విక్రమసింఘెకు మూడో స్థానమే
తొలిసారి రెండో రౌండ్‌లో ఫలితం
నేడు ప్రమాణం చేయనున్న మార్క్సిస్ట్ నేత
కొలంబో: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనూర కుమార దిస్సనాయకే (56) విజయం సాధించారు. దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులో ఫలితం తేలడం విశేషం. జనతా విముక్తి పెరమున అధినేత అయిన దిస్సనాయకే తన సమీప ప్రత్యరి్థ, ఎస్‌జేబీ నేత సజిత్ ప్రేమదాసపై విజయం సాధించారు. అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (75) తొలి రౌండ్‌లోనే వైదొలి గారు.
తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో దిస్సనాయకే 42.31% ఓట్లతో తొలి స్థానంలో, ప్రేమదాస 32.8 శాతంతో రెండో స్థానంలో నిలవగా విక్రమసింఘే 17.27 శాతంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఏ ఒక్కరికీ విజయానికి కావాల్సిన 50 శాతం రాకపోవడంతో ద్వితీయ ప్రాధమ్య ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను తేల్చారు. శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిస్సనాయకే సోమవారం ప్రమాణం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) ప్రకటించింది. దిస్సనాయకేకు భారత ప్రధాని మోదీ
అభినందనలు తెలిపారు.
ఏకేడీ.. ఎట్టకేలకు!
ఏకేడీగా పిలుచుకునే అనూర దిస్సనాయకే నార్త్ సెంట్రల్ ప్రావిన్స్ లోని థంబుట్టెగామలో జన్మించారు. కొలంబో సమీపంలోని కెలనియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకున్నారు. 1987లో జేవీపీలో చేరారు. 1971, 1987, 1990ల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకు జేవీపీ హింసా మార్గం తొక్కింది. ఇది భారత వ్యతిరేకి కూడా. అప్పట్లో రాజీవ్ గాం«దీ–జయవర్థనే ప్రభుత్వాల ఒప్పందం శ్రీలంక సార్వ¿ౌమత్వానికి భంగకరమని భావించేది. గత ఫిబ్రవరిలో దిస్సనాయకే భారత్‌లో పర్యటించాక పార్టీ వైఖరిలో మార్పువచి్చంది. 90ల్లో జేవీపీ ప్రజాస్వామ్య విధానాల పట్ల మొగ్గాక పారీ్టలో దిస్సనాయకేకు ప్రాధాన్యం పెరిగింది. 2000 ఎన్నికల్లో మొదటిసారి ఎంపీ అయ్యారు. 2014లో పార్టీ అధ్యక్షుడయ్యారు. 2019 ఎన్నికల్లో జేవీపీకి దక్కిన ఓట్లు కేవలం మూడు శాతమే.
Comments
Please login to add a commentAdd a comment