shashabad airport
-
మిథాలీరాజ్‌తో జేపీ నడ్డా భేటీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వరంగల్‌లో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభ కోసం తెలంగాణ పర్యటనకు వచ్చారు. అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం జేపీ నడ్డా.. నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్‌లతో పాటు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. కాగా, జేపీ నడ్డా.. శంషాబాద్ నుంచి నేరుగా నోవాటెల్ హోటల్‌కి వెళ్లారు. నోవాటెల్‌లో బీజేపీ నేతలతో పాటు మిథాలీ రాజ్‌తో నడ్డా భేటీ అయ్యారు. మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్‌కు వెళ్తారు. వరంగల్ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం, మధ్యాహ్నం 3.45 గంటలకు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొ.. వెంకటనారాయణ నివాసానికి నడ్డా చేరుకుని వారితో మాట్లాడతారు. సాయంత్రం 4.10 గంటలకి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌కి నడ్డా చేరుకుంటారు. వరంగల్ సభ అనంతరం హైదరాబాద్‌కు జేపీ నడ్డా తిరుగుపయనం అవుతారు. రాత్రి 7.30 గంటలకు నోవాటెల్‌లో నటుడు నితిన్‌తో నడ్డా భేటీ కానున్నారు. -
రూ.78 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
-
శంషాబాద్‌లో తిష్టవేసిన చిరుత
శంషాబాద్, పహాడీషరీఫ్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి ఎయిరో డ్రమ్స్ టవర్ సమీపంలో చిరుత కనిపించిందని విమానాశ్రయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాశ్రయ రక్షణ సిబ్బంది పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. విమానాశ్రయంలోని అమెజాన్ గోదాం, మామిడిపల్లి రహదారి వైపు వెళ్లే ఎయిరో డ్రమ్ టవర్ ప్రాంతాలను సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అటవీశాఖ అధికారు లు, పోలీసులు గాలించారు. ఎయిరో డ్రమ్ టవర్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అందులో కనిపిస్తున్న జంతువును చిరు తగా నిర్ధారించలేమని శంషాబాద్ ఎఫ్ఆర్వో శ్యామ్‌కుమార్ స్పష్టం చేశారు. అది అడవి పిల్లిలా కనిపిస్తోందన్నారు. చిరుత పాదముద్రలు కూడా ఎక్కడా లభించలేదని తెలిపారు. చిరుత ఎటువైపు నుంచి వచ్చిందనే విషయంలోనూ సందేహాలు వ్యక్తమవుతుండగా.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జల్పల్లిలో కనిపించిన చిరుత రెండ్రోజుల కిందట శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల్లో కనిపించిన చిరుతపులి తాజాగా జల్పల్లి పరిసరాల్లో కనిపించింది. సోమవారం అర్ధరాత్రి జల్పల్లి కార్గో రోడ్డుతో పాటు మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల వెనుక భాగంలో చిరుత సంచరిస్తుండగా పోలీసులతో పాటు స్థానికులు గమనించారు. శంషాబాద్ నుంచి జల్పల్లి గరిగుట్ట అడవి ద్వారా చిరుత రోడ్డుపైకి వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాత్రిపూట ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి సూచించారు. -
ఎయిర్ హోస్టెస్‌కు వేధింపులు
శంషాబాద్: ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఓ ఎయిర్‌హోస్టెస్ వేధింపులకు గురయ్యారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అజయ్ రెడ్డిగా గుర్తించారు. అజయ్ రెడ్డిపై ఎయిర్‌హోస్టెస్, విమాన పైలట్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన శంషాబాద్‌లోని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టులో విమానం దిగగానే సీఐఎస్ఎఫ్ సిబ్బంది అజయ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అజయ్‌ని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. -
శంషాబాద్‌లో 1.3 కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1.3 కిలోల బంగారం బయటపడింది. ఈ రోజు ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళ దగ్గర భారీగా బంగారం లభించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు 1.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదనపు వివరాల కోసం మహిళను విచారిస్తున్నారు.