ఇనుప కడ్డీల కోసం హుస్సేన్‌సాగర్‌లోకి దిగిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇనుప కడ్డీల కోసం హుస్సేన్‌సాగర్‌లోకి దిగిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గణేశుని విగ్రహాల నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు హుస్సేన్‌సాగర్‌లోకి దిగాడు. విగ్రహాలకు లోపల ఉండే ఇనుప కడ్డీలను వెతికే క్రమంలో అతడు అదుపుతప్పి నీటిలో మునిగిపోయాడు. పోలీసులు గమనించి వెలికి తీసేలోగానే అతడు చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.