కోకట్‌ కాగ్నా నదిలో నిమజ్జనానికి ఏర్పాట్లు | immersion works starts in kagna river | Sakshi
Sakshi News home page

కోకట్‌ కాగ్నానదిలో నిమజ్జనానికి ఏర్పాట్లు

Published Thu, Sep 8 2016 5:55 PM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM

కోకట్‌ కాగ్నా నదిలో నిమజ్జనానికి ఏర్పాట్లు - Sakshi

కోకట్‌ కాగ్నా నదిలో నిమజ్జనానికి ఏర్పాట్లు

యాలాల: తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథుల నిమజ్జనానికి సంబంధించి మండలంలోని కోకట్‌ కాగ్నా నది వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్‌ సిబ్బంది కాగ్నా బ్రిడ్జిపై బారికేడ్లతోపాటు విద్యుత్‌ దీపాల ఏర్పాట్లు, ట్రాఫిక్‌ సమస్య లేకుండా ఉండేందుకు చర్యలు, నిమజ్జన ప్రదేశంలో నీరు నిలిచేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. కాగా గతేడాది కోకట్‌ కాగ్నా నదిలో నిమజ్జనం సమయంలో నీటికొరత తీవ్రంగా ఉండి ఇబ్బందులు ఎదురయ్యాయి. కాగా మండలంలో గత వారం కురిసిన భారీ వర్షాలతో కాగ్నా నది ఉప్పొంగి ప్రవహించింది. దీంతో నదిలో నీరు పుష్కలంగా ఉండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు. యాలాల పోలీసులు కాగ్నా నది వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement