ఐజ్వాల్: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి మిజోరంలో ఊరట లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు దక్కించునే దిశగా సాగుతోంది. మిజోరంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజాగా అందించిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 22 సీట్లు గెల్చుకుంది. మరో 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరాలాండ్ డెమొక్రటిక్ అలయన్స్‌లతో కూడిన మిజోరం ప్రజాస్వామిక కూటమి ఒక సీటు దక్కించుకుంది. మరో రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
ముఖ్యమంత్రి లాల్ తన్హాల్వా తన సొంత నియోజకవర్గం సెర్చీఫ్లో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఎంఎన్ఎఫ్ అభ్యర్థి సి లాల్ రామ్ జావాపై 734 ఓట్ల తేడాతో గెలుపొందారు. తన్హాల్వాకు 5719, లాల్ రామ్ జావాకు 4985 ఓట్లు వచ్చాయి.
మిజోరంలో కాంగ్రెస్కు ఆధిక్యం
Published Mon, Dec 9 2013 12:57 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
Advertisement