DGCA Issues Show Cause Notice To SpiceJet Over Faulty Air Services - Sakshi
Sakshi News home page

వరుస ఘటనలపై స్పైస్‌జెట్‌కు షాక్‌.. DGCA నోటీసులు

Published Wed, Jul 6 2022 2:46 PM | Last Updated on Wed, Jul 6 2022 3:14 PM

DGCA issues show cause notice to SpiceJet - Sakshi

న్యూఢిల్లీ: వరుస ఘటనలో ఎమర్జెన్సీల్యాండింగ్‌లు.. ప్రయాణికులను ఇబ్బందిపెడుతుండడంతో పాటు వార్తల్లో నిలుస్తున్న స్పైస్‌జెట్‌ సంస్థకు షాక్‌ తగిలింది. పౌర విమానయాన సంస్థల నియంత్రణ విభాగం డీజీసీఏ స్పైస్‌జెట్‌ సంస్థకు బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 

గత 18 రోజుల్లో ఎనిమిది విమానాల్లో సాంకేతిక లోపాల సమస్యలు తలెత్తాయి. ఈ లోపాల ఘటనలపై స్పైస్‌జెట్‌ను పూర్తిస్థాయి వివరణ కోరింది డీజీసీఏ. జూన్‌ 19న రెండు ఘటనలు, జూన్‌ 25న ఒకటి, జులై 2న మరోక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవిగాక వరుసగా చోటు చేసుకున్నాయి. ఇక మంగళవారం ఢిల్లీ-దుబాయ్‌ విమానం సాంకేతికలోపంతో కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ అయిన సంగతి తెలిసిందే.

గత మూడేళ్లుగా ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌ సంస్థ స్పైస్‌జెట్‌.. నష్టాల్లో కొనసాగుతోంది. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల మధ్య రూ.316 కోట్లు, రూ.934 కోట్లు, రూ.998 కోట్లు.. వరుసగా నష్టాలు చవిచూసింది. 

చదవండి: ఈ స్పైస్‌జెట్‌కు ఏమైంది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement