమించారు. ఈవీఎంలతో పోలింగ్ కారణంగా ఫలితాలు వేగంగా వెలువడనున్నాయి. పది గంటల కల్లా తొలి ఫలితం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుంటే మధ్యాహ్నం ఒంటి గంట కల్లా లెక్కింపు ముగించి, పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు ప్రజాప్రతినిధులు, స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో పోటీచేసిన వివిధ పార్టీల ప్రతినిధులు తమ అభ్యర్థుల విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేస్తూ, సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేయండి
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందనరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపుపై అధికారులతో చర్చించారు. జిల్లాలోని రెండు పార్లమెంటు, 16 అసెంబ్లీ (ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం లోని కైకలూరు, నూజివీడు) నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు. ఈ నెల 16వ తేదీన కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్నాయి. శుక్రవారం రాత్రి వర్షం కురిసిన నేపథ్యంలో శనివారం ఉదయం స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ పరి శీలించారు. అవసరమైన చోట్ల స్ట్రాంగ్ రూమ్‌లకు వెలుపలి భాగంలో టార్పాలిన్ పట్టాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కాలేజీ లోపలకు ప్రవేశించడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయి, ఏబ్లాక్ నుంచి ఏ బ్లాక్‌కు చేరుకోవచ్చు, భోజన ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో చర్చించి తగు సూచనలు ఇచ్చారు. పరిశీలకులకు కేటాయించిన రూమ్‌లు, మీడియా సెంటర్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. కళాశాల ఆవరణలో వాహనాల కదలికలను నియంత్రించటానికి కొత్తగా వేస్తున్న రోడ్డు మార్గాన్ని కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ జె.మురళి తదితర అధికారులు కలెక్టర్‌తో పాటు ఏర్పాట్లను పరిశీలించారు. -
తేలనున్న నే‘తల రాత’
సదాశివపేట, న్యూస్‌లైన్: మున్సిపల్, ప్రాదేశిక ఫలితాలపై నెల కొన్న ఉత్కంఠకు రెండు రోజుల్లో తెరపడనుం ది. ఈనెల 12న మున్సిపల్, 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కిపు జరుగనుంది. అదేరోజు ఫలితాలు వెలువడుతాయి. అయితే అభ్యర్థు ల్లో ఫలితాల టెన్షన్ నెలకొంది. సదాశవపేట పట్టణంలోని మున్సిపల్, మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు హోరాహోరిగా జరి గాయి. మున్సిపల్ ఎన్నికల్లో 132 మంది కౌన్సిలర్ అభ్యర్థులుగా, జెడ్పీటీసీ అభ్యర్థులుగా నలుగురు, ఎంపీటీసీ సభ్యులుగా 54 మంది బరిలో నిలిచారు. గెలిచేందుకు శతవిధాలుగా ప్రయత్నించి అన్ని అస్త్రాలను ఉపయోగించా రు. తమ స్థాయి కంటే అధికంగా డబ్బులు ఖర్చు చేశారు. కొందరు అభ్యర్ధులు స్థలాలు, పొలాలు, నగలు తాకట్టు పెట్టి మరి డబ్బులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చుపెట్టారు. అయినా తమను గెలుపు వరిస్తుందా లేదా అన్న గుబు లు వారిలో నెలకొంది. ఫలితాలు అనుకులం గా వస్తే సరి లేకుంటే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అభ్యర్ధులను వేధిస్తోంది. ఫలితాలు అనుకూలంగా రాకుంటే కొందరు అభ్యర్థులు దివాలు తీసే పరిస్థితి ఉందని సమాచారం. మళ్లీ వేడెక్కుతున్న రాజకీయం జోగిపేట: స్థానిక ఓట్ల లెక్కింపు ఫలితాల తేదీ సమీపించడంతో మళ్లీ పల్లెలు, పట్టణాల్లో రాజకీయం వేడెక్కింది. ఎవరు గెలుస్తారన్న విషయమై చిన్నా చితక పందేలు గ్రామాల్లో ఊపందుకున్నాయి. ఇన్నాళ్లు సార్వత్రిక ఎన్నికల మాటున మరచిపోయిన అభ్యర్థుల్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. నెల రోజుల నిరీక్షణ అనంతరం ఫలితాలు వస్తున్నాయని అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటుండగా, మున్సిపల్, జడ్పీ, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలపై మళ్లీ ఉత్కంఠే నెలకొంది. ఈ పదవుల ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి అధికార ఆదేశాలు ఇవ్వకపోవడంతో జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవతరించనుండడంతో సందిగ్దం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ఈ పదవులకు పరోక్ష ఎన్నిక ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే, ఎంపీల ఓటు కీలకం కానుంది. మరిన్ని రోజులు మున్సిపల్ చెర్మైన్, పరిషత్ చైర్మన్లపై ఆశలు పెట్టుకున్న వారికి మరిన్ని రోజులు నిరీక్షణ తప్పడంలేదు. చైర్మన్ పీఠంపై పార్టీల గురి వరుసగా మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెలువడుతుండడంతో ఇప్పుడు అన్ని పార్టీలు చైర్మన్ పీఠంపై గురి పెట్టాయి. ఈ పదవులను కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. తమ అభ్యర్థులను బరిలో నిలిపిన అన్ని పార్టీలు ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. తమకు ఎన్ని స్థానాలు వస్తాయి..స్పష్టమైన మెజార్టీకి ఇంకా ఎన్ని స్థానాలు అవసరమవుతాయి.. స్వతంత్రులు ఎంత మంది గెలుస్తారు..చిన్న పార్టీలకు ఎన్ని స్థానాలు వస్తాయి వారిని మనవైపు ఎలా త్రిప్పుకోవాలి..అనే ఆంశాలపై చర్చల్లో మునిగారు. క్యాంపులంటేనే బెంబేలు మున్సిపల్, జడ్పీ, పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకపోవడంతో ఫలితాలు వెలువడిన తర్వాత క్యాంపులంటేనే పదవులు ఆశిస్తున్న అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఫలితాలు వచ్చిన పది రోజుల్లోగా పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే క్యాంపుల నిర్వాహణ పెద్ద భారం కాదు. కానీ ఈసారి ఫలితాలు వెలువడిన చాలా రోజుల తర్వాత పరోక్ష ఎన్నికలు జరుగనుండడంతో క్యాంపులంటేనే పార్టీల నేతలు, పదవులు ఆశించే వారు హడలెత్తిపోతున్నారు. ఎన్నికల కమిషన్ ఈఎన్నికలపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. -
పకడ్బందీగా కౌంటింగ్ ఏర్పాట్లు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: సార్వత్రిక సంగ్రామంలో తుది ఘట్టమైన ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. బుధవారం ఆమె, జేసీ శరత్‌తో కలిసి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వివిధ శాఖ అధికారులతో కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈనెల 16న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కోసం 700 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వీరందరికీ ఈనెల 12న శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె వెల్లడించారు. సంగారెడ్డి సమీపంలోని గీతం విశ్వవిద్యాల యం, ఎంఎన్ఆర్ వైద్య కళాశాల, డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలను ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోని ప్రతి టేబుల్ వద్ద ఒక పరిశీలకుడిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో పంపించేందుకు ప్రతి అసెం బ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక సమన్వయ అధికారిని నియమించనున్నట్లు వెల్లడించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలోనూ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ వారీగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేస్తామని స్మితా సబర్వాల్ తెలిపారు. నిర్లక్ష్యం తగదు కౌంటింగ్ ఏర్పాట్లలో ఏ మాత్రం నిర్లక్ష్యంచే యవద్దని కలెక్టర్ అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో బారికేడ్లు, ఏజెంట్లు కూర్చునేందుకు కుర్చీలు, ఈవీఎంలను ఉంచేందుకు టేబుళ్లు సిద్ధం చేయాలన్నారు. అంతేకాకుండా రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల కార్యాలయ వసతితో సహా ఏర్పాట్లన్నీ ఈ నెల 10లోపు పూర్తి చేయాలని స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు, గదులను తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గాల్లో అదనంగా ఉన్న ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌కు తరలించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ దయానంద్, హౌసింగ్ పీడీ బాల్‌రెడ్డి, ఏఓ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపు శిక్షణ ప్రారంభం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల తలరాతలను తేల్చేందుకు ఈనెల 16న జరగాల్సిన ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతోంది. ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపుపై మూడురోజుల శిక్షణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రవీణ్‌కుమార్ సోమవారం ప్రారంభించారు. రాష్ట్రంలోని 39, పుదుచ్చేరిలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు వివిధ పార్టీలు పోటీపడ్డాయి. గత నెల 24వ తేదీన పోలింగ్ ముగియగా ఈనెల 16న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సుమారు 16 వేల మంది సిబ్బందిని ఈ పనులకు నియమించారు. ఈవీఎంలను ఎలా తెరవాలి, లెక్కింపు ఎలా ప్రారంభించాలి, రెండవసారి ఎలా ధృవీకరించుకోవాలి, రౌండ్ల వారీగా వివరాలను ఎలా నమోదు చేసుకోవాలి, విజేతకు ధృవీకరణ పత్రం ఎలా అందజేయాలనే అంశాలపై ఈవీఎంను చేతపుచ్చుకుని వివరించారు. 77 మందికి నాలుగుదశల్లో శిక్షణ నిచ్చారు. ఈనెల 7వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు సాగుతాయి. తొలినాటి కార్యక్రమంలో శిక్షణ పొందిన 308 మంది అధికారులు త మ పరిధిలో పనిచేసే కింది స్థాయి సిబ్బందికి నేర్పిస్తారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, 8 జిల్లాలకు చెందిన జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు నాలుగు షిప్టుల్లో శిక్షణ నిచ్చినట్లు తెలిపారు. లెక్కింపు విధులకు అధికారుల నియూమకంపై వారంరోజుల ముందుగా నిర్ణయం తీసుకుంటామని, ఎవరెవరు, ఏ బాధ్యతలు నిర్వర్తించాలో లెక్కింపునకు ముందురోజు అంటే ఈనెల 15న లాటరీ విధానంలో నిర్ణయిస్తామన్నారు. ఏ టేబుల్‌పై ఎవరు బాధ్యతలు నిర్వర్తించాలో 16న తెల్లవారుజాము 5 గంటలకు లాటరీ పద్ధతి ద్వారానే ఎంపిక చేస్తామని తెలిపారు. రాజకీయ జోక్యాలకు తావులేకుండా ఈ పద్ధతిని అవలంభిస్తున్నామని చెప్పారు. 7 గంటలకు ఏజెంట్లు విధులకు హాజరుకావాలి, 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, 8.30 గంటలకు సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని అయన వివరించారు. నుంగంబాక్కంలో జరిగిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ప్రధానాధికారులు, ఎన్నికల నిర్వహణాధికారులు, నియోజకవర్గ అధికారులు, పర్యవేక్షణాధికారులు తదితర 8 కేటగిరిలకు చెందిన 77 మంది అధికారులు తొలినాటి శిక్షణలో పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఒక్కలిగ సంఘం ఎన్నికలు
93.12 శాతం పోలింగ్ నమోదు సోమవారం ఓట్ల లెక్కింపు కోలారు/మాలూరు/ముళబాగిలు, న్యూస్‌లైన్ : రాష్ట్ర ఒక్కలిగ సంఘానికి సంబంధించి కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల నుంచి మూడు డెరైక్టర్ల స్థానాలకు ఆదివారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 93.12 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం గోకుల విద్యా సంస్థలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. కోలారు, చిక్కబళ్లాపురంలో మొత్తం 35500 ఓటర్లు ఉండగా 32162 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోలారులోని మహిళా సమాజ కళాశాల, సదాశివ స్మారక భవనంతోపాటు మొత్తం 19 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోలారు తాలూకాలో 9354 మంది ఓటర్లు ఉండగా 8157 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కలిగ సంఘానికి జరిగిన ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. మహిళా సమాజ తదితర పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థుల మద్దతు దారులు మకాం వేసి ఓటర్లను ఓటు అడగడం కనిపించింది. బరిలో 14 మంది అభ్యర్థులు : ఒక్కలిగ సంఘం డెరైక్టర్ల స్థానాలకు నిర్వహించిన ఎన్నికలో కోలారు చిక్కబళ్లాపురం నుంచి 14 మంది బరిలో ఉన్నారు. వీఈ రామచంద్ర, కేబి గోపాలకృష్ణ, హెచ్‌సీ నవీన్‌కుమార్, పి. నాగరాజ్, ఆర్.నంజుండగౌడ, డీకే రమేష్, యలువళ్లి రమేష్, డి.రామచంద్ర, టి.ఎం.రఘునాథ్, హెచ్. లోకేష్, సి.వి. లోకేష్ గౌడ, ఎన్.శ్రీరామరెడ్డి, ఎం.ఎల్. సతీష్, ఎం.ఎన్. సదాశివరెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 14 మందిలో ఎక్కువ ఓట్లు పొందిన ముగ్గురు అభ్యర్థులను ఉభయ జిల్లాల నుంచి డెరైక్టర్లుగా ఎంపిక చేస్తారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఒక్కలిగ సంఘం డెరైక్టర్ల స్థానాలకు ఆదివారం మాలూరు, ముళబాగిలులో ఎన్నికలు నిర్వహించారు. మాలూరులో బీజీఎస్ విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 85 శాతం పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్యే మంజునాథ్‌గౌడ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అదేవిధంగా ముళబాగిలులోని నేతాజీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 1227 మంది ఓటర్లకుగాను 1018 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
న్యూఢిల్లీ: గత నాలుగోతేదీన జరిగిన ఢిల్లీ విధాన సభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఆది వారం జరగనున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. నగరవ్యాప్తంగా ఉన్న 14 కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర పారామిలటరీ దళానికి చెందిన 2000 మంది సాయుధులతోపాటు ఢిల్లీ పోలీస్ సిబ్బందిని భారీగా మోహరించారు. ఆయా కేంద్రా ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేయడంతోపాటు వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయనున్నారు. సదరు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అంతర్గత భద్రతా వ్యవహారాలను పారామిలటరీ దళాలు, బయట భద్రతా చర్యలను ఢిల్లీ పోలీసులు చూసుకుంటారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల ను లెక్కిస్తారు. ఈసారి మొత్తం 43 వేల పోస్టల్ బ్యా లెట్లు వచ్చాయని, గత ఎన్నికల్లో ఈ సంఖ్య 1,600 మాత్రమేనని ఎన్నికల కమిషన్ అధికారి దేవ్ తెలి పారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరుగకుండా మొత్తం ప్రక్రియను కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా సీనియర్ ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తారని ఆయన వివరించారు.