Bridge construction work
-
‘మిజోరం’ ప్రమాదం.. 22కు చేరిన మృతులు
ఐజ్వాల్: మిజోరంలోని ఐజ్వాల్‌లో బుధవారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం సాయంత్రం వరకు మొత్తం 22 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. జాడ తెలియకుండా పోయిన మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. అతడు ప్రాణాలతో ఉండే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. క్షతగాత్రులైన ముగ్గురిలో ఇద్దరిని ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. బాధితులైన మొత్తం 26 మందీ పశి్చమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాకు చెందిన వారే. -
కోటిపల్లి రైల్వేలైన్‌కు కదలిక
సాక్షి అమలాపురం: కోటిపల్లి–నరసాపురం రైల్వేలైన్ నిర్మాణంలో ముందడుగు పడింది. కొన్ని పనులకు రైల్వేశాఖ రూ.296.51 కోట్లు కేటాయించింది. గౌతమి నదిపై దాదాపు రెండేళ్లుగా నిలిచిపోయిన వంతెన నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం పూర్తయిన ఈ వంతెన పైభాగంలో ఐరన్ రెయిల్స్, బాక్స్ గడ్డర్లు, ఇతర పనులు చేపట్టనున్నారు. కోటిపల్లి–నరసాపురం మధ్య 57.21 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణ అంచనా రూ.2,120.16 కోట్లు. ఈ ప్రాజెక్టులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గోదావరి నది పాయలపై మూడు వంతెనల నిర్మాణం కీలకం. ఈ పనులు పూర్తయితే ప్రాజెక్టు నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చినట్టే. తొలుత డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో కోటిపల్లి–శానపల్లిలంక మధ్య గౌతమి గోదావరి నదిపై 3.50 కిలోమీటర్ల వంతెన నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించి మొత్తం 44 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. వైనతేయ గోదావరి పాయపై బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య 21 పిల్లర్లకుగాను 16 పూర్తయ్యాయి. ఐదు నిర్మాణదశలో ఉన్నాయి. వశిష్ట గోదావరి నదిపై జిల్లాలోని దిండి, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని చించినాడ మధ్య వంతెన నిర్మాణానికి 20 పిల్లర్లకుగాను 18 పూర్తయ్యాయి. గౌతమి నదిపై పిల్లర్ల నిర్మాణం పూర్తయి రెండేళ్లవుతున్నా మిగిలిన వంతెన నిర్మాణ పనులు చేపట్టలేదు. వరదలు, ఇతర కారణాల వల్ల వశిష్ట, వైనతేయ పిల్లర్ల నిర్మాణాలకు అవాంతరాలు ఏర్పడినా ఇటీవల పనులు జోరందుకున్నాయి. ఇక పనులు చకచకా.. గౌతమి నదిపై వంతెన నిర్మాణం పూర్తిచేయడంతోపాటు ట్రాక్ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రైల్వేశాఖ రూ.296.51 కోట్లు కేటాయించడంతో పనులు చకచకా సాగనున్నాయి. ఈ నిధులతో వంతెన నిర్మాణం పూర్తిచేయడంతోపాటు కోటిపల్లి వైపు 30 మీటర్లు, శానపల్లిలంక వైపు 100 మీటర్ల మేర ఎర్త్‌వర్క్ చేసి, కోటిపల్లి నుంచి శానపల్లిలంక వరకు ట్రాక్ నిర్మిస్తారు. ఈ పనులకు సంబంధించి ఈ నెల 11న టెండర్లు పిలిచారు. వచ్చేనెల 26వ తేదీ వరకు టెండర్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. దుష్ప్రచారాలకు తెర దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోటిపల్లి–నరసాపురం రైల్వే ప్రాజెక్టులో 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా భరిస్తామని హామీ ఇచ్చారు. గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.2 కోట్లు ఇస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసి చేతులు దులుపుకొంది. నిధులు విడుదల చేయలేదు. భూసేకరణ భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తున్నందున ఇవ్వాల్సిన వాటాను మినహాయించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఈ యత్నాలు ఫలించాయి. దీంతో రైల్వేశాఖ గౌతమి వంతెన నిర్మాణ పనులకు టెండర్లు పిలిచింది. ప్రభుత్వం ఈ ప్రయత్నాల్లో ఉండగా ఇదే అదనుగా టీడీపీ సహా విపక్షాలు వంతెన నిర్మాణ పనులు నిలిచిపో యినట్టు దుష్ప్రచారానికి దిగాయి. గౌతమి నదిపై వంతెన పనులు ఆగినా.. వైనతేయ, వశిష్ట నదులపై వంతెనల పనులు జరుగుతున్నా విషప్రచారం ఆపకపోవడం గమనార్హం. తాజాగా గౌతమి నదిపై వంతెన పనులు కూడా మొదలు కానున్నాయి. గౌతమి నదిపై వంతెన నిర్మాణ పనులకు టెండరు పిలవడంపై కోనసీమ జేఏసీ చైర్మన్ వి.దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహ నరావు అమలాపురంలో ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. చాలా సంతోషం కోటిపల్లి–నరసాపురం రైల్వే ప్రాజెక్టులో గౌతమి నదిపై వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించడంతో చాలా సంతోషంగా ఉంది. ఆగిపోయిన పను లు మొదలు కావడంతో ఈ ప్రాజెక్టుపై స్థాని కులకు ఉన్న బెంగ వీడింది. ఇందుకు సహక రి ంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు.– బండారు రామ్మోహనరావు, కోనసీమ జేఏసీ కన్వీనర్ -
స్టీల్ బ్రిడ్జి.. నగరానికే తలమానికం
ముషీరాబాద్: ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్ల మేర రూ.440 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి నగరానికే తలమానికం కానుందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి స్టీల్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. పనులు నత్త నడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే రాత్రింబవళ్లూ పని చేయాలని కేటీఆర్ సూచించారు. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చి పనులను పరిశీలించారు. అనంతరం వీఎస్టీ వద్ద నిర్మితమవుతున్న ర్యాంప్‌పైకి ఎక్కి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే ట్రాఫిక్‌ను మళ్లించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్‌ను తగ్గించి ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల ప్రజల సౌకర్యార్థం స్టీల్ బ్రిడ్జీని చేపడుతున్నామని తెలిపారు. నగర పౌరులకు ట్రాఫిక్ రద్దీ సమస్యకు ఉపశమనం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ పనుల పరిశీలన.. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఎస్ఎన్డీపీలో భాగంగా చేపట్టిన హుస్సేన్‌సాగర్ నాలా రిటైనింగ్ వాల్ పనులను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. హుస్సేన్‌సాగర్ వరద నీటి ద్వారా లోతట్టు ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో ముంపు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం చిక్కడపల్లిలోని కూరగాయల మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. చేపల మార్కెట్ కోసం డిజైన్ రూపొందించండి.. దేశంలోనే ఫ్రెష్ ఫిష్ మార్కెట్ ఎక్కడ ఉందంటే రాంనగర్‌లోనే ఉందనే విధంగా చేపల మార్కెట్‌ను మంచి డిజైన్ చేసి వారం రోజుల్లో తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు ముఠా జైసింహకు మంత్రి కేటీఆర్ బాధ్యతలను అప్పగించారు. జాగా నేను ఇప్పిస్తా.. డబ్బులు ఇప్పిస్తా వారం రోజుల్లో డిజైన్ చేసి తీసుకురా అని జైసింహతో చెప్పారు. ఈఎన్సీలు శ్రీధర్, జియావుద్దీన్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. -
సోమశిల–సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం కలేనా!
సాక్షి, నాగర్‌కర్నూల్: సోమశిల–సిద్దేశ్వరం వంతెన నిర్మాణంపై అడుగు ముందుకు పడడం లేదు. పదేళ్ల క్రితం అప్పటి సీఎం వైఎస్సార్ చేసిన శంకుస్థాపన చేయగా.. ఆ తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదిలో ఆదివారం బోటు ప్రమాదం జరిగిన నేపథ్యంలో జిల్లావాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 2007లో మంచాల కట్ట వద్ద మరబోటు మునిగి 61మంది జలసమాధి అయిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. వంతెన నిర్మించడంలో పాలకులు నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదమని తెలిసినా ప్రతి రోజూ జిల్లాలోని కృష్ణానది తీర గ్రామాల నుంచి నిత్యం అవతలి ఒడ్డున ఉన్న రాయలసీమ ప్రాంత గ్రామాలకు పుట్టీలు, పడవల్లో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే పుట్టీ నిర్వాహకులు కనీస జాగ్రత్తలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ పెద్దగా లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గోధావరి ఘటనతోనైనా అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోజూ వందల సంఖ్యలో రాకపోకలు కృష్ణానదికి ఇవతలి వైపునాగర్కర్నూల్ జిల్లా అటువైపు కర్నూలు జిల్లా ఉన్నాయి. ఇరు జిల్లాల పరిధిలోని నదీతీర గ్రామాల ప్రజల మధ్య బంధుత్వాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ప్రతి రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులు బోటులో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ ప్రయాణిస్తుంటారు. జిల్లాలోని పెంట్లవెల్లి మండలంలోని మంచాలకట్ట, మల్లేశ్వరం, కొల్లాపూర్ మండలంలోని సోమశిల ప్రాంతాల నుంచి బోటు, పుట్టి ప్రయాణాలు కొనసాగుతున్నాయి. పండుగలు, ఉత్సవాల సందర్భంగా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు బోట్లు, పుట్టీలలో ప్రయాణిస్తూ ఉంటారు. అధికారుల కనీస పర్యవేక్షణ లేకపోవడం, బోట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రజలు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న పరిస్థితి. పర్యవేక్షణ కరువు.. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ సందర్భంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఉదయం 9గంటల నుంచి సాయంకాలం 5గంటల వరకు ఆయా ప్రాంతాల నుంచి బోట్లు రాకపోకలు సాగుతూనే ఉంటాయి. బోటు నిర్వాహకులు మాత్రం ప్రయాణికుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. లైఫ్ జాకెట్లు కచ్చితంగా ప్రయాణికులకు ఇవ్వాల్సి ఉన్నా ఒక పర్యాటక బోటులో తప్పా, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే బోట్లలో ఇవ్వడం లేదు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. కృష్ణానది ఉధృతంగా ప్రహిస్తున్న నేపథ్యంలో బోటు ప్రయాణం అంత సురక్షితం కాదు. రోడ్డు మార్గంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాలకు వెళ్లాలంటే ఆరు గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ మంది బోట్లలోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగోటం బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే బోటు ప్రయాణాలపై అధికారుల పర్యవేక్షణ ఉంటుంది తప్పా మిగతా రోజుల్లో అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షణ పెంచాలని, వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 2009లో శంకుస్థాపన 2007 జనవరి 18న కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా నెహ్రూనగర్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని సింగోటం లక్ష్మి నరసింహ్మాస్వామి బ్రహ్మోత్సవాలకు వస్తున్న మరబోటు మంచాలకట్ట వద్ద నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 61మంది మృతి చెందారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. సోమశిల–సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇవ్వడంతో పాటు రూ.149.40కోట్లు కేటాయిస్తామని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణం కోసం 2009 ఫిబ్రవరి 13న కొల్లాపూర్‌లో శంకుస్థాపన కూడా చేశారు. ఆ మహానేత అకాల మరణంతో తర్వాత వచ్చి న పాలకులు బ్రిడ్జి నిర్మాణంపై పాలకులు పట్టించుకోలేదు. అయి తే గత నెల 29న పాలమూరు–రంగారెడ్డి ప నుల పరిశీలనకు కొల్లాపూర్‌కు వచ్చిన సీఎం కే సీఆర్ బ్రిడ్జి నిర్మానంపై మాట్లాడతారని స్థానిక ప్రజలు ఆశించినప్పటికీ ఆ ప్రస్తావనే తేలేదు. వంతెన నిర్మించాలి సోమశిలలో కృష్ణానదిపై వంతెన నిర్మిస్తామని ప్రభుత్వం చాలా కాలంగా చెబుతోంది. కానీ పనులు మాత్రం చేపట్టడం లేదు. వంతెన నిర్మాణం జరిగితే కొల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. నదీ ప్రయాణాలు కూడా సులభతరంగా మారుతాయి. వంతెన నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టాలి. – లక్ష్మీనర్సింహ, సోమశిల -
నిర్లక్ష్యానికి మూడేళ్లు!
సాక్షి, యాలాల: తాండూరు – కొడంగల్ మార్గంలోని కాగ్నా నదిపై నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోయి మూడేళ్లు కావస్తున్నా.. నూతన వంతెన అందుబాటులోకి రాలేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి అప్పటి మంత్రి మహేందర్‌రెడ్డి యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేసినా.. పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనికి తోడు ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న పాత వంతెన ప్రమాదకరంగా మారుతోంది. సరిగ్గా మూడేళ్ల క్రితం 2016, సెప్టెంబరు 15న తాండూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో కాగ్నా ఉధృతికి తాండూరు– కొడంగల్ మార్గంలోని బ్రిడ్జి కొట్టుకుపోయింది. అంతర్ జిల్లా రహదారిలోని వంతెన కోతకు గురికావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తాండూరు నుంచి మహబూబ్‌నగర్ కొడంగల్, పరిగి, బషీరాబాద్ వెళ్లే వాహనదారులు.. ముద్దాయిపేట, విశ్వనాథ్‌పూర్ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
అండర్‌పాస్‌లతో తీరనున్న అవస్థలు
సాక్షి, రామన్నపేట: మండల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లే మార్గంలో రైల్వేలైన్ కింద నిర్మిస్తున్న అండర్‌పాస్ బ్రిడ్జిలతో ప్రయాణికుల అవస్థలు తీరనున్నాయి. ఇప్పటికే బోగారం, సిరిపురం, ఇంద్రపాలనగరం గ్రామాలకు వెళ్లేదారిలో అండర్‌పాస్‌ల నిర్మాణం పూర్తయింది. రామన్నపేట శివారులో చేపట్టిన అండర్‌పాస్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. తప్పనున్న నిరీక్షణ రామన్నపేట మండలం మీదుగా సికింద్రాబాద్–నడికుడి రైలుమార్గం ఉంది. మండలంలో రామన్నపేట–సిరిపురం, బోగారం–సిరిపురం, ఇంద్రపాలనగరం–సిరిపురం, ఇంద్రపాలనగరం–వెల్లంకి, రామన్నపేట–కొమ్మాయిగూడెం గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో రైల్వే ట్రాక్ ఉంది. ఈ మార్గంలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు పదుల సంఖ్యలో నడుస్తుంటాయి. అయితే ఈ క్రమంలో పగటిపూట పదిహేను సార్లకుపైగా గేట్ వేయవలసి వస్తోంది. ఈ మార్గంలో ద్విచ్రక వాహనదారులతో పాటు బస్సులో ప్రయాణించే ప్రయాణికులు గేట్ పడినప్పుడల్లా పది నిమిషాలకుపైగా నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో అత్యవసర పనిమీద వెళ్లేవారు, స్కూలు విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తొలగనున్న ఇబ్బందులు రైల్వే శాఖ వారు గత ఆర్థిక సంవత్సరంలో మండల పరిధిలోని ఇంద్రపాలనగరం–వెల్లంకి గ్రామాల మధ్య అండర్‌పాస్ నిర్మించి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బోగారం–సిరిపురం, రామన్నపేట–సిరిపురం గ్రామాల మధ్య అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టారు. బోగారం–సిరిపురం గ్రామాల మధ్య బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. సిరిపురం–రామన్నపేట మధ్య పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ అండర్‌పాస్‌లు వినియోగంలోకి వస్తే వాహనదారులు నిరీక్షించే బాధ తప్పుతుంది. రైల్వే శాఖ వారు అండర్‌పాస్ బ్రిడ్జిల నిర్మాణంతో తమ కష్టాలు తప్పనున్నాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో నీరు నిల్వకుండా చూడాలి అండర్‌పాస్ నిర్మాణం వల్ల నిరీక్షించే బాధ తప్పింది. ముఖ్యంగా రైతులకు సౌకర్యవంతంగా ఉంది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చేయాలి. రాత్రిపూట ప్రమాదాలు జరుగకుండా లైట్లు ఏర్పాటు చేయాలి. కార్నర్ వద్ద రెడ్‌లైట్లు ఏర్పాటు చేయాలి. – గోగు హరిప్రసాద్ -
బ్రిడ్జి నిర్మాణానికి 83 ఏళ్లా?
⇒ ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ⇒ రూ.2.60 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన ⇒ హాజరైన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి గుమ్మడిదల(జిన్నారం): బ్రిడ్జి నిర్మాణానికి 1934లో శంకుస్థాపన చేసి.. నేటి వరకు నిర్మాణ పనులు చేపట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందని, దీన్ని బట్టి గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఏంటో తెలుస్తోందని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం గుమ్మడిదల మండలం బొంతపల్లి కమాన్ నుంచి బొంతపల్లి ఆలయం వరకు ఉన్న రోడ్డుపై రూ.2.60 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గత పాలకులు ఇక్కడి బ్రిడ్జి నిర్మాణంలో 83 ఏళ్లుగా నిర్లక్ష్యం వహించారన్నారు. దీనిబట్టి తెలంగాణ ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగిందో స్పష్టంగా తెలుస్తోందన్నారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని చెప్పారు. అందులో భాగంగానే అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్లను అభివృద్ధి చేసేందుకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సాగు, తాగునీటి ప్రాజెక్టులను నిర్మించి తీరుతామన్నారు. ఎంపీపీ రవీందర్‌రెడ్డి, ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ శ్రవణ్ ప్రకాశ్, నాయకులు చంద్రారెడ్డి, బాల్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, ఉమారాణి, భద్రప్ప, గౌరీశంకర్‌గౌడ్, సద్ది విజయభాస్కర్‌రెడ్డి, శంకర్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.