
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాదికి పొంగల్ కానుకగా రిలీజ్ కానుంది. దీంతో పాటు విడాయమర్చి అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం ఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.
అయితే అజిత్ నటి షాలినిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2000లో అజిత్ కుమార్- షాలిని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా షాలిని పేరుతో నకిలీ ట్విటర్ ఖాతా బయటపడింది. ఈ విషయాన్ని షాలిని అజిత్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. 'ప్రతి ఒక్కరికీ నా మనవి.. ఇది నా అఫీషియల్ ట్విటర్ అకౌంట్ కాదు.. దయచేసి ఎవరూ కూడా నమ్మి ఫాలో అవ్వొద్దు. ధన్యవాదాలు' అంటూ అభిమానులను కోరింది. షాలిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment