Ganesh immersion
-
Ganesh Nimajjanam: హుస్సేన్‌సాగర్‌లో లక్ష విగ్రహాలు
ఖైరతాబాద్: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 3 గంటల ముందే పూర్తి చేశామని, సోమవారం ఉదయం 10.30 గంటలకు నగరంలోని అన్ని జంక్షన్లలో ట్రాఫిక్ ఫ్రీ చేయగలిగామని, ఇదంతా ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం వల్లే సాధ్యమైందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ మార్గ్ లో కొనసాగుతున్న నిమజ్జనోత్సవాలను పరిశీలించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో హుస్సేన్ సాగర్‌లో ఒక్కరోజే 15 వేల విగ్రహాలు నిమజ్జనమయ్యాయని తెలిపారు. మొత్తం 11 రోజుల్లో హుస్సేన్ సాగర్‌లో లక్ష విగ్రహాలు నిమజ్జనం చేశారన్నారు. ఇంకా మిగిలి ఉన్న విగ్రహాలను ప్రణాళిక ప్రకారం నెక్లెస్ రోడ్డు, ఐమాక్స్ పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతంలో ఉంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి ఉదయం 6.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం 1.40కి పూర్తిచేశాం..ఇందుకు సహకరించిన ఉత్సవ కమిటీ సభ్యులకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రణాళిక ప్రకారం సౌత్ జోన్లో నిమజ్జన కార్యక్రమంలో చత్రినాక, సంతోష్ నగర్, మాదన్నపేటలకు చెందిన నిర్వాహకులు ముందుకొచ్చి విగ్రహాలను త్వరగా తరలించారన్నారు. ఈస్ట్‌జోన్, సౌత్ జోన్ల పరిధిలో మండప నిర్వాహకులు ఎంత చెప్పినా ముందుకు రాలేదని, అందుకే ఆలస్యమవుతుందన్నారు. ఇష్టమొచి్చనట్లు వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. వచ్చే సంవత్సరం నుంచైనా మండప నిర్వాహకులు మొత్తం ప్రక్రియను అర్థం చేసుకొని పోలీసులకు, జీహెచ్ఎంసీకి సహకరిచాలన్నారు. అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్ల మధ్య రెండు భారీ వినాయక విగ్రహాలు ఇరుక్కుపోవడం వల్ల కొంత ఆలస్యమైందని, ఓల్డ్ సిటీ, ఆబిడ్స్ మెయిన్ రోడ్లలో వాహనాలు బ్రేక్ డౌన్ కావడం 4–5 గంటల ఆలస్యానికి కారణమైందన్నారు. పోలీసు సిబ్బంది, అధికారులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ట్రాన్స్‌కో, ఆర్టీఏ సిబ్బంది, అధికారులు 40 గంటల పాటు నిద్రాహారాలు మాని పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే గొడవలు చాలా తగ్గాయని, చిన్న చిన్న గొడవలు జరిగిన సంఘటనలు తమ దృష్టికి వచి్చన వెంటనే పరిష్కరించామని తెలిపారు. మొదటి ఫేజ్, రెండవ ఫేజ్‌లలో కలిపి సిటీ పోలీసులు 15 వేల మంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన 10 వేల మంది మొత్తం 25 వేల మంది పోలీసులు నిమజ్జనోత్సవాల్లో విధులు నిర్వహించారని తెలిపారు. మొత్తం మీద నిమజ్జనోత్సవాలను సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతున్నానని నగర సీపీ తెలిపారు. -
Ganesh Immersion 2024: గణేశ్ నిమజ్జనం వేళ డీజేల హోరు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో వినాయకుడు మోత మోగించేశాడు. గణేష్ నిమజ్జనం వేళ డీజేలు, టపాసులతో హోరెత్తించారు. గ్రేటర్‌వ్యాప్తంగా పరిమితికి మించి శబ్ద కాలుష్యం వెలువడింది. నివాస, సున్నితమైన ప్రాంతాలలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిర్దేశించిన దాని కంటే చాలా రెట్లు ధ్వని కాలుష్యం మించిపోయింది. పీసీబీ పరిమితులను గణేష్ మండప నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. రాత్రి వేళల్లో డీజేలు, టపాసుల మోతతో కాలనీలు దద్ధరిల్లిపోయాయి. సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసినా పీసీబీ, మున్సిపల్, పోలీసు విభాగాలు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాల్లేవు. శబ్ద కాలుష్యంతో పిల్లలు, వృద్ధులలో వినికిడి సమస్యలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 👉గణేష్ ఊరేగింపుల్లో డీజేల చప్పుళ్లు, లౌడ్ స్పీకర్లు, జనరేటర్ల వినియోగం, టపాసులు కాల్చడం, వాహనాల హారన్లు, యువతీయువకులు బూరలతో శబ్దాలు చేయడం తదితర కారణాలతో నిమజ్జనం వేళ పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదైంది. ప్రధానంగా హుస్సేన్‌సాగర్, అబిడ్స్, బహదూర్‌పురా, చార్మినార్, ఖైరతాబాద్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, బాలాపూర్, రామాంతాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం ఎక్కువగా నమోదైంది. ఆయా ప్రాంతాల్లోని నివాసితులు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేరే రాష్ట్రాల్లో కేసులు.. పుణే, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించి, పరిమితికి మించి శబ్ద కాలుష్యం కలిగించిన గణేష్ మండప నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కానీ, మన దగ్గర మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో అధిక శబ్దాలను గుర్తించేందుకు పోలీసులు ప్రధాన రహదారుల్లో నాయిస్ డిటెక్షన్ ఉపకరణాలు ఏర్పాటు చేశారు. కానీ, వాటి నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి.వినికిడి సమస్యలు.. మితిమీరిన శబ్దాలతో చిన్న పిల్లల కర్ణభేరి సూక్ష్మ నాడులు దెబ్బతింటాయి. వృద్ధులకు వినికిడి శక్తి లోపించే ప్రమాదం ఉంది. పరిమితికి మించి శబ్ధాలతో తలనొప్పి, చికాకు, గుండె స్పందనలో వేగం, రక్త ప్రసరణ పెరగడంతో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. 65 డెసిబుల్స్‌కు మించిన ధ్వనితో గుండె జబ్బులు, చెవుడు కూడా రావచ్చు. -
మహా గణపయ్య నిమజ్జనంలో పాల్గొన్న మొదటి సీఎంగా రేవంత్ రెడ్డి
-
గణనాథుడికి ఘన వీడ్కోలు
-
వినాయక విగ్రహాలతో నిండిపోయిన ట్యాంక్ బండ్.. ఫుల్ ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గణేష్ విగగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్ వద్దకు వేలాదిగా విగ్రహాలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూలోనే ఉన్నాయి. పెద్ద విగ్రహాలు సైతం ఇంకా నిమజ్జనం కాలేదు.ఇక, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్‌లో విగ్రహాలను తరలిస్తున్న వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. కాగా, సోమవారం అర్ధరాత్రి వరకు లక్షకు పైగా నిమజ్జనాలు జరిగాయి. నేడు రోజు కూడా నిమజ్జనాల ప్రక్రియకు మరింత సమయం పట్టనుంది. నిన్నటి నుంచి నిమజ్జనం కోసం గణపతి విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. దీంతో, ఖైరతాబాద్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో కొంత మేర ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అధికారులు.. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నేడు పనిదినం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ.. పోలీసుల అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఒక వైపు రోడ్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గణపతి విగ్రహాలను జలవిహార్, పీపుల్స్ ప్లాజా వైపు మళ్లిస్తున్నారు. అలాగే, విగ్రహాలను నిమజ్జనం కోసం పీపుల్స్ ప్లాజా రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోని మరో రోడ్లోకి మళ్లిస్తున్నారు. సాధారణ వాహనాల రాకపోకల కోసం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఇక, ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం కోసం ఇంకా ఐదువేల వరకు విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: లంబో‘ధర’ లడ్డూ! -
గణేష్ నిమజ్జనంలో విషాదం.. చెరువులో పడి యువకుడి మృతి
సాక్షి, యాదాద్రి భువనగిరి: వినాయకుడి నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకరస సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు గణేషుడిని చెరువులో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందాడు. ప్రవీణ్ మృతదేహం వెలికి తీసేందుకు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.చదవండి: ఉత్సాహంగా వినాయక నిమజ్జనం -
నిఘా నీడలో.. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
-
Ganesh Immersion: ఆ అనుభవాల నుంచి పాఠాలు!
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: నగరంలో గణేశ్ సామూహిక నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా గత ఏడాది ఎదురైన అనుభవాలను పాఠాలుగా తీసుకొని ఈసారి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా కసరత్తు చేస్తున్నారు. బందోబస్తు కోణంలో సామూహిక నిమజ్జనం నగర పోలీసులకు ఫైనల్స్ వంటివి. గత కొన్నేళ్లతో పోలిస్తే గత ఏడాది ఈ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. 2023 సెప్టెంబర్ 28 తెల్లవారుజాము నుంచి 29 రాత్రి 10 గంటల వరకు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరిగింది. ఈ ఆలస్యానికి కారణాలను ఉన్నతాధికారులు విశ్లేషించి ఈసారి ఏ ఒక్కటీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఈ లోపాలను ప్రస్తావించారు. వీటిని జీహెచ్ఎంసీ సహా ఇతర విభాగాల దృష్టికీ తీసుకువెళ్లారు. రెండు క్రేన్ల మధ్య వంద అడుగుల దూరం... కొన్ని క్రేన్లలో ఇనుపతాళ్లకు బదులుగా బెల్ట్‌లు వాడారు. నిమజ్జనం సందర్భంలో ఇవి ఊడిపోవడంతో మరింత ఆలస్యమైంది. అత్యవసర పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు ఏర్పాటు చేయాల్సి వస్తే... ప్రతి రెండు క్రేన్ల మధ్య కనీసం 100 నుంచి 150 అడుగుల దూరం ఉండాలి. అలా చేస్తేనే నిమజ్జనానికి విగ్రహాలను తెచ్చిన లారీలు, ఖాళీ అయినవి తేలిగ్గా ముందుకు వెళ్తాయి. అయితే సరైన పర్యవేక్షణ లేని కారణంగా గత ఏడాది ప్రతి క్రేన్ మధ్య 30 నుంచి 40 అడుగుల దూరమే ఉంచారు. దీంతో విగ్రహాలను తీసుకొచ్చిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఫలితంగా నిమజ్జనానికి వచ్చే విగ్రహాల కోసం క్రేన్లు ఖాళీగా వేచి ఉండాల్సి వచ్చింది. అదేవిధంగా ట్యాంక్‌బండ్‌పై బయటి ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులకు ఎక్కువగా డ్యూటీలు వేశారు. సరైన అవగాహన లేని వీళ్ళు సక్రమంగా తమ విధులను నిర్వర్తించలేకపోయారు. ఇదీ చదవండి: కీలక ఘట్టానికి వేళాయేపటిష్టంగా బారికేడింగ్ నిమజ్జనం చూడటానికి వచ్చే సందర్భకులు లారీల మధ్యలోకి, రోడ్డుపైకి రాకుండా ఇరువైపులా పటిష్ట బారికేడింగ్ ప్రతి ఏడాదీ ఏర్పాటు చేస్తుంటారు. ఇది గత ఏడాది సక్రమంగా జరగలేదు. దీంతో అనేకమంది లారీల మధ్యకు వస్తుండటంతో అవి చాలా ఆలస్యంగా కదిలాయి. మరోపక్క బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ వైపు వాహనాలను అనుమతించడం మరో ఇబ్బందికి కారణమైంది. విగ్రహాలు తీసుకువచ్చే లారీల వెనుక వచ్చే ద్విచక్ర వాహనాలు, ఇతరాలను గత ఏడాది పూర్తిస్థాయిలో అడ్డుకోలేదు. ఇది కూడా నిమజ్జనం ఆలస్యానికి కారణంగా మారింది. ఇవన్నీ విశ్లేషిస్తున్న ఉన్నతాధికారులు ఈసారి అవి పునరావృతం కాకుండా, గతం కంటే మెరుగైన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇవీ లోపాలు... ముందుగా వచ్చే విగ్రహాలు నిమజ్జనం కాగానే బండ్ నుంచి 20 అడుగుల దూరం మేర నీటిలో పేరుకుపోయే వ్యర్థాలు, వస్తువులను వెంట వెంటనే తొలగించాలి. అలా జరగకపోవడంతో ఆ వెంటనే నిమజ్జనం చేసే విగ్రహాలు మునగడానికి చాలా సమయం పట్టింది. నిమజ్జనం సందర్భంగా సాగర్‌లో కనీసం నాలుగు, ఐదు ఫ్లోటింగ్ జేసీబీలను ఏర్పాటు చేయాలి. ఓ పక్క విగ్రహాలు నీటిలో పడుతుంటే, మరోపక్క వాటి వ్యర్థాలను తొలగించాలి. అయితే జీహెచ్ఎంసీ అధికారులు గత ఏడాది కేవలం ఒక్క ఫ్లోటింగ్ జేసీబీ మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ కారణాల వల్ల నిమజ్జనం ప్రక్రియ వేగంగా జరగడానికి తీసుకువచ్చిన అత్యాధునిక క్యూఆర్డీ హుక్స్ సరిగ్గా పనిచేయలేదు. క్రేన్ ప్లాట్‌ఫామ్‌కు ఉన్న నాలుగు మూలలు సమానంగా నీటిలోకి దిగితేనే ఇవి సక్రమంగా పని చేస్తాయి. అయితే సాగర్‌లో ఉన్న వ్యర్థాలు, విగ్రహాలు, ఇనుప సీకులకు తట్టుకుని నాలుగు వైపులా నీటిలో దిగక హుక్స్ వెంటనే రిలీజ్ కాలేదు. దీంతో కొన్ని విగ్రహాల నిమజ్జనానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టింది. -
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
మేడ్చల్ రూరల్: మేడ్చల్ మండలం రాజబొల్లారం తండాలో శనివారం రాత్రి నిర్వహించిన వినాయక నిమజ్జనం అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీటమునిగి మృతి చెందాడు. స్ధానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజ బొల్లారం తండాకు చెందిన మాజీ సర్పంచ్ మాంగ్యా నాయక్ తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి పలువురు యువకులు సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో కరంతోడ్ సురేందర్ అలియాస్ హంజా(28) నీటిలో మునిగాడు. ఈ విషయాన్ని గమనించని మిగతా యువకులు విగ్రహాన్ని నీటిలోకి నెట్టారు. ఈ క్రమంలో విగ్రహం మీద పడి హంజా నీటిలో మునిగిపోయాడు. నిమజ్జనం తర్వాత రోడ్డుపైకి వచ్చిన యువకులకు హంజా కనబడకపోవడంతో తిరిగి నీటిలోకి వెళ్లి చూడగా విగ్రహం కింద పడి విగతజీవిగా కనిపించాడు. మృతుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గణేష్ నిమజ్జనాలు.. రూట్ మ్యాప్ ఇదే
-
Ganesh immersion: గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17న జరిగే గణేశ్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతోంది. ఎప్పటి మాదిరిగానే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్ఎండీఏ, వాటర్‌బోర్డు, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్‌సరీ్వసెస్, ఆర్టీసీ, ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, టూరిజం విభాగాలతోపాటు 108 ఈఎంఆర్ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పను లు చేయనున్నారు. జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్ల పరిధుల్లోనూ నిమజ్జనాలు జరిగే ప్రాంతాలవారీగా ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దారి పొడవునా దాదాపు కిలోమీటరుకు ఒక గ్రూపుచొప్పున పారిశుద్ధ్య కార్మికులతో గ్రూపులు ఏర్పాటు చేశారు. గణేశ్ యాక్షన్ టీమ్స్ పేరిట ఇవి మూడు షిఫ్టుల్లో పని చేస్తాయి. ఒక్కో టీమ్‌లో ప్రాంతాన్ని, అవసరాన్ని బట్టి అయిదుగురు నుంచి పన్నెండు మంది వరకు కారి్మకులుంటారు. దాదాపు మూడు వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధుల్లో పాల్గొంటారు. ఇబ్బందులు తలెత్తకుండా: ఆమ్రపాలి శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేందుకు భక్తులు సహకరించాలని కోరారు. మండపాల నుంచి నిమజ్జనాలు జరిగే చెరువులు, కొలనుల దాకా భక్తులకు సమస్యలు లేకుండా రహదారి మరమ్మతులు, వీధి దీపాలు, చెట్ల కొమ్మల తొలగింపు తదితర పనులకు పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, విద్యుత్ సిబ్బంది, జీవవైవిధ్య విభాగం, ఇంజినీర్లు కమిటీగా ఏర్పడి మండపాల నిర్వాహకుల సూచనల మేరకు తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 73 కొలనుల్లో ఏర్పాట్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడి ప్రజలక్కడే నిమజ్జనాలు చేసేందుకు వీలుగా 73 కొలనుల్లో నిమజ్జనాలకు ఏర్పాటు చేసినట్లు ఆమ్రపాలి పేర్కొన్నారు. వాటిలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 22 తాత్కాలిక కొలనులు ఉన్నాయన్నారు. వీటితోపాటు 5 పెద్ద చెరువుల (సరూర్ నగర్, జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహదూర్‌పురా మీరాలం చెరువు, కాప్రా ఊర చెరువు) వద్ద ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. నిమజ్జన ప్రదేశాల వద్ద విద్యుత్, 24 గంటల పాటు తాగునీరు అందుబాటులో ఉండేలా, పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగేలా అవసరమైన సిబ్బంది, సామగ్రి సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో భోజన సదుపాయాలు కలి్పంచనున్నట్లు పేర్కొన్నారు. నమో.. మహా గణనాథా ఒక్కరోజే 4 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్: మహా గణపతి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తడంతో ప్రాంగణమంతా జనసంద్రాన్ని తలపించింది. సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివచి్చనట్లు అంచనా. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్ల నుంచి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఖైరతాబాద్ రైల్వేగేట్ రోడ్డంతా కిక్కిరిసిపోయింది. మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతుండటంతో సోమవారం దర్శనం ఉండదని సైఫాబాద్ ఏసీపీ ఆర్.సంజయ్‌కుమార్ తెలిపారు. నిర్వాహకులు మాత్రం సోమవారం భక్తులు మహా గణపతిని దూరం నుంచి దర్శించుకోవచ్చన్నారు.బాలాపూర్ నుంచి.. ట్యాంక్‌బండ్ వరకు నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన డీజీపీ, సీపీలు చాంద్రాయణగుట్ట/పహాడీషరీఫ్: ఈ నెల 17న జరిగే బాలానగర్ వినాయక నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని డీజీపీ డాక్టర్ జితేందర్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం శనివారం ప్రధాన మార్గాన్ని పరిశీలించింది. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సి.వి.ఆనంద్, సు«దీర్ బాబు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు సీపీలు (శాంతి భద్రతలు) విక్రం సింగ్, పి.విశ్వప్రసాద్ (ట్రాఫిక్)లు ఇతర శాఖల అధికారులు ఆయన వెంట ఉన్నారు. అంతకుముందు బాలాపూర్ గణనాథుడికి పూజలు చేశారు. అనంతరం నిమజ్జనం రూట్లోని రాయల్ కాలనీ, గుర్రం చెరువు కట్ట, బార్కాస్, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఇంజన్‌లి, శంషీర్‌గంజ్, అలియాబాద్, సయ్యద్ అలీ చబుత్రా, లాల్‌దర్వాజా మోడ్, శాలిబండ, చారి్మనార్, గుల్జార్‌హౌజ్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ట్యాంక్‌బండ్ వరకు 19 కిలోమీటర్ల రూట్‌ను పరిశీలించారు. అధికారులతో మహేశ్వరం, సౌత్, సౌత్ ఈస్ట్ డీసీపీలు సునీతా రెడ్డి, స్నేహ మెహ్రా, కాంతిలాల్ సుభాష్ పాటిల్, బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత ్డ ఉన్నారు. 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 👉 రహదారులపై వ్యర్థాలు తొలగించేందుకు గణేశ్ యాక్షన్ టీమ్‌లు 160. 👉 అందుబాటులో ఉంచిన మినీ టిప్పర్లు 102, జేసీబీలు 125. 👉 మొబైల్ టాయ్‌లెట్స్ 309 👉 తాత్కాలిక వీధి దీపాలు 52,270. 👉 రోడ్ల మరమ్మతులు, ప్యాచ్‌వర్క్స్‌కు సంబంధించిన పనులు 172. 👉 వీటికి చేసిన వ్యయం రూ.12.77 కోట్లు. 👉 రవాణాకు సంబంధించిన పనులు 36. వ్యయం రూ.16.35 కోట్లు. పనులన్నీ పూర్తయినట్లు జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు దర్శనమిస్తున్నాయి. ప్యాచ్‌వర్క్ పనులు పూర్తి కాలేదు. -
HYD: కీలకఘట్టం.. 17న మహా నిమజ్జన సెలవు
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో అత్యంత కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం ఈ నెల 17న (మంగళవారం) జరగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 17కి బదులుగా నవంబర్ 9(రెండో శనివారం)న పనిదినంగా ప్రకటించింది. ఈ నెల 7న మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు 17తో ముగియనున్నాయి.నిమజ్జనాలు నేపథ్యంలో నగర పోలీసులు, అదనపు బలగాలతో కలిపి దాదాపు 25 వేల మంది బందోబస్తు, భద్రత విధులు నిర్వర్తిస్తారని కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రకటించారు. నిమజ్జనంతో పాటు 19న జరగనున్న మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్క అడుగుతో మొదలై 70 అడుగులకు..హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఏడాది కూడా ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాలు నిషేధించామని చెప్పిన ఆయన ఎన్టీఆర్ మార్గ్‌తో పాటు పీవీ నరసింహారావు మార్గ్‌ల్లో అవసరమైన అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. గణేష్ విగ్రహాల ఊరేగింపు జరిగే మార్గాలతో పాటు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.మరోపక్క కమిషనరేట్‌లోని జోన్ల వారీగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆనంద్ శుక్రవారం వెస్ట్ జోన్‌పై సమీక్షించారు. మాసబ్‌ట్యాంక్‌లో డీసీపీ కార్యాలయానికి వెళ్లిన ఆయన శాంతిభద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, టాస్‌్కఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. కమ్యూనల్ రౌడీలను కట్టడి చేయాలని, సోషల్ మీడియా ద్వారా వదంతులు, సున్నిత అంశాలు సంబంధించిన వీడియోలు ప్రచారం చేసే వారిపైనా నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. -
అనంతపురం జిల్లాలో సందడిగా గణేష్ నిమజ్జనం (ఫొటోలు)
-
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
#Hyderabadసాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్.. ప్రతివాదిగా చేర్చాలని కూడా కోరారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. మొదట హైడ్రాను ప్రతివాదిగా చేర్చడాన్ని కోర్టు తిరస్కరించింది. అనంతరం, పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ట్యాంక్ బండ్లో నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్బంగా కోర్టు ధిక్కరణపై పిటిషనర్ ఆధారాలు చూపించలేకపోయారు అంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నిమజ్జనం జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలి. గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు. అలాంటప్పుడు ఇప్పుడెలా హైడ్రాను పార్టీ చేస్తాం. ఈ సందర్భంగా అధికారుల చర్యలను హైకోర్టు సమర్థించింది. 2022లో అధికారుల చర్యలపై తృప్తి చెంది రికార్డ్ చేసాము. పీఓపీతో విగ్రహాలు తయారు చేయడంపై నిషేధం ఇవ్వలేం. కానీ, పీఓపీ విగ్రహాలు తాత్కాలిక పాండ్స్‌లో నిమజ్జనం చేసుకోవచ్చు. పిటిషనర్ ప్రత్యేక ఆదేశాల కోసం రిట్ పిటిషన్ వేయవచ్చు అని ధర్మాసనం చెప్పింది. #Tankbundఇదిలా ఉండగా.. కోర్టులో పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతులు లేవంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గణేష్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్‌లో వినాయకుని నిమజ్జనాలకు అనుమతులు ఇవ్వకపోతే ఎక్కడ నిమజ్జనం చేయాలనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. No idol immersion on Tank bund ✅ pic.twitter.com/ZwQBdao8LQ— Sreekanth B+ ve (@sreekanth324) September 10, 2024 #RajaSingh Comments..ఈ సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో గందరగోళం కనిపిస్తోంది. సీఎం రేవంత్, జీహెచ్ఎంసీ కమిషనర్ దీనిపై వివరణ ఇవ్వాలి. నగరం నలుమూలల నుంచి ట్యాంక్ బండ్‌కు నిమజ్జనానికి విగ్రహాలు వస్తాయి. నిజంగా హైకోర్టు ఆర్డర్ అమలు చేస్తే ఈ విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయిస్తారు. ఇప్పటికే ప్రజలు ఎన్నో సందేహాలతో ఉన్నారు. వారికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ట్యాంక్ బండ్లో విగ్రహాలు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అసలు ఎవరు వ్యతిరేకిస్తున్నారో జీహెచ్ఎంసీ కమిషనర్ బయటకు తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. There seems to be some confusion regarding the immersion of Ganesh idols at Vinayaka Sagar (Tankbund). I kindly request Telangana CM @revanth_anumula garu and the @GHMCOnline Commissioner to provide clarity on this matter as a priority.Ensuring clear guidelines will help in… pic.twitter.com/JmWthMZyze— Raja Singh (@TigerRajaSingh) September 10, 2024ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు.. వివరాలివే -
అమెరికా విస్కాన్సిన్ స్టేట్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
మాడిసన్: విదేశాల్లో గణనాథుడి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్టం విస్కాన్సిన్ స్టేట్‌లోని సన్ ప్రైరీలో తెలుగు వాళ్లంతా కలిసి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించి.. సోమవారం అట్టహాసంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో అభిషేక్ సింధుజ, సంతోష్ ప్రణయ, ప్రసాద్ రమ్య, క్రాంతి కవిత, సంతోష్ ఉష తదితరులు పాల్గొన్నారు. -
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం.. ‘హైడ్రా’ ప్రతివాదిగా కోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వినాయకచవితి నవ రాత్రుల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై రేపు(మంగళవారం) విచారణ జరుగనుంది.కాగా, హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్.. ప్రతివాదిగా చేర్చాలన్నారు. హుస్సేన్‌సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని కోర్టును పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై వాదనలను రేపు(మంగళవారం) వింటామని న్యాయస్థానం తెలిపింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో రేపు వాదనలు జరుగనున్నాయి. -
హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. సంజీవయ్య పార్క్ వద్ద బాలుడు మృతిచెందాడు. గణనాథుడిని తీసుకొస్తున్న లారీ టైర్ కిందపడి బాలుడు మృతిచెందాడు. మృతిచెందిన మైనర్ కిషన్‌బాగ్‌కు చెందిన ప్రణిత్‌కుమార్‌గా గుర్తించారు. మరో ప్రమాదంలో.. బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ సమీపంలో లారీ టైర్ కింద పడి ఒకరు మృతిచెందారు. సంతోష్ నగర్ ప్రెస్ కాలనీలో నివాసం ఉంటున్న బెల్లంపల్లికి చెందిన రాజశేఖర్ కుటుంబం.. నిమజ్జనం చేయడానికి బైక్‌పై వస్తుండగా, బైక్ స్కిడ్ కావడంతో కుటుంబసభ్యులు కిందపడ్డారు. నాలుగేళ్ల ఆయుష్‌పై నుంచి టక్కర్ వాహనం వెళ్లడంతో నిలోఫర్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. చదవండి: బాలిక హత్య.. బాబాయే హంతకుడు? -
న్యూజెర్సీలోని ఎడిసన్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం వేడుకలు
-
భక్త 'గణ' యాత్ర
సాక్షి, హైదరాబాద్: గణపతి నిమజ్జన వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో విగ్రహాలు, భక్తులతో రహదారులు కిటకిటలాడాయి. నగరం నలువైపుల నుంచి తరలి వచ్చిన భక్తజన సందోహంతో సాగరతీరం సందడిగా మారింది. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, పీపుల్స్‌ప్లాజా తదితర ప్రాంతాల్లో ‘జై బోలో గణపతి మహారాజ్‌కీ జై ’అంటూ నినాదాలు హోరెత్తాయి. వైవిధ్య భరితమైన వినాయక మూర్తుల నిమజ్జన వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. భక్తుల నినాదాలు, నృత్యాలతో కూడిన శోభాయాత్రతో మహానగరం ఆధ్మాత్మికతను సంతరించుకుంది. 63 అడుగుల ఖైరతాబాద్ శ్రీ దశ మహావిద్యా గణపతి నిమజ్జన వేడుకలు మధ్యాహ్నం 1.27 గంటలకే ముగిశాయి. ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్త జనందోహం నడుమ శోభాయాత్ర ప్రశాంతంగా సాగింది. ఉదయం 6.12 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్. రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మీనార్, సచివాలయం, ఎన్టీయార్మార్గ్ మీదుగా ఉదయం 11.40 గంటలకు 4వ నంబర్ క్రేన్ వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం 12.24 గంటలకు చివరి పూజ నిర్వహించిన గంట తరువాత మహాగణపతిని నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని విభాగాల సహకారంతో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేకత ఉందని పది రోజుల్లో 50 లక్షల మంది దర్శించుకున్నారని చెప్పారు. గురువారం నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో భారీగా పోటెత్తిన భక్త జనం వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ మహాగణపతి నిమజ్జన వేడుకలు ముగిసిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి బొజ్జ గణపయ్యలు సాగరతీరంలో నిమజ్జనానికి తరలివచ్చారు. మధ్యలో స్వాగత వేదికలు గణపతులకు సాదర స్వాగతం పలికాయి. రకరకాల ఆకృతులలో అందంగా రూపుదిద్దుకున్న మూషికవాహనుడి విగ్రహాలు ఆకట్టుకున్నాయి. తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం అలంకరణలో ఏర్పాటు చేసిన మండపాలు, విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్ వంటి సోషల్ మీడియాను ప్రతిబింబించే చిన్న చిన్న విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి నిమజ్జనానికి తీసుకొచ్చారు. అబిడ్స్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పండ్లతో అలంకరించిన విగ్రహాలు, కాగితంతో అందంగా తీర్చిదిద్దిన పర్యావరణ గణపతులు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కోసం అమరవీరుల స్మారక చిహ్నం వద్ద బారులు తీరిన వినాయక విగ్రహాలు ఏరియల్ నిఘా రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసేందుకు పోలీస్‌శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీ స్ కమిషనర్లు వినాయక నిమజ్జన ప్రాంతాలు పరిశీలించారు. హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని మంత్రులు మహమూ ద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి డీజీపీ అంజనీకుమార్ ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. హెలికాప్టర్లో శోభాయాత్రను, హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కూడా పాల్గొన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా శోభయాత్రను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల లైవ్ ఫీడ్‌ను చూస్తూ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. నగరం ఆధ్యాత్మిక సంద్రమైంది. ఎటుచూసినా భక్తజన సందోహం.. అంతటా గణనాథుని నిమజ్జన వేడుకల కోలాహలం.. దారిపొడవునా వినాయకులకు ఘన స్వాగతాలు.. ట్యాంక్బండ్లు, చెరువుల వద్ద వీడ్కోళ్లు.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. 63 అడుగుల ఖైరతాబాద్ శ్రీ దశ మహావిద్యా గణపతి నిమజ్జనోత్సవం మధ్యాహ్నం 1.27 గంటలకే ముగిసింది. -
హైదరాబాద్‌లో వర్షం.. వానలోనే గణనాథుల నిమజ్జనం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం ప్రారంభమైంది. ట్యాంక్ బండ్లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్న సందర్భంగా వర్షం కురుస్తుండటం ఇబ్బందికరంగా మారింది. వర్షంలోనే ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. బషీర్‌బాగ్, ఎంజే మార్కెట్, ట్యాంక్ బండ్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక, వర్షంలోనే గణనాథులు ట్యాంక్ బండ్‌పైకి తరలి వస్తున్నాయి. వర్షంలోనే వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విగ్రహాల తరలింపునకు ఆటంకం కలుగుతోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్ గణనాథుల నిమజ్జనం ముగిసింది. #28SEP 5PM⚠️ HEAVY THUNDERSTORMS ALERT FOR South -East #Hyderabad ⛈️#SaroorNagar,#Uppal,#Malakpet,#Amberpet ,#Ou ,#Secunderabad surroundings Seeing Intense Downpour⛈️⚠️ & These Stroms will Later Spread towards Central City.,#HyderabadRains pic.twitter.com/fjHhxcvUxR — Hyderabad Rains (@Hyderabadrains) September 28, 2023 Hyderabad right now! #rain #hyderabadrains #weather pic.twitter.com/r8lyCBXmEg — Stella Paul (@stellasglobe) September 28, 2023 మరోవైపు.. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హిమాయత్‌నగర్, కవాడిగూడ, నారాయణగూడ, ముషీరాబాద్, ఉప్పల్, అంబర్పేట్, ఓయూ, తర్నాక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. #24HrWx #Telangana #Hyderabad High chances of thunderstorms in parts of the city particularly in the evening time. pic.twitter.com/fBpORkJxeg — Weather@Hyderabad|TS|AP 🇮🇳 (@Rajani_Weather) September 28, 2023 RED WARNING FOR HYDERABAD ⚠️ As expected, Huge thunderstorms clouds forming in Central Zone like Himayatnagar, Kavadiguda, Narayanguda, Musheerabad, Uppal, Amberpet, OU, Tarnaka side will later cover other parts too. Get ready for the blast 🔥⚡️⚡️⚡️⚡️#HyderabadRains — Telangana Weatherman (@balaji25_t) September 28, 2023 Pouring really hard. Almost like a curtain/waterfall. Can't see anything. Video somehow there's some visibility. #HyderabadRains pic.twitter.com/PmVPU4dEHd — VT-RRB ◢◤ (@rb_41) September 28, 2023 -
ట్యాంక్ బండ్ లో నిమజ్జనానికి తరలివస్తున్న గణనాధులు
-
ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్తుల కోలాహలం
-
Khairatabad Ganesh Nimajjanam 2023: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. నిమజ్జనం (ఫొటోలు)
-
రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
సాక్షి, రంగారెడ్డి: బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్‌రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. దయానంద్‌ది తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని పాటిగూడ గ్రామం. ఈయన వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. నేటితో బాలాపూర్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏయేడుకాయేడు ఎక్కువ ధర పలికే లడ్డూ.. ఈసారి ఎంతకు పోతుందో అనే ఆసక్తి నెలకొనగా.. రికార్డు స్థాయిలోనే పోయింది. గతేడాది రూ. 24 లక్షలకు పోయింది బాలాపూర్ లడ్డూ. ఈసారి వేలంపాటలో 36 మంది ఔత్సాహికులు పాల్గొంటున్నారు. వీళ్లలో ముగ్గురే స్థానికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ వినాయకుడి దగ్గర సందడి నెలకొంది. అంతకు ముందు బాలాపూర్ గ్రామంలో గణేశుడిని ఊరేగించింది ఉత్సవ కమిటీ. ఉత్సవ కమిటీ రూల్స్ ప్రకారం.. స్థానికేతరులు వేలం కంటే ముందే గతేడాది కంటే ఎక్కువ సొమ్మును డిపాజిట్ చేశారు. అంటే.. రూ.25 లక్షలు చెల్లించారు. ఒకవేళ వాళ్లు గనుక సొంతం చేసుకోకుంటే తిరిగి డబ్బులు చెల్లిస్తుంది ఉత్సవ కమిటీ. వేలంపాట ముగియడంతో కాసేపట్లో నిమజ్జనం కోసం బాలాపూర్ గణేశుడు కదులుతాడు. బాలాపూర్ లడ్డూ వేలంపాట.. ఎవరు దక్కించుకున్నారు.. ఎంతకంటే.. ► 1994లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 450 ► 1995లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 4,500 ►1996లో కొలను కృష్ణారెడ్డి.. రూ. 18,000 ►1997లో కొలను కృష్ణారెడ్డి... రూ. 28,000 ►1998లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 51,000 ►1999లో కల్లెం అంజి రెడ్డి .. రూ. 65,000 ►2000లో కల్లెం ప్రతాప్‌రెడ్డి.. రూ.66,000 ►2001లో రఘునందన్‌చారి.. రూ. 85,000 ►2002లో కందాడ మాధవరెడ్డి.. రూ.1,05,000 ►2003లో చిగిరింత బాల్‌రెడ్డి.. రూ.1,55,000 ►2004లో కొలను మోహన్‌రెడ్డి...రూ. 2,01,000 ►2005లో ఇబ్రహీం శేఖర్... రూ.2,80,000 ►2006లో చిగిరింత తిరుపతి రెడ్డి..రూ.3,00,000 ►2007లో రఘునందర్‌చారి.. రూ.4,15,000 ►2008లో కొలను మోహన్‌రెడ్డి... రూ.5,07,000 ►2009లో సరిత రూ.5,10,000 ►2010లో కొడాలి శ్రీధర్‌బాబు..రూ.5,35,000 ►2011లో కొలను బ్రదర్స్... రూ. 5,45,000 ►2012లో పన్నాల గోవర్థన్‌రెడ్డి... రూ.7,50,000 ►2013లో తీగల కృష్ణారెడ్డి... రూ.9,26,000 ►2014లో సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి...రూ.9,50,000 ►2015లో కొలను మదన్ మోహన్‌రెడ్డి... రూ.10,32,000 ►2016లో స్కైలాబ్‌రెడ్డి... రూ.14,65,000 ►2017లో నాగం తిరుపతిరెడ్డి... రూ.15,60,000 ►2018లో శ్రీనివాస్‌గుప్తా.. రూ.16,60,000 ►2019లో కొలను రామిరెడ్డి... రూ.17,60,000 ►2020 కరోనా కారణంగా సీఎం కెసిఆర్ కి అందజేశారు... ►2021లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్‌రెడ్డి... రూ. 18,90,000 ► 2022లో 24 లక్షల 60,000 వంగెటి లక్ష్మారెడ్డి ► 2023లో 27 లక్షలు దాసరి దయానంద్‌రెడ్డి -
బాలాపూర్ లడ్డు వేలం 2023