నిమజ్జనం చూపిస్తానని తీసుకెళ్లి బలత్కారం
► బాలికపై మేనమామ అత్యాచారయత్నం
► ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
సైదాబాద్: వినాయక నిమజ్జనం చూపిస్తానని వరుసకు మేనమామ అయిన వ్యక్తి ఓ పద కొండేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే నేపాల్‌కు చెందిన తులసి(35) నగరానికి వలస వచ్చి సింగరేణి వాంబే గృహాల్లో నివాసం ఉండేవాడు.
ఇతనికి భా ర్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం చర్లపల్లికి మకాం మార్చాడు. సింగరేణి కాలనీలో ఉండగా పక్కింట్లో ఉన్న వరుసకు కొడ లు అయ్యే బాలికతో పరిచయం పెంచుకున్నాడు. కాగా ఈ నెల 17న వినాయక నిమజ్జనం చూపిస్తానని తన ఆటోలో తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
అనంతరం బాలికను ఆమె ఇంటికి తీసుకొచ్చి వదిలేశాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిచి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది.