Mizoram assembly elections
-
Mizoram Chief Minister Lalduhoma: ఎమ్మెల్యేలకు కొత్త కార్లు కొనబోము
ఐజ్వాల్: మిజోరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నూతన ముఖ్యమంత్రి లాల్దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు కొత్త కార్లు కొనుగోలు చేయబోమని కరాఖండీగా చెప్పేశారు. కొత్త ప్రభుత్వం కొలువుతీరిన ప్రతిసారీ కొత్త కార్ల కొనుగోలుతో ప్రజాధనం వృథా అవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల దిగిపోయిన మంత్రులు, ఓడిన ఎమ్మెల్యేలు వాడిన ప్రభుత్వ వాహనాలనే కొత్త మంత్రులు, శాసనసభ్యులు వాడుకోవాలని సూచించారు. -
Five States Election: అసెంబ్లీలలో కొత్త నీరు
దేశవ్యాప్తంగా చట్టసభల్లోకి కొత్త నీరు శరవేగంగా చేరుతోంది. ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టగల ఈ ధోరణి తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టొచి్చనట్టు కని్పంచింది. వాటన్నింటిలో కలిపి ఏకంగా 38 శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు కొలువుదీరారు! మెజారిటీ సాధనలో వెటరన్ ఎమ్మెల్యేలదే పై చేయిగా నిలిచినా, రాజకీయ రంగంలో మాత్రం మొత్తమ్మీద కొత్త గాలులు వీస్తున్నాయనేందుకు ఈ ఎన్నికలు స్పష్టమైన సూచికగా నిలిచాయి. మూడింట్లో కొత్తవారి జోరు మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీలకు తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజేతల జాబితాను పరిశీలిస్తే ఇప్పటికే కనీసం రెండు నుంచి మూడుసార్లు నెగ్గిన అనుభవజు్ఞలైన ఎమ్మెల్యేలు అందులో 38 శాతం మంది ఉన్నారు. అయితే సరిగ్గా అంతే శాతం మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం విశేషం. ఇప్పటికే మూడుసార్లకు మించి ఎమ్మెల్యేలుగా చేసిన వెటరన్లలో ఈసారి 24 శాతం మంది గెలుపొందారు. రాష్ట్రాలవారీగా చూస్తే తొలిసారి ఎమ్మెల్యేల జాబితాలో గిరిజన రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ టాప్‌లో నిలవడం విశేషం. అక్కడ ఈసారి మొత్తం 90 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 52 శాతం మంది కొత్త ముఖాలే! వెటరన్లు కేవలం 18 శాతం కాగా అనుభవజు్ఞలు 30 శాతమున్నారు. తెలంగాణలో కూడా 119 మంది ఎమ్మెల్యేల్లో 45 శాతం మంది తొలిసారి ఎన్నికైనవారే! ఈ దక్షిణాది రాష్ట్రంలో 21 శాతం మంది వెటరన్లు, 34 శాతం మంది అనుభవజు్ఞలు తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇక ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కూడా 40 మంది ఎమ్మెల్యేల్లో 47 శాతం మంది కొత్తవారున్నారు. వెటరన్లు 18 శాతం, అనుభవజు్ఞలు 35 శాతంగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో మాత్రం కొత్తవారి హవా కాస్త పరిమితంగానే ఉంది. మధ్యప్రదేశ్‌లో మాత్రం వెటరన్లు 31 శాతం మంది ఉండగా అనుభవజ్ఞులైన ఎమ్మెల్యేల శాతం 36గా ఉంది. రాష్ట్రంలో 33 శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టారు. రాజస్తాన్ ఎమ్మెల్యేల్లో మాత్రం 46 శాతం మంది అనుభవజ్ఞులే. వెటరన్లు 24 శాతం కాగా తొలిసారి నెగ్గినవారు 30 శాతమున్నారు. మెజారిటీలో వెటరన్లదే పైచేయి ఓవరాల్ గెలుపు శాతంలో వెనకబడ్డా, మెజారిటీ సాధనలో మాత్రం వెటరన్లు సత్తా చాటారు. మూడు రాష్ట్రాల్లో కొత్తవారు, అనుభవజు్ఞల కంటే ఎక్కువ మెజారిటీని వెటరన్లు సాధించారు. మొత్తమ్మీద ఐదు రాష్ట్రాల్లోనూ కలిపి చూస్తే వెటరన్లు సగటున 22,227 ఓట్ల మెజారిటీ సాధించగా కొత్తవారు 20,868 ఓట్ల మెజారిటీతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక అనుభవజు్ఞల సగటు మెజారిటీ 20,495 ఓట్లు. జనాకర్షణలో వెటరన్లు ఇప్పటికీ సత్తా చాటుతున్నారనేందుకు వారు సాధించిన మెజారిటీలు నిదర్శనంగా నిలిచాయి. పార్టీలవారీగా చూస్తే... ఇక ఐదు రాష్ట్రాల ఫలితాలను పార్టీలవారీగా చూస్తే బీజేపీ ఎమ్మెల్యేల్లో కొత్తవారు 38 శాతం మంది ఉన్నారు. 35 శాతం మంది అనుభవజు్ఞలు కాగా వెటరన్లు 27 శాతం మంది ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అనుభవజ్ఞులు బీజేపీ కంటే ఎక్కువగా 43 శాతం మంది ఉన్నారు. తొలిసారి నెగ్గిన వారు 34 శాతం కాగా వెటరన్లు 23 శాతంగా తేలారు. ఇతర పార్టీలన్నీ కలిపి చూస్తే కొత్త ఎమ్మెల్యేలు ఏకంగా 47 శాతముండటం విశేషం! 35 శాతం మంది అనుభవజు్ఞలు కాగా వెటరన్లు 19 శాతానికి పరిమితమయ్యారు. చిన్న, ప్రాంతీయ పార్టీల్లో కొత్త వారి జోరు ఎక్కువగా ఉందనేందుకు ఇది స్పష్టమైన సంకేతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Mizoram Election Result 2023: మిజోరంలో జెడ్పీఎం
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరం శాసనసభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ జోరాం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) సంచలన విజయం సాధించింది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)ను మట్టికరిపించింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను 27 స్థానాల్లో గెలిచింది. మెజారిటీ మార్కును సులువుగా దాటేసింది. మిజోరం ఎన్నికల్లో సోమవారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అధికార ఎంఎన్ఎఫ్ కేవలం 10 స్థానాల్లో నెగ్గింది. బీజేపీకి రెండు స్థానాలు లభించాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంలో గట్టెక్కింది. ఈ ఎన్నికల్లో అధికార ఎంఎన్ఎఫ్కు దారుణ పరాభవం ఎదురైంది. ఎంఎన్ఎఫ్ అధినేత, ముఖ్యమంత్రి జోరామ్‌తాంగ ఓటమిపాలయ్యారు. ఐజ్వాల్ ఈస్ట్–1 స్థానంలో ఆయనపై జెడ్పీఎం అభ్యర్థి లాల్థాన్సాంగ 2,101 ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. జెడ్పీఎం నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్దుహొమా.. సెర్చిప్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి జె.వాంచ్వాంగ్పై 2,982 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు. ఎన్నికల్లో పోటీ చేసిన 11 మంది మంత్రుల్లో ఏకంగా 9 మంది పరాజయం పాలయ్యారు. ఉప ముఖ్యమంత్రి తాన్లూయా, ఆరోగ్య శాఖ మంత్రి ఆర్.లాల్థాంగ్లియానా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లారౌత్కిమా, విద్యుత్ శాఖ మంత్రి ఆర్.లాల్జిర్లియానా, వ్యవసాయం, నీటిపారుదల శాఖ మంత్రి సి.లాల్రిన్సంగా, ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి కె.లాల్రిన్లియానా, ఎక్సైజ్ శాఖ మంత్రి లాల్రినామా తదితరులు ఓడిపోయారు. పాఠశాల విద్యా శాఖ మంత్రి లాల్చాందామా రాల్టే, పర్యాటక శాఖ సహాయ మంత్రి రాబర్ట్ రొమావియా రాయ్టే విజయం సాధించారు. మిజోరం నూతన ముఖ్యమంత్రిగా జెడ్పీఎం అధ్యక్షుడు లాల్దుహొమా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవంబర్ 7వ తేదీన జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం, కాంగ్రెస్ పారీ్టలు మొత్తం 40 స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ 23 సీట్లలో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. రాష్ట్రంలో తొలిసారిగా ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) సైతం పోటీ చేసింది. నాలుగు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీపడ్డారు. అలాగే 17 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల్లో ‘ఆప్’ ఖాతా తెరవలేకపోయింది. స్వతంత్రులెవరూ నెగ్గలేదు. ఇందిరాగాంధీ అంగరక్షకుడు కాబోయే ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురైన మొట్టమొదటి ఎంపీగా అప్రతిష్ట మూటగట్టుకున్న 73 ఏళ్ల లాల్దుహోమా మిజోరం ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అన్నింటినీ తట్టుకొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. లాల్దుహొమా ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భద్రతా సిబ్బందికి ఇన్చార్జిగా సేవలందించారు. ఆయన నాయకత్వంలో జోరాం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) 2019లో రాజకీయ పారీ్టగా ఎన్నికల సంఘం వద్ద నమోదైంది. కేవలం నాలుగేళ్లలో మిజోరం ఎన్నికల్లో అతిపెద్దగా పార్టీగా అవతరించి, అధికారం చేపడుతుండడం విశేషం. లాల్దుహొమా తొలిసారిగా 1984లో కాంగ్రెస్ టికెట్‌పై మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. కేవలం 846 ఓట్ల తేడాతో పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత మిజోరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986లో ఆ పారీ్టకి రాజీనామా చేశారు. అప్పటి ముఖ్యమంత్రి లాల్ థాన్హాలాకు, కేబినెట్ మంత్రులకు వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు లాల్దుహొమాపై ఆరోపణలు వచ్చాయి. 1988లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడింది. అలాగే 2020లో ఎంఎన్ఎఫ్ ఎమ్మెల్యేగా ఉన్న లాల్దుహొమాపై మిజోరం అసెంబ్లీ స్పీకర్ లాల్రిన్లియానా సాయ్‌లో అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ లాల్దుహొమాపై ఎంన్ఎఫ్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మిజోరంలో ఈ చట్టం కింద అనర్హతకు గురైన మొదటి ఎమ్మెల్యే లాల్దుహొమా కావడం గమనార్హం. జెడ్ఎన్పీ అభ్యర్థిగా 2003లో, 2008లో, 2018లో, 2021లోఎమ్మెల్యేగా ఆయన విజయం దక్కించుకున్నారు. రాజకీయ యోధుడిని ఓడించిన మూకదాడి బాధితుడు రాయ్‌పూర్: మత ఘర్షణల్లో కుమారుడిని కోల్పోయి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ తండ్రి చూపిన ధర్మాగ్రహం.. అక్కడి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్నికల్లో మట్టికరిపించింది. ఆదివారం వెల్లడైన ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలు ఈ ఘటనకు సాక్ష్యంగా నిలిచాయి. అసలేం జరిగిందనేది ఓ సారి గమనిస్తే.. బేమేతరా జిల్లా బిరాన్‌పూర్ గ్రామంలో ఈశ్వర్ సాహూ అనే కార్మికుడికి 23 ఏళ్ల భువనేశ్వర్ సాహూ అనే కుమారుడు ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ గ్రామంలో జరిగిన మత ఘర్షణల్లో వేరే మతానికి చెందిన అల్లరిమూక భువనేశ్వర్ సాహూను హతమార్చింది. కొడుకును కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ తమ సాజా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రవీంద్ర చౌబేను తండ్రి వేడుకున్నాడు. భూపేశ్ బఘేల్ సర్కార్ తనకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఈశ్వర్ సాహూ కన్నీరుమున్నీరవడం, ఆయన ఆక్రందన నాడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హత్య ఘటన తర్వాత హతుడి తల్లినీ అల్లరిమూక బెదిరించింది. హత్యకు నిరసనగా నాడు విశ్వహిందూ పరిషత్ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పాలనే సంకల్పంతో ఇతనికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాజా నియోజకవర్గంలో రాజకీయ యోధుడిగా పేరొందిన రవీంద్ర చౌబేకు పోటీగా బరిలో నిలిపింది. ఈశ్వర్ సాహూకు జరిగిన అన్యాయంపై ప్రజల్లో గూడుకట్టుకున్న ఆగ్రహావేశాలు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించాయి. రవీంద్ర చౌబే కంటే ఎక్కువ ఓట్లు సాధించి ఈశ్వర్ ఘన విజయం సాధించారు. ‘ ఈశ్వర్ సాహూ ఒకప్పుడు కార్మికుడు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే. హంతకులకు మద్దతు పలికిన కాంగ్రెస్‌కు ఈశ్వర్ తగిన గుణపాఠం చెప్పారు’ అని బీజేపీ ఐటీ విభాగ జాతీయ సమన్వయ కర్త అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. -
మిజోరం జెయింట్ కిల్లర్..ఎవరంటే..!
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూమెంట్(జెడ్‌పీఎమ్) పార్టీ ఘన విజయం సాధించింది. 27 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో జెడ్‌పీఎమ్ పార్టీ తరపున ఐజ్వాల్ ఈస్ట్-1 నియోజకవర్గం నుంచి గెలిచిన లాల్తన్సంగా వార్తల్లో నిలిచారు. మూడుసార్లు మిజోరం ముఖ్యమంత్రిగా చేసిన జోరంతంగాను ఓడించి 2 వేల ఓట్ల మెజారిటీతో లాల్ గెలిచారు. ఈ సందర్భంగా లాల్తన్సంగా మాట్లాడుతూ ‘మిజోనేషనల్ ఫ్రంట్(ఎమ్ఎన్ఎఫ్), కాంగ్రెస్ పార్టీలది కేవలం అధికారదాహం. పార్టీ నాకు ఐజ్వాల్ ఈస్ట్-1 టికెట్ ఇచ్చినపుడు నేను సర్వే చేసుకున్నాను. నియోజకవర్గంలో జోరంతంగా బలం అంతగా లేదని నాకు అప్పుడే తెలిసింది. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా జోరంతంగా నాయకత్వంపై ప్రజలు అంత సంతృప్తిగా లేరు’అని లాల్ తెలిపారు. ‘కాంగ్రెస్, ఎమ్ఎన్ఎఫ్ పార్టీలు కేవలం డబ్బుపైనే ఆధారపడి రాజకీయాలు చేస్తాయి.నిజంగా డబ్బు ప్రభావమే ఉంటే జోరంపై నేను గెలిచేవాడిని కాదు’అని లాల్ చెప్పారు. సోమవారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మిజోరంలో జెడ్‌పీఎమ్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. మిజోరం అసెంబ్లీలో మొత్తం 40 సీట్లుండగా జెడ్‌పీఎమ్ 27 సీట్లు గెలిచింది. ఇవీ చూడండి..మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ -
జెండా పాతిన జీపీఎం.. మిజోరంలో సంచలన విజయం
అగర్తలా: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం విజయం నమోదు అయ్యింది. ప్రాంతీయ పార్టీ జీపీఎం(ZPM) 27 సీట్లతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది జీపీఎం. ఎంఎన్ఎఫ్ 10 స్థానాల్లో నెగ్గగా.. బీజేపీ 2, కాంగ్రెస్ ఒక స్థానంతో సరిపెట్టుకున్నాయి. మిజోరం అసెంబ్లీకి 40 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 21 కాగా, మిజోరం మరో ఆరు ఎక్కువ సీట్లకే కైవసం చేసుకుంది. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరిగింది. మిజోరంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ కూటమికి సంబంధించిన 5 ముఖ్యమైన విషయాలు.. ► రాష్ట్రంలోని జోరం పీపుల్స్ మూవ్మెంట్(జీపీఎం) ఆరు పార్టీల కూటమి. ఇందులో మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్, జోరామ్ నేషనలిస్ట్ పార్టీ, జోరామ్ ఎక్సోడస్ మూవ్మెంట్, జోరామ్ డిసెంట్రలైజేషన్ ఫ్రంట్, జోరామ్ రిఫార్మేషన్ ఫ్రంట్, మిజోరం పీపుల్స్ పార్టీ. ఈ పార్టీలన్నీ జెడ్పీఎం కూటమిగా అసెంబ్లీ బరిలోకి దిగాయి. ► జీపీఎం స్థాపించిన కొద్ది ఏళ్లలోనే మిజోరంలో గణనీయంగా దీని ప్రాధాన్యతను సంపాధించుకుంది. ఈ పార్టీని 2017లో స్థాపించారు. తొలిసారి 2018 మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో 40 సీట్లలో పోటీ చేసి.. కేవలం ఆరు సీట్లలో విజయం సాధించింది. ఆ మరుసటి ఏడాది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జీపీఎం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ► మాజీ ఎంపీ, ఎమ్మెల్యే లల్దుహోమ జీపీఎం పార్టీని స్థాపించారు. ఆయనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నిలబడ్డారు. ► మిజోరంలో లౌకికవాదాన్ని విస్తరించటం, ప్రాంతీయ మైనారిటీలకు రక్షణ కల్పించడం ఈ పార్టీ అవలభించే ప్రాధాన్యతలుగా ప్రచారం చేసింది. ఈ పార్టీ ముఖ్యగా ప్రస్తుత సీఎం జోరమ్‌తంగాపై అవినీతి ఆరోపణలను ప్రజలకు వివరించడంలో సఫలీకృతమయ్యింది. ► మిజోరంలో జీపీఎం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని తమ కూటమి ప్రాధాన్యతలలో ఒకటిగా ప్రచారం చేసింది. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) 26 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ 3 స్థానాల నుంచి ఒకటికి పడిపోగా, బీజేపీ 2 నియోజకవర్గాల్లో నెగ్గి.. గత ఎన్నికల కంటే ఒక స్థానం అదనంగా దక్కించుకుంది. -
Mizoram Election Results 2023: మిజోరంలో జెడ్పీఎం జయ కేతనం
Live Updates.. జెడీపీఎం జయ కేతనం 27 స్థానాలను కైవసం చేసుకున్న జెడ్పీఎం 7 చోట్ల ఎంఎన్ఎఫ్ విజయం.. 3 స్థానాల్లో ముందంజ 25 చోట్ల జెడ్పీఎం గెలుపు.. 2 స్థానాల్లో ముందంజ సెర్చిప్ నియోజకవర్గంలో జెడ్పీఎం సీఎం అభ్యర్థి లాల్దుహోమా ఘన విజయం జెడ్పీఎం ‘మ్యాజిక్’ విజయాలు 20 స్థానాల్లో జెడ్పీఎం విజయం.. 7 చోట్ల ఆధిక్యం 7 స్థానాల్లో ఎంఎన్ఎఫ్ గెలుపు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన జెడ్పీఎం రేపు గవర్నర్‌ను కలవనున్ను సీఎం అభ్యర్థి లాల్దుహోమా 16 స్థానాల్లో జెడ్పీఎం విజయం.. 11 చోట్ల కొనసాగుతున్న ఆధిక్యత 3 చోట్ల ఎంఎన్ఎఫ్ గెలుపు.. 7 స్థానాల్లో ముందంజ 2 సీట్లు గెలుపొందిన బీజేపీ.. ఒక చోట కాంగ్రెస్ ఆధిక్యం ఎంఎన్ఎఫ్ తొలి గెలుపు ఒక చోట గెలిచిన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), మరో 10 చోట్ల లీడింగ్ జెడ్పీఎంకు 11 విజయాలు, 15 చోట్ల కొనసాగుతున్న ఆధిక్యం 7 స్థానాల్లో జెడ్పీఎం విజయం.. 7 స్థానాల్లో జెడ్పీఎం విజయం, మరో 19 చోట్ల ఆధిక్యం 11 నియోజకవర్గాల్లో ఎంఎన్ఎఫ్ ముందంజ ఒక చోట గెలిచిన బీజేపీ, మరో స్థానంలో లీడింగ్ ఒక స్థానంలో కాంగ్రెస్ ముందంజ మిజోరంలో దూసుకుపోతున్న జేపీఎం జోరం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం).. 26స్థానాల్లో లీడ్, ఒక స్థానంలో గెలుపు ఎంఎన్ఎఫ్.. 9 స్థానాలు బీజేపీ..3 కాంగ్రెస్..2 స్థానాల్లో లీడ్ #MizoramElections2023 | Official EC trends of all 40 seats in - ZPM (Zoram People's Movement) comfortably crosses the halfway mark, wins 1 and leads on 25 seats. Ruling MNF (Mizo National Front) leads on 9 seats BJP on 3 Congress on 2 pic.twitter.com/w2zT3I7sVc — ANI (@ANI) December 4, 2023 మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్.. ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. ఎంఎన్ఎఫ్..5 జెడ్‌పీఎమ్..3 బీజేపీ..1 కాంగ్రెస్..1 చోట ఆధిక్యం #MizoramElections2023 | Early official EC trends in; MNF (Mizo National Front) leading on 5 seats while ZPM (Zoram People's Movement) ruling on 3 seats. BJP and Congress leading on 1 each. Counting of votes on all 40 seats is underway. pic.twitter.com/QfPu4B77Pn — ANI (@ANI) December 4, 2023 మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్ #WATCH | #MizoramElections2023 | After counting of postal ballots, counting of votes cast through EVMs begins. Visuals from a counting centre at Aizawl Government College where strong room was unlocked for EVMs to be brought out. pic.twitter.com/epdcbCNHUB — ANI (@ANI) December 4, 2023 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న అధికారులు. #WATCH | Counting of votes for #MizoramElections2023 is underway. Visuals from a counting centre in Serchhip. pic.twitter.com/yaQzE5oqmj — ANI (@ANI) December 4, 2023 ►మిజోరంలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం Counting of votes for Mizoram Elections 2023 begins. pic.twitter.com/S1IJmvFwR7 — ANI (@ANI) December 4, 2023 ► మిజోరంలో కౌంటింగ్‌కు సర్వం సిద్దం. #WATCH | Counting for #MizoramElections2023 to take place today. Visuals from a counting centre in Serchhip as boxes containing ballot papers being brought here. pic.twitter.com/PqIWtRKpDv — ANI (@ANI) December 4, 2023 #WATCH | Preparations underway at the counting centre in Aizawl where the counting of votes for the Mizroam Assembly Elections will begin shortly. pic.twitter.com/tAwFWBDiuM — ANI (@ANI) December 4, 2023 ►మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు కౌంటింగ్ జరుగనుంది. కౌంటింగ్ ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. ►40 నియోజక వర్గాలున్న మిజోరంలో అధికార ఎంఎన్ఎఫ్(మిజో నేషనల్ ఫ్రంట్), జడ్పీఎం (జొరం పీపుల్స్ మూవ్మెంట్), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ►ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 13 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని మిజోరం రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి హెచ్.లియాంజెలా తెలిపారు. #WATCH | Preparations underway at the counting centre in Serchhip where the counting of votes for the Mizroam Assembly Elections will begin shortly. pic.twitter.com/QiedojHJ7B — ANI (@ANI) December 4, 2023 ►మిజోరంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ►174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26, జడ్పీఎం 8, కాంగ్రెస్ 5, బీజేపీ ఒక స్థానం గెలుపొందాయి. ►నవంబరు 7న మిజోరం అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
Mizoram: ఎలక్షన్ కౌంటింగ్ తేదీ మార్పు.. ఈసీ కీలక ప్రకటన
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. డిసెంబర్ 3 జరగాల్సిన ఓట్ల లెక్కింపును డిసెంబర్ 4కి మారుస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆదివారం మిజోరం ప్రజలకు ప్రత్యేకమైన రోజు అని 2023 డిసెంబర్ 3వ తేదీ ఆదివారం కావడంతో కౌంటింగ్ తేదీని మరో రోజుకు మార్చాలని అభ్యర్థిస్తూ వివిధ వర్గాల నుంచి అనేక వినతులు అందినట్లు ప్రెస్ నోట్లో ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. పలు వర్గాల ప్రజల నుంచి అందిన వినతులను పరిగణనలోకి తీసుకుకు మిజోరాం శాసనసభకు జరిగే సాధారణ ఎన్నికల కౌంటింగ్ తేదీని డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 4 (సోమవారం)కు మారుస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మిగతా షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. Counting of votes in Mizoram rescheduled to Dec 4. Mizoram civil society and parties had demanded change in date from Dec 3 as it was Sunday@DeccanHerald pic.twitter.com/vOlND6G4kX — Shemin (@shemin_joy) December 1, 2023 -
కాంగ్రెస్ –2, బీజేపీ–2, హంగ్–1!
న్యూఢిల్లీ: నెలన్నరకు పైగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు ముగింపునకు వచి్చంది. గురువారంతో అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 19 తేదీల్లో రెండు దశల్లో, మధ్యప్రదేశ్‌లో 19న, రాజస్థాన్‌లో 25న పోలింగ్ జరగడం తెలిసిందే. తెలంగాణలో కూడా గురువారం ఒకే దశలో పోలింగ్ ముగిసింది. ఐదు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో పోలింగ్ ముగియగానే ఐదు రాష్టాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఓడించనుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో అధికారం నిలబెట్టుకుంటుందని పలు పోల్స్ పేర్కొన్నాయి. ఇక కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో బీజేపీ గెలుస్తుందని చాలావరకు తేల్చాయి. మధ్యప్రదేశ్‌ను కూడా బీజేపీ నిలబెట్టుకోవచ్చని, మిజోరంలో హంగ్ రావచ్చని తెలిపాయి... మధ్యప్రదేశ్... బీజేపీకే మొగ్గు! మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించనుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ వంటి పలు సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సీట్లు 230. మెజారిటీ మార్కు 116 కాగా బీజేపీకి ఏకంగా 140 నుంచి 162 సీట్లు వస్తాయని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. కాంగ్రెస్ 68 నుంచి 90 సీట్లకు పరిమితం కానుందని చెప్పింది. టుడేస్ చాణక్య కూడా బీజేపీకి 151, కాంగ్రెస్‌కు 74 స్థానాలిచ్చింది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్‌లోనూ బీజేపీకి 140 నుంచి 159 సీట్లు రాగా కాంగ్రెస్ 70 నుంచి 89 సీట్లకు పరిమితమైంది. రిపబ్లిక్ టీవీ కూడా బీజేపీకి 118 నుంచి 130 సీట్లిచ్చింది. కాంగ్రెస్‌కు 97 నుంచి 107 రావచ్చని పేర్కొంది. టైమ్స్ నౌ–ఈటీజీ మాత్రం కాంగ్రెస్‌కు 109–125 సీట్లివ్వగా బీజేపీకి 105–117 వస్తాయని పేర్కొంది. ఏబీపీ–సీవోటర్ కూడా కాంగ్రెస్‌కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. జన్ కీ బాత్ మాత్రం రెండు పారీ్టలూ 100 నుంచి 125 సీట్ల మధ్య గెలుచుకుంటాయని జోస్యం చెప్పింది. రాజస్థాన్‌లో కమల వికాసమే రాజస్థాన్‌లో బీజేపీ విజయం ఖాయమని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మూడు మాత్రం కాంగ్రెస్ బహుశా రాజస్థాన్‌లో నెగ్గే అవకాశముందని అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ సీట్లు కాగా మెజారిటీకి 101 స్థానాలు రావాలి. టైమ్స్ నౌ సర్వేలో బీజేపీకి 108 నుంచి 128, కాంగ్రెస్‌కు 56 నుంచి 72 సీట్లొచ్చాయి. ఇక బీజేపీ 105 నుంచి 125 స్థానాలు సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. కాంగ్రెస్ 69 నుంచి 81కి పరిమితమవుతుందని చెప్పింది. ఏబీపీ–సీవోటర్ బీజేపీకి 94–114, కాంగ్రెస్‌కు 71–91 సీట్లిచ్చింది. జన్ కీ బాత్ సర్వే కూడా బీజేపీ 100 నుంచి 122 సీట్లు గెలుస్తుందని, కాంగ్రెస్ 62 నుంచి 85కు పరిమితమవుతుందని పేర్కొంది. టుడేస్ చాణక్య బీజేపీకి 101, కాంగ్రెస్ 89 సీట్లిచి్చంది. ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్‌కు80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 94 నుంచి 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని, బీజేపీకి 80 నుంచి 90 స్థానాలొస్తాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ పేర్కొంది. తెలంగాణలో కాంగ్రెస్ పాగా తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు తెర దించి తొలిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 119 స్థానాల అసెంబ్లీలో మెజారిటీకి 60 స్థానాలు కావాల్సి ఉండగా కాంగ్రెస్‌కు 60 నుంచి 70 దాకా వస్తాయని టైమ్స్ నౌ–ఈటీజీ అంచనా వేసింది. బీఆర్ఎస్ 37 నుంచి 45 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. బీజేపీకి 6 నుంచి 8, మజ్లిస్‌కు5 నుంచి 7 రావచ్చని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ కూడా కాంగ్రెస్‌కు 58 నుంకచి 68 సీట్లిచి్చంది. బీఆర్ఎస్కు 46 56, బీజేపీకి 4 నుంచి 9 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని పేర్కొంది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ అయితే కాంగ్రెస్‌కు ఏకంగా 63 నుంచి 79 సీట్లిచి్చంది. బీఆర్ఎస్ 31 నుంచి 47తో సరిపెట్టుకుంటుందని చెప్పింది. బీజేపీకి 2 నుంచి 4, మజ్లిస్‌కు5 నుంచి 7 వస్తాయని తెలిపింది. టుడేస్ చాణక్య కూడా కాంగ్రెస్‌కు 71 సీట్లు, బీఆర్ఎస్కు 33, బీజేపీకి 7, ఇతరులకు 8 స్థానాలిచి్చంది. కాంగ్రెస్ 49 నుంచి 65 సీట్లొస్తాయని ఏబీపీ–సీవోటర్ సర్వే పేర్కొంది. బీఆర్ఎస్కు 38 నుంచి 54, బీజేపీకి 5 నుంచి 13 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని చెప్పుకొచ్చింది. జన్ కీ బాత్ కూడా కాంగ్రెస్‌కు 48 నుంచి 64, బీఆర్ఎస్కు 40 నుంచి 55 సీట్లిచి్చంది. బీజేపీ 7 నుంచి 13, మజ్లిస్ 4 నుంచి 7 సీట్లు నెగ్గుతాయని చెప్పింది. మిజోరంలో హంగ్ ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) ఈసారి ఎదురీదుతోందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఎంఎన్ఎఫ్కు ఈసారి జోరాం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) గట్టి పోటీ ఇచి్చనట్టు పేర్కొన్నాయి. బహుశా హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమవుతుందని, బీజేపీకి ఒకట్రెండు స్థానాలు దాటకపోవచ్చని తెలిపాయి. మొత్తం 40 స్థానాలకు గాను రిపబ్లిక్ టీవీ మాత్రం ఎంఎన్ఎఫ్కు 17 నుంచి 22 దాకా ఇచ్చింది. ఏబీపీ సీవోటర్ కూడా దానికి 15 నుంచి 21 స్థానాలు రావచ్చని పేర్కొంది. మిగతా సర్వేలన్నీ అది మెజారిటీకి కొద్ది దూరంలోనే నిలిచిపోతుందని తేల్చాయి. జెడ్పీఎం ఏకంగా 28 నుంచి 35 సీట్లతో ఘనవిజయం సాధిస్తుందని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొనడం విశేషం! ఎంఎన్ఎఫ్ కేవలం 3 నుంచి 7 సీట్లకు, కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలకు పరిమితమవుతాయని అది తేల్చింది. మిగతా సర్వేలన్నీ ఎంఎన్ఎఫ్కు 14 నుంచి 18 సీట్లు, జెడ్పీఎంకు 10 నుంచి 16 సీట్ల చొప్పున ఇచ్చాయి. ఛత్తీస్‌గఢ్ ‘హస్త’గతం! ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘెల్ సర్కారు పనితీరుకు ప్రజలు మరోసారి పట్టం కడుతున్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 40 50 దాకా వస్తాయని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. బీజేపీ 36 నుంచి 46 దాకా గెలుచుకుంటుందని అంచనా వేసింది. టైమ్స్ నౌ–ఈటీజీ కాంగ్రెస్‌కు 48 నుంచి 56, బీజేపీకి 32 నుంచి 40 సీట్లిచ్చింది. కాంగ్రెస్‌కు 57, బీజేపీకి 33 సీట్లొస్తాయని టుడేస్ చాణక్య పేర్కొంది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ సర్వే కాంగ్రెస్‌కు 46–56, బీజేపీకి 30–40 సీట్లిచి్చంది. రిపబ్లిక్ టీవీ కూడా కాంగ్రెస్44 నుంచి 52 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 35 నుంచి 42 సీట్లకు పరిమితమవుతుందని అభిప్రాయపడింది. ఇక రెండు పారీ్టలూ హోరాహోరీగా తలపడ్డట్టు ఏబీపీ–సీవోటర్, జన్ కీ బాత్ తేల్చాయి. కాంగ్రెస్‌కు 41 నుంచి 53, బీజేపీకి 36 నుంచి 48 సీట్లు రావచ్చని ఏబీపీ చెప్పింది. ఇక జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 34 నుంచి 45, కాంగ్రెస్‌కు 42 నుంచి 53 స్థానాలిచ్చింది. -
మిజోరాం ఎగ్జిట్‌పోల్స్‌లో గెలుపు ఎవరిదంటే..!
ఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు వచ్చేశాయి. ఐదు రాస్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరాంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) మరోసారి ఆధిక్యం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే స్పష్టం చేయగా, జోరమ్ పీపుల్స్ మూమెంట్(జేపీఎం) పైచేయి సాధిస్తుందని జన్ కీ బాత్ సర్వే తెలిపింది. 40 అసెంబ్లీ సీట్లున్న మిజోరాంలో ఎంఎన్ఎఫ్ 16 నుంచి 20 స్థానాలను సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే తెలపగా, జన్ కీ బాత్ సర్వే మాత్రం ఎంఎన్ఎఫ్ 10 నుంచి 14 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటివరకూ వచ్చిన మూడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం అక్కడ ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. మిజోరాం అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పీపుల్స్ పల్స్ సర్వే ఎంఎన్ఎఫ్ 16-20 జేపీఎం-10-14 ఐఎన్‌సీ 2-3 బీజేపీ 6-10 ఇతరులు-0 జన్ కీ బాత్ సర్వే ఎంఎన్ఎఫ్-10-14 జేపీఎం-15-25 కాంగ్రెస్-5-9 బీజేపీ-0-2 ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ఎంఎన్ఎఫ్ 14-18 జేపీఎం 12-16 కాంగ్రెస్ 8-10 బీజేపీ 0-2 ABP-Cvoter MNF-15-21 ZPM-12-18 OTH-0-10 Times Now-ETG MNF-14-18 ZPM-10-14 OTH-9-15 ఎగ్జిట్‌పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
ఓట్ల లెక్కింపునకు 4 వేల మంది సిబ్బంది
ఐజ్వాల్: మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. డిసెంబర్ 3న జరిగే మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో దాదాపు 4000 మంది సిబ్బంది పాల్గొంటారని మిజోరం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మధుప్ వ్యాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల విభాగం సర్వం సిద్ధం చేసింది. కౌంటింగ్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యామని, రాష్ట్రవ్యాప్తంగా 13 కౌంటింగ్ కేంద్రాలు, 40 కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశామని సీఈవో పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో ఈవీఎంలను భద్రంగా ఉంచినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40 కౌంటింగ్ హాళ్లలో 399 ఈవీఎం టేబుల్స్, 56 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయని మిజోరం అదనపు సీఈవో హెచ్ లియాంజెలా తెలిపారు. 40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి నవంబర్ 7న పోలింగ్ జరగ్గా 80.66 శాతం ఓటింగ్ నమోదైంది. పటిష్ట భద్రత రాష్ట్రంలో డిసెంబర్ 3న జరిగే ఓట్ల కౌంటింగ్‌కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మిజోరాం డీజీపీ అనిల్ శుక్లా చెప్పారు. అన్ని ఓటింగ్ యంత్రాలు వివిధ జిల్లాల్లో భద్రంగా ఉన్నాయని, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు పూర్తిగా సహకరిస్తామన్నారు. భద్రత కోసం సీఏపీఎఫ్, ఇతర కేంద్ర బలగాలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నాయి. అదనంగా ఐఆర్‌బీఎన్, మిజోరం సాయుధ పోలీసులను కూడా మోహరించినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఓట్ల కౌంటింగ్ తేదీని మార్చండి..
ఈశాన్య రాష్ట్రం మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలంటూ ఆ రాష్ట్ర పౌర సంఘాలు విజ్ఞప్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఆ రాష్ట్ర పౌర సమాజం, విద్యార్థి సంఘాల గొడుగు సంస్థ అయిన మిజోరం ఎన్జీవో కోఆర్డినేషన్ కమిటీ నుంచి ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. అయితే వీరికి ఎన్నికల కమిషన్ అపాయింట్మెంట్ లభించలేదని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఆదివారం కావడంతోనే.. మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ జరిగింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తోపాటుగా మిజోరాంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. క్రైస్తవ మెజారిటీ రాష్ట్రమైన మిజోరాంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, పౌర సమాజం, ఇతర సంఘాలు కౌంటింగ్ తేదీని మార్చాలని ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కోరాయి. డిసెంబర్ 3 ఆదివారం కావడంతో చర్చి కార్యక్రమాలకు ఇబ్బందులు కలుగుతాయని విజ్ఞప్తులు చేశాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వారి డిమాండ్లను అంగీకరించలేదు. పోలింగ్ తేదీ లాగా కౌంటింగ్ తేదీ ప్రభావం సాధారణ ప్రజలపై ఉండదని, ఆ రోజున వారు నచ్చినట్లుగా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనవచ్చిని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. తమకు ఎన్నికల కమిషన్‌తో ముందస్తు అపాయింట్మెంట్ లేనప్పటికీ ఢిల్లీకి చేరుకుని ఎలక్షన్ కమిషన్ అధికారులను కలవడానికి ప్రయత్నించవచ్చన్న సూచన మేరకు ఇక్కడికి వచ్చినట్లు సెంట్రల్ యంగ్ మిజో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్సావ్‌మ్లియానా పీటీఐకి చెప్పారు. సీవైఎంఏ అనేది ఎన్‌జీవోసీసీలో ఒక భాగం కాగా, ఢిల్లీకి వచ్చిన ఆరుగురు ప్రతినిధుల్లో మల్సావ్‌మ్లియానా ఒకరు. తమ డిమాండ్లను ఈసీ అంగీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా తాము ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలవడానికి ప్రయత్నిస్తామని, కౌంటింగ్ తేదీని రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థిస్తామని సీవైఎంఏ ప్రెసిడెంట్ లాల్‌మచువానా తెలిపారు. -
పోలింగ్ ప్రశాంతం
భోపాల్, ఐజ్వాల్: మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యప్రదేశ్‌లో 74.6%, మిజోరంలో 75 శాతం ఓటింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా ఈవీఎంలు, వీవీప్యాట్లు మొరాయించాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి రావడంతో పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ శాసనసభలోని 230 స్థానాలకు గానూ.. 227 నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. మావోయిస్టు ప్రభావిత బాలాఘాట్ జిల్లాలోని లాన్జీ, పరస్వాడ, బైహార్ (మూడు) నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 3 వరకే పోలింగ్ కొనసాగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ ఈసారి 2 శాతం పెరిగింది. మావోయిస్టు ప్రభావిత మూడు జిల్లాల్లోనే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. పలుచోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), ఓటు ధ్రువీకరణ యంత్రాలు (వీవీప్యాట్) లు మొరాయించాయని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీఎల్ కాంతారావు తెలిపారు. సాంకేతిక లోపాలున్నట్లు ఫిర్యాదులు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా 1,145 ఈవీఎంలు, 1,545 వీవీప్యాట్లను మార్చినట్లు ఆయన చెప్పారు. ‘ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఫిర్యాదులు 2% మాత్రమే వచ్చాయనీ, బుధవారం మాత్రం అది 2.5% వరకు ఉంది. ధర్, ఇండోర్, గుణ జిల్లాల్లో పోలింగ్ విధుల్లో ఉన్న ముగ్గురు సిబ్బంది అనారోగ్య కారణాలతో చనిపోగా, వ్యక్తిగత గొడవల్లో మరో వ్యక్తి మృతి చెందాడు. మరోచోట పోలింగ్ అధికారి తనకు అప్పగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లతో అనుమతి లేకుండా హోటల్లో బస చేయడంతో ఆయన్ను విధుల నుంచి తొలగించాం’అన్నారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంలలో సాంకేతికలోపాలు తలెత్తడం, ఓటర్లు ఎదురుచూడాల్సి రావడంపై కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ఈవీఎల కారణంగా పోలింగ్ ఆలస్యమైన ప్రాంతాల్లో అదనపు సమయం కేటాయించాలని అధికారులను కోరారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. అదనపు సమయం కేటాయించడంపై స్థానిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని తెలిపింది. ఓటేసిన శతాధిక వృద్ధులు మిజోరంలోని 40 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. సుమారు 73 శాతం పోలింగ్ నమోదయింది. సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు క్యూలో నిలుచుని ఉండటంతో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయని చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి ఆశిష్ కుంద్రా తెలిపారు. ముఖ్యమంత్రి లాల్ థన్వాలా పోటీ చేస్తున్న సెర్చిప్ నియోజకవర్గంలో అత్యధికంగా 81 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. ఐజ్వాల్ తూర్పు–1 నియోజకవర్గంలోని జెమబౌక్ నార్త్ ప్రాంతానికి చెందిన స్థానిక మత పెద్ద రొచింగా (108) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతోపాటు 106, 104, 96 ఏళ్ల వృద్ధ ఓటర్లు కూడా తమ హక్కును వినియోగించుకున్నారు. ‘ఓటు వేయడం నేనెప్పుడూ మర్చిపోలేదు. ఓటేయడం మన బాధ్యత. దానిని మనం విస్మరిస్తే.. బాధ్యత మరిచిన సందర్భాల్లో ప్రభుత్వాన్ని మనం ఎలా ప్రశ్నించగలం’ అని రొచింగా అన్నారు. హచ్చెక్, మిజోరం నియోజకవర్గాల్లోనూ శతాధిక వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. త్రిపుర సరిహద్దుల్లోని శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న బ్రూ శరణార్థులు 55 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆశిష్ కుంద్రా తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు తోడ్పాటు అందించిన మిజో ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని 40 సీట్లకుగాను 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
‘ఈశాన్య’ సంస్కృతి వాళ్లకో వింత
ఐజ్వాల్/లుంగ్లీ: ఈశాన్య ప్రాంతమంటే కాంగ్రెస్‌కు ఏ మాత్రం గౌరవం లేదని, అక్కడి సంప్రదాయాలు, వస్త్రధారణను ఆ పార్టీ వింతగా చూడటం తనను బాధించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ నెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మిజోరంలోని లుంగ్లీలో శుక్రవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ఈశాన్య ప్రాంతంలో రవాణా మార్గాలను మెరుగుపరిచి మార్పు తీసుకురావాలన్నదే తమ అభివృద్ధి మంత్రమని తెలిపారు. లుంగ్లీలో ప్రచారం ముగిశాక రాజధాని ఐజ్వాల్‌లో మోదీ..ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులు, పౌర సంఘాలు, విద్యార్థి సంఘాలతో ముచ్చటించారు. వారికి అధికారమే కావాలి.. కాంగ్రెస్‌ను వదిలించుకునేందుకు మిజోరంకు ఇదే చక్కటి అవకాశమని మోదీ పేర్కొన్నారు. ఆ పార్టీ ప్రధాన్యతాంశాల్లో ప్రజలు లేరని, అధికారం కోసమే వెంపర్లాడుతోందని మండిపడ్డారు. ‘మీ ఆశలు, ఆకాంక్షలంటే కాంగ్రెస్‌కు పట్టింపు లేదు. అధికారం దక్కించుకోవడమే వారికి ముఖ్యం. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే మిజోరం అభివృద్ధిలో కొత్త శిఖరాల్ని చేరుకుంటుంది. బీజేపీ హయాంలో ఈశాన్య ప్రాంతంలో రైల్వే మార్గాల విస్తరణ మూడింతలు పెరిగింది. క్రీడా నైపుణ్యానికి మిజోరం కేంద్ర బిందువు. ఇక్కడ పుట్టిన బిడ్డ ‘రోటి’ అనే పదం పలకడానికి ముందే బలంగా బంతిని తన్నడం నేర్చుకుంటాడుæ’ అని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. -
మిజోరం కాంగ్రెస్‌కే..
ఐజ్వాల్: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్ మిజోరంలో మాత్రం తీపి విజయం సాధించింది. మూడింట రెండు వంతులకుపైగా భారీ మెజారిటీతో వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 40 స్థానాలకు ఎన్నికలు జరగడం తెలిసిందే. ఈవీఎంలో సమస్య కారణంగా ఒక స్థానం మినహా 39 స్థానాల ఫలితాలను సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ 33 స్థానాలను కైవసం చేసుకుంది. 2008 నాటి ఎన్నికల్లో ఆ పార్టీకి 32 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో మూడు సీట్లు సాధించిన ప్రధాన విపక్షం మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) ఈసారి ఐదు సీట్లు కైవసం చేసుకుంది. మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్(ఎంపీసీ) ఒక చోట గెలిచింది. 17 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ రిక్తహస్తాలతో మిగిలింది. లాంగ్ట్లాయ్ తూర్పు స్థానంలో ఓ పోలింగ్ బూత్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎంలో సాంకేతిక సమస్య వల్ల కౌంటింగ్ పూర్తి కాలేదు. ఈ బూత్‌లో ఈ నెల 11న రీపోలింగ్ జరిపి, 12న కౌంటింగ్ చేపడతారు. క్రైస్తవుల ప్రాబల్యమున్న మిజోరంలో ‘హస్తం’ తాజా విజయంతో సీఎం లాల్ తాన్హవ్లా ఐదో పర్యాయం మళ్లీ గద్దెనెక్కనున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన తాను పోటీ చేసిన రెండు చోట్లా(సెర్చిప్, రంగ్టర్జో) గెలిచారు. తాన్హవ్లా అసెంబ్లీకి ఎన్నికవడం ఇది తొమ్మిదోసారి. కాంగ్రెస్ మల్లయోధుడు..!: ఈశాన్య పర్వత రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్‌ను మళ్లీ గద్దెనెక్కించిన ముఖ్యమంత్రి లాల్ తాన్హవ్లా (71) తాను ఆ పార్టీ ‘పోస్టర్ బాయ్’నని మరోసారి నిరూపించుకున్నారు. గత 30 ఏళ్లలో నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన ఆయన ఐదోసారి మళ్లీ ఆ పీఠాన్ని అధిష్టించనున్నారు. 1987లో మిజోరంకు రాష్ట్ర హోదా లభించినప్పటినుంచి ‘హస్తం’ గెలుపుల్లో ఆయనదే కీలక పాత్ర. ఆయన 1973 నుంచి రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా పనిచేస్తున్నారంటే రాష్ట్ర పార్టీలో ఆయన స్థానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. చిన్న ప్రభుత్వ ఉద్యోగి స్థాయి నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇంత స్థాయికి ఎదిగారు. -
మిజోరంలో కాంగ్రెస్‌కు ఆధిక్యం
ఐజ్వాల్: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి మిజోరంలో ఊరట లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు దక్కించునే దిశగా సాగుతోంది. మిజోరంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజాగా అందించిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 22 సీట్లు గెల్చుకుంది. మరో 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరాలాండ్ డెమొక్రటిక్ అలయన్స్‌లతో కూడిన మిజోరం ప్రజాస్వామిక కూటమి ఒక సీటు దక్కించుకుంది. మరో రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి లాల్ తన్హాల్వా తన సొంత నియోజకవర్గం సెర్చీఫ్లో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఎంఎన్ఎఫ్ అభ్యర్థి సి లాల్ రామ్ జావాపై 734 ఓట్ల తేడాతో గెలుపొందారు. తన్హాల్వాకు 5719, లాల్ రామ్ జావాకు 4985 ఓట్లు వచ్చాయి. -
మిజోరం ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఐజ్వాల్: మిజోరం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమయింది. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాల నుంచి 142 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీటిలో లుంగ్లెయ్ సౌత్ మినహా మిగిలినవన్నీ ఎస్టీ రిజర్వుడు స్థానాలే కావడం విశేషం. ఎంఎన్ఎఫ్, మరాలాండ్ డెమొక్రటిక్ అలయన్స్‌లతో కూడిన మిజోరం ప్రజాస్వామిక కూటమికి, అధికార కాంగ్రెస్‌కు మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. మిజోరంలో 81 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటరు తాను ఎవరికి ఓటేసిందీ సరిచూసుకునేందుకు వీలు కల్పించే ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా మిజోరంలో ఈసారి 10 అసెంబ్లీ స్థానాల పరిధిలో ప్రవేశపెట్టారు. -
మిజోరంలో ప్రచారం సమాప్తం
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు హోరాహోరీగా సాగించిన ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడింది. సోమవారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. మొత్తం 142 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సోమవారం జరిగే పోలింగ్‌లో వారి భవితవ్యాన్ని 6.91 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు.