SpiceJet airlines
-
మూడు నెలల వేతన బకాయిలు చెల్లింపు
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ గురువారం ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ నెల 16 నుంచి 18 వరకు కంపెనీ క్యూఐపీ ద్వారా నిధులు సేకరించింది. దాంతో రూ.3,000 కోట్లు సమీకరించింది.సంస్థ ఉద్యోగులకు జూన్ నుంచి వేతనాలు చెల్లించడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. దాంతోపాటు ఏప్రిల్ 2020-ఆగస్టు 2023 మధ్య ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.220 కోట్ల టీడీఎస్(మూలం వద్ద పన్ను మినహాయింపు)ను చెల్లించలేదనే వాదనలున్నాయి. ఈ వార్తలు వచ్చిన కొన్ని రోజులకే కంపెనీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా నిధులు సేకరించేందుకు పూనుకుంది. ఫలితంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్యూఐబీ) నుంచి రూ.3,000 కోట్లను సమీకరించింది. ఈ సొమ్ములోని కొంత మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలు, టీడీఎస్ చెల్లించేందుకు వినియోగించినట్లు కొందరు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!కంపెనీ ప్రకటించిన క్యూఐపీలో దాదాపు 87 దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొని ఈ ఇష్యూను సబ్స్క్రయిబ్ చేసుకున్నాయి. ఇదిలా ఉండగా, డీజీసీఏ డేటా ప్రకారం స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా తగ్గిపోతోంది. జనవరిలో ఈ వాటా 5.6 శాతంగా ఉంది. క్రమంగా ఇది తగ్గిపోతూ ఆగస్టులో 2.3 శాతానికి చేరింది. 2021లో ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా 10.5 శాతంగా నమోదవ్వడం గమనార్హం. సంస్థ పరిధిలోని విమానాల సంఖ్య 2019లో 74గా ఉండేది. 2024లో వీటి సంఖ్య 28కి చేరింది. -
స్పైస్‌జెట్ నిర్లక్ష్యం.. విమానం వద్దే ప్రయాణికుల పడిగాపులు!
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయంలో దిగాక బస్సు ఏర్పాటు చేయకపోవటం వల్ల సుమారు 45 నిమిషాల పాటు అక్కడే నిరీక్షించారు. ఎంతకూ బస్సు రాకపోవటంతో చాలా మంది తమ లగేజీని పట్టుకుని కాలినడకన టర్మినల్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 186 మంది ప్రయాణికులతో వెళ్లిన స్పైస్‌జెట్ విమానం శనివారం రాత్రి 11.24 గంటలకు హస్తినలో దిగింది. వెంటనే ఓ బస్సు వచ్చి కొంత మందిని టర్మినల్‌కు తీసుకెళ్లింది. మిగిలిన వారు సుమారు 45 నిమిషాలు అక్కడే వేచి ఉన్నారు. బస్సు రాకపోవటంతో అక్కడి నుంచి టర్మినల్ వైపు నడక ప్రారంభించారు. 11 నిమిషాలు నడిచాక 12.20కి బస్సు వచ్చి వారిని తీసుకెళ్లినట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు. ఈ విషయంపై స్పైస్‌జెట్ వివరణ ఇచ్చింది. బస్సు రావటానికి కాస్త ఆలస్యం అయిందని, ఆ తర్వాత విమానం వద్ద ఉన్న ప్రయాణికులతో పాటు నడక ప్రారంభించిన వారందరినీ బస్సులో ఎక్కించుకుని టర్మినల్‌కు చేర్చినట్లు తెలిపింది. ‘మా సిబ్బంది ఎన్నిసార్లు సూచించినా కొందరు టర్మినల్ వైపు నడిచారు. బస్సులు వచ్చే సరికి కొంత దూరం వెళ్లారు. వారితో పాటు మిగిలిన వారందరిని బస్సుల్లో టర్మినల్ చేర్చాం.’ అని పేర్కొంది స్పైస్‌జెట్. How often do you see this happening at T3 of the Indira Gandhi International Airport in New Delhi? @flyspicejet kept up cooked up for 45 minutes after announcing “early arrival” of 6 mins at 11:24pm on the SG 8108 Hyd-Delhi. They parked the flight really far away with no buses. pic.twitter.com/sgkR9gXs3Y — Lasya Nadimpally (@nlasya) August 6, 2022 ఇదీ చదవండి: ‘ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలం’.. ఇస్రో అధికారిక ప్రకటన -
స్పైస్‌జెట్‌కు షాక్.. DGCA నోటీసులు
న్యూఢిల్లీ: వరుస ఘటనలో ఎమర్జెన్సీల్యాండింగ్‌లు.. ప్రయాణికులను ఇబ్బందిపెడుతుండడంతో పాటు వార్తల్లో నిలుస్తున్న స్పైస్‌జెట్ సంస్థకు షాక్ తగిలింది. పౌర విమానయాన సంస్థల నియంత్రణ విభాగం డీజీసీఏ స్పైస్‌జెట్ సంస్థకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత 18 రోజుల్లో ఎనిమిది విమానాల్లో సాంకేతిక లోపాల సమస్యలు తలెత్తాయి. ఈ లోపాల ఘటనలపై స్పైస్‌జెట్‌ను పూర్తిస్థాయి వివరణ కోరింది డీజీసీఏ. జూన్ 19న రెండు ఘటనలు, జూన్ 25న ఒకటి, జులై 2న మరోక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవిగాక వరుసగా చోటు చేసుకున్నాయి. ఇక మంగళవారం ఢిల్లీ-దుబాయ్ విమానం సాంకేతికలోపంతో కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ స్పైస్‌జెట్.. నష్టాల్లో కొనసాగుతోంది. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల మధ్య రూ.316 కోట్లు, రూ.934 కోట్లు, రూ.998 కోట్లు.. వరుసగా నష్టాలు చవిచూసింది. చదవండి: ఈ స్పైస్‌జెట్‌కు ఏమైంది? -
స్పైస్‌జెట్‌కు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం పెరిగి రూ. 729 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 593 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 705 కోట్ల నుంచి రూ. 1,266 కోట్లకు జంప్‌చేసింది. అయితే నిర్వహణ వ్యయాలు సైతం రూ. 1,298 కోట్ల నుంచి రూ. 1,995 కోట్లకు ఎగశాయి. కోవిడ్–19 ప్రభావం నేపథ్యంలో గత ఐదు క్వార్టర్లుగా పలు సవాళ్లమధ్య కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ పేర్కొన్నారు. -
80% విమానాలకు ఓకే- షేర్లకు రెక్కలు
ముంబై, సాక్షి: కోవిడ్-19కు ముందున్నస్థాయిలో 80 శాతంవరకూ దేశీ సర్వీసుల నిర్వహణకు ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎయిర్‌లైన్స్ కంపెనీలు తమ సామర్థ్యంలో 80 శాతం విమానాలను నిర్వహించేందుకు వీలు చిక్కింది. ఇందుకు అనుమతిస్తూ పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ కట్టడికి లాక్‌డవున్ విధించిన తదుపరి మే 25న దేశీయంగా విమాన సర్వీసులకు ప్రభుత్వం అనుమతించింది. రెండు నెలల తరువాత సర్వీసులు ప్రారంభమైనప్పుడు 30,000 మంది ప్రయాణికులు నమోదుకాగా.. నవంబర్ 30కల్లా ఈ సంఖ్య 2.52 లక్షలను తాకినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో ప్రయివేట్ రంగ లిస్టెడ్ కంపెనీలు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్పైస్‌జెట్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పుట్టింది. దీంతో ఈ కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండిగో.. గో ఇండిగో బ్రాండు విమానయాన సర్వీసుల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 1,744 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,747 వరకూ ఎగసింది. వెరసి 52 వారాల గరిష్టాన్ని తాకింది. దేశీయంగా మే నెలలో 33 శాతం, జూన్‌లో 45 శాతం వరకూ విమానాల నిర్వహణకు అనుమతించిన ప్రభుత్వం తాజాగా 70 శాతం నుంచి 80 శాతానికి పరిమితిని పెంచడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. స్పైస్‌జెట్ దేశీ సర్వీసులలో 80 శాతం వరకూ విమానాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో స్పైస్‌జెట్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9.3 శాతం దూసుకెళ్లి రూ. 89 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 92 వరకూ ఎగసింది. ఇక రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా కల్రాక్ క్యాపిటిల్ కన్సార్షియం మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇటీవల జెట్ ఎయిర్వేస్ కౌంటర్ సైతం ర్యాలీ బాటలో సాగుతున్న విషయం విదితమే. వచ్చే(2021) వేసవిలో యూరోపియన్ దేశాలతోపాటు.. పశ్చిమాసియా నగరాలకు జెట్ ఎయిర్వేస్ సర్వీసులను ప్రారంభించే వీలున్నట్లు అంచనాలు వెలువడటంతో జెట్ ఎయిర్వేస్ షేరు నవంబర్ 5న రూ. 79 వద్ద ఏడాది గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షేరు 1.5 శాతం క్షీణించి రూ. 69 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్నజెట్ ఎయిర్వేస్ షేరు 8 నెలల్లో 438 శాతంపైగా దూసుకెళ్లడం గమనార్హం! -
సిబ్బంది దురుసు ప్రవర్తన; ప్రగ్యా ఫిర్యాదు
భోపాల్ : బీజేపీ నేత, భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ స్పైస్‌జెట్ విమానంలో సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని సంస్ధ డైరక్టర్‌కు ఆదివారం భోపాల్ విమానాశ్రయంలో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్నస్పైస్జెట్ విమానం ఎక్కారు. అయితే విమాన సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. తాను బుక్ చేసుకున్న సీటుని తనకు కేటాయించలేదని విమానాశ్రయ డైరక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు తనకు సీటు ఇవ్వలేదన్న కోపంతో విమానం ల్యాండిండ్ అవుతున్న సమయంలో నిరసనకు దిగినట్లు మాకు సమాచారం అందింది. దీంతో డైరక్టర్ అనిల్ విక్రమ్ రంగంలోకి దిగి ప్రగ్యాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.'ప్రగ్యా ఠాకూర్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించాం. దీనిపై సిబ్బందిని వివరణ అడిగి చర్యలు తీసుకుంటామని ' అనిల్ విక్రమ్ తెలిపారు. 'ప్రగ్యా ఠాకూర్ వీల్‌చైర్‌తోనే విమానాన్ని ఎక్కారు. భద్రతా కారణాల రిత్యా వీల్‌చైర్‌ను అనుమతించబోమని తెలిపాం. అందుకే ఆమెకు కేటాయించిన సీటులో ఆమెను కూర్చోవడానికి నిరాకరించాం. దీంతో ఆమె విమానంలోనే నిరసనకు దిగారని' అని సిబ్బంది వాపోయారు. అయితే ఈ కేసును సోమవారం పరిశీలించనున్నట్లు అనిల్ విక్రమ్ ఒక ప్రకటనలో తెలిపారు.(చదవండి :‘మనోభావాలు దెబ్బతింటే మన్నించండి’) -
ఎయిర్ హోస్టెస్‌కు వేధింపులు
శంషాబాద్: ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఓ ఎయిర్‌హోస్టెస్ వేధింపులకు గురయ్యారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అజయ్ రెడ్డిగా గుర్తించారు. అజయ్ రెడ్డిపై ఎయిర్‌హోస్టెస్, విమాన పైలట్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన శంషాబాద్‌లోని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టులో విమానం దిగగానే సీఐఎస్ఎఫ్ సిబ్బంది అజయ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అజయ్‌ని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. -
ఆ ఆరోపణలపై స్పైస్‌జెట్ స్పందించింది
చెన్నై : స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న ‘నో ఫ్రిల్స్ కారియర్’కు వ్యతిరేకంగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్‌లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాలసీలో భాగంగా ఎయిర్‌లైన్ అధికారులు వారి భద్రతా సిబ్బంది చేత ఇబ్బందికరరీతిలో తమపై వ్యక్తిగత తనిఖీలు నిర్వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌హోస్టెస్ చేస్తున్న ఈ నిరసనలపై స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. కొన్ని దొంగతనం కేసులు గుర్తించామని, ఈ మేరకే తాము క్రమశిక్షణ చర్యలు ప్రారంభించామని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఈ తనిఖీలు కేవలం సాధారణ ఏవియేషన్ ఇండస్ట్రి చేపడుతున్న ప్రక్రియ మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా పలు ఇండస్ట్రీస్ ఈ మేరకు తనిఖీలు చేపడుతూ ఉన్నాయని చెబుతోంది. అయితే ఈ తనిఖీలు తమకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయంటూ ఎయిర్‌హోస్టెస్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ పట్ల భద్రతా సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు అత్యాచారం, వేధింపుల కంటే తక్కువగా ఉందా అంటూ ఎయిర్‌హోస్టెస్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలపై నేడు స్పైస్‌జెట్ అధికారులు, ఎయిర్‌హోస్టెస్‌తో ఓ మీటింగ్ కూడా నిర్వహించారు. -
విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్: తిరుపతికి వెళ్తున్న స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎస్జీ 1094 విమానాన్ని గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఉదయం 9.35 గంటలకు శంషాబాద్ నుంచి టేకాఫ్ తీసుకున్న కాసేపటికి విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పది నిమిషాల వ్యవధిలోనే సమస్యను గుర్తించిన పైలట్ అప్రమత్తమై శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. అధికారుల సూచనలతో 9.50 గంటలకు విమానాన్ని తిరిగి శంషాబాద్లోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో మొత్తం 170 మంది ప్రయాణికులున్నారు. సాంకేతిక సమస్యను సవరించిన అనంతరం 11.30 గంటలకు తిరుపతికి విమానం బయలుదేరింది. -
ఎయిర్‌పోర్టులో క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్!
ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శంషాబాద్(రాజేంద్రనగర్): అనుమతి లేకుండా విమానాశ్రయంలో ప్రయాణికులను తాము ఎక్కించుకుంటే.. ఈ సమాచారాన్ని ట్రాఫిక్ పోలీసులకు అందిస్తున్నాడని ఓ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవర్‌ను ఐదుగురు ప్రైవేట్ డ్రైవర్లు కిడ్నాప్ చేసినట్లుగా కలకలం రేగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. రాజేంద్రనగర్ సర్కిల్ గగన్‌పహాడ్ బస్తీకి చెందిన జావెద్ అలీ (30) విమానాశ్రయంలో స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన కారును నడిపిస్తున్నాడు. అనుమతులు లేకుండా విమానాశ్రయంలో ప్రయాణికులను ఎక్కించుకుంటున్న విషయమై ట్రాఫిక్ పోలీసులకు చెబుతున్నాడనే అనుమానంతో బేగంపేట, షాహిన్‌నగర్ బస్తీలకు చెందిన ఐదుగురు ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్లు ఇబ్రహీం(28), తౌఫిక్(30), అఫ్రోజ్(28), అల్తాఫ్(29), ఇబ్రహీం(30) గురువారం మధ్యాహ్నం గోకార్టింగ్ రేస్ వద్ద జావెద్ అలీని కలిశారు. ట్రాఫిక్ పోలీసులకు ఎందుకు సమాచారం అందిస్తున్నావని అతనితో వాగ్వాదానికి దిగారు. షాహిన్ నగర్‌కు వెళ్లి మాట్లాడుకుందామని తీసుకెళ్లారు. అక్కడ తనని ఓ ఇంట్లో నిర్బంధించారని, దీంతో తాను తప్పించుకుని వచ్చానని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు శనివారం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాము అతడితో చర్చించామే తప్ప, కిడ్నాప్‌నకు పాల్పడలేదని డ్రైవర్లు తెలిపారు.