న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన వారి (డిఫాల్టర్లు) బైటపెట్టే విషయంపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించకపోవడం మీద వివరణనివ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పటేల్‌పై గరిష్ట పెనాల్టీ ఎందుకు విధించరాదో వివరించాలని సూచించింది.
మొండిబాకీలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాసిన లేఖను కూడా బహిర్గతం చేయాలంటూ ప్రధాని కార్యాలయం, కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్‌నకు సూచించింది. ముందుగా రూ. 1,000 కోట్ల పైగా డిఫాల్ట్ అయిన రుణాలతో మొదలుపెట్టి ఆ తర్వాత రూ. 500 కోట్ల దాకా రుణాలకు సంబంధించిన వివరాలను అయిదు రోజుల్లోగా ఆర్‌బీఐ వెల్లడించాల్సి ఉంటుందని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment