ShowCause notices
-
కాంగ్రెస్ గ్యారెంటీలపై సొంత ఎమ్మెల్యే నుంచే వ్యతిరేకత!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు.. సొంత ప్రభుత్వాన్నే ఇరకాటంలో పడేశారు. ఎన్నికల హామీల్లో కొన్నింటిని రద్దు చేయాలంటూ సదరు ఎమ్మెల్యే చేసిన బహిరంగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలను కర్ణాటక కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. ఆ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు.విజయనగర ఎమ్మెల్యే హెచఆర్ గవియప్ప.. తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఎన్నికల హామీల వల్ల జనాలకు ఇళ్ల సదుపాయం కల్పించలేకపోతున్నామని, కాబట్టి వాటిలో కొన్నింటిని రద్దుచేయాలని సీఎం సిద్ధరామయ్యను పబ్లిక్‌గా కోరారాయన.ఉచిత పథకాల వల్ల ఇళ్ల నిర్మాణ పథకం సజావుగా ముందుకు సాగడం లేదు. ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రిగారికి విజ్ఞప్తి చేసేది ఒక్కటే. రెండు నుంచి 3 గ్యారెంటీ స్కీంలను తీసేయాలని కోరుతున్నా. అవి లేకపోయినా పెద్దగా ఫర్వాలేదు. తద్వారా కొందరికైనా ఇళ్లను నిర్మించి ఇవ్వగలం. ఇక నిర్ణయం సీఎంకే వదిలేస్తున్నా. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అన్నారు.ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಸಕರಿಂದಲೇ ವಿರೋಧ - ಒಂದೆರಡು ಗ್ಯಾರಂಟಿ ಸ್ಕೀಂ ತೆಗೆಯುವಂತೆ ಸಿಎಂಗೆ ಮನವಿ ಮಾಡ್ತೀವಿ ಎಂದ ಶಾಸಕ ಗವಿಯಪ್ಪ#CongressGuarantee #Congress #Gaviyappa #Bellary pic.twitter.com/3fsw27C1HD— soumya Sanatani (Modi Ka Parivar) (@NaikSoumya_) November 26, 2024అయితే .. ఎమ్మెల్యే వాదనను డీకే శివకుమార్ కొట్టిపారేశారు. ఎన్నికల హామీల అమలులో వెనకడుగు వేయబోయేది లేదని స్పష్టం చేశారాయన. ఆయన ఇలా చేయాల్సింది కాదు. ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేస్తాం. ఎలాంటి పథకాన్ని ఆపే ప్రసక్తే లేదు. మేం కర్ణాటక ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. దానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన సహించేది లేదు అని శివకుమార్ పేర్కొన్నారు.గవియప్ప సొంత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో తన నియోజకవర్గానికి నిధుల విషయంలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపించారాయన. అయితే.. ఆ ఆరోపణలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సిరాజ్ షేక్ ఖండించారు. అంతేకాదు.. ఆరెస్సెస్‌తో ఉన్న అనుబంధమే గవియప్పతో అలా మాట్లాడిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. -
ఓలాకు మరో దెబ్బ! షోకాజ్ నోటీసు జారీ
ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి.ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా ప్రతి సంస్థ స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు.🚨🚨 Sources to CNBC-TV18 ⬇️⚡Central Consumer Protection Authority (CCPA) issues showcause notice to @OlaElectric for class action⚡ Ola Electric given 15 days to respond to CCPA showcause notice on service issues and more⚡ #OlaElectric faces more than 10,000 complaints… pic.twitter.com/fNbdBLsQQq— CNBC-TV18 (@CNBCTV18News) October 7, 2024ఇదీ చదవండి: పేరుకుపోతున్న వాహన నిల్వలుఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. -
కోల్‌కతా ఉదంతం: ప్రభుత్వ అనుబంధ స్కూల్స్‌కు నోటీసులు
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనను దేశం నలుమూలల నుంచి ప్రజలు, మెడికల్ కాలేజీ విద్యార్థులు, డాక్టర్లు తీవ్రంగా ఖండించి పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఘటన జరిగిన పశ్చిమ బెంగాల్లో మరింత అధికంగా చిన్నాపెద్ద తేడా లేకుండా నిరసనల్లో పాల్గొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా బెంగాల్ ప్రభుత్వం పలు ప్రభుత్వ అనుబంధ స్కూల్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పలు స్కూల్స్ టీచర్లు, విద్యార్థులతో నిరసనలు చేపట్టాయని పేర్కొంది. పాఠశాలలో విద్యార్థులకు క్లాసులు జరగాల్సిన సమయంలో ఇలా నిరసనల్లో వారిని పాల్గొనేలా చేయటంపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.హౌరా, బంకురా, తూర్పు మిడ్నాపూర్, పశ్చిమ మిడ్నాపూర్‌లోని పలు ప్రభుత్వ అనుబంధ స్కూల్స్‌కు నోటీసులు ఇచ్చింది. అందులో హౌరాలోని బలుహతి ఉన్నత పాఠశాల, బలుహతి బాలికల ఉన్నత పాఠశాల, బంట్ర రాజలక్ష్మి బాలికల పాఠశాలు ఉన్నాయి. ‘‘ 23.08.2024న స్కూల్స్‌లో క్లాసులు జరగాల్సిన సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో.. నిరసన ర్యాలీ నిర్వహించినట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలా చేయటం సరికాదు.. బాలల హక్కుల ఉల్లంఘన’’ అని నోటీసుల్లో తెలిపింది.ఇదిలా ఉండగా.. ఈ కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసిన సీబీఐ.. ఇవాళ ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. -
ఉద్యోగం నుంచి తొలగిస్తే.. పురుగుల మందే దిక్కు
పులివెందుల: తమను ఉద్యోగం నుంచి తొలగిస్తే పురుగుల మందు తాగి చనిపోతామంటూ ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఇద్దరు చిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేసిన ఘటన వైఎస్సార్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో నియమితులై పులివెందుల మార్కెట్‌యార్డులో పనిచేస్తున్న నలుగురిని, సింహాద్రిపురం మార్కెట్‌యార్డులో ముగ్గురిని తొలగించేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారన్న ఆందోళనతో పులివెందుల మార్కెట్‌యార్డులో అటెండర్‌గా పనిచేస్తున్న అజార్, సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న మహేశ్వరరెడ్డి బుధవారం స్థానిక మార్కెట్‌యార్డులో పురుగుమందు డబ్బాలు, పెట్రోలు తీసుకెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటనాస్థలానికి వచ్చిన మీడియాతో అజార్, మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతల ఆదేశాలతో.. సరైన కారణాలు చూపకుండా ఇప్పటికే అధికారులు తమకు రెండు షోకాజ్ నోటీసులు అందజేశారన్నారు. ఆఫీసులో రిజిష్టర్‌ను దాచిపెట్టి తాము సంతకాలు పెట్టేందుకు వీలులేకుండా చేస్తున్నారని చెప్పారు. తమకు జీవనాధారం అయిన ఈ ఉద్యోగాలను తీసేస్తే.. ఆత్మహత్యలే శరణ్యమని విలపించారు. దీంతో మార్కెట్‌యార్డు సెక్రటరీ శ్రీధర్‌రెడ్డి అక్కడికి చేరుకుని ‘మీరు కోర్టును ఆశ్రయించారు కాబట్టి.. కోర్టు ద్వారా వచ్చే నిర్ణయాన్ని బట్టి తాము చర్యలు తీసుకుంటాం’ అని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. దీనిపై సెక్రటరీని వివరణ కోరగా తాము ఎవర్ని విధుల నుంచి తొలగించలేదని తెలిపారు. -
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై పన్ను పిడుగు
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై పన్ను పిడుగు పడింది. పన్ను ఎగవేతకు సంబంధించి రూ.లక్ష కోట్ల మేర చెల్లించాలని కోరుతూ జీఎస్టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అక్టోబర్ 1 తర్వాత భారత్‌లో నమోదు చేసుకున్న విదేశీ గేమింగ్ కంపెనీలకు సంబంధించి డేటా లేదన్నారు. విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే గేమింగ్ కంపెనీలు, జీఎస్టీ చట్టం కింద నమోదు చేసుకోవడాన్ని అక్టోబర్ 1 నుంచి కేంద్రం తప్పనిసరి చేసింది. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో బెట్టింగ్ పూర్తి విలువపై 28 శాతం పన్ను వసూలు చేస్తామని జీఎస్టీ కౌన్సిల్ ఆగస్ట్‌లోనే స్పష్టం చేయడం గమనార్హం. డ్రీమ్11, డెల్టా కార్ప్ తదితర సంస్థలు భారీ మొత్తంలో పన్ను చెల్లింపులకు సంబంధించి గత నెలలో షోకాజు నోటీసులు అందుకోవడం తెలిసిందే. గేమ్స్క్రాఫ్ట్ సంస్థ రూ.21,000 కోట్ల పన్ను ఎగవేసిందంటూ గతేడాది జీఎస్టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. దీంతో సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, సానుకూల ఆదేశాలు పొందింది. దీనిపై కేంద్ర సర్కారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు డ్రీమ్11 సంస్థ రూ.40,000 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి షోకాజు నోటీసులు అందుకుంది. డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు రూ.23,000 కోట్లకు సంబంధించి షోకాజు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై డెల్టాకార్ప్ బోంబే హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. న్యాయస్థానాలు ఇచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా పన్ను వసూళ్లు ఆధారపడి ఉన్నాయి. -
జీఎస్టీ హీట్: దేశీయ అతిపెద్ద కార్ల కంపెనీకి షోకాజ్‌నోటీసులు
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, బీమా , తదితర కంపెనీలు షోకాజ్ నోటీసుల తరువాత తాజాగా ఆటోమొబైల్ మేజర్ మారుతీ సుజుకి ఇండియాకి జీఎస్టీ షాక్ తగిలింది. వడ్డీ , పెనాల్టీలతో పాటు రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికన నిర్దిష్ట సేవలపై పన్ను బాధ్యతకు సంబంధించి రూ. 139.3 కోట్లు చెల్లించాలంటూ జీఎస్టీ అధికారులు కంపెనీకి షోకాజ్ నోటిసులు పంపించారు. అయితే దీనిపై స్పందించిన మారుతి ఇప్పటికే చెల్లించిన పన్నుకు, 2017 జూలై -2022 ఆగస్టు వరకు నిర్దిష్ట సేవలపై రివర్స్ ఛార్జ్ విషయానికి సంబంధించిన నోటీసు అని కంపెనీ తెలిపింది. "అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు షోకాజ్ నోటీసుకు తమ జవాబును ఫైల్ చేయనున్నామని, అలాగే ఈ నోటీసు తమ ఆర్థిక, కార్యకలాపాలు లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ సమాచారాన్ని అందించింది. అలాగే 2006 జూన్ నుండి మార్చి 2011 మధ్య కాలంలో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాఖలు చేసిన అప్పీళ్లు కొట్టివేస్తూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుండి తమకు అనుకూలమైన ఉత్తర్వు లభించిందని కంపెనీ తెలిపింది. దీనిపై జరిమానాను కూడా కోర్టు తొలగించినట్టు వెల్లడించింది. డిపార్ట్మెంట్ అప్పీల్లో పెనాల్టీ తోకలిపి మొత్తం పన్ను రూ. 57.2 కోట్లు. కాగా మారుతీ ఈ ఏడాది ఆగస్టు అత్యధిక నెలవారీ అమ్మకాల్లో1,89,082 యూనిట్లతో కీలక మైలురాయిని సాధించింది. వివిధ సబ్-సెగ్మెంట్ మోడల్‌లతో సహా దేశీయ విక్రయాలలో 1,58,678 యూనిట్లను నమోదు చేసింది. తన మొత్తం లైనప్‌లో పూర్తి స్వదేశీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ప్యాసింజర్ వెహికల్ (PV) మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతి ఇప్పటికీ కొన్ని కీలకమైన భాగాలు, ముఖ్యంగా సెమీకండక్టర్ చిప్‌ల దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పటికీ, దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీపై పట్టు సాధిస్తే,విదేశీ మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని కంపెనీ విశ్వసిస్తోంది. -
వేల కోట్ల జీఎస్టీ ఎగవేత: అధికారుల షాక్..కోర్టుకెక్కిన డ్రీమ్11
ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ (RMG) కంపెనీలకు పన్ను అధికారులు భారీ షాక్ ఇచ్చారు. రూ. 55 వేల కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ పలు కంపెనీలకు ప్రీ-షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దేశంలో అత్యంత విలువైన పరోక్ష పన్ను నోటీసు అని భావిస్తున్నారు. ముఖ్యంగా రూ.66,500 కోట్ల విలువైన ఫాంటసీ స్పోర్ట్స్ మేజర్ డ్రీమ్11కి రూ. 25 వేల కోట్ల పన్ను ఎగవేత నోటీసులు అందించడం కలకలం రేపింది. ఈ షో కాజ్ నోటీసు నేపథ్యంలో డ్రీమ్11 బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ అనేక ఇతర ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు సుమారు రూ. 55,000 కోట్ల పన్ను డిమాండ్‌ను పెంచుతూ ప్రీ-షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందులో, ముంబైకి చెందిన వ్యాపారవేత్త హర్ష్ జైన్, అతని స్నేహితుడు కో-ఫౌండర్ భవిత్ షేత్‌కు చెందిన డ్రీమ్11కి రూ. 25000 కోట్ల అతిపెద్ద నోటీసు ఇవ్వడం కలకలం రేపింది. వాస్తవానికి ఇది దాదాపు రూ. 40,000 కోట్లుకు పై మాటేనని పలు మీడియాలు నివేదించాయి. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి డ్రీమ్ స్పోర్ట్స్ నిరాకరించింది. డ్రీమ్ 11కు హర్ష్ సీఈవోగా, భవిత్ సీఓఓగా ఉన్నారు. ఇక ప్లే గేమ్స్24x7 రూ. 20,000 కోట్లు, హెడ్ డిజిటల్ వర్క్స్ రూ. 5,000 కోట్లు మేర ఎగవేసినట్టుగా నోటీసులందాయి. తాజా పరిణామంతో డ్రీమ్ 11 (స్పోర్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్) మాతృ సంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ ఈ షోకాజ్ నోటీసులను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. డ్రీమ్11 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,841 కోట్ల నిర్వహణ ఆదాయంపై రూ.142 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మరోవైపు రూ. 21,000 కోట్ల మేర పన్ను ఎగవేతకు ఆరోపణలెదుర్కొంటున్న గేమ్స్క్రాఫ్ట్ కేసులో జీఎస్టీ నోటీసును రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై రానున్న వారాల్లో సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. అంతేకాదు పన్ను ఎగవేత ఆరోపణలపై 40కి పైగా స్కిల్-గేమింగ్ కంపెనీలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు అండ్ కస్టమ్స్ (CBIC) షోకాజ్ నోటీసులు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమీక్షలో ఆన్లైన్ రియల్ మనీ గేమ్స్‌పై జీఎస్టీని18 శాతంనుంచి 28 శాతానికి పెంచింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని కౌన్సిల్, అక్టోబర్ 1, 2023 నాటికి కొత్త పన్ను రేట్లను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను కోరింది. ఈ నిర్ణయాన్ని అమలును ఆరు నెలల తర్వాత సమీక్షించడానికి కూడా అంగీకరించింది. అలాగే ఆగస్ట్ 11న వర్షాకాల సమావేశాల చివరి రోజు, ఆర్థిక మంత్రి సీతారామన్ సీజీఎస్టీ చట్టాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. ఉభయ సభల ఆమోదం తరువాత దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆగస్టు 19న సవరణలకు ఆమోదం తెలిపారు. తదనంతరం, హర్యానా, గోవా, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమ తమ రాష్ట్ర GST చట్టాలకు ఇదే విధమైన సవరణలను ఆమోదించాయి. -
డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్! తనిఖీల్లో బండారం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 48 ఏరియా ఆసుపత్రులు, 108 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 33 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో ఎండీ, ఇతర సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వైద్యం చేస్తుంటారు. ఆర్థో, కార్డియాక్, గైనిక్, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గ్యాస్ట్రో వంటి ప్రత్యేక వైద్యం అందుబాటులో ఉంటుంది. కొందరు స్పెషలిస్ట్ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు హాజరుకాకుండా హైదరాబాద్‌లోనూ, తాము పనిచేసే సమీప పెద్ద నగరాల్లోనూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లినప్పుడు అనేకచోట్ల డాక్టర్లు విధులకు రాకపోవడాన్ని గుర్తించారు. ఈ మేరకు 50 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు. హాజరైనట్లుగా తప్పుడు పద్ధతులు కొన్ని ఆసుపత్రుల్లో ఫేస్ రికగ్నేషన్ మెషీన్, కొన్నిచోట్ల వేలిముద్రల మెషీన్లను వైద్యవిధాన పరిషత్ ఏర్పాటు చేసింది. అయితే ఫేస్ రికగ్నేషన్ మెషీన్లో కొందరు డాక్టర్లు ముఖం కాకుండా ఫొటోలను ఫీడ్ చేశారు. ఆ ఫొటోను ఆ ఆసుపత్రిలో పనిచేసే వైద్యసిబ్బందికి ఇచ్చి, రోజూ ఫొటోను ఫేస్ రికగ్నేషన్ మెషీన్ ముందు పెట్టి హాజరు వేయిస్తుంటారు. కొందరు డాక్టర్లయితే వారాల తరబడి కూడా ఆసుపత్రుల ముఖం చూడటంలేదని తేలింది. కానీ, హాజరైనట్లుగా మెషీన్లో నమోదవుతుంది. కొన్నిచోట్ల తమకు బదులుగా అక్కడి సిబ్బంది వేలిముద్రలను మెషీన్లలో ఫీడ్ చేయించారు. సిబ్బంది వేలిముద్రల సహాయంతో హాజరైనట్లుగా నమోదు చేయించుకుంటున్నారు. కొందరు డాక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల కుటుంబసభ్యులకు వైద్యం చేస్తూ మెప్పు పొందుతున్నారు. ఇటువంటి వారిని ఏమీ అనలేని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక జిల్లాలో ఒక మహిళా ఎంబీబీఎస్ డాక్టర్ వారానికి ఒకసారి వచ్చి తన వ్రస్తాలను మార్చి ఇతర వ్రస్తాలను ధరించి ఫొటోలు దిగి బయోమెట్రిక్ అటెండెన్స్‌లో ఫీడ్ చేసిన విషయం వెలుగు చూసింది. ఈ డాక్టర్‌పై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయతి్నంచగా కొందరు మంత్రుల ఆఫీసుల నుంచి ఫోన్లు చేసి అడ్డుకున్నట్లు తెలిసింది. మరోవైపు కొన్ని సంఘాలు కూడా ఇటువంటి డాక్టర్లకు వంతపాడుతున్నాయని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో వైద్యుల బండారం బట్టబయలు ఆయన పేరు డాక్టర్ దేవేందర్ (పేరు మార్చాం). హైదరాబాద్ సమీపంలోని ఒక ఏరియా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుడు. ఆయనకు నగరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నారు. కా నీ, ఆయన రోజూ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నట్లుగా హాజరుంటుంది. బయోమెట్రిక్ హాజరున్నా తన మాయాజాలాన్ని ఉపయోగించారు. ఫేస్ రికగ్నిషన్ సందర్భంగా తన ముఖాన్ని కాకుండా ఫొటోను బయోమెట్రిక్ మెషీన్లో ఫీడ్ చేయించాడు. అతను వెళ్లకున్నా సిబ్బంది అతని ఫొటోను బయోమెట్రిక్‌లో హాజరుకోసం ఉపయోగిస్తున్నారు. మరో డాక్టర్ శ్రవణ్ కుమార్ (పేరు మార్చాం). నిజామాబాద్ జిల్లాలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అతను వారానికి ఒకరోజు ఆసుపత్రికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్తాడు. కానీ, అతను రోజూ వచి్చనట్లుగా హాజరుంటుంది. అతను వేలిముద్ర హాజరును దిద్దుబాటు చేశాడు. తన వేలి ముద్ర బదులుగా అక్కడ రోజూ వచ్చే ఇతర సిబ్బంది వేలిముద్రను ఫీడ్ చేశాడు. దీంతో అతను వెళ్లకుండానే హాజరుపడుతుంది. ఆమె పేరు డాక్టర్ రవళి(పేరు మార్చాం). రాష్ట్రంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తారు. ప్రతీ డాక్టర్ తాను పనిచేసినట్లుగా రోజూ ఫొటో తీసి అప్లోడ్ చేయాలని ఆ జిల్లాలో నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆమె మాత్రం ఒక రోజు వచ్చి తన వ్రస్తాలను ఐదారుసార్లు మార్చి ఇతర వస్త్రాలను ధరించడం, హెయిర్ స్టైల్‌ను కూడా మార్చి రోగులను చూసినట్లు ఫొటోలు దిగుతారు. వారంలో మిగిలిన రోజులు రాకుండానే ఆ ఫొటోలను అప్లోడ్ చేస్తారు. (చదవండి: సీబీఐ ఛాయ్ బిస్కెట్ తినడానికి రాలేదు.. కవితపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్) -
కేఆర్ఐపై సెబీ కొరడా
న్యూఢిల్లీ: అనధికార పెట్టుబడి సలహాలు ఇస్తున్న కారణంగా నాలెడ్జ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(కేఆర్ఐ)తోపాటు సంస్థ యజమాని ఆయుష్ ఝవార్పై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కన్నెర్ర చేసింది. ఆరు నెలలపాటు సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. కేఆర్ఐ, ఆయుష్లకు సెబీ 2021 జులైలో షోకాజ్ నోటీసులను జారీ చేసింది. తదుపరి తాజా ఆదేశాలు జారీ చేసింది. సెబీ నుంచి సర్టిఫికెట్ పొందకుండానే కేఆర్ఐ, ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజరీ సర్వీసులను అందించడం ద్వారా అడ్వయిజరీ నిబంధనలను అతిక్రమించాయి. దీంతో సెబీ తాజా చర్యలను చేపట్టింది. సలహాల ద్వారా ఫీజు రూపేణా ఆర్జించిన రూ. 27.57 లక్షలను 3 నెలల్లోగా వాపస్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. -
స్పైస్‌జెట్‌కు షాక్.. DGCA నోటీసులు
న్యూఢిల్లీ: వరుస ఘటనలో ఎమర్జెన్సీల్యాండింగ్‌లు.. ప్రయాణికులను ఇబ్బందిపెడుతుండడంతో పాటు వార్తల్లో నిలుస్తున్న స్పైస్‌జెట్ సంస్థకు షాక్ తగిలింది. పౌర విమానయాన సంస్థల నియంత్రణ విభాగం డీజీసీఏ స్పైస్‌జెట్ సంస్థకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత 18 రోజుల్లో ఎనిమిది విమానాల్లో సాంకేతిక లోపాల సమస్యలు తలెత్తాయి. ఈ లోపాల ఘటనలపై స్పైస్‌జెట్‌ను పూర్తిస్థాయి వివరణ కోరింది డీజీసీఏ. జూన్ 19న రెండు ఘటనలు, జూన్ 25న ఒకటి, జులై 2న మరోక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవిగాక వరుసగా చోటు చేసుకున్నాయి. ఇక మంగళవారం ఢిల్లీ-దుబాయ్ విమానం సాంకేతికలోపంతో కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ స్పైస్‌జెట్.. నష్టాల్లో కొనసాగుతోంది. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల మధ్య రూ.316 కోట్లు, రూ.934 కోట్లు, రూ.998 కోట్లు.. వరుసగా నష్టాలు చవిచూసింది. చదవండి: ఈ స్పైస్‌జెట్‌కు ఏమైంది? -
జిల్లా ఆస్పత్రిలో నృత్యాలపై సీరియస్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో అప్పటి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్‌కు సత్కారం పేరుతో సిబ్బంది డీజే పాటలకు చిందులేసిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఆస్పత్రిలోని ఐదుగురు అధికారులకు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 10 రోజుల్లోగా సమాధానం చెప్పాలనిఆదేశించినట్టు తెలుస్తోంది. జిల్లా ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నృత్యాలు చేస్తూ హడావుడి చేసిన ఘటనపై ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించారు. ఇప్పటికే ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసిన అధికారులు, తాజా గా రెగ్యులర్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయటం సంచలనంగా మారింది. జిల్లా ఆస్పత్రిలో గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్ వరలక్ష్మీబాయి, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్ జయకుమారి, డీసీహెచ్ఎస్లో పనిచేసే ఏడీ పిల్లా ఉమాదేవి, హెడ్ నర్స్ శాంతకుమారి, సూర్యవతి, ఫార్మసిస్ట్ రామకృష్ణలకు ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకరరావును వివరణ కోరగా ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆదేశాలు జారీ అయ్యా యని, రేపు ఉదయం ఉద్యోగులకు నోటీసులు అందజేస్తామని పేర్కొన్నారు. -
సీఎం ఆదేశాలు తక్షణమే అమలు
సాక్షి, అమరావతి: ప్రజాప్రయోజనార్థం ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి/సీఎం కార్యాలయం (సీఎంవో) పంపించే ఆదేశాలపై ఉత్తర్వుల(జీవో) జారీకి నిర్ధిష్ట గడువు (టైమ్‌లైన్) విధించింది. ముఖ్యమంత్రి/సీఎంవో ఈ–ఆఫీసు రూపంలో పంపించే ఫైలు సంబంధిత శాఖలకు చేరిన తర్వాత నిర్ధిష్ట గడువులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర్వులు జారీ కావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎం ఆదేశాల తక్షణ అమలే లక్ష్యంగా ఉత్తర్వుల జారీ కోసం బిజినెస్ రూల్స్‌ను సవరించింది. దీనిప్రకారం ముఖ్యమంత్రి/సీఎంవో అధికారులు ఎండార్స్మెంట్ చేసిన ఫైళ్లను ఔట్టుడే, మోస్ట్ ఇమ్మీడియట్ (అత్యంత తక్షణం), ఇమ్మీడియట్ (తక్షణం) అనే విభాగాల్లో ఈ–ఆఫీసు ద్వారా సంబంధిత శాఖల కార్యదర్శులకు పంపుతారు. ఇవి సంబంధిత విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శికి చేరిన తర్వాత ఒక్క రోజులోనే ఉత్తర్వులు జారీ చేయాలి. మోస్ట్ ఇమ్మీడియట్ కేటగిరీ కింద వచ్చిన ఫైళ్లకు సంబంధించిన జీవోలను 5 రోజుల్లో జారీ చేయాలి. ఇమ్మీడియట్ కేటగిరీ కింద వచ్చే ఫైళ్లకు సంబంధించిన జీఓలను 15 రోజుల్లో జారీ చేయాలి. ఇలా నిర్ధిష్ట సమయంలో సంబంధిత శాఖల అధికారులు (ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శులు) జీఓలు జారీ చేయడంతోపాటు చర్యల నివేదికను కూడా సీఎం/సీఎంఓకు తెలియజేయాలి. ఈ టైమ్‌లైన్ పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే షోకాజ్ నోటీసులు జారీచేసి, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ రూల్స్‌లోని సెక్షన్ 4, రూల్ 20కి సవరణలు చేసినట్లు సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ శుక్రవారం జీవో జారీ చేశారు. గడువు ఉల్లంఘిస్తే.. జీఓల జారీలో ఎవరైనా నిర్ధిష్ట గడువు పాటించకుండా ఉల్లంఘిస్తే సీఎం సంబంధిత ఫైలును వెనక్కు తెప్పించుకుని, జాప్యానికి కారణాలు పరిశీలించి, సంబంధిత శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తారు. తదుపరి ముఖ్యమంత్రి ఈ జీఓ జారీ బాధ్యతలను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శికి గానీ, ఇతర ఏ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/కార్యదర్శికి గానీ అప్పగించవచ్చు. సీఎం అప్పగించిన బాధ్యతల ప్రకారం వారు ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం జీఓ జారీ చేస్తారు. మీడియా దృష్టిని ఆకర్షిస్తుందని భావించే జీఓలు, అంతర్గత ఆదేశాలు (మెమో) జారీ చేయాలంటే ముందుగా ముఖ్యమంత్రి/ముఖ్య కార్యాలయ అధికారులకు పంపించి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -
40 మంది బిల్డర్లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) కొరడా ఝళిపించింది. టీ–రెరాలో నమోదు చేయకుండా ప్రాజెక్ట్‌ను అడ్వటయిజింగ్ చేసిన 40 మంది డెవలపర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20 తేదీలోపు వివరణ ఇవ్వాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని టీ–రెరా సెక్రటరీ కే విద్యాధర్ రావు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. నోటీసులు జారీ చేసిన 40 మంది డెవలపర్లలో ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రమోటర్లు కూడా ఉన్నట్లు సమాచారం. టీ–రెరాలో నమోదు చేయకుండా ప్రచారం చేయడమే కాకుండా విక్రయాలు కూడా జరిపినట్లు తెలిసింది. రెరాలో నమోదు చేయకుండా ప్రచారం చేసినా లేదా విక్రయించినా సరే సెక్షన్ 59 ప్రకారం.. ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా ఉంటుంది. అథారిటీకి సరైన వివరణ ఇవ్వకపోయినా లేదా అప్పటికీ రిజిస్టర్ చేయకపోయినా రెరా అథారిటీ సంబంధిత డెవలపర్‌కు మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 20 శాతం జరిమానా విధిస్తుంది. రెరా జరిమానాలు, శిక్షలివే.. ప్రమోటర్లకు: రెరా అథారిటీ ఆర్డర్లను ఉల్లంఘిస్తే.. సెక్షన్ 59 ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా. ♦ ప్రాజెక్ట్ లేదా అమ్మకాలకు సంబంధించిన తప్పుడు సమాచారం అందిస్తే.. సెక్షన్ 60 ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం జరిమానా. ఏజెంట్లకు: నమోదు కాకుండా ఫ్లాట్లు/ప్లాట్లను విక్రయిస్తే.. సెక్షన్ 65 ప్రకారం విక్రయించిన ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం జరిమానా. ♦ అప్పిలేట్ ట్రిబ్యునల్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. సెక్షన్ 62 ప్రకారం ఏడాది పాటు జైలు శిక్ష లేదా ప్రతి రోజు రూ.10 వేలు, గరిష్టంగా ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా. ఇంకా 14 రోజులే.. టీ–రెరాలో ప్రాజెక్ట్‌ల నమోదు గడువు ఈనెల 30తో ముగస్తుంది. అంటే ఇంకా 14 రోజులే మిగిలి ఉంది. రెరా గడువును పొడిగించే ప్రసక్తే లేదని, డిసెంబర్ 1 నుంచి ప్రాజెక్ట్‌లను నమోదు చేయని నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ చేసి సెక్షన్ 59 ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా విధిస్తామని విద్యాధర్ రావు తెలిపారు. ఇప్పటివరకు టీ–రెరాలో 1,200 మంది ఏజెంట్లు, డెవలపర్లు రిజిస్టరయ్యారు. సుమారు 600ల ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. ♦ 2017, జనవరి 1 తర్వాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, టీఎస్ఐఐసీ, మున్సి పాలిటీ, పంచాయతీల నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్ల కంటే ఎక్కువుండే ప్రతి ప్రాజెక్టూ రెరాలో నమోదు తప్పనిసరి. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గతేడాది జనవరి 1 తర్వాత ఆయా విభాగాల నుంచి సుమారు 5 వేల ప్రాజెక్ట్‌లను అనుమతి పొందాయి. కానీ, ఇప్పటివరకు కేవలం 600 ప్రాజెక్ట్‌లే నమోదవ్వటం గమనార్హం. -
డిఫాల్టర్ల లిస్టు ఎందుకు బైటపెట్టలేదు?
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన వారి (డిఫాల్టర్లు) బైటపెట్టే విషయంపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించకపోవడం మీద వివరణనివ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పటేల్‌పై గరిష్ట పెనాల్టీ ఎందుకు విధించరాదో వివరించాలని సూచించింది. మొండిబాకీలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాసిన లేఖను కూడా బహిర్గతం చేయాలంటూ ప్రధాని కార్యాలయం, కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్‌నకు సూచించింది. ముందుగా రూ. 1,000 కోట్ల పైగా డిఫాల్ట్ అయిన రుణాలతో మొదలుపెట్టి ఆ తర్వాత రూ. 500 కోట్ల దాకా రుణాలకు సంబంధించిన వివరాలను అయిదు రోజుల్లోగా ఆర్బీఐ వెల్లడించాల్సి ఉంటుందని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు పేర్కొన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో పాఠశాల విద్యాశాఖ వెనక్కి తగ్గింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ సంచాలకులతో సహా ప్రాంతీయ సంయుక్త సంచాలకులను తప్పు దోవ పట్టిస్తూ హైదరాబాద్ ఆర్జేడీ కార్యాలయ ఉద్యోగులు ఉత్తర్వులు విడుదల చేసిన వ్యవహారంపై విచారణ చేపట్టిన అధికారులు ఇందులో ముగ్గురి పాత్ర ఉన్నట్లు తేల్చారు. ఆ ముగ్గురు ఉద్యోగులైన సహాయ సంచాలకులు, సెక్షన్ సూపరింటెండెంట్, క్లరికల్ ఉద్యోగులు దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అనంతరం వారి నుంచి వివరణ తీసుకున్న ఆర్జేడీ ఆమేరకు ఫైలును పాఠశాల విద్యాశాఖ సంచాలక కార్యాలయానికి పంపించారు. ఇక్కడి వరకు చర్యలు వేగవంతంగా జరిగినప్పటికీ...ఆ ముగ్గురు ఉద్యోగులపై వేటువేసే క్రమంలో మాత్రం ఆ శాఖ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అవకతవకలు జరిగిన తీరు, చర్యలు తీసుకోవాల్సిన విషయానికి సంబంధించిన ఫైలు విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయానికి చేరి 15 రోజులు కావస్తున్నా...ఆ ఫైలుకు మోక్షం కలగకపోవడం గమనార్హం. ఉన్నతాధికారిపై ఒత్తిడి... టీచర్ల బదిలీల్లో జరిగిన అక్రమాలు రుజువైనప్పటికీ...వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆ శాఖలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కలపై చర్యలు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు ఆ శాఖలోని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ఈక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారిపై ఒత్తిడి వస్తుండటంతోనే చర్యలకు సంబంధించిన ఫైలు పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు. అవకతవకలకు పాల్పడినట్లు తేలిన ముగ్గుర్లో ఒకరు ఈ నెలాఖరులో పదవీ విరమణ పొందనున్నారు. దీంతో రిటైర్మెంట్కు ముందుగా శాఖపరమైన చర్యలు తీసుకుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు ఇబ్బంది వస్తుందని, ఈ కారణంగానే వేటువేయడంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. ఇదిలావుండగా, బదిలీ ఉత్తర్వుల్లో అక్రమంగా పేర్లు చొప్పిస్తూ ఇచ్చిన ఆదేశాలను విద్యాశాఖ రద్దు చేసింది. మొత్తం 37 మంది టీచర్ల పేర్లతో వచ్చిన ఉత్తర్వుల్లో దాదాపు ఇరవై వరకు సరైనవని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా టీచర్లకు తిరిగి బదిలీ ఉత్తర్వులు జారీ చేసే అంశంపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
వైద్య ఆరోగ్య శాఖలో 100 మందికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో 100 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19, 20వ తేదీల్లో ఎలాంటి ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా సెలవు తీసుకున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు కఠిన చర్యలకు రంగం సిద్ధం చేశారు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగంలో పనిచేస్తున్న వారందరూ ఆ రెండు రోజులు ఎందుకు విధులకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాల్సిందిగా సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దసరాను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17, 18 తేదీల్లో సెలవులు ప్రకటించింది. ఆ తర్వాత 19, 20 తేదీల్లో శుక్ర, శనివారాలు కావడం, తదుపరి ఆదివారం రావడంతో అనేక మంది ఆ రెండ్రోజులు కూడా విధులకు డుమ్మా కొట్టారు. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జ్వరాలు, స్వైన్‌ఫ్లూ విజృంభిస్తున్నాయి. కంటి వెలుగు కార్యక్రమం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఎలాంటి సమాచారం, అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోవడంపై శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు అందుకున్న వారి నుంచి సమాధానం వచ్చాక తదుపరి చర్య తీసుకుంటామని తెలిపారు. -
మాయ‘రోగుల’పై సస్పెన్షన్ వేటు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీచర్ల బదిలీల్లో అడ్డదారిలో అనారోగ్యం పేరిట ప్రిఫరెన్షియల్ పాయింట్లు పొందేందుకు ప్రయత్నించిన 17 మంది టీచర్లను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సస్పెండ్ చేశారు. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు జారీచేసిన నలుగురు ప్రభుత్వ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టీచర్ల బదిలీల మార్గదర్శకాలతో కూడిన జీవో 16ను ప్రభుత్వం ఈ నెల 6న విడుదల చేసింది. పూర్వపు మెదక్ జిల్లా పరిధిలో 8,269 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్టైటిల్మెంట్ పాయింట్ల ఆధారంగా సీనియార్టీ జాబితా రూపొందించారు. అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ 195 మంది టీచర్లు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో అదనపు ఎన్టైటిల్మెంట్ పాయింట్లు కోరుతూ ఆన్లైన్లో మెడికల్ సర్టిఫికెట్లు దరఖాస్తుతో సమర్పించారు. పరిశీలనకు కలెక్టర్ ఆదేశం.. జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్లపై ఫిర్యాదులు రావడంతో సంగారెడ్డి కలెక్టర్ పరిశీలనకు ఆదేశించారు. ఈ నెల 16, 18ల్లో 195 మంది టీచర్లు సమర్పించిన సర్టిఫికెట్లను కమిటీ పరిశీలించింది. çపరిశీలనకు 8 మంది టీచర్లు గైర్హాజరు కాగా, 14 మంది తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలింది. దీనిపై పరిశీలన జరిపిన సంగారెడ్డి డీఈఓ విజయలక్ష్మి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించిన 11 మందితో పాటు, పరిశీలనకు గైర్హాజరైన ఆరుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేసిన నలుగురు ప్రభుత్వ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సస్పెన్షన్ వేటు పడిన వారిలో సంగారెడ్డి జిల్లా పరిధిలో ఆరుగురు, మెదక్ జిల్లా పరిధిలో ఏడుగురు, సిద్దిపేట జిల్లా పరిధిలో నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తూ, దురుద్దేశ పూర్వకంగా తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించినందునే ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి వెల్లడించారు. -
గద్వాలలో నిషేధిత బీటీ3 సాగు
సాక్షి, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలో పత్తి విత్తన కంపెనీల బాగోతాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇటీవల ఐటీ శాఖ అధికారులు చేసిన దాడుల్లో రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి, వారి భూములను లీజుకు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు సృష్టించి ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టినట్లు తేలిన విషయం విదితమే. ఇది మరువక ముందే కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బీటీ3 విత్తనాలను గద్వాల కేంద్రంగా విత్తన కంపెనీలు సాగు చేయిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తల బృందం, డీఎన్ఏ పరిశోధన సంస్థ నిర్ధారించడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 18న కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, అధికారులు, విత్తన ధ్రువీకరణ సంస్థల ప్రతినిధులు జిల్లాలో పర్యటించి 300 పత్తి విత్తనాల శాంపిళ్లను సేకరించి తీసుకెళ్లారు. వీటిని ఢిల్లీలోని ల్యాబ్‌లో పరీక్షించగా ఆ శాంపిళ్లలో బీటీ3 విత్తనాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని తెలిసింది. అదే నెలలో గద్వాలలోని మార్కెట్ యార్డు, ఇటిక్యాల మండలంలోని ఓ గోదాంలో అధికారులు సేకరించి న షాంపిళ్లలోనూ బీటీ3 పత్తి విత్తనాలు వాడినట్లు తేలిం ది. 60 షాంపిళ్లకుగాను ఆరు షాంపిళ్లలో నిషేధిత హెచ్‌టీ రకం పత్తి విత్తనాలున్నట్లు అధికారులు నిర్ధారించారు. దీం తో ఆ కంపెనీలపై కేసుల నమోదుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు గోవింద్‌నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. చర్యలు తీసుకుంటున్నాం.. పరీక్షలకు పంపిన 60 షాంపిళ్లలో 6 షాంపిళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిలేని, గడ్డి మందును తట్టుకునే హెచ్టీరకం పత్తివిత్తనాలు ఉన్నట్లు తేలింది. స్టాక్‌ను సీజ్ చేశాం. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంతో పాటు, సంబంధిత కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. త్వరలో కేసులు నమోదు చేస్తాం. గోవింద్‌నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
కాల్‌డ్రాప్స్‌పై టెలికాం కంపెనీలకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారులను చికాకుపరిచే కాల్‌డ్రాప్స్‌పై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) సీరియస్ అయింది. కాల్‌డ్రాప్స్‌పై నూతన సేవా నాణ్యతా ప్రమాణాలను అందించడంలో విఫలమయ్యారంటూ కొన్ని టెలికాం కంపెనీలకు ట్రాయ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వారాంతంలోగా దీనిపై సరైన వివరణలతో ముందుకురావాలని ఆయా కంపెనీలను కోరింది. అయితే ఏ టెలికాం ప్రొవైడర్లకు ఈ నోటీసులు జారీ అయ్యాయో టెలికాం రెగ్యులేటర్ వివరించలేదు. నిబంధనలు పాటించని ఆపరేటర్ల పేర్లను తాము బహిర్గతం చేయదలుచుకోలేదని ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ చెప్పారు. ఆయా కంపెనీల నుంచి వివరణలు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామన్నారు. ట్రాయ్ ఇటీవల నిర్ధేశించిన నూతన సేవా ప్రమాణాలను కొన్ని సర్కిళ్లలో పాటించని కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. కాగా, 2017, అక్టోబర్ 1 నుంచి కాల్డ్రాప్స్ ను అధిగమించేందుకు ట్రాయ్ కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో కాల్‌డ్రాప్స్‌కు రూ పదిలక్షల జరిమానాను టెలికాం సర్కిల్ స్ధాయిలో విధిస్తుండగా, తాజా నిబంధనల ప్రకారం మొబైల్ టవర్ స్ధాయిలోనే చర్యలను చేపట్టారు. -
1,000 బీఈడీ కాలేజీలకు నోటీసులు
కోల్‌కతా: నిర్దేశిత గడువులోగా కోరిన సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించని 1000 బీఈడీ కాలేజీలకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన కాలేజీల్లో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో విద్యార్థులకు అడ్మిషన్లు చేపట్టవద్దని ఎన్సీటీఈ ఆదేశించిందని మానవ వనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వీటితోపాటు మరో 3వేల కాలేజీలకు త్వరలో నోటీసులు పంపనున్నారు. బీఈడీ, డీఈడీ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో తమకు అందించాలని కోరినా సమర్పించని కాలేజీలపై ఎన్సీటీఈ చర్యలకు ఉపక్రమించింది. -
ఇంజినీరంగు పడింది!
మౌలిక వసతుల లేమి, అర్హత లేని అధ్యాపకులతో పాఠ్యాంశాల బోధనపై అనంతపురం జేఎన్టీయూ మండిపడింది. నిబంధనలు పాటించని, ఆర్థిక వెసులుబాటును విస్మరించిన కళాశాలల యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జూన్ 3వ తేదీ లోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకుంటే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. నెల్లూరు(టౌన్): అసలే అంతంత మాత్రపు అడ్మిషన్లతో నడుస్తున్న ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు జేఎన్టీయూ తాజా హెచ్చరికలతో కంటిమీద కునుకు లేకుండా పోయింది. గతేడాది జూన్‌లో 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా 40 కళాశాలలు ఎంపిక చేసుకుని తనిఖీలు జరిపారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో 3 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించారు. మౌలిక వసతులపై ఆరా ప్రధానంగా ఫ్యాకల్టీ, ఫైనాన్స్, ఇన్ఫాస్ట్రక్చర్ తదితర వాటిపై తనిఖీలు చేశారు. అర్హత లేని అధ్యాపకుల నియామకం, విద్యార్థులకు తగిన అధ్యాపకులు లేకపోవడం, కళాశాలకు అవసరమైన స్థలం లేకపోవడం, భవనాలు, ప్రయోగశాలలు, కంప్యూటర్లు, లైబ్రరీ తదితర సౌకర్యాలు కొరవడిన విషయాన్ని గుర్తించా రు. ఈ నేపథ్యంలో కళాశాలల డొల్లతనంపై కమిటీ సభ్యులు ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రమాణాలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో మూడు కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జూన్ 3వ తేదీ లోపు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 24 ఇంజినీరింగ్ కళాశాలు జిల్లా వ్యాప్తంగా 24 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ప్రధానంగా మెకానికల్, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్, ఈఐఈ బ్రాంచ్‌లు ఉన్నాయి. కళాశాల సీనియారిటీని బట్టి 300 నుంచి 550 వరకు అన్ని బ్రాంచిల్లో సీట్లున్నాయి. ఏటా ఇంటర్ పూర్తి చేసుకుని జిల్లా వ్యాప్తంగా సుమారు 22 వేల మందికి పైగా విద్యార్థులు బయటకు వస్తున్నారు. అయితే ఎక్కువ మంది చెన్నై, బెంగళూరు, విజయవాడ, హైదరాబాదు తదితర ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. అధికశాతం కళాశాలల్లో.. జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో అధికశాతం పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహిస్తే ఒక్క కళాశాల కూడా తరగతులు జరిపే పరిస్థితి ఉండదంటున్నారు. ఏటా ప్రయోగాల కోసం జిల్లా నుంచి రెండు కళాశాలల యాజమాన్యం తిరుపతిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు విద్యార్థులను తరలిస్తోంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపైనే ఆధారపడి ఆయా యాజమాన్యాలు కళాశాలలను నడుపుతున్నాయి. అవి నిలిచిపోతే జిల్లాలో మెజారిటీ కళాశాలలను మూసివేసే పరిస్థితి ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. సీట్లు భర్తీకాని కళాశాలలు ఏటా ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ఒకటి రెండు కళాశాలలు మాత్రమే 95 శాతం సీట్లు భర్తీ అవుతున్నాయి. గతేడాది జిల్లాలో రెండు కళాశాలల్లో ఒక అడ్మిషన్ కూడా జరగలేదంటేనే పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. కొన్ని కళాశాలల్లో అధ్యాపకుల కొరత, మరికొన్నింటిలో అధ్యాపకులు ఉన్నా అర్హత లేకపోవడం, సరైన ల్యాబ్ సౌకర్యం, సరిపడా గదులు, కంప్యూటర్లు లేకపోవడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి పోతున్నారు. ఏటా తనిఖీలు నిర్వహిస్తాం ఏటా ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. ఈ ఏడాది కూడా జేఎన్టీయూ ఆధ్వర్యంలో తనిఖీలు చేశాం. ఆ నివేదిక ఇంకా రాలేదు. గతేడాది తనిఖీల్లో సరైన సౌకర్యాలు లేని కళాశాలలకు నోటీసులు జారీ చేశాం. –కృష్ణయ్య, రిజిస్ట్రార్, జేఎన్టీయూ(ఏ) -
మంత్రి సేవలో తరించిన అధికారులకు నోటీసులు!
తిరుపతి: మంత్రి గంటా శ్రీనివాస రావు సేవలో తరించిన ప్రభుత్వ అధికారులకు ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. మంత్రిని చూసేసరికి సర్వశిక్ష అభియాన్ అధికారులకు ఏమీ గుర్తుకు రాలేదు. ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేశారు. ఎన్నికల సంఘం చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది. వారికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన సర్వశిక్ష అభియాన్ పీడీ లక్ష్మి, ఇన్చార్జి డీఈఓ శ్యామ్యూల్లకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.