
న్యూఢిల్లీ: వ్యక్తిగత దూషణకు సంబంధించిన ఓ కేసులో దేశ సర్వోన్నత న్యాయం మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మియాన్-టియాన్, పాకిస్థానీ అనడం నేరమేమీ కాదని, అలా అనడం వల్ల మతపరమైన మనోభావాలు దెబ్బ తిన్నాయన్న వాదన అర్ధరహితమని వ్యాఖ్యానించింది.
జార్ఖండ్‌లో పని చేసే ఓ ప్రభుత్వ ఉద్యోగి.. ఆర్టీఐ దరఖాస్తు వెరిఫికేషన్‌లో భాగంగా ఓ వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆ టైంలో మతం ప్రస్తావన తెచ్చి ఆ వ్యక్తి.. సదరు ఉద్యోగిని దుర్భాషలాడాడు. దీంతో తన విధులకు ఆటంకం కలిగించాడంటూ ఆ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితుడికి జార్ఖండ్ హైకోర్టులో ఊరట దక్కలేదు.
దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మియాన్-టియాన్, పాకిస్థానీ అని సంబోధించడం ద్వారా తన మనోభావాలు దెబ్బన్నాయని ఫిర్యాదుదారు అంటున్నారు. ముమ్మాటికీ అలాంటి వ్యాఖ్యలు అప్రస్తుతం. అయినప్పటికీ.. అది మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం ఏమాత్రం కాదని స్పష్టం చేస్తూ ఆ వ్యక్తికి ఊరట కలిగించింది.
Comments
Please login to add a commentAdd a comment