Aizawl
-
కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి
ఐజ్వాల్: మిజోరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ రాతి క్వారీ కుప్పకూలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఐజ్వాల్ జిల్లాలో జరిగిన క్యారీ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరికొంత మంది క్యారీలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.#Mizoram: 2 killed, many feared dead after stone quarry collapses in #AizawlTwo individuals were killed after a stone quarry collapsed in Aizawl’s Melthum and Hlimen border on May 28 around 6 am after #CycloneRemal wreaked havoc across Mizoram, as per latest reports.… pic.twitter.com/rCr7cExMGX— India Today NE (@IndiaTodayNE) May 28, 2024క్యారీలో చిక్కుకున్నవారిని రెస్య్కూ చేసి బయటకు తీసుకురావటానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భారీ వర్షం, కొండచరియలు విరిగిపడే ప్రాంతం సెర్చ్ ఆపరేషన్‌కు ప్రతికూలంగా మారిందని వెల్లడించారు.10 Dead, Several Feared Trapped As Stone Quarry Collapses In Mizoram https://t.co/8B5FGdvLz6— Priyanka Krishnadas (@pri3107das) May 28, 2024 మరోవైపు భారీ వర్షం కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులుకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. అదే విధంగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో హైవేలు, కీలక రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. హుంతూర్ వద్ద జాతీయ రహదారి 6పై కొండచరియలు విరిగిపడటంతో ఐజ్వాల్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఆదివారం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లో రెమాల్ తుపాన్ బిభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. -
మిజోరం జెయింట్ కిల్లర్..ఎవరంటే..!
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూమెంట్(జెడ్‌పీఎమ్) పార్టీ ఘన విజయం సాధించింది. 27 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో జెడ్‌పీఎమ్ పార్టీ తరపున ఐజ్వాల్ ఈస్ట్-1 నియోజకవర్గం నుంచి గెలిచిన లాల్తన్సంగా వార్తల్లో నిలిచారు. మూడుసార్లు మిజోరం ముఖ్యమంత్రిగా చేసిన జోరంతంగాను ఓడించి 2 వేల ఓట్ల మెజారిటీతో లాల్ గెలిచారు. ఈ సందర్భంగా లాల్తన్సంగా మాట్లాడుతూ ‘మిజోనేషనల్ ఫ్రంట్(ఎమ్ఎన్ఎఫ్), కాంగ్రెస్ పార్టీలది కేవలం అధికారదాహం. పార్టీ నాకు ఐజ్వాల్ ఈస్ట్-1 టికెట్ ఇచ్చినపుడు నేను సర్వే చేసుకున్నాను. నియోజకవర్గంలో జోరంతంగా బలం అంతగా లేదని నాకు అప్పుడే తెలిసింది. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా జోరంతంగా నాయకత్వంపై ప్రజలు అంత సంతృప్తిగా లేరు’అని లాల్ తెలిపారు. ‘కాంగ్రెస్, ఎమ్ఎన్ఎఫ్ పార్టీలు కేవలం డబ్బుపైనే ఆధారపడి రాజకీయాలు చేస్తాయి.నిజంగా డబ్బు ప్రభావమే ఉంటే జోరంపై నేను గెలిచేవాడిని కాదు’అని లాల్ చెప్పారు. సోమవారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మిజోరంలో జెడ్‌పీఎమ్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. మిజోరం అసెంబ్లీలో మొత్తం 40 సీట్లుండగా జెడ్‌పీఎమ్ 27 సీట్లు గెలిచింది. ఇవీ చూడండి..మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ -
మిజోరంలో 77 శాతానికి పైగా పోలింగ్
ఐజ్వాల్: అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), విపక్ష జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం), కాంగ్రెస్ మధ్య తీవ్రపోటీకి వేదికగా నిలిచిన మిజోరం శాసనసభ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 40 స్థానాలకూ ఒకే దఫాలో పోలింగ్ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు అందిన సమాచారం మేరకు 77.39 శాతం పోలింగ్ నమోదైందని అదనపు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్.లియాంజెలా చెప్పారు. సవరించిన తుది ఫలితాలు బుధవారం వచ్చేసరికి పోలింగ్ శాతం 80 శాతాన్ని తాకొచ్చు. 18 మంది మహిళలు సహా మొత్తంగా 174 మంది అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 8.57 లక్షల ఓటర్లు ఉన్నారు. సెర్చిప్ జిల్లాలో అత్యధికంగా 84.49 శాతం, ఐజ్వాల్ జిల్లాలో అత్యల్పంగా 73.09 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు 7,200 భద్రతా సిబ్బందిని నియోగించారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ఓటేయబోతే మొరాయించింది ఐజ్వాల్‌లోని ఒక ఈవీఎం ఏకంగా ముఖ్యమంత్రినే రెండోసారి పోలింగ్‌కేంద్రానికి రప్పించింది. మొదటిసారి మొరాయించడమే ఇందుకు కారణం. ర్యామ్హ్యూన్ వెంగ్లాయ్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు ఉదయాన్ని ముఖ్యమంత్రి జోరామ్‌థంగా విచ్చేశారు. అప్పుడే ఈవీఎం మొరాయించింది. చేసేదేం లేక ఇంటికి వెనుతిరిగారు. మళ్లీ 9.40 గంటలకు వచ్చి ఓటేశారు. ‘ ఈసారి కనీసం 25 చోట్ల గెలుస్తాం’ అని సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లాల్సావ్తా ఐజ్వాల్ వెస్ట్–3 నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 96 ఏళ్ల అంధుడు పూ జదావ్లా పోస్టల్ బ్యాలెట్‌ను కాదని స్వయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. పోలింగ్ నేపథ్యంలో మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసేశారు. రాకపోకలను ఆపేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఏకంగా 81.61 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. డిసెంబర్ మూడో తేదీన ఓట్లలెక్కింపు ఉంటుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 చోట్ల గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఉపఎన్నికల్లో మరో రెండు చోట్ల గెలిచింది. విపక్ష జెడ్పీఎం ఎనిమిది చోట్ల గెలిచింది. బీజేపీ కేవలం ఒక్క స్థానంలో, కాంగ్రెస్ ఐదు చోట్ల విజయబావుటా ఎగరేశాయి. ‘ఈసారి పట్టణప్రాంతాల్లో జెడ్పీఎం, గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎన్ఎఫ్ ఎక్కువ సీట్లు గెలవొచ్చు’ అన్న విశ్లేషణలు వినిపించాయి. -
‘మిజోరం’ ప్రమాదం.. 22కు చేరిన మృతులు
ఐజ్వాల్: మిజోరంలోని ఐజ్వాల్‌లో బుధవారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం సాయంత్రం వరకు మొత్తం 22 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. జాడ తెలియకుండా పోయిన మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. అతడు ప్రాణాలతో ఉండే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. క్షతగాత్రులైన ముగ్గురిలో ఇద్దరిని ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. బాధితులైన మొత్తం 26 మందీ పశి్చమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాకు చెందిన వారే. -
బ్రిడ్జి కింద నలిగిన బతుకులు
కోల్‌కతా/ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో బుధవారం ఘోరం జరిగింది. ఐజ్వాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 100 మీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. నిర్మాణ పనుల్లో ఉన్న కారి్మకుల్లో కనీసం 18 మంది ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇంకా కనీసం ఐదుగురి జాడ తెలియాల్సి ఉంది. మృతుల్లో అత్యధికులు పశి్చమ బెంగాల్‌కు చెందిన వారే. ప్రమాద ప్రాంతం సైరంగ్ ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. కురింగ్ నది మీద నిర్మిస్తున్న బ్రిడ్జి పైకి చేర్చే క్రమంలో గాంట్రీ కుప్పకూలడమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 16 మృతదేహాలను వెలికితీశారు. సహాయ, తరలింపు తదితర చర్యల్లో మిజోరం అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాల్సిందిగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. మృతుల కుటుంబాల్లోని అర్హులకు రైల్వే శాఖ పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. Under construction railway over bridge at Sairang, near Aizawl collapsed today; atleast 17 workers died: Rescue under progress. Deeply saddened and affected by this tragedy. I extend my deepest condolences to all the bereaved families and wishing a speedy recovery to the… pic.twitter.com/IbmjtHSPT7 — Zoramthanga (@ZoramthangaCM) August 23, 2023 ఇది కూడా చదవండి: Live Updates: చందమామను ముద్దాడే క్షణం కోసం.. చరిత్రకు అడుగు దూరంలో చంద్రయాన్–3 -
షాకింగ్.. సబ్బు పెట్టెల్లో హెరాయిన్.. రూ.12 కోట్ల డ్రగ్స్ సీజ్..
ఐజ్వాల్: మిజోరాంలో డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. పోలీసులు, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఐజ్వాల్‌లో రెండు చోట్ల మత్తుపదార్థాలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం నలుగురు డ్రగ్ పెడ్లర్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక చోట 98,000 డ్రగ్స్ మాత్రలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.9.8 కోట్లు ఉంటుందని తెలిపారు. మరో ఘటనలో శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. 40 సబ్బుపెట్టెల్లో హెరాయిన్‌ను గుర్తించారు అధికారులు. దీని విలువ రూ.2.5కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. వీడియో వైరల్.. -
చనిపోలేదు! బిగ్గెస్ట్ ఫ్యామిలీమ్యాన్ బతికే ఉన్నారు!
ఐజ్వాల్: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి అధిపతిగా రికార్డులకెక్కిన జియాన్‌ఘాకా మరణించి 36 గంటలు దాటుతున్నా, ఆయన కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఆయన ఇంకా జీవించేఉన్నారని వారు చెబుతున్నారు. 39 మంది భార్యలు, 90 మందికి పైగా సంతానం, 33 మంది మనవళ్లు, మనవరాళ్లున్న 76 ఏళ్ల జియాన్ స్థానిక లాల్పా కోహ్రాన్ ధర్ తెగకు అధిపతి. బీపీ, సుగర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం మరణించినట్లు స్థానిక ట్రినిటీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఆయన శరీరం ఇంకా వెచ్చగానే ఉందని, నాడి కొట్టుకుంటూనే ఉందని చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తెచ్చాక ఆయన నాడి తిరిగి కొట్టుకోవడం ఆరంభించిందని తెగ కార్యదర్శి జతిన్ ఖుమా చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులే కాకుండా స్థానికులు సైతం ఈ పరిస్థితుల్లో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధంగా లేరన్నారు. ఆయన పూర్తిగా మరణించారని తెగ పెద్దలు భావించేవరకు జియాన్‌ను పూడ్చిపెట్టేదిలేదన్నారు. 70 ఏళ్ల క్రితం ఈ తెగను జియాన్ పూర్వీకులు స్థాపించారు. వీరంతా కుటుంబపోషణకు వడ్రంగి పని చేస్తుంటారు. ప్రస్తుతం దాదాపు 433 కుటుంబాలకు చెందిన 2500 మందికి పైగా తెగలో ఉన్నారు. చదవండి: 38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు -
38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు
ఐజ్వాల్: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద జియోన చన (78) ఇకలేరు. అతడికి 38 మంది భార్యలు.. 89 మంది మగ పిల్లలు.. 14 మంది కుమార్తెలు.. 33 మంది మనవరాళ్లు.. ఒక మనవడు ఉన్నారు. వీరి కుటుంబంలో మొత్తం 176 మంది సభ్యులు ఉన్నారు. కాగా జియోన మరణంపై మిజోరాం ముఖ్యమంత్రి జోరాంతంగ స్పందించారు. ఆయన కుటుంబం ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద అయిన మిజోరాం వాసి మిస్టర్ జియోన్‌కు బరువైన హృదయంతో వీడ్కోలు పలుకుతున్నాను. ఆయనకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు ఉన్నారు. ఆయన గ్రామం బక్తంగ్ త్లంగ్నాంతో పాటు మిజోరాంకు కూడా అనేక మంది పర్యాటకులు రావడానికి ఆయన కుటుంబం ఒక కారణం’’ అని సీఎం జోరాంతంగ ట్వీట్ చేశారు. చదవండి: భట్టి: ప్రజల అవసరాల కోసం ఆస్తులు... అమ్మకానికి కాదు -
ఆస్పత్రిలో ఫ్లోర్ తుడిచిన మంత్రి.. ‘నేనేం ఎక్కువ కాదు’
ఐజ్వాల్: కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తోంది. పేద, ధనిక తేడాలేకుండా అందరూ ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, మందుల కోసం సోషల్ మీడియాలో వినతులు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల వేళల్లో కనిపించే రాజకీయ నాయకులు ఈ కష్టకాలంలో కంటికి కనిపించడం లేదు. కానీ, ఇందుకు భిన్నంగా మిజోరం విద్యుత్ శాఖ మంత్రి ఆర్ లాల్జిర్లియానా అధికార దర్పం పక్కపెట్టి ఆస్పత్రిలో నేలను శుభ్రం చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మంత్రి ఆర్ లాల్జిర్లియానాను చూసి రాజకీయ నాయకులు కళ్లు తెరవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. " నేను ఆసుపత్రిలో నేలను శుభ్రంచేసి వైద్యులు, నర్సులను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. ఈ పని చేసి నేనొక ఉదాహరణగా నిలవాలి, అది ఇతరులకు అవగాహన కల్పించాలన్నదే నా ఆలోచన. మేము ఆస్పత్రిలో బాగానే ఉన్నాం. వైద్యులు, నర్సులు బాగా చూసుకుంటున్నారు." అని మంత్రి ఆర్ లాల్జిర్లియానా మీడియాతో అన్నారు. అంతేకాకుండా తానున్న గది అపరిశుభ్రంగా ఉండటంతో స్వీపర్‌కి ఫోన్ చేయగా, అటువైపు నుంచి స్పందన రాలేదని, దీంతో తానే శుభ్రం చేసినట్లు వివరించారు. "నాకు ఇలాంటి పనులు కొత్తేం కాదు. అవసరం అనుకున్నప్పుడు నేను ఇలాంటి పనులు చేస్తుంటాను. నేను మంత్రి పదవిలో ఉన్నప్పటికీ.. ఇతరుల కంటే ఎక్కువని అనుకోవట్లేదు" అని ఆయన చెప్పారు. మంత్రితో పాటు ఆయన భార్య, కుమారుడు కూడా అదే ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్నారు. గత సంవత్సరం మిజోరంలోని మంత్రులు వీఐపీ సంస్కృతిని పక్కన పెట్టి ఇంటి పనులు చేయడం, ప్రజా రవాణా, మోటారు బైక్‌లో ప్రయాణించారు. వీరు వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం.. క్రిస్మస్ వంటి పండుగ సీజన్లో వంట మనుషులుగా పనిచేయడం ద్వారా సామాన్యులుగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. (చదవండి: వైరల్: బొమ్మతో చిరుతనే ఆటపట్టించిన చిన్నారి!) -
వింత ఆచారం : షాపులకు ఓనర్లు ఉండరు
ఐజ్వాల్ : సాధారణంగా కిరాణషాపు నుంచి మొదలుకొని ఏ షాపుకైనా సరే యజమానులు కచ్చితంగా ఉంటారు. వారి ఆధ్వర్యంలోనే షాపు మొత్తం నడుస్తుంటుంది. కాని మిజోరాం రాజధాని ఐజ్వాల్ దగ్గరలో ఉన్న కొన్ని షాపులు మాత్రం యజమానులు లేకుండానే నడుస్తున్నాయి. అక్కడ నివసించే స్థానికులు ఒక ప్రత్యేక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.' న్ఘా లౌ డావర్ సంస్కృతి'గా పిలవబడే సంప్రదాయం ప్రకారం అక్కడ ఉండే దుకాణాలన్ని యజమానులు లేకుండానే నడుస్తుంటాయి.(ధార్వాడ పేడాపై కరోనా నీడ) ఇదంతా ఎందుకంటే చేస్తున్నారంటే.. ఈ ప్రాంతంలో నిజాయితీలో కూడిన మనుషులు నివసిస్తారట. ఎవరు ఎవరిని మోసం చేయరట. వారికి నచ్చినవి కొనుక్కొని ఆ షాపులోనే ఏర్పాటు చేసిన మనీ డిపాజిట్ బాక్సులో డబ్బులు వేసి వెళ్లిపోతారట. ముఖ్యంగా ఇక్కడి షాపులన్ని నమ్మకం పైనే పనిచేస్తాయట. ఇంత ఆధునిక కాలంలో కూడా ఇలాంటి సంప్రదాయాలు పాటించే మనుషులు ఉన్నారా అని ఆశ్చర్యమనిపిస్తే వెంటనే మిజోరాం వచ్చేయండి అంటున్నారు మై హోమ్ ఇండియా ఎన్జీవో సంస్థ. ఎందుకంటే ట్విటర్లో ఈ విషయాన్ని ఆ ఎన్జీవో సంస్థనే షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ' ఒక భారతీయునిగా గర్వపడుతున్నా'.. ' ఐ లవ్ దిస్ పీపుల్ వెరీ మచ్'..' ఇదంతా నమ్మకంపైనై ఆధారపడి ఉంటుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
దొంగ నుంచి బంగారం దొంగిలించిన ఆర్మీ కల్నల్
ఐజ్వాల్: ఓ స్మగ్లర్ నుంచి బంగారం స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించని ఓ సీనియర్ ఆర్మీ అధికారి అసోం రైఫిల్స్ కు చెందిన మరో ఎనిమిదిమంది పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లింగ్ అవుతున్న బంగారాన్ని పట్టుకొని తిరిగి దాన్ని పోలీసులకు అప్పగించకపోవడంతో వారిని ఉదయాన్నే అదుపులోకి తీసుకున్నారు. ఆ బంగారం విలువ దాదాపు రూ.14.5కోట్లు ఉంటుందని అంచనా. ఐజ్వాల్‌లో 2014 డిసెంబర్ నెలలో మయన్మార్ నుంచి బంగారాన్ని దొంగరవాణా చేస్తున్న సీ లాల్నున్ ఫెలా అనే వ్యక్తి వాహనాన్ని కల్నల్ జాసిత్ సింగ్, మరో ఎనిమిది మంది కలసి అడ్డుకున్నారు. వీరిలో ఒకరకు జూనియర్ కమిషనర్ రేంజ్ అధికారి కూడా ఉన్నాడు. వారు తొలుత కారును ఆపేశారు. తమ వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తూనే సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో వారికి మొత్తం రూ.14.5కోట్ల విలువ చేసే 52 బంగారు కడ్డీలు లభించాయి. అనంతరం వారి కార్లలో వాటిని పెట్టుకొని అతడిని బెదిరించి వెళ్లిపోయారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అసలు తమకు ఎవరూ బంగారం అప్పగించలేదని చెప్పిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని ఆర్మీ యూనిట్ పై అనుమానం వచ్చి గత నెల(ఏప్రిల్ 21) కేసు ఫైల్ చేసి కల్నల్ సింగ్ ను దర్యాప్తునకు సహకరించాలని కోరారు. కానీ, ముందస్తుగా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునేందుకు వెళ్లడంతో పోలీసులు అరెస్టు చేశారు. -
మొబైల్ కోసం అక్కాబావలను చంపేశాడు
ఐజ్వాల్: మొబైల్ ఫోన్‌పై మోజు ఆ యువకుడిని పిచ్చివాడిని చేసింది. తాను ఏం చేస్తున్నానో అనే ఆలోచన కూడా లేకుండా చేసింది. ఫలితంగా అతడు తీవ్ర నేరానికి పాల్పడ్డాడు. సొంత అక్కాబావను హతమార్చాడు. అనంతరం ఇంట్లో నుంచి 36 వేలు ఎత్తుకెళ్లి చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఈ నెల 7న జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతానికి జువైనల్ కోర్టు అతడు నేరం చేసినట్లు నిర్దారించి జైలుకు తరలించింది. పోలీసుల వివరాల ప్రకారం, సవతి సోదరి, అతడి బావకు ఈ మధ్యనే ప్రభుత్వ సాయంగా ఓ 66 వేల రూపాయాలు వచ్చాయి. అందులో ఓ ముప్పై వేలతో కొంత భూమి కొనుక్కోని మిగితావి ఇంట్లో పెట్టారు. దీంతో వాటిపై కన్నేసిన యువకుడు ఆ డబ్బుతో కొత్త ఫోన్ కొనుక్కోవాలని ఆలోచించి, వారిని అడిగితే ఇవ్వరని భావించి ఊర్లో చుట్టుపక్కల జంతువులను వేటాడటానికి ఉపయోగించే సింగ్ బ్యారెల్ తుపాకీని తీసుకొని ముందుగా బావను హతమార్చాడు. ఆ వెంటనే సోదరిని అదే తుపాకీతో దారుణంగా కొట్టాడు. అనంతరం గొడ్డలితో తీవ్రంగా గాయపరిచాడు. చివరికి ఆమె చనిపోగానే ఇంట్లో ఉన్న 36 వేలు తీసుకొని ఏం తెలియనట్లు సొంతింటికి వెళ్లాడు. అలా వెళ్లిన మరుసటి రోజే పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం చెప్పాడు. -
భర్త ఎదుటే భార్యపై గ్యాంగ్ రేప్
ఐజాల్: అత్యాచారాల సంసృతి ఈశాన్య రాష్ట్రాలకు పాకుతోంది. మిజోరంలో వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఎదుటే వారీ ఘాతుకానికి పాల్పడ్డారు. రొపాయబవాక్ ప్రాంతంలో ఆదివారం ఈ దారుణోదంతం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్తను చెట్టుకు కట్టేసి, అతడి ఎదుటే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. చావల్హ్మున్ ప్రాంతానికి చెందిన జార్జొలియనా(19), పీసీ లాల్హూట్లుయాంగ(20) ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
మిజోరంలో కాంగ్రెస్‌కు ఆధిక్యం
ఐజ్వాల్: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి మిజోరంలో ఊరట లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు దక్కించునే దిశగా సాగుతోంది. మిజోరంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజాగా అందించిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 22 సీట్లు గెల్చుకుంది. మరో 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరాలాండ్ డెమొక్రటిక్ అలయన్స్‌లతో కూడిన మిజోరం ప్రజాస్వామిక కూటమి ఒక సీటు దక్కించుకుంది. మరో రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి లాల్ తన్హాల్వా తన సొంత నియోజకవర్గం సెర్చీఫ్లో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఎంఎన్ఎఫ్ అభ్యర్థి సి లాల్ రామ్ జావాపై 734 ఓట్ల తేడాతో గెలుపొందారు. తన్హాల్వాకు 5719, లాల్ రామ్ జావాకు 4985 ఓట్లు వచ్చాయి. -
గ్రామీణ పేదలకు కొత్త గృహనిర్మాణ పథకం: ప్రధాని
ఐజ్వాల్: గ్రామీణ పేదల గృహనిర్మాణం కోసం కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెల్లడించారు. ఇక్కడ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మిజోరంపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో గృహనిర్మాణ అవసరం చాలా ఎక్కువగా ఉందనే విషయం తనకు అర్థమైందని, త్వరలో ప్రారంభమయ్యే పథకంతో వారి అవసరాలు తీరతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా యువతను కోరారు. క్రీడలకు భవిష్యత్‌లో బంగారు భవిష్యత్ ఉందని, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని తెలిపారు. కంప్యూటర్ విద్యను సమర్థంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మౌలిక వసతుల అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే 210 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంట్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. మయన్మార్ సిట్వే పోర్ట్‌ను అనుసంధానిస్తూ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఏ దశాబ్దకాలంలో లేనంతగా యూపీఏ హయాంలో ఆర్థికాభివృద్ధి జరిగిందని చెప్పారు. పేదరికం మూడొంతులు తగ్గిందని తెలిపారు.