
ప్రతీకాత్మక చిత్రం
వేధింపులకు పాల్పడిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అజయ్ రెడ్డిగా గుర్తించారు.
శంషాబాద్: ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఓ ఎయిర్‌హోస్టెస్ వేధింపులకు గురయ్యారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అజయ్ రెడ్డిగా గుర్తించారు. అజయ్ రెడ్డిపై ఎయిర్‌హోస్టెస్, విమాన పైలట్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన శంషాబాద్‌లోని సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టులో విమానం దిగగానే సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అజయ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అజయ్‌ని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.