
నిమజ్జనంలో అపశ్రుతి: ట్యాంక్ బండ్‌పై సెల్ఫీ దిగుతూ..
సాక్షి, హైదరాబాద్ సిటీ: ఉత్సాహంగా జరుగుతోన్న గణపతి నిమజ్జనమహోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మంగవారం నిమజ్జనం చూసేందుకు ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన ఓ యువకుడు సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ హుస్సేన్ సాగర్‌లో పడిపోయాడు.
ఇది గమనించిన స్నేహుతులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. నీళ్లలోకి దిగి గాలించింది. కానీ యువకుడి ఆచూకీ లభించలేదు. దీంతో గాలింపు పరిధిని పెంచుకుంటూ పోయారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఆ యువకుడి జాడ తెలియరాలేదు.