బ్రిడ్జి కింద నలిగిన బతుకులు | 17 Workers Dead After Under-Construction Railway Bridge Collapses In Mizoram - Sakshi
Sakshi News home page

మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం

Published Wed, Aug 23 2023 12:34 PM | Last Updated on Thu, Aug 24 2023 5:25 AM

Workers Dead After Construction Railway Bridge Collapses In Mizoram - Sakshi

కోల్‌కతా/ఐజ్వాల్‌:  ఈశాన్య రాష్ట్రం మిజోరంలో బుధవారం ఘోరం జరిగింది. ఐజ్వాల్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 100 మీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. నిర్మాణ పనుల్లో ఉన్న కారి్మకుల్లో కనీసం 18 మంది ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇంకా కనీసం ఐదుగురి జాడ తెలియాల్సి ఉంది. మృతుల్లో అత్యధికులు పశి్చమ బెంగాల్‌కు చెందిన వారే. ప్రమాద ప్రాంతం సైరంగ్‌ ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కురింగ్‌ నది మీద నిర్మిస్తున్న బ్రిడ్జి పైకి చేర్చే క్రమంలో గాంట్రీ కుప్పకూలడమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.  ఇప్పటిదాకా 16 మృతదేహాలను వెలికితీశారు. సహాయ, తరలింపు తదితర చర్యల్లో మిజోరం అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాల్సిందిగా బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. మృతుల కుటుంబాల్లోని అర్హులకు రైల్వే శాఖ పర్మనెంట్‌ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదంపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.   

ఇది కూడా చదవండి: Live Updates: చందమామను ముద్దాడే క్షణం కోసం.. చరిత్రకు అడుగు దూరంలో చంద్రయాన్‌–3

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement