
ఉర్జిత్ పటేల్ ట్విట్టర్ ఫేక్ అకౌంట్ తొలగింపు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నూతన గవర్నర్ గా వచ్చే నెలలో బాధ్యతలు చేపట్టనున్న ఉర్జిత్ పటేల్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఫేక్ అకౌంట్ను డిలీట్ చేశారు.
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నూతన గవర్నర్ గా వచ్చే నెలలో బాధ్యతలు చేపట్టనున్న ఉర్జిత్ పటేల్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఫేక్ అకౌంట్ను డిలీట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ సంస్థ మంగళవారం వెల్లడించింది. గత శనివారం ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పేరును ఖరారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపిన వెంటనే ఈ ట్విట్టర్ ఖాతాకు అభినందనల వెల్లువ మొదలైంది.
తనపేరుతో ఉన్న నకిలీ ఖాతా గురించి తెలిపిన వెంటనే ట్విట్టర్ మేనేజ్ మెంట్ ఆ అకౌంట్ ను తొలగించింది. ఈ ఫేక్ అకౌంట్ ఈ ఏడాది జూన్ నెలలో క్రియేట్ చేశారని, అయితే ఉర్జిత్ పటేల్ పేరును ఆర్‌బీఐ గవర్నర్ గా ప్రకటించక ముందువరకు ఒక్క ట్వీట్ కూడా ఆ ఖాతా నుంచి చేయలేదని ఆర్బీఐ వెల్లడించింది. ఉర్జిత్ పటేల్ ప్రస్తుతం ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.