Urjit Patel
-
కీలక పోస్టులోకి ఆర్బీఐ మాజీ గవర్నర్ ! బ్రిటానియాకు గుడ్‌బై
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పని చేసిన ఊర్జిత్ పటేల్‌కి కీలక పదవి దక్కింది. ఊర్జిత్ పటేల్‌ను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఏఐఐబీ వ్యవస్థాపక దేశాల్లో భారత్ కూడా ఉంది. వైస్ ప్రెసిడెంట్ షియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది. చైనా తర్వాత రెండో అత్యధిక ఓటింగ్ వాటాతో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ)లో భారత్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. ఏఐఐబీకి చైనా మాజీ ఆర్థిక శాఖ వైస్ మినిస్టర్ జిన్ లికున్ నాయకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 1న ఊర్జిత్ పటేల్ ఈ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో బ్రిటానియా కంపెనీలో ఉన్న పదవులకు ఆయన శనివారం రాజీనామా సమర్పించారు. రిజర్వ్ బ్యాంక్‌కి 24వ గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్ సేవలు అందించారు. ఆయన గవర్నర్‌గా ఉన్న సమయంలోనే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలతో పొసగపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన బ్రిటానియా సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టర్ కమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. గత నెలలోనే ఊర్జిత్ను వైస్ ప్రెసిడెంట్ నియామక నిర్ణయాన్ని ఏఊఊబీ వెల్లడించింది. గత రెండు వారాలుగా ఈ విషయంపై మౌనంగా ఉన్న ఊర్జిత్ పటేల్.. చివరకు బ్రిటానియాకు తగు సమయం కేటాయించలేకపోతున్నందున రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. చదవండి: ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా ఆర్బీఐ మాజీ గవర్నర్..! -
ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా ఆర్బీఐ మాజీ గవర్నర్..!
న్యూఢిల్లీ: ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు బ్యాంకు వర్గాలు ఆదివారం తెలిపాయి. చైనా తర్వాత రెండో అత్యధిక ఓటింగ్ వాటాతో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ)లో భారత్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. ఏఐఐబీకి చైనా మాజీ ఆర్థిక శాఖ వైస్ మినిస్టర్ జిన్ లికున్ నాయకత్వం వహిస్తున్నారు. 58 ఏళ్ల పటేల్ మూడేళ్ల పదవీకాలం గల ఏఐఐబీ ఐదుగురు ఉపాధ్యక్షుల్లో ఒకరుగా ఉంటారు. వచ్చే నెలలో ఆయన తన పదవిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఏఐఐబీలో వైస్ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన డిజె పాండియన్ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు ఏఐఐబీ వర్గాలు పీటీఐకి తెలిపాయి. గతంలో గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పాండియన్ ఈ నెల చివర్లో భారతదేశానికి తిరిగి రానున్నారు.సెప్టెంబర్ 5, 2016న రఘురామ్ రాజన్ తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 2018లో "వ్యక్తిగత కారణాల వల్ల" పటేల్ రాజీనామా చేశారు. సెప్టెంబర్ 6, 2016న బాధ్యతలు చేపట్టడానికి ముందు అతను రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలో ఆర్బీఐలో ద్రవ్య విధాన విభాగాన్ని పర్యవేక్షిస్తున్న డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నారు. పటేల్ గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ & రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ ఇతర సంస్థలతో కలిసి పనిచేశారు. ఏఐఐబీ నుంచి 28 ప్రాజెక్టులకు 6.8 బిలియన్ డాలర్లు రుణం తీసుకుంది. అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించిన భారతదేశానికి ఏఐఐబీ పటేల్ పోస్టింగ్ ముఖ్యమైనది అని పాండియన్ శనివారం తన వీడ్కోలు సమయంలో తెలిపారు. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు 2022లో పండగే..!) -
బ్యాంకులపై ‘మొండి’బండ!
ముంబై: భారత్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్సీబీ) మొండి బకాయిల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టమైపోయాయి. 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని శుక్రవారంనాడు విడుదల చేసిన ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. ఆర్థికాంశాలకు సంబంధించి ఆర్బీఐ తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► పలు క్షేత్ర స్థాయి ఆర్థిక అంశాల ప్రాతిపదికన బ్యాంకింగ్ తాజా పరిస్థితిని అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) వృద్ధిరేటు, జీడీపీలో ద్రవ్యలోటు నిష్పత్తి, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వంటివి ఉన్నాయి. ► మార్చి నుంచి ఆగస్టు వరకూ రుణాల చెల్లింపులపై మారటోరియం అమలవుతోంది. ఈ మారటోరియం ప్రభావం బ్యాంకింగ్‌పై ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం ఇంకా అస్పష్టంగా ఉంది. దీని గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. ► ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే– జీఎన్‌పీఏ నిష్పత్తి 2021 మార్చి నాటికి 15.2 శాతానికి చేరే వీలుంది. 2020 మార్చిలో ఈ రేటు 11.3 శాతం. ► ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఈ రేటు 4.2 శాతం నుంచి 7.3 శాతానికి చేరవచ్చు. ► విదేశీ బ్యాంకుల విషయంలో జీఎన్‌పీఏల నిష్పత్తి 2.3 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చు. ► ఇక కనీస పెట్టుబడుల నిష్పత్తి (క్యాపిటల్ అడిక్వసీ రేషియో –సీఆర్ఏఆర్) 2020 మార్చిలో 14.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి 13.3 శాతానికి తగ్గే వీలుంది. పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు 11.8 శాతానికీ పడిపోయే వీలుంది. కనీస పెట్టుబడుల నిష్పత్తిని కొనసాగించడంలో ఐదు బ్యాంకులు పూర్తిగా విఫలం కావచ్చు. ► నిజానికి 2018–19 తో పోల్చితే 2019–20 లో బ్యాంకింగ్ లాభదాయక నిష్పత్తులు బాగున్నాయి. అయితే 2019–20 ఒక్క ద్వితీయార్ధాన్ని పరిశీలిస్తే ఈ నిష్పత్తులు తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభదాయక నిష్పత్తులు ఏ స్థాయిలో పడిపోయే అవకాశం ఉందో అర్థం చేసుకోవచ్చు. ► ఒకపక్క తగ్గుతున్న డిపాజిట్లు, మరోపక్క మొండిబకాయిల భారం వెరసి బ్యాంకింగ్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలనూ ఎదుర్కొనే వీలుంది. ► ఇక ఆర్థిక అంశాల విషయానికి వస్తే, కరోనా మహమ్మారి సవాళ్లు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితి. లాక్డౌన్ ఇంకా పూర్తిస్థాయిలో ఎత్తివేయని పరిస్థితీ ఉంది. ఈ నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమన ఇబ్బందులే ఉంటాయని భావిస్తున్నాం. భారత ఆర్థిక మూలాలు పటిష్టం: శక్తికాంత్ దాస్ కోవిడ్–19 నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ప్రభుత్వంతోపాటు ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్థిక రంగంపై కరోనా ప్రభావాన్ని తగ్గించగలిగాయి. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, వినియోగదారులు... ఇలా అందరికీ విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలంటే ఫైనాన్షియల్ రంగంలో స్థిరత్వం అవసరం. ఈ స్థిరత్వం చెక్కుచెదరకుండా చూడడంపై మేము అధిక దృష్టి సారిస్తున్నాం. బ్యాంకింగ్ విషయానికి వస్తే, ఇబ్బందులను తట్టుకోగలిగిన స్థాయికి ఎదగాల్సిఉంది. ఇందుకు తగిన యంత్రాంగం సమాయత్తం కావాలి. మూలధనాన్ని తగిన స్థాయిల్లో నిలుపుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రుణాల మంజూరీ విషయాల్లో మితిమీరిన అతి జాగ్రత్తలూ మంచిదికాదు. ఇలాంటి ధోరణీ ప్రతికూలతలకు దారితీస్తుంది. లాక్డౌన్ సమయాల్లోనూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి దేశీయ రంగాలు కొన్ని చక్కటి పనితీరునే ప్రదర్శించాయి. భారత్ ఆర్థిక వ్యవస్థలో మొత్తంగా రికవరీ జాడలు కనిపిస్తున్నాయి. ఇక అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు పటిష్టంగా ఉండడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దివాలా చట్టం నిర్వీర్య యత్నం వల్లే కేంద్రంతో విభేదించా: ఉర్జిత్ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి 2018 డిసెంబర్లో మధ్యంతరంగా వైదొలగిన ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు ఇందుకు కారణాన్ని వెల్లడించారు. దివాలా చట్టం నిర్వీర్యానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నాలే కేంద్రంతో విభేదాలకు కారణమని శుక్రవారం ఆవిష్కరించిన తన పుస్తకంలో పేర్కొన్నారు. రీపేమెంట్లను ఆలస్యం చేస్తున్న డిఫాల్టర్లను తక్షణం డిఫాల్టర్లుగా వర్గీకరించాలని, అలాంటి వ్యక్తులు దివాలా చర్యల సందర్భంగా తిరిగి తమ కంపెనీలను బైబ్యాక్ చేయకుండా నిరోధించాలని బ్యాంకింగ్‌కు సూచిస్తూ ఆర్బీఐ జారీ చేసిన 2018 ఫిబ్రవరి సర్క్యులర్ మొత్తం వివాదానికి కేంద్ర బిందువైందని తెలిపారు. అయితే దీనిని చట్టరూపంలో తీసుకురావడానికి కేంద్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించిందని సూచించారు. -
మొండి బాకీలపై ఉర్జిత్ పటేల్ పుస్తకం
ముంబై: బ్యాంకింగ్ మొండి బాకీల సమస్యపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాసిన పుస్తకం ఈ నెలాఖరులో విడుదల కానుంది. దీన్ని ప్రచురించిన హార్పర్‌కోలిన్స్ ఇండియా ఈ విషయం వెల్లడించింది. ‘ఓవర్‌డ్రాఫ్ట్– భారత్‌లో పొదుపు చేసే వర్గాలను కాపాడటం’ పేరిట పటేల్ ఈ పుస్తకం రాశారు. ఎన్పీఏలు పేరుకుపోవడానికి కారణాలు, పరిస్థితి చక్కదిద్దడానికి ఆర్బీఐ గవర్నర్ హోదాలో పటేల్ చేసిన ప్రయత్నాలు తదితర అంశాలను ఇందులో పొందుపర్చారు. ఆయన పదవీకాలంలోనే పెద్ద నోట్ల రద్దు అమలైంది. అయితే, కొన్ని అంశాలపై ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో 2018 డిసెంబర్లో ఆయన అనూహ్యంగా పదవికి రాజీనామా చేశారు. కానీ, ఇటీవలే ఎన్ఐపీఎఫ్పీ చైర్మన్‌గా గత నెలలో నియమితులయ్యారు. -
కీలక పదవిని చేపట్టనున్న ఉర్జిత్ పటేల్
సాక్షి, న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ దేశ ప్రధాన ఆర్థిక థింక్ ట్యాంక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ)కి చైర్మన్‌గా నియమితు లయ్యారు. నాలుగేళ్ల పాటు బాధ్యతలను నిర్వహిస్తారని ఎన్ఐపీఎఫ్పీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన దాదాపు 18 నెలల తరువాత మరో ఆర్థిక సంస్థ కీలక బాధ్యతలను చేపట్టడం విశేషం. దాదాపు ఆరేళ్లపాటు ఎన్ఐపీఎఫ్పీకి అధ్యక్షత వహించిన విజయ్ లక్ష్మణ్ కేల్కర్ స్థానంలో జూన్ 22, 2020 నుంచి ఉర్జిత్ పటేల్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ కేల్కర్ చేసిన విశేష కృషికి ఎన్ఐపీఎఫ్పీ ప్రశంసలు కురిపించింది. ఆయన సేవలను కొనియాడుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. కాగా ఆర్బీఐ గవర్నర్ గా పదవీకాలం ముగియకముందే డిసెంబర్ 10, 2018న ఉర్జిత్ పదవికి రాజీనామా చేశారు. తన మూడేళ్ల పదవీకాలం 2019 సెప్టెంబర్‌లో ముగిసేలోపే వ్యక్తిగత కారణాల పేరుతో పదవి నుంచి ఆయన వైదొలగిన సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ ముందే మేల్కొని ఉండాల్సింది
ముంబై: దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం నెలకొన్న భారీ మొండి బకాయిల (ఎన్పీఏలు) సమస్య వెనుక బ్యాంకులు, ప్రభుత్వంతో పాటు భారతీయ రిజర్వు బ్యాంకు వైఫల్యం కూడా ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అంగీకరించారు. బ్యాంకులు పెద్ద మొత్తాల్లో రుణాలను ఇచ్చేశాయని, ఈ విషయంలో ప్రభుత్వం సైతం తన పాత్రను సమర్థంగా పోషించలేకపోయిందని చెప్పారాయన. ‘‘ఆఖరుకు ఆర్బీఐ అయినా ముందుగా స్పందించి ఉండాల్సింది’’ అన్నారాయన. ప్రభుత్వంతో విభేదాల కారణంగా గతేడాది డిసెంబర్ 10న ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత తొలిసారిగా, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న ఆందోళనకరమైన అంశాలపై ఉర్జిత్ పటేల్ మాట్లాడారు. ‘‘ప్రస్తుత మూలధన నిధులు కూడా ఎక్కువ చేసి చూపించినవే. భారీ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ఇవి సరిపోవు. అసలు ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చామో తెలుసా? 2014కు ముందు అన్ని పక్షాలూ తమ పాత్రలను సమర్థంగా నిర్వహించడంలో విఫలమయ్యాయి. బ్యాంకులు, నియంత్రణ సంస్థ (ఆర్బీఐ), ప్రభుత్వం కూడా’’ అని ఉర్జిత్ పటేల్ స్పష్టంచేశారు. 2014 తర్వాత కేంద్రంలో ప్రభుత్వం మారడం, ఆర్బీఐ గవర్నరు హోదాలో రఘురామ్ రాజన్ బ్యాంకుల ఆస్తుల నాణ్యతను మదింపు చేయడంతో భారీ స్థాయిలో ఎన్పీఏల పుట్ట బయటపడిన విషయం తెలిసిందే. రఘురామ్ రాజన్ హయాం నుంచి పటేల్ ఆర్బీఐలో వివిధ హోదాల్లో మొత్తం ఐదేళ్లకు పైగా పనిచేశారు. సమస్యను కార్పెట్ కింద చుట్టేయడం ఫలితాన్నివ్వదని, భవిష్యత్తులో రుణ వితరణ సమర్థవంతంగా ఉండాలని పటేల్ అభిప్రాయపడ్డారు. ఎన్బీఎఫ్సీ ఆస్తులను సైతం సమీక్షించాలి ఆర్థిక వ్యవస్థతో అంతర్గతంగా అనుసంధానమై ఉన్న దృష్ట్యా ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల నాణ్యతను సమీక్షించడం తప్పనిసరి అని ఉర్జిత్ పటేల్ ఉద్ఘాటించారు. సామాజిక రంగ అవసరాలు, క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించుకోలేకపోవడం వంటి అంశాల వల్ల ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా పెరిగిందని చెప్పారు. ద్రవ్య పరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధుల సాయం పెరిగినట్టు తెలిపారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య స్థిరీకరణకు బలవంతం చేయడంపైనా పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బలహీన బ్యాంకులను విలీనం చేసుకునే బ్యాంకుల విలువ హరించుకుపోతుందన్నారు. ఎల్ఐసీతో కొనుగోలు చేయించిన ఐడీబీఐ బ్యాంకును చాలా సమస్యాత్మక బ్యాంకుగా అభివర్ణించారు. బ్యాంకులకు అడ్డంకులు తొలగాలి: రఘురామ్ రాజన్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కొన్ని అడ్డంకులు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఈ అడ్డంకులు తొలగితే, ఆయా బ్యాంకులు మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి ప్రభుత్వపరమైన నియంత్రణలు కొంత తగ్గాల్సి ఉందని రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే మెజారిటీ వాటాలు ప్రభుత్వానికి ఉన్నంతవరకూ ఇది సాధ్యం కాదనీ అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణే అన్నింటికీ మందన్న అభిప్రాయం కొన్ని చోట్ల నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ, కేవలం ఇదే సరైనదని భావించకూడదన్నారు. తనకు తెలిసి కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకుల నిర్వహణ కూడా పేలవంగానే ఉందని అన్నారు. తక్కువ నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు ప్రైవేటు రంగంకన్నా ఎక్కువగాను .. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులకు తక్కువగాను వేతనాలు చెల్లిస్తుండటం, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా అనుమతించాల్సిన పరిస్థితులు ఉండటం వంటివి పీఎస్‌బీల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని ఆయన తెలిపారు. ‘ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు కావాల్సింది ఏమిటి?‘ అన్న ఒక పుస్తకంలో ఈ మేరకు రాజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక వేత్తలు అభిజిత్ బెనర్జీ, గీతా గోపీనాథ్, మిహిర్ ఎస్ శర్మ కూడా ఈ పుస్తకంలో తమ విశ్లేషణలు చేశారు. -
పార్లమెంటులో ‘బిజినెస్’
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పనితీరు పట్ల అసంతృప్తి లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ విషయం చెప్పారు. ‘‘ఇటీవలి కాలంలో ఆర్బీఐ పర్యవేక్షణ, నియంత్రణ గణనీయంగా మెరుగుపడింది. పటిష్టమయ్యింది’’ అంటూ ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఇచ్చిన ఒక నివేదికను కూడా ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న రూ.9 లక్షల కోట్లకు పైగా నిధుల్లో భారీ మొత్తాన్ని ప్రభుత్వం కోరుతోందని, దిద్దుబాటు చర్యల చట్రంలో ఉన్న 11 బ్యాంకుల్లో కొన్నింటిపై నియంత్రణలు ఎత్తివేయాలని ఒత్తిడితెస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ నెలారంభంలో ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయటం తెలిసిందే. కొత్త గవర్నర్‌గా శక్తికాంతదాస్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో జైట్లీ తాజా సమాధానమిచ్చారు. -
35,540 దిగువన డౌన్‌ట్రెండ్
మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్డీఏ ఓటమిచెందడం, రిజర్వుబ్యాంక్ గవర్నర్ ఉర్జిత్పటేల్ రాజీనామా, ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వంటి పలు ప్రతికూలాంశాల నడుమ వరుసగా ఏడురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్ మార్కెట్...శుక్రవారం అంతర్జాతీయ ట్రెండ్‌కు తలొగ్గింది. అమెరికా మార్కెట్లయితే ఊపిరి పీల్చుకోకుండా పడుతున్నాయి. జపాన్‌లో సైతం ఇదే తంతు. గత శుక్రవారం అమెరికా మార్కెట్లో ట్రేడింగ్ పరిమాణం రెట్టింపయ్యింది. అక్కడ ఇదే ట్రెండ్ కొనసాగితే ఇండియాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లన్నీ తీవ్రమైన బేర్కక్ష్యలోకి మళ్లే ప్రమాదం వుంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ రెండోవారం నుంచి విదేశీ, స్వదేశీ ఫండ్స్ మన మార్కెట్లో తీసుకున్న భారీ లాంగ్ పొజిషన్లను జనవరికి రోలోవర్ చేస్తారా లేదా వారి పొజిషన్లను పూర్తిగా ఆఫ్‌లోడ్ చేస్తారా అనే అంశం ఇక్కడ కీలకం. సెన్సెక్స్ సాంకేతికాలు... డిసెంబర్ 21తో ముగిసిన వారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 35,800 మద్దతును పరిరక్షించుకుని వేగంగా 36,555 గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం భారీ పతనాన్ని చవిచూసి 35,695 కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 221 పాయింట్ల నష్టంతో 35,742 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌కు 200 రోజుల చలనసగటు రేఖ (200 డీఎంఏ) కదులుతున్న 35,540 పాయింట్ల స్థాయి కీలకం. ఈ స్థాయి దిగువన సోమవారం గ్యాప్‌డౌన్‌తో మార్కెట్ మొదలైతే వేగంగా 35,445 పాయింట్ల స్థాయికి పడిపోవొచ్చు. ఈ లోపున 50 డీఎంఏ రేఖ చలిస్తున్న 35,175 పాయింట్ల వరకూ సెన్సెక్స్‌కు సాంకేతిక మద్దతు ఏదీ లేదు. ఈ లోపున ముగిస్తే 34,420 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 36,050 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 36,200 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. ఆపైన ముగింపు..సెన్సెక్స్‌ను 36,480 పాయింట్ల స్థాయికి చేర్చవచ్చు. 10,765 దిగువన నిఫ్టీ బలహీనం గతవారం ప్రథమార్ధంలో 10,985 పాయింట్ల వరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో 10,738 పాయింట్ల స్థాయికి పతనమయ్యింది. చివరకు అంతక్రితంవారంకంటే 51 పాయింట్ల లాభంతో 10,754 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 200 డీఎంఏ రేఖ 10,765 పాయింట్ల వద్ద కదులుతున్నది. ఈ రేఖ ఎగువకు గత నెలరోజుల్లో రెండోదఫా నిఫ్టీ చేరినప్పటికీ, ఈ రెండు సందర్భాల్లో ఆపైన నిలదొక్కుకోలేకపోయింది. ఈ కీలక స్థాయి దిగువన నిఫ్టీ తిరిగి డౌన్‌ట్రెండ్‌లోకి జారుకునే ప్రమాదం వుంది. ఈ స్థాయి దిగువన సోమవారం నిఫ్టీ మొదలైతే వేగంగా 10,650 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున 50 డీఎంఏ రేఖ సంచరిస్తున్న 10,565 పాయింట్ల వద్దకు పతనం కావచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 10,330 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం నిఫ్టీ 10,765 పాయింట్ల స్థాయి ఎగువన స్థిరపడితే 10,820 వరకూ పెరగవచ్చు. అటుపై 10,880 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. ఆపైన కీలక అవరోధస్థాయి 10,965 పాయింట్లు. -
భార్య, భర్తల అనుబంధంలా ఉండాలి
రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం మధ్య సంబంధాలు భార్య, భర్తల మధ్య అనుబంధంలాగా ఉండాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఏవైనా భేదాభిప్రాయాలు వస్తే.. ఇరు పక్షాలు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం, ఆర్బీఐ మధ్య విభేదాలతో ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేశారన్న విమర్శల నేపథ్యంలో మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ’చేంజింగ్ ఇండియా’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మన్మోహన్ సింగ్ ఈ విషయాలు చెప్పారు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని, స్వతంత్రతను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇటు కేంద్రంతో కలిసి పనిచేస్తూనే అటు పటిష్టంగా, స్వతంత్రంగా కూడా పనిచేసేలా ఉండాలని చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వాల రైతు రుణ మాఫీ పథకాలపై స్పందిస్తూ.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చిన పక్షంలో తప్పక నెరవేర్చాల్సి ఉంటుందన్నారు. -
ఉర్జిత్ రాజీనామా కోరలేదు..
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని ఉర్జిత్ పటేల్‌ను ప్రభుత్వం కోరలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ప్రధానులుగా ఉన్న సమయంలోను, యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలోనూ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల రాజీనామాలను జైట్లీ ప్రస్తావించారు. వివిధ రంగాల్లో నెలకొన్న నిధుల కొరత (లిక్విడిటీ సమస్య), ఇతర అంశాలను ఆర్బీఐ పరిష్కరించాలని మాత్రం తాము కోరామని చెప్పారు. దాన్ని సమర్థించుకున్నారు కూడా. ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలతో ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి ఈ నెల 11న రాజీనామా చేయటం తెలిసిందే. ప్రభుత్వ ఒత్తిడులే దీనికి దారితీసినట్టు ప్రతిపక్షాలు, ఆర్థికవేత్తల నుంచి మోదీ సర్కారు విమర్శలను కూడా ఎదుర్కొంది. దీనిపై ఓ టీవీ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ స్పందించారు. ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్న పలు అంశాలపై చర్చ కోసం ఆర్బీఐ గవర్నర్‌కు కేంద్రం ఆదేశించే నిబంధనను ప్రభుత్వం ఉపయోగించిన విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ఆ తర్వాత రెండు బోర్డు సమావేశాలూ సుహృద్భావపూర్వకంగా జరిగాయి. మూడు నాలుగు అంశాలపై నిర్ణయం జరిగింది. కొన్నింటిపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ఆర్బీఐ వద్దనున్న రూ.9 లక్షల కోట్లకు పైగా నిధుల్లో కొంత మేర తగ్గించుకునే విషయాన్ని నిపుణుల కమిటీ మరికొన్ని రోజుల్లో తేల్చనుంది’’ అని జైట్లీ వివరించారు. ఈ అంశాలను పరిష్కరించాలని కోర డం ఆర్బీఐ స్వతంత్రత విషయంలో జోక్యం చేసుకోవడంగా పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆర్బీఐ వద్దే అధిక నిధులు ‘‘ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు సెంట్రల్ బ్యాంకులు స్థూల ఆస్తుల్లో 8 శాతాన్నే రిజర్వ్‌లుగా అమలు చేస్తున్నాయి. సంప్రదాయ దేశాల్లో ఇది 13– 14 శాతంగా ఉంది. కానీ, ఆర్బీఐ మాత్రం 28 శాతాన్ని రిజర్వ్‌లుగా కొనసాగిస్తోంది. 2013లో రూ.1.4 లక్షల కోట్లను ఆర్బీఐ అదనంగా ఇవ్వాలని నాటి ప్రభుత్వం కోరింది. కానీ, దీన్ని ఆర్బీఐపై స్వారీ చేయడమని ఎవరూ మాట్లాడలేదు’’ అని జైట్లీ గుర్తుచేశారు. ఆర్బీఐ వద్ద మిగులు నిధులను విడుదల చేస్తే వాటితో ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయంతోపాటు, పేద ప్రజల సంక్షేమ పథకాలకు వినియోగించే అవకాశం ఉందన్నారు. అంతేకానీ, ఈ నిధులు ద్రవ్యలోటు భర్తీకి, ప్రభుత్వ ఖర్చులకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్లుగా పనిచేసిన రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్ ఇద్దరితోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని, పదవుల నుంచి తప్పుకున్న తర్వాత కూడా వారితో అవే స్థాయి సంబంధాలు కొనసాగుతున్నాయని జైట్లీ చెప్పారు. ఐబీసీ, పరిష్కార పథకాల విలీనం తర్వాత రుణ భారంతో ఉన్న కంపెనీల విషయంలో పరిష్కారం కోసం అనుసరిస్తున్న దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ), ఇతర పరిష్కార పథకాలను ఒక్కటి చేయడాన్ని భవిష్యత్తులో పరిశీలిస్తామని జెట్లీ చెప్పారు. ‘‘పరిష్కారం కోసం పెద్ద ఎత్తున కంపెనీలు ఎన్సీఎల్టీ ముందుకొస్తున్నాయి. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఈ రద్దీ తగ్గి.. వ్యాపారాలు సాధారణ స్థితికి వస్తే అప్పుడు పునరాలోచిస్తాం. నిజాయతీతో కూడిన రుణదాత, రుణ గ్రహీత అనుబంధం ఐబీసీ కారణంగా ఎర్పడాల్సి ఉంది. అప్పుడే ఐబీసీ, ఇతర పథకాలను ఒక్కటి చేయడమన్న పరిస్థితి ఏదురవుతుంది’’ అని ఆర్థిక మంత్రి వివరించారు. రుణ బకాయిల పరిష్కారం, పునరుద్ధరణకు సంబంధించి ఆర్బీఐ పథకాలతో పెద్దగా ఫలితాలు రాలేదన్నారు. ఆర్బీఐ అందరితో కలిసే పనిచేయాలి... నియంత్రణ సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ.. ఎవ్వరితో కలవకుండా ఒంటరిగా పనిచేయడం కుదరదని, అందరితో చర్చించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా ఆర్బీఐని ఉద్దేశించి జైట్లీ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన లిక్విడిటీ మొదలుకుని రుణ వితరణ దాకా పలు విషయాల్లో ఆర్బీఐని చర్చలకు రప్పించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని చెప్పారాయన. ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య సంబంధాలెప్పుడూ దెబ్బతినలేదని, ప్రధాని నరేంద్ర మోదీ సహా అన్ని స్థాయిల్లోనూ సమావేశాలు సామరస్యంగానే సాగేవని తెలియజేశారు. నిర్దిష్టంగా ఆర్బీఐని ప్రస్తావించకుండా .. నియంత్రణ సంస్థలన్నీ సంబంధిత వర్గాలందరితో చర్చించాల్సిన అవసరం ఉంటుందని, అప్పుడే మార్కెట్ మనోభావాలు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పుకోవడానికి కొన్నాళ్ల ముందు నుంచి సంక్షోభంలో ఉన్న ఎన్బీఎఫ్సీలు వంటి పరిశ్రమ వర్గాలను కలిసేందుకు ఉర్జిత్ పటేల్ నిరాకరించారన్న వార్తల నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్బీఐని దారికి తెచ్చుకునేందుకు గతంలో ఏ ప్రభుత్వమూ ప్రయోగించని ఆర్బీఐ చట్టంలోని వివాదాస్పద సెక్షన్ 7ని కూడా మోదీ సర్కార్ ప్రయోగించడం తెలిసిందే. -
రిజర్వ్ బ్యాంకుకే ‘కన్నం’ వేస్తున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తంగా అగమ్యగోచరంగానే ఉంది. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఖాళీ అవుతున్న ఉద్యోగాలే భర్తీ కావడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తిలో (జీడీపీ) ఆర్థిక ద్రవ్యలోటు 3.3 శాతాన్ని మించరాదంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ అది 3.6 శాతానికి చేరుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది మరింత పెరిగే ప్రమాదం ఉంది. పరోక్ష పన్నుల వసూళ్లు లక్షిత వసూళ్లకు అంతనంత దూరంలోనే ఉన్నాయి. ఇక జీఎస్టీ వసూళ్లలో లక్ష్యాన్ని అందుకోవాలంటే ఈ డిసెంబర్ నెల నుంచి 2019, మార్చి నెల వరకు 45 శాతం వసూళ్లు జరగాలి. లక్షిత జీఎస్టీ వసూళ్లలో గత ఎనిమిది నెలల్లో జరిగిన వసూళ్లు 55 శాతం అన్నమాట. ఈ నాలుగు నెలల్లో మిగతా 45 శాతం వసూళ్లు చేయడం దాదాపు అసాధ్యం. దేశంలోని 11 భారత ప్రభుత్వరంగ బ్యాంకులు పూర్తిగా దివాలా తీశాయి. వాస్తవానికి వీటిని ఎప్పుడో మూసివేయాలి. కానీ 2017, ఏప్రిల్ ఒకటవ తేదీన తీసుకొచ్చిన ‘ప్రాప్ట్ కరెక్టివ్ ఆక్షన్ (పీఏసీ)’ కింద ఈ బ్యాంకులను నెట్టుకొస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో పేరుకుపోయిన 12 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిల్లో 90 శాతం బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకులవే. ఇప్పటికే కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసినా, నూతన సిబ్బంది నియామకాలను నిలిపివేసినా పరిస్థితి మెరుగుపడలేదు. రుణాల మాఫీ కోసం, సరైన గిట్టుబాటు ధరల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేసినప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా రైతుల రుణాల మాఫీకి మోదీ ప్రభుత్వం సాహసించలేకపోయిందంటే దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా లేదా దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చే ఏడాది, అంటే 2019, మేలోగా సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్కుగానీ, వినియోగదారుడికిగానీ నగదు కొరత రాలేదు. దేశ ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంటే సరిగ్గా ఎన్నికల సమయానికి నగదు కొరత పరిస్థితి కూడా వస్తుంది. అందుకనే నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రిజర్వ్ నిధుల మీద కన్నేసింది. రిజర్వ్ బ్యాంక్ వద్ద రిజర్వ్ నిధులు 9.6 లక్షల కోట్ల రూపాయలు ఉండగా, ఆపధర్మ నిధి కింద 3.6 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏ ప్రభుత్వానికి ఇవ్వలేదు దేశంలోని బంగారం, ఫారెక్స్ నిల్వలు పడిపోయినప్పుడల్లా వాటి నిర్దేశిత స్థాయిని కొనసాగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ రిజర్వ్ నిధులను విడుదల చేస్తుంది. ఇక ఆపధర్మ నిధిని అనుకోకుండా భవిష్యత్తులో వచ్చే అవసరాల కోసం వాడాలని ఏర్పాటు చేసుకొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో రిజర్వ్ బ్యాంకును జాతీయం చేయగా, ఈ ఆపధర్మ నిధిని 1950లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం కూడా ఆపధర్మ నిధులను అడగలేదు. ఆర్బీఐ ఇవ్వలేదు. ఉర్జిత్ పటేల్‌పై అదే ఒత్తిడి ఆర్బీఐ ఆపధర్మ నిధి నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం గతకొంత కాలం నుంచి మొన్నటివరకు ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్ పటేల్‌పై ఒత్తిడి చేస్తూ వచ్చింది. తమ మాట వినకపోతే ఆర్బీఐ చట్టంలోని ఏడో షెడ్యూల్ కింద ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఉర్జిత్‌కు హెచ్చరిక కూడా చేశారు. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని రక్షించడం కోసం గతంలో ఏ ప్రభుత్వం ఈ షెడ్యూల్‌ను ఉపయోగించలేదు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ బోర్డు సభ్యులు రెండు, మూడు సార్లు సమావేశమై ప్రభుత్వ ప్రతిపాదన గురించి చర్చించారు. ప్రభుత్వానికి సానుకూలంగా నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. కాకపోతే వ్యక్తిగత కారణాలపై రాజీనామా చేస్తున్నానని చెప్పుకున్నారు. మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలాన్ని పొడిగించకుండా ఉర్జిత్ పటేల్‌ను కోరి తెచ్చుకున్నందుకు ఆయనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాల్సిందే. కానీ రెండు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఇచ్చేంత కృతజ్ఞత చూపలేకపోయారు. ఓ ఆర్థిక నిపుణుడిగా దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు కనుక. కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ ఎవరు? ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను తీసుకొచ్చారు. ఆయన రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్‌లాగా ఆర్థికవేత్త కాదు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుత 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా ఐఏఎస్ ఆఫీసర్‌ను నియమించడం ఇదే కొత్తకాదు. గతంలో 14 మంది ఐఏఎస్–ఐసీఎస్ ఆఫీసర్లు పనిచేశారు. వారిలో ఎక్కువమంది ఆర్థిక వేత్తలే. 1990లో ఎస్. వెంకటరామన్ తర్వాత చదువురీత్యా ఆర్థిక వేత్తకానీ వ్యక్తిని తీసుకరావడం ఇదే మొదటిసారి. కొత్త గవర్నర్ ప్రభుత్వం మాట వింటారా? అక్షరాలా వింటారు. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఏర్పడిన సంక్షోభంలో ఎప్పటికప్పుడు కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ అడుగడుగున సమర్థిస్తూ వచ్చిందీ ఈ శక్తికాంత దాసే. అయినా ఆయన ఇప్పటికీ పెద్ద నోట్లను రద్దు చేయడం తప్పుకాదంటారు. అసలేం అవుతుంది ? మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీఐని దేవురించాల్సిన పరిస్థితి రావడానికి ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత తెచ్చిన జీఎస్టీనే. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం ఎప్పటికీ అంగీకరించదు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా మోదీ పక్షాన నిలిచిన శక్తికాంత దాస్, ఇప్పుడు కూడా ఆయన పక్షానే నిలిచి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడవచ్చు! ఆ నిర్ణయం వల్ల 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ పార్టీ గట్టెక్కవచ్చు. కానీ ఐదేళ్లకాలంలోనే జింబాబ్వే, అర్జెంటీనా, వెనిజులాలో తలెత్తిన ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలు భారత్‌కు కూడా తప్పకపోవచ్చు. ఆ మూడు దేశాల్లో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు ప్రభుత్వాలు సెంట్రల్ బ్యాంకులను (మన రిజర్వ్ బ్యాంక్‌కు సమానం) స్వాధీనం చేసుకున్న పర్యవసానంగా సామాజిక, రాజకీయ సంక్షోభాలు తలెత్తాయి. -
మొండి బకాయిలు వసూలు కావు... జాగ్రత్త
న్యూఢిల్లీ: ఉర్జిత్ పటేల్ ఆకస్మిక రాజీనామా... ఆర్బీఐ విధానాల ప్రాధాన్యతల విషయంలో ఉన్న రిస్క్‌ను తెలియజేస్తోందని రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. కేంద్ర బ్యాంకులో ప్రభుత్వ జోక్యం పెరగడాన్ని ఇది తెలియజేస్తోందని, మొండి బకాయిల పరిష్కారానికి ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాలకు దీనివల్ల విఘాతం కలుగుతుందని అభిప్రాయపడింది. పటేల్ రాజీనామా కారణంగా ఏర్పడే సమస్యలన్నవి కొత్తగా వచ్చిన శక్తికాంత దాస్ సారథ్యంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా తేటతెల్లం అవుతాయని పేర్కొంది. ‘‘వృద్ధిని వేగవంతం చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఎంతో కాలంగా వచ్చిన ఒత్తిళ్ల తర్వాతే ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయడం జరిగింది. ఇది ఆర్బీఐ విధాన ప్రాధాన్యతల రిస్క్‌ను తెలియజేస్తోంది. మొండి బకాయిల పరిష్కారానికి ఆర్బీఐ చేపడుతున్న చర్యలు దీర్ఘకాలంలో బ్యాంకింగ్ రంగ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ద్రవ్యోల్బణం నియంత్రణకు కట్టుబడి ఉండటం అన్నది మరింత స్థిరమైన స్థూల ఆర్థిక వాతావరణానికి కారణం అవుతుంది. ఆర్బీఐలో ప్రభుత్వ జోక్యం పెరిగితే అది ప్రగతికి విఘాతం కలిగిస్తుంది’’ అని ఫిచ్ వివరించింది. దీర్ఘకాలంగా ఉన్న ఎన్పీఏల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల విషయంలో వెనక్కి తగ్గితే అది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆర్బీఐ విధానాలను మరింత ప్రోత్సహించడం ప్రభుత్వానికి రాజకీయ ప్రోత్సాహకం అవుతుందని అభిప్రాయపడింది. -
ఆర్బీఐకి ‘శక్తి’ కాంత్!
న్యూఢిల్లీ : బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న ఈ 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి... ఇప్పటిదాకా ఆర్థిక రంగానికి సంబంధించిన పలు కీలక పదవులు నిర్వహించారు. తమిళనాడు కేడర్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి స్వరాష్ట్రం ఒడిశా. ఆ రాష్ట్రం నుంచి తొలిసారి ఈ బాధ్యతలు చేపడుతున్నది కూడా ఈయనే. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వంటి వ్యవహారాల్లో ఆరంభంలో ఎదురైన పలు సవాళ్లను అధిగమించడంలో కీలక పాత్ర పోషించారు. వ్యక్తిగత కారణాలతో గవర్నర్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్ పటేల్ ప్రకటించిన మరుసటి రోజే కేంద్రం ఈ కీలక పదవికి 61 సంవత్సరాల దాస్ పేరును ప్రకటించడం గమనార్హం. మూడేళ్లు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారని అధికారిక ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలియజేసింది. నిజానికి ఒక బ్యూరోక్రాట్‌కు సెంట్రల్ బ్యాంక్ చీఫ్ బాధ్యతలు అప్పగించటం ఐదేళ్లలో ఇదే తొలిసారి. అంతకు ముందు ఐఏఎస్ అధికారి దువ్వూరి సుబ్బారావు ఈ బాధ్యతలు నిర్వహించారు. ఆయన తరవాత మూడేళ్లపాటు రఘురామ్ రాజన్, రెండేళ్లకు పైగా ఉర్జిత్ పటేల్ ఈ పదవిలో కొనసాగటం తెలిసిందే. ‘తాత్కాలికం’ అంచనాలకు భిన్నంగా... నిజానికి పటేల్ రాజీనామా నేపథ్యంలో– ఈ బాధ్యతలకు తాత్కాలికంగా ఎవరో ఒకరిని నియమిస్తారని అంతా భావించారు. అయితే ఇందుకు భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ దాస్‌ను మూడేళ్ల కాలానికి ఎంచుకోవడం గమనార్హం. డాక్టర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాను కేంద్రం ఆమోదించిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే తాజా నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి శక్తికాంత దాస్‌కు విశేష అనుభవం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎ.ఎస్.ఝా పేర్కొన్నారు. ఐఏఎస్ నుంచి ఆర్బీఐ గవర్నర్ వరకూ... దాస్ 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి. నార్త్‌బ్లాక్‌లో నిర్వహించిన బాధ్యతల్లో పరిపూర్ణత ఆయనను మింట్ స్ట్రీట్ వరకూ నడిపించిందని చెప్పవచ్చు. 38 సంవత్సరాల కెరీర్లో ప్రతి సందర్భంలోనూ శక్తికాంత దాస్... వివాద రహిత ధోరణి కలిగిన వ్యక్తిగా, కీలక అంశాల్లో ఏకాభిప్రాయ సాధనలో విజయం సాధించే నేర్పరిగా ప్రత్యేకత సాధించారు. 2017 మేలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు సహా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న ఆటుపోట్లను పరిష్కరించటంలో కీలక పాత్రను పోషించారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత... భారత్‌లో జీ–20 సమావేశాల నిర్వహణ బాధ్యతలను కేంద్రం ఆయనకు అప్పగించింది. 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి చరిత్రలో పట్టభద్రులయిన శక్తికాంత దాస్... 2008లో పి.చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తొలిసారి ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. తదుపరి 2014 మధ్యలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టాక ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆయన కీలక బాధ్యతలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రెవెన్యూ శాఖ పగ్గాలను ఆయనకు అప్పగించింది. అటు తర్వాత ఆర్బీఐ, ద్రవ్య పరపతి విధానంతో ప్రత్యక్ష సంబంధాలు నెరపే ఆర్థిక వ్యవహారాల శాఖ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనల్లో పలు సంవత్సరాలు ఆయన ముఖ్య భూమిక వహించారు. ఈ నియామకం హర్షణీయం ఆర్బీఐ చీఫ్‌గా శక్తికాంత్‌దాస్ నియామకం హర్షణీయం. అంతర్జాతీయంగా, దేశీయంగా ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న వ్యక్తి నియామకం ఆర్బీఐ ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందని భావిస్తున్నాం. కీలక కూడలిలో ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థకు తాజా నియామకం లాభిస్తుందని విశ్వసిస్తున్నాం. – రాకేశ్ షా, ఫిక్కీ ప్రెసిడెంట్ ఫైనాన్షియల్ మార్కెట్లకు ప్రయోజనం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నియామకం ఫైనాన్షియల్ మార్కెట్లకు ఎంతో ప్రయోజనాన్ని కల్పిస్తుంది. ద్రవ్య, వాణిజ్య పరమైన అంశాల్లో దాస్‌కు విశేష అనుభవం ఉండడమే దీనికి కారణం. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక విధానాల రూపకల్పనలోనూ ఈ నియామకం సానుకూల ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ గొప్ప నిర్ణయం దాస్‌కు నా శుభాకాంక్షలు. ఆయన నాకు కళాశాల రోజుల నుంచీ తెలుసు. అత్యంత ప్రతిభా పాటవాలు కలిగిన, పరిపక్వత కలిగిన అధికారి ఆయన. గొప్ప టీమ్ లీడర్. ఏకాభిప్రాయ సాధనలో ఆయనకు ఆయనే సాటి. ఆర్థికాభివృద్ధిలో, ఆర్బీఐ స్వతంత్య్రత, ప్రతిష్టలను కాపాడ్డంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. – అమితాబ్‌కాంత్, నీతీ ఆయోగ్ సీఈఓ లిక్విడిటీ సమస్యల పరిష్కారం కొత్త గవర్నర్ దాస్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలను పరిష్కరిస్తారన్న విశ్వాసం ఉంది. పరిశ్రమల సెంటిమెంట్‌కు ఈ నియామకం బలాన్నిస్తుంది. దాస్ అపార ఆర్థిక అనుభవం కలిగినవారు. పలు వ్యవహారాల సున్నిత పరిష్కారానికి, స్థిరత్వానికి ఆయన నియామకం దోహదపడుతుంది. బ్యాంకింగ్, నాన్–బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో లిక్విడిటీ సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నాం. – రాకేష్ భారతీ మిట్టల్, సీఐఐ ప్రెసిడెంట్ 14న బోర్డ్ భేటీ యథాతథం ఈ నెల 14వ తేదీన యథాతథంగానే ఆర్బీఐ బోర్డ్ సమావేశం జరుగుతుందని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ఆర్బీఐలో దిద్దుబాటు చర్యల చట్రంలో ఉన్న 11 బ్యాంకుల్లో కొన్నింటికి సడలింపులు వంటి కీలక అంశాలపై 14 మంది బోర్డ్ సభ్యులు ఈ భేటీలో చర్చిస్తారు. దాస్ నియామకాన్ని తప్పుపట్టిన ఆర్థికవేత్త అభిజిత్ ముఖర్జీ .. రిటైర్డ్ బ్యూరోక్రాట్ శక్తికాంత్ దాస్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా ప్రభుత్వం నియమించడాన్ని ప్రముఖ ఆర్థిక వేత్త, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రొఫెసర్ అభిజిత్ ముఖర్జీ తప్పుపట్టారు. దీనివల్ల కీలకమైన ప్రభుత్వ సంస్థల్లో గవర్నెన్స్‌పరమైన అంశాలపై సందేహాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. విశ్వసనీయతను పునరుద్ధరించాలి ఉర్జిత్ పటేల్ స్థానంలో నియమితులైన వ్యక్తి అత్యున్నత సంస్థ విశ్వసనీయతను, స్వతంత్రతను పునరుద్ధరించాలి. రాజీనామా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉర్జిత్ పటేల్ ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనబడుతోంది. పటేల్ రాజీనామా నేపథ్యంలో– ఈ అంశంపై కేంద్రం కూడా ఆత్మావలోకన చేసుకోవాలి. జోక్యం ఏ స్థాయిలో అవసరం, పరిమితులేమిటి? వంటి అంశాల్లో కేంద్రం పరిపక్వత కలిగి ఉంటుందని విశ్వసిస్తున్నా. – దువ్వూరి సుబ్బారావు, ఆర్బీఐ మాజీ గవర్నర్ -
ఉర్జిత్ బాంబు : దలాల్‌స్ట్రీట్ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాకమార్కెట్లు సెన్సెక్స్ 713, నిఫ్టీ 205 పతనమైన కీలక సూచీలు మంగళవారం మరింత కుదేలయ్యాయి. మంగళవారం అదే ధోరణిని కొనసాగిస్తూ సెన్సెక్స్ 350, పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు పతనమై ట్రేడ్ అవుతున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ పరిణామాలు, మరోవైపు దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. దీనికి తోడు దేశ కేంద్ర బ్యాంకులో చోటు చేసుకున్న దిగ్భ్రాంతికర పరిణామం వెరసి దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల సెగ రేగింది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ పెత్తనమంటూ భారీ బాంబు పేల్చిన ఆర్బీఐ గవర్నర్ డా. ఉర్జిత్ పటేల్ నిశ్శబ్ద నిష్క్రమణ ఇన్వెస్టర్లును భారీగా నిరాశపర్చింది. దాదాపు అన్ని రంగాలూ నష్టాల్లోనే. అటు దేశీయ రుపాయి కరెన్సీ కూడా భారీ నష్టాలతో ప్రారంభమైంది. డాలరుమారకంలో ఏకంగా రూపాయికిపైగా పతనమైన 72.35 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మిజోరం, తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. -
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా, సీబీఐలో అంతర్గత కుమ్ములాటలు, రఫేల్ ఒప్పందంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణంపై మిత్రపక్షం శివసేన నుంచే బీజేపీకి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మరోవైపు అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్‌ను దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకురావడం, విజయ్‌మాల్యా అప్పగింతపై బ్రిటన్ కోర్టు తీర్పును ఈ సమావేశాల్లో ఎన్డీయే ప్రధా న అస్త్రంగా వాడుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రిపుల్ తలాక్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి తదితర 45 కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. -
ఉర్జిత్ నిష్క్రమణ!
‘‘మేం డేగలమూ కాదు, పావురాళ్లమూ కాదు... గుడ్లగూబలం. అది జ్ఞానానికీ, వివేకానికీ చిహ్న మని మీకు తెలుసు కదా’’ అని నాలుగేళ్లక్రితం ఒక సందర్భంలో రిజర్వ్‌బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ చమత్కరించారు. అప్పటికాయన డిప్యూటీ గవర్నర్‌గా ఉంటున్నారు. గుడ్లగూబ ఇంటిపై వాలినా, దాని అరుపు వినబడినా అరిష్టమని కొందరి నమ్మకం. దాని సంగతలా ఉంచి ఎన్డీఏ ప్రభుత్వానికి తనపై ఎలాంటి అభిప్రాయముందో గ్రహించుకుని ఉర్జిత్ పటేల్ సోమవారం గవర్నర్ పదవినుంచి వైదొలగారు. ‘వ్యక్తిగత కారణాలతో’ నిష్క్రమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్‌బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు గురుమూర్తి వరకూ ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన అందించిన సేవలను, ఆయన నిజాయితీని, నిపుణతను ప్రస్తుతిస్తూ ట్వీట్లు చేశారు. ఇంతగా ప్రశంసలందుకున్నారు గనుక పదవుల నుంచి తప్పుకుంటున్న కొందరు రాస్తున్నట్టు గవర్నర్‌గా తన అనుభవాలను ఆయన మున్ముందు గ్రంథస్తం చేస్తారో లేదో చూడాల్సి ఉంది. ఈమధ్య కాలంలో ఉర్జిత్కూ, కేంద్రానికీ మధ్య అభిప్రాయ భేదాలు తారస్థాయికెళ్లడం, అవి ఎప్పుడూ లేని విధంగా మీడియాలో ప్రము ఖంగా రావడం సంచలనం కలిగించింది. గత నెల 19న రిజర్వ్‌బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు తొమ్మిది గంటల సుదీర్ఘ సమావేశం జరిపినప్పుడు అందులో ఏ నిర్ణయాలు వెలువడతాయోనని పరిశ్రమ వర్గాలు, ఆర్థికరంగ నిపుణులు ఉత్కంఠతో ఎదురుచూశారు. ఆ సమావేశంలో కేంద్రం తాడో పేడో తేల్చుకుంటుందని, అసాధారణమైన రీతిలో ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ను ఉపయోగించి బ్యాంకు వ్యవహారాలను తన పరిధిలోకి తెచ్చుకుంటుందని ఊహాగానాలు వెలువడ్డాయి. అదే జరిగితే ప్రమాదకర పరిణామాలు ఏర్పడే అవకాశం ఉన్నదని కొందరు నిపుణులు భావించారు. కానీ అందుకు భిన్నంగా ఆ సమావేశం సుఖాంతమైంది. ఎడాపెడా రుణాలిచ్చి వాటిని వసూలు చేయలేని స్థితిలో పడిన బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయకుండా విధించిన ఆంక్షల్ని సడలించే అంశాన్ని పరిశీలించడానికి ఆర్బీఐ ఈ సమావేశంలో అంగీకరించింది. ఆ ఆంక్షల వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు రుణలభ్యత అసాధ్యమవుతోంది. ఇది ఉత్పాదకతపైనా, ఉపాధి అవకాశాలపైనా ప్రభావం చూపుతున్నదని కేంద్రం భావించింది. అలాగే ఆర్బీఐ దగ్గరున్న 9.69 లక్షల కోట్ల మూలధనంలో కొంత మొత్తాన్ని సామాజిక సంక్షేమ పథకాల అమలుకు వీలుగా తనకు బదలాయించాలని కేంద్రం భావించింది. అయితే ఆర్బీఐ దగ్గర తగి నంతగా ద్రవ్య నిల్వలుంటేనే దానిపై అందరికీ విశ్వసనీయత ఏర్పడుతుందన్నది ఉర్జిత్ మనో గతం. ఇక చెల్లింపుల వ్యవహారాల పర్యవేక్షణను రిజర్వ్‌బ్యాంకు పరిధి నుంచి తప్పించి దానికోసం ఒక స్వతంత్ర బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రం భావించగా, ఆర్బీఐ అది సరికాదని బహిరం గంగానే అసమ్మతిని ప్రకటించింది. రిజర్వ్‌బ్యాంకుకూ, కేంద్రానికీ మధ్య ఘర్షణ మన దేశంలో కొత్తగాదు. ఆ రెండూ రెండు వేర్వేరు అస్తిత్వాలు గలవి. కనుక వాటి వాటి కర్తవ్య నిర్వహణలో విభేదాలు తలెత్తడం సహజం. నిజానికిది అవసరం. విభేదాలు చర్చలకు దారితీస్తాయి. ఆ చర్చలు పరస్పర అవగాహనకు దారులు పరుస్తాయి. చివరకు ఏకాభిప్రాయానికి దోహదపడతాయి. దేశంలో ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడటానికి ఇదంతా అవసరం. తన మాటే చెల్లుబడి కావాలని ఎవరికి వారనుకుంటే అది అంతిమంగా ఆ వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఆర్బీఐ, కేంద్రం మధ్య సంబంధాలు అత్యంత సంక్లిష్టమైనవి. వాటిని నేర్పుగా నిర్వహించడం, ఆర్థికరంగంలో వైఫల్యాలు ఎదురుకాకుండా చూడటం కత్తిమీది సాము వంటిది. ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నకాలంలో వై. వేణుగోపాలరెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. ‘‘అవును నేను స్వతంత్రుణ్ణే. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థే. నేను కేంద్ర ఆర్థికమంత్రి అనుమతి తీసుకున్నాక ఈ సంగతి చెబుతున్నాను’’ అని ఆయన వ్యంగ్యంగా చెప్పారు. తాము చెప్పినట్టల్లా వినే గవర్నర్ ఉండాలని కేంద్రం ఎంతగా వాంఛించినా అది చివరకు ఎటు దారితీస్తుందో దానికి తెలియనిది కాదు. అలాంటి ఆర్బీఐపై అంతర్జాతీయంగా విశ్వసనీయత ఉండదు. దాని పనితీరుపై, సామర్థ్యంపై నమ్మకం కుదరదు. అదే సమయంలో ఆర్బీఐ సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తానంటే ప్రజాస్వామ్యంలో చెల్లదు. ఈ పరిస్థితి ఉండరాదని భావించింది ఉర్జిత్పటేలే. ఆర్బీఐ నిర్ణయాల్లో కేంద్రం మనోగతం కూడా చెల్లుబా టయ్యే విధంగా ఆరుగురు సభ్యులుండే ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ)కి డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయనే రూపకల్పన చేశారు. దానికి వడ్డీరేట్ల పెంపు, తగ్గింపు మొదలుకొని నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) వరకూ పలు అంశాలను సమీక్షించి నిర్ణయించే అధికారం ఉంది. అంతక్రితం ఈ అధికారం కేవలం గవర్నర్‌కి మాత్రమే ఉండేది. అలాంటి ఉర్జిత్‌కు కూడా కేంద్ర ప్రభుత్వంతో భిన్నాభిప్రాయాలు ఏర్పడటం, అవి బజారున పడటం అనారోగ్య వాతావరణానికి చిహ్నం. ముఖ్యంగా బోర్డు సభ్యులు కొందరు ఆర్బీఐ తీరుపై బాహాటంగా చేసిన వ్యాఖ్యలు సరికాదు. పెద్దనోట్ల రద్దు సమయంలో ఉర్జిత్ దృఢంగా వ్యవహ రించలేదని కొందరు అభిప్రాయపడినా ద్రవ్యోల్బణం కట్టడి మొదలుకొని రుణాల ఎగవేత ధోర ణులను అరికట్టడం వరకూ పలు అంశాలపై ఆయన కఠినంగా ఉన్నారు. యాక్సిస్ బ్యాంకు, యెస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర వంటి ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఆయన దృఢంగా వ్యవ హరించారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులపై కేంద్ర నియంత్రణ కూడా ఉన్నందువల్ల కావొచ్చు... ఆయన మాట పెద్దగా చెల్లుబాటు కాలేదు. ఏదేమైనా ఆర్బీఐ స్వతంత్రతను కాపా డటంలో ఉర్జిత్ పాత్ర ఎన్నదగినది. తదుపరి గవర్నర్ ఈ వారసత్వాన్ని కొనసాగిస్తారా లేదా అన్నది మున్ముందు చూడాల్సి ఉంది. -
ఉర్జిత్ పటేల్ రాజీనామా.. మిస్ యూ అన్న మోదీ!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ సోమవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక విధాన నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడుతూ వస్తున్న ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం.. పలువురిని ఆశ్చర్య పరుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తక్షణమే వైదొలుగుతున్నానని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసినందుకు గర్విస్తున్నానని పేర్కొన్న ఉర్జిత్.. పదవీకాలంలో తనకు సహకరించిన ఉద్యోగులు, ఆర్బీఐ డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 2016 నుంచి ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగుతున్న ఉర్జిత్ పటేల్ తన పదవీకాలం కన్నా చాలాముందే రాజీనామా చేశారు. 2019 సెప్టెంబర్ వరకు ఆయన పదవీకాలం ఉంది. ఉర్జిత్ పటేల్ హయాంలోనే పెద్దనోట్ల రద్దు వంటి తీవ్రమైన నిర్ణయాలను మోదీ సర్కారు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గతకొంతకాలంగా విధాన నిర్ణయాల విషయంలో కేంద్రంతో ఉర్జిత్ పటేల్ విబేధిస్తున్న సంగతి తెలిసిందే. తాను చెప్పినట్టు వినకుండా ఉర్జిత్ స్వతంత్రంగా వ్యవహరిస్తుండటం.. కేంద్రాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఆర్థిక వ్యవస్థపరంగా దేశం ఒకింత క్లిష్టసమయంలో ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేయడం రాజకీయంగా దుమారం రేపే అవకాశముంది. ఉర్జిత్ రాజీనామాను అస్త్రంగా చేసుకొని.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టే అవకాశముందని తెలుస్తోంది. వుయ్ మిస్ యూ: ప్రధాని మోదీ ఉర్జిత్ పటేల్ రాజీనామాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్లో స్పందించారు. ‘వృత్తిపరంగా ఉర్జిత్ పటేల్ తిరుగులేని నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఆయన ఆరేళ్లు దేశానికి సేవలందించారు. గొప్ప వారసత్వాన్ని ఆయన అందించారు. ఆయనను మేం మిస్సవుతున్నాం’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేయగా.. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఉర్జిత్ అందించిన సేవలను ప్రభుత్వం ఎంతో గౌరవంతో కొనియాడుతోందని, ఆయన మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని తాను కోరుకుంటున్నట్టు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. దేశంలోని ఎంతో విలువైన వ్యవస్థలన్నింటినీ మోదీ ప్రభుత్వం వరుసగా ధ్వంసం చేస్తోందని, అందుకు తాజా నిదర్శనమే ఉర్జిత్ రాజీనామా అని కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా మండిపడ్డారు. -
ఎక్కడి రేట్లు అక్కడే..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్షలో యథాతథస్థితిని కొనసాగించే అవకాశం ఉందని ఎక్కువ మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క ఆర్థిక వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం శాంతించినప్పటికీ... ఈ నెల 5న ప్రకటించనున్న పాలసీ నిర్ణయంలో కీలక రేట్లలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని వారు భావిస్తున్నారు. వరుసగా రెండు పాలసీల్లో రెపో రేటును పెంచిన ఆర్బీఐ గత సమీక్ష(అక్టోబర్)లో మాత్రం రేట్లను పెంచకుండా అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. డాలరుతో రూపాయి మారకం విలువ పాతాళానికి పడిపోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో అక్టోబర్‌లో బ్యాంకర్లు, నిపుణులు ఆర్బీఐ రెపో రేటును పెంచొచ్చని అంచనా వేశారు. అయితే, దీనికి భిన్నంగా ఆర్బీఐ వ్యవహరించడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 3 నుంచి 5 వరకూ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది. 5న నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ప్రస్తుతం రెపో రేటు (బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) 6.5 శాతంగా ఉంది. రివర్స్ రెపో(ఆర్బీఐ వద్ద ఉంచే నగదుపై బ్యాంకులకు లభించే వడ్డీ) 6.25 శాతంగా కొనసాగుతోంది. ఇక సీఆర్ఆర్(నగదు నిల్వల నిష్పత్తి– బ్యాంకులు తమ డిపాజిట్ నిల్వల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం–దీనిపై ఎలాంటి వడ్డీ లభించదు) 4 శాతం వద్ద ఉంది. రూపాయి రివర్స్‌గేర్... అక్టోబర్‌లో సమీక్ష నాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 72–73 రికార్డు కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఆతర్వాత 74.5 స్థాయికి కూడా క్షీణించి వేగంగా కోలుకుంది. ప్రస్తుతం మళ్లీ కీలకమైన 70 ఎగువకు రికవరీ అయింది. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు ధర (బ్రెంట్ క్రూడ్) 85 డాలర్ల నుంచి ఇప్పుడు ఏకంగా 60 డాలర్ల కిందికి దిగొచ్చింది. ఈ రెండు అంశాలూ ఆర్బీఐ రేట్ల పెంపు ఆలోచనలను పక్కనబెట్టేలా చేస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2018–19, క్యూ2)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు కాస్త మందగించి 7.1 శాతానికి పరిమితమైంది. తొలి త్రైమాసికం(క్యూ1)లో వృద్ధి రేటు 8.2 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. గతేడాది క్యూ2లో వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.31%కి దిగొచ్చింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి కూడా. ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరలు తగ్గడం దీనికి కారణం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 3.7 శాతం. ఎవరేమంటున్నారంటే... ఆర్బీఐ ఈ నెల 5న ప్రకటించనున్న పరపతి విధాన సమీక్ష నిర్ణయంలో కీలక రేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని కోటక్ రీసెర్చ్ అభిప్రాయపడింది. ‘గత సమీక్షలో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం రిటైల్ ద్రవ్యోల్బణం 3.9–4.5 శాతంగా ఉండొచ్చని, అదేవిధంగా వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో 4.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే, ఆహార ధరలు భారీగా దిగిరావడంతో ద్వితీయార్ధంతో 2.9–4.3 శాతం, వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో 4.5 శాతం స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఉండొచ్చని మేం భావిస్తున్నాం. మరోపక్క, గత కొద్ది నెలలుగా భగ్గుమన్న పెట్రో ధరలు.. శాంతించడం కూడా ద్రవ్యోల్బణం దిగొచ్చేందుకు తోడ్పడుతుంది’ అని కోటక్ రీసెర్చ్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి జీడీపీ వృద్ధిరేటు 7.3 శాతంగా ఉండొచ్చని.. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనమిస్ట్ దేవేంద్ర కుమార్ పంత్ అంచనా వేశారు. ఈ తరుణంలో పాలసీలో ఆర్బీఐ రెపో రేటులో మార్పులూ చేయకపోచ్చని ఆయన వ్యాఖ్యానించారు. -
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దువల్ల ఆర్థిక వ్యవస్థపై ఏర్పడ్డ ప్రభావం తాత్కాలికమేనని ఆయన అన్నారు. ఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని 31 మంది సభ్యులున్న పార్లమెంటరీ స్థాయీ సంఘం(ఆర్థికాంశాలు) ముందు హాజరైన ఉర్జిత్ పటేల్.. ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ పరిస్థితులపై ఆయన ప్రజెంటేషన్ సమర్పించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు లాభిస్తుందని తెలిపారు. 2016, నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకుల రుణ పరపతి 15 శాతం పెరిగిందన్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం సైతం 4 శాతం దిగువకు వచ్చిందని గుర్తుచేశారు. అయితే ఆర్బీఐ చట్టంలోని సెక్షన్–7ను తొలగించాలన్న ప్రతిపాదన, నిరర్ధక ఆస్తులు, ఆర్బీఐ స్వతంత్రత, తదితర విషయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పటేల్ సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలకు ఉర్జిత్ సమాధానం ఇవ్వకపోవడంతో, వీటన్నింటిపై మరో 10–15 రోజుల్లో రాతపూర్వకంగా జవాబివ్వాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కోరింది. -
పార్లమెంటరీ కమిటీ ఎదుట ఆర్బీఐ గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు, బ్యాంకుల్లో మొండి బకాయిల (ఎన్పీఏ)పై వివరణ ఇచ్చేందుకు ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ మంగళవారం ఆర్థిక వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయన పదిరోజుల్లో లిఖితపూర్వకంగా బదులిస్తారు. పార్లమెంటరీ కమిటీ సభ్యులతో సంప్రదింపుల సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ముడిచమురు ధరలు, భారత ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి చర్చించినట్టు సమాచారం. నోట్ల రద్దు, బ్యాంకుల్లో ఎన్పీఏల పరిస్థితి పర్యవసానాలపై సభ్యులు ఆర్బీఐ గవర్నర్‌ను ప్రశ్నించారు. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలో 31 మంది సభ్యులున్న ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. కాగా ఆర్బీఐ నిర్వహణ వ్యవహరాల్లో ఇటీవల కేంద్ర జోక్యం పెరిగిందన్న విమర్శల నేపథ్యంలో సెక్షన్ 7ను ప్రయోగించారనే ప్రచారంపై పార్లమెంటరీ కమిటీ ఊర్జిత్ పటేల్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. -
ఆర్బీఐ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు
ముంబై: కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య దాదాపు కీలక అంశాలన్నిటి మధ్యా సయోధ్య కుదిరింది. సున్నితమైన పలు అంశాలకు సంబంధించి ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొనడంతో... సోమవారం ఆర్బీఐ బోర్డు సమావేశం తొమ్మిది గంటలకు పైగా వీటన్నింటిపై చర్చించింది. ‘‘సుహృద్భావ పూర్వక వాతావరణంలో ఈ సమావేశం జరిగింది. చాలా అంశాలు స్నేహపూర్వక రీతిలో పరిష్కారం అయ్యాయి’’ అని బోర్డు సభ్యుడొకరు తెలిపారు. తదుపరి ఆర్బీఐ బోర్డు సమావేశం డిసెంబర్ 14న జరుగుతుందని బోర్డు సభ్యుడు సచిన్ చతుర్వేది తెలియజేశారు. వివిధ అంశాలకు సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నారంటే... 1. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ రంగానికి) ఇచ్చిన రుణాల్లో, మొండి బకాయిలుగా మారిన వాటిని పునరుద్ధరించాలని కేంద్రం కోరుతోంది. ఇందుకోసం ఓ పథకాన్ని పరిశీలించే బాధ్యతను నిపుణుల కమిటీకి ఆర్బీఐ బోర్డు అప్పగించింది. 2. ఆర్బీఐ వద్ద భారీగా ఉన్న రూ.9.69 లక్షల కోట్ల నగదు నిల్వల నుంచి కొంత భాగాన్ని బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తోంది. దీనిపై అసలు ఆర్బీఐ వద్ద వాస్తవంగా ఎంత మేర మిగులు నిల్వలు ఉండాలి? మిగులు నిల్వలను కేంద్ర ప్రభుత్వానికి బదలాయించడానికి సంబంధించిన ‘ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్’ ఎలా ఉండాలి? అనేది నిర్ణయించేందుకు ఓ ఉన్నత స్థాయి నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ బోర్డు నిర్ణయించింది. 3. ప్రభుత్వరంగంలోని 21 బ్యాంకులకు గాను 11 బ్యాంకులను ఆర్బీఐ నిక్కచ్చయిన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలోకి తీసుకొచ్చి, వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇవి కొత్త రుణాలివ్వడానికి అవకాశం లేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటి విషయంలో నిబంధనలను సరళించాలని కేంద్రం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐకి చెందిన ఆర్థిక పర్యవేక్షక బోర్డు పీసీఏ పరిధిలోకి వచ్చిన బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలన్న నిర్ణయానికి ఆర్బీఐ బోర్డు వచ్చింది. ఇదీ... ఆర్బీఐ ప్రకటన ‘‘ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇందులో సభ్యులు, నిబంధనలను ప్రభుత్వం, ఆర్బీఐ ఉమ్మడిగా నిర్ణయిస్తాయి. ఇక రూ.25 కోట్ల వరకు ఎంఎస్ఎంఈల మొండి బకాయిలను పునరుద్ధరించే పథకాన్ని పరిశీలించాలని కూడా నిర్ణయించడం జరిగింది’’ అని ఆర్బీఐ తన ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక స్థిరత్వం కోసం ఈ తరహా చర్యలు అవసరమని పేర్కొంది. ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు అయిన ఆర్థిక వ్యహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌తోపాటు స్వతంత్ర డైరెక్టర్ ఎస్ గురుమూర్తి ఆర్బీఐ క్యాపిటల్ బేస్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తక్కువ ఉండాలని వాదించారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్బీఐ నుంచి ఇతర సభ్యులతో ప్రభుత్వ నామినీలు, గురుమూర్తి ముఖాముఖిగా అంశాలపై చర్చించారు. ఆర్బీఐ బోర్డులో 10 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లలో టాటాసన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సహా ఎక్కువ మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఘర్షణ లేదు... ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య ఎటువంటి ఘర్షణ లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ, మీడియానే దీన్ని చిత్రీకరిస్తున్నాయన్నారు. ఎంతో ముఖ్య సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్‌కు దేశం పట్ల ఉన్న బాధ్యతలపై ఆర్బీఐ బోర్డు సభ్యుల మధ్య చర్చ జరగడం అభ్యంతరకరమేమీ కాదన్నారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రభుత్వం రూపాయి కూడా ఆశించడం లేదని ఇప్పటికే స్పష్టం చేసినట్టు ఆయన గుర్తు చేశారు. ఆర్బీఐ స్వతంత్రతను కేంద్రం గుర్తించింది: చిదంబరం ఆర్బీఐ స్వతంత్రతను కేంద్రం అసమ్మతంగా అయినా ఒప్పుకుందంటూ, దీని పట్ల కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఓ అడుగు వెనక్కు తగ్గడాన్ని ఆహ్వానించారు. ‘‘కేంద్రం ప్రమాదకరమైన ధోరణితో ఉందన్న విషయాన్ని స్వతంత్ర డైరెక్టర్లు అర్థం చేసుకుని ఉంటారు. అందుకే ఆర్బీఐకి సూచన ఇవ్వడానికి మించి ముందుకు వెళ్లలేదు’’అని చిదంబరం పేర్కొన్నారు. సాంకేతిక కమిటీ మిగులు నిల్వలను పరిశీలించడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదన్నారు. దీనివల్ల ఆర్బీఐ మిగులు నిల్వలు కనీసం 2019 వరకు అయినా సురక్షితంగా ఉంటాయంటూ, పరోక్షంగా మరో ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలను గుర్తు చేశారు. ఆర్బీఐ నుంచి వ్యవస్థలోకి మరో రూ.8,000 కోట్లు 22న ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు ముంబై: వ్యవస్థలో నగదు లభ్యతను పెంచే చర్యలో భాగంగా ఈ నెల 22న ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. తద్వారా రూ.8,000 కోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. నగదు లభ్యత పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా ఈ నెల 22న రూ.8,000 కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు నిర్ణయించినట్టు ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత లిక్విడిటీ సమస్య నెలకొన్న విషయం తెలిసిందే. దీన్ని సులభతరం చేసేందుకు ఆర్బీఐ ఓఎంవో మార్గాన్ని ఆశ్రయించింది. ఒకవేళ వ్యవస్థలో నగదు లభ్యత అధికమైన సమయాల్లో ఆర్బీఐ తిరిగి ఇవే సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా తగ్గిస్తుంది. -
ఆర్బీఐ vs కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ బోర్డు కీలక సమావేశం సోమవారం జరగనుంది. ఇందులో ఇరుపక్షాలు ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గం కనుగొనేందుకే ప్రాధాన్యం ఇవ్వనున్నప్పటికీ.. భేటీ కొంత వాడి, వేడిగా జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద పీసీఏ నిబంధనలు, చిన్న సంస్థలకు రుణాల మంజూరు తదితర వివాదాస్పద అంశాలపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ టీమ్‌పై ఆర్థిక శాఖ నామినీలు, కొంతమంది స్వతంత్ర డైరెక్టర్లు అస్త్రాలు సంధించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పటేల్ రాజీనామా చేయాలంటూ కొన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నప్పటికీ.. ఒత్తిళ్లకు ఆయన లొంగకపోవచ్చని వివరించాయి. తాము అమలు చేస్తున్న విధానాలను మరింత గట్టిగా సమ ర్థించుకునే ప్రయత్నమే చేయొచ్చని పేర్కొన్నాయి. గవర్నర్ ఉర్జిత్ పటేల్ సారథ్యంలోని ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో ప్రస్తుతం 18 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఖ్య 21 దాకా పెంచుకోవచ్చు. ప్రస్తుత బోర్డులో ఆర్బీఐ గవర్నర్‌తో పాటు నలుగురు డిప్యూటీలు ఫుల్ టైమ్ అధికారిక డైరెక్టర్లుగా ఉండగా, 13 మందిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. వీరిలో ఆర్థిక శాఖకు చెందిన అధికారులు ఇద్దరు ఉన్నారు. సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) కఠిన నిబంధనలు, చిన్న తరహా సంస్థలకు రుణాల మంజూరీ నిబంధనల సడలింపు వంటి విషయాల్లో నెలకొన్న విభేదాలను తొలగించుకునేలా ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గాన్ని రూపొందించాలని ఇరుపక్షాలు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పీసీఏకి సంబంధించి ఈ సమావేశంలో కాకపోయినా మరికొన్ని వారాల్లో తగు పరిష్కారమార్గం కనుగొనే అవకాశం ఉన్నట్లు వివరించాయి. వివాదాస్పద అంశాలివీ.. వీటిని సడలించిన పక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పలు బ్యాంకులకు కొంత వెసులుబాటు లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో 21 బ్యాంకులు ఉండగా, వీటిలో 11 బ్యాంకులు ప్రస్తుతం పీసీఏ కింద ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. రిస్కులెక్కువగా ఉన్న అసెట్స్‌కి, మూలధనానికి మధ్య నిష్పత్తి తగ్గినా, నికర నిరర్ధక ఆస్తులు పెరిగినా, అసెట్స్‌పై రాబడులు భారీగా తగ్గినా పీసీఏ నిబంధనలు అమల్లోకి వస్తాయి. అయితే, పీసీఏని ప్రయోగించడానికి అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు .. క్యాపిటల్ అడెక్వసీ రేషియోని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇక చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాల మంజూరీలో కొంత సడలింపునివ్వడం, లిక్విడిటీ కొరతను ఎదుర్కొంటున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ద్రవ్య లభ్యత మెరుగుపడేలా వ్యవస్థలో మరింత నిధులను అందుబాటులోకి తేవడం వంటివి ఆర్బీఐ చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. కానీ ఈ రంగాల సంస్థలకు రిస్కులు ఎక్కువగా పొంచి ఉన్నాయనే భావనతో ఆర్బీఐ దీన్ని విభేదిస్తోంది. రెండు పక్షాలు ఇందుకు సంబంధించి బహిరంగంగానే తమ మధ్య విభేదాలను బైటపెట్టాయి. సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తిని గౌరవించకపోతే ఎకానమీకి పెను విపత్తు తప్పదంటూ ఆర్బీఐ డిçప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యాఖ్యానించడం దీనికి ఆజ్యం పోసింది. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్‌ను దారికి తెచ్చుకునేందుకు గతంలో ఎన్నడూ ప్రయోగించని ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ని ప్రయోగించడంపై కేంద్ర ఆర్థిక సమాలోచనలు కూడా జరపడం మరింత వివాదాస్పదమైంది. అటు ఆర్బీఐలో కేంద్రం నామినేట్ చేసిన ఎస్ గురుమూర్తి సైతం కేంద్ర ప్రభుత్వ వాదనలను వెనకేసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కలిసి పనిచేయాలని లేదా రాజీనామా చేసి తప్పుకోవాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ కో–కన్వీనర్ అశ్వనీ మహాజన్ వ్యాఖ్యానించారు. ఆర్బీఐని కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటోంది! రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న రూ. 9 లక్షల కోట్ల నిధులపై అజమాయిషీని దక్కించుకునేందుకు ఆర్బీఐని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ఆర్బీఐ బోర్డు భేటీ ఘర్షణాత్మకంగానే ఉండవచ్చని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ వద్ద రూ. 9.59 లక్షల కోట్ల నిల్వలు ఉన్నాయి. ద్రవ్య లోటు తదితర సమస్యల పరిష్కారం కోసం వీటిలో కనీసం మూడో వంతు నిధులైనా (సుమారు రూ. 3.6 లక్షల కోట్లు) తమకు ఇవ్వాలంటూ ఆర్బీఐపై కేంద్రం ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అలాంటి ప్రతిపాదనేదీ లేదంటూ కేంద్రం కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ బోర్డు భేటీ, చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఆర్బీఐకు స్వతంత్రత అవసరం
ముంబై: ఆర్బీఐ స్వయంప్రతిపత్తికి ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ బాసటగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ ఉపయోగించని సెక్షన్ 7 ద్వారా తన నిర్ణయాలను ఆర్బీఐపై రుద్దే ప్రయత్నం చేయరాదని ఆయన సూచించారు. ఈ నెల 19న జరిగే ఆర్బీఐ భేటీ సందర్భంగా ఆర్బీఐ, ప్రభుత్వం తమ మధ్య దూరాన్ని తొలగించుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ సెక్షన్ 7ను ప్రభుత్వం ప్రయోగిస్తే, గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. ‘‘ప్రభుత్వం తన నిర్ణయాలకే కట్టుబడి ఉంటే విషయం వెడెక్కుతుంది. ఆర్బీఐ లేదా ఉర్జిత్ పటేల్ కూడా తమ వాదనకే కట్టుబడి ఉంటే, ప్రభుత్వం సెక్షన్ 7ను ప్రయోగించినట్టయితే... పటేల్ రాజీనామా చేస్తారని అనుకుంటున్నా’’ అని రాహుల్ బజాజ్ పేర్కొన్నారు. గురువారం ముంబైలో జమ్నాలాల్ బజాజ్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రభుత్వం–ఆర్బీఐ మధ్య వివాదం మంచిది కాదు ఆర్బీఐ బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంకు మధ్య వివాదం మంచిది కాదని ఆర్బీఐ బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి అన్నారు. పలు అంశాలపై ఇటీవల కేంద్రం, ఆర్బీఐ మధ్య పొరపొచ్చాలు వచ్చిన నేపథ్యంలో గురుమూర్తి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... మొండి బకాయిల విషయంలో ప్రొవిజన్లకు సంబంధించి కఠిన నిబంధనలను బ్యాంకులపై రుద్దడం వల్ల బ్యాంకింగ్ రంగంలో సమస్యలకు దారితీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బేసెల్ క్యాపిటల్ అడెక్వెసీ నిబంధనల్లో పేర్కొన్న పరిధికి మించి భారత్ వెళ్లకూడదన్నారు. -
ఆర్బీఐ డీఫాల్టర్లను ఎందుకు వెల్లడించడం లేదు?
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన బడా బాబుల పేర్లును వెల్లడించాల్సిందిగా కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఎన్నిసార్లు ఆదేశించినా, ఈ విషయంలోనే సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించినప్పటికీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ పదే పదే ఒకే మాట చెబుతూ వస్తోంది. దేశం, బ్యాంకుల ఆర్థిక ప్రయోజనాలను దష్టిలో పెట్టుకొని ఆ సమాచారాన్ని వెల్లడించలేక పోతున్నామంటూ పాడిందే పాటగా పాడుతూ వస్తోంది. 2015 నుంచి ఆర్బీఐ తంతూ ఇదే. చివరకు విసిగిపోయిన కేంద్ర సమాచార కమిషన్ ఇదే విషయమై ఆర్బీఐకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు స్పందించిన ఆర్బీఐ సమాధానం ఇవ్వడానికి నవంబర్ 26వ తేదీ వరకు గడువు కావాలని సీఐసీని కోరింది. గడువు కావడానికి కారణం ఏమిటో సులభంగానే ఊహించవచ్చు. చీఫ్ సమాచార కమిషనర్ సతీష్ ఆచార్యులు నవంబర్ 20వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు. బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఉద్దేశ పూర్వకంగానే ఎగ్గొడుతున్న డీఫాల్టర్ల పేర్లను వెల్లడించాల్సిందిగా సతీష్ ఆచార్యులు పట్టుబడుతుండడంతో ఆయన పోయే వరకు నిరీక్షిద్దామనే వైఖరితో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యవహిరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ స్థానంలో వచ్చే కొత్తవారిని ఏదో విధంగా మేనేజ్ చేసుకోవచ్చన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. కొన్ని బడా బ్యాంకులు ఇప్పటికే తమ వెబ్సైట్లలో డీ ఫాల్టర్లయిన బడా బాబుల పేర్లను వెల్లడించాయని ఆదివారం నాడు ఎన్డీటీవీ ఓ కథనాన్ని ప్రచురించింది. సమాచార హక్కు కింద ఆర్బీఐని సీఐసీ కోరుతున్న సమాచారం ఇప్పటికే బ్యాంకుల వెబ్సైట్లలో ఉన్నాయని ఆ వార్తా కథనం పేర్కొంది. ఈ సమాచారం బయటకు రావడంతో ఆర్బీఐ చెబుతున్నట్లుగా లేదా భయపడుతున్నట్లుగా దేశ ఆర్థిక వ్యవస్థగానీ, బ్యాంకుల ఆర్థిక పరిస్థితిగానీ దెబ్బ తినే సూచనలుగానీ, అల్లకల్లోలం అలికిడిగానీ కనిపించడం లేదే! డీఫాల్టర్ల సమాచారాన్ని వెల్లడించాల్సిన విధి ఆర్బీఐదని 2015లోనే సుప్రీం కోర్టు స్పష్టంగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆర్బీఐలో చలనం లేదు. ‘స్వచ్ఛమైన, పారదర్శకమైన పద్ధతిలో చాలా ఆర్థిక సంస్థలు తమ లావా దేవీలను నిర్వహించడం లేదన్నది మాకు బలమైన అనుమానం. వాటితో సంఘటితమైన ఆర్బీఐ, వాటి లావాదేవీలను ప్రజల దష్టికి రాకుండా కప్పి పుచ్చుతోంది. అది భావ్యం కాదు. అగౌర వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవడం ఆర్బీఐ విధి’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం మాటలను పెడ చెవిన పెడితే రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ కింద జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఇటీవల ఆర్బీఐని తీవ్రంగా హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం బడా డీఫాల్టర్ల పేర్లను వెల్లడించాల్సిందిగా ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా ఎందుకు ఆర్బీఐని ఆదేశించలేదు? ఆ బడా డీఫాల్టర్లే ఎన్నికల సమయంలో అధికార పార్టీకి భారీగా విరాళాలు ఇస్తున్న వారే అవడం వల్లనా?! -
ప్రధానితో ఆర్బీఐ గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్రంతో వివాదాస్పద అంశాలను పరిష్కరించుకునే దిశగా రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గత వారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న న్యూఢిల్లీ వచ్చిన ఉర్జిత్ పటేల్.. ప్రధాని కార్యాలయంలో పలువురు సీనియర్ అధికారులతో సమావేశం అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్నింటిలో ప్రధాని కూడా పాల్గొన్నట్లు వివరించాయి. ఈ చర్చల నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలివ్వడానికి సంబంధించి ఆర్బీఐ ప్రత్యేక విధానమేదైనా రూపొందించే అవకాశమున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపాయి. అయితే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) లిక్విడిటీ సమస్యలు తీర్చడం, రిజర్వ్ బ్యాంక్ దగ్గరున్న మిగులు నిధుల్లో గణనీయ భాగాన్ని ప్రభుత్వానికి బదలాయించడం వంటి అంశాలపై ఏదైనా అంగీకారం కుదిరిందా లేదా అన్నది తెలియరాలేదు. ఈ నెల 19న రిజర్వ్ బ్యాంక్ బోర్డు కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
అనారోగ్య కారణాలతో ఉర్జిత్ పటేల్ రాజీనామా?
సాక్షి, న్యూఢిల్లీ: గత కొద్ది వారాలుగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, కేంద్రం మద్య రగులుతున్న వివాదం సమసిపోయే లక్షణాలు కనిపించడంలేదు. తాజా అంచనాల ప్రకారం ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రభుత్వంతో భిన్నాభిప్రాయాల నేపథ్యం తన ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపనుందన్నకారణంతో ఆయన త్వరలోనే రాజీనామా చేయనున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. తదుపరి బోర్డు సమావేశంలో ఉర్జిత్ పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. నవంబరు 19న జరగనున్న ఆర్బీఐ బోర్డు సమావేశంలో అనారోగ్య కారణాల రీత్యా ఆయన తప్పుకోనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అంతేకాదు ఊర్జిత్ పటేల్ రాజీనామా నిర్ణయం వాస్తవ రూపం దాలిస్తే, అటు డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య కూడా అదే బాటలో పయనించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంతో విభేదించి అలసిపోవడమే కాక, వైరిపూరిత వాతావరణంలో పనిచేయడం వల్ల తన ఆరోగ్యం పాడవుతున్నదని పటేల్ తన సన్నిహితుల వద్ద మొరపెట్టుకుంటున్నారట. ముఖ్యంగా రిజర్వ్‌బ్యాంక్ చట్టంలోని సెక్షన్-7 కింద ప్రభుత్వం ఆదేశాలను జారీచేసేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో గవర్నర్ ఊర్జిత్ పటేల్ మరింత మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టు సమాచారం. దీనికితోడు ఆర్బీఐ గవర్నర్ ఆర్ధిక ప్రాధాన్యతలను గుర్తించి, కేంద్రం ప్రతిపాదనలను ఆమోదించాలని, దీనిపై బోర్డు సభ్యులతో చర్చించాలని కోరుతున్నామని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు ఉర్జిత్పటేల్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటే, ఆయన తప్పుకోవడమే మంచిదని కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో ఉర్జిత్ రాజీనామా ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. అయితే రానున్నఎన్నికలకు ముందు, అందునా ఆర్థిక సేవల రంగం వివిధ కుంభకోణాలతో సతమతమవుతున్న తరుణంలో రిజర్వ్‌బ్యాంక్ ఉన్నతాధికారులిద్దరు రాజీనామా చేయడం ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ దీర్ఘకాలిక పరిష్కారాలపై ఆలోచిస్తోంటే, కేంద్రం స్వల్పకాలిక పరిష్కారాలను అన్వేషిస్తోందని ప్రముఖ ఆర్థిక నిపుణుడు భానుమూర్తి పేర్కొన్నారు. అయితే విభేదాలున్నప్పటికీ, ఇద్దరూ వారి భేదాలను పరిష్కరించకోదగినవే అన్నారు. కానీ ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయవలసి వస్తే మాత్రం అది ఆర్ధిక వ్యవస్థకు ముప్పేనని వ్యాఖ్యానించారు. కాగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య రిజర్వ్‌బ్యాంక్ స్వయంప్రతిపత్తికి ఎదురవుతున్న సవాళ్లపై చేసిన సంచలన వ్యాఖ్యలతో కేంద్రం, రిజర్వ్‌బ్యాంకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఆర్బీఐ గవర్నర్ పదవినుంచి తప్పుకోన్నారనే వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆర్థికశాఖ స్పందించింది. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడుతామంటూ ప్రకటన జారీ చేసింది. మరోవైపు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ వివాదంపై తొలిసారిగా స్పందిస్తూ ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిందేనంటూ బహిరంగంగా ఆర్బీఐకి మద్దతు పలికారు. సీటు బెల్టులాంటి ఆర్బీఐని వాహనదారుడైన ప్రభుత్వం ధరించకపోతే ప్రమాదం చాలా తీవ్రంగానే ఉంటుందని సూచించిన సంగతి తెలిసిందే. -
డిఫాల్టర్ల లిస్టు ఎందుకు బైటపెట్టలేదు?
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన వారి (డిఫాల్టర్లు) బైటపెట్టే విషయంపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించకపోవడం మీద వివరణనివ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పటేల్‌పై గరిష్ట పెనాల్టీ ఎందుకు విధించరాదో వివరించాలని సూచించింది. మొండిబాకీలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాసిన లేఖను కూడా బహిర్గతం చేయాలంటూ ప్రధాని కార్యాలయం, కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్‌నకు సూచించింది. ముందుగా రూ. 1,000 కోట్ల పైగా డిఫాల్ట్ అయిన రుణాలతో మొదలుపెట్టి ఆ తర్వాత రూ. 500 కోట్ల దాకా రుణాలకు సంబంధించిన వివరాలను అయిదు రోజుల్లోగా ఆర్బీఐ వెల్లడించాల్సి ఉంటుందని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు పేర్కొన్నారు. -
ఆర్థికాంశాల్లో ఇంత అపరిపక్వతా!
ఆర్బీఐ పునాదులే కదిలిపోయే ప్రమాదం ఏర్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి అవసరమైంది ఏమిటి అనేది పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కేంద్రం ఇంత అపరిపక్వ దృష్టితో అడ్డుకోవడం వల్ల సంక్షోభం మరింత తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు దేశానికి అవసరమైంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో ప్రొఫెషనలిజమూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధానపరమైన ఆదేశాలకు అనుగుణంగానే డబ్బు చలామణీ, వడ్డీరేట్లను నిర్వహించాల్సి ఉందని ఆర్బీఐకి స్పష్టం చేయడమూ మాత్రమే. ఇవి మాత్రమే పారిశ్రామిక, ఉపాధి పెరుగుదలకు వీలు కల్పిస్తాయి. ఆర్థికాంశాల్లో అపరిపక్వత దేశానికే హానికరం. దేశీయ పారిశ్రామిక ప్రగతి 2010–11లో 8.2% నుంచి 2011–12 నాటికి అంటే ఒక్క ఏడాదిలోపే 2.8%నికి దిగజారిపోయినప్పటి నుంచి, ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కీలక నిర్ణయాలపై చివరిమాట ఎవరిదై ఉండాలి అనే అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంకుకు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు మధ్య గిల్లికజ్జాలు సాగుతూ వస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి 2010లో ఆర్బీఐ దేశ ఆర్థిక వ్యవస్థపై విధించిన అధిక వడ్డీరేటు విధానంలో సడలింపు చేయడం వైపుగా 2012 నుంచి అటు పరిశ్రమా ఇటు ప్రభుత్వం ప్రయత్నిస్తూ వచ్చాయి. ఆర్థిక వ్యవస్థపై అలాంటి సడలింపువల్ల కలిగే ప్రభావాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పరిశ్రమా, ప్రభుత్వమూ తమ వైఖరిని నేటివరకూ సమర్థించుకుంటూ వస్తున్నాయి. గతవారం ఢిల్లీలో ఎ.డి. ష్రాఫ్ స్మారకోపన్యాసంలో ప్రసంగించిన సందర్భంగా డిప్యూటీ ఆర్బీఐ గవర్నర్ విరాళ్ ఆచార్య.. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వాలను కలిపి తీవ్రంగా హెచ్చరించడం ద్వారా ఆర్బీఐకీ, కేంద్రప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలకు మధ్య సాగుతున్న దోబూచులాట ముసుగు వీడి బయటపడినట్లయింది. ’ఆర్బీఐకి తన విధులను నిర్వహించడంలో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ఇవ్వకపోతే, దేశీయ పరిశ్రమలూ, కేంద్రప్రభుత్వం కూడా ద్రవ్యమార్కెట్ల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదనీ, అది ఆర్థిక వ్యవస్థను దహించక మానదనీ, ముఖ్యమైన రెగ్యులేటరీ సంస్థను చిన్నచూపు చూస్తే ఏదో ఒక రోజు అందరూ విచారించక తప్పని పరి స్థితి కలుగుతుంద’ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ తేల్చి చెప్పారు. దేశ పాలకవ్యవస్థపై, దేశీయ పరిశ్రమపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎందుకిలా తిరుగుబాటు చేశారో నాలుగురోజుల తర్వాత తేటతెల్లమైంది. ఆర్బీఐ చట్టంలోని 7వ సెక్షన్‌లోని సంప్రదింపుల విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు నేరుగా ఆదేశాలనిచ్చేందుకు అవకాశముంది. ఇంతవరకు అమలు కాని ఈ సెక్షన్‌ని ఇప్పుడు ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనం పేరిట ఆర్బీఐకి నేరుగా ఆదేశాలు ఇవ్వాలని తలపెట్టింది. ఇలాంటి ఆదేశాలను ఆర్బీఐ తూచా తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్‌తో సంప్రదిం పుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆర్బీఐని ఎప్పటికప్పుడు ఆదేశించవచ్చు అని సెక్షన్ 7 స్పష్టం చేస్తోంది. అయితే సి. రంగరాజన్, బిమల్ జలాన్లు 1992 నుంచి 2003 వరకు ఆర్బీఐ గవర్నర్లుగా ఉన్న కాలంలో సెక్షన్ 7తో పనిలేకుం డానే నాటి కేంద్రప్రభుత్వాలు అలాంటి ఆదేశాలు చేస్తూవచ్చాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్‌తోనే ఆర్బీఐ స్వతంత్రవైఖరిపై విభేదించారు కూడా. 2008 డిసెం బర్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం విరుచుకుపడిన నేపథ్యంలో విధానపరమైన వడ్డీరేట్లను తగ్గించాలని, పరపతి నియంత్రణలను సడలించాలని మన్మోహన్ సింగ్ దాదాపుగా ఆర్బీఐని ఆదేశించారు. ఈరోజు మోదీ ప్రభుత్వం ఇంతవరకు అరుదుగా ఉపయోగించిన సెక్షన్ 7ని అమలు చేయాలని తలపెట్టడం అత్యంత అరుదైన ఘటన. ఆర్బీఐకి వ్యతిరేకంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వాగ్వివాదం ద్వారా ప్రభుత్వ వైఖరి ఇప్పటికే తేటతెల్లమై తీవ్ర చర్చలకు దారితీసింది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కనీవినీ ఎరుగని ద్రవ్య సంక్షోభాన్ని చవి చూస్తున్న తరుణంలో సెక్షన్ 7 అమలుకు కేంద్రం పూర్తిగా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ స్వదేశ్ జాగరణ్ మంచ్‌కి చెందిన ఎస్ గురుమూర్తి (ఈ ఆగస్టులో తనను ఆర్బీఐ తాత్కాలిక బోర్డ్ డైరెక్టర్‌గా నియమించారు), విదేశీమారక ద్రవ్య సంక్షోభాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ అట్టిపెట్టుకున్న కొన్ని ద్రవ్య నిల్వలను ప్రభుత్వ ఖజానాకు బదలాయించాల్సిందిగా చేసిన సూచనతో కేంద్రానికి, ఆర్బీఐకి మధ్య నడుస్తున్న అంతర్గత పోరు బహిరంగమైంది. గురుమూర్తి సూచనను విస్మరించి వదిలేయకుండా విరాళ్ 2010లో అర్జెంటైనాలో సంభవించిన ఆర్థిక సంక్షోభంతో ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ తీరును వర్ణించే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా విరాళ్ ఆచార్య తన ప్రసంగంలో శ్రోతలకు చెప్పని విషయం ఒకటుంది. అంతకు ముందు వారంలో ఆర్బీఐ బోర్డు నిర్వహిం చిన సుదీర్ఘ సమావేశంలో గురుమూర్తి తన ప్రతిపాదనను చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య సంక్షోభానికి సాహసోపేతమైన పరిష్కారంగా గురుమూర్తి ఆర్బీఐ నిల్వలలో కొంత భాగాన్ని ప్రభుత్వ ఖజానాలోకి మళ్లించాలని సూచించారు. ఇప్పటికే ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు, వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తాత్కాలిక రుణ సౌకర్యాన్ని ఉపయోగించుకుని రూ. 1,30,000 కోట్ల రుణాలను తీసుకున్నాయి. ఇంత భారీ రుణం కూడా ఏమూలకూ సరి పోని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్బీఐ తాత్కాలిక బోర్డు సభ్యులు చాలామంది రుణాలపై ఆర్బీఐ నియంత్రణలను సడలించాలని కోరారు. పైగా నిర్దిష్ట దిద్దుబాటు చర్యలో భాగంగా, మొండి బకాయిల సమస్యను తేల్చివేసే ఉద్దేశంతో 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల డిపాజిట్లను ఆర్బీఐ అట్టిపెట్టుకోవడాన్ని కూడా సడలించాలని వీరు కోరారు. అయితే ఆర్బీఐ వీరి సూచనలకు తలొగ్గలేదు. అలాగని ద్రవ్య సంక్షోభాన్ని ఎలా సడలించాలనే విషయానికి సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలను ఆర్బీఐ ప్రకటించలేదు. కేంద్రప్రభుత్వంతో ఘర్షణ వైఖరిని విరాళ్ ఆచార్య మరొక స్థాయికి తీసుకెళ్లారు. ఒకరకంగా ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించే స్థాయిలో ఆయన ప్రసంగం సాగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు స్వల్పకాలిక దృక్పథాన్ని కలిగి ఉంటాయని, అందుకే తాము నిరోధించలేని జనాకర్షక రాజకీయాల ఒత్తిళ్లబారిన పడుతుంటాయని విమర్శించారు. అందుకే ప్రత్యేక జ్ఞానం అవసరమైన విధు లను నిర్వహించే విషయంలో ప్రభుత్వాలను విశ్వసించలేమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు జనాకర్షక ఒత్తిళ్లకులోనై దీర్ఘకాలిక దృక్పథాన్ని విడనాడటమే దీనికి కారణమనేశారు. కొన్ని విధుల నిర్వహణను ప్రజాస్వామ్య వ్యవస్థకు అతీతంగా పనిచేసే నిపుణులతో కూడిన ప్రత్యేక సంస్థలకు మాత్రమే కట్టబెట్టాల్సి ఉంటుంది. దేశ ద్రవ్యోల్బణాన్ని నివారిం చడం, మారకపు రేటు, డబ్బు చలామణి వంటి ప్రత్యేక విధులను కూడా పూర్తిగా ఆర్బీఐకే అప్పగిం చాలి. ఆర్బీఐ ఇలాంటి విధులను నిర్వర్తించాలంటే దానికి స్వతంత్రతను కట్టబెట్టడం తప్పనిసరి అన్నది విరాళ్ అభిప్రాయం. విరాళ్ ఆచార్య ప్రసంగం ఒక విషయంలో మాత్రం సరైందేనని చెప్పాలి. ఆధునిక యుద్ధతంత్రంలో పోరాడటం అత్యంత ప్రత్యేకమైన విధి. యుద్ధసన్నద్దత అనేది దీర్ఘకాలిక లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి తాత్కాలిక రాజకీయాలు తీసుకొచ్చే ఒత్తిళ్లనుంచి దానికి రక్షణ కల్పించాలి. ఆధునిక సమాజంలో హై స్పీడ్ రైళ్ల వ్యవస్థను నడపడం కూడా ప్రత్యేకమైన విధిగానే ఉంటుంది. అలాగని, ఒక సైన్యాధిపతికి, జాయింట్ సర్వీసెస్ చైర్మన్‌కి సుప్రీం కోర్టు జడ్జి లేక ఎన్నికల కమిషనర్‌కు ఉండే రాజ్యాంగ ప్రతిపత్తిని ఇవ్వాలని ఎవరూ సూచించలేరు. ఈ సందర్భంగా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హెచ్ ఆర్ ఖాన్ మాట్లాడుతూ స్వతంత్రత అనేది స్వయంప్రతిపత్తి లాంటిది కాదని చెప్పారు. అత్యున్నత స్థాయి ప్రొఫెషనలిజాన్ని సాధించాలంటే, పాలసీలో అనూహ్య మార్పులు లేక ఆ ప్రక్రియలో అనవసర జోక్యాలనుంచి సంస్థలకు రక్షణ కల్పించాలి. కానీ ఈ సంస్థలు నేరుగా గానీ, పరోక్షంగా కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం నిర్ణయించిన విధాన చట్రం పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. అంతేతప్ప పాలసీని తమకు తాముగా రూపొం దించుకునే హక్కును అవి తీసుకోకూడదు. గతంలో 2007–2008 మధ్య కాలంలో ఆర్బీఐ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా రుణాల లభ్యతను అడ్డుకుంటూ వడ్డీరేట్లను పెంచుతూ పోయింది. కానీ దేశీయ అదనపు డిమాండుతో పనిలేకుండానే ద్రవ్యోల్బణం పెరిగి పెరిగి 9%కి చేరుకుంది. 2008లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్బీఐ స్వతంత్రతను ఘోరంగా ఉల్లంఘించి చేసిన ఆదేశాల ఫలితంగా ద్రవ్యోల్బణం మరికాస్త పెరిగి 9.1%కి చేరుకుంది. వడ్డీరేట్లను పెంచడం, తగ్గించడంలో సమతుల్యత పాటించడంలో ఆర్బీఐ గుణపాఠాలు నేర్చుకోలేదు. అందుకే ఈరోజు ఆర్బీఐ దయలేని స్కూల్ మాస్టర్లా మారింది. తప్పు చేసిన విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టి అది బాదేస్తోంది. వారు చేస్తున్న తప్పులకు తానే కారణమనే వాస్తవాన్ని గుర్తించడానికి కూడా సిద్ధపడటంలేదు. అందుకే ఒక అభిప్రాయం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు ఆర్బీఐపై పట్టు సాధించడానికి ప్రయత్నించటంలో లేదు. కాగా ఆర్బీఐకి మరీ ఎక్కువ స్వతంత్రతను కల్పించి సకాలంలో సరైన నిర్ణయాలను తీసుకోనివిధంగా దాన్ని కేంద్రం స్తంభింపచేసింది. అందుకే ఆర్బీఐ నేడు భారతీయ ఆర్థిక వ్యవస్థ మూలాలనే పద్ధతి ప్రకారం దెబ్బతీస్తోందని కొందరి అభి ప్రాయం. ఆర్బీఐ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు తిరుగుబాటు ప్రకటించింది కానీ వేలాది చిన్న మదుపుదార్లను దెబ్బతీసే జనాకర్షక విధానంతో, ప్రభుత్వేతర డైరెక్టర్లతో పావుకదిపి విమర్శల పాలవుతోంది. అదేసమయంలో విరాళ్ ఆచార్య చెప్పింది ఒక కోణంలో సరైనదే. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని ఇంత అపరిపక్వ దృష్టితో అడ్డుకోవడం వల్ల సంక్షోభం మరింత తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు దేశానికి అవసరమైంది ఆర్థిక మంత్రిత్వశాఖలో ప్రొఫెషనలిజమూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధానపరమైన ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే డబ్బు చలామణి, వడ్డీరేట్లను నిర్వహించాల్సి ఉందని ఆర్బీఐకి స్పష్టం చేయడమూ మాత్రమే. ఇవి మాత్రమే పారిశ్రామిక, ఉపాధి పెరుగుదలకు వీలు కల్పిస్తాయి. వ్యాసకర్త: ప్రేమ్ శంకర్ ఝా, సీనియర్ జర్నలిస్టు -
ఆర్థికాంశాల్లో ఇంత అపరిపక్వతా!
ఆర్బీఐ పునాదులే కదిలిపోయే ప్రమాదం ఏర్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి అవసరమైంది ఏమిటి అనేది పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కేంద్రం ఇంత అపరిపక్వ దృష్టితో అడ్డుకోవడం వల్ల సంక్షోభం మరింత తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు దేశానికి అవసరమైంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో ప్రొఫెషనలిజమూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధానపరమైన ఆదేశాలకు అనుగుణంగానే డబ్బు చలామణీ, వడ్డీరేట్లను నిర్వహించాల్సి ఉందని ఆర్బీఐకి స్పష్టం చేయడమూ మాత్రమే. ఇవి మాత్రమే పారిశ్రామిక, ఉపాధి పెరుగుదలకు వీలు కల్పిస్తాయి. ఆర్థికాంశాల్లో అపరిపక్వత దేశానికే హానికరం. దేశీయ పారిశ్రామిక ప్రగతి 2010–11లో 8.2% నుంచి 2011–12 నాటికి అంటే ఒక్క ఏడాదిలోపే 2.8%నికి దిగజారిపోయినప్పటి నుంచి, ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కీలక నిర్ణయాలపై చివరిమాట ఎవరిదై ఉండాలి అనే అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంకుకు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు మధ్య గిల్లికజ్జాలు సాగుతూ వస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి 2010లో ఆర్బీఐ దేశ ఆర్థిక వ్యవస్థపై విధించిన అధిక వడ్డీరేటు విధానంలో సడలింపు చేయడం వైపుగా 2012 నుంచి అటు పరిశ్రమా ఇటు ప్రభుత్వం ప్రయత్నిస్తూ వచ్చాయి. ఆర్థిక వ్యవస్థపై అలాంటి సడలింపువల్ల కలిగే ప్రభావాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పరిశ్రమా, ప్రభుత్వమూ తమ వైఖరిని నేటివరకూ సమర్థించుకుంటూ వస్తున్నాయి. గతవారం ఢిల్లీలో ఎ.డి. ష్రాఫ్ స్మారకోపన్యాసంలో ప్రసంగించిన సందర్భంగా డిప్యూటీ ఆర్బీఐ గవర్నర్ విరాళ్ ఆచార్య.. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వాలను కలిపి తీవ్రంగా హెచ్చరించడం ద్వారా ఆర్బీఐకీ, కేంద్రప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలకు మధ్య సాగుతున్న దోబూచులాట ముసుగు వీడి బయటపడినట్లయింది. ’ఆర్బీఐకి తన విధులను నిర్వహించడంలో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ఇవ్వకపోతే, దేశీయ పరిశ్రమలూ, కేంద్రప్రభుత్వం కూడా ద్రవ్యమార్కెట్ల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదనీ, అది ఆర్థిక వ్యవస్థను దహించక మానదనీ, ముఖ్యమైన రెగ్యులేటరీ సంస్థను చిన్నచూపు చూస్తే ఏదో ఒక రోజు అందరూ విచారించక తప్పని పరి స్థితి కలుగుతుంద’ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ తేల్చి చెప్పారు. దేశ పాలకవ్యవస్థపై, దేశీయ పరిశ్రమపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎందుకిలా తిరుగుబాటు చేశారో నాలుగురోజుల తర్వాత తేటతెల్లమైంది. ఆర్బీఐ చట్టంలోని 7వ సెక్షన్‌లోని సంప్రదింపుల విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు నేరుగా ఆదేశాలనిచ్చేందుకు అవకాశముంది. ఇంతవరకు అమలు కాని ఈ సెక్షన్‌ని ఇప్పుడు ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనం పేరిట ఆర్బీఐకి నేరుగా ఆదేశాలు ఇవ్వాలని తలపెట్టింది. ఇలాంటి ఆదేశాలను ఆర్బీఐ తూచా తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్‌తో సంప్రదిం పుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆర్బీఐని ఎప్పటికప్పుడు ఆదేశించవచ్చు అని సెక్షన్ 7 స్పష్టం చేస్తోంది. అయితే సి. రంగరాజన్, బిమల్ జలాన్లు 1992 నుంచి 2003 వరకు ఆర్బీఐ గవర్నర్లుగా ఉన్న కాలంలో సెక్షన్ 7తో పనిలేకుం డానే నాటి కేంద్రప్రభుత్వాలు అలాంటి ఆదేశాలు చేస్తూవచ్చాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్‌తోనే ఆర్బీఐ స్వతంత్రవైఖరిపై విభేదించారు కూడా. 2008 డిసెం బర్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం విరుచుకుపడిన నేపథ్యంలో విధానపరమైన వడ్డీరేట్లను తగ్గించాలని, పరపతి నియంత్రణలను సడలించాలని మన్మోహన్ సింగ్ దాదాపుగా ఆర్బీఐని ఆదేశించారు. ఈరోజు మోదీ ప్రభుత్వం ఇంతవరకు అరుదుగా ఉపయోగించిన సెక్షన్ 7ని అమలు చేయాలని తలపెట్టడం అత్యంత అరుదైన ఘటన. ఆర్బీఐకి వ్యతిరేకంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వాగ్వివాదం ద్వారా ప్రభుత్వ వైఖరి ఇప్పటికే తేటతెల్లమై తీవ్ర చర్చలకు దారితీసింది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కనీవినీ ఎరుగని ద్రవ్య సంక్షోభాన్ని చవి చూస్తున్న తరుణంలో సెక్షన్ 7 అమలుకు కేంద్రం పూర్తిగా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ స్వదేశ్ జాగరణ్ మంచ్‌కి చెందిన ఎస్ గురుమూర్తి (ఈ ఆగస్టులో తనను ఆర్బీఐ తాత్కాలిక బోర్డ్ డైరెక్టర్‌గా నియమించారు), విదేశీమారక ద్రవ్య సంక్షోభాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ అట్టిపెట్టుకున్న కొన్ని ద్రవ్య నిల్వలను ప్రభుత్వ ఖజానాకు బదలాయించాల్సిందిగా చేసిన సూచనతో కేంద్రానికి, ఆర్బీఐకి మధ్య నడుస్తున్న అంతర్గత పోరు బహిరంగమైంది. గురుమూర్తి సూచనను విస్మరించి వదిలేయకుండా విరాళ్ 2010లో అర్జెంటైనాలో సంభవించిన ఆర్థిక సంక్షోభంతో ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ తీరును వర్ణించే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా విరాళ్ ఆచార్య తన ప్రసంగంలో శ్రోతలకు చెప్పని విషయం ఒకటుంది. అంతకు ముందు వారంలో ఆర్బీఐ బోర్డు నిర్వహిం చిన సుదీర్ఘ సమావేశంలో గురుమూర్తి తన ప్రతిపాదనను చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య సంక్షోభానికి సాహసోపేతమైన పరిష్కారంగా గురుమూర్తి ఆర్బీఐ నిల్వలలో కొంత భాగాన్ని ప్రభుత్వ ఖజానాలోకి మళ్లించాలని సూచించారు. ఇప్పటికే ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు, వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తాత్కాలిక రుణ సౌకర్యాన్ని ఉపయోగించుకుని రూ. 1,30,000 కోట్ల రుణాలను తీసుకున్నాయి. ఇంత భారీ రుణం కూడా ఏమూలకూ సరి పోని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్బీఐ తాత్కాలిక బోర్డు సభ్యులు చాలామంది రుణాలపై ఆర్బీఐ నియంత్రణలను సడలించాలని కోరారు. పైగా నిర్దిష్ట దిద్దుబాటు చర్యలో భాగంగా, మొండి బకాయిల సమస్యను తేల్చివేసే ఉద్దేశంతో 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల డిపాజిట్లను ఆర్బీఐ అట్టిపెట్టుకోవడాన్ని కూడా సడలించాలని వీరు కోరారు. అయితే ఆర్బీఐ వీరి సూచనలకు తలొగ్గలేదు. అలాగని ద్రవ్య సంక్షోభాన్ని ఎలా సడలించాలనే విషయానికి సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలను ఆర్బీఐ ప్రకటించలేదు. కేంద్రప్రభుత్వంతో ఘర్షణ వైఖరిని విరాళ్ ఆచార్య మరొక స్థాయికి తీసుకెళ్లారు. ఒకరకంగా ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించే స్థాయిలో ఆయన ప్రసంగం సాగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు స్వల్పకాలిక దృక్పథాన్ని కలిగి ఉంటాయని, అందుకే తాము నిరోధించలేని జనాకర్షక రాజకీయాల ఒత్తిళ్లబారిన పడుతుంటాయని విమర్శించారు. అందుకే ప్రత్యేక జ్ఞానం అవసరమైన విధు లను నిర్వహించే విషయంలో ప్రభుత్వాలను విశ్వసించలేమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు జనాకర్షక ఒత్తిళ్లకులోనై దీర్ఘకాలిక దృక్పథాన్ని విడనాడటమే దీనికి కారణమనేశారు. కొన్ని విధుల నిర్వహణను ప్రజాస్వామ్య వ్యవస్థకు అతీతంగా పనిచేసే నిపుణులతో కూడిన ప్రత్యేక సంస్థలకు మాత్రమే కట్టబెట్టాల్సి ఉంటుంది. దేశ ద్రవ్యోల్బణాన్ని నివారిం చడం, మారకపు రేటు, డబ్బు చలామణి వంటి ప్రత్యేక విధులను కూడా పూర్తిగా ఆర్బీఐకే అప్పగిం చాలి. ఆర్బీఐ ఇలాంటి విధులను నిర్వర్తించాలంటే దానికి స్వతంత్రతను కట్టబెట్టడం తప్పనిసరి అన్నది విరాళ్ అభిప్రాయం. విరాళ్ ఆచార్య ప్రసంగం ఒక విషయంలో మాత్రం సరైందేనని చెప్పాలి. ఆధునిక యుద్ధతంత్రంలో పోరాడటం అత్యంత ప్రత్యేకమైన విధి. యుద్ధసన్నద్దత అనేది దీర్ఘకాలిక లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి తాత్కాలిక రాజకీయాలు తీసుకొచ్చే ఒత్తిళ్లనుంచి దానికి రక్షణ కల్పించాలి. ఆధునిక సమాజంలో హై స్పీడ్ రైళ్ల వ్యవస్థను నడపడం కూడా ప్రత్యేకమైన విధిగానే ఉంటుంది. అలాగని, ఒక సైన్యాధిపతికి, జాయింట్ సర్వీసెస్ చైర్మన్‌కి సుప్రీం కోర్టు జడ్జి లేక ఎన్నికల కమిషనర్‌కు ఉండే రాజ్యాంగ ప్రతిపత్తిని ఇవ్వాలని ఎవరూ సూచించలేరు. ఈ సందర్భంగా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హెచ్ ఆర్ ఖాన్ మాట్లాడుతూ స్వతంత్రత అనేది స్వయంప్రతిపత్తి లాంటిది కాదని చెప్పారు. అత్యున్నత స్థాయి ప్రొఫెషనలిజాన్ని సాధించాలంటే, పాలసీలో అనూహ్య మార్పులు లేక ఆ ప్రక్రియలో అనవసర జోక్యాలనుంచి సంస్థలకు రక్షణ కల్పించాలి. కానీ ఈ సంస్థలు నేరుగా గానీ, పరోక్షంగా కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం నిర్ణయించిన విధాన చట్రం పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. అంతేతప్ప పాలసీని తమకు తాముగా రూపొం దించుకునే హక్కును అవి తీసుకోకూడదు. గతంలో 2007–2008 మధ్య కాలంలో ఆర్బీఐ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా రుణాల లభ్యతను అడ్డుకుంటూ వడ్డీరేట్లను పెంచుతూ పోయింది. కానీ దేశీయ అదనపు డిమాండుతో పనిలేకుండానే ద్రవ్యోల్బణం పెరిగి పెరిగి 9%కి చేరుకుంది. 2008లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్బీఐ స్వతంత్రతను ఘోరంగా ఉల్లంఘించి చేసిన ఆదేశాల ఫలితంగా ద్రవ్యోల్బణం మరికాస్త పెరిగి 9.1%కి చేరుకుంది. వడ్డీరేట్లను పెంచడం, తగ్గించడంలో సమతుల్యత పాటించడంలో ఆర్బీఐ గుణపాఠాలు నేర్చుకోలేదు. అందుకే ఈరోజు ఆర్బీఐ దయలేని స్కూల్ మాస్టర్లా మారింది. తప్పు చేసిన విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టి అది బాదేస్తోంది. వారు చేస్తున్న తప్పులకు తానే కారణమనే వాస్తవాన్ని గుర్తించడానికి కూడా సిద్ధపడటంలేదు. అందుకే ఒక అభిప్రాయం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు ఆర్బీఐపై పట్టు సాధించడానికి ప్రయత్నించటంలో లేదు. కాగా ఆర్బీఐకి మరీ ఎక్కువ స్వతంత్రతను కల్పించి సకాలంలో సరైన నిర్ణయాలను తీసుకోనివిధంగా దాన్ని కేంద్రం స్తంభింపచేసింది. అందుకే ఆర్బీఐ నేడు భారతీయ ఆర్థిక వ్యవస్థ మూలాలనే పద్ధతి ప్రకారం దెబ్బతీస్తోందని కొందరి అభి ప్రాయం. ఆర్బీఐ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు తిరుగుబాటు ప్రకటించింది కానీ వేలాది చిన్న మదుపుదార్లను దెబ్బతీసే జనాకర్షక విధానంతో, ప్రభుత్వేతర డైరెక్టర్లతో పావుకదిపి విమర్శల పాలవుతోంది. అదేసమయంలో విరాళ్ ఆచార్య చెప్పింది ఒక కోణంలో సరైనదే. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని ఇంత అపరిపక్వ దృష్టితో అడ్డుకోవడం వల్ల సంక్షోభం మరింత తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు దేశానికి అవసరమైంది ఆర్థిక మంత్రిత్వశాఖలో ప్రొఫెషనలిజమూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధానపరమైన ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే డబ్బు చలామణి, వడ్డీరేట్లను నిర్వహించాల్సి ఉందని ఆర్బీఐకి స్పష్టం చేయడమూ మాత్రమే. ఇవి మాత్రమే పారిశ్రామిక, ఉపాధి పెరుగుదలకు వీలు కల్పిస్తాయి. వ్యాసకర్త: ప్రేమ్ శంకర్ ఝా, సీనియర్ జర్నలిస్టు -
రిజర్వ్‌బ్యాంక్ వివాదంలో కేంద్రం రాజీమంత్రం
-
వాదం... వివాదం
అసలు ఆర్బీఐకి, కేంద్రానికి వివాదం ఎక్కడ మొదలైంది? దీనికి కారణాలు చూస్తే... మొండిబాకీలతో కుదేలవుతున్న బలహీన ప్రభుత్వ రంగ బ్యాంకులను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ కఠినతరమైన సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) అమలు చేస్తోంది. ఈ కఠినమైన ఆంక్షల వల్ల వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని ఆయా బ్యాంకులు కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. దీంతో పాటు విద్యుత్ రంగంలో మొండి బాకీల విషయంలో నిబంధనలను కొంత సడలించాలని కేంద్రం కోరింది. ఈ రెండింటికీ ఆర్బీఐ ససేమిరా అనేసింది. ఇక వ్యవస్థలో ద్రవ్య లభ్యత తగ్గిపోవడం, పేమెంట్ వాలెట్లకు సంబంధించి స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండటం తదితర అంశాలు కూడా ఆర్బీఐకి, కేంద్రానికి మధ్య విభేదాలను ఇతోధికంగా పెంచాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ స్వతంత్రతను బలహీనపరిస్తే పెను విపత్తు తప్పదంటూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య ఇటీవల వ్యాఖ్యానించారు. ఇవి ఇద్దరి మధ్యా విభేదాలను స్పష్టంగా బయటపెట్టాయి. ఆర్బీఐపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందన్న అభిప్రాయాలు కూడా నెలకొన్నాయి. దీనికి ప్రతిగా... బ్యాంకులు అడ్డగోలుగా రుణాలిచ్చేస్తుంటే ఆర్బీఐ కళ్లు మూసుకుని కూర్చుందని, ఈ రుణాలే ప్రస్తుతం భారీ మొండిబాకీలుగా మారాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు విభేదాలను పతాక స్థాయికి తీసుకువెళ్లాయి. నియంత్రణ సంస్థలు తోచింది చేసి చేతులు దులుపేసుకుంటాయని, పర్యవసానాలు రాజకీయ నేతలు ఎదుర్కొనాల్సి వస్తుందని జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంక్‌ను దారికి తెచ్చుకునేందుకు కేంద్రం సెక్షన్ 7ని ప్రయోగించి ఉంటుందన్న వార్తలు వచ్చాయి. రాజన్‌తో రాజుకుంది... నిజానికి కేంద్రం, ఆర్బీఐ మధ్య విభేదాలు రేగటం ఇది తొలిసారేమీ కాదు. వడ్డీ రేట్ల నుంచి లిక్విడిటీ, బ్యాంకింగ్ రంగ నిర్వహణ మొదలైన పలు కీలక అంశాలపై గతంలోనూ అభిప్రాయ భేదాలుండేవి. అయితే, అంతిమంగా ఇవన్నీ సామరస్యంగానే పరిష్కారమయ్యాయి. కానీ, కేంద్రం సెక్షన్ 7ని ప్రయోగించిందంటూ వస్తున్న వార్తలను చూస్తుంటే ఈ సారి మాత్రం విభేదాలు తారస్థాయికి చేరినట్లుగా కనిపిస్తోందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తామని ఆర్థిక శాఖ ప్రకటించినప్పటికీ, సెక్షన్ 7ని ప్రయోగంపై మౌనం దాల్చటం ఈ అభిప్రాయాలకు ఊతమిస్తోందని పేర్కొన్నాయి. ఉర్జిత్ పటేల్‌కి ముందు రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసినప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం మధ్య మొండిబాకీల నిర్వహణ, పెద్ద నోట్ల రద్దు వంటి పలు అంశాలపై విభేదాలు తలెత్తాయి. ప్రభుత్వ ఆర్థిక, ఆర్థికేతర విధానాలను రాజన్ బాహాటంగానే విమర్శించేవారు. దీంతో సుబ్రమణియన్ స్వామి వంటి బీజేపీ ఎంపీలు సహా పలువురు నేతలు రాజన్‌పై విమర్శలు గుప్పించారు. దువ్వూరికీ తప్పలేదు... రఘురామ్ రాజన్ కన్నా ముందు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావు హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. దువ్వూరి హయాంలో కఠిన ద్రవ్య పరపతి విధానంపై అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం గుర్రుగా ఉండేవారు. వడ్డీ రేట్లను సడలించాలన్న ప్రభుత్వ, పరిశ్రమ వర్గాల అభ్యర్థనలను దువ్వూరి పక్కనపెడుతుండటంతో అసహనానికి గురైన చిదంబరం ఒక దశలో.. రిజర్వ్ బ్యాంక్ సహకారం లేకుండా ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధన కోసం అవసరమైతే ఒంటరిపోరుకైనా సిద్ధమన్నారు. దీనిపై పదవీ విరమణ సమయంలో స్పందించిన దువ్వూరి.. ఏదో ఒకరోజు ఆర్బీఐ చేసిన మేలును చిదంబరం గుర్తు చేసుకుంటారని చమత్కరించారు. -
ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయనున్నారా?
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా బ్యాంకు స్వతంత్రత, ప్రభుత్వ బ్యాంకులపై దానికి పూర్తి పెత్తనం లేకపోవటం మీద తాజాగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆర్బీఐ వ్యవహారాలపై చేసిన దాడి, తదితర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో ఆర్బీఐ గవర్నర్ తన రాజీనామా అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గత దశాబ్దకాలంలో ఆర్బీఐ గవర్నర్లకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవటానికి ప్రధానాంశంగా నిలిచిన బ్యాంకుల లిక్విడిటీ అంశమే మరోసారి కీలకంగా మారింది. ఈ క్రమంలో ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం కేంద్రం చర్యలు తీసుకుంటుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత లిక్విడిటీ పెంచాలన్న కేంద్ర వాదనను ఆర్బీఐ తిరస్కరిస్తోంది. అలాగే పేమెంట్స్ రెగ్యులేటరీ కమిటీకి ఆర్బీఐ విముఖత వ్యక్తం చేసింది. నీరవ్‌మోదీ కుంభకోణంపై కేంద్రంపై తీవ్రవిమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఈ స్కాంను నిరోధించడంలో ఆర్బీఐ ఫెయిల్ అయిందని కేంద్రం ఆరోపిస్తోంది. ఇలా వివాదం ముదురుతూ వస్తోంది. ఇది ఇలా ఉండగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య తాజాగా వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోసాయి. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్బీఐ పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేకపోతోంది. మేనేజ్మెంట్ను మార్చాలన్నా, బోర్డును తొలగించాలన్నా, లైసెన్సు రద్దు చేయాలన్నా, బ్యాంకుల విలీనమైనా లేదా వేరే బ్యాంకుకు అప్పగించే ప్రయత్నమైనా..ఇలా ఏ అంశమైనా సరే.. ప్రైవేటు బ్యాంకుల విషయంలో స్పందించినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో స్పందించడం ఆర్బీఐకి సాధ్యం కావడంలేదు’ అని విరాల్ ఆచార్య గతవారం ముంబైలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా అరుణ్ జైట్లీ బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలిచ్చేస్తుంటే కట్టడి చేయకుండా సెంట్రల్ బ్యాంక్ చోద్యం చూస్తూ కూర్చుందంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ రుణాలే పెరిగి, పెద్దవై ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీల సంక్షోభానికి దారితీశాయని ఎదురు దాడికి దిగారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆర్బీఐ గవర్నర్లుగా వ్యవహరించిన వారు ఎన్నో సందర్భాల్లో బ్యాంకులపై నియంత్రణ విషయంలో తమకు తగినంత స్వేచ్ఛ లేదని గతంనుంచి వినిపిస్తున్న వాదనే. ఆర్బీఐకి పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని పలువురు బ్యాంకింగ్ నిపుణులు వివిధ సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఆర్బీఐ పాలసీలపై ప్రభుత్వం విమర్శలు కూడా ఇదే మొదటిసారి కాదు. ఈ క్రమంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు సార్లు ఆర్బీఐ గవర్నర్లు రాజీనామా ఉదంతాలు చోటు చేసుకున్నాయి. If RBI governor resigns then it is a direct consequence of FM blaming him publicly yesterday for NPAs. Patel is a self respecting scholar of economics(Ph.D in Banking from Yale). He should be persuaded to stay. — Subramanian Swamy (@Swamy39) October 31, 2018 -
ఉర్జిత్ పటేల్ (ఆర్బీఐ గవర్నర్) రాయని డైరీ
మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయ్యాక ఎవరి ఇళ్లకు వాళ్లం వెళుతున్నాం. ఎవరి ఇళ్లకు వాళ్లం అని అనుకున్నానే కానీ, వెనక్కి తిరిగి చూస్తే మిగతా ఐదుగురూ నా వెనుకే వస్తున్నారు! మీటింగ్ అయ్యాక మా ఇంట్లో గెట్ టుగెదర్ ఉంటుందని వాళ్లకు చెప్పినట్లుగా నాకేమీ గుర్తుకు లేదు. నవ్వాను. నవ్వారు. ‘‘మీరేదైనా చేస్తారు అనుకున్నాను’’ అన్నారు మిసెస్ పామీ దువా. ‘‘అవునవును.. మీరేదైనా చేస్తారని మేమూ అనుకున్నాం’’ అన్నారు ప్రొఫెసర్ రవీంద్ర, ప్రొఫెసర్ చేతన్! దువా, రవీంద్ర, చేతన్.. మా బ్యాంకు వాళ్లు కాదు. మానిటరీ పాలసీ మెంబర్లుగా గవర్నమెంటు పంపినవాళ్లు. వాళ్లు అలా అనగానే ఆచార్య, మైఖేల్ పాత్రా నావైపు చూశారు. వాళ్లిద్దరూ మావాళ్లు. మా బ్యాంకు వాళ్లు. రూపాయి రేటు పడిపోకుండా నేనేదైనా చేస్తానని కమిటీ సభ్యులంతా అనుకున్నారట! మీటింగుల్లో కూర్చొని ఏం చేస్తాం.. రూపాయి పడిపోకుండా?! పడేది పడుతుంది. లేచేది లేస్తుంది. పడుతూ లేస్తూ ఉన్నదానిని తక్కువ పడి, తక్కువ లేస్తూ ఉండేలా చూడాలి గానీ, అరచేత్తో రూపాయిని బిగించి పట్టుకుంటే దేశం ఊపిరాడక చచ్చిపోతుంది. దేశం చచ్చిపోయాక, రూపీ వాల్యూ పెరిగి ఎవరికి లాభం? ‘‘అలాక్కాదు ఉర్జిత్. మన మీటింగ్ అయితే ముగిసింది కానీ, మీటింగ్ మీద దేశ ప్రజలు పెట్టుకున్న ఆశలు ముగిసిపోలేదు’’ అన్నారు మిసెస్ దువా! ‘‘నిజానికి ఉర్జిత్.. మీటింగ్ మీద దేశ ప్రజలు ఆశలు పెట్టుకోలేదు. మీ మీద పెట్టుకున్నారు’’ అన్నారు ప్రొఫెసర్ రవీంద్ర. ఆశల్దేముంది? ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎవరి మీదైనా పెట్టుకోవచ్చు. ఆశ అప్పటికప్పుడు నెరవేరుతుందా.. మీటింగ్ అయ్యేలోపు! బ్యాంకు కాంపౌండ్‌లో మామిడి చెట్టు కింద అరుగులు ఉన్నాయి. వాటిల్లో ఒక అరుగు మీద కూర్చున్నాను. మావాళ్లిద్దరూ ఒక అరుగు మీద, గవర్నమెంటు వాళ్లు ముగ్గురూ ఒక అరుగు మీద కూర్చున్నారు. ‘‘మన ఆరుగురం ఇక్కడిలా కూర్చోవడం ఎవరైనా చూస్తే ఆరుబయట మళ్లీ ఒక మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరుగుతోందేమో అనుకుంటారు’’ అని నవ్వారు ప్రొఫెసర్ చేతన్. మామిడి చెట్టు పైకి చూశాను. మిగతావాళ్లూ చూశారు. ‘‘ఈ చెట్టు చూడండి.. మనం మీటింగ్‌కు వెళ్లే ముందు ఈ చెట్టుకు పూత లేదు. పిందెలు లేవు. కాయల్లేవు. పండ్లు లేవు. మీటింగ్ నుంచి వచ్చాక కూడా పూత లేదు. పిందెలు లేవు. కాయల్లేవు. పండ్లు లేవు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసిందేమిటంటే.. మీటింగ్ అయింది కదా అని మామిడి చెట్టు గానీ, మానిటరీ పాలసీ గానీ పూత తొడిగి, పిందెలు వేయవని. కాయలు కాసి, పండ్లు ఇవ్వవని’’ అన్నాను. ‘‘కానీ ఉర్జిత్.. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా.. రూపాయి మీరేం చెబితే అది వింటుంది. చెట్లు పండ్లివ్వకపోవచ్చు. చెట్లకు మీరు డబ్బులు కాయించగలరు. మా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పిల్లలకి ఈ విషయమే నేను చెబుతుంటాను’’ అన్నారు మిసెస్ దువా. ‘‘అవును ఉర్జిత్. మీరు పెద్ద పెద్దవాళ్లను ఇంప్రెస్ చేసినవారు. పీవీ నరసింహారావు, పి. చిదంబరం, రఘురామ్ రాజన్.. ఇలాంటి వాళ్లందర్నీ’’ అన్నాడు ప్రొఫెసర్ చేతన్. ‘‘పెద్ద ఎకనమిస్ట్ కదా మీరు, రూపాయికి ఏదైనా చేయవలసింది’’ అన్నారు మిసెస్ దువా మళ్లీ. రూపాయిని మించిన ఎకనమిస్ట్ ఎవరుంటారు? మిసెస్ దువాతో అదే మాట చెప్పి, అరుగు మీద నుంచి లేచాను. -
అంచనాలు తలకిందులు
అంచనాలు తలకిందులయ్యాయి. ఆర్బీఐ నిర్ణయం విశ్లేషకులు, బ్యాంకర్లను అయోమయానికి గురిచేసింది! ఒకపక్క మన కరెన్సీ రూపాయి రోజురోజుకు డాలర్ ముందు బక్కచిక్కుతోంది. మరోపక్క అంతర్జాతీయంగా చమురు ధరలు ఉరుముతున్నాయి. ఇంకో పక్క దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. ఇన్నిరకాల సమస్యలు చుట్టుముట్టిన తరుణంలోనూ... ఆర్బీఐ పాలసీ కమిటీ (ఎంపీసీ) 3 రోజులు సమావేశమై... ఒక్క నివారణ చర్య లేకుండా ముగించేయడం ఆశ్చర్యపరిచింది. ముంబై: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన జరిగిన ఎంపీసీ కమిటీ నాలుగో ద్వైమాసిక సమావేశం, చివరికి కీలక రేట్లలో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథ విధానాన్నే కొనసాగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. బెంచ్‌మార్క్ రెపో రేటు 6.5 శాతాన్ని మార్చాల్సిన అవసరం లేదని మొత్తం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ఓటు వేశారు. రివర్స్ రెపో 6.25 శాతంలోనూ మార్పు లేదు. పెరిగే చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినతరం అవుతుండటం మన దేశ వృద్ధికి, ద్రవ్యోల్బణానికి సవాళ్లను విసురుతున్నాయని పేర్కొన్నా... అందుకు తన వైపు నుంచి చర్యలను ప్రకటించకపోవడం గమనార్హం. కాకపోతే పాలసీ విధానాన్ని తటస్థం నుంచి ‘క్రమంగా కఠినతరం’ (క్యాలిబ్రేటెడ్ టైటనింగ్)కు మార్చింది. అంటే ఇకపై సమీప భవిష్యత్తులో రేట్ల పెంపే గానీ, తగ్గేందుకు అవకాశాల్లేవని సంకేతాలిచ్చింది. మధ్య కాలానికి ధరల పెరుగుదలను (ద్రవ్యోల్బణాన్ని) 4 శాతానికి నియంత్రించాలన్న విధానానికి కట్టుబడి ఉన్నట్టు మరోసారి పేర్కొంది. నిజానికి కీలక రేటును కనీసం పావు శాతం అయినా పెంచుతారని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేశారు. రూపాయి బలహీనత చూసి కొందరయితే... ఈ పెంపు అర శాతం కూడా ఉండొచ్చని అనుకున్నారు. కానీ, వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన తర్వాత రూపాయి ఫారెక్స్ మార్కెట్లో 74 స్థాయిని కోల్పోయింది. స్టాక్ మార్కెట్లు మాత్రం ఆర్బీఐ విధానంతో కకావికలం అయ్యాయి. పెరిగిపోతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అస్థిరతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు, అంతర్జాతీయంగా ఆర్థిక మార్కెట్లలో పరిస్థితి కఠినతరం అవుతుండడం మనదేశ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ అంచనాలకు పెద్ద సవాళ్లుగా ఆర్బీఐ పేర్కొంది. ఈ తరహా సమస్యల ప్రభావాన్ని తటస్థ పరిచే విధంగా దేశీ స్థూల ఆర్థిక మూలాలు మరింత బలపడాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4%గానే ఉంటుందని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 7.6%కి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దేశాల రక్షణాత్మక విధానాలు, కరెన్సీ యుద్ధాల ముప్పు, అమెరికాలో వడ్డీరేట్ల పెంపు అన్నవి దేశ ఆర్థిక వృద్ధికి అతిపెద్ద సమస్యలుగా ఎంపీసీ అభిప్రాయపడింది. ఎంపీసీ ఆగస్ట్‌లో జరిగిన సమావేశంలో పాలసీ రేట్లను పావు శాతం పెంచిన విషయం గమనార్హం. రూపాయి ఇప్పటికీ బాగానే ఉంది... దేశీయ కరెన్సీ రూపాయి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయని, ఈ విషయంలో ఆర్బీఐకి ఎటువంటి టార్గెట్, బ్యాండ్ లేదని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. వర్ధమాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి ఇప్పటికే మెరుగ్గానే ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్ చివరి నాటికి ఉన్న విదేశీ మారక నిల్వలు 400.5 బిలియన్ డాలర్లని, ఇవి పది నెలల దిగుమతులకు సరిపోతాయని చెప్పారు. రూపాయి పతనం కొన్ని అంశాల్లో పలు వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే మోస్తరుగానే ఉందని ఉర్జిత్ చెప్పారు. ద్రవ్యోల్బణం... ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో (అక్టోబర్–మార్చి) రిటైల్ ద్రవ్యోల్బణం 3.9–4.5 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. ఆహార ధరలు ఊహించనంత అనుకూలంగా ఉండడమే కారణం. 2019–20 మొదటి త్రైమాసికంలో 4.8 శాతంగా ఉండొచ్చని, సమస్యలు ఎదురైతే కొంత అధికంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. మధ్య కాలానికి వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4%కి (2% అటూ, ఇటూగా) తీసుకురావాలన్న లక్ష్యానికి అనుగుణంగానే... క్రమంగా కఠినతరమనే విధానం తీసుకున్నట్టు తెలిపింది. ద్రవ్యలోటు లక్ష్యాలను దాటితే ప్రమాదమే ద్రవ్యలోటు లక్ష్యాలను దాటకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ సూచించింది. లక్ష్యాలు తప్పితే ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావం పడడమే కాకుండా, మార్కెట్లలో అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించింది. ‘‘కేంద్రం లేదా రాష్ట్రాల స్థాయిలో ద్రవ్యలోటు కట్టుతప్పితే అది ద్రవ్యోల్బణ అంచనాలపై, ప్రైవేటు పెట్టుబడులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది’’ అని ఆర్బీఐ పేర్కొంది. ఐఎల్ఎఫ్ఎస్ పరిస్థితి కుదుటపడుతుంది ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభంలో ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుందని, పరిస్థితిని ఇది సద్దుమణిగేట్టు చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. పూర్తి నిర్మాణాత్మక సంస్థాగత చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. నూతన యాజమాన్యానికి ఆర్బీఐ సహకారం ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. స్వల్పకాలిక రుణాలపై అధికంగా ఎన్బీఎఫ్సీలు ఆధారపడడాన్ని హ్రస్వదృష్టి విధానంగా డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య అభివర్ణించారు. ఇది సంస్థలపైనే కాకుండా వ్యవస్థాగత స్థిరత్వంపైనా ప్రభావం చూపించినట్టు చెప్పారు. ఈక్విటీ, దీర్ఘకాలిక రుణాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ‘‘వరుసగా రెండు సార్లు రేట్లను పెంచడం, ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుందన్న అంచనాలే యథాతథ స్థితిని కొనసాగించేందుకు, కఠినతర విధానానికి మళ్లేలా చేశాయి. ప్రతి సమావేశంలోనూ రేట్ల పెంపునకు మేమేమీ కట్టుబడలేదు. ఈ సమయంలో అది అవసరం పడలేదు. ఆర్బీఐ, ఎంపీసీ ఇందుకు సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాయి. తటస్థ విధానం నుంచి క్రమంగా కఠినతర విధానానికి మళ్లడం ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగేందుకు సమస్యలు పొంచి ఉండడం వల్లే. ఈ విధానంలో రెండే ఆప్షన్లు ఉన్నాయి. రేట్లను పెంచడం లేదా వాటిని స్థిరంగా కొనసాగించడం ’’ – ఉర్జిత్పటేల్, ఆర్బీఐ గవర్నర్ రూపాయి, మార్కెట్లకు ఇబ్బందే! సమస్య తీవ్రమవుతుంది.. ఆర్బీఐ చర్య ఇబ్బందిని సృష్టించేదే. ప్రస్తుతం రూపాయి పతనాన్ని అడ్డుకోవడం ప్రధానం. రూపాయి బలోపేతం మార్కెట్‌కూ అవసరం. కానీ ఆర్బీఐ నిర్ణయం ఈ దిశలో లేదు. రేటు పెంపు లేకపోవడం వల్ల కరెన్సీ, అలాగే ఇతర అసెట్స్ మార్కెట్లు తీవ్ర సర్దుబాటుకు (కరెక్షన్) గురయ్యే అవకాశాలున్నాయి. ఫైనాన్షియల్ సంక్షోభ సమయాల్లో ఒక్క ద్రవ్యోల్బణం లక్ష్యాలను మాత్రమే చూడ్డం సరికాదు. అయితే ఆర్బీఐ పాలసీ వైఖరి మార్చుకోవడం గమనించాలి. వచ్చే నెలల్లో రేటు పెంపు ఉంటుందని ఈ పాలసీ వైఖరి మార్పు తెలియజేస్తోంది. – అభీక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ అనిశ్చితిని సూచిస్తోంది ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని పాలసీ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి తీవ్రతను ఆర్బీఐ పరిశీలనలోకి తీసుకుంది. గ్లోబల్ ట్రేడ్, ఫైనాన్షియల్ స్థిరత్వ పరిస్థితులు బలహీనతకు అవకాశాలు ఉన్నట్లు పాలసీ నిర్ణయాలు సూచిస్తున్నాయి. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ ఆశ్చర్యానికి గురిచేసింది రెపోపై ఆర్బీఐ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలే ఉన్నాయి. రైతులకు కనీస మద్దతు ధరల పెరుగుదల, చమురు ధరలు, అంతర్జాతీయ అనిశ్చితి, కేంద్రం, రాష్ట్ర స్థాయిల్లో ద్రవ్యలోటు లక్ష్యాలు కట్టుతప్పే అవకాశాలు దీనికి కారణం. – సునీల్ మెహతా, ఐబీఏ చైర్మన్ రియల్టీకి సానుకూలమే గడచిన ఆరు నెలల్లో వృద్ధి సంకేతాలను ఇస్తున్న రియల్టీకి తాజా ఆర్బీఐ నిర్ణయం మరింత సానుకూలమైనదే. కొనుగోలుదారులకు ఇది ఒక అవకాశం. పండుగల సీజన్, దేశ వ్యాప్తంగా ప్రొపర్టీ రేట్లు దాదాపు తక్కువగానే ఉండడం వంటి అంశాలు ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగం సెంటిమెంట్‌ను మరింత బలపరుస్తున్నాయి. – జాక్షయ్ షా, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎఫ్‌పీఐల ఆకర్షణకు వీఆర్ఆర్ మార్గం విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) ఆకర్షించేందుకు స్వచ్చంద ఉపసంహరణ మార్గాన్ని (వాలంటరీ రిటెన్షర్ రూట్/వీఆర్ఆర్) ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ విధానంలో విదేశీ ఇన్వెస్టర్లకు మరింత వెసులుబాటు ఉంటుందని తెలిపింది. డెట్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులకు సంబంధించి ఇటీవలి కాలంలో పలు చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. ‘‘దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేలా ఎఫ్‌పీఐలను ప్రోత్సహించేందుకు వీఆర్ఆర్ అనే పత్య్రేక మార్గాన్ని ప్రతిపాదించాం. ఈ మార్గంలో ఇనుస్ట్రుమెంట్ల ఎంపిక పరంగా ఎఫ్‌పీఐలకు మరింత వెసులుబాటు ఉంటుంది. స్వల్పకాలిక పెట్టుబడుల పరంగా నియంత్రణపరమైన మినహాయింపులు కూడా ఉంటాయి’’ అని ఆర్బీఐ తెలిపింది. ఈ వీఆర్ఆర్ మార్గంలో ఇన్వెస్ట్ చేసేందుకు అర్హతగా... పెట్టుబడుల్లో కనీస శాతాన్ని, నిర్ణీత కాలం వరకు భారత్‌లో కొనసాగించేందుకు వారు ఎంచుకోవచ్చని ఆర్బీఐ వివరించింది. -
మరో విడత వడ్డింపు!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ 3,4,5వ తేదీల్లో జరపనున్న ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) నిర్ణయం వైపే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరశాతం వరకూ పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే ఈ రేటు 6.5 శాతం నుంచి 7 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మూడవసారి రేటు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అవుతుంది. నిర్దేశిత లక్ష్యాల మేరకు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పటికీ, క్రూడ్ ఆయిల్ తీవ్రత, రూపాయి బలహీనత, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంశాల నేపథ్యంలో రేటు పెంపు వైపే ఆర్బీఐ మొగ్గుచూపే అవకాశం ఉందని ఒక వార్తా సంస్థ సెప్టెంబర్ 19 నుంచి 25 మధ్య నిర్వహించిన సర్వేలో ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇక డాలర్ మారకంలో ఈ ఏడాది ఇప్పటి వరకూ దాదాపు 15 శాతం బలహీనపడ్డ రూపాయి విధాన నిర్ణేతలకు ఆందోళన కలిగించే అంశమేనన్నది వారి విశ్లేషణ. అమెరికాలో వడ్డీరేటు పెరుగుతున్న పరిస్థితుల్లో, దేశీయంగా ఈ తరహా నిర్ణయం లేకపోతే దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్‌కు తగిన రిటర్న్ లభించని పరిస్థితి ఉంటుంది. దీనితో దేశానికి విదేశీ నిధులు తగ్గిపోతాయి. ఈ పరిస్థితి కరెంట్ అకౌంట్ లోటుకు, రూపాయి మరింత పతనానికి దారితీస్తుంది. 3వ తేదీ నుంచీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశం జరగనుంది. 5వ తేదీన కీలక రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ అంశంపై కొందరి అభిప్రాయాలు చూస్తే... ఎస్బీఐ: రూపాయి బలహీనతను అరికట్టడానికి కనీసం పావుశాతం రేటు పెంపు తప్పదని ఎస్బీఐ తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన ‘తటస్థ వైఖరి’ని కూడా ఆర్బీఐ మార్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఐఎన్జీ: అమెరికా సెంట్రల్ బ్యాంక్.. ఫెడ్ వడ్డీరేట్ల (ప్రస్తుతం 2.25%) పెంపు నేపథ్యంలో దేశీయంగానూ రేట్ల పెంపు తప్పని పరిస్థితి నెలకొందని ఐఎన్‌జీలో ఆసియా ఆర్థిక వ్యవహారాల నిపుణులు ప్రకాశ్ శక్పాల్ పేర్కొన్నారు. ఆర్బీఐ అక్టోబర్ 4వ తేదీన పావుశాతం రేటు పెంచినా, ఫెడ్ రేటుకు సంబంధించి పోల్చిచూస్తే, ఆ మేర రేటు పెంపు (పావుశాతం) తక్కువగానే భావించాల్సి వస్తుందని ఆయన విశ్లేషించారు. రాబోబ్యాంక్: భారత్ రెండవ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటును సాధించినప్పటికీ, దానికి ప్రధానంగా బేస్ ఎఫెక్ట్ కారణమవుతుందని రబోబ్యాంక్‌లో సీనియర్ ఎకనమిస్ట్ హుగో ఎర్కిన్ పేర్కొన్నారు. చమురు ధరల పెరుగుదల ప్రస్తుతం భారత్ ముందున్న తీవ్ర సవాలని అన్నారు. ఇది కరెంట్ అకౌంట్‌పై ప్రతికూలత చూపే అంశంగా పేర్కొన్నారు. డీబీఎస్: రూపాయి క్షీణతతో పాలసీ రేటు పెంపు ఆర్బీఐకి తప్పనిసరేనని, అయితే ఎప్పుడు పెంచుతారన్నదే కీలకమని సింగపూర్‌లో డీబీఎస్ ఎకనమిస్ట్ రాధికారావు పేర్కొన్నారు. బ్రెంట్ క్రూడ్ ధర తీవ్రత, దేశంలో ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అవకాశాలు రేటు పెంపు నిర్ణయం పట్ల ఆర్బీఐ మొగ్గుచూపేలా చేస్తాయని రాధికారావు పేర్కొన్నారు. మోర్గాన్ స్టాన్లీ: ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు ఖాయమని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడుతోంది. రూపాయి బలహీనత ఇక్కడ కీలకాంశమని పేర్కొంది. కరెన్సీ విలువ స్థిరీకరణకు తీసుకుంటున్న చర్యలూ ఫలితమివ్వడం లేదన్న విషయాన్ని మోర్గాన్ స్టాన్లీ ప్రస్తావించింది. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యలోటు సమస్య, ద్రవ్యోల్బణం ఎగసే అవకాశాలను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పెట్రో ధరల మంట... దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం ము న్ముందు పెరుగుతుందనడానికి ఇది ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ముందస్తు చర్య తీసుకునే అవకాశం ఉంది. రెపో రేటు పావుశాతం పెరుగుతుందని భావిస్తున్నా. – రాజ్‌కిరణ్ రాయ్ జీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ రూపీ బలహీనత కారణంగా... కరెన్సీ విలువ డాలర్ మారకంలో భారీగా పడిపోతోంది. ఆయా పరిణామాలను ఎదుర్కొనడానికి పావుశాతం రేటు పెంపు తక్షణ అవసరం. – కేకి మిస్త్రీ, హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్ రయ్‌మంటున్న క్రూడ్... అంతర్జాతీయంగా క్రూడ్ ధర నాలుగున్నరేళ్ల గరిష్టస్థాయికి చేరింది. మంగళవారం నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర 75.91 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే 9 గంటల సమయానికి 75.30 వద్ద ట్రేడవుతోంది. భారత్ ప్రధానం గా వినియోగించే బ్రెంట్ ధర 85.36 స్థాయిని తాకి, అదే స్థాయిలో ట్రేడవుతోంది. సరఫరా పరమైన ఆందోళనలు అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదలకు కారణం. 100 డాలర్లకు బ్రెంట్ చేరుతుందన్న అంచనాలు భారత్ వంటి వర్థమాన దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. జారిపోతున్న రూపాయి... ఇక అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోతోంది. మంగళవారం నైమెక్స్‌లో రూపాయి విలువ డాలర్ మారకంలో 73.77కు పడిపోయింది. ఈ వార్త రాసే 9 గంటల సమయానికి 73.30 వద్ద ట్రేడవుతోంది. ఇక ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ మళ్లీ 95 పటిష్ట స్థాయిని దాటింది. దేశీయ ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటికి రూపాయి ఇంట్రాడే రికార్డు 72.99 అయితే, ముగింపులో రికార్డు 72.98. అంతర్జాతీయ ట్రేడింగ్ ధోరణిని చూస్తుంటే, బుధవారం దేశీయంగా 73ను రూపాయి దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నోట్ల రద్దు నుంచి ఎన్పీఏల దాకా...
ముంబై: సెప్టెంబరు 4, 2016న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఉర్జిత్ పటేల్ నేటితో రెండేళ్లను పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నటువంటి సమయంలో ముందుచూపుపై చేసిన వ్యాఖ్యలు తాజాగా హైలైట్ అయ్యాయి. ‘ఆర్బీఐ.. పావురం లేదా డేగలా ఉండడం కంటే తెలివైన గుడ్లగూబ పాత్రను పోషించడం మంచిది. ఎందుకంటే సంప్రదాయంగా జ్ఞానానికి చిహ్నంగా ఈపక్షి కొనసాగుతోంది. మనం కూడా జ్ఞానవంతమైన గుడ్లగూబ విధానాన్ని కొనసాగిద్దాం.’ అని 2014లో అన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇదే విధానాన్ని తీసుకుని ‘వైజ్ ఔల్’ ఆఫ్ మింట్ స్ట్రీట్‌గా మారారు. ఈయన పదవి చేపట్టిన రెండునెలల్లోనే పెద్దనోట్ల రద్దు అంశం సవాలు విసిరినప్పటికీ, సునాయాసంగా సమస్యను అధిగమించారు. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను శుద్ధి చేయడంలో తనదైన ముద్రవేసి.. సామాన్యులకు బ్యాంకుల రూపంలో గుదిబండ వెంటాడకూడదనే తన ఆలోచనలో విజయం సాధించారని ఈ రంగ నిపుణులు కొనియాడుతున్నారు. ఇక మిగిలి ఉన్న పదవీకాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును ఏ మేరకు మెరుగుపరుస్తారు? రుణ జారీ తగ్గుతున్న తరుణంలో ఎటువంటి నిర్ణయాలు తీసు కుంటారు? అనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆశక్తి నెలకొంది. -
ఉర్జిత్ పటేల్‌కు ఆర్బీఐ యూనియన్ బాసట
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) పీడిస్తున్న మొండిబాకీలు తదితర సమస్యల పరిష్కారం విషయంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తీసుకుంటున్న కఠిన చర్యలకు ఆర్బీఐ ఉద్యోగుల సంఘం మద్దతు పలికింది. బ్యాంకులను ఆర్బీఐ మరింత క్రియాశీలకంగా పర్యవేక్షించాల్సి ఉందని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ కేవలం ఆఫ్‌సైట్ సర్వేయర్‌గా ఉండిపోకుండా అప్రమత్తంగా ఉండే ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాలని అభిప్రాయపడింది. అఖిల భారత రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఈ మేరకు ఉర్జిత్ పటేల్‌కు లేఖ రాసింది. ఇటీవలే పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన ఉర్జిత్ పటేల్.. పీఎస్‌బీల నియంత్రణకు మరిన్ని అధికారాలు అవసరమని చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు, భారీగా బాకీ పడిన 40 మొండిపద్దులపై దివాలా కోర్టుకెళ్లాలన్న ఆర్బీఐ ఆదేశాలతో పీఎస్‌బీల పరిస్థితి మరింత దిగజారడంతో పాటు తమ ఉద్యోగాలకూ ముప్పు తప్పదంటూ బ్యాంక్ ఆఫీసర్ల యూనియన్లు ఇటీవలే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో పటేల్ కఠిన వైఖరికి మద్దతుగా ఆర్బీఐ యూనియన్ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిజర్వ్ బ్యాంక్‌కు ఉన్న పరిమితులను పార్లమెంటరీ స్థాయీసంఘానికి స్పష్టీకరించినందుకు పటేల్‌ను ప్రశంసిస్తూనే.. మరోవైపు, ఆర్బీఐ మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉన్న సంగతి కూడా యూనియన్ గుర్తు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌ను ప్రస్తావిస్తూ.. బ్యాంకుల యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని, అవి ఇచ్చే నివేదికలను పూర్తిగా నమ్మొచ్చని ఆర్బీఐ గానీ భావిస్తే.. తన విధులను విస్మరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. అలా కాకుండా, రిస్క్ ఆధారిత పర్యవేక్షణ, ఆఫ్‌సైట్ నిఘా, నిర్వహణ వ్యవస్థలను ఆన్సైట్లో తనిఖీలు చేయడం వంటి త్రిముఖ వ్యూహాన్ని పాటించవచ్చని పేర్కొంది. -
మరిన్ని అధికారాలు ఇవ్వండి..
న్యూఢిల్లీ: మొండిబాకీలు, స్కామ్‌లు, నష్టాలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) సమర్ధంగా నియంత్రించాలంటే తమకు మరిన్ని అధికారాలు ఇవ్వాల్సి ఉంటుందని పార్లమెంటరీ కమిటీకి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. పీఎస్‌బీల చైర్మన్, డైరెక్టర్, సీఈవోలను తొలగించడం మొదలు ఆయా బ్యాంకుల బోర్డుల్లో డైరెక్టర్లపై ఆంక్షలు విధించడం దాకా దాదాపు పదికి పైగా కీలక అంశాల్లో తమకు పూర్తి అధికారాలు లేవని ఆయన చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం (ఆర్థిక)తో మంగళవారం భేటీ అయిన సందర్భంగా పటేల్ ఈ విషయాలు పేర్కొన్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. మొండిబాకీలు, బ్యాంకుల్లో మోసాలు, నగదు కొరత వంటి పలు అంశాలపై స్థాయీ సంఘం నుంచి పటేల్‌కు కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. మరోవైపు, దివాలా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి మొండిబాకీల రికవరీ మెరుగుపడుతోందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు. బోర్డుల్లో ఆర్బీఐ నామినీలు ఉండకూడదు.. బ్యాంకులను సమర్ధంగా నియంత్రించాలంటే వాటి బోర్డుల్లో రిజర్వ్ బ్యాంక్ నామినీ డైరెక్టర్లు ఉండకూడదని స్థాయీ సంఘానికి పటేల్ తెలిపారు. దీనిపై ఆర్థిక శాఖతో సంప్రతింపులు జరుగుతున్నాయని వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డుల పనితీరును మెరుగుపర్చేందుకు నాయక్ కమిటీ సిఫార్సులను సత్వరం అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. బోర్డు స్వతంత్ర హోదాను మరింత పటిష్టం చేసేందుకు, మేనేజ్మెంట్పై పర్యవేక్షణను పెంచేందుకే చైర్మన్.. సీఈవో/ఎండీ పదవులను విడగొట్టినట్లు పటేల్ తెలిపారు. మోసాల నియంత్రణ బాధ్యత బోర్డులదే.. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో రూ. 13,000 కోట్ల కుంభకోణం గురించి కూడా పటేల్ వివరణ ఇచ్చారు. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల్లో గవర్నెన్స్ లోపాలపైనా స్థాయీ సంఘం ప్రశ్నించింది. ప్రతి బ్యాంకు శాఖను ఆర్బీఐ ఆడిట్ చేయడం అసాధ్యమని స్పష్టం చేసిన పటేల్.. మోసాలకు తావులేకుండా బ్యాంకులు సమర్ధంగా నడిచేలా చూడటమనేది వాటి బోర్డుల్లోని డైరెక్టర్ల ప్రాథమిక, సమష్టి బాధ్యత అని పేర్కొన్నారు. అటు డీమోనిటైజేషన్, ఆ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలోకి మళ్లీ ఎంత మొత్తం నగదు తిరిగి వచ్చిం దన్న ప్రశ్నలకు పటేల్ నుంచి సంతృప్తికరమైన సమాధానం లభించలేదని సమచారం. -
దేనా బ్యాంక్‌పై ఆంక్షలు ఎత్తివేయండి
వడోదరా: భారీ మొండిబాకీల కారణంగా తదుపరి రుణాలు మంజూరు చేయకుండా ప్రభుత్వ రంగ దేనా బ్యాంకుపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ అభ్యర్థించింది. ఆంక్షల మూలంగా బ్యాంకు ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మొండిబాకీలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో దేనా బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోకి చేర్చడం తెలిసిందే. దీనివల్ల కొత్తగా రుణాలు మంజూరు చేయటం, ఉద్యోగ నియామకాలు చేపట్టడం వంటి అంశాల్లో బ్యాంకు పలు నియంత్రణలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల బ్యాంకు ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని జూన్ 10న ఉర్జిత్ పటేల్‌కు రాసిన లేఖలో ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాదారులు, ఉద్యోగులను ఇది అనవసర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. వ్యాపార పరిమాణం ప్రకారం భారీ బ్యాంకు కాకపోయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిలో దేనా బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందని వెంకటాచలం వివరించారు. 2018 మార్చి 31 నాటికి దేనా బ్యాంకులో స్థూల మొండిబాకీలు 16.27% నుంచి 22.4 శాతానికి ఎగిశాయి. విలువపరంగా చూస్తే రూ. 12,619 కోట్ల నుంచి రూ.16,361 కోట్లకు చేరాయి. నికర ఎన్పీఏలు 10.66% (రూ.7,735 కోట్లు) నుంచి 11.95 శాతానికి (రూ.7,839 కోట్లు) చేరాయి. దేనా బ్యాంక్‌తో పాటు అలహాబాద్ బ్యాంక్, ఐడీబీఐ, యూకో తదితర బ్యాంకులు కూడా పీసీఏ పరిధిలోనే ఉన్నాయి. ఎన్సీఎల్టీ ముందుకు 65 మొండిపద్దులు: అలహాబాద్ బ్యాంక్ కోల్‌కతా: గత ఆర్థిక సంవత్సరం(2017–18) సుమారు రూ.12,566 కోట్ల మొండిబాకీలకు సంబంధించిన 65 ఖాతాదారులపై దివాలా చట్టం కింద చర్యల కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించినట్లు ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ వెల్లడించింది. -
ఇక 'వడ్డిం'పు షూరూ..!
వడ్డీరేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మరోసారి అందరి అంచనాలను తలకిందులు చేసింది. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత అనూహ్యంగా కీలక పాలసీ రేట్లను పెంచింది. అంతర్జాతీయంగా అంతకంతకూ పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావంతో దేశీయంగా ద్రవ్యోల్బణం ఎగబాకే ప్రమాదం పొంచి ఉండటమే వడ్డీరేట్ల పెంపునకు ప్రధాన కారణంగా పేర్కొంది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు కూడా పెరగనున్నాయి. ఖాతాదారులు చెల్లించే నెల వాయిదాలు (ఈఎంఐ) భారం కానున్నాయి. కాగా, మోదీ సర్కారు హయాంలో ఇది ఆర్బీఐ మొట్టమొదటి రేట్ల పెంపు కావడం విశేషం. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేస్తాం... రిటైల్ ద్రవ్యోల్బణాన్ని మధ్యకాలికంగా 4 శాతానికి (రెండు శాతం అటు ఇటుగా) కట్టడి చేయాలన్నదే తమ లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. వృద్ధి ఊతమిస్తూనే ఈ లక్ష్యానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. దీనికి అనుగుణంగానే ప్రస్తుతానికి తటస్థ పాలసీనే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ‘దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు కొద్ది నెలలుగా పుంజుకున్నాయి. ఉత్పాదకతకు సంబంధించిన తగ్గుముఖం ధోరణి దాదాపు ముగిసినట్లే. కార్పొరేట్ల పెట్టుబడుల్లో కూడా మెరుగైన రికవరీయే కనబడుతోంది. దివాలా చట్టంతో మొండిబకాయిలకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది. భౌగోళిక–రాజకీయ రిస్కులు, ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు, రక్షణాత్మక వాణిజ్య విధానాలు దేశీ ఆర్థిక వ్యవస్థ రికవరీకి అడ్డంకులు సృష్టించే ప్రమాదం పొంచి ఉంది’ అని ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కులపై ఆర్బీఐ అప్రమత్తత కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.7%కి(ఏడు క్వార్టర్ల గరిష్టం), పూర్తి ఏడాదికి 6.7%కి వృద్ధి చెందిన సంగతి తెలిసిందే. ఎగవేతదారులపై మరో అస్త్రం.. పీసీఆర్! రుణ ఎగవేతదారులను గుర్తించడం ప్రధాన లక్ష్యంగా ‘పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ (పీసీఆర్)’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. రుణ గ్రహీతల సమాచారం అంతా పీసీఆర్‌లో నమోదవుతుంది. వారి రుణ చరితను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ... అప్రమత్తం చేయడం రిజిస్ట్రీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. యశ్వంత్ ఎం దేవస్థాలి నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులకు అనుగుణంగా పీసీఆర్‌ను ఏర్పాటుచేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. రిజిస్ట్రీ విధివిధానాలు, పనితీరు వంటివి ఖరారుకు తొలిదశలో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఐటీఎఫ్) ఏర్పాటవుతుంది. ప్రస్తుతం దేశంలో పలు క్రెడిట్ సమాచార విభాగాలున్నా.. కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలు, లక్ష్యాల మేరకే ఇవి పనిచేస్తున్నాయి. చిన్న బ్యాంకులుగా సహకార బ్యాంకులు! సహకార బ్యాంకులకు త్వరలో చిన్న తరహా బ్యాంకుల హోదా(స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్) లభించే అవకాశాలు ఉన్నాయి. చిన్న బ్యాంకులుగా పట్టణ సహకార బ్యాంకుల(యూసీబీ) మార్పిడికి సంబంధించి ఆర్బీఐ త్వరలో ఒక పథకాన్ని ఆవిష్కరిస్తుందని డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ సూచించారు. దీనికి సంబంధించి కొన్ని వర్గాల నుంచి ఆర్బీఐకి విజ్ఞప్తులు వస్తున్నట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడానికి, ఇందులో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఆర్బీఐ ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయం సేకరణకుగాను సెప్టెంబర్ 30న ఆర్బీఐ ఒక విధాన పత్రాన్ని విడుదల చేస్తుందని డిప్యూటీ గవర్నర్ తెలిపారు. ఆర్థిక వృద్ధికి విఘాతం: పరిశ్రమ వర్గాలు ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంపై పారిశ్రామిక రంగం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలకు గండిపడుతుందని పేర్కొన్నారు. ‘సరఫరాపరమైన అడ్డంకులే ప్రస్తుత ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణం. రేట్ల పెంపుతో వృద్ధికి విఘాతం కలుగుతుంది. రానున్న కాలంలో వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ మళ్లీ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని భావిస్తున్నాం’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ‘పరిశ్రమతోపాటు చాలా మందికి ఆర్బీఐ కఠిన వైఖరి రుచించకపోవచ్చు. అయినా, స్వల్పకాలానికి ఆర్బీఐ వడ్డీరేట్లలో పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ చెప్పారు. ‘ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వడ్డీరేట్ల ధోరణి, క్రూడ్ ధరల జోరు, అధిక ద్రవ్యోల్బణం వల్లే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. రియల్టీ రంగంపై (ఇళ్ల కొనుగోళ్లు) ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. దీర్ఘకాలంలో రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది’ అని నరెడ్కో జాతీయ అధ్యక్షుడు నిరంజన్ హిరనందాని వ్యాఖ్యానించారు. ముఖ్యాంశాలు ఇవీ... ►బ్యాంక్ రేటు 6.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 4 శాతంగా కొనసాగుతాయి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు 6.5 శాతంగా ఉంటుంది. ►కార్పొరేట్ పెట్టుబడుల్లో రికవరీ మెరుగ్గానే ఉంది. దివాలా చట్టంతో మొండిబకాయిల పరిష్కారానికి తోడ్పాటు. ►ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పిత్తి(జీడీపీ) వృద్ధి రేటు గతంలో అంచనా వేసిన విధంగానే 7.4 శాతంగా ఉంటుంది. ►అంతర్జాతీయంగా పొంచిఉన్న రాజకీయ–భౌగోళికపరమైన రిస్కులు, ఫైనాన్షియల్ మార్కెట్లలో కుదుపులు, అమెరికాతో సహా పలు దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ►తదుపరి పాలసీ సమీక్ష నిర్ణయం ఆగస్టు 1న వెలువడుతుంది. సరైన దిశలో చర్యలు.. అందుబాటు గృహాలకిచ్చే రుణాలకు పరిమితులను పెంచడం, ఎంఎస్ఎంఈ సంస్థలు సంఘటిత రంగంలో భాగమయ్యేలా ప్రోత్సహించే చర్యలు సరైన దిశలో తీసుకున్నవే. ఎస్డీఎల్ వేల్యుయేషన్ నిబంధనల్లో మార్పులు.. దీర్ఘకాలికంగా సానుకూలమైనవి. ఎఫ్ఏఎల్ఎల్సీ నిష్పత్తిని పెంచడం వల్ల బ్యాంకులకు మరింత లిక్విడిటీ లభిస్తుంది. – రజనీష్ కుమార్, చైర్మన్, ఎస్బీఐ ఆర్థిక స్థిరత్వానికి తోడ్పాటు ఆర్బీఐ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలు.. ద్రవ్యోల్బణ అంచనాలు స్థిరంగా ఉండేలా చూసేందుకు తోడ్పడతాయి. ఇవి ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఉపయోగపడగలవు. – చందా కొచర్, ఎండీ, ఐసీఐసీఐ బ్యాంక్ ద్రవ్యోల్బణ కట్టడి.. రేట్ల పెంపు నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4%స్థాయిలో కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. పెరుగుతున్న ముడి చమురు రేట్లు వంటి అంశాలతో అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగానే రేట్ల పెంచి ఉంటారని భావిస్తున్నా. – రాణా కపూర్, ఎండీ, యస్ బ్యాంక్ -
నేడు ఆర్బీఐ కీలక నిర్ణయం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్ష కమిటీ (ఎంపీసీ) బుధవారం కీలక రెపో రేటు నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది. ముడిచమురు ధరల తీవ్రత ఒకవైపు, ద్రవ్యోల్బణం భయాలు మరోవైపు, 13వ తేదీన అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ రేటు నిర్ణయం అంశాలు ఆర్బీఐ నిర్ణయంలో ప్రధాన అంశాలు కానున్నాయి. రేటు పెంపు పావుశాతం ఉంటుందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఇలాంటి నిర్ణయం నాలుగున్నర సంవత్సరాల తర్వాత మొదటిదవుతుంది. 2014 జనవరిలో ఆర్బీఐ రెపో రేటును పెంచింది. దీనితో అప్పటి రేటు 8 శాతానికి పెరిగింది. తక్షణం రేటు పెంపునకు అవకాశం లేదని పేర్కొంటున్న ఆర్థికవేత్తలు, సంస్థలుసైతం ఆగస్టులో రేటు పెంపు పావుశాతం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ‘‘2018–19లో 50 బేసిస్ పాయింట్ల రేటు పెంపు ఉంటుందని భావిస్తున్నాం. ఆగస్టు, అక్టోబర్ నెలల్లో ఈ రేటు పెంపు అవకాశం ఉంది. జూన్ సమావేశాల్లో రేటు పెంపు అవకాశం లేదని భావిస్తున్నాం’’ అని దేశీయ బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. -
బ్యాంకింగ్ కుంభకోణాలపై వివరణ ఇవ్వండి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ కుంభకోణాలపై వివరణ ఇచ్చేందుకు మే 17న తమ ముందు హాజరు కావాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జీత్ పటేల్‌ను పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో సుమారు రూ.13 వేల కోట్ల స్కాంతోపాటు గత కొన్ని నెలలుగా పలు ఇతర బ్యాంకుల్లో కుంభకోణాలు వెలుగుచూడడం తెల్సిందే. దీంతో సీనియర్ కాంగ్రెస్ నేత మొయిలీ నేతృత్వంలోని ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్, బీజేపీ ఎంపీ నిశికాంత్‌తో సహా పలువురు సభ్యులు ఆర్బీఐ రుణాల ఎగవేతను నియంత్రించ లేకపోయిందని అభిప్రాయపడినట్టు తెలిసింది. బ్యాంకులకు సంబంధించిన పలు అంశాలపై 3 వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆర్థిక శాఖ అధికారులను కమిటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ గవర్నర్‌ను హాజరు కావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. -
రూ.500, రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేయండి..!
భువనేశ్వర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఒడిశాకు చెందిన ఒకవ్యక్తి రాసిన బహిరంగ లేఖ కలకలం రేపుతోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక పరిస్థితులు, పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ ఎకానమీ తదితర అంశాలను ప్రస్తావిస్తూ సంజయ్ కుమార్ పట్నాయక్ ఈ లేఖ రాశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన విమర్శలు గుప్పించారు.అవినీతిని అంతంచేయడానికి పెద్దనోట్లను రద్దు చేస్తే.. రద్దైన వెయ్యి రూపాయల నోట్ల కంటే రూ.2వేల నోట్ల వల్లే ఎక్కువ ప్రమాదం ఉందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సాహించాల్సిన అవసరం లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో , పెద్ద నగరాల్లోని ప్రజలకు వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగలరు. వారికి కరెన్సీ అవసరం. కానీ చిన్న పట్టణాల్లో లేదా గ్రామాలలోని నిరక్షరాస్యులైన ప్రజలకు కరెన్సీ మాత్రం అవసరమవుతుంది. దయచేసి రూ.500, రూ.2వేల నోట్ల ముద్రణను నిలిపివేయండి. రాబోయే రెండు సంవత్సరాల్లో పెద్ద కరెన్సీల ఉపసంహరణకు ప్లాన్ చేయమని కోరుతున్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. భారతదేశ పేద పౌరుల ఆర్థిక పరిస్థితుల గురించి మీకు తెలియదా? దేశంలో ప్రతి ఒక్కరూ మినిమం బ్యాలెన్స్ కొనసాగించేంత ధనికమైందా భారతదేశం? మినిమం బ్యాలెన్స్ నిర్ణయంపై నేను చాలా ఆశ్చర్యపోతున్నాను? దీనిపై విచారణ జరగాలని కోరుకుంటున్నాను. కనీసం జాతీయీకరించిన బ్యాంకుల్లోనైనా జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఉండాలని మీరు భావించడంలేదా? లాంటి ప్రశ్నలను సంజయ్ కుమార్ సంధించారు. పబ్లిక్ / కంపెనీలు / పరిశ్రమలకు ఇచ్చే రుణాలు చాలా అరుదుగా బ్యాంకులు రికవరీ చేస్తాయి. కానీ పేదల రుణాలను రాబట్టడంలో మాత్రం ఎందుకు ధైర్యం చేస్తాయని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. మోదీజీ మీరు మీ స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం, ఇతర పార్టీలపై ఆధిపత్యంకోసం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటే ఈ మెయిల్ మిమ్మల్ని లేదా బీజీపీకి బాధించదు కనుక లేఖను రద్దు చేయండి. ఇప్పటికీ దేశాన్ని మార్చడానికి చాలా అవకాశం ఉంది. నా లేఖను పరిగణనలోకి తీసుకుని స్పందిస్తారని ఎదురు చూస్తున్నాను. సంబంధిత చర్య తీసుకుంటారని భావిస్తున్నానంటూ ఆయన లేఖను ముగించారు. -
వృద్ధి గాడిలో పడుతుంది..!!
భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడిన సానుకూల పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. 2016 సెప్టెంబర్‌లో ఆర్ బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక వార్తా సంస్థకు ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో ఆర్థిక వృద్ధి తీరు, ద్రవ్యోల్బణం పరిస్థితులు, ద్రవ్య లభ్యత ధోరణులు సహా పలు ఆర్థిక అంశాలపై ఆయన మాట్లాడారు. గవర్నర్ ఏకపక్ష నిర్ణయం కాకుండా, ఆర్బీఐ కీలక రేట్ల నిర్ణయానికి ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీని (ఎంపీసీ) ఏర్పాటు చేసి కూడా ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు చూస్తే... రుణ పాలసీని పటిష్టం చేయటమే లక్ష్యంగా గవర్నర్ నేతృత్వంలో ఎంపీసీ ఏర్పాటైంది... ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలని ఈ కమిటీ నిర్దేశించుకుంది. కానీ ద్రవ్యోల్బణం ఇప్పటికే 4 శాతానికి దగ్గరవుతోంది కదా? ద్రవ్యోల్బణం భయాలున్న మాట విషయం నిజమే. అయితే వరుసగా మూడు త్రైమాసికాలు ద్రవ్యోల్బణం హద్దు దాటితే, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఎం దుకిలా జరుగుతోంది? తగ్గటానికి ఎలాంటి చర్యలు తీసుకోవా లి? అన్న అంశాలపై పరస్పర చర్చలు, అనంతరం కట్టడికి చర్యలు తీసుకోవాలి. అయితే నిర్దేశిత లక్ష్యం దాటకుండా ప్రభుత్వం, ఆర్బీఐ ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఆరుగురు సభ్యుల ఎంపీసీ క్రియాశీలకంగా పనిచేస్తోంది. మరి ఇప్పటికీ మీరు పాలసీ ప్రకటనకు ముందు ఆర్థిక మంత్రితో సమావేశం కావాల్సిన పనేంటి? నిజానికిదేమీ సంప్రదాయం కాదు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి కీలక సూక్ష్మ ఆర్థిక అంశాలపై పరస్పరం చర్చించుకుని, పటిష్ట బాటలో ఆయా అంశాలను నిలపడానికి ప్రభుత్వానికి, ఆర్బీఐకి ఒక చక్కటి అవకాశమది. పలు దేశాల్లో ఈ తరహా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణం కట్టు తప్పకూడదన్న లక్ష్యంతో ఆర్బీఐ ఆర్థిక వృద్ధిని విస్మరిస్తోందా? నిజానికి పాలసీకి ప్రాతిపదిక ప్రధానంగా వృద్ధి, ద్రవ్యోల్బణాలే. అయితే ఇక్కడ దేనికి ఎంత వెయిటేజ్ అన్నదానికి కచ్చితమైన కొలమానమేమీ లేదు. మనం ద్రవ్యోల్బ ణం లక్ష్యాన్ని నిర్దిష్టంగా 4 శాతంగా నిర్దేశించుకున్నాం. ఈ లక్ష్యం కట్టు తప్పకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. తద్వారా పటిష్ట వృద్ధి ఎలా సాధ్యమన్న అంశంపై ఆర్బీఐ ఉన్నతస్థాయి కమి టీ దృష్టి సారిస్తుంది. వృద్ధిని పూర్తిగా పక్కనపెట్టామనడం సరికాదు. వృద్ధి జరగాల్సిందే. అయితే ద్రవ్యోల్బణం లక్ష్యాలను త్యాగం చేసి కాదు. ఆయా అంశాలకు సంబంధించి పారదర్శకమైన, సమగ్ర గణాంకాలపై ఆధారపడాలన్నది ఆర్బీఐ అభిప్రాయం. ఈ దిశలోనూ సమగ్ర చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పడు భారత ఆర్థిక వ్యవస్థ పలు ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. నోట్ల ర ద్దు, జీఎస్టీ వల్ల వ్యవస్థాగత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి పాలసీ రూపకల్పనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అలాంటిదేమీ లేదు. ప్రతి అంశంపైనా సమతౌల్య భావన ఉంటుంది. అప్పటి గణాంకాల ప్రాతిపదికన నిర్ణయాలుంటాయి. జూన్ త్రైమాసికంలో వృద్ధి 5.7 శాతానికి పడిపోయింది. ఇక్కడ జీఎస్టీ అమలు ముందస్తు పరిస్థితిని మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఆయా అంశాల నేపథ్యంతో ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుంచి 6.7 శాతానికి ఆర్బీఐ తగ్గించింది. అయితే మా ఉద్దేశం ప్రకారం ఆర్థిక వృద్ధి పునరుత్తేజం పొందుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వృద్ధి రేటు 7 శాతం పైనే ఉంటుందని భావిస్తున్నాం. పలు ఆర్థిక సూచీలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎంపీసీ పనితీరు ఎలా ఉంది? ఎంపీసీ ప్రతిభావంతమైన వ్యవస్థ. మన ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు బయటివారు. అత్యున్నత స్థాయి విద్యావేత్తలు. ఆర్థిక పరిశోధనా నిపుణులుగా వారికి గౌరవముంది. కమిటీ పనితీరు ఎంతో బాగుందన్నది నా అభిప్రాయం. ఎంపీసీ కానీయండి లేదా జీఎస్టీ కౌన్సిల్ కానీయండి. ఆయా వ్యవస్థల ఏర్పాటు ఆర్థిక వృద్ధిలో కీలక అడుగులు. -
ఆర్బీఐ రూటు ఎటు..?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మంగళ, బుధవారాల్లో (3, 4 తేదీలు) నాలుగో ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నిర్వహించనుంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీపీ) ప్రధానంగా బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6 శాతం) తగ్గించే అంశంపై ఈ సమావేశంలో చర్చించనుంది. ప్రస్తుతం రెపో ఏడేళ్ల కనిష్ట స్థాయి. 10 నెలల తరువాత ఆగస్టులో పావుశాతం తగ్గించడంతో రెపో ఈ స్థాయికి తగ్గింది. రేటు కోత అంచనాలకు కారణం... ♦ డీమోనిటైజేషన్ ఎఫెక్ట్ ప్రధాన కారణంగా– స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూన్ (ఏప్రిల్–జూన్) త్రైమాసికంలో మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోయింది. ♦ పారిశ్రామిక వృద్ధి మందగమనం (జూలై పారిశ్రామిక ఉత్పత్తి– ఐఐపీ వృద్ధి రేటు కేవలం 1.2 శాతంగా నమోదయింది) కొనసాగుతోంది. ♦ జూలై నుంచీ అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లో క్లిష్టత కూడా వృద్ధి తగ్గుదలకు కారణం అవుతోందన్న నేపథ్యంలో– ఇందుకు సంబంధించి తక్కువ పన్ను శ్లాబుల్ని అమల్లోకి తీసుకువచ్చే విషయాన్నీ ఆలోచిస్తోంది. ♦ ప్రభుత్వానికి లభించే ఆదాయ–వ్యయాల మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు లక్ష్యం (ఈ ఏడాది 3.2 శాతం) సడలింపు వార్తలు వినిపిస్తున్నాయి. ♦ డాలర్ మారకంలో రూపాయి విలువ మళ్లీ ‘యూ’ టర్న్(క్షీణించడం) తీసుకుంటుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ♦ ఇటువంటి ఆర్థిక మందగమన పరిస్థితుల్లో– కేంద్రం ఉద్దీపణలు అవసరమన్న ప్రకటనలు వెలువడుతున్నాయి. ♦ ఈ నేపథ్యంలో వృద్ధికి రేటు కోత అవసరమని అటు ప్రభుత్వ వర్గాల నుంచీ ఇటు పారిశ్రామిక వర్గాల నుంచి విజ్ఞప్తులు వెలువడుతున్నాయి. అడ్డుపడేది ద్రవ్యోల్బణమే! అయితే పాలసీ యథాతథ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పలువురు బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం (ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ట స్థాయిలో 3.36 శాతం) పెరుగవచ్చన్న ఆందోళన ఇందుకు కారణంగా వారు చూపిస్తున్నారు. క్రూడ్ జోరు, ద్రవ్యలోటు సడలించవచ్చన్న ఊహాగానాలు, రూపాయి బలహీనత వంటి అంశాలు ఆర్బీఐ యథాతథ పరిస్థితి కొనసాగిస్తుందనడానికి కారణాలుగా వారు పేర్కొంటున్నారు. ‘అక్టోబర్ 4న ఆర్బీఐ కీలక రుణ రేటు విషయమై యథాతథ పరిస్థితి కొనసాగించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు దీనికి ప్రధాన కారణం’ అని ఎస్బీఐ, మోర్గాన్ స్టాన్లీ నివేదికలు పేర్కొంటున్నాయి. -
ప్రభుత్వ బ్యాంకులకు మరింత క్యాపిటల్ కావాలి
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత పెట్టుబడుల అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడ్డారు. శనివారం ముంబైలో నిర్వహించిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. బ్యాలెన్స్ షీట్ల భారాన్ని తగ్గించుకునేందుకు ఈ భారీ రీకాపిటలైజేషన్ అవసరమవుతుంది. నగదు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెద్ద మొత్తంలో రీకాపిటలైజేషన్ అవసరమవుతుందని ఆర్బీఐ గవర్నర్ పటేల్ చెప్పారు. అదనపు నిధులు కావాలన్నారు. మార్కెట్ నుంచి నిధులను సమీకరించడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ వాటాను తగ్గించడంతో పాటు పలు రంగాల్లో అదనపు క్యాపిటల్‌ను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇది అధిక నిష్పత్తిలో కొనసాగుతోందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్పీఏ నిష్పత్తి 9.6 శాతంగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని వివిధ బ్యాంకర్లు పారిశ్రామికవేత్తలు హాజరైన ఈ సమావేశంలో తెలిపారు. అలాగే బ్యాంకుల బ్యాడ్ లోన్ల సమస్య పరిష్కరించేందుకు హెయిర్ కట్ అవసరం పేర్కొన్నారు. -
జైట్లీతో ఆర్బీఐ గవర్నర్ భేటీ
వచ్చేవారం పాలసీ సమీక్ష నేపథ్యం న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ శుక్రవారం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. వచ్చే నెల 1, 2 తేదీల్లో ఆర్బీఐ ద్రవ్య, పరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో జరిగిన వీరి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. దేశ, అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై వీరిరువురి మధ్యా సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు కనిష్ట స్థాయిలకు తగ్గడం, పారిశ్రామిక ఉత్పత్తి భారీ పతనం వంటి అంశాల నేపథ్యంలో రెపో రేటును (ప్రస్తుతం 6.25 శాతం) తగ్గించాలని ఇటు పారిశ్రామిక ప్రతినిధులతో పాటు, ప్రభుత్వ వర్గాల నుంచి కూడా డిమాండ్ వస్తున్న సంగతి తెలిసిందే. -
‘కేంద్రం లెక్కల టీచర్ కోసం వెతుకుతోంది’
న్యూఢిల్లీ: గతేడాది కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్లను ఇంకా లెక్కిస్తూనే ఉన్నామన్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం మంచి లెక్కల టీచర్ కోసం వెతుకుతోందని..ఆసక్తి ఉన్నవారు వీలైనంత తొందరగా ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంవో) దరఖాస్తు చేసుకోవాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వేలాకోళం చేశారు. ‘పెద్ద నోట్లు రద్దయిన 8 నెలల తర్వాత ఆర్బీఐ నోట్ల లెక్కింపు యంత్రాలను కొనుగోలు చేస్తోంది. బహుశా ఇంతకుముందు లీజు అన్న పదాన్ని వారు వినలేదేమో’ అని మాజీ మంత్రి పి.చిదంబరం ట్వీట్ చేశారు. ముద్రా రుణాల ద్వారా 7.28 కోట్ల మంది యువత స్వయం ఉపాధి పొందారన్న అమిత్‌షా వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘7.28 కోట్ల మంది యువతకు స్వయం ఉపాధి’ పేరుతో దేశంలో సరికొత్త పౌరాణిక నాటకం మొదలైందని ఎద్దేవా చేశారు. ఆసక్తి కలిగిన కథారచయితలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. -
ఇంకా లెక్కిస్తున్నాం
► రద్దయిన నోట్లపై ఆర్బీఐ చీఫ్ ఉర్జిత్ పటేల్ ► పార్లమెంటరీ కమిటీ ముందు రెండోసారి హాజరు న్యూఢిల్లీ: రద్దయిన రూ. 500, రూ. 1,000 నోట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వెల్లడించారు. రద్దు తర్వాత ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ఆ నోట్లను ఇంకా లెక్కిస్తున్నామని, అందువల్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి ఎంత డబ్బు వచ్చిందో కచ్చితంగా చెప్పలేనని పేర్కొన్నారు. ‘ఆర్బీఐ ప్రత్యేక బృందం రోజుకు 24 గంటలూ ఆ నోట్లను లెక్కిస్తోంది. వారికి శనివారంతోపాటు చాలా సెలవులను తగ్గించాం. ఆదివారం మాత్రమే సెలవు లభిస్తోంది’ అని ఆయన బుధవారం ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్బీఐకి ప్రస్తుతం 15,000 మంది సిబ్బంది ఉన్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రద్దయిన నోట్లను లెక్కించడానికి కొత్త కౌంటింగ్ యంత్రాల కోసం టెండర్లు జారీచేసినట్లు ఉర్జిత్ పార్లమెంటరీ కమిటీకి చెప్పారు. ఆయన ఈ కమిటీ ముందు హాజరు కావడం ఇది రెండోసారి. మూడు గంటలు కొనసాగిన ఈ సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్. ముంద్రా కూడా పాల్గొన్నారు. రద్దయిన నోట్లలో ఎంత మొత్తం తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందని ఉర్జిత్‌ను నరేశ్ అగర్వాల్(సమాజ్‌వాదీ), సౌగతా రాయ్(తృణమూల్ కాంగ్రెస్) ప్రశ్నించారు. రద్దు కాకముందు దేశంలో మొత్తం రూ. 17.7 లక్షల కోట్ల డబ్బు చలా మణిలో ఉండేదని, ప్రస్తుతం రూ. 15.4 లక్షల కోట్లు ఉందని ఉర్జిత్ తెలిపారు. రద్దు తర్వాత తిరిగి చలామణిలోకి వచ్చిన డబ్బు పై ఆర్బీఐ చీఫ్ కచ్చితమైన సమాధానం చెప్పకపోవడంతో కమిటీలోని పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నలు అడగని మన్మోహన్ జనవరి నాటి కమిటీ సమావేశంలో ఉర్జిత్‌ను కఠిన ప్రశ్నలను అడిగిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తాజా సమావేశంలో ఆయనను ఎలాంటి ప్రశ్నలూ అడగలేదు. ఆర్బీఐ గవర్నర్‌ను కొందరు సభ్యులు ప్రశ్నలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేయగా, కమిటీ చైర్మన్ వీరప్ప మొయిలీతోపాటు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ అంశంపై ఉర్జిత్‌ను మళ్లీ కమిటీ ముందుకు పిలవబోమని స్పష్టం చేశారు. -
నోట్ల లెక్క ఇంకా తేలలేదు
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ముగిసి ఆరు నెలలకు పైగా కావొస్తున్నా ఇంకా ఆ నోట్ల లెక్క తేలలేదు. డీమానిటైజేషన్ తర్వాత పాత నోట్లు ఎన్ని డిపాజిట్ అయ్యాయో ఇంకా లెక్కిస్తూనే ఉన్నామని రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేడు పార్లమెంట్ ప్యానెల్‌కు తెలిపారు. స్పెషల్ టీమ్ ఈ నోట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతుందని, వారంలో ఆరు రోజులు పనిచేస్తూ కేవలం ఆదివారం మాత్రమే సెలవు తీసుకుంటున్నట్టు పటేల్ చెప్పారు. నోట్ల రద్దు చేపట్టినప్పటి నుంచీ ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎన్ని రద్దైన నోట్లు మళ్లీ సిస్టమ్‌లోకి వచ్చాయని సమాజ్‌వాదీ పార్టీ నేత నరేశ్ అగర్వాల్, తృణమూల్ ఎంపీ సాగాటో రాయ్‌లు ఆర్బీఐ గవర్నర్‌ను ప్రశ్నించగా... గతేడాది నవంబర్‌న రూ.17.7 లక్షల కోట్లు చలామణిలో ఉంటే, ప్రస్తుతం రూ.15.4 లక్షల కోట్లు చలామణిలో ఉన్నట్టు పటేల్ తెలిపారు. గతేడాది నవంబర్ 8 ప్రధాని హఠాత్తుగా పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రద్దు చేసిన అనంతరం పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి డిసెంబర్ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. అప్పటిలోగా దేశంలో ఉన్న పాత కరెన్సీ నోట్లన్నంటిన్నీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వాటిని కొత్త కరెన్సీలోకి మార్చుకోవాలని ఆదేశించింది. రద్దయిన నోట్లు ఇంకా నేపాల్ దేశం నుంచి, కోపరేటివ్ బ్యాంకుల నుంచి వస్తున్నాయని పటేల్ చెప్పారు. అంతేకాక పోస్టు ఆఫీసులు ఇంకా పాత నోట్లను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉందన్నారు. నోట్ల రద్దు విషయంలో పటేల్ రెండోసారి పార్లమెంట్ ప్యానల్ ముందు హాజరయ్యారు. ప్యానల్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు లెక్కలు పార్లమెంటులో ప్రవేశపెడతామని పటేల్ చెప్పినట్టు తెలిసింది. పార్లమెంట్ ప్యానల్‌కు అధినేతగా కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ ఉన్నారు. అంతకముందు రెండుసార్లు పటేల్‌కు ప్యానల్ సమన్లు జారీచేయగా.. ఆ కాలంలో ఆర్బీఐకు అత్యంత కీలకమైన ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఉన్నందున పటేల్ మినహాయింపు కోరారు. ఈ కమిటీ టాప్ ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులకు కూడా పెద్ద నోట్ల విషయంలో సమన్లు జారీచేసింది. దీని ప్రభావాన్ని తమ ముందు వెల్లడించాలని ఆదేశించింది. -
జీఎస్టీతో పన్నుల ఊరట!
♦ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ♦ ఐటీ ఉద్యోగాలపై తీవ్ర నిరాశాధోరణి వద్దని హితవు ♦ స్టార్టప్‌లు ఆదుకుంటాయని భరోసా ముంబై: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వల్ల దీర్ఘకాలంలో పన్ను భారం తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. జూలై 1 నుంచి నాలుగు అంచల్లో అమల్లోకి రానున్న జీఎస్టీ వల్ల దేశవ్యాప్త ఒకే మార్కెట్ ఏర్పాటవడంతోపాటు, పన్ను పరమైన ప్రయోజనాలు దీర్ఘకాలంలో ఉంటాయన్నారు. కాగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)లో ఉపాధి అవకాశాల పట్ల తీవ్ర నిరాశావాదం పనికిరాదని పేర్కొన్న ఆయన, ఇక్కడ ఏమైనా సవాళ్లు ఎదురైతే, ఈ లోటును స్టార్టప్‌లు భర్తీ చేస్తాయన్న భరోసాను ఆయన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ లాబీ ఐఎంసీ చాంబర్ ఆఫ్ అండ్ ఇండస్ట్రీ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ♦ జీఎస్టీలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, పన్ను ప్రక్రియ, నిర్వహణ సంబంధించి పారదర్శకత దిశలో ఒక సంస్కరణ ఇది. ♦ దీనివల్ల పన్ను పరిధి విస్తరిస్తుంది. ♦ రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలో వస్తువుల సరఫరాల సమయంలో అసమగ్రతలను జీఎస్టీ తొలగిస్తుంది. ♦ ఫైనాన్షియల్ సేవల్లో సాంకేతిక అభివృద్ధి అంశాలు ఫైనాన్షియల్ సెక్టార్‌కు కష్టాలతో పాటు, నష్టాలనూ తెచ్చిపెడుతుంది. ఈ సమస్యలను ఎదుర్కొనడానికి విధాన నిర్ణేతలు, రెగ్యులేటర్లు, సూపర్వైజర్లు తగిన చర్యలను తీసుకోవాలి. ♦ 2008 ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో ప్రపంచం కోలుకోవాల్సి ఉన్నందున ప్రతి ఆర్థిక అంశం, నిర్ణయం పట్లా జాగరూకతగా వ్యవహరిస్తూ... ప్రయోజనాలు, ప్రతికూలాంశాల పట్ల ఎప్పటికప్పుడు పూర్తి మదింపును చేసుకోవాల్సి ఉంటుంది. ♦ కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నప్పటికీ, భారత్ ఫైనాన్షియల్ పరిశ్రమ 2013 నుంచీ భారీగా అభివృద్ధి చెందింది. అప్పటినుంచీ మూడు రెట్లు పెరిగి ఇప్పటికే 30 బిలియన్ డాలర్లకు చేరింది. ♦ డిజిటల్ బ్యాంకింగ్ ఏర్పాటు దిశలో ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటోంది. ♦ 2016–17లో 8.6 శాతం ఉన్న 160 బిలియన్ డాలర్ల ఐటీ వృద్ధి రేటు 2017–18లో 7.8 శాతానికి తగ్గిపోతుందన్న నాస్కామ్ గైడింగ్‌ను ఆయన ప్రస్తావిస్తూ... ఈ రంగంలో ఉద్యోగాలపై మరో ఆందోళన అక్కర్లేదని వివరించారు. ఒకవేళ అలా జరిగినా స్టార్టప్‌లు ఈ లోటును భర్తీ చేస్తాయని అన్నారు. నివేదికలు చెబుతున్న అంశాలు, పరిశ్రమలు పేర్కొంటున్న అంశాల మధ్య వ్యత్యాసం ఉంటుందని అన్నారు. ♦ మార్కెట్ ఎక్సే్ఛంజ్ రేటు వద్ద 2.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ప్రపంచ వేదికపై మన అభిప్రాయాల పట్ల పూర్తి విశ్వాసం ఉంటుందని, ఓపెన్ ట్రేడింగ్ వ్యవస్థ పట్ల మనం భారీగా ప్రయోజనం పొందవచ్చనీ ఆయన వివరించారు. ఎన్పీఏలపై కమిటీలో మరో ముగ్గురు... బ్యాంకింగ్ రంగంలో పేరుకుపోయిన మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్యను పరిష్కరించడంపై సూచనలు ఇవ్వడానికి ఉద్దేశించిన కమిటీ (ఓవర్‌సైట్)లో కొత్తగా మరో ముగ్గురిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియమించింది. దీనితో కమిటీ సభ్యుల సంఖ్య ఐదుకు పెరిగింది. మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఈ కమిటీకి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని ఆర్బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) ఆర్డినెన్స్, 2017 ప్రకారం తాజా నియామకాలు జరిగాయి. కుమార్‌తో పాటు ఎస్బీఐ మాజీ చైర్మన్ జానకీ వల్లభ్, కెనరాబ్యాంక్ మాజీ చైర్మన్ ఎంబీఎన్ రావు, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ మాజీ చైర్మన్ ఎండీ ఎం దేవస్థలి, సెబీ సభ్యుడు ఎస్ రామన్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అయితే సెబీలో బాధ్యతలు పూర్తయిన తర్వాత రామన్ 2017, సెప్టెంబర్ 7 నుంచీ కమిటీలో సభ్యునిగా చేరతారు. దేశంలో బ్యాంకింగ్ మొండి బకాయిలు దాదాపు రూ.8,00,000 కోట్లను దాటిన సంగతి తెలిసిందే. -
ధరలు తగ్గుతాయన్న అంచనాలతో ‘రేటు కోత’ సరికాదు
♦ ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయం ♦ జూన్ 6,7 నాటి మినిట్స్ విడుదల ముంబై: ధరలు రానున్న కాలంలో తగ్గిపోవడానికి అవకాశం ఉందన్న అంచనాల ప్రాతిపదికన రెపో రేటు కోత ఎంతమాత్రం సరికాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడుతున్నారు. జూన్ 6, 7 తేదీల్లో జరిగిన ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి ద్వైమాసిక సమీక్ష సందర్భంగా రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు. ప్రస్తుతం 6.25 శాతం)ను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ధరలు పెరిగే అవకాశాలను ఇందుకు కారణంగా చూపింది. వరుసగా ఎనిమిది నెలల నుంచీ ఇదే ధోరణిని అవలంబిస్తోంది. తాజాగా విడుదలైన ఈ నెల 6, 7 తేదీల సమావేశం మినిట్స్ ప్రకారం, ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశంలో, ఒకేఒక్క సభ్యుడు రవీంద్ర ధోలాకియా (ఐఐఎం–అహ్మదాబాద్ ఫేకల్టీ) మాత్రం రెపో రేటును అర శాతం అంటే 5.75 శాతానికి తగ్గించాలని సిఫారసు చేశారు. పలు అంశాలను పరిశీలిస్తే... భవిష్యత్తులో ధరల తగ్గుదలకే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పేలవ పారిశ్రామిక ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అయితే ధరలపై భవిష్యత్ అంచనాల ప్రాతిపదికన రేటు కోత ఎంతమాత్రం సమంజసం కాదని గవర్నర్ అభిప్రాయడ్డారు. మిగిలిన ఐదుగురు సభ్యులూ ఆయన నిర్ణయానికే ఓటేశారు. ఎంపీసీ ఏర్పడిన తర్వాత పాలసీ సమావేశంలో భిన్న అభిప్రాయాలు తలెత్తడం ఇదే తొలిసారి. -
పంట పండినా..ఫలం లేదు!
దేశంలో అన్నదాత ఆక్రోశం దేశమంతటా రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. మహారాష్ట్రలో రైతులు రోడ్లకు పాలాభిషేకం చేస్తున్నారు. వీధుల్లో కూరగాయలు పారబోస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారి ఆరుగురు అన్నదాతలను బలితీసుకుంది. గత నెల లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రైతులు మిర్చిని తగులబెట్టి ఆందోళనకు దిగారు. ఉత్తరప్రదేశ్ రైతులూ మండిపడుతున్నారు. గుజరాత్ రైతాంగం వేడెక్కుతోంది. పంజాబ్, హరియాణాల్లోనూ రైతుల నిరసన రాజుకుంటోంది. ఇవన్నీ విడివిడిగా చూస్తే రాష్ట్రాల్లో స్థానిక సమస్యలపై ఆందోళనలుగా కనిపిస్తున్నా.. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం ఒకే రకమైనది. దేశ జనాభాలో సగం మంది పంట పొలాల్లో పనిచేస్తారు. కానీ.. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా కేవలం 15 శాతమే. మరో రకంగా చెబితే.. సగం జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం ఉత్పాదకతలో మాత్రం ఆరో వంతు కూడా లేదు. అంటే అన్నదాతల ఆదాయం ఎంత తక్కువగా ఉంటుందనేది అర్థమవుతోంది. అయినా రైతన్న ఆరుగాలం శ్రమించి సాగుబడి చేస్తూనే ఉన్నాడు. చివరికి పంట చేతికొచ్చేసరికి మార్కెట్లు మాయచేసి ముంచేస్తున్నాయి. దీంతో అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యల బాట పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మార్పులేదు. వ్యవసాయ కమిషన్ల సిఫారసులున్నా ప్రయోజనం లేదు. ఈ పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా రైతులు వీధుల్లోకి వచ్చి ఉద్యమిస్తున్నారు. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని, పెట్టుబడి రాయితీలు పెంచాలని, సాగుకు నీటి సౌకర్యం కల్పించాలనేవి వారి ప్రధాన డిమాండ్లు. తమిళనాడు నుంచి పంజాబ్ వరకూ అన్ని రాష్ట్రాల్లోనూ రైతన్న పోరుబాట పట్టడానికి దారితీస్తున్న పరిస్థితులివీ... పెరిగిన దిగుబడులు.. పడిపోయిన ధరలు దేశంలో వ్యవసాయ రంగం దశాబ్దాలుగా కరువు బారిన పడింది. రైతుల కమతాల పరిమాణాలు కుంచించుకుపోవడం, భూగర్భజలాలు అడుగంటుతుండటం, ఉత్పాదకత తగ్గిపోతుండటం, ఆధునీకరణ లోపించడం వంటి కారణాలూ దీనికి తోడవుతున్నాయి. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో రైతుల ఆందోళనకు కారణం.. అధిక దిగుబడులతో ధరలు పడిపోవడమేనని నిపుణులు చెప్తున్నారు. వరుసగా రెండేళ్ల పాటు కరవు పరిస్థితులతో వ్యవసాయ రంగం కుదేలు కాగా.. 2016లో రుతుపవనాలు అనుకూలించడంతో పంటలు సమృద్ధిగా పండాయి. 2014–15లో 0.2 శాతానికి కుదించుకుపోయిన సాగురంగం వృద్ధి రేటు 2015–16లో 1.2 శాతాన్ని దాటింది. 2016–17లో అది 4.1 శాతానికి పెరిగింది. ముఖ్యంగా పప్పు దినుసులు పండించే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో మార్కెట్లకు ఆయా ఉత్పత్తులు వెల్లువెత్తాయి. కందిపప్పు దిగుబడి భారీగా పెరిగింది. అయితే.. అదే సమయంలో మయన్మార్, టాంజానియా, మొజాంబిక్, మలావీ నుంచి పప్పుల దిగుమతులు పెరగడంతో భారతీయ పప్పు రేటు ఒక్కసారిగా పడిపోయింది. 2015 డిసెంబర్లో క్వింటాలు ధర రూ.11,000గా ఉన్న కందిపప్పు ధర.. ఇప్పుడు రూ.4,000కు దిగజారింది. కనీస మద్దతు ధర రూ.5,050 కన్నా తక్కువ. అలాగే.. ఉల్లి, ద్రాక్ష, సోయాబీన్, మిర్చి తదితర పంటల ధరలు దారుణంగా పడిపోయాయని, ఈ విషయంలో ప్రభుత్వాలు సక్రమంగా స్పందించలేదని పరిశీలకులు చెబుతున్నారు. దెబ్బతీసిన నోట్ల రద్దు పంటల ధరలు పడిపోవడానికి ఒక ప్రధాన కారణం.. పెద్ద నోట్ల రద్దేనని కొందరు వాదిస్తున్నారు. అయితే సాగు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడే రైతులను నోట్ల రద్దు పెద్దగా ఇబ్బంది పెట్టలేదని.. దీంతో సాధారణం కన్నా ఎక్కువ భూమిని సాగు చేశారని వ్యవసాయ రంగ నిపుణులు వివరిస్తున్నారు. దీనికి వర్షాలు కూడా అనుకూలించడంతో దిగుబడులు బాగా వచ్చాయని.. కానీ అదనపు దిగుబడులను కొనుగోలు చేయడానికి వ్యాపారుల వద్ద తగినంత డబ్బు నిల్వలు లేకపోవడం సమస్యగా మారిందని చెప్తున్నారు. దీనివల్ల పంటల ధరలు పడిపోయాయనేది వారి వాదన. దాచుకోవాలంటే గిడ్డంగుల కొరత పంట దిగుబడులు పెరిగినపుడు నిల్వ చేసుకునేందుకు అవసరమైన గోదాములు, శీతల గిడ్డంగులు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఆహార శుద్ధి వ్యవస్థలు విస్తరించకపోవడం తరచుగా పంటల ధరలు పడిపోవడానికి కారణమవుతోందని.. ఇప్పుడు కూడా అదే జరిగిందని మరికొందరు చెప్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయల్లో ఐదు శాతం కన్నా తక్కువే శుద్ధి చేసి వినియోగ వస్తువులుగా మారుస్తున్నారు. ముఖ్యంగా ఉల్లి, కూరగాయలు, పండ్లు వంటి ఉత్పత్తులను నిల్వ చేసే సామర్థ్యం పెరగపోవడం, సరఫరా వ్యవస్థ లోపాలు పెద్ద సమస్యగా ఉన్నాయని.. రైతుకు, వ్యాపారికి, వినియోగదారుడికి సంతృప్తికరమైన ధరలో ఆయా ఉత్పత్తులు ఉండేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని వారు విమర్శిస్తున్నారు. పంటల ఎంపికపై అవగాహన కొరత సాగు చేసే పంటలను రైతులు ముందస్తు అంచనాలతో ఎంచుకునే విధివిధానాలపై అవగాహన పెంపొందించడానికి ప్రభుత్వాల నుంచి సరైన కృషి జరగడం లేదన్న విమర్శలున్నాయి. సాధారణంగా గత ఏడాది ఏ పంటకు మంచి ధర ఉందనేది చూసుకుని రైతులు ఈ ఏడాది అవే పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. ఇది అధిక ఉత్పత్తికి దారితీసి ధరలు పడిపోవడానికి కారణమవుతుందని.. లేదంటే ప్రకృతి అనుకూలించకపోతే నష్టపోవడం జరుగుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. పంట ఖర్చులు, రైతు కష్టానికి అనుగుణంగా ఆయా ఉత్పత్తుల ధరలను తక్షణమే సవరిస్తూ వారిని కష్టాల బారినుంచి తప్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో యూపీ బీజేపీ ప్రభుత్వం తక్షణమే మేల్కొని బంగాళాదుంపల మార్కెట్ ధరను పెంచడమే కాకుండా రైతు రుణాల మాఫీని కూడా ప్రకటించిందని.. తద్వారా రైతుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని చల్లార్చగలిగిందని పరిశీలకులు చెప్తున్నారు. కానీ మధ్యప్రదేశ్‌లో అదే బీజేపీ ప్రభుత్వం.. ఉల్లి ధరలు, కొనుగోళ్ల విషయంలో సరైన సమయంలో స్పందించడంలో విఫలమైందని అంటున్నారు. సాగునీటి సౌకర్యాల లేమి దేశంలో సాగు చేసే పంట భూముల్లో 52 శాతం భూములు ఇప్పటికీ వర్షాల పైనే ఆధారపడి ఉన్నాయి. అంటే.. సగం వ్యవసాయం వర్షాధారమే. ఇది రైతుల జీవితాలను తీవ్ర అనిశ్చితిలో పడేస్తోంది. మరోవైపు వాతావరణ మార్పు పర్యవసానంగా భూగర్భ జలాలూ తగ్గిపోతున్నాయి. పైగా.. దేశంలో 80 శాతం మంది రైతులు నీరు అధికంగా అవసరమయ్యే గోధుమ, వరి వంటి పంటలే పండిస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు వేగంగా పడిపోతూ తర్వాతి పంటలకు అనుకూలించడం లేదు. గడచిన ఆరు దశాబ్దాల్లో సాగునీటి రంగం మీద 3.5 లక్షల కోట్లు వ్యయం చేసినా ఇంకా సగం భూములకు కూడా నీటి సదుపాయం లభించడం లేదు. అవినీతి.. మార్కెట్ మోసాలు ప్రభుత్వ యంత్రాంగంలో పేరుకుపోయిన అవినీతి, అలసత్వం.. ప్రభుత్వ విధివిధానాల జరిగే జాప్యం రైతాంగానికి మరో శాపంగా పరిణమించాయి. చాలా మంది చిన్న రైతులు తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి ఇష్టపడకపోవడానికి ఇదే కారణం. మద్దతు ధరకు కొనుగోలు చేసే ఈ కేంద్రాల్లో విక్రయిస్తే.. ఆ సొమ్ములు చేతికి రావడానికి నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. దీంతో కాస్త తక్కువ ధరకైనా సరే ప్రైవేటు వ్యాపారులకు అమ్మేస్తున్నారు. దేశవ్యాప్తమవుతున్న మాఫీ డిమాండ్... అధికార పీఠాన్ని అందుకోవడానికి ‘రుణ మాఫీ’ చేస్తామని ఎన్నికల హామీ ఇవ్వడం... ఆపై ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయలేక రాష్ట్రంపై అప్పుల భారం పెరగడం ఇప్పుడు ప్రతిచోటా జరుగుతోంది. 2008లో మన్మోహన్సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం రూ.65,000 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. ఇది 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసొచ్చి మరోసారి అధికారం చేపట్టింది. ఇక అప్పటినుంచి జాతీయ, ప్రాంతీయ పార్టీలు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టి లో పెట్టుకోకుండా అధికారమే పరమావధిగా ‘రుణమాఫీ’ హామీ ఇస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ రుణమాఫీ హామీనిచ్చి... నాలుగు విడతల్లో 17,000 కోట్లను మాఫీ చేసింది. ఏపీలో చంద్రబాబు ఇదే హామీనిచ్చి... మాయ చేసి ‘మమ’ అనిపించారు. 2016లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఐదు ఎకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ. 5,780 కోట్ల రుణాలను మాఫీ చేశారు. తర్వాత కోర్టు ఆదేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మిగతా రైతులకు మరో 1,980 కోట్లు మాఫీ చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో యూపీ సీఎంగా అధికారం చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ దాస్ ఎన్నికల హామీ మేరకు రూ. 36,359 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్న ట్లు ప్రకటించారు. దీని ప్రభావం ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లపై పడింది. క్రమేపీ దేశం లోని మరిన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ డిమాండ్ తెరపైకి వస్తోం ది. పంజాబ్‌లో రుణమాఫీ హామీని మేనిఫెస్టోలో పెట్టిన కాం గ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడక్కడ రైతులు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని నిలదీస్తున్నారు. హరియాణా, రాజస్థాన్‌లోనూ రుణమాఫీ డిమాండ్లు బలంగా వినపడుతున్నాయి. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఇవీ... ► కేంద్రం 2004 నవంబర్‌లో ప్రొ. స్వామినాథన్ అధ్యక్షతన రైతులపై జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ 2006 అక్టోబర్ నాటికి ప్రభుత్వానికి ఐదు నివేదికలు సమర్పించింది. ఇప్పటికి పదేళ్లయినా అమలు చేసింది వీసమెత్తయినా లేదన్న విమర్శలున్నాయి. కమిషన్ ఏం సూచించిందంటే... ► రైతులకు వ్యవసాయానికి అవసరమైన భూమి, నీరు, జీవవనరులు, రుణం, బీమా, విజ్ఞాన నిర్వహణ, మార్కెట్లు తదితర కనీస వనరుల అందుబాటుపై భరోసా ఉండాలి. వాటిపై రైతులకు హక్కులు, వారి నియంత్రణ ఉండాలి. వ్యవసాయాన్ని రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చాలి. తద్వారా కేంద్ర, రాష్ట్రలు రెండూ ఈ రంగంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించేందుకు వీలవుతుంది. ► 1991–92లో దేశ గ్రామీణ జనాభాలో 50 శాతం మంది పేదవర్గాల వద్ద కేవలం మూడు శాతం భూమి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సీలింగ్, మిగులు భూములను, బంజరు భూములను పంపిణీ చేయాలి. ప్రధాన వ్యవసాయ భూములను, అడవులను వ్యవసాయేతర అవసరాల కోసం కార్పొరేట్ రంగానికి బదిలీ చేయడం ఆపాలి. ►వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయాలి. భూగర్భ జల మట్టాలను పునరుద్ధరించాలి. ప్రైవేటు బావులు లక్ష్యంగా పది లక్షల బావుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలి. ►అధిక ఉత్పాదకత రేటు సాధించడం కోసం వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాలు.. ప్రత్యేకించి సాగునీటి సరఫరా, మురుగు పారుదల, భూమి అభివృద్ధి, నీటి పరిరక్షణ, పరిశోధన అభివృద్ధి, రహదారుల అనుసంధానం వంటి వాటిలో ప్రభుత్వ పెట్టుబడులను గణనీయంగా పెంచాలి. ►వ్యవస్థీకృత రుణ వ్యవస్థ అందుబాటును విస్తరించాలి. పంట రుణాల వడ్డీ రేట్లను 4 శాతానికి తగ్గించడం, రుణాల వసూళ్లపై మారటోరియం విధించడం, వ్యవసాయ విపత్తు నిధిని ఏర్పాటు చేయడం, మహిళా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించడం వంటి చర్యలు తీసుకోవాలి. ► పోషకాహార మద్దతు పథకాలను పునర్వ్యవస్థీకరిస్తూ సార్వజనీన ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేయాలి. సూక్ష్మపోషకాల లోపం నిర్మూలన, మహిళా స్వయం సహాయక బృందాల నిర్వహణలో సామాజిక ఆహార, నీటి బ్యాంకుల ఏర్పాటు, చిన్న, సన్నకారు రైతులకు సాయం, జాతీయ ఆహార భద్రత చట్టం రూపకల్పన తదితర చర్యలు తీసుకోవాలి. నిజాయితీగా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే సంస్కృతికి ఇది విఘాతం కలిగిస్తుంది. రుణ క్రమశిక్షణపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో రుణాలు తీసుకునేవారు తిరిగి దాన్ని చెల్లించకుండా ఉండేలా ప్రోత్సహిస్తుంది. మాఫీ అనేది నైతికతను ప్రమాదంలో పడేస్తుంది. ఎన్నికల సమయంలో రుణమాఫీ జోలికి పార్టీలు వెళ్లకుండా... ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.. – ఉర్జిత్ పటేల్, ఆర్బీఐ గవర్నర్ – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నేడు ఆర్బీఐ కీలక పాలసీ నిర్ణయం
ప్రారంభమైన ఎంపీసీ సమావేశం ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయం బుధవారం వెలువడనుంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని రెండు రోజుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) భేటీ మంగళవారం ఆరంభమైంది. దేశ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఈ ద్వితీయ ద్వైమాసిక సమావేశం రెండు రోజుల పాటు చర్చిస్తుంది. బలహీనంగా పారిశ్రామిక వృద్ధి, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో కేవలం 6.1 శాతం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు నమోదయిన నేపథ్యంలో, వృద్ధికి ఊతం ఇవ్వడానికి రెపోను (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) మరింత తగ్గించాలని పారిశ్రామిక రంగం కోరుతోంది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణాన్ని కారణంగా చూపుతూ ప్రభుత్వం కూడా రెపోను తగ్గించాలనే భావిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ రేటును తగ్గించే అవకాశం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జూలై 1వ తేదీ నుంచీ అమలవుతుందని భావిస్తున్న జీఎస్టీ ప్రభావం ద్రవ్యో ల్బణంపై ఏమేరకు ఉంటుందన్న అంశాన్ని ఎంపీ సీ చర్చిస్తుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. -
రద్దు నాటికే తగినన్ని కొత్తనోట్లు
పార్లమెంటరీ సంఘం ఎదుట ఉర్జిత్ పటేల్ వివరణ రఘురామ్ రాజన్ టైమ్‌లోనే దీనిపై చర్చలు మొదలు రహస్యం కనుక ఏ రికార్డులూ నిర్వహించలేదని వెల్లడి న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ డీమోనిటైజేషన్ నిర్ణయం ప్రకటించే తేదీ నవంబర్ 8 నాటికే కొత్త రూ.500, రూ.2,000 నోట్ల నిల్వలు తగిన స్థాయిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ‘‘సిద్ధం’’ చేసుకున్నట్లు గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇటు ఆర్బీఐకానీ, అటు ప్రభుత్వంకానీ ఎటువంటి రికార్డులూ నిర్వహించలేదని చెప్పారాయన. అత్యంత రహస్యమైన అంశంగా దీనిని కొనసాగించాల్సి రావడమే దీనికి కారణమన్నారు. ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు ఆయన లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. డీమోనిటైజేషన్ ప్రకటన అనంతరం ప్రజల నగదు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలన్నింటినీ ఆర్బీఐ తీసుకుందని తెలిపారు. నగదుకు ప్రింటిగ్ సామర్థ్యం, అలాగే బ్యాంక్ నోట్ పేపర్, ఇంక్ సహా ఇతర అవసరాలకు సంబంధించిన అంశాలన్నింటిపై తరచూ ప్రభుత్వంతో ఆర్బీఐ అధికారులు సంప్రదింపులు జరుపుతుంటారని స్థాయీ సంఘానికి ఆయన తెలియజేశారు. పెద్ద నోట్ల రద్దు విషయంపై రఘురామ్ రాజన్ గవర్నర్‌గా ఉన్న సమయం– 2016 ప్రారంభం నుంచే చర్చలు ప్రారంభమయ్యాయని కూడా పటేల్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి చర్చల మినిట్స్ ఏవీ లేవని కూడా వివరణిచ్చారు. -
ముందే నోట్ల స్టాక్ ను రెడీగా పెట్టాం: ఉర్జిత్
న్యూఢిల్లీ : నోట్ల రద్దుపై ఇప్పటికీ చాలానే అంతు తోచని ప్రశ్నలు ప్రజల మదిలో ఉన్నాయి. అంత సీక్రెసీగా నిర్ణయం ఎలా తీసుకున్నారు? కొత్త నోట్లను వెంటనే ఎలా విడుదల చేశారు? ఉర్జిత్ పటేల్ కు ముందున్న రిజర్వు బ్యాంకు గవర్నర్ రాజన్ ఈ ప్రక్రియకు ఆమోదం తెలిపారా? అనే ప్రశ్నలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. అయితే డీమానిటైజేషన్ కు ముందే అవసరమయ్యే కొత్త 500, 2000 నోట్లను తయారుచేసి రెడీగా పెట్టామని రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. డీమానిటైజేషన్ విషయాన్ని సీక్రెట్ గా ఉంచడానికి ఆర్బీఐకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలను రికార్డుల రూపంలో పొందుపరచలేదని ఉర్జిత్ పటేల్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రజల అసౌకర్యాలను తొలగించామని చెప్పారు. ప్రింటింగ్ సామర్థ్యాన్ని పెంచడం, ఇతర వనరులు బ్యాంకు నోట్ పేపర్, ఇంక్, లాజిస్టిక్స్ అవసరాలు వంటి వాటి విషయంలో ఎప్పడికప్పుడూ ప్రభుత్వంతో చర్చలు జరిపామని లిఖిత పూర్వకంగా తన సమాధాన్ని అందించారు. ఈ కీలక అంశాలన్నింటిన్నీ పరిగణలోకి తీసుకుని డీమానిటైజేషన్ కు కొన్ని నెలల ముందే కొత్త 2000, 500 నోట్ల ముద్రించే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించినప్పుడు తమ దగ్గర సహేతుకమైన కొత్త నోట్లు ప్రింట్ అయి, సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఉన్నప్పటి నుంచే అంటే 2016 ప్రారంభం నుంచే పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ గురించి సెంట్రల్ బ్యాంకు, ప్రభుత్వం మధ్య చర్చలు ప్రారంభమయ్యాయని పటేల్ తెలిపారు. అయితే డీమానిటైజేషన్ కు సంబంధించి రాజన్ కు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల మినిట్స్ రికార్డుల్లో లేవన్నారు. -
బ్యాంకుల విలీనం మంచిదే!
► బాగున్న బ్యాంకులు ఇంకా బలపడతాయి ► ఎన్పీఏల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ► అక్కర్లేని బ్రాంచీలను అమ్మేస్తే నిధులొస్తాయి ► అమెరికా వాణిజ్య రక్షణాత్మక విధానం సరికాదు ► ఆర్బీఐ గవర్నరు ఉర్జిత్ పటేల్ వ్యాఖ్యలు ► 2017–18లో వృద్ధి 7.4 శాతంగా అంచనా న్యూయార్క్: కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు మంచి జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. మంచి బ్యాలెన్స్ షీట్లున్న బ్యాంకుల్లోకి విలీనాలు జరిగితే మొండిబకాయిలు, దానివల్ల ఒత్తిడిలో ఉన్న రుణ సమస్యలను ఎదుర్కోవటం సులువవుతుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో పలు సానుకూల అంశాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందంటూ... అమెరికా రక్షణాత్మక విధానాలు సరికాదని స్పష్టంచేశారు. ఇక్కడి కొలంబియా యూనివర్సిటీలో కొటక్ ఫ్యామిలీ ప్రతిష్టాత్మక ఉపన్యాసమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ... ♦ ఇన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు అవసరం లేదని చాలామంది చెబుతున్నారు. అవి కొద్ది బ్యాంకులుగా మారితే అదీ మంచి బ్యాలెన్స్ షీట్స్ ఉన్న బ్యాంకులుగా రూపాంతరం చెందితే అది బ్యాంకింగ్ వ్యవస్థకు మంచి ఫలితాలను అందిస్తుంది. ♦ విలీనాల వల్ల అవసరంలేని ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల్ని మూసివేయవచ్చు.అలాంటి బ్రాంచీలను మూసివేసినప్పుడు సంబంధిత రియల్టీ అమ్మకాల ద్వారా నిధులు సమకూరుతాయి. స్వచ్ఛంద పదవీ విరమణ పథకాల ద్వారా ఉద్యోగుల సంఖ్య సరిచేసుకోవచ్చు. టెక్నాలజీ మీద అవగాహన ఉన్న యువతకు బ్యాంకింగ్‌లో ఉపాధి దొరుకుతుంది కూడా. ♦ మొండిబకాయిల సమాచారం అంతా ఆర్బీఐ వద్ద ఉంది. ఎన్పీఏల సమస్య పరిష్కారానికి గత ఏడాది ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంది. బ్యాంకుల సమగ్ర రుణ నాణ్యతను సమీక్షించింది కూడా. ♦ దివాలా కోడ్‌కు అనుగుణంగా ఎన్పీఏల సమస్య పరిష్కార దిశలో తదుపరి అడుగులకు ఆర్బీఐ సిద్ధమవుతోంది. కష్టాల్లో ఉన్న బ్యాంకుల విషయంలో తగిన దిద్దుబాటు చర్యలూ ఉంటాయి. ♦ ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటు క్యాపిటల్‌ను స్వయంగా సమకూర్చుకోవాలి. ఆయా అవసరాలకు కేవలం ప్రభుత్వం మీదనే ఆధారపడ్డం సరికాదు. నిర్వహణా పరమైన నిర్ణయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను బ్యాంకులు పాటించాలి. ♦ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల విక్రయం మొత్తంమీద బ్యాంకింగ్ రంగానికి మంచిదే. మెరుగుపడిన మార్కెట్ విలువల నేపథ్యంలో డిజిన్వెస్ట్‌మెంట్ మరింత మేలు చేకూరుస్తుంది. మూలధన కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గడానికీ ఈ చర్య దోహదపడుతుంది. ♦ ఆర్థిక సంస్కరణల అమలు విషయంలో దేశంలో విస్తృతస్థాయి ఏకాభిప్రాయ సాధన ఏర్పడుతోంది. ఇది దేశాభివృద్ధికి దారితీస్తుంది. జీఎస్టీ, దివాలా కోడ్, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఎఫ్ఐపీబీ) రద్దు వంటి అంశాలు ఇన్వెస్టర్ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ♦ భారత్ ఆర్థిక అంశాలన్నీ పటిష్టంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది.కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో ఒక శాతంకన్నా తక్కువగానే ఉంది. బడ్జెట్‌కు అనుగుణంగా ద్రవ్యలోటును మూడు శాతంలోపే కట్టడిచేసే పరిస్థితి ఉంది. ♦ డీమోనిటైజేషన్ ఇబ్బందులు ఉన్నప్పటికీ, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యింది. డిజిన్వెస్ట్‌మెంట్ కాలాన్ని చూస్తే– కరెన్సీ కన్నా, క్రెడిట్ ముఖ్యం. రుణ సంబంధ ఇబ్బందులు ఎక్కడా తలెత్తలేదు. ♦ రూపాయి విలువ అనేది పూర్తిగా మార్కెట్ నిర్ణయించే అంశం. ఒడిదుడుకులను నివారించడానికే ఆర్బీఐ జోక్యం. మున్ముందూ ఇదే విధానం కొనసాగుతుంది. ఆర్బీఐ పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేస్తోంది. -
బ్యాంకులకు వడ్డీరేట్లు తగ్గించే వీలుంది..
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయం ముంబై: మరింతగా వడ్డీరేట్లు తగ్గించే అవకాశం బ్యాంకులకు ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. ఏప్రిల్ 6న ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)ని ఉద్దేశించి ఆయన ఈ అంశాన్ని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం)ను యథాతథంగా కొనసాగిస్తూ, నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2015 జనవరి నుంచీ ఆర్బీఐ రెపో రేటును 1.75 శాతం తగ్గిస్తే– బ్యాంకులు మాత్రం కస్టమర్లకు ఈ ప్రయోజనంలో 0.85 నుంచి 90 బేసిస్ పాయింట్లను మాత్రమే బదలాయించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 6 మినిట్స్ సమావేశాలను ఆర్బీఐ గురువారం విడుదల చేసింది. ద్రవ్యోల్బణం పరమైన అడ్డంకులు వ్యవస్థలో ఉన్నాయని పటేల్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమస్యపై కొంత జాగరూకత అవసరమన్నారు. దిగువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థ వృద్ధికి ఊతం ఇచ్చినా– ద్రవ్యోల్బణం సమస్యలను కొనితెచ్చే వీలుందని పటేల్ అన్నారు. అయితే రెండింటిమధ్యా సమతౌల్యత సాధించడంపై ఆర్బీఐ దృష్టి సారిస్తుందని అన్నారు. పీసీఏ పరిధిలోకి సగం ప్రభుత్వ బ్యాంకులు: ఫిచ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా సమీక్షించిన ‘సత్వర దిద్దుబాటు చర్యల’ (పీసీఏ) మార్గదర్శకాల పరిధిలోకి దాదాపు సగానికిపైగా ప్రభుత్వ రంగ బ్యాంకులు వస్తాయని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ గురువారం విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. మొండిబకాయిల సమస్య తీవ్రంగా ఉన్న బ్యాంకులకు సంబంధించి పీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్బీఐ కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణల నేపథ్యంలో ఫిచ్ ఈ అంశాలను ప్రస్తావించింది. అయితే ఈ చర్యల ద్వారా సమస్య పరిష్కారం కీలకమనీ, దీని ఆధారంగానే చర్యలు ఉంటాయని ఫిచ్ పేర్కొంది. కఠిన చర్యలకు అవకాశం! గతంలో ఫ్రేమ్‌వర్క్ ప్రకారం– పీసీఏ పరిధిలోకి వచ్చే బ్యాంకుకు కేవలం రుణాలు ఇవ్వవద్దన్న సూచనలను మాత్రమే ఆర్బీఐ చేయగలిగేది. అయితే ఇప్పుడు తాజా నిర్ణయాల ప్రకారం, చర్యల పరిధి మరింత విస్తృతమైంది. ఎటువంటి చర్యలను ఆర్బీఐ తీసుకుంటుదన్నదే ఇప్పుడు కీలకమని ఫిచ్ వ్యాఖ్యానించింది. -
ఎక్కడి రేట్లు అక్కడే..!
⇒ 6న ఆర్బీఐ పాలసీ సమీక్ష... ⇒ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ⇒ ద్రవ్యోల్బణం పెరుగుదల, అంతర్జాతీయ ప్రతికూలతలే కారణం ⇒ నిపుణుల అభిప్రాయం... న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఈసారి కూడా కీలక పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకుతుండటం... అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలే దీనికి కారణమని వారు పేర్కొంటున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమీక్ష ఈ నెల 6న(గురువారం) జరగనుంది. అమెరికాలో వడ్డీరేట్ల పెరుగుదల... ఆర్బీఐ ఇప్పుడప్పుడే పాలసీ రేట్లను తగ్గించే ఆస్కారం లేదనేందుకు తగిన సంకేతమని, అంతేకాకుండా దేశీ, విదేశీ అంశాల ఆధారంగా భవిష్యత్తులో రేట్లు పెంచినాపెంచొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎవరేమంటున్నారంటే... ‘రానున్న పాలసీలో ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేసే అవకాశం లేదని భావిస్తున్నా. తదుపరి నెలల్లో పరిస్థితులను బట్టి పావుశాతం తగ్గింపు/పెంపునకు వీలుంది’ అని కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. ‘2017 మార్చినాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతానికి పరిమితం కావాలన్నది ఆర్బీఐ లక్ష్యం. దీనికంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే, మధ్యకాలానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతంగా కొనసాగించడంపై పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో 6న జరిగే పాలసీ సమీక్షలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చు’ అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఎండీ నరేశ్ టక్కర్ పేర్కొన్నారు. కాగా, గత సమీక్షలో ఆశ్చర్యకరమైన రీతిలో ఆర్బీఐ సరళ విధానం నుంచి తటస్థానికి మారుతున్నట్లు ప్రకటించిందని.. రానున్న సమీక్షలో కూడా ఇదే విధానం ఉండొచ్చని సింగపూర్‌కు చెందిన బ్యాంకింగ్ దిగ్గజం డీబీఎస్ అభిప్రాయపడింది. ఒక్క కోతతో సరి... ఆర్బీఐ గవర్నర్‌గా గతేడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టి తర్వాత తొలిసారి అక్టోబర్‌లో జరిపిన సమీక్షలో ఉర్జిత్ పటేల్ రెపో రేటును పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ఎంపీసీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి భేటీ కూడా అదే. ఇక అప్పటి నుంచి కీలక రేట్లను యథాతథంగానే కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 8న చేపట్టిన సమీక్షలోనూ ఇదే వైఖరిని అవలంభించారు. ద్రవ్యోల్బణం ధోరణి, ఆర్థిక వృద్ధిపై పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) ప్రభావంపై మరింత స్పష్టత కోసం వేచిచూస్తున్నామని... దీనికి అనుగుణంగానే పాలసీ రేట్లలో మార్పులు ఉంటాయని గత సమీక్ష సందర్భంగా ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. అంతేకాకుండా సరళ పాలసీ నుంచి తటస్థ విధానానికి మారుతున్నట్లు ప్రకటించడం ద్వారా ఆర్బీఐ ఒకరకంగా షాకిచ్చింది కూడా. అంటే రేట్ల తగ్గింపు విధానానికి ఇక బ్రేక్ పడినట్లే లెక్క. టోకు ధరల(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు ఫిబ్రవరిలో 39 నెలల గరిష్టానికి(6.55 శాతం) ఎగబాకడం కలవరపరిచే అంశం. అదేవిధంగా రిటైల్ ద్రవ్యోల్బ ణం కూడా 3.65 శాతానికి పెరిగింది. ప్రధానంగా ఆహార, ఇంధన ధరల పెరుగుదల దీనికి కారణం. ద్రవ్యోల్బణం పెరుగుదలను చూస్తుంటే ఆర్బీఐ వడ్డీరేట్లను కదిలించే అవకాశల్లేవనేది విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం రేట్లు ఇలా... ప్రస్తుతం రెపో రేటు(ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) 6.25%గా కొనసాగుతోంది. ఇక రివర్స్ రెపో(బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై లభించే వడ్డీరేటు) 5.75% వద్ద, నగదు నిల్వల నిష్పతి(సీఆర్ఆర్–బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం–దీనిపై ఆర్బీఐ ఎలాంటి వడ్డీ చెల్లించదు) 4%గా ఉన్నాయి. గవర్నర్ జీతం రెట్టింపు... ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్ వేతనాలను ప్రభుత్వం దండిగానే పెంచింది. బేసిక్ సాలరీ నెలకు రెట్టింపునకుపైగా ఎగబాకింది. దీని ప్రకారం గవర్నర్ బేసిక్ సాలరీ రూ.2.5 లక్షలకు, డిప్యూటీ గవర్నర్లకు రూ.2.25 లక్షలకు చేరింది. ఈ పెంపును జనవరి 1, 2016 నుంచి వర్తింపజేయనున్నారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఒక దరఖాస్తునకు స్పందిస్తూ ఆర్బీఐ ఈ వివరాలను వెల్లడించింది. జీతం పెంపు సమాచారాన్ని తమకు ఫిబ్రవరి 21న ఆర్థిక శాఖ తెలియజేసిందని పేర్కొంది. పెంపునకు ముందు గవర్నర్ బేసిక్ పే(మూల వేతనం) రూ.90,000 కాగా, డిప్యూటీ గవర్నర్లకు రూ.80,000 ఉంది. ఆర్బీఐ వెబ్‌సైట్‌లోని తాజా సమాచారంమేరకు నవంబర్‌లో ఉర్జిత్ నెల జీతం(బేసిక్ పే, డీఏ, ఇతర చెల్లింపులు కలుపుకొని) రూ.2,09,500. ఇందులో డీఏ రూ.1,12,500 కాగా, ఇతర చెల్లింపులు రూ.7,000గా ఉన్నాయి. పెంచిన తర్వాత స్థూల వేతన వివరాలను ఆర్బీఐ వెల్లడించలేదు. అయితే, పాత డీఏ, ఇతర చెల్లింపులను లెక్కలోకి తీసుకుంటే ఆర్బీఐ గవర్నర్ ప్రస్తుత స్థూల వేతనం దాదాపు రూ.3.7 లక్షలకు చేరుతుంది. కాగా, ఈ స్థాయిలో పెంచినప్పటికీ.. దేశంలోని పలు ప్రైవేటు బ్యాంకుల చీఫ్‌లతో పోలిస్తే ఇంకా ఆర్బీఐ గవర్నర్ జీతం చాలా తక్కువే కావడం గమనార్హం. ఉదాహరణకు 2015–16 ఏడాదికి ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓ, ఎండీ ఆదిత్య పురి వేతన ప్యాకేజీ(స్టాక్ ఆప్షన్స్ కాకుండా) రూ.9.73 కోట్లుగా ఉంది. అంటే నెలకు దాదాపు రూ.81 లక్షలు. ఇక ఐసీఐసీఐ చీఫ్ చందా కొచర్ 2015–16 వార్షిక వేతన ప్యాకేజీ రూ.6.59 కోట్లు(నెలకు రూ.55 లక్షలు) కావడం విశేషం. -
ఉర్జిత్‌కు శాలరీ బొనాంజ.. భారీగా జీతం పెంపు!
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తోపాటు డిప్యూటీ గవర్నర్ల జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. వారి మూలవేతనాన్ని ఏకంగా 100శాతం పెంచింది. దీంతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ నెలకు రూ. 2.50 లక్షల జీతాన్ని అందుకోనుండగా.. డిప్యూటీ గవర్నర్లు రూ. 2.25 లక్షల జీతాన్ని పొందనున్నారు. ఈ పెంపు గడిచిన ఏడాది (2016) జనవరి 1 నుంచి అమలుకానుండటం గమనార్హం. ఇప్పటివరకు ఆర్బీఐ గవర్నర్‌కు రూ. 90వేల నెలవారీ జీతం అందుతుండగా, ఆయన డిప్యూటీలకు రూ. 80వేల జీతం అందుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వారి వేతనాల అంశాన్ని సమీక్షించి.. జీతాలలో ఈ మేరకు మార్పులు చేసింది. భారీస్థాయిలో ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్ జీతాలను కేంద్రం పెంచినప్పటికీ.. ఆర్బీఐ నియంత్రిస్తున్న పలు బ్యాంకుల్లోని టాప్ అధికారులతో జీతాలతో పోలిస్తే.. వారికి తక్కువ వేతనమే లభిస్తుండటం గమనార్హం. -
మరోసారి ఉర్జిత్ పటేల్‌కు నోటీసులు?
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు మరోసారి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 20 న కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా కోరింది. డీమానిటైజేషన్ కాలంలో(50 రోజులు) ఎన్ని పాత కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చాయి, రీమానిటైజేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది తదితర అంశాలపై కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ ప్యానెల్ ఉర్జిత్‌ను ప్రశ్నించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఆర్థికవ్యవహారాల కార్యదర్శి శక్తి కాంత్ దాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి అంజులే చిబ్ దుగ్గల్ ని కూడా కమిటీ ముందు హాజరు కావాలని కమిటీ కోరింది. జనవరి 18 న సమావేశమైన కమిటీ ఏప్రిల్ 20 న తిరిగి సమావేశమయ్యేందుకు నిర్ణయించింది. ఈమేరకు ఆర్బీఐకి, ఆర్థిక అధికారులకు నోటీసులు జారీ చేసింది. కమిటీ తన తుది నివేదికను రూపొందించే క్రమంలో ఓరల్ ఎవిడెన్స్ నిమిత్తం జరగనున్న చివరి సమావేశం కావచ్చని భావిస్తున్నారు. అలాగే ఏప్రిల్ 20 సమావేశానికి ఉర్జిత్ పటేల్ హాజరుకాని పక్షంలో మరో సమావేశం నిర్వహించాల్సి వస్తుందనే సూచన కూడా ఇచ్చనట్టు తెలుస్తోంది. 31మంది సభ్యుల స్టాండింగ్ కమిటీలో బీజేపీ నుంచి నిషికాంత్ దూబే, బిజెపి కిరిత్ సోమయ్య, నరేష్ అగర్వాల్(ఎస్పీ) దినేష్ త్రివేది(టీఎంసీ) సతీష్ చంద్ర మిశ్రా (బీఎస్పీ) తదితరులు ఉన్నారు. అయితే గత సమావేశంలో నగదు విత్‌డ్రాపై పరిమితి, ఎత్తివేతపై కాంగ్రెస్ ఎంపి దిగ్విజయ్ సింగ్ పలు ప్రశ్నలు సంధించిన సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఆదుకున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పద్దని పటేల్‌కు సలహా ఇచ్చారట.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నించి ఒత్తిడికి గురిచేసింది. మన్మోహన్ సింగ్ మధ్యలో కల్పించుకుని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవద్దని ఉర్జిత్‌కు సలహా ఇచ్చారని సమాచారం. నగదు పరిస్థితి ఎప్పుడు సాధారణ పరిస్థితికి వస్తుందనే దానిపై ఉర్జిత్ పటేల్ సమాధానం ఇవ్వలేదు. రూ.500, రూ.1000 పాత నోట్లను రద్దు చేసే విషయంలో ప్రభుత్వం నుంచి సలహాను నవంబర్ 7న అందుకున్నామని, మరునాటి దీనికిఆర్బీఐ సమ్మతించిందని లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించింది. దీనికి కొన్ని గంటల తరువాత ప్రధాని టీవీలో ఈ షాకింగ్ ప్రకటన చేసినట్టు వివరణ ఇచ్చింది. అలాగే 86 శాతం చలామణిలోఉన్న పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎంత నగదు బ్యాంకులకు జమ అయిందో స్పష్టంగా చెప్పలేకపోయారు. రద్దైన మొత్తం పెద్దనోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు కాగా, రూ.9.2లక్షల కోట్ల కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చంపేస్తా అని ఉర్జిత్ పటేల్‌కు బెదిరింపు
ముంబై: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఓ వ్యక్తి బెదిరింపు ఈ మెయిల్ పంపడం కలకలం రేపింది. ఆర్బీఐ గవర్నర్ విధుల నుంచి తప్పుకోకపోతే.. చంపేస్తానంటూ ఓ అగంతకుడు ఉర్జిత్ పటేల్‌కు మెయిల్ చేశాడు. ఈ బెదిరింపుల వ్యవహారంపై విచారణ చేపట్టిన ముంబై సైబర్ క్రైమ్ సెల్ పోలీసులు.. 34 ఏళ్ల వైభవ్ బదల్వార్ అనే వ్యక్తిని నాగ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఉర్జిత్ పటేల్‌తో పాటు అతడి కుటుంబసభ్యులను కూడా చంపేస్తానంటూ నిరుద్యోగి అయిన బదల్వార్ ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడిని ముంబైకి తరలించిన పోలీసులు.. ఐపీసీ 506(2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. -
4వ త్రైమాసికంలో వృద్ధి పుంజుకుంటుంది
⇒ వ్యవస్థలో నగదు లభ్యత పెరగడమే కారణం ⇒ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి నాల్గవ త్రైమాసికంలో (2016–17 జనవరి–మార్చి) వేగం పుంజుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఫిబ్రవరి 7,8 తేదీల్లో సమావేశమై రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు (రెపో)ను 6.25 శాతంగా కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇకమీదట మరింత రేటు పుంపు ఉండబోదనీ ఆర్బీఐ ఈ సందర్భంగా సంకేతాలు ఇచ్చింది. ఈ సమావేశం మినిట్స్ బుధవారం విడుదలయ్యాయి. ‘‘పెద్ద నోట్ల రద్దు వెన్వెంటనే వినియోగ డిమాండ్ తగ్గింది. అయితే ఇది తిరిగి పుంజుకుంటుందని భావిస్తున్నాం. వ్యవస్థలో నగదు లభ్యత పెరగడమే దీనికి ప్రధాన కారణం’’ అని పటేల్ ఈ సమావేశంలో అన్నారు. 2017–18 బడ్జెట్ తగిన విధంగా ఉందని, మౌలిక రంగం, హౌసింగ్‌కు బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రపంచ వృద్ధి 2016లోకన్నా 2017లో బాగుంటుందన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేశారు. -
ఆన్లైన్ వ్యయాల తగ్గింపుపై కసరత్తు
• మెరుగుపడిన నగదు లభ్యత • డీమోనిటైజేషన్‌తో వృద్ధిపై స్వల్పకాలిక ప్రభావం • దీర్ఘకాలంలో ఎకానమీకి ప్రయోజనకరమే • పీఏసీకి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వివరణ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు దరిమిలా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో ఆన్లైన్ చెల్లింపు లావాదేవీల వ్యయాలు తగ్గించే విధానంపై కసరత్తు చేస్తున్నట్లు పార్లమెంటరీ కమిటీకి రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నగదు లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వివరించింది. ద్రవ్యపరపతి విధాన సమీక్షపై మౌఖిక వివరణనిచ్చేందుకు శుక్రవారం పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ముందు హాజరైన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్.. కమిటీకి ఈ విషయాలు తెలిపారు. డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు తగ్గించే విధానం రూపకల్పనపై బ్యాంకులు, పేమెంట్ గేట్వేలు మొదలైన వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు పీఏసీకి ఆర్బీఐ వివరించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా నగదు సరఫరా మెరుగుపడిందని.. కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కాస్త సమస్యలు ఉన్నప్పటికీ.. రాబోయే కొద్ది వారాల్లో పరిస్థితి చక్కబడగలదని పటేల్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీమోనిటైజేషన్ ప్రభావం స్వల్పకాలికంగా వృద్ధిపై కొంత ప్రతికూల ప్రభావం చూపినా.. మధ్య, దీర్ఘకాలికంగా ఎకానమీకి ప్రయోజనం చేకూర్చగలదని ఆయన వివరించారు. మరిన్ని అంశాలు చర్చించేందుకు ఫిబ్రవరి 10న ఆర్థిక శాఖ అధికారులతో భేటీ కానున్నట్లు, అవసరమైతే పటేల్‌ను కూడా మరోసారి పిలిపించనున్నట్లు సమావేశం అనంతరం పీఏసీ చైర్మన్ కేవీ థామస్ చెప్పారు. దాదాపు 4 గంటల పాటు సాగిన సమావేశంలో పలు సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు ఒక్కసారిగా ఎగియడం గురించి ప్రశ్నించిన కమిటీ.. ఈ అంశంపై దృష్టి సారించాలని ఆర్బీఐకి సూచించింది. నోట్ల రద్దు అంశంపై గతేడాది జనవరి నుంచి ప్రభుత్వంతో చర్చలు జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. గవర్నర్ పటేల్, ఇద్దరు డిప్యూటీ గవర్నర్స్ (ఆర్ గాంధీ, ఎస్ ఎస్ ముంద్రా), అయిదుగురు ఆర్బీఐ డైరెక్టర్లు (నచికేత్ మోర్, భరత్ ఎన్ దోషి, సుధీర్ మన్కడ్, శక్తికాంత దాస్, అంజలీ చిబ్ దుగ్గల్) హాజరయ్యారు. -
మన్మోహన్ సింగ్.. మీకిది తగునా?
న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వెనుకేసుకురావడాన్ని కాంగ్రెస్ నేతలు ఆక్షేపిస్తున్నారు. మన్మోహన్ తీరును మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ తప్పుబట్టారు. ఆర్బీఐ గవర్నర్ ను మన్మోహన్ వెనకేసుకురావడం సరికాదని పేర్కొన్నారు. ఆర్బీఐని ప్రశ్నించే అధికారం పార్లమెంట్ కమిటీలకు ఉంటుందని చెప్పారు. ‘మన్మోహన్ సింగ్ అంటే నాకు గౌరవం ఉంది. కానీ ఆర్బీఐ గవర్నర్ ను ఆయన వెనకేసుకురావడం సమంజసం కాదు. ప్రశ్నించే హక్కు ఎంపీలకు ఉంది. చట్టసభ సభ్యులకు ప్రశ్నించే హక్కు లేదని అనుకుంటే.. అవతలివారి నుంచి అటువంటి సమాధానాలే వస్తాయి. ఆర్బీఐ లాంటి సంస్థలు ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిందే’నని సందీప్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. పాత పెద్ద నోట్ల రద్దుపై వివరణ ఇచ్చేందుకు బుధవారం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరైన ఉర్జిత్ పటేల్ కు మన్మోహన్ సింగ్ దన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇబ్బందికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయనను వెనకేసుకొచ్చారు. -
మితభాషి ఉర్జిత్
దేశ ప్రజలపై ఉత్పాతంలా వచ్చిపడిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పూర్వాపరా లేమిటో, దాని పర్యవసానాలేమిటో తెలుసుకుందామని ఎంతో ఆశతో ఎదురు చూసినవారికి బుధవారం జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం అసంతృప్తి కలిగించి ఉంటుంది. నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు గురించి ప్రకటించడం... మరికొన్ని గంటల్లో అమల్లోకి రావడం, ఆ మరుసటి రోజు నుంచి ఏటీఎంల ముందూ, బ్యాంకుల ముందూ పడిగాపులు పడటం మినహా సామాన్య పౌరులకు ఏం జరిగిందో, జరుగుతున్నదో అర్ధంకాలేదు. చాలా సందేహా లకు ఈనాటికీ జవాబులేదు. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సవాళ్లు విసురుకున్నారు. దేశ ప్రజలంతా ఈ నిర్ణయాన్ని వేనోళ్ల కీర్తిస్తున్నారని మోదీ మొదలుకొని కింది స్థాయి బీజేపీ నేతల వరకూ చెబితే... ఇది అనాలోచిత నిర్ణయమని విపక్షాలన్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనైనా ప్రభుత్వం దీనిపై సవివరమైన ప్రకటన చేస్తుందని, విపక్షాలు ఆ దిశగా ఒత్తిడి తెస్తాయని ఆశించినవారు ఆ సమావేశాల తంతు చూసి దిగ్భ్రమచెందారు. మొదలైన దగ్గర నుంచి ముగిసేవరకూ అవి వాయిదాల్లోనే గడిచిపోయాయి. ఇన్నాళ్లకు ఆర్ధిక శాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ కమిటీ వంతు వచ్చింది. ఈ కమిటీ ముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అసలు హాజరవుతారా లేదా అన్న సందేహాలు చాలామందికొచ్చాయి. అయితే ఆయన, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కమిటీ సభ్యులడిగిన ప్రశ్నలకు జవాబులూ ఇచ్చారు. కానీ అవి సభ్యుల్ని సంతృప్తి పరచలేదని అంటున్నారు. సమయం సరిపోకపోవడంతో మరోసారి కూడా వారిని కమిటీ ముందుకు పిలుస్తారని చెబుతున్నారు. వాస్తవానికి ఇదే విషయంపై ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) కూడా ఈ నెల 20న సమావేశం కాబోతోంది. దానికి కూడా ఉర్జిత్ హాజరుకావలసి ఉంటుంది. స్థాయీ సంఘాలకు విపక్ష సభ్యుల నేతృత్వం ఉన్నప్పుడు... ఆ సంఘాలు సమీక్షించే అంశాలు సంచలనాత్మకమైనవి అయినప్పుడు ప్రశ్నలెప్పుడూ విచ్చుకత్తు ల్లాగే ఉంటాయి. సూటి ప్రశ్నకు సూటి జవాబు రాని స్థితి సాధారణంగా రెండు సందర్భాల్లో ఉంటుంది. సంధించిన ప్రశ్నకు జవాబు లేకపోవడంవల్ల లేదా జవాబివ్వడానికి పరిమితులు అడ్డొచ్చినప్పుడు నోరు పెగలదు. ఇచ్చే సమాధానం మరిన్ని ప్రశ్నలకు దారితీసే ప్రమాదం ఉంటే ఇక చెప్పనవసరమే లేదు. ఏ అవస్థ వల్ల ఉర్జిత్ సవివరమైన జవాబివ్వలేకపోయారో లేదా అరకొరగా ఇచ్చి ఊరు కున్నారో ఆయనే స్వయంగా చెబితే తప్ప ప్రజలకు తెలిసే అవకాశం లేదు. నిజానికి ఆయన జవాబివ్వని ప్రశ్నలేవీ జటిలమైనవి కాదు. ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి ఎంత నగదు తిరిగొచ్చిందన్న ప్రశ్నకు సాధారణ బ్యాంకు ఉద్యోగి జవాబు చెప్పలేకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇన్ని నెలల తర్వాత కూడా ఉర్జిత్ పటేల్ చెప్పలేకపోవడం అయోమయాన్ని కలిగిస్తుంది. తిరిగొచ్చిన నోట్ల విలువను మరోసారి లెక్కేయమని కింది బ్యాంకులకు రిజర్వ్‌బ్యాంక్ సూచిం చినట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. అందువల్లే జవాబు ఇవ్వలేకపోతే ఆ సంగతి కమిటీకి చెప్పడంవల్ల కలిగే నష్టమేమిటో అర్ధంకాదు. ఎప్పటికల్లా బ్యాంకింగ్ కార్య కలాపాలు సాధారణ స్థితికి చేరతాయన్న ప్రశ్న కూడా ఇటువంటిదే. ఈ రెండు అంశాలూ నిజానికి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నవి. వాటికి కనీసం స్థాయీ సంఘంలోనైనా జవాబులు రాకపోతే ఏమనుకోవాలి? ఉర్జిత్ ఆమాత్రం ఆలోచించ లేకపోయారా? స్థాయీ సంఘం సమావేశంలో ఉర్జిత్ నుంచి విస్పష్టమైన జవాబులు వచ్చి ఉంటే ఆయన పతాక శీర్షికలకు ఎక్కేవారు. ఆయనిచ్చిన వివరణలపై చానెళ్ల చర్చలు హోరెత్తేవి. కానీ ఆయనకు అలాంటి ఆసక్తి ఉన్నట్టు లేదు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మాత్రం అనుకోకుండా వార్తలకెక్కారు. మౌన మునిగా పేరుబడిన ఆయన కీలక సమయాల్లో చురుగ్గా ఉండగలనని, సమర్ధుడైన మధ్యవర్తిగా వ్యవ హరించి పరిస్థితిని చక్కదిద్దగలనని నిరూపించారు. సభ్యులు కటువుగా మాట్లాడు తుంటే రాజ్యాంగపరమైన సంస్థగా ఆర్బీఐని గౌరవించాల్సిన అవసరం ఉన్నదని హితవు పలకడమే కాక, ఒక ప్రశ్నకు ఇరకాటంలో పడిన ఉర్జిత్‌ను ఉద్దేశించి ‘దానికి మీరు జవాబు ఇవ్వనవసరం లేదు’ అని ఊరడించారట! ఉర్జిత్‌ను ఒకప్పుడు రిజర్వ్‌బ్యాంకుకు తీసుకొచ్చింది తానేనన్న ఆపేక్ష వల్లనో, ఆర్బీఐకి తాను సైతం గవర్నర్‌గా పనిచేసి ఉండటంవల్ల ఏర్పడిన సెంటిమెంటు వల్లనో మన్మోహన్‌లో కద లిక వచ్చి ఉంటుంది. ఈ సందర్భంగా మన పార్లమెంటరీ కమిటీల పనితీరు గురించి మాట్లాడు కోవాలి. ప్రజాపద్దుల కమిటీ ఉండటమన్న సంప్రదాయం బ్రిటిష్‌వారి కాలంలోనే మొదలుకాగా, వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కమిటీలు 1993 నుంచి మన దేశంలో అమల్లోకి వచ్చాయి. వీటిని అమెరికా ప్రతినిధుల సభ కమిటీలతో, బ్రిటన్ పార్లమెంటు కమిటీలతో పోల్చవచ్చు. అయితే ఆ రెండుచోట్లా కమిటీలు పారదర్శకంగా పనిచేస్తాయి. ఆ కమిటీ సమావేశాలకు పౌరులు హాజరుకావొచ్చు. వాటి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. భవిష్యత్తులో ఎవరైనా చూడటానికి వీలుగా ఆ రికార్డుల్ని భద్రపరుస్తారు. ఆ రెండు దేశాల్లోని కమిటీల తరహాలోనే మన కమిటీలు కూడా పనిచేస్తాయి. ప్రభుత్వ విధానాల్లోని లొసుగులను వెలికి తీస్తాయి. అందుకోసం ఎవరినైనా పిలుస్తాయి. ఏ పత్రాన్నయినా తమ ముందుంచ మని కోరతాయి. కానీ ఈ కార్యకలాపాలన్నీ గోప్యంగా జరుగుతాయి. ఇది సబబేనా? అమెరికా, బ్రిటన్ తరహాలో కమిటీలు పనిచేస్తే ప్రభుత్వ నిర్ణయాల్లోని మంచిచెడ్డలు పౌరులకు తెలుస్తాయి. కమిటీల ముందు నీళ్లు నమిలేవారి ఆంత ర్యాలు బయటపడతాయి. ప్రజల నిఘా ఉంటే కమిటీల పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని చెప్పుకుంటాం. కానీ వాటి అనుబంధ సంఘాలు ఆ సంస్కృతికి అనుగుణంగా లేకపోవడం వింత కాదా? పార దర్శకత ప్రజాస్వామ్యానికి బలమే తప్ప విఘాతం కాదని గుర్తించడం అవసరం. అందుకనుగుణంగా మార్పులు చేయడం తప్పనిసరి. -
పాత నోట్లు ఎన్ని వచ్చాయ్..
-
పాత నోట్లు ఎన్ని వచ్చాయ్..
నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షలు ఎప్పుడు ఎత్తేస్తారు... • ఎప్పటికల్లా పరిస్థితి చక్కబడుతుంది... • పెద్ద నోట్ల రద్దుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం • సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయిన ఉర్జిత్ • మరో దఫా ప్రశ్నించనున్న కమిటీ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అంశంపై వివరణనిచ్చేందుకు పార్లమెంటు స్థాయీ సంఘం ముందు బుధవారం హాజరైన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కఠిన ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ‘నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షలెప్పుడు ఎత్తివేస్తారు? అసలు మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి ఎప్పుడు వస్తాయి? పెద్ద నోట్ల రద్దు తర్వాత అసలెంత మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చింది? కచ్చితమైన లెక్కలు చెప్పండి‘ అంటూ కమిటీ సభ్యులు ప్రశ్నలు సంధించారు. అయితే, కమిటీ సభ్యులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన సంతృప్తికరమైన జవాబులు ఇవ్వలేకపోయారు. డీమోనిటైజేషన్ దరిమిలా 60 శాతం దాకా కొత్త కరెన్సీని వ్యవస్థలోకి తెచ్చామని తెలిపినా .. పరిస్థితులు మళ్లీ ఎప్పటికల్లా సాధారణ స్థితికి వస్తాయో చెప్పలేకపోయారు. డీమోనిటైజేషన్ అనంతరం ఎన్ని పాత రూ. 500, రూ. 1,000 నోట్లు తిరిగి వచ్చాయన్నది కూడా ఆయన కచ్చితంగా చెప్పలేకపోయారు. దీంతో కమిటీ సభ్యులు ఆర్బీఐని, ఆర్థిక శాఖ అధికారులను మరో దఫా ప్రశ్నించాలని నిర్ణయించారు. ‘ఆయన (పటేల్) ప్రధాన ప్రశ్నలకు సమాధానమివ్వలేకపోయారు. కొంత వరకే చెప్పగలిగారు. వ్యవస్థలోకి ఎంత నగదు తిరిగివచ్చింది.. ఎప్పటికల్లా బ్యాంకుల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరతాయి వంటి ప్రశ్నలకు సమాధానం రాలేదు. చూడబోతే డీమోనిటైజేషన్‌పై ఆర్బీఐ అధికారులు రక్షణాత్మక వైఖరితో వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తోంది‘ అని సమావేశం అనంతరం విపక్షానికి చెందిన సీనియర్ నేత వ్యాఖ్యానించారు. డీమోనిటైజేషన్‌పై గతేడాది నుంచే చర్చలు.. పెద్ద నోట్ల రద్దు, ప్రభావాల అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ నేత ఎం వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం (ఆర్థిక) ఆదేశించిన మీదట ఆర్బీఐ, ఆర్థిక శాఖ అధికారులు కమిటీ ముందు హాజరయ్యారు. డిప్యూటీ గవర్నర్లు ఆర్ గాంధీ, ఎస్ఎస్ ముంద్రాలతో కలిసి ఉర్జిత్ పటేల్ వచ్చారు. డీమోనిటైజేషన్ అంశంపై 2016 తొలి నాళ్ల నుంచి ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయని పటేల్ వివరించారు. పెద్ద నోట్ల రద్దు వెనుక ప్రభుత్వ ప్రధానోద్దేశాన్ని ఆర్బీఐ కూడా ఆమోదయోగ్యంగానే పరిగణించిందని పేర్కొన్నారు. నోట్ల రద్దు అనంతరం దాదాపు రూ. 9.2 లక్షల కోట్ల విలువ చేసే కొత్త కరెన్సీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టినట్లు కమిటీకి వివరించారు. అయితే, సంతృప్తికరమైన సమాధానాలు రానందువల్ల అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రశ్నల ప్రక్రియను మరో రోజున కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. పార్లమెంటు బడ్జెట్ సెషన్ విరామం సమయంలో ఆర్బీఐ, ఆర్థిక శాఖ అధికారులను మరోసారి ప్రశ్నించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘ఆర్బీఐ గవర్నర్‌తో పాటు ఆర్థిక శాఖ అధికారులను కమిటీ సభ్యులు పలు ప్రశ్నలు వేశారు. సమయాభావం వల్ల ఆర్థిక శాఖ అధికారులు ఇంకో రోజున వివరణ ఇవ్వనున్నారు. ఆర్బీఐ గవర్నర్ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రశ్నల ప్రక్రియ పూర్తి చేయడం కుదరలేదు. వారిని మరోసారి పిలిచే అవకాశం ఉంది‘ అని వివరించాయి. ఆర్బీఐకి మన్మోహన్ సింగ్ బాసట.. కమిటీ సభ్యులు ఉర్జిత్ పటేల్‌ను మరింత కటువుగా ప్రశ్నించకుండా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా కొందరు సీనియర్ ఎంపీలు జోక్యం చేసుకున్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఆర్బీఐని గౌరవించాల్సిన అవసరం ఉందని వారు మిగతా సభ్యులకు సూచించినట్లు సమాచారం. నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షలను పూర్తిగా ఎప్పుడు ఎత్తివేస్తారు మొద లైన ప్రశ్నలకు కచ్చితమైన జవాబు ఇవ్వాలంటూ దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. ఆర్బీఐ ప్రతిష్టను కాపాడండి.: ఉర్జిత్ రిజర్వ్ బ్యాంక్ ప్రతిష్టను దెబ్బతీసే యత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని గవర్నర్ ఉర్జిత్ పటేల్ సహోద్యోగులకు సూచించారు. సంస్థ పేరు ప్రతిష్టలను కాపాడేందుకు కట్టుబడి ఉండాలని వారికి పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో ఎకానమీని స్థిరపర్చేందుకు ఆర్బీఐ తీవ్రంగా కృషి చేస్తోందని, ఈ క్రమంలో తలెత్తుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కోగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమిష్టి కృషితోనే ఆర్బీఐ ప్రఖ్యాతి గాంచిందని పటేల్ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 4న గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన పటేల్.. ఉద్యోగులను ఉద్దేశించి లేఖ రాయడం ఇదే తొలిసారి. డీమోనిటైజేషన్ తర్వాత ఆర్బీఐపై విమర్శలు వెల్లువెత్తడం, అక్రమంగా పాత నోట్ల మార్పిడి చేస్తూ కొందరు అధికారులు పట్టుబడటం తెలిసిందే. -
ఉర్జిత్‌ను కాపాడిన మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దును వ్యవస్థీకృత దోపిడీగా అభివర్ణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఆదుకున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పద్దని ఉర్జిత్ పటేల్‌కు సలహా ఇచ్చారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెబితే సెంట్రల్ బ్యాంకు స్వతంత్రతకు ముప్పు వస్తుందంటూ హెచ్చరించారట. అయితే ఆ ప్రశ్నలేమిటో తెలుసా? నగదు విత్డ్రాయల్స్పై ప్రస్తుతం కొనసాగిస్తున్న ఆంక్షలను ఒకవేళ తొలగిస్తే గందరగోళాలన్నీ తొలగిపోతాయా.. 50 రోజుల్లో ఎన్ని పాత కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చాయంటూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బుధవారం ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నిస్తూ ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్రయత్నించింది. పార్లమెంటరీ కమిటీ ఈ ప్రశ్నలు అడిగిన వెంటనే మధ్యలో కల్పించుకుని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవద్దని ఉర్జిత్‌కు మన్మోహన్ సింగ్ సలహా ఇచ్చారట. హఠాత్తుగా నోట్లను రద్దు చేసిన అనంతరం తలెత్తిన పరిణామాలపై వివరణ ఇవ్వడానికి ఉర్జిత్పటేల్, ఆర్థికశాఖ అధికారులు నేడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ అడిగిన ఈ ప్రశ్నలకు ఉర్జిత్ సమాధానం ఇవ్వద్దని మన్మోహన్ సూచించారని తెలిసింది. సెంట్రల్ బ్యాంకు టాప్ బాస్‌గా పనిచేసిన మన్మోహన్, అనుభవపూర్వకంగా ఉర్జిత్‌ను ఆదుకున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని పార్లమెంట్లో తీవ్రంగా వ్యతిరేకించిన మన్మోహన్, ఈ మేరకు సలహా ఇవ్వడం విశేషం. మన్మోహన్ సలహా మేరకు రద్దయిన ఎన్నినోట్లు వెనక్కి వచ్చాయి? నగదు పరిస్థితి ఎప్పుడు సాధారణ పరిస్థితికి వస్తుందనే దానిపై ఉర్జిత్ పటేల్ సమాధానం ఇవ్వలేదు. -
నోట్ల రద్దు ప్రక్రియ అప్పుడే ప్రారంభమైంది!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రక్రియకు ముహుర్తం ఒకటి రెండు నెలల ముందు తీసుకున్నది కాదంట. దాదాపు 10 నెలల ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైందని తెలిసింది. గత జనవరిలోనే డీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్టు బుధవారం పార్లమెంట్ ప్యానెల్‌కు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ చెప్పినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్యానల్‌కు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో పెద్ద నోట్లను రద్దుచేయమని ప్రభుత్వం నవంబర్ 7న సెంట్రల్ బ్యాంకుకు సూచించినట్టు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. అనంతరం ఒక్కరోజులోనే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ నవంబర్ 8న సంచలన నిర్ణయం ప్రకటించినట్టు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిణామాలపై వివరణ ఇవ్వడానికి బుధవారం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైన ఉర్జిత్ పటేల్, రూ.9.2 లక్షల కోట్ల కొత్త కరెన్సీ నోట్లను బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. అయితే బ్యాంకింగ్ సిస్టమ్ ఎప్పటిలోగా సాధారణ పరిస్థితి వస్తుందన్న ప్రశ్నకు ఉర్జిత్ పటేల్ సమాధనం చెప్పలేకపోయారని తెలిసింది. అయితే అవసరమైన నగదును సెంట్రల్ బ్యాంకు సరఫరా చేస్తుందని ఉర్జిత్ తెలిపారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన అనంతరం చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ అంటే రూ.15.44 లక్షల కోట్ల నగదు నిరూపయోగంగా మారిన సంగతి తెలిసిందే. ప్యానల్ ముందు హాజరైన ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు మాత్రం పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎన్ని పాత నోట్లు వెనక్కి వచ్చాయనే దానిపై కనీసం నోరు కూడా మెదపలేదట. ఇదే విషయంలో ఉర్జిత్ పటేల్‌తో పాటు, అధికారులు కూడా శుక్రవారం ప్రజాపద్దుల కమిటీ ముందు హాజరుకావాల్సి ఉంది. -
ఆర్బీఐకి ఘోర అవమానం!
-
ఆర్బీఐకి ఘోర అవమానం!
ముంబై: నోట్ల రద్దు అనంతర పరిణామాలపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. నోట్ల రద్దు విషయంలో ఇప్పటికే అప్రతిష్టపాలైన ఆర్బీఐలో.. కేంద్ర ప్రభుత్వం మరింతగా జోక్యం చేసుకోవడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ఆర్బీఐలో పనిచేస్తోన్న దాదాపు 18 వేల మంది అధికారులు, ఉద్యోగులు తేల్చిచెప్పారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఘాటు లేఖ రాశాయి. నగదు నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారులను నియమించడం ఆర్బీఐకి ఘోర అవమానమంటూ నిరసన తెలిపాయి. 1935లో ఆర్బీఐ ప్రారంభమైన నాటి నుంచి ఎనిమిది దశాబద్దాలకుపైగా స్వతంత్రప్రతిపత్తతో వ్యవహరించిందని, అలాంటి సంస్థ ప్రతిష్ఠ నేడు(నోట్ల రద్దుతో) మసకబారిందని ఉద్యోగులు తమ లేఖలో అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు విషయంలో సమర్థవంతంగా వ్యవహరించని కారణంగా ఆర్బీఐ తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదని, ఇప్పుడు కొత్తగా ఆర్థిక శాఖ అధికారులు వచ్చి పెత్తనం చెలాయించాలనుకోవడం అవమానకరమని లేఖలో పేర్కొన్నారు. ఆర్బీఐ ప్రతిష్ఠను దిగజార్చే నిర్ణయాలను వ్యతిరేకిస్తామని తెలిపారు. ‘ది యూనియన్ ఫోరం ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయిస్’ పేరుతో విడుదలైన లేఖ ప్రస్తుతం బ్యాంకింగ్, ఆర్థిక శాఖ వర్గాల్లో తీవ్రచర్చనీయాంశమైంది. (ఆర్బీఐ స్వేచ్ఛను కాపాడాలి: బిమల్ జలాన్) గవర్నర్‌కు పంపిన లేఖపై ఆల్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బాధ్యుడు సమీర్ ఘోష్, రిజర్వ్ బ్యాంక్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సూర్యకాంత్ మహాదిక్, ఆల్ ఇండియా రిజర్వ్‌బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున సి.ఎం.ఫౌజిల్, ఆర్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ఆర్.ఎన్.వత్స తదితరులు సంతకాలు చేశారు. ఆర్బీఐలో నగదు నిర్వహణకు ఆర్థిక శాఖ తరఫున అధికారిని నియమించాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్లు బిమల్ జలాన్, వైవీ రెడ్డి, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు ఉషా థొరాట్, కె.సి.చక్రవర్తి తదితరులు బాహాటంగానే తమ నిరసన తెలియజేశారు. అధికారులు, ఉద్యోగుల లేఖపై ఆర్బీఐ గవర్నర్ స్పందన తెలియాల్సిఉంది. (నోట్లరద్దుకు కారణాలేంటి?) (ఇదో ముక్కోణపు కథ..) -
కేంద్రం, రాష్ట్రాల అప్పులు తగ్గాలి
• ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సూచన • బ్యాంకింగ్ రంగానికి తగినంత నిధుల సాయం అవసరం • సబ్సిడీలు తగ్గించుకోవాలని హితవు గాంధీనగర్: కేంద్ర బడ్జెట్‌కు ముందు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రభుత్వానికి కీలకమైన సూచనలు చేశారు. అధిక స్థాయిలో ఉన్న కేంద్ర, రాష్ట్రాల రుణ భారాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. స్థిరమైన స్థూల ఆర్థిక రంగ పరిస్థితుల కోసం దేశానికి చక్కని విధానం అవసరమని చెప్పారు. వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో ఆయన మాట్లాడారు. మధ్య కాలానికి ద్రవ్యోల్బణం 4 శాతం అన్నది సురక్షితమైన, స్థిరమైనదిగా పేర్కొన్నారు. ప్రభుత్వం బ్యాంకింగ్ రంగానికి తగినంత నిధులు అందించాలని ఆశిస్తున్నట్టు ఉర్జిత్ పటేల్ చెప్పారు. గత కొన్ని సంవత్సరాల్లో నిర్మించుకున్న స్థూల ఆర్థిక వాతావరణం విచ్ఛిన్నం కానీయరాదన్నారు. దేశ రుణ–జీడీపీ నిష్పత్తి సార్వభౌమ రేటింగ్‌పై ప్రభావం చూపుతోందన్నారు. కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి ద్రవ్యలోటు జీ20 గ్రూపు దేశాల్లోనే అధిక స్థాయిలో ఉందని ఉర్జిత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని మనం అభివృద్ధి దిశగా ముందుకు సాగిపోవాలి. ప్రత్యేకంగా ఇది సవాళ్లను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు, ఆర్థిక అస్థిరతను తగ్గించేందుకు సాయపడుతుంది’’ అని ఉర్జిత్ పటేల్ వివరించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి ద్రవ్యలోటు లక్ష్యం 6.4 శాతంగా ఉంది. హామీలు, రాయితీల విషయంలో జాగ్రత్త... ‘‘రుణాల సబ్సిడీ లేదా రుణ హామీల విషయంలో ప్రభుత్వం జాగరూకతతో ఉండాలి. ఎందుకంటే ఈ విధమైన పథకాలు ప్రభుత్వ రుణ భారాన్ని పెంచుతాయి. కొన్ని రకాల హామీలు, పరిమిత రాయితీలు మేలు చేస్తాయి కానీ, వడ్డీ రేట్లలో గణనీయమైన రాయితీలు, భారీ స్థాయి రుణ హామీలు సరైన ఆర్థిక వనరుల కేటాయింపులకు అడ్డుగా మారతాయి. రుణ హామీలు ప్రభుత్వ కంటింజెంట్ లయబిలిటీలను పెంచుతాయి. దీంతో సొంతంగా రుణ సేకరణ రిస్క్ కూడా పెరిగిపోతుంది. జాగ్రత్తతో కూడిన ద్రవ్య నిర్వహణ అనేది స్థూల ఆర్థిక స్థిరత్వానికి కీలకం. 2013 నుంచి కేంద్ర ప్రభుత్వం ద్రవ్య స్థిరీకరణ దిశగా ప్రగతిని సాధించింది. అయినప్పటికీ సాధారణ ద్రవ్యలోటు (కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి) పరంగా చూస్తే ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం జీ20 దేశాల్లో అధిక స్థాయిలో ఉంది’’ అని ఉర్జిత్ పేర్కొన్నారు. పేదలు, రైతులు, మహిళలు, చిన్న వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించేందుకు ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన పథకాన్ని నేరుగా పేర్కొనకుండా ఉర్జిత్ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. వృద్ధికి ద్రవ్యోల్బణ స్థిరత్వం అవసరం ‘‘చక్కని వృద్ధికి వీలుగా పెట్టుబడులను ఇతోధికం చేసేందుకు అర్థవంతమైన వడ్డీ రేట్లు ఉండాలి. అందుకు వినియోగ ఆధారిత ద్రవ్యోల్బణాన్ని తక్కువ స్థాయిలో, స్థిరంగా ఉంచడం అన్నది కనీస అవసరం’ అని ఉర్జిత్ పేర్కొన్నారు. ఉర్జిత్ మరోసారి అలానే... ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మరోసారి మీడియా ఫోబియా చాటుకున్నారు. బుధవారం వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు వచ్చిన ఆయన్ను పెద్ద నోట్ల రద్దుపై ప్రశ్నించేందుకు మహాత్మా మందిర్ వెలుపల టీవీ, పత్రికల ప్రతినిధులు భారీ సంఖ్యలో కాచుక్కూర్చున్నారు. ఈ విషయం గ్రహించిన ఆయన ఓ నోట్‌ను సహాయకులతో మీడియాకు అందించి వెనుక డోర్ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఆయన్ను చేరుకునేందుకు మీడియా ప్రతినిధులు పరుగు తీసినా ప్రయోజనం లేకపోయింది. ఉర్జిత్ చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్లి కారెక్కి అక్కడి నుంచి చలోమన్నారు. -
నోట్లరద్దుకు కారణాలేంటి?
-
నోట్లరద్దుకు కారణాలేంటి?
♦ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు పీఏసీ సమన్లు ♦ 20న హాజరుకావాలని ఆదేశం న్యూఢిల్లీ: కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయాన్ని విచారిస్తున్న పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ).. నోట్లరద్దు, తదనంతర పరిణామాలపై వివరణ ఇవ్వాలంటూ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు నోటీసులు పంపించింది. డిసెంబర్ 30న జారీచేసిన ఈ నోటీసుల్లో.. నోట్లరద్దు నిర్ణయంలో ఆర్బీఐ పాత్ర, ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం, రెండు నెలల్లో ఆర్బీఐ నిబంధనల్లో భారీగా తీసుకొచ్చిన మార్పులు వంటి ప్రశ్నలను సంధించింది. విత్‌డ్రాయల్ పరిమితిపై ఆంక్షలు విధించే విషయంలో సరైన ఆధారాలు చూపించని పక్షంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న కారణాలతో ఎందుకు విధులనుంచి తొలగించరాదో చెప్పాలంది. నోట్లరద్దుతో ఎంత మొత్తంలో నల్లధనం బయటకు వచ్చింది? ఎంత మొత్తం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వెళ్లిందో వివరాలివ్వాలని ఆదేశించింది. నోటీసుల్లో పేర్కొన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు జనవరి 20న కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించినట్లు పీఏసీ చైర్మన్ కేవీ థామస్ ఓ వార్తా సంస్థతో వెల్లడించారు. ‘ఆర్బీఐ గవర్నర్‌కు డిసెంబర్లోనే సమన్లు ఇవ్వాలనుకున్నాం. కానీ నోట్లరద్దుపై ప్రధాని 50 రోజుల సమయం ఇచ్చిన నేపథ్యంలో దీన్ని జనవరికి వాయిదా వేయాలనుకున్నాం. ఈ వివాదానికి రాజకీయ రంగు పులమాలనుకోవటం లేదు’ అని థామస్ తెలి పారు. పటేల్‌తోపాటు ఆర్థిక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులకూ నోటీసులు జారీ చేసింది. గత శుక్రవారం రాజ్యసభ స్టాండింగ్ కమిటీ కూడా పటేల్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్, ఆర్.గాంధీలనూ నోట్లరద్దుపైనే ప్రశ్నించింది. అయితే కమిటీ వేసిన పలు ప్రశ్నలకు ఆర్బీఐ అధికారుల వద్దనుంచి సరైన సమాధానం రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉర్జిత్‌కు పీఏసీ సంధించిన ప్రశ్నలు ► నోట్లరద్దు నిర్ణయాన్ని ఆర్బీఐ, ఆర్బీఐ బోర్డు తీసుకున్నాయని.. దీనికి ప్రభుత్వం ఆమోదం మాత్రమే తెలిపిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో తెలిపారు. దీంతో మీరు ఏకీభవిస్తారా? ► ఒకవేళ ఇది ఆర్బీఐ ఆలోచనే అయితే.. ఎప్పుడు నోట్లరద్దుపై చర్చించి నిర్ణయం తీసుకుంది? ► రాత్రికి రాత్రి నోట్లరద్దు చేయాలనే నిర్ణయం వెనక ఆర్బీఐ చూపించే అసలైన కారణమేంటి? ► భారత జీడీపీలో నగదు 12 శాతం (జపాన్ 18, స్విట్జర్లాండ్ 13). భారత కరెన్సీలో పెద్ద నోట్లు 86 శాతం ఉంటే.. చైనాలో 90 శాతం, అమెరికాలో 81 శాతం. ఇలాంటప్పుడు భారత్‌లోనే అత్యవసరంగా నోట్లరద్దు నిర్ణయం తీసుకోవటం వెనక ఉన్న కారణాలేంటి? ► నవంబర్ 8న అత్యవసర సమావేశం కోసం ఆర్బీఐ బోర్డు సభ్యులకు ఎప్పుడు నోటీసులు పంపారు? వీరిలో ఎందరు సమావేశానికి హాజరయ్యారు? మీటింగ్ మినిట్స్ (చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు) ఎక్కడున్నాయి? ► కేబినెట్ ఆమోదం కోసం పంపిన లేఖలో.. నోట్లరద్దు వల్ల 86% కరెన్సీ చెల్లకుండా పోవటం, దీని మొత్తం విలువ వంటివి ప్రత్యేకంగా పేర్కొన్నారా? రద్దయిన నోట్ల మొత్తం విలువను చలామణిలోకి తెచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? ► ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 3 సీ(వీ) ప్రకారం.. విత్‌డ్రా పరిమితిపై ఆంక్షలు విధిస్తున్నట్లు నవంబర్ 8న ప్రకటన ఇచ్చారు. ఆర్బీఐలోని ఏ చట్టం ప్రకారం ప్రజలపై విత్‌డ్రా పరిమితి విధించారు? ఆర్బీఐకి ఈ అధికారం ఉందా? అలాంటి చట్టాలేమీ లేకపోతే.. అధికార దుర్వినియోగం చేసినందుకు మిమ్మల్ని ఎందుకు ఉద్యోగంలోనుంచి తొలగించరాదు? ► రెండు నెలలుగా ఆర్బీఐ నియమాల్లో ఎందుకు త్వరత్వరగా మార్పులు జరిగాయి? ప్రజల విత్‌డ్రాయల్ నియంత్రణపై సలహా ఇచ్చిన అధికారి పేరును తెలపండి. వివాహ సంబంధిత విత్‌డ్రాయల్స్ నిబంధనలను రాసిందెవరు? ఒకవేళ ఆర్బీఐ కాకుండా ప్రభుత్వమే దీన్ని రాసిస్తే.. మరి ఆర్బీఐ ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగంగా మారిందనుకోవాలా? ► రద్దయిన నోట్ల అసలైన లెక్క ఎంత? బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాతనోట్ల విలువెంత? నవంబర్ 8న ప్రభుత్వానికి నోట్లరద్దు నిర్ణయంపై సూచన చేసినపుడు.. ఎంత మొత్తంలో నోట్లను రద్దుచేయొచ్చని ఆర్బీఐ భావించింది? ► నోట్లరద్దుపై వివరాలు చెప్పాలంటూ దాఖలైన ఆర్టీఐ ఫిర్యాదులకు సమాధానం ఇచ్చేందుకు ఆర్బీఐ ఎందుకు విముఖత వ్యక్తం చేసింది? -
ఇదో ముక్కోణపు కథ..
► ఆర్బీఐ–బ్యాంకులు– కేంద్రం బ్యాంకులు 2017 మార్చికల్లా ఎన్ పీఏలకు పూర్తి కేటాయింపులు చేసి బ్యాలన్స్ షీట్లలో చూపించాలని రఘురామ్ రాజన్ షరతు పెట్టారు. నల్లధనాన్ని ఏరేయాలనుకున్న కేంద్రం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి ఆర్బీఐపై భారీ బాధ్యతే పెట్టింది. చివరి రెండు నెలలూ తమ వ్యాపారాన్నంతా పక్కన పెట్టి బ్యాంకులు జనం నుంచి పాత నోట్లు తీసుకోవటం, కొత్త నోట్లు ఇవ్వటానికే పరిమితమయ్యాయి. ఇదో ట్రయాంగిల్ స్టోరీలా మారింది. బ్యాంకుల ఎన్ పీఏలు సెప్టెంబర్ నాటికే రూ.7 లక్షల కోట్లను దాటేశాయి. వీటిలో అధికం ప్రభుత్వ రంగ బ్యాంకులవే. వీటికి కేటాయింపులు చేయడం బ్యాంకులకు సవాలుగా మారింది. ఆస్తులు అమ్మి రుణాలు తీర్చటానికి కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నా అవి ఫలించటం లేదు. ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారూ భారీగానే ఉన్నారు. ఇవన్నీ ఎన్ పీఏలను పెంచేశాయి. అయితే, నోట్ల రద్దుతో బ్యాంకుల్లో చేరిన భారీ డిపాజిట్లు మూలధన అవసరాలు తీరుస్తాయనేది తాజా అంచనా. ద్రవ్యోల్బణమే ఆర్బీఐ టార్గెట్? రఘురామ్ రాజన్ మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 4తో ముగిసింది. తర్వాత ఉర్జిత్ పటేల్ గవర్నర్ అయ్యారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న విషయంలో కేంద్రం, ఆర్బీఐ అంగీకారానికి వచ్చాయి. ఇక ఆర్బీఐ అనుమతుల మేరకు దేశంలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు, ఈక్విటీస్ స్మాల్ బ్యాంకు పేరుతో కొత్త తరహా బ్యాంకింగ్ కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చాయి. -
నోట్ల కిలాడీ అరెస్ట్
రూ. 25 కోట్ల నోట్ల మార్పిడి వ్యవహారంలో.... ► పారిపోతుండగా ముంబై ఎయిర్‌పోర్టులో పట్టుకున్న ఈడీ న్యూఢిల్లీ/రాయ్‌పూర్: రూ. 25 కోట్ల విలువైన పాత నోట్ల మార్పిడి కేసుతో సంబంధమున్న కోల్‌కతా వ్యాపారి పరాస్ ఎం ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లోధాపై అంతకుముందే లుకౌట్ నోటీసు జారీ కాగా... ముంబై ఎయిర్ పోర్టు నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిబ్బంది బుధవారం రాత్రి వలపన్ని పట్టుకున్నారు. శేఖర్ రెడ్డి, రోహిత్ టాండన్ కేసుల్లో రూ. 25 కోట్ల మేర పాత నోట్ల మార్పిడితో లోధాకు సంబంధం ఉన్నట్లు గుర్తించామని ఈడీ అధికారులు వెల్లడించారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కస్టడీ కోరుతూ అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అస్సాంలో రూ. 2.3 కోట్ల కొత్త నోట్లు ఐటీ అధికారులు గురువారం అస్సాంలోని నగౌన్ పట్టణంలో వ్యాపారవేత్త అముల్య దాస్ నుంచి రూ. 2.3 కోట్ల విలువైన కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతని ఇల్లు, వ్యాపార కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో భారీగా రూ. 2 వేలు, రూ. 500 నోట్లను సీజ్ చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఐటీ అధికారులు ఒక ఫైనాన్షియర్ నుంచి రూ.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. 43 లక్షల మేర కొత్త కరెన్సీగా గుర్తించారు. ఆ ఫైనాన్షియర్ ఎన్నడూ పన్ను చెల్లించలేదని, అలాగే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని ఐటీ అధికారులు కనుగొన్నారు. అప్రకటిత ఆదాయం రూ. 10.3 కోట్ల వరకూ ఉన్నట్లు అతను వెల్లడించాడు. పార్లమెంటరీ కమిటీ ముందుకు ఉర్జిత్ జనవర్ 19న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై నోట్ల రద్దు అంశాలు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావంపై వివరించనున్నారు. వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాౖటెన స్టాండింగ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నోట్ల రద్దు అనంతరం పలువురు నిపుణులు ప్యానల్ ముందు హాజరై తమ అభిప్రాయాల్ని తెలిపినట్లు మెయిలీ పేర్కొన్నారు. -
పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై అనిశ్చితి
ఆర్బీఐ ఎంపీసీ అభిప్రాయం ముంబై: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో ద్రవ్యోల్బణ లక్ష్యంపై దృష్టి కారణంగానే కీలక రేట్లను యధాతథంగా కొనసాగించడానికే ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ మొగ్గు చూపారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు వుండొచ్చనే అంశంపై అనిశ్చితి నెలకొందని పటేల్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 6–7 మధ్య జరిగిన ఆర్బీఐ మోనేటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశ వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ వివరాల ప్రకా రం... ఈ కమిటీలోని ఆరుగురు సభ్యులు రెపో రేటు ను 6.25 శాతంగా ఉంచడానికే మొగ్గు చూపారు. ⇔ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం రేంజ్‌లోనే నియంత్రించాలనే విషయంపైనే దృష్టి కేంద్రీకరించాలని పటేల్ సూచించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యోల్బణం వచ్చే ఏడాది పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ⇔ నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తాత్కాలికమే అయినప్పటికీ, స్వల్ప కాలిక ప్రభా వం ఉంటుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ కూడా అభిప్రాయపడ్డారు. అయితే మధ్య కాలానికి వృద్ధి అవకాశాలపై చెప్పుకోదగ్గ ప్రతికూల ప్రభావాలు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. చమురు ధరలు, భౌగోళిక–రాజకీయ స్థితిగతుల ప్రభావం ఉంటుందని వివరించారు. ⇔ పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థకు ఊహించని షాక్ అని మరో సభ్యుడు రవీంద్ర హెచ్ డోలాకియా అభిప్రాయపడ్డారు. ఫలితంగా జీడీపీ అంచనాల ను తగ్గించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రభావం తాత్కాలికమేనని వివరించారు. ⇔ పెద్ద నోట్ల రద్దు ప్రభావాలను తట్టుకునే స్థాయిలోనే మన ఆర్థిక వ్యవస్థ ఉందని మరో ఎంపీసీ సభ్యురాలు పామి దువా అభిప్రాయపడ్డారు. ఆర్థిక కార్యకలాపాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమేనని ఆమె పేర్కొన్నారు. ⇔ డిమాండ్ తగ్గుతుండడం, దేశీయంగా సరఫరా సంబంధిత సమస్యలు తాత్కాలికమేనని మరో ఎంపీసీ సభ్యుడు దేబబ్రత పాత్ర అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించినరిస్క్లు, ఎక్కువ కాలం ప్రభావం చూపుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
ట్విట్టర్లో ఉర్జిత్ లక్ష్యంగా పవన్ విమర్శలు
హైదరాబాద్: 'మిస్టర్ ఉర్జిత్.. ఈయన (ఏపీలోని కర్నూలుకు చెందిన) దివంగత బాలరాజు. మీరు ఎంతో ఆలోచించి తీసుకొచ్చిన పెద్దనోట్ల రద్దు వల్ల ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది అభాగ్యులలో ఈయన ఒకరు' అంటూ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ లక్ష్యంగా ట్విట్టర్లో జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు అవుతున్నా.. ఈ దేశంలో మనుషులు అశుద్ధం మోసే జాఢ్యాన్ని రూపుమాపలేకపోయాని, అలాంటి దేశంలో 'క్యాష్‌లెస్ ఎకానమీ' (నగదు రహిత ఆర్థిక వ్యవస్థ) సాధ్యమని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎంతో ఆలోచించి ఉర్జిత్ పటేల్ ప్రవేశపెట్టిన పెద్దనోట్ల రద్దు వల్ల ఆయన సహచర భారతీయులైన ఆదివాసీలు, రైతులు, దినసరి కూలీలు, గృహిణులు, ఉద్యోగులు, వృద్ధులు, పండ్లు, కూరగాయాల వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, చిన్న వ్యాపారులు ఇలా చాలామంది కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. కిలోమీటర్ల పొడవున్న క్యూలలో నిలబడలేక సామాన్యులు ప్రాణాలు విడుస్తుండగా.. అక్రమార్కులు మాత్రం తమ ఇళ్లలో సుఖంగా కూచొని తమ సంపదను మార్చుకుంటున్నారని విమర్శించారు. 86శాతం నగదు బ్యాంకుల్లో డిపాజిట్ కావడంతో ఉర్జిత్ పటేల్ ఇప్పుడు ఆనందంతో గంతులు వేస్తుండవచ్చు. నల్లధనం తుడిచిపెట్టుకుపోయిందని గర్వంగా చెప్పుకుంటుండొచ్చు. కానీ నిజమేమిటంటే.. మీరు పాత దానిని కొత్త దానితో మార్చారు. ఇక దోపిడీదారుల వర్గంలో బ్యాంకింగ్ ఉద్యోగులు కూడా చేరిపోయారు' అంటూ పవన్ పేర్కొన్నారు. pic.twitter.com/VHHi5eENYn — Pawan Kalyan (@PawanKalyan) 20 December 2016 -
ఉర్జిత్ పటేల్ అంతా వివరిస్తారట!