గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి | Boy dies while doing Ganesh Immersion process | Sakshi
Sakshi News home page

గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి

Published Sun, Sep 3 2017 7:15 PM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM

గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి - Sakshi

గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి

సాక్షి, హైదరాబాద్‌ : వినాయక నిమజ్జనం చేస్తుండగా నగరంలో అపశృతి చోటు చేసుకుంది. ముందున్న బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బాచుపల్లి రాజీవ్‌గాంధీనగర్‌ లో ఆదివారం ట్రాక్టర్‌పై గణేశుడిని నిమజ్జనానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ ముందు యువకులు నృత్యాలు చేస్తున్నారు.

అంతలోనే ట్రాక్టర్‌ అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లి  మహేశ్‌ అనే బాలుడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ మహేశ్‌ను వెంటనే నిజాంపేటలోని హోలిస్టిక్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఇద్దరు బాలురకు గాయాలు కాగా వారికి చికిత్స చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement