#Hyderabad
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అయితే, హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్‌లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్.. ప్రతివాదిగా చేర్చాలని కూడా కోరారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.
మొదట హైడ్రాను ప్రతివాదిగా చేర్చడాన్ని కోర్టు తిరస్కరించింది. అనంతరం, పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ట్యాంక్ బండ్‌లో నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్బంగా కోర్టు ధిక్కరణపై పిటిషనర్ ఆధారాలు చూపించలేకపోయారు అంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నిమజ్జనం జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది.
2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలి. గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు. అలాంటప్పుడు ఇప్పుడెలా హైడ్రాను పార్టీ చేస్తాం. ఈ సందర్భంగా అధికారుల చర్యలను హైకోర్టు సమర్థించింది. 2022లో అధికారుల చర్యలపై తృప్తి చెంది రికార్డ్ చేసాము. పీఓపీతో విగ్రహాలు తయారు చేయడంపై నిషేధం ఇవ్వలేం. కానీ, పీఓపీ విగ్రహాలు తాత్కాలిక పాండ్స్‌లో నిమజ్జనం చేసుకోవచ్చు. పిటిషనర్ ప్రత్యేక ఆదేశాల కోసం రిట్ పిటిషన్ వేయవచ్చు అని ధర్మాసనం చెప్పింది.
#Tankbund
ఇదిలా ఉండగా.. కోర్టులో పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతులు లేవంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గణేష్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్‌లో వినాయకుని నిమజ్జనాలకు అనుమతులు ఇవ్వకపోతే ఎక్కడ నిమజ్జనం చేయాలనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
No idol immersion on Tank bund ✅ pic.twitter.com/ZwQBdao8LQ
— Sreekanth B+ ve (@sreekanth324) September 10, 2024
#RajaSingh Comments..
ఈ సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో గందరగోళం కనిపిస్తోంది. సీఎం రేవంత్, జీహెచ్ఎంసీ కమిషనర్ దీనిపై వివరణ ఇవ్వాలి. నగరం నలుమూలల నుంచి ట్యాంక్ బండ్‌కు నిమజ్జనానికి విగ్రహాలు వస్తాయి. నిజంగా హైకోర్టు ఆర్డర్ అమలు చేస్తే ఈ విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయిస్తారు. ఇప్పటికే ప్రజలు ఎన్నో సందేహాలతో ఉన్నారు. వారికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ట్యాంక్ బండ్‌లో విగ్రహాలు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అసలు ఎవరు వ్యతిరేకిస్తున్నారో జీహెచ్ఎంసీ కమిషనర్ బయటకు తీసుకురావాలి అని డిమాండ్ చేశారు.
There seems to be some confusion regarding the immersion of Ganesh idols at Vinayaka Sagar (Tankbund).
I kindly request Telangana CM @revanth_anumula garu and the @GHMCOnline Commissioner to provide clarity on this matter as a priority.
Ensuring clear guidelines will help in… pic.twitter.com/JmWthMZyze— Raja Singh (@TigerRajaSingh) September 10, 2024
ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు.. వివరాలివే
Comments
Please login to add a commentAdd a comment