mizo national front
-
Mizoram Election Result 2023: మిజోరంలో జెడ్పీఎం
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరం శాసనసభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ జోరాం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) సంచలన విజయం సాధించింది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)ను మట్టికరిపించింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను 27 స్థానాల్లో గెలిచింది. మెజారిటీ మార్కును సులువుగా దాటేసింది. మిజోరం ఎన్నికల్లో సోమవారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అధికార ఎంఎన్ఎఫ్ కేవలం 10 స్థానాల్లో నెగ్గింది. బీజేపీకి రెండు స్థానాలు లభించాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంలో గట్టెక్కింది. ఈ ఎన్నికల్లో అధికార ఎంఎన్ఎఫ్కు దారుణ పరాభవం ఎదురైంది. ఎంఎన్ఎఫ్ అధినేత, ముఖ్యమంత్రి జోరామ్‌తాంగ ఓటమిపాలయ్యారు. ఐజ్వాల్ ఈస్ట్–1 స్థానంలో ఆయనపై జెడ్పీఎం అభ్యర్థి లాల్థాన్సాంగ 2,101 ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. జెడ్పీఎం నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్దుహొమా.. సెర్చిప్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి జె.వాంచ్వాంగ్పై 2,982 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు. ఎన్నికల్లో పోటీ చేసిన 11 మంది మంత్రుల్లో ఏకంగా 9 మంది పరాజయం పాలయ్యారు. ఉప ముఖ్యమంత్రి తాన్లూయా, ఆరోగ్య శాఖ మంత్రి ఆర్.లాల్థాంగ్లియానా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లారౌత్కిమా, విద్యుత్ శాఖ మంత్రి ఆర్.లాల్జిర్లియానా, వ్యవసాయం, నీటిపారుదల శాఖ మంత్రి సి.లాల్రిన్సంగా, ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి కె.లాల్రిన్లియానా, ఎక్సైజ్ శాఖ మంత్రి లాల్రినామా తదితరులు ఓడిపోయారు. పాఠశాల విద్యా శాఖ మంత్రి లాల్చాందామా రాల్టే, పర్యాటక శాఖ సహాయ మంత్రి రాబర్ట్ రొమావియా రాయ్టే విజయం సాధించారు. మిజోరం నూతన ముఖ్యమంత్రిగా జెడ్పీఎం అధ్యక్షుడు లాల్దుహొమా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవంబర్ 7వ తేదీన జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం, కాంగ్రెస్ పారీ్టలు మొత్తం 40 స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ 23 సీట్లలో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. రాష్ట్రంలో తొలిసారిగా ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) సైతం పోటీ చేసింది. నాలుగు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీపడ్డారు. అలాగే 17 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల్లో ‘ఆప్’ ఖాతా తెరవలేకపోయింది. స్వతంత్రులెవరూ నెగ్గలేదు. ఇందిరాగాంధీ అంగరక్షకుడు కాబోయే ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురైన మొట్టమొదటి ఎంపీగా అప్రతిష్ట మూటగట్టుకున్న 73 ఏళ్ల లాల్దుహోమా మిజోరం ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అన్నింటినీ తట్టుకొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. లాల్దుహొమా ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భద్రతా సిబ్బందికి ఇన్చార్జిగా సేవలందించారు. ఆయన నాయకత్వంలో జోరాం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) 2019లో రాజకీయ పారీ్టగా ఎన్నికల సంఘం వద్ద నమోదైంది. కేవలం నాలుగేళ్లలో మిజోరం ఎన్నికల్లో అతిపెద్దగా పార్టీగా అవతరించి, అధికారం చేపడుతుండడం విశేషం. లాల్దుహొమా తొలిసారిగా 1984లో కాంగ్రెస్ టికెట్‌పై మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. కేవలం 846 ఓట్ల తేడాతో పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత మిజోరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986లో ఆ పారీ్టకి రాజీనామా చేశారు. అప్పటి ముఖ్యమంత్రి లాల్ థాన్హాలాకు, కేబినెట్ మంత్రులకు వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు లాల్దుహొమాపై ఆరోపణలు వచ్చాయి. 1988లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడింది. అలాగే 2020లో ఎంఎన్ఎఫ్ ఎమ్మెల్యేగా ఉన్న లాల్దుహొమాపై మిజోరం అసెంబ్లీ స్పీకర్ లాల్రిన్లియానా సాయ్‌లో అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ లాల్దుహొమాపై ఎంన్ఎఫ్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మిజోరంలో ఈ చట్టం కింద అనర్హతకు గురైన మొదటి ఎమ్మెల్యే లాల్దుహొమా కావడం గమనార్హం. జెడ్ఎన్పీ అభ్యర్థిగా 2003లో, 2008లో, 2018లో, 2021లోఎమ్మెల్యేగా ఆయన విజయం దక్కించుకున్నారు. రాజకీయ యోధుడిని ఓడించిన మూకదాడి బాధితుడు రాయ్‌పూర్: మత ఘర్షణల్లో కుమారుడిని కోల్పోయి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ తండ్రి చూపిన ధర్మాగ్రహం.. అక్కడి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్నికల్లో మట్టికరిపించింది. ఆదివారం వెల్లడైన ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలు ఈ ఘటనకు సాక్ష్యంగా నిలిచాయి. అసలేం జరిగిందనేది ఓ సారి గమనిస్తే.. బేమేతరా జిల్లా బిరాన్‌పూర్ గ్రామంలో ఈశ్వర్ సాహూ అనే కార్మికుడికి 23 ఏళ్ల భువనేశ్వర్ సాహూ అనే కుమారుడు ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ గ్రామంలో జరిగిన మత ఘర్షణల్లో వేరే మతానికి చెందిన అల్లరిమూక భువనేశ్వర్ సాహూను హతమార్చింది. కొడుకును కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ తమ సాజా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రవీంద్ర చౌబేను తండ్రి వేడుకున్నాడు. భూపేశ్ బఘేల్ సర్కార్ తనకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఈశ్వర్ సాహూ కన్నీరుమున్నీరవడం, ఆయన ఆక్రందన నాడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హత్య ఘటన తర్వాత హతుడి తల్లినీ అల్లరిమూక బెదిరించింది. హత్యకు నిరసనగా నాడు విశ్వహిందూ పరిషత్ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పాలనే సంకల్పంతో ఇతనికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాజా నియోజకవర్గంలో రాజకీయ యోధుడిగా పేరొందిన రవీంద్ర చౌబేకు పోటీగా బరిలో నిలిపింది. ఈశ్వర్ సాహూకు జరిగిన అన్యాయంపై ప్రజల్లో గూడుకట్టుకున్న ఆగ్రహావేశాలు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించాయి. రవీంద్ర చౌబే కంటే ఎక్కువ ఓట్లు సాధించి ఈశ్వర్ ఘన విజయం సాధించారు. ‘ ఈశ్వర్ సాహూ ఒకప్పుడు కార్మికుడు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే. హంతకులకు మద్దతు పలికిన కాంగ్రెస్‌కు ఈశ్వర్ తగిన గుణపాఠం చెప్పారు’ అని బీజేపీ ఐటీ విభాగ జాతీయ సమన్వయ కర్త అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. -
జెండా పాతిన జీపీఎం.. మిజోరంలో సంచలన విజయం
అగర్తలా: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం విజయం నమోదు అయ్యింది. ప్రాంతీయ పార్టీ జీపీఎం(ZPM) 27 సీట్లతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది జీపీఎం. ఎంఎన్ఎఫ్ 10 స్థానాల్లో నెగ్గగా.. బీజేపీ 2, కాంగ్రెస్ ఒక స్థానంతో సరిపెట్టుకున్నాయి. మిజోరం అసెంబ్లీకి 40 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 21 కాగా, మిజోరం మరో ఆరు ఎక్కువ సీట్లకే కైవసం చేసుకుంది. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరిగింది. మిజోరంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ కూటమికి సంబంధించిన 5 ముఖ్యమైన విషయాలు.. ► రాష్ట్రంలోని జోరం పీపుల్స్ మూవ్మెంట్(జీపీఎం) ఆరు పార్టీల కూటమి. ఇందులో మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్, జోరామ్ నేషనలిస్ట్ పార్టీ, జోరామ్ ఎక్సోడస్ మూవ్మెంట్, జోరామ్ డిసెంట్రలైజేషన్ ఫ్రంట్, జోరామ్ రిఫార్మేషన్ ఫ్రంట్, మిజోరం పీపుల్స్ పార్టీ. ఈ పార్టీలన్నీ జెడ్పీఎం కూటమిగా అసెంబ్లీ బరిలోకి దిగాయి. ► జీపీఎం స్థాపించిన కొద్ది ఏళ్లలోనే మిజోరంలో గణనీయంగా దీని ప్రాధాన్యతను సంపాధించుకుంది. ఈ పార్టీని 2017లో స్థాపించారు. తొలిసారి 2018 మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో 40 సీట్లలో పోటీ చేసి.. కేవలం ఆరు సీట్లలో విజయం సాధించింది. ఆ మరుసటి ఏడాది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జీపీఎం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ► మాజీ ఎంపీ, ఎమ్మెల్యే లల్దుహోమ జీపీఎం పార్టీని స్థాపించారు. ఆయనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నిలబడ్డారు. ► మిజోరంలో లౌకికవాదాన్ని విస్తరించటం, ప్రాంతీయ మైనారిటీలకు రక్షణ కల్పించడం ఈ పార్టీ అవలభించే ప్రాధాన్యతలుగా ప్రచారం చేసింది. ఈ పార్టీ ముఖ్యగా ప్రస్తుత సీఎం జోరమ్‌తంగాపై అవినీతి ఆరోపణలను ప్రజలకు వివరించడంలో సఫలీకృతమయ్యింది. ► మిజోరంలో జీపీఎం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని తమ కూటమి ప్రాధాన్యతలలో ఒకటిగా ప్రచారం చేసింది. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) 26 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ 3 స్థానాల నుంచి ఒకటికి పడిపోగా, బీజేపీ 2 నియోజకవర్గాల్లో నెగ్గి.. గత ఎన్నికల కంటే ఒక స్థానం అదనంగా దక్కించుకుంది. -
Mizoram Election Results 2023: మిజోరంలో జెడ్పీఎం జయ కేతనం
Live Updates.. జెడీపీఎం జయ కేతనం 27 స్థానాలను కైవసం చేసుకున్న జెడ్పీఎం 7 చోట్ల ఎంఎన్ఎఫ్ విజయం.. 3 స్థానాల్లో ముందంజ 25 చోట్ల జెడ్పీఎం గెలుపు.. 2 స్థానాల్లో ముందంజ సెర్చిప్ నియోజకవర్గంలో జెడ్పీఎం సీఎం అభ్యర్థి లాల్దుహోమా ఘన విజయం జెడ్పీఎం ‘మ్యాజిక్’ విజయాలు 20 స్థానాల్లో జెడ్పీఎం విజయం.. 7 చోట్ల ఆధిక్యం 7 స్థానాల్లో ఎంఎన్ఎఫ్ గెలుపు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన జెడ్పీఎం రేపు గవర్నర్‌ను కలవనున్ను సీఎం అభ్యర్థి లాల్దుహోమా 16 స్థానాల్లో జెడ్పీఎం విజయం.. 11 చోట్ల కొనసాగుతున్న ఆధిక్యత 3 చోట్ల ఎంఎన్ఎఫ్ గెలుపు.. 7 స్థానాల్లో ముందంజ 2 సీట్లు గెలుపొందిన బీజేపీ.. ఒక చోట కాంగ్రెస్ ఆధిక్యం ఎంఎన్ఎఫ్ తొలి గెలుపు ఒక చోట గెలిచిన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), మరో 10 చోట్ల లీడింగ్ జెడ్పీఎంకు 11 విజయాలు, 15 చోట్ల కొనసాగుతున్న ఆధిక్యం 7 స్థానాల్లో జెడ్పీఎం విజయం.. 7 స్థానాల్లో జెడ్పీఎం విజయం, మరో 19 చోట్ల ఆధిక్యం 11 నియోజకవర్గాల్లో ఎంఎన్ఎఫ్ ముందంజ ఒక చోట గెలిచిన బీజేపీ, మరో స్థానంలో లీడింగ్ ఒక స్థానంలో కాంగ్రెస్ ముందంజ మిజోరంలో దూసుకుపోతున్న జేపీఎం జోరం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం).. 26స్థానాల్లో లీడ్, ఒక స్థానంలో గెలుపు ఎంఎన్ఎఫ్.. 9 స్థానాలు బీజేపీ..3 కాంగ్రెస్..2 స్థానాల్లో లీడ్ #MizoramElections2023 | Official EC trends of all 40 seats in - ZPM (Zoram People's Movement) comfortably crosses the halfway mark, wins 1 and leads on 25 seats. Ruling MNF (Mizo National Front) leads on 9 seats BJP on 3 Congress on 2 pic.twitter.com/w2zT3I7sVc — ANI (@ANI) December 4, 2023 మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్.. ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. ఎంఎన్ఎఫ్..5 జెడ్‌పీఎమ్..3 బీజేపీ..1 కాంగ్రెస్..1 చోట ఆధిక్యం #MizoramElections2023 | Early official EC trends in; MNF (Mizo National Front) leading on 5 seats while ZPM (Zoram People's Movement) ruling on 3 seats. BJP and Congress leading on 1 each. Counting of votes on all 40 seats is underway. pic.twitter.com/QfPu4B77Pn — ANI (@ANI) December 4, 2023 మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్ #WATCH | #MizoramElections2023 | After counting of postal ballots, counting of votes cast through EVMs begins. Visuals from a counting centre at Aizawl Government College where strong room was unlocked for EVMs to be brought out. pic.twitter.com/epdcbCNHUB — ANI (@ANI) December 4, 2023 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న అధికారులు. #WATCH | Counting of votes for #MizoramElections2023 is underway. Visuals from a counting centre in Serchhip. pic.twitter.com/yaQzE5oqmj — ANI (@ANI) December 4, 2023 ►మిజోరంలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం Counting of votes for Mizoram Elections 2023 begins. pic.twitter.com/S1IJmvFwR7 — ANI (@ANI) December 4, 2023 ► మిజోరంలో కౌంటింగ్‌కు సర్వం సిద్దం. #WATCH | Counting for #MizoramElections2023 to take place today. Visuals from a counting centre in Serchhip as boxes containing ballot papers being brought here. pic.twitter.com/PqIWtRKpDv — ANI (@ANI) December 4, 2023 #WATCH | Preparations underway at the counting centre in Aizawl where the counting of votes for the Mizroam Assembly Elections will begin shortly. pic.twitter.com/tAwFWBDiuM — ANI (@ANI) December 4, 2023 ►మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు కౌంటింగ్ జరుగనుంది. కౌంటింగ్ ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. ►40 నియోజక వర్గాలున్న మిజోరంలో అధికార ఎంఎన్ఎఫ్(మిజో నేషనల్ ఫ్రంట్), జడ్పీఎం (జొరం పీపుల్స్ మూవ్మెంట్), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ►ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 13 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని మిజోరం రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి హెచ్.లియాంజెలా తెలిపారు. #WATCH | Preparations underway at the counting centre in Serchhip where the counting of votes for the Mizroam Assembly Elections will begin shortly. pic.twitter.com/QiedojHJ7B — ANI (@ANI) December 4, 2023 ►మిజోరంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ►174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26, జడ్పీఎం 8, కాంగ్రెస్ 5, బీజేపీ ఒక స్థానం గెలుపొందాయి. ►నవంబరు 7న మిజోరం అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
మిజోరం కొత్త సీఎం ప్రమాణం
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరాం కొత్త ముఖ్యమంత్రిగా మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) అధ్యక్షుడు జోరంథంగా శనివారం ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ రాజశేఖరన్ ఐజ్వాల్‌లోని రాజ్ భవన్లో ప్రమాణం చేయించారు. మిజోరాం శాసనసభలో మొత్తం 40 స్థానాలుండగా ఇటీవలి ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 సీట్లు గెలవడం తెలిసిందే. జోరంథంగా 1998, 2003ల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 11 మంది మంత్రుల్లో ఐదుగురు కేబినెట్ మంత్రులు. తాన్లూ్యయాకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. గతపదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, ఎన్నికలకు కొద్దిరోజుల ముందే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎంఎన్‌ఎఫ్‌లో చేరిన లాల్జిర్లియానాకు కూడా కేబినెట్ మంత్రి పదవి దక్కడం గమనార్హం. తొలిసారిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బైబిల్లోని వాక్యాలను చదివి ప్రార్థనలు చేశారు. క్రైస్తవ పాటలను కూడా ఆలపించారు. తొలిసారిగా జోరంథంగా, ఆయన మంత్రులు మిజో భాషలో ప్రమాణం చేశారు. -
మిజోరంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : ఎంఎన్ఎఫ్
ఐజ్వాల్ : మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్ధానాలకు గాను మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 24 స్ధానాల్లో గెలుపొందిన మిజో నేషనల్ ఫ్రంట్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. మిజోరంలో తమ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తాము యూపీఏలో చేరబోమని ఎంఎన్ఎఫ్ అధ్యక్షుడు జోరంతంగా తెలిపారు. తాము నార్త్ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటామని చెప్పారు.తమ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే మద్య నిషేధం విదించడంతో పాటు రహదారుల మరమ్మత్తులు, సామాజికార్ధిక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడమే అజెండాగా పనిచేస్తామన్నారు. -
ముఖ్యమంత్రి హాట్రిక్ మిస్?
అతిచిన్న రాష్ట్రం మిజోరంలో అధికార పార్టీకి షాక్ తగిలింది. దేశంలో మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ మెరుగైన తీరుతో దూసుకుపోతుండగా మిజోరాంలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే తగిలింది. ఏ మాత్రం రేసులో లేని నిరాశజనక ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఎంఎన్ఎఫ్ 25 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సీట్లలో విజయం సాధిస్తే మ్యాజిక్ ఫిగర్ ఖాయం అయినట్టే. అయితే ఆరంభంలో కొంచెం జోరుగా ఉన్న కాంగ్రెస్ అంతకంతకూ ఆధిక్యాన్ని కోల్పోతూ తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 9 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. ఈ ఫలితాలతో అందనంత దూరంలో కాంగ్రెస్‌ను అక్కడి ప్రజలు నెట్టేశారు. బీజేపీ కూటమి రెండు స్థానాల్లో లీడ్‌లో ఉంది. జోరాం పీపుల్స్ మూవ్మెంట్(జేపీఎం) 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వెనుకంజలో సీఎం స్వయంగా ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ వెనకంజలో ఉన్నారు. సొంత నియోజకవర్గం సెర్చిప్‌లో జీపీఎం అభ్యర్థి లాల్దూ హోమా కంటే వెనుకబడి ఉండగా అటు చంపైలో కూడా వెనుకంజలో ఉన్నారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న రాష్ట్రాల్లో మిజోరం ఒకటి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మిజోరం విజయం చాలా ప్రతిష్టాత్మకం. ఇక్కడ మొత్తం 40 శాసనసభ స్థానాలున్నాయి. మెజారిటీ మార్క్ 21. అంటే 21 అంతకంటే ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. -
మిజో గుండెపై బాంబుల వర్షం
మిజోరాం దేశ రాష్ట్రాల్లో ఒకటిగా అందరికీ తెలుసు. కానీ, మిజోరాం సొంత రాష్ట్రంగా ఏర్పడటానికి చేసిన ప్రయత్నాల గురించి.. తిన్న ఎదురుదెబ్బల గురించి మాత్రం కొందరికే తెలుసు. సొంత ప్రభుత్వంతో తన గుండెలపై బాంబుల వర్షం కురిపించుకున్న తొలి రాష్ట్రం మిజోరాం. అవును. మిజోరాంపై భారత ప్రభుత్వం బాంబుల వర్షం కురిపించింది. ఆ విషయాన్ని బయటకు రానికుండా ఎన్నో గొంతులు నులిమేసింది. అయినా నిజం ఎన్నటికీ చావదు. అందుకే ఆనాటి ప్రభుత్వ చర్య భవిష్యత్తు తరాలకు తెలియాలని కొందరు తమ పుస్తకాల్లో రాశారు. 1961లో అసోం నుంచి మిజోరాంను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్ పెరిగింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మిజో నేషనల్ ఫ్రంట్ అక్టోబర్ 28, 1961న ఏర్పడింది. తొలుత రాజకీయ అవసరాలను నేరవేర్చుకునేందుకు ఉద్యమం ప్రశాంతంగా సాగింది. ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర బలగాలు మానవహక్కులను ఉల్లంఘిస్తూ చేసిన ప్రయత్నాలు మిజో ప్రజలను విచక్షణ కోల్పోయేలా చేశాయి. దాంతో మిజో నేషనల్ ఫ్రంట్ ఆయుధాలను చేత పట్టింది. బలగాలను మిజోరాం నుంచి పంపేయాలనే ఉద్దేశంతో మిజో నేషనల్ ఫ్రంట్ ఆపరేషన్ జెరికోను ప్రారంభించింది. ఐజ్వాల్, లుంగ్లేయ్ల్లోని అస్సాం రైఫిల్స్‌కు చెందిన స్ధావరాలపై వరుస దాడులు నిర్వహించింది. ఆ మరుసటి రోజు మిజో నేషనల్ ఫ్రంట్ భారత్ నుంచి విడిపోయి స్వతంత్ర రాజ్యంగా ఏర్పడినట్లు ప్రకటించుకుంది. ఆపరేషన్ జెరికోతో భారత ప్రభుత్వం, భద్రతా దళాలు షాక్‌కు గురయ్యాయి. మిజో నేషనల్ ఫ్రంట్ దెబ్బకు భద్రతా దళాలు ఐజ్వాల్, లుంగ్లేయ్లలో పూర్తిగా పట్టుకోల్పోయాయి. ఆయుధ కర్మాగారాలు, ఐజ్వాల్ కోశాగారం మిజోల చేతిలోకి వెళ్లిపోయాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ ప్రభుత్వం మార్చి 5వ తేదీన ఐజ్వాల్‌పై బాంబు దాడి చేయాలని ఆదేశించింది. క్షణాల్లో ఐజ్వాల్‌కు చేరువలో ఉన్న ఎయిర్‌బేస్‌ల నుంచి నాలుగు యుద్ధవిమానాలు ఐజ్వాల్‌పై దాడి చేశాయి. తొలుత బుల్లెట్ల వర్షం కురిపించిన విమానాలు.. కొద్ది క్షణాల తర్వాత బాంబుల వర్షం కురిపించాయి. దాంతో ఐజ్వాల్‌లో పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భయభ్రాంతులకు గురైన మిజో ప్రజలు పట్టణం నుంచి కొండ ప్రాంతాలకు పారిపోయారు. మార్చి 13వ తేదీ వరకూ ఎయిర్‌ఫోర్స్ ఐజ్వాల్‌పై దాడులు నిర్వహించింది. రెబెల్స్‌లో కొందరు తలదాచుకోవడానికి మయన్మార్ అడవులకు, మరికొందరు అప్పటి తూర్పు పాకిస్తాన్(నేటి బంగ్లాదేశ్)కు పారిపోయారు. ఎయిర్‌ఫోర్స్ దాడులను గుర్తు చేసుకున్న ఓ మిజో నేషనల్ ఫ్రంట్ వెటరన్.. ప్రభుత్వం బాంబు దాడులకు దిగుతుందని తాము కలలో కూడా ఊహించలేదని చెప్పారు. నలువైపుల నుంచి వచ్చిన జెట్లు తమపై బాంబుల వర్షం కురిపించాయని.. అదృష్టవశాత్తు ఆ ఘటనలో 13మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ప్రభుత్వం మిజోరాం గుండెపై దెబ్బకొట్టినా.. మిజో వాసుల ఆశయాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయిందని గద్గద స్వరంతో తెలిపారు. ఐజ్వాల్ దాని దగ్గరి జిల్లాలపై ప్రభుత్వం బాంబు దాడులు జరిపి ఈ నెల 5వ తేదీతో 50 ఏళ్లు పూర్తయ్యాయి.