
ఐజ్వాల్: మిజోరంలోని ఐజ్వాల్‌లో బుధవారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం సాయంత్రం వరకు మొత్తం 22 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. జాడ తెలియకుండా పోయిన మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది.
అతడు ప్రాణాలతో ఉండే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. క్షతగాత్రులైన ముగ్గురిలో ఇద్దరిని ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. బాధితులైన మొత్తం 26 మందీ పశి్చమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాకు చెందిన వారే.
Comments
Please login to add a commentAdd a comment