Mizoram Election Results 2023: మిజోరంలో జెడ్‌పీఎం జయ కేతనం | Mizoram Election Results 2023 Live Updates | Sakshi
Sakshi News home page

Mizoram Election Results 2023: మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ అప్‌డేట్స్‌

Published Mon, Dec 4 2023 7:28 AM | Last Updated on Mon, Dec 4 2023 3:00 PM

Mizoram Election Results 2023 Live Updates - Sakshi

Live Updates..

జెడీపీఎం జయ కేతనం

  • 27 స్థానాలను కైవసం చేసుకున్న జెడ్పీఎం
  • 7 చోట్ల ఎంఎన్‌ఎఫ్‌ విజయం.. 3 స్థానాల్లో ముందంజ

25 చోట్ల జెడ్‌పీఎం గెలుపు.. 2 స్థానాల్లో ముందంజ

సెర్చిప్‌ నియోజకవర్గంలో జెడ్‌పీఎం సీఎం అభ్యర్థి లాల్దుహోమా ఘన విజయం

జెడ్‌పీఎం ‘మ్యాజిక్‌’ విజయాలు 

  • 20 స్థానాల్లో జెడ్‌పీఎం విజయం.. 7 చోట్ల ఆధిక్యం
  • 7 స్థానాల్లో ఎంఎన్‌ఎఫ్‌ గెలుపు
  • ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన జెడ్‌పీఎం
  • రేపు గవర్నర్‌ను కలవనున్ను సీఎం అభ్యర్థి  లాల్దుహోమా
  • 16 స్థానాల్లో జెడ్‌పీఎం విజయం.. 11 చోట్ల కొనసాగుతున్న ఆధిక్యత
  • 3 చోట్ల ఎంఎన్‌ఎఫ్‌ గెలుపు.. 7 స్థానాల్లో ముందంజ
  • 2 సీట్లు గెలుపొందిన బీజేపీ.. ఒక చోట కాంగ్రెస్‌ ఆధిక్యం

ఎంఎన్‌ఎఫ్‌ తొలి గెలుపు

  • ఒక చోట గెలిచిన మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌), మరో 10 చోట్ల లీడింగ్‌
  • జెడ్‌పీఎంకు 11 విజయాలు, 15 చోట్ల కొనసాగుతున్న ఆధిక్యం

7 స్థానాల్లో జెడ్‌పీఎం విజయం.. 

  • 7 స్థానాల్లో జెడ్‌పీఎం విజయం, మరో 19 చోట్ల ఆధిక్యం
  • 11 నియోజకవర్గాల్లో ఎంఎన్‌ఎఫ్‌ ముందంజ
  • ఒక చోట గెలిచిన బీజేపీ, మరో స్థానంలో లీడింగ్‌
  • ఒక స్థానంలో కాం‍గ్రెస్‌ ముందంజ

మిజోరంలో దూసుకుపోతున్న జేపీఎం
జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌(జెడ్‌పీఎం).. 26స్థానాల్లో లీడ్‌, ఒక స్థానంలో గెలుపు
ఎంఎన్‌ఎఫ్‌.. 9 స్థానాలు
బీజేపీ..3
కాంగ్రెస్‌..2 స్థానాల్లో లీడ్‌

మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్‌.. 

  • ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం.. 
  • ఎంఎన్‌ఎఫ్‌..5 
  • జెడ్‌పీఎమ్‌..3
  • బీజేపీ..1
  • కాంగ్రెస్‌..1 చోట ఆధిక్యం 

మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్‌


పోస్టల్‌ బ్యాలెట​్‌ ఓట్లను లెక్కిస్తున్న అధికారులు. 

►మిజోరంలో ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

► మిజోరంలో కౌంటింగ్‌కు సర్వం సిద్దం.

►మిజోరం అసెం‍బ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు కౌంటింగ్‌ జరుగనుంది. కౌంటింగ్‌ ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. 

►40 నియోజక వర్గాలున్న మిజోరంలో అధికార ఎంఎన్‌ఎఫ్‌(మిజో నేషనల్‌ ఫ్రంట్‌), జడ్‌పీఎం (జొరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌), కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

►ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 13 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని మిజోరం రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి హెచ్‌.లియాంజెలా తెలిపారు.

►మిజోరంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

►174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్‌ 26, జడ్‌పీఎం 8, కాంగ్రెస్‌ 5, బీజేపీ ఒక స్థానం గెలుపొందాయి.

►నవంబరు 7న మిజోరం అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement