2016 సెప్టెంబర్ 15న భారీ వర్షాలకు కొట్టుకుపోయిన కాగ్నా బ్రిడ్జి
సాక్షి, యాలాల: తాండూరు – కొడంగల్ మార్గంలోని కాగ్నా నదిపై నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోయి మూడేళ్లు కావస్తున్నా.. నూతన వంతెన అందుబాటులోకి రాలేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి అప్పటి మంత్రి మహేందర్‌రెడ్డి యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేసినా.. పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనికి తోడు ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న పాత వంతెన ప్రమాదకరంగా మారుతోంది. సరిగ్గా మూడేళ్ల క్రితం 2016, సెప్టెంబరు 15న తాండూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో కాగ్నా ఉధృతికి తాండూరు– కొడంగల్ మార్గంలోని బ్రిడ్జి కొట్టుకుపోయింది. అంతర్ జిల్లా రహదారిలోని వంతెన కోతకు గురికావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తాండూరు నుంచి మహబూబ్‌నగర్ కొడంగల్, పరిగి, బషీరాబాద్ వెళ్లే వాహనదారులు.. ముద్దాయిపేట, విశ్వనాథ్‌పూర్ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment