kagna river
-
వరద తాకిడికి కొట్టుకుపోయిన వంతెన
సాక్షి, హైదరాబాద్ : గురువారం రాత్రి హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు వంకలు పెంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో కాగ్నా నది తీవ్ర రూపం దాల్చింది. వరద తాకిడికి కొండగల్-తాండూర్ మార్గం మధ్యలో తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుని పోయింది. దీంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధారూర్, కుల్కచర్ల, పెద్దేముల్ మండలాల్లో భారీగా వర్షం కురవడం వరద ఎక్కువగా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో 17.2 సెం.మీ వర్షపాతం మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడలో 17 సెం.మీ వర్షపాతం మహబూబ్‌నగర్‌లో 13.9 సెం.మీ వర్షపాతం మహబూబాబాద్‌లో 13.6 సెం.మీ వర్షపాతం సంగారెడ్డి జిల్లా మొగ్దంపల్లెలో 11 సెం.మీ వర్షపాతం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో 10.2 సెం.మీ వర్షపాతం వికారాబాద్ జిల్లా ధారూర్‌లో 9.2 సెం.మీ వర్షపాతం -
నిర్లక్ష్యానికి మూడేళ్లు!
సాక్షి, యాలాల: తాండూరు – కొడంగల్ మార్గంలోని కాగ్నా నదిపై నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోయి మూడేళ్లు కావస్తున్నా.. నూతన వంతెన అందుబాటులోకి రాలేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి అప్పటి మంత్రి మహేందర్‌రెడ్డి యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేసినా.. పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనికి తోడు ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న పాత వంతెన ప్రమాదకరంగా మారుతోంది. సరిగ్గా మూడేళ్ల క్రితం 2016, సెప్టెంబరు 15న తాండూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో కాగ్నా ఉధృతికి తాండూరు– కొడంగల్ మార్గంలోని బ్రిడ్జి కొట్టుకుపోయింది. అంతర్ జిల్లా రహదారిలోని వంతెన కోతకు గురికావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తాండూరు నుంచి మహబూబ్‌నగర్ కొడంగల్, పరిగి, బషీరాబాద్ వెళ్లే వాహనదారులు.. ముద్దాయిపేట, విశ్వనాథ్‌పూర్ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
కలెక్టర్ల భేటీలో కాగ్నా వివాదానికి తెర!
బషీరాబాద్: కాగ్నా నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాద్గిరా– పోతంగల్ దగ్గర కాగ్నా నదిలో కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఇసుక తవ్వకాలు గురువారం వివాదాస్పదమైన సంగతి విదితమే. సరిహద్దుల విషయంలో బషీరాబాద్ చించొళ్లీ రెవెన్యూ, పోలీసుల మధ్య వాగ్వాదాలతో సమస్య మరింత జఠిలమవ్వడంతో, చివరకు వికారాబాద్, గుల్బర్గా జిల్లాల కలెకర్లు ఉమర్ జలీల్, జి. వెంకటేశ్ కుమార్ రంగంలోకి దిగారు. శుక్రవారం వివాదాస్పద కాగ్నా నదిలో ఇరువురు జిల్లా ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఇరురాష్ట్రాల సరిహద్దు నక్షలు, భూ రికార్డులను పరిశీలించారు. అయితే రెండు రాష్ట్రాల నక్షల ప్రకారం తమకంటే తమకే ఎక్కువ వాటాలు వస్తాయని ఏడీఎస్ఎల్ఆర్ అధికారులు తెలిపారు. వీటితో సమస్య పరిష్కారం కాదని భావించిన ఇద్దరు కలెక్టర్లు రాజీ మార్గంగా ఉమ్మడి సర్వే చేయించి నదిలో సమాన భూ భాగం పంచుకోవడానికి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. నదికి ఇరువైపులా ఉన్న రైతుల పట్టాభూముల బౌండరీలను గుర్తించి, మిగిలిన నదీ భాగంలో రెండు సమాన భాగాలుగా పంచుకోవాలని నిర్ణయించారు. వెంటనే కలెక్టర్లు, నదిలో కర్ణాటక అధికారులు పాతిన హద్దురాళ్లు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఉండాలన్నారు. రెండు రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు ఎక్కడ ఉన్నా సామరస్యంగా పరిష్కరించుకుంటామని సంయుక్తంగా ప్రకటించారు. నదీ భూ భాగంలో ఇరు ప్రభుత్వాలకు సమాన వాటా తీసుకోవడానికి అంగీకరించామని, ఇక సరిహద్దు సమస్య ఏమీ ఉండదన్నారు. నీళ్లపల్లి దగ్గర అటవీ భూమికి చెందిన సరిహద్దు సమస్యను కూడా త్వరలో తేలుస్తామని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 10 నుంచి 30 మీటర్లు చొచ్చుకొచ్చిన కన్నడిగులు... కాగ్నాలో రెండు జిల్లాల సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్లు నరహరిరావు, జిదగేధర్ ఆధ్వర్యంలో డీజీపీఎస్ శాటిలైట్ సర్వేచేశారు. నదికి ఇరువైపుల ఉన్న కాద్గిరా – పోతంగల్ గ్రామాల రైతుల పట్టా భూముల హద్దులను గుర్తించారు. మిగిలిన నదీ భాగంలో సర్వే చేయగా కర్ణాటక అధికారులు కిలోమీటరు పొడవులో 10 నుంచి 30 మీటర్ల మేర తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు బహిర్గతమైంది. దీంట్లో కొంత మేర తెలంగాణ నదీభాగంలో కన్నడిగులు ఇసుక తవ్వకాలు చేసినట్లు గుర్తించారు. నదికి ఇరువైపులా ఉన్న హద్దులతో రెండు రాష్ట్రాలకు సమాన భాగాలను గుర్తించి హద్దురాళ్లు పాతారు. కార్యక్రమంలో సేడం రెవెన్యూ అసిస్టెంట్ కమిషనర్ బి.సుశీల, గుల్బర్గా ట్రైనీ కలెక్టర్ సుధర్ స్నేహల్‌లొకండే, తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌రావు, మైన్స్ అధికారులు రేణుకాదేవి, రవికుమార్, జియాలజిస్ట్ రామారావు, చించొళ్లీ, బషీరాబాద్ తహసీల్దార్లు పండిత్ బీరాధర్, ఉమామహేశ్వరి, డీఎస్పీలు రామచంద్రుడు, బస్వరాజు రెవెన్యూ, మైన్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
నదిలో పడి తల్లి, కూతురు మృతి
వికారాబాద్: బషీరాబాద్ సమీపంలో కాగ్నా నది దాటుతూ ప్రమాదవశాత్తూ తల్లీకూతురు మృతిచెందారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం గొట్టికకుర్దుకు చెందిన తలారి శివమ్మ (65), ఆమె కుమార్తె కాశమ్మ (45) రెండు రోజుల కిందట బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి పయనమైన వారిద్దరూ కాగ్నా నది దాటుతూ ఈత రాక నీటిలో మునిగిపోయారు. స్థానికులు వారి మృతదేహాలను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. -
జోరుగా వర్షాలు
మహబూబ్‌నగర్ వ్యవసాయం : నైరుతి రుతుపవనాలు ప్రభావంతో జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం జిల్లావ్యాప్తంగా 16.1మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ధరూర్ మండలంలో 51మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వరకు జిల్లాలోని 37 మండలాల్లో అత్యధిక, 16 మండలాల్లో మోస్తరు, మరో 7మండల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్ సగటు వర్షపాతం 446.8మి.మీ కాగా, ఇప్పటివరకు 417.5 మి.మీ వర్షపాతం నమోదైంది. కొడంగల్ మండలంలో 48.4మి.మీ, వనపర్తి మండలంలో 42.8మి.మీ, గద్వాల మండలంలో 41మి.మీ, కల్వకుర్తి మండలంలో 38.6మి.మీ, కోస్గి మండలంలో 34.2మి.మీ, షాద్‌నగర్‌లో 31.2మి.మీ, వెల్దండ 30.6మి.మీ వర్షపాతం నమోదైంది. జొన్నపంటకు నష్టమే.. నాలుగు రోజులుగా కురుస్తున్న మబ్బులతో కూడిన ముసురు వర్షాలతో జిల్లాలో 30వేల హెక్టార్లలో సాగుచేసిన జొన్నపంటకు నష్టం వాటì ల్లే ప్రమాదం ఏర్పడింది. జిల్లాలో 7,300హెక్టార్లలో ఇప్పటికే కరువుతో జొన్న ఎండిపోగా, మిగిలిన పంటకు అధిక వర్షాలు నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే జొన్నపంట ధాన్యం గింజలు నల్లగా మారుతున్నాయి. మరో రెండు, మూడు రోజులు వర్షాలు ఇలాగే కురిస్తే జొన్న చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లే దు. పత్తి, మొక్కజొన్న, ఆముదం, ఉల్లి పంటల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కోకట్ కాగ్నా నదిలో నిమజ్జనానికి ఏర్పాట్లు
యాలాల: తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథుల నిమజ్జనానికి సంబంధించి మండలంలోని కోకట్ కాగ్నా నది వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ సిబ్బంది కాగ్నా బ్రిడ్జిపై బారికేడ్లతోపాటు విద్యుత్ దీపాల ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు చర్యలు, నిమజ్జన ప్రదేశంలో నీరు నిలిచేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. కాగా గతేడాది కోకట్ కాగ్నా నదిలో నిమజ్జనం సమయంలో నీటికొరత తీవ్రంగా ఉండి ఇబ్బందులు ఎదురయ్యాయి. కాగా మండలంలో గత వారం కురిసిన భారీ వర్షాలతో కాగ్నా నది ఉప్పొంగి ప్రవహించింది. దీంతో నదిలో నీరు పుష్కలంగా ఉండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు. యాలాల పోలీసులు కాగ్నా నది వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
పొంగిపొర్లుతున్న కాగ్నా నది
రంగారెడ్డి : ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కాగ్నానది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే తాండూరు సమీపంలో నది పై ఉన్న ఓ వంతెన నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో తాండూరు-మహబూబ్‌నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దెముల్ మండలంలోని పలు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో.. నగరానికి వెళ్లే రహదారులు జలమయమయ్యాయి. -
పొంగిన కాగ్నానది
బషీరాబాద్: మండలంలో కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. మంతన్‌గౌడ్ ఊరచెరువు, నవాంద్గి బడా తలాబ్, ఎక్మాయ్ తూర్తలాబ్ తదితర చెరువులు నిండాయి. కాగ్నా నదిలోకి భారీగా వరద నీరు రావడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది -
ముగ్గురు ఇసుకాసురులు అరెస్ట్
కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక టిప్పర్, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరులోని కాగ్నా నది నుంచి అక్రమ ఇసుక రవాణ జరుగుతుందనే సమాచారంతో గురువారం రంగంలోకి దిగిన పోలీసులు ఇసుక తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈక మీదట ఎవ రైన ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని అర్బన్ సీఐ ెహ చ్చరించారు. -
కాగ్నా నదిని పరిశీలించిన అదనపు ఎస్పీ
యాలాల : రంగారెడ్డి జిల్లాలోని కాగ్నా నదిలో సోమవారం వినాయక నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులోభాగంగా ఆదివారం జిల్లా అదనపు ఎస్పీ యాలాల సమీపాన గల కాగ్నా నదిని ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన పోలీసు సిబ్బందికి సూచించారు. -
నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరు శివారులోని కాగ్నా నదిలోకి శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు రెండు రోజుల క్రితం యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో బ్రేకులు ఫెయిల్ అయి.. నిలిచిపోయింది. సదరు బస్సును బాగు చేయడానికి ఈ రోజు తెల్లవారుజామున తాండూరు డిపోకు తరలిస్తున్న క్రమంలో బ్రిడ్జ్‌పై నుంచి కాగ్నా నదిలోకి దూసుకెళ్లింది. అయితే బస్సు వెనుక భాగం మాత్రం బ్రిడ్జ్‌పైనే ఉండిపోయింది. దాంతో బస్సు డ్రైవర్ బస్సులో నుంచి కిందకి దూకేశాడు. బస్సుని నదిలో నుంచి బయటకు తీసేందుకు ఆర్టీసీ అధికారులు స్థానికుల సహాయంతో చర్యలు చేపట్టారు.