![AP Mptc Zptc Election Results YSRCP Candidate Ashwini Won In Kuppam - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/19/Ashwini_Kuppam_MPTC.jpg.webp?itok=N6ERkTVl)
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. పరిషత్ ఎన్నికల ఫలితాల్లో రికార్డు స్థాయిలో స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ఇక టీడీపీకి గతంలో మంచి పట్టున్న కుప్పంలోనూ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్విని(23).. 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో 65 జడ్పీటీసీలకుగానూ ఇప్పటికి 29 స్థానాలను .. 841కి ఎంపీటీసీ స్థానాలకుగానూ.. 416 స్థానాలను కైవసం చేసుకుని ఆధిక్యంలో దూసుకుపోతోంది వైఎస్సార్‌సీపీ.
మరోవైపు ఆదివారం ఉదయం మొదలైన ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యం కొనసాగిస్తోంది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ జిల్లాల వారీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment