date change
-
తేదీ తార్ మార్
వచ్చేస్తున్నా అంటూ ఓ డేట్ చెప్పారు. అయితే ఆ డేట్‌కి కాకుండా కాస్త లేట్‌గా వస్తా అంటున్నారు. చెప్పిన డేట్కన్నా ముందే వస్తా అంటున్నవారూ ఉన్నారు. ఈ మధ్య కొన్ని తెలుగు చిత్రాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ అలా వాయిదాలు పడి, ఫైనల్లీ ఈ 27న థియేటర్స్‌కి వస్తోంది. ఇలా రిలీజ్ డేట్‌ను తారుమారు చేసుకున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం. దేవర.. ఓ పెద్ద కథ ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమాని ప్రకటించినప్పుడే విడుదల తేదీ (2024 ఏప్రిల్ 5న)ని కూడా ప్రకటించారు మేకర్స్. కానీ కథ పెద్దది కావడంతో ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లుగా ఆ తర్వాత పేర్కొన్నారు. అయితే చిత్రీకరణ ప్లాన్ చేసిన ప్రకారం జరగకపోవడంతో తొలి భాగం విడుదలను అక్టోబరు 10కి వాయిదా వేశారు.కానీ కాస్త ముందుకి వస్తున్నాడు ‘దేవర’. సెప్టెంబరు 27న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ముందుగా ప్రకటించిన మరో సినిమా సెప్టెంబరు 27న రాకపోవడంతో ఈ తేదీకి ‘దేవర’ రావడానికి రెడీ అయ్యాడట. కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం కానున్నారు. పుష్పరాజ్... సీన్ రిపీట్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరు 17న విడుదలై, మంచి విజయం సాధించింది. హీరో పుష్పరాజ్‌గా టైటిల్ రోల్ చేసిన అల్లు అర్జున్‌కి ఉత్తమ జాతీయ నటుడి అవార్డుని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయిక. ఇక తొలి భాగం సాధించిన విజయంతో జోష్‌గా మలి భాగం ‘పుష్ప: ది రూల్’ను ఆరంభించారు. కొంత చిత్రీకరణ తర్వాత ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి కాలేదు.క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేక ‘పుష్ప: ది రూల్’ రిలీజ్‌ను ఆగస్టు 15 నుంచి డిసెంబరు 6కు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ‘పుష్ప: ది రైజ్’ను కూడా తొలుత 2021 ఆగస్టు 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ డిసెంబరులో విడుదల చేశారు. అలాగే ‘పుష్ప 2: ది రూల్’ని 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకుని డిసెంబరు 6కి మార్చారు. తొలి భాగానికి జరిగిన సీన్ రిపీట్ అయింది. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ రెడీ ‘ఇస్మార్ట్ శంకర్’గా హీరో రామ్‌లోని మాస్ యాంగిల్‌ని ఓ రేంజ్లో చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం 2019లో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ‘ఇస్మార్ట్ శంకర్’ కథలో సీక్వెల్‌కు స్కోప్ ఉండటంతో రామ్‌తోనే ‘డబుల్ ఇస్మార్ట్’ను ప్రకటించారు పూరి. ఈ సినిమా ప్రకటించిన రోజునే 2024 మార్చి 18న రిలీజ్ చేయనున్నట్లు కూడా వెల్లడించారు. కానీ విడుదల కాలేదు. ఆ తర్వాత జూలైలో విడుదల కావొచ్చనే ప్రచారం సాగింది. ఈ మూవీ చిత్రీకరణ అనుకున్నట్లుగా సాగలేదట. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను ఆగస్టు 15న రిలీజ్‌కి రెడీ చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మాతలు. ముందుకు రానున్న లక్కీ భాస్కర్‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఈ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘లక్కీ భాస్కర్’ని సెప్టెంబరు 27న విడుదల చేస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా అదే తేదీకి తెరపైకి రానుంది. ‘లక్కీ భాస్కర్’ సినిమా నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ‘దేవర’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్నారట.దీంతో ఒకే రోజు ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాల విడుదల ఎందుకని భావిస్తున్నారట నాగవంశీ. ఈ నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్‌ను కాస్త ముందుగానే ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని భోగట్టా. అయితే ఆగస్టు 15న ఇప్పటికే రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమాలు ఉన్నాయి. సో.. ‘లక్కీ భాస్కర్’ ఏ తేదీన వస్తాడో చూడాలి. ఇక దుల్కర్ సూపర్ హిట్ మూవీ ‘సీతారామం’ 2022 ఆగస్టు తొలివారంలో విడుదలైంది. ఈ సెంటిమెంట్‌ని అనుసరించి, ‘లక్కీ భాస్కర్’ని కూడా ఆగస్టు తొలి వారంలో రిలీజ్ చేస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది.ఈ కోవలోనే మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్లు ముందుకు, వెనక్కు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
Mizoram: ఎలక్షన్ కౌంటింగ్ తేదీ మార్పు.. ఈసీ కీలక ప్రకటన
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. డిసెంబర్ 3 జరగాల్సిన ఓట్ల లెక్కింపును డిసెంబర్ 4కి మారుస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆదివారం మిజోరం ప్రజలకు ప్రత్యేకమైన రోజు అని 2023 డిసెంబర్ 3వ తేదీ ఆదివారం కావడంతో కౌంటింగ్ తేదీని మరో రోజుకు మార్చాలని అభ్యర్థిస్తూ వివిధ వర్గాల నుంచి అనేక వినతులు అందినట్లు ప్రెస్ నోట్లో ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. పలు వర్గాల ప్రజల నుంచి అందిన వినతులను పరిగణనలోకి తీసుకుకు మిజోరాం శాసనసభకు జరిగే సాధారణ ఎన్నికల కౌంటింగ్ తేదీని డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 4 (సోమవారం)కు మారుస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మిగతా షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. Counting of votes in Mizoram rescheduled to Dec 4. Mizoram civil society and parties had demanded change in date from Dec 3 as it was Sunday@DeccanHerald pic.twitter.com/vOlND6G4kX — Shemin (@shemin_joy) December 1, 2023 -
మార్చిలో గోదావరి గ్యాంగ్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటించగా, నటి అంజలి ముఖ్యమైనపాత్రను పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, వెంకట్ ఉప్పుటూరి, ఇన్మమూరి గోపీచంద్ నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీ మారింది. తొలుత డిసెంబరు 8న సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే 2024 మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ‘‘చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథతో ఈ చిత్రం రూపొందింది. అతని ప్రయాణంలో రాజకీయ చిక్కులు కూడా ఉంటాయి. ఈ సినిమాలో విశ్వక్ సేన్ గ్రే క్యారెక్టర్లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాడి. -
అభిమానులకు షాక్!
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో అత్యంత ప్రతిష్టాత్మక పోరు... అభిమానుల కోణంలో అయితే మరీ భావోద్వేగాల సమరం... అందుకే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ఎదురు చూశారు. విమాన టికెట్లతో పాటు పెద్ద మొత్తంలో ఖర్చు చేసి భారీగా పెరిగిన రేట్లతో హోటల్ గదులు కూడా బుక్ చేసుకున్నారు. ఎన్ని వ్యయప్రయాసలెదురైనా నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు అక్టోబర్ 15 కోసం ప్రణాళిక రూపొందించుకున్నారు. అయితే ఇప్పుడు వీరందరి ప్లాన్ తలకిందులయ్యే అవకాశమూ కనిపిస్తోంది! అహ్మదాబాద్‌లో అదే రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గుజరాత్లో అత్యంత వైభవంగా జరిగే నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు మ్యాచ్ జరపడం చాలా సమస్యగా మారుతుందని అక్కడి భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ రోజు సెక్యూరిటీ కలి్పంచడం తమ వల్ల సాధ్యం కాదని చేతులెత్తేసిన పోలీసులు, మ్యాచ్‌ను మరో రోజుకు మార్చాలని బీసీసీఐ అధికారులకు సూచించారు. ప్రకటించిన తేదీకంటే ఒక రోజు ముందు అక్టోబర్ 14కు మ్యాచ్ మారే అవకాశం ఉంది. అయితే ఒక రోజు మారినా ఫ్యాన్స్‌కు ఇది పెద్ద సమస్యగా మారడం మాత్రం ఖాయం. అసలు షెడ్యూల్ ప్రకటించడమే చాలా ఆలస్యం కాగా... గుజరాత్లో నవరాత్రి గురించి బోర్డు కార్యదర్శి జై షాకు తెలియకపోవడం ఆశ్చర్యకరం! దీనిపై నేడు జరిగే బీసీసీఐ సమావేశం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించి నేడు వివిధ సబ్ కమిటీలతో నేడు బోర్డు చర్చించనుంది. -
క్రీడా పోటీల తేదీల్లో మార్పు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రస్థాయి ఉద్యోగుల క్రీడా పోటీల తేదీ లను మార్పు చేసినట్లు జిల్లా క్రీడాభి వృద్ధి అధికారి బాషామోహిద్దీన్ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పో టీలు వచ్చే నెల 17 నుంచి 19 వర కు రాష్ట్ర రాజధాని విజయవాడలో జరగాల్సి ఉం ది. వాటిని వచ్చే నెల 5 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులు ఐ జీఎంసీ స్టేడి యం, విజయవాడలో సం ప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 0855 4–243175 నంబ ర్ను సంప్రదించాలన్నారు. పోటీల వివరాలు : విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో అక్టోబర్ 5న బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, కబడ్డీ, ఫుట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్, బ్రిడ్జ్ పోటీలు నిర్వహిస్తారు. గాందీనగర్ కార్పొరేషన్ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత పోటీలుంటాయి. 6న క్యారమ్స్, హాకీ, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, 7న చెస్, క్రికెట్, టేబుల్‌టెన్నిస్, వాలీబాల్, రెజింగ్, అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయి.