ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. డిసెంబర్ 3 జరగాల్సిన ఓట్ల లెక్కింపును డిసెంబర్ 4కి మారుస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఆదివారం మిజోరం ప్రజలకు ప్రత్యేకమైన రోజు అని 2023 డిసెంబర్ 3వ తేదీ ఆదివారం కావడంతో కౌంటింగ్ తేదీని మరో రోజుకు మార్చాలని అభ్యర్థిస్తూ వివిధ వర్గాల నుంచి అనేక వినతులు అందినట్లు ప్రెస్ నోట్‌లో ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.
పలు వర్గాల ప్రజల నుంచి అందిన వినతులను పరిగణనలోకి తీసుకుకు మిజోరాం శాసనసభకు జరిగే సాధారణ ఎన్నికల కౌంటింగ్ తేదీని డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 4 (సోమవారం)కు మారుస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మిగతా షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది.
Counting of votes in Mizoram rescheduled to Dec 4. Mizoram civil society and parties had demanded change in date from Dec 3 as it was Sunday@DeccanHerald pic.twitter.com/vOlND6G4kX
— Shemin (@shemin_joy) December 1, 2023
Comments
Please login to add a commentAdd a comment