న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో అత్యంత ప్రతిష్టాత్మక పోరు... అభిమానుల కోణంలో అయితే మరీ భావోద్వేగాల సమరం... అందుకే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ఎదురు చూశారు. విమాన టికెట్లతో పాటు పెద్ద మొత్తంలో ఖర్చు చేసి భారీగా పెరిగిన రేట్‌లతో హోటల్ గదులు కూడా బుక్ చేసుకున్నారు. ఎన్ని వ్యయప్రయాసలెదురైనా నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు అక్టోబర్ 15 కోసం ప్రణాళిక రూపొందించుకున్నారు.
అయితే ఇప్పుడు వీరందరి ప్లాన్ తలకిందులయ్యే అవకాశమూ కనిపిస్తోంది! అహ్మదాబాద్‌లో అదే రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గుజరాత్‌లో అత్యంత వైభవంగా జరిగే నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు మ్యాచ్ జరపడం చాలా సమస్యగా మారుతుందని అక్కడి భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ రోజు సెక్యూరిటీ కలి్పంచడం తమ వల్ల సాధ్యం కాదని చేతులెత్తేసిన పోలీసులు, మ్యాచ్‌ను మరో రోజుకు మార్చాలని బీసీసీఐ అధికారులకు సూచించారు.
ప్రకటించిన తేదీకంటే ఒక రోజు ముందు అక్టోబర్ 14కు మ్యాచ్ మారే అవకాశం ఉంది. అయితే ఒక రోజు మారినా ఫ్యాన్స్‌కు ఇది పెద్ద సమస్యగా మారడం మాత్రం ఖాయం. అసలు షెడ్యూల్ ప్రకటించడమే చాలా ఆలస్యం కాగా... గుజరాత్‌లో నవరాత్రి గురించి బోర్డు కార్యదర్శి జై షాకు తెలియకపోవడం ఆశ్చర్యకరం! దీనిపై నేడు జరిగే బీసీసీఐ సమావేశం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించి నేడు వివిధ సబ్ కమిటీలతో నేడు బోర్డు చర్చించనుంది.
Comments
Please login to add a commentAdd a comment